• facebook
  • whatsapp
  • telegram

జడ వాయువులు - ఉత్కృష్ట వాయువులు

మాదిరి ప్రశ్నలు

1. కింది ఏ మూలకాలతో గ్జినాన్‌ సమ్మేళనాలను  ఏర్పరుస్తుంది?
1) సల్ఫర్‌   2) ఆక్సిజన్‌   3) ఫ్లోరిన్‌   4) 2, 3


2. సాధారణ విద్యుత్‌ బల్బుల్లో నింపడానికి ఉపయోగించే వాయువు ఏది?
1) క్రిప్టాన్‌  2) రేడాన్‌  3) ఆర్గాన్‌  4) టంగ్‌స్టన్‌


3. ప్రకటనల కోసం వాడే ప్రతిదీప్తి బల్బుల్లో  ఏ వాయువును ఉపయోగిస్తారు?
1) హీలియం         2) నియాన్‌    3) గ్జినాన్‌        4) పైవన్నీ


4. 18వ గ్రూపు మూలకాలకు ఉన్న మరో పేరు ఏమిటి?
1) ఉత్కృష్ట వాయువులు     2) జడ వాయువులు 
3) విరళ వాయువులు       4) పైవన్నీ


5. వాతావరణంలో అధిక పరిమాణంలో ఉండే జడవాయువు ఏది?
1) హీలియం      2) ఆర్గాన్‌      3) నియాన్‌      4) గ్జినాన్‌ 


6. జడవాయువుల్లో చాలా తేలికైన వాయువు ఏది?
1) హీలియం          2) నియాన్‌       3) రేడాన్‌           4) హైడ్రోజన్‌


7. కిందివాటిని జతపరచండి.
జడ వాయువు            ఎలక్ట్రాన్‌ విన్యాసం

A. హీలియం           i) [Ni]3s2 3p6
B. నియాన్‌              ii) 1s2
C. ఆర్గాన్‌                iii) [He]2s2 2p6

1) A - ii, B - i, C - iii         2) A - i, B - iii,  C - ii
3) A - ii, B - iii, C - i         4) A - iii, B - ii, C - i


8. జడ వాయువుల రసాయన చర్యాశీలత పరంగా  జడత్వానికి గల కారణం?
1) అవి ఏక పరమాణుక వాయువులు
2) జడ వాయువుల బాహ్యకక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్లతో పూర్తిగా నిండి అష్టక విన్యాసం ఉండటం.
3) వాటికి అధిక అయనీకరణ ఎంథాల్పీ ఉండటం.
4) 2, 3


9. కిందివాటిలో సూర్యుడిలో సమృద్ధిగా లభించే జడవాయువు ఏది?
1) నియాన్‌        2) ఆర్గాన్‌ 
3) హైడ్రోజన్‌        4) హీలియం


10. కిందివాటిలో జడవాయువు కానిది ఏది?
1) క్రిప్టాన్‌   2) క్లోరిన్‌   3) గ్జినాన్‌   4) రేడాన్‌


11. హీలియం మూలకాన్ని ఏ విధంగా సూచిస్తారు?
1) 22He         2) 32He         3) 42He        4)  42H


12. కిందివాటిలో రేడాన్‌ రసాయన సంకేతం ఏమిటి?
1) Ra     2) Rd      3) R      4) Rn


13. మొట్టమొదటి ఉత్కృష్ట వాయువుతో సమ్మేళనాన్ని తయారుచేసిన శాస్త్రవేత్త ఎవరు?
1) మేడమ్‌ క్యూరీ        2) నీల్‌ బార్ట్‌లెట్‌     3) డబ్ల్యూ.రాంసే        4) డబ్ల్యూ.ఎల్‌.బ్రాగ్‌


14. ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి ఉత్కృష్ట వాయువు సమ్మేళనం ఏది?
1) O2PtF6     2) XePtF6    3) XeF4    4)  XeF6


15. కిందివాటిలో సూపర్‌ ఫ్లూయిడ్‌ అని దేన్ని అంటారు?
1) ద్రవ ఆక్సిజన్‌       2) ద్రవ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌
3) ద్రవ హీలియం   4) ద్రవ నైట్రోజన్‌


16. సూర్యుడి పేరు మీద ఉన జడవాయువు ఏది?
1) హీలియం       2) క్రిప్టాన్‌      3) గ్జినాన్‌       4) రేడాన్‌


17. మండే స్వభావం లేని అతి తేలికైన వాయువు ఏది?
1) హైడ్రోజన్‌       2) హీలియం      3) ఆర్గాన్‌        4) ఆక్సిజన్‌


18. కిందివాటిలో ఏకపరమాణుక వాయువు ఏది?
1) ఆక్సిజన్‌       2) నైట్రోజన్‌       3) ఆర్గాన్‌      4) క్లోరిన్‌


19. మూలకాలన్నింటిలో అతి తక్కువ మరిగే ఉష్ణోగ్రత కలిగింది ఏది?
1) గ్జినాన్‌         2) హైడ్రోజన్‌       3) టంగ్‌స్టన్‌         4) హీలియం


20. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో హీలియం మూలాలను సూచించే వర్ణపట రేఖను మొదట ఏ ప్రాంతంలో కనుక్కున్నారు?
1) లండన్‌        2) గుంటూరు       3) అమెరికా         4) దిల్లీ


21. హీలియోక్స్‌ అనే శ్వాస వాయువు దేని మిశ్రమం?
1) ఆక్సిజన్ + నైట్రోజన్‌        2) నైట్రోజన్‌ + హీలియం 
3) ఆక్సిజన్‌ + హీలియం       4) ఆక్సిజన్‌ + కార్బన్‌ డైఆక్సైడ్‌ 


22. కింది ఏ శాస్త్రవేత్తలకు జడ వాయువులపై పరిశోధనకు నోబెల్‌ బహుమతి లభించింది?
1) రామ్సే, రాబర్ట్‌ బాయిల్‌     2) రామ్సే, రేలీ     3) రామ్సే, రౌల్ట్స్‌      4) రాబర్ట్‌ బాయిల్, రేలీ


23. పరమ శూన్య ఉష్ణోగ్రత అంటే?
1) 0       2) 273      3) 0   4) 1, 2


24. హీలియం మరిగే ఉష్ణోగ్రత ఎంత?
1) 273         2) 0∘       3) 100       4) 268.9


25. రేడియోధార్మికతను గుర్తించే గ్రెగర్‌ - ముల్లర్‌  కౌంటర్‌లో ఉపయోగించే జడవాయువు ఏది?
1) హైడ్రోజన్‌        2) ఆర్గాన్‌       3) రేడాన్‌          4) రేడియం


26. పాత్ర గోడలపైకి ఎగబాకే ద్రవపదార్థం ఏది?
1) ద్రవ నైట్రోజన్‌       2) ద్రవ ఆక్సిజన్‌      3) హీలియం-I         4) హీలియం-II


27. అధిక ఉష్ణోగ్రతా లోహ సంగ్రహణ ప్రక్రియలో  జడ రసాయనిక వాతావరణాన్ని కల్పించేందుకు ఉపయోగించే వాయువు ఏది?
1) ఆక్సిజన్‌      2) హైడ్రోజన్‌       3) క్లోరిన్‌      4) ఆర్గాన్‌


సమాధానాలు: 1-4;  2-3;  3-2;  4-4;  5-2;  6-1;  7-3;  8-4;  9-4; 10-2; 11-3; 12-4; 13-2; 14-2; 15-3; 16-1; 17-2; 18-3; 19-4; 20-2; 21-3; 22-2; 23-4; 24-4; 25-2; 26-4; 27-4. 

Posted Date : 15-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌