• facebook
  • whatsapp
  • telegram

శక్తి

* శక్తి అనేది నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగం 
* శక్తి అవసరాల్లో ప్రపంచంలో 3.5% మనదేశం ఉపయోగించుకుంటోంది. ఈ శక్తి అవసర వినయోగంలో భారతదేశం ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది.
* దేశంలో గత మూడు దశాబ్దాలుగా శక్తి వినియోగం అధికమవుతుంది.
* గృహవినియోగం (Residential Sector) రంగంలో శక్తి వినియోగం అధిక శాతంగా ఉంది.
    గృహ రంగం - 57%
    పారిశ్రామిక రంగం - 24%
    రవాణా రంగం - 9%
     శక్తి ఇతర రంగాలు - 7%
* భారతదేశంలోని ఏకైక శక్తి వనరు - పునరుత్పత్తి వనరులు, వాటి వ్యర్థాలు
* ప్రస్తుతం భారతదేశంలో శక్తి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు.
* ఓపీఈసీ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు భారతదేశంలో ప్రధాన ఇంధన వనరు.

2. తరిగిపోని శక్తి వనరులు
* వీటిని సంప్రదాయేతర శక్తి వనరులు లేదా పునరుత్పాదక శక్తి వనరులు అని పిలుస్తారు.
* ఈ శక్తి వనరులను ఒకసారి వినియోగించిన తరువాత తిరిగి మళ్లీ ఉపయోగించవచ్చు.
ఉదా: సౌరశక్తి, వాయుశక్తి, సముద్ర అలల శక్తి.
* వీటి వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడదు. అందువల్ల వీటిని హరిత ఇంధనాలు (Green Energy Resources) అంటారు.


బొగ్గు
* బొగ్గు అనేది మొక్కలు, ఫెర్న్‌ల నుంచి లభించే ఘన శిలాజ ఇంధనం
బొగ్గు వివిధ రకాలుగా ఉంటుంది.
* పీట్ కోల్ (పాక్షికంగా కార్బన్ ఉన్న మొక్క నుంచి లభించేది)
* లిగ్నైట్ (Brownish – Black coal with low carbon content)
* సబ్ బిట్యూమినస్ (Soft coal with intermediate carbon content)
* బిట్యూమినస్ కోల్ (Soft coal with highest carbon and lower moisture content)
* ఆంత్రసైట్ (Hard coal with highest carbon and lower moisture content)
* వివిధ బొగ్గు రకాల్లో ఆంత్రసైట్ అత్యంత నాణ్యమైన, అధిక కార్బన్ శాతం ఉన్న బొగ్గు. ఆంత్రసైట్ అధిక వేడి విలువను కలిగి ఉంటుంది.
* 2006 లెక్కల ప్రకారం భారతదేశంలో బొగ్గు నిల్వలు 253.3 బిలియన్ టన్నులు.
* ఆంత్రసైట్ బొగ్గు అధిక కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుంది.
* బొగ్గును అంశిక స్వేధనానికి గురి చేయడం ద్వారా 'కోక్‌'ను తయారు చేయవచ్చు.
* థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు ఆధారం.
* బొగ్గును నల్ల బంగారం, శిలాజ ఇంధనం, విద్యుత్‌శక్తి గిడ్డంగి అంటారు.
* దీన్ని 19వ శతాబ్దపు ఇంధనం అని కూడా పిలుస్తారు.
* గృహేతర అవసరాలకు బొగ్గు బూడిద వివిధ సందర్భాల్లో అవసరం అవుతుంది.
* ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి 'మూడో స్థానంలో' ఉంది.
* భారతదేశంలో బొగ్గు పరిశోధన విభాగంలో
      i) ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ అండ్ సేఫ్టీ
      ii) కోల్ బెనిఫికేషన్
     iii) కోల్ యుటిలైజేషన్
     iv) ఎన్విరాన్‌మెంట్ అండ్ ఇకాలజీ డిపార్ట్‌మెంట్
* రానున్న దశాబ్ద కాలంలో బొగ్గు అవసరాలు 1.4% మేర పెరుగుతాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) అంచనా వేసింది.
* బొగ్గు ఆధారిత సాంకేతికాలు
     i) In–situ coal gassification.
    ii) Clean coal Technology
* ఆంత్రసైట్‌ను హార్డ్‌కోల్ అని అంటారు.
* బిట్యూమినస్‌ను వంట బొగ్గు (Cooking coal) అని అంటారు. దీన్ని ఇళ్లలో ఉపయోగిస్తారు.
* లిగ్నైట్ బొగ్గును బ్రౌన్ కోల్ అని అంటారు. దీన్ని ఉపయోగించి వాటర్ గ్యాస్ (CO + H2) ప్రొడ్యూసర్ గ్యాస్ (CO + H2 + N2)లను తయారు చేస్తారు.
* బొగ్గు, నీటి ఆవిరి ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను థర్మల్ విద్యుత్ అని అంటారు.
* ప్రపంచం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉత్పత్తి, వినియోగం చెందించే విద్యుత్ థర్మల్ విద్యుత్.
* భారతదేశంలో నిర్మించిన మొదటి థర్మల్ విద్యుత్ కేంద్రం - కలకత్తా (1899)
* భారతదేశంలో అధిక సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రం - వింద్యాచల్ (మధ్యప్రదేశ్) (4,760 MW)
* థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1975లో ఎన్టీపీసీ సంస్థను ఏర్పాటు చేసింది.
* NTPC: National Thermal Power Corporation
* ఎన్టీపీసీ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.
* బొగ్గు పరిశ్రమలో పని చేసే వారికి వచ్చే వ్యాధి - న్యూమోకొనియాసిస్
* బొగ్గును నిర్వాతస్వేధనం (గాలి లేకుండా వేడిచేయడం) చేయడం వల్ల కోల్‌గ్యాస్, కోల్‌తార్, కోక్ లభిస్తుంది.
* కర్రను (వంట చెరకు)ను నిర్వాతస్వేధనం చేసి చార్‌కోల్‌ను పొందవచ్చు.
* ఎముకలను నిర్వాత స్వేదనానికి గురిచేసి జంతు చార్‌కోల్‌ను పొందుతారు. వీటిని గ్యాస్ మాస్క్‌ల్లో ఉపయోగిస్తారు.
* లిగ్నైట్ బొగ్గు భారతదేశంలో 28.27 బిలియన్ టన్నులు ఉంది. (2006 సంవత్సరానికి)
* తమిళనాడు, పుదుచ్చేరి (87.5%)
    రాజస్థాన్ (6.9%)
    గుజరాత్ (4.9%)
    కేరళ (0.31%)
     జమ్ము కశ్మీర్ (0.39%) రాష్ట్రాల్లో లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి.
* తమిళనాడులోని ఈ లిగ్నైట్ రకపు బొగ్గు నిల్వల కారణంగా మిగిలిన రాష్ట్రాల కంటే రసాయన పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు విస్తారంగా ఉన్నాయి.

ముడి చమురు
* భారతదేశంలో 2006 లెక్కల ప్రకారం ముడిచమురు నిల్వలు 760 మిలియన్ టన్నులు. ఇది ప్రపంచ నిల్వల్లో కేవలం 0.4% మాత్రమే.
* ముడిచమురు అవసరాల్లో అధిక భాగం రవాణా రంగానిదే.
* ప్రపంచ అవసరాల్లో మన దేశ అవసరాలు సుమారు 2.8%.
* భారత ప్రభుత్వం పెట్రోలియం, సహజ వాయు నిబంధనలు 1959 ప్రకారం న్యూ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ (NELP) ని ప్రవేశపెట్టింది.
* దీని ప్రకారం భారతదేశంలో చమురు శుద్ధి కేంద్రాల సంఖ్యను పెంచాలి.
* ఓఎన్‌జీసీ ముడిచమురు ఆయిల్ రిఫైనరీలో నిల్వలకు 18 ఐవోఆర్, ఈవోఆర్ ప్రాజెక్టులను నెలకొల్పింది.
     IOR : Improved Oil Recovery
     EOR: Enhanced Oil Recovery
* సహజ వాయువు రంగంలో సేవలందిస్తున్న సంస్థలు
     1. ఓఎన్‌జీసీ
     2. గెయిల్
* ఓఎన్‌జీసీ, గెయిల్ మహారత్న హోదాను కలిగి ఉన్నాయి.
* కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలోని గెయిల్ 933 కిలోమీటర్ల పొడవున గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం చేపడుతోంది.
* భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వరంగ సహజ వాయువు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం - విజ్జేశ్వరం (పశ్చిమ గోదావరి)
* ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసిన మొదటి సహజ వాయువు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం - జేగురుపాడు (తూర్పు గోదావరి)
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జేగురుపాడు సహజ వాయువు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పేరును గోదావరి గ్యాస్ పవర్‌ప్లాంట్‌గా మార్చింది.
* వీటిలో ఐదు ఆఫ్‌షోర్ ఐవోఆర్ ప్రాజెక్టులు
     1) ముంబయి హై ఉత్తర విభాగం
     2) ముంబయి హై దక్షిణ అభివృద్ధి విభాగం
     3) నీలం (2005 లో పూర్తయ్యింది)
     4) హీరా పార్ట్ - I (2005 డిసెంబరులో పూర్తయ్యింది)
     5) హీరా పార్ట్ - II ఈవోఆర్ ప్రాజెక్టులను గుజరాత్‌లో ఏర్పాటు చేశారు.
మూడు EOR ప్రాజెక్టులు గుజ‌రాత్‌లో ఏర్పాటు చేశారు.
         i) ఇన్సిటూ కంబుషన్ బెలోల్ (2001లో పూర్తయ్యింది)
        ii) ఇన్సిటూ కంబుషన్ సాంటల్ (2001లో పూర్తయ్యింది)
       iii) ఎక్స్‌టెండర్ పాలిమర్ సనాండ్ (2002లో పూర్తయ్యింది)
* 7 ఐవోఆర్ ప్రాజెక్టులను గుజరాత్‌లో ఏర్పాటు చేశారు
     i) సంతాల్ ఇన్‌ఫిల్ (2003 నవంబరులో పూర్తి చేశారు)
    ii) గంధర్ (2005 జులైలో పూర్తిచేశారు)
* కలోల్ ఉత్తర కాడి ఫేజ్-I, సొభాసన్, జోటానా, ఉత్తరకాడి ఫేజ్-II
* అసోంలో మూడు ఐవోఆర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు.
అవి: లక్వాలక్ష్మణి, రుద్రసాగర్, గలేరి.
* వీటి ద్వారా 2030 సంవత్సరానికి 200 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడిచమురును వెలికి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* భారతదేశంలో 18 నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి.
* భారతదేశంలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం - మధుర (ఉత్తర్‌ప్రదేశ్)
* బరౌని (బిహార్), దిగ్బాయ్ (అసోం), బాంబే హై (ముంబయి)లో కూడా రిఫైనరీలు ఉన్నాయి.
* ఎనర్జీ మేనేజ్‌మెంట్ సంస్థను న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు.
సహజవాయువు (Natural Gas)
* భూమిని డ్రిల్లింగ్ చేసినప్పుడు వెలువడే వాయువును సహజవాయువు అంటారు.
* ఇది హైడ్రోకార్బన్‌ల మిశ్రం
* దీనిలో మీథేన్ 85%(CH4) ఉంటుంది.
* ఈథేన్ (C2H6), ప్రోపేన్ (C3H8), బ్యూటేన్ (C4H10), పెంటేన్ (C5H12) 10% వరకు ఉంటాయి.
* మిగిలిన శాతం హైడ్రోజన్, CO2, నైట్రోజన్, H2S ఉంటాయి.
*సహజ వాయువులో మీథేన్ అధిక మొత్తంలో ఉంటుంది.
* భూమిలోని లోపలి పొరల్లో నీటి అడుగున ఉండే వృక్ష పదార్థం నుంచి సహజవాయువు ఉత్పత్తి అవుతుంది.
* ఆక్సిజన్ లేని వాతావరణంలో విచ్ఛన్నకర బ్యాక్టీరియాతో ఇది తయారవుతుంది.
* సహజ వాయువును వాయు రూపంలో నిల్వచేయలేం. కాబట్టి దీన్ని ద్రవరూపంలోకి మార్చి నిల్వచేస్తారు.
* సహజ వాయువును ఇంధనంగానే కాకుండా పరిశ్రమల్లో వేడి చేసేందుకు, ఎరువుల కర్మాగారాల్లో ముడిపదార్థంగా ఉపయోగిస్తారు.
* సహజ వాయువును వేడి చేసినప్పుడు బొగ్గు కంటే ఎక్కువ వేడిని ఇస్తూ CO2, నీటిని విడుదల చేస్తుంది.
* సహజ వాయువు బూడిద వంటి మిగులు పదార్థాలు లేకుండా మండుతుంది. వాతావరణ కాలుష్యం ఉండదు.

* సహజ వాయువు నిక్షేపాలు మొదటి సారిగా 1983లో రాజోలు బావి-1లో గుర్తించారు.

* కృష్ణా, గోదావరి బేసిన్‌లో అత్యధిక సహజ వాయువు నిల్వలు ఉన్న బ్లాక్ D–6.
* ఆంధ్రప్రదేశ్ తీరంలోని బంగాళాఖాతంలో మంచు రూపంలో గ్యాస్ హైడ్రేట్ నిల్వలు భారీ స్థాయిలో ఉన్నాయని ఓఎన్‌జీసీ ఇటీవల ప్రకటించింది.
* ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాల్లో ఇది ఒకటి.
* ఈ గ్యాస్ హైడ్రేట్ల నుంచి సహజవాయువును వెలికి తీయవచ్చు.
* గ్యాస్ ఉత్పత్తిని లెక్కించే ప్రమాణాలు మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్ పర్ డే (MMSCMD)
* సహజ వాయువు భూమి పొరల్లో పెట్రోలియం నిక్షేపాలతో పాటు లభిస్తుంది.
* ప్రపంచ ఇంధన అవసరాలను దాదాపు 25% ఇది తీరుస్తుంది.
* దీన్ని ముడిచమురు నిల్వలపై గాలి పొరలాగా నిల్వ చేస్తారు.
* దీన్ని పెట్రోరసాయనాల తయారీలో ముడి ఖనిజంగా ఉపయోగిస్తారు.
* ప్రపంచ సహజవాయువు నిక్షేపాల్లో భారతదేశ వాటా 0.4%
* నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రాం (NGHP) కార్యక్రమాన్ని 1997లో చమురు మంత్రిత్వ శాఖ Mopng వారు ఏర్పాటు చేశారు. ఆయిల్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్‌జీసీని 1956లో ఏర్పాటు చేశారు.

* ఎన్జీహెచ్‌పీలో సభ్య సంస్థలుగా ఓఎన్‌జీసీ, గెయిల్, డీజీహెచ్ (నేషనల్ జియోగ్రాఫికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్), ఎన్ఐవో (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రాఫి), డీవోడీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డవలప్‌మెంట్) పని చేస్తున్నాయి.
* సహజ వాయువును అత్యధిక పీడనాల వద్ద సంపీడిత సహజవాయువుగా నిల్వ చేస్తున్నారు.
*దీన్ని వాహనాలకు, గృహేతర అవసరాలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
* శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి మన జీవితాలను మార్చగలిగింది.
* కాలుష్యం పరంగా ఆదర్శ ఇంధనం సహజవాయువు అవుతుంది.


పెట్రోలియం
* పెట్రోలియం పెట్రా, ఓలియం అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. గ్రీకులో పెట్రా అంటే రాయి, ఓలియం అంటే నూనె. దీన్ని రాతి నూనె అని పిలుస్తారు.
* 4000 సంవత్సరాల పూర్వమే బాబిలోనియా గోడలు, గోపురాల నిర్మాణంలో ఆస్పాల్ట్ అనే పెట్రోలియం ఉత్పన్నాలను వాడారు.
* పూర్వ చారిత్రక యుగం నుంచి పెట్రోలియం గురించి మానవుడికి తెలుసు.
* పెట్రోలియాన్ని వెలికి తీసేందుకు చైనావారు లోతైన బావులు తవ్వారు.
* సముద్రాలు, మహా సముద్రాల ఉపరితలాలకు దగ్గరగా ఉండే ప్లాంక్‌టన్ వంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరల్లో కప్పబడి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా రూపాంతరం చెందుతాయి.
* వ్యాపార ప్రాముఖ్యం వల్ల దీన్ని 'ద్రవబంగారం' అని పిలుస్తారు.
*పెట్రోలియం ఘన పరిమాణాన్ని బ్యారల్‌లలో కొలుస్తారు.
    (1 బ్యారల్ = 159 లీటర్లు)

 

*ఇంటర్నేషనల్ ఎనర్జీఫోరమ్ రియాద్‌లో ఉంది.
*పెట్రోలియం ఒక సంక్లిష్ట మిశ్రమం దీన్ని అంశిక స్వేధనం ద్వారా వివిధ అంశీభూతాలను వేరుచేస్తారు.» పెట్రోలియం, భారలోహాల నుంచి తయారయ్యే పెయింట్లను గోడలకు, తలుపులకు వేసినప్పుడు విషపదార్థాలు గాలిలోకి విడుదల అవుతాయి. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, నాసియా మత్తులకు దారి తీస్తుంది.
*పెట్రోలియం శీఘ్ర దహనకారకం అందుకే పెట్రోలియం ట్యాంకర్లపై 'హైలీ ఇన్‌ఫ్లేమబుల్' అని రాసి ఉంటుంది.
* ఇది హైడ్రోజన్, కార్బన్‌ల మిశ్రమం. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఏపీలోని చిన్న తరహా నూనె శుద్ధి కర్మాగారం - తాటిపాక (తూర్పు గోదావరి)
* భారతదేశంలో దీని నిల్వలు బాంబే హై (అతిపెద్దది - ముంబయి), దిగ్భాయి (అసోం - అతి ప్రాచీనమైంది) లో ఉన్నాయి. 
* సెంట్రల్ పవర్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ బెంగళూరులో ఉంది.
* అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు సామర్థ్యం 4000 MW.
      ఉదా: కృష్ణ పట్నం, నెల్లూరు
* భారత ప్రభుత్వం విద్యుత్ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం - 2003
* భారత శక్తి సంరక్షణ చట్టాన్ని చేసిన సంవత్సరం - 2001
* ప్రపంచంలో విద్యుత్ వినియోగంలో మనదేశం 6వ స్థానంలో ఉంది.
* పెట్రోలియంను ఆంశిక స్వేధనం ద్వారా శుద్ధి చేస్తారు.
ప్రస్తుతం భారతదేశంలో నాలుగు పెట్రోలియం యూనివర్సిటీలు ఉన్నాయి.
       1. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (UPES), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)
       2. పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం (PDPU), గాంధీనగర్ (గుజరాత్)
       3. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ (RGIPT), రాయ్‌బరేలి (ఉత్తర్ ప్రదేశ్)
       4. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)

* జల విద్యుత్తు ఉత్పత్తిలో స్థితి శక్తి రూపంలో ఉన్న నీరు, గతి శక్తి రూపంలోకి మారినప్పుడు టర్బైన్‌లను తిప్పడం వల్ల ఉత్పత్తి జరుగుతుంది.
* అంటే స్థితి శక్తి గతిజ శక్తిగా మారి తర్వాత విద్యుత్ శక్తిగా మారుతుంది.
* 1975లో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC)ను ఫరీదాబాద్ లో ఏర్పాటు చేశారు.
* గ్రామీణ ప్రాంతాల్లో విద్యుద్దీకరణకు 'రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజనను' 2005 ఏప్రిల్‌లో ప్రారంభించారు.
* రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పాలసీని 2006లో ప్రారంభించారు.
* పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ను తయారు చేసే కార్యక్రమాన్ని శాస్త్ర సాంకేతిక శాఖ 1981 మార్చిలో ప్రారంభించింది.
* బయోమాస్, సోలార్ శక్తి వంటి పునరుత్పత్తి వనరులను 1982లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్ కనెక్వన్షనల్ ఎనర్జీ సోర్సెస్ (DNES) తయారు చేయడం ప్రారంభించింది.
* ఇండియన్ రెన్యూవల్ ఎనర్జీ డవలప్‌మెంట్ ఏజెన్సీ (IREDA) ను పునరుత్పాదక వనరుల వినియోగంలో, ఆర్థిక వనరులు సమకూర్చేందుకు 1987లో ఏర్పాటు చేశారు.
* 1,83,000 MW విద్యుత్‌ను 2032 సంవత్సరానికి పునరుత్పాదక వనరుల నుంచి తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 పవనశక్తి
* పవన శక్తి ఉత్పత్తికి కావాల్సిన కనీస గాలి వేగం 18 KMPH (లేదా) 5 m/sec.
* 2016 నాటికి అధికంగా ఈ శక్తిని ఉత్పత్తి చేస్తున్న దేశం - చైనా
    రెండో స్థానం - అమెరికా
    మూడో స్థానం - జర్మనీ
    నాలుగో స్థానం - స్పెయిన్
    అయిదో స్థానం - భారతదేశం
* మనదేశంలో పవనశక్తిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - తమిళనాడు (40%)
* రెండో స్థానం - గుజరాత్ ఆసియాలో మొదటి పవన కేంద్రం (మాడ్వి)
       మూడో స్థానం - మహారాష్ట్ర
      నాలుగో స్థానం - ఆంధ్రప్రదేశ్
* మనదేశంలో గాలిమరలను (విండ్ టర్బైన్‌లు) సరఫరా చేస్తున్న సంస్థలు
       1) సుజలాన్
       2) వెష్టాన్
       3) వెనెరాకాన్

* పవన శక్తిని గ్రీన్ పవర్ (Green Power) అని కూడా అంటారు.
* పవన విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే గాలి మరలను హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది.
* ప్రపంచంలో పవన శక్తిని అధికంగా వినియోగించే దేశం - అమెరికా
* పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని రూపొందించిన వారు అల్బర్ట్ బెట్చ్
పవనశక్తి విషయంలో పరిశోధనలు చేసే సంస్థలు
     1. సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ - చెన్నై, తమిళనాడు
     2. సర్దార్ పటేల్ రెన్యువబుల్ ఎనర్జీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ - ఆనంద్ (గుజరాత్)
     3. విండ్ వరల్డ్ ఇండియా - ముంబయి (మహారాష్ట్ర)
* 2014లో కేంద్ర ప్రభుత్వం జాతీయ వాయుశక్తి మిషన్‌ను చేపట్టింది. (National Wind Energy Mission - NWEM)
* దీని లక్ష్యం 2022 నాటికి 60,000 MW పవనశక్తిని ఉత్పత్తి చేయడం.
* తమిళనాడులోని 'ముప్పందళ్ పవన కేంద్రం' అరల్వైమోజి దగ్గర ఉన్న పవన కేంద్రం ఆసియాలోనే అతిపెద్ద పవన విద్యుత్ కేంద్రం.
* ప్రపంచంలో మొదటి పవన విద్యుత్ కేంద్రాన్ని జపాన్‌లోని యమగాటా రాష్ట్రంలోని 'నకాటా' అనే ప్రదేశంలో ఏర్పాటు చేశారు.

* లండన్‌లో 2013, జులై 4న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రపంచంలో అతి పెద్ద పవన విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిని సామర్థ్యం 630 MW.
* భారతదేశంలో పవన విద్యుత్ కేంద్రాలను కోస్తాతీరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీవులు, కర్టాటక తీరంలో ఏర్పాటు చేశారు.
* సహజ వాయు కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ సంస్థలు కూడా పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీని ఉత్పత్తి కోసం అనువైన 216 కేంద్రాలను గుర్తించారు.
వ్యర్థాల నుంచి విద్యుత్
* పర్యావరణంగా, ఆర్థికంగా వ్యర్థ పదార్థాలు అనేవి తీవ్రమైన సమస్యగా మారుతున్నాయి.
* అనేక దేశాలు వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నాయి.
* ప్రపంచ వ్యాప్తంగా 230 MMT వ్యర్థాలను ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు. (మున్సిపల్ ప్రాంతాల్లో)
* భారతదేశంలో 42 MMT ఘన వ్యర్థాలు, 6000 మిలియన్ క్యూబిక్ మీటర్ల ద్రవ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి.
* అధిక పరిమాణంలో వ్యర్థాలు చక్కెర, పండ్లు, కాగితం, ఆహార సంబంధ పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారమ్‌లు లాంటి వాటి నుంచి విడుదల అవుతున్నాయి.
* ఈ వ్యర్థాల నుంచి విద్యుత్‌ను 2007 సంవత్సరానికి 1300 MW, 2012 సంవత్సరానికి 1600 MW 2017 సంవత్సరానికి 2000 MW తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* భారతదేశంలో వ్యర్థాల నిర్వహణలో భాగంగా 21 ప్రాజెక్టులు నిర్మించారు.
* 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుకు ఐదు కోట్లు రాయితీ ఇచ్చారు.
* పారిశ్రామిక వ్యర్థాల నుంచి ప్రస్తుతం 200 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

సౌరశక్తి 
* ఇది ప్రకృతిలో విద్యుత్ అయస్కాంత శక్తి.
* సౌరశక్తి భూమిపైకి పాకెట్‌ల రూపంలో విడుదల అవుతుంది. వీటినే 'ఫోటాన్‌'లు అని అంటారు.
* ఒక చదరపు కిలోమీటరుకు 1400 MW సౌర విద్యుత్‌ను ప్రతి నిమిషానికి తయారు చేయవచ్చు.
* సాధారణ రోజు భారతదేశంలో చదరపు మీటరుకు 4 KWhr - 7.5 KWhr. వరకు సౌర విద్యుత్ తయారు చేయవచ్చు.
     సంవత్సరానికి సౌరశక్తి సరాసరి 5 × 105 KWhr విద్యుత్‌ను గ్రహిస్తుంది.
* సౌరశక్తిని నేరుగా రెండు పద్ధతుల ద్వారా సంగ్రహించవచ్చు.
      1) ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్
     2) కాన్సన్‌ట్రేటింగ్ కలెక్టర్స్

* సమాంతర ఫలకలను ఉపయోగించి ఇంటి పైకప్పు వంటి ప్రదేశాల్లో సూర్యునికి అభిముఖంగా వీటిని అమర్చుతారు.
* సమాంతర ఫలకలను అమర్చడానికి వీలులేని పరిశ్రమల లాంటి ప్రదేశాల్లో కాన్సన్‌ట్రేటింగ్ కలెక్టర్స్ సంగ్రహకాలను ఉపయోగిస్తారు.
* సూర్యునికి అభిముఖంగా ఉండి ఉష్ణోగ్రతను కొలిచే పరికరాన్ని హీలియోస్టాట్ అంటారు.
* సూర్యడి నుంచి కొంత శక్తి భూమిని చేరడాన్ని సూర్యపుటం (Insolation) అని అంటారు. దీన్ని రెండు విధాలుగా ఉత్పత్తి చేస్తారు.
    1) సోలార్ ఫొటో ఓల్టాయిక్ పద్ధతి
    2) సోలార్ థర్మల్ పద్ధతి
సోలార్ ఫొటో ఓల్టాయిక్ పద్ధతి
* సిలికాన్‌తో నిర్మించిన సౌర ఫలకలు (Solar Pannel's) పై కాంతి పతనమైనప్పుడు ఎలక్ట్రాన్‌లు ఉద్భవించి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ఉదా: సోలార్ వీధి దీపాలు
          సోలార్ క్యాలుక్యులేటర్
          సోలార్ సిగ్నలింగ్ సిస్టం
          సోలార్ ఫ్రిజ్
          సోలార్ ఏసీ ప్లాంట్లు
* సిలికాన్‌తో తయారైన సౌర ఘటాలను ఉపయోగించి సౌరశక్తిని విద్యుత్‌శక్తిగా మార్చిన మొదటి దేశం అమెరికా.
* భారతదేశంలో స్థాపించిన మొదటి సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం - కళ్యాణ్‌పూర్ (ఉత్తర్‌ప్రదేశ్)
* సౌరశక్తి గురించి పరిశోధన చేస్తున్న సంస్థలు
      1. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ - గుర్‌గాన్ (ఫరీదాబాద్)
      2. ఇనిస్టిట్యూట్ ఫర్ సోలార్ టెక్నాలజీ - హౌరా (పశ్చిమ బంగా)
సోలార్ ఇంపల్స్ 2 - సౌర విమానం
* అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటిన తొలి సౌర విమానం - ఇంపల్స్ 2
* 2015, మార్చి 9న దుబాయ్‌లో ప్రారంభమై ఒమన్, భారత్, మయన్మార్, చైనా దేశాలను సందర్శించింది. తర్వాత దీని బ్యాటరీలోని లోపాలను గుర్తించి అమెరికాలోని హవాయిలో 9 నెలల పాటు నిలిపివేశారు.
* తిరిగి 2016, ఏప్రిల్ 21న ప్రయాణాన్ని ప్రారంభించి 2016, జులై 26న ప్రారంభ స్థానాన్ని చేరుకుంది.
* న్యూయార్క్ నుంచి స్పెయిన్‌లోని సెవిల్లీ నగరానికి 72 గంటల్లో ప్రయాణించింది.
* ప్రపంచంలో అతిపెద్దదైన సోలార్ పవర్ పాండ్‌ను 2010 ఫిబ్రవరిలో లో చైనా నిర్మించింది.
* ఈ ప్లాంట్ వద్ద 1,40,000 లీటర్ల ద్రవాన్ని 80°C వరకు వేడి చేయవచ్చు.

* 1987లో గుజరాత్‌లోని భుజ్ తీరంలో సోలార్ పవర్ పాండ్‌ను ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 80,000 లీటర్లు
* దీన్ని ఉపయోగించి 80,000 లీటర్ల పాలు లేదా నీటిని 80°C వరకు వేడిచేయవచ్చు.
* సోలార్ ఇంపల్స్ I, సోలార్ ఇంపల్స్ II సౌర విమానాలను స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంపల్స్ అనే సంస్థ నిర్మించింది. వీటి వేగం సుమారు 77 Kmph.
* 2013 మార్చిలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు ఈ సౌరవిమానం సందర్శన కోసం వచ్చింది.
* 5 KW సామర్థ్యం ఉన్న సౌర ప్లాంట్లను రిమోట్ గ్రామాల్లో ప్రత్యేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రారంభించారు.
* సౌరశక్తితో వీధి దీపాలను మొదట కోలకతా నగరంలో ఏర్పాటు చేశారు.
*హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ లాంతర్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది.
* సౌరశక్తితో పనిచేసే ఏటీఎంను 2010 జనవరిలో ముంబయిలోని ఇండస్ బ్యాంకులో ఏర్పాటు చేశారు.
* భవిష్యత్తులో సోలార్ లాంతర్లు, ఫ్యాన్లను విద్యార్థులకు అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
* భవిష్యత్తులో 'నాగ్‌పూర్' పట్టణాన్ని ఆదర్శ సోలార్ సిటీగా రూపొందించాలని భారత ప్రభుత్వం సంకల్పించింది.
* మన దేశంలో సౌర పరికరాలను అధికంగా ఉపయోగిస్తున్న రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ కాబట్టి దాన్ని సోలార్ రాష్ట్రం అని అంటారు.
* సోలార్ పరికరాలను సబ్సిడీ ధరలకు అందించే సంస్థ 'ఆదిత్య'. దీని మరో పేరు 'అక్షయ్ కేంద్రాలు'.
*  సౌర పరికరాలను ఎక్కువగా ఉపయోగించే నగరం - సిమ్లా

థర్మల్ విద్యుత్
* బొగ్గు, సహజ వాయువును మండించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల దీన్ని థర్మల్ విద్యుత్ అంటారు.
* థర్మల్ విద్యుత్ కోసం 1975లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)ను ఏర్పాటు చేశారు.
* దీని ఆధ్వర్యంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటిలో సూపర్ పవర్ థర్మల్ కేంద్రంగా రామగుండం పేరు గాంచింది.
* విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం - విజయవాడ, ఆంధ్రప్రదేశ్
* కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం - తెలంగాణ
* నిహర్ ఖతియా థర్మల్ విద్యుత్ కేంద్రం - ఒడిశా
* దువరాన్ థర్మల్ విద్యుత్ కేంద్రం - గుజరాత్
* బరౌని థర్మల్ విద్యుత్ కేంద్రం - బిహార్
* నాసిక్ థర్మల్ విద్యుత్ కేంద్రం - మహారాష్ట్ర
* నైవేలి థర్మల్ విద్యుత్ కేంద్రం - తమిళనాడు
* ప్రస్తుతం (2016 నాటికి) ఉత్పత్తి, వినియోగంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో ఉన్నాయి.

* కాల వ్యవధి - 2006 నుంచి 2020
* కేటాయించిన నిధులు - రూ.25,000 కోట్లు
లక్ష్యాలు:
1) 2020 నాటికి 100 MW హైడ్రోజన్ పవర్‌ను ఉత్పత్తి చేయడం.
2) 2020 నాటికి ఒక మిలియన్ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలను ఉత్పత్తి చేయడం.
సముద్ర అలల శక్తి
* సముద్ర అలలకు మార్గ మధ్యంలో విద్యుత్ టర్బైన్‌లను అమర్చినప్పుడు జనరేటర్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
* ఫ్రాన్స్‌లోని 'లారెన్స్' ప్రాంతంలో 240 MW సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు.
* ఈ విద్యుత్ ఉత్పత్తికి పరిశోధన చేస్తున్న సంస్థలు
     1) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ (గోవా)
     2) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (చెన్నై)

* భారతదేశంలో ఈ శక్తికి అవకాశం ఉన్న ప్రాంతాలు
     1) ట్యుటికోరిన్ - తమిళనాడు
     2) వింజిగం - కేరళ
     3) అండమాన్ నికోబార్ దీవులు
     4) లక్ష్యద్వీప్

     5) సుందర్‌బన్ ప్రాంతం - పశ్చిమ్ బంగ
* ట్యుటికోరిన్‌లో 1 MW సామర్థ్యం ఉన్న ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ (OTEC) ఉన్న ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.


భూగర్భోష్ణశక్తి
* భూగర్భోష్ణశక్తి భూకేంద్రం నుంచి ప్రసరిస్తుంది. భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత 4000°C - 6000°C వరకు ఉంటుంది.
* భూ పటలంలో ప్రతి 30 మీటర్లు లోతుకు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది.
* భూమి సగటు అభివాహ సాంద్రత (ఉపరితలం) 0.06 W/చ.మీ.
* వేడి బుగ్గలు ఉన్న ప్రదేశంలో భూమి పొరల్లో 100°C నుంచి 200°C ఉష్ణోగ్రత ఉంటుంది.
* ఈ పొరల్లోకి ట్యూబులను పంపి నీటిని ఆవిరి రూపంలోకి మార్చి టర్బైన్‌లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు.
* ప్రపంచంలో ఈ శక్తిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియా.
* ఇతర ప్రాంతాలు హవాయి, మెక్సికో.

* దేశంలో 340 ప్రాంతాల్లో ఈ శక్తిని వెలికి తీయవచ్చని పరిశోధన జరిపారు.
మన దేశంలో భూగర్భోష్ణశక్తిని వెలికితీస్తున్న ప్రాంతాలు
    1) ప్యూగాలోయ - కశ్మీర్‌లోయ ప్రాంతం
    2) సూరజ్ ఖుండ్ - జమ్మూ కశ్మీర్
    3) అలక్‌నంద - ఉత్తరాఖండ్
    4) తపోవన్ - ఉత్తర్ ప్రదేశ్
    5) మణికరన్ - హిమాచల్ ప్రదేశ్
* మణికరన్‌లో 1 MW సామర్థ్యం ఉన్న శక్తి ఉత్పత్తికి ప్రాజెక్టు నెలకొల్పుతున్నారు.
జీవ ఇంధనాలు
* జీవించి ఉన్న పదార్థాల నుంచి తయారయ్యే ఇంధనాలను జీవ ఇంధనాలు అంటారు. అవి:
    1) బయో డీజిల్
    2) బయో ఇథనాల్
    3) బయో గ్యాస్
   4) బయో మాస్

బయో డీజిల్
* కొన్ని మొక్కల విత్తనాల్లోని నూనెలను ట్రాన్స్ - ఎస్టరిఫికేషన్ ప్రక్రియకులోను చేయడం వల్ల తయారయ్యే ఇంధనాన్ని బయో డీజిల్ అని అంటారు.
* ముఖ్యంగా జత్రోపా, కానుగ మొక్కల గింజల నుంచి సేకరించిన నూనెను బయో డీజిల్ అని అంటారు. దీనిలో సాధారణమైన డీజిల్‌ను కొంత కలిపితే దాని దహనశీలత పెరుగుతుంది. కాబట్టి డీజిల్‌తో పనిచేసే ప్రతీ ఇంజన్‌లో బయోడీజిల్‌ను ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
* భారతదేశంలో దీని ఉత్పత్తి
    జత్రోపా కర్కన్ - సీమనేల పాలం/ అడవి ఆముదం
    పొంగామియా పిన్నేటా - కానుగ నుంచి తయారు చేస్తున్నారు.
* అమెరికాలో సోయాబీన్, మలేషియాలో పామాయిల్, ఫ్రాన్స్‌లో రేప్‌సీడ్ నుంచి బయోడీజిల్ తయారు చేస్తున్నారు.
* దీని ఉత్పత్తి, నిర్వహణ శాస్త్రసాంకేతిక శాఖ ఆధ్వర్యంలో డీఎస్టీ వారు నిర్వహిస్తున్నారు.
దీని ఉత్పత్తిలో
     మొదటి స్థానం - బ్రెజిల్
     రెండో స్థానం - యూఎస్ఏ
     మూడో స్థానం - చైనా
     నాలుగో స్థానం - భారతదేశం
బయో ఇథనాల్
* చెరకు, తీపి మొక్కజొన్న, తీపి క్యారెట్, తీపి ఆలుగడ్డ లాంటి వాటి నుంచి సేకరించిన గ్లూకోజ్‌ను పులియ బెట్టినప్పుడు బయోఇథనాల్ ఏర్పడుతుంది.
* కొన్ని రకాల మొక్కల విత్తనాల నుంచి కూడా సేకరిస్తారు.
* భారతదేశంలో చెరకు నుంచి, అమెరికాలో మొక్కజొన్న నుంచి ఉత్పత్తి చేస్తారు.
* బయో ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియలో జరిగే చర్య అవాయుశ్వాస క్రియ/కిణ్వనమం
* దీని ఉత్పత్తిలో పాల్గొనే జీవి ఈస్ట్ కణజీవులు.
* బయోడీజిల్‌ను, డీజిల్‌కు; బయో ఇథనాల్‌ను పెట్రోలుకు కలిపే ప్రక్రియను బ్లెండింగ్ (Blending) అని అంటారు.
   యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం B10 (Blending 10%) అమల్లో ఉంది.
   బయో డీజిల్ (10%) + డీజిల్ (90%) = B10
   బయో ఇథనాల్ (10%) + పెట్రోల్ (90%) = B10
   ఇథనాల్ + పెట్రోల్ = గ్యాసోహాల్

బయోగ్యాస్
* దీన్నే గోబర్‌గ్యాస్ అని కూడా అంటారు.
* పశువుల వ్యర్థాలైన పేడ, మూత్రం, నీటిని కలిపి బయోగ్యాస్ ప్లాంట్‌లో వేయడం వల్ల కిణ్వన ప్రక్రియకు గురై బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
* దీనిలో ప్రధాన వాయివులు
   మీథేన్ (CH4) = 60 - 70%
   బొగ్గుపులుసు వాయువు (CO2) = 30 - 40%
*  హైడ్రోజన్, నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్‌లు పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువ పరిమాణంలో ఉంటాయి.
* ప్రపంచంలో మొదటి బయోగ్యాస్ ప్లాంట్‌ను 1947లో జర్మనీ దేశం ఏర్పాటు చేసింది.
* మన దేశంలో బయోగ్యాస్ ప్లాంట్లను 1953, 1955లో 'గ్రామలక్ష్మి' అనే పేరుతో ఏర్పాటు చేశారు.
*  బయోగ్యాస్ ప్లాంట్లను సమర్థంగా వినియోగించుకుంటున్న రాష్ట్రం పంజాబ్.
   తదుపరి రాష్ట్రాలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్.
* బయోగ్యాస్ ఉత్పత్తి, వినియోగంలో మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో భారతదేశం ఉన్నాయి

బయోమాస్
* వ్యవసాయ వ్యర్థాలైన గడ్డి, ఆకులు, పిప్పి లాంటి వాటిని నీటితో కలిపితే మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుంది.
* వీటిలో మిగిలిపోయిన పిప్పిని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పద్ధతిని కో - జనరేషన్ అంటారు.
* కో - జనరేషన్ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను మన దేశంలో 1994లో ప్రారంభించారు. అనేక చక్కెర కర్మాగారాల్లో దీన్ని ఏర్పాటు చేశారు.
* బయోగ్యాస్ అభివృద్ధి కార్యక్రమాన్ని 1981 - 82లో ప్రారంభించారు.
* మన దేశంలో బయోగ్యాస్ ప్లాంట్ల నమూనా
    i) ప్లోటింగ్
   ii) ఫిక్స్‌డ్ డోమ్
   iii) దీనబంధు
* బయోగ్యాస్ ప్లాంట్లలో పేడ, నీటిని 4 : 5 నిష్పత్తిలో కలుపుతారు.
*  బయోగ్యాస్ ప్లాంట్లలో మిగిలే వ్యర్థ పదార్థాలను స్లర్రీ అని అంటారు.
* బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - తమిళనాడు.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో మొదటి బయోమాస్ ప్లాంట్‌ను ఖమ్మం జిల్లా పాల్వంచ దగ్గర ఏర్పాటు చేశారు.
* మాగ్నట్ హైడ్రో డైనమిక్స్‌లో ఉష్ణశక్తి - విద్యుత్‌శక్తిగా మారుతుంది.
* రసాయన శక్తి జనకాలు లేదా ఫ్యూయల్ సెల్స్‌కు ఉదాహరణ
     i) సాలిడ్ ఆక్సైడ్
     ii) ఫాస్పారిక్ ఆమ్లం
    iii) మోల్టన్ కార్బొనేట్
* మాగ్నైట్ హైడ్రో డైనమిక్స్ ప్లాంటును దేశంలో తొలిసారిగా తమిళనాడులోని 'తిరుచ్చి'లో ఏర్పాటు చేశారు.
* దేశంలో ఎనర్జీ పార్కులను 1994 - 95లో ప్రారంభించారు.
భూగర్భోష్ణం గురించి పరిశోధన చేస్తున్న సంస్థలు
    i) నేషనల్ ఎరోనాటికల్ ల్యాబొరేటరీ
   ii) మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్
   iii) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
హ్రైడ్రోజన్ శక్తి గురించి దేశంలో పరిశోధన చేస్తున్న సంస్థలు
    i) రాజస్థాన్ విశ్వవిద్యాలయం
   ii) ఉస్మానియా విశ్వవిద్యాలయం
   iii) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
* 2008, సెప్టెంబర్ 11న భారత ప్రభుత్వం ప్రకటించిన జీవ ఇంధన విధానం ప్రకారం 2017 నాటికి ఇంధన వినియోగంలో ఉండాల్సిన జీవ ఇంధన శాతం - 20%
* హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించే కారును రూపొందించడానికి ప్రయత్నిస్తున్న సంస్థ - టాటా మోటార్స్
* బయోడీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును కర్ణాటకలో ఏర్పాటు చేశారు.
* ప్రస్తుతం దేశంలో ఒక లీటరు బయోడీజిల్ ఉత్పత్తి వ్యయం రూ.21
* బయో ఇంధన పంటలను పంటల బీమా పథకంలో చేర్చిన రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్
* జీవ ఇంధనాలకు సంబంధించిన ప్రాజెక్టును ప్రారంభించిన శాఖ - నేషనల్ ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటెబుల్ ఆయిల్ డెవలప్‌మెంట్ బోర్డు
* మన దేశానికి కార్బన్ క్రెడిట్ కార్డులు అందిస్తున్న విద్యుత్ ఉత్పత్తి విధానం
    i) వాయు ఇంధనం
   ii) జీవ ఇంధనం
   iii) సౌర ఇంధనం, పునరుత్పాదక వనరులు
* మన దేశంలో చక్కెర పరిశ్రమల నుంచి వెలువడే బగాసె ద్వారా 5000 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు.

చిన్న తరహా జల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అనుకూలమైన రాష్ట్రాలు
    i) హిమాచల్‌ప్రదేశ్
    ii) ఉత్తరాఖండ్
    iii) జమ్మూకశ్మీర్ వంటి చిన్న రాష్ట్రాలు
* పట్టణ వ్యర్థపదార్థాల నుంచి 3400 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు.
* 2007 నాటికి దేశంలో పరిశ్రమల వ్యర్థ పదార్థాల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ 26 MW


కోల్ బెడ్ మీథేన్ (CBM)
* ఇది కోల్‌బెడ్ నుంచి సంగ్రహించే సహజ వాయువు
* దీనిలో ప్రొపేన్, బ్యూటేన్ వంటి భారయుత హైడ్రో కార్బన్లు తక్కువగా ఉంటాయి.
* ఈ వాయువు ఉత్పత్తి, నిర్వహణ కోసం 'గ్రేట్ ఈస్టరన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (GEECL)' అనే సంస్థ ఏర్పాటు చేశారు.
* GEECL సంస్థ పశ్చిమబంగాలోని 'అసన్ సోల్' వద్ద ఉంది.


షేల్ వాయువు
* షేల్ అనేది ఒక అవక్షేప శిల.
* ఈ శిలల పొరల మధ్య ఉండే సహజ వాయువే షేల్ వాయువు.
* షేల్ వాయు నిల్వలు అధికంగా ఉన్న దేశం చైనా.
* భారతదేశంలో కృష్ణా, గోదావరి, కావేరి వంటి నదుల తీర ప్రాంతాల్లో షేల్ వాయువుల నిల్వలు ఉన్నాయి.

 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌