• facebook
  • whatsapp
  • telegram

నదీవ్యవస్థ

కావేరి నదీ తీరంలో కుంభకోణం! 


భారతీయ సంస్కృతి, జీవనం, నాగరికత, అభివృద్ధిలో నదులు అంతర్భాగాలు. ప్రధానంగా హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులుగా వందలాదిగా ఉన్న ఈ సహజ వనరులే దేశంలో అధికశాతం ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్నాయి. జీవనోపాధితో పాటు ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు కేంద్ర బిందువులయ్యాయి. ప్రధాన నగరాలు, పట్టణాలన్నీ వాటి తీరాల్లో అభివృద్ధి చెందినవే. దేశ నదీవ్యవస్థ, ప్రధాన నదుల విశేషాలు, నైసర్గిక స్వరూపం గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. నదులజన్మస్థానాలు, ప్రవాహ మార్గాలు, పరీవాహక  ప్రాంతాలున్న రాష్ట్రాలు, ముఖ్యమైన ఉపనదులు, నదుల ఆధారంగా ఏర్పడిన సరస్సులు, జలపాతాల గురించి విస్తృతంగా తెలుసుకోవాలి. 


1. కిందివాటిలో పుష్కర్‌ సరస్సు మీదుగా ప్రవహించే నది ఏది?

1) లూని   2)బాని   3)ఘగ్గర్‌    4) గాగ్ర


2. ఖర్కాయి.. ఏ నదికి ఉపనది?

1) బ్రాహ్మణి      2)సువర్ణరేఖ    3)నాగావళి     4) పెరియార్‌

 

3. కింది ఏ నది కేరళలోని పులాచిమలై కొండల్లో జన్మిస్తుంది?

1) పెరియార్‌      2)భరతపూజ    3)పంబా నది      4) మాండోవి నది

 

4. కిందివాటిలో మహి నదికి ఉపనదులు-

ఎ) సోమ్‌      బి) అనాస్‌   సి) వాకల్‌      డి) హత్‌మతి

1) ఎ, బి   2)బి, సి    3)సి, డి   4) డి, ఎ

 

5. నర్మదా నదికి ఉన్న పలు పేర్లను గుర్తించండి.

ఎ) నేరబుద్ధ      బి) రేవా నది     సి) సూర్య పుత్రి       డి) గిరి కర్ణిక

1) ఎ, సి   2)బి, సి   3)ఎ, బి   4) డి, ఎ


6. కిందివాటిలో కావేరి నదికి ఎడమవైపు ఉపనదులేవి?

ఎ) హేమవతి     బి) లక్ష్మణ తీర్థ   సి) ఆర్కావతి       డి) కభిని

1) ఎ, సి   2)ఎ, బి   3)బి, సి   4) డి, సి


7. ఇరుపుల జలపాతం ఏ నదిపై ఉంది?

1) కభిని      2)లక్ష్మణ తీర్థ     3)భవాని      4) హేమావతి


 

8. బ్రహ్మపుత్ర నదికి కుడివైపు ఉన్న ఉపనదులు    గుర్తించండి.

 ఎ) మానస్‌      బి) లోహిత్‌    సి) కామెంగ్‌       డి) కపిలి

1) ఎ, సి   2)బి, సి   3)డి, ఎ   4) బి, డి

 

9. బ్రహ్మపుత్ర నది ఏర్పరచిన నదీ ఆధారిత దీవి మజూలిలో అధికంగా నివసిస్తున్న తెగ ఏది?

 1) మిషింగ్‌      2)గారో    3)లలాంగ్‌      4) హజాంగ్‌


10. గోదావరి నది పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న రెండో రాష్ట్రం?

 1) మధ్యప్రదేశ్‌      2)తెలంగాణ    3)ఒడిశా    4) మహారాష్ట్ర

 

11. కిందివాటిలో గోదావరి నదికి ఎడమవైపు ఉండే నదులు గుర్తించండి.    

ఎ) ప్రాణహిత      బి) పూర్ణ   సి) మంజీర        డి) మానేరు

1) ఎ, సి   2)సి, డి   3)ఎ, బి   4) బి, డి


12. అలకనంద, నందాకిని నదులు ఏ ప్రాంతంలో కలుస్తాయి?

1) కర్ణప్రయాగ       2)నందప్రయాగ       3)రుద్రప్రయాగ       4) దేవప్రయాగ


13. సింధు నది పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న మూడో రాష్ట్రం ఏది?

1) పంజాబ్‌    2)హరియాణా   3)హిమాచల్‌ ప్రదేశ్‌    4) రాజస్థాన్‌



14. కిందివాటిలో యమునా నదికి ఉపనదులు?

ఎ) చంబల్‌     బి) బెట్వా    సి) కెన్‌       డి) సోన్‌

 1) ఎ, బి, సి    2)బి, సి, డి      3)సి, డి, ఎ     4) డి, ఎ, బి


15. కింది ఏ నదిపై గోకక్‌ జలపాతం ఉంది.

1) గోదావరి     2)ఘటప్రభ   3)మలప్రభ       4) భీమ


16. కిందివాటిలో ఏ నదిని ముచుకుందా నది అంటారు?

1) భీమ   2)మున్నేరు  3)మూసి    4) కొయానా


17. కిందివాటిలో మహదాయి నది అని దేన్ని     పిలుస్తారు?

1) భరత పూజ     2)పెరియార్‌   3)మాండోవి       4) పంబా


18. కిందివాటిలో ఏ నదికి మహేంద్ర తనయ నది ఉపనది?

1) నర్మద      2)తపతి   3)నాగావళి      4) వంశధార

 

19. కుంభకోణం నగరం ఏ నది ఒడ్డున ఉంది?

1) కావేరి   2)వైగై    3)కభిని   4) భవాని

 

20. నర్మదా నది కుడివైపు ఉపనదులు గుర్తించండి.

ఎ) హిరన్‌    బి) ఒర్సాంగ్‌   సి) బంజర్‌     డి) షక్కర్‌

1) ఎ, సి   2)ఎ, బి   3)సి, డి   4) డి, ఎ

 

21. కిందివాటిలో రహస్య చెరువుగా దేన్ని పిలుస్తారు?

1) కంభం చెరువు       2)గండిపేట చెరువు   3)దుర్గం చెరువు       4) మీర్‌ ఆలమ్‌ చెరువు



22. కిందివాటిలో ఏ రెండు నదుల కలయిక వల్ల హరిక్‌ సరస్సు ఏర్పడింది?    

ఎ) సట్లెజ్‌      బి) బియాస్‌    సి) రావి      డి) చినాబ్‌

1) ఎ, బి,   2)బి, సి    3)సి, డి   4) డి, ఎ


23. రేణుకా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఉత్తరాఖండ్‌    2)హిమాచల్‌ ప్రదేశ్‌     3)సిక్కిం    4) లద్దాఖ్‌


24. కిందివాటిలో నెలవంక ఆకారంలో ఉన్న   సరస్సును గుర్తించండి.

1) కొల్లేరు    2)కేదార్‌   3)నైనిటాల్‌    4) వీరనాం


25. కృష్ణా నది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది?

1) కర్ణాటక       2)మహారాష్ట్ర    3)తెలంగాణ       4) ఆంధ్రప్రదేశ్‌


26. ఏ నది పరివాహక ప్రాంతంలో పాకుయ్‌/పక్కే పులుల సంరక్షణా కేంద్రం ఉంది?

1) మనాస్‌      2)సంకోష్‌    3)కామెంగ్‌      4) తీస్తా


27. పెన్నానది కుడివైపు నదులు గుర్తించండి.

ఎ) పాపాగ్ని     బి) చిత్రావతి     సి) సగిలేరు    డి) జయమంగళి

1) ఎ, బి    2)బి, సి   3)సి, డి   4) డి, ఎ


28. కిందివాటిలో తపతి నది ఉపనదులు-

ఎ) అనేర్‌    బి) గిర్నా     సి) బంజర్‌     డి) ఒర్సాంగ్‌

1) ఎ, సి  2)సి, డి   3)డి, ఎ   4) ఎ, బి


29. నర్మదా నది పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది?

1) మధ్యప్రదేశ్‌       2)మహారాష్ట్ర   3)గుజరాత్‌       4) కర్ణాటక


30. మహి నది పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రం?

1) రాజస్థాన్‌     2)గుజరాత్‌    3)మధ్యప్రదేశ్‌     4) మహారాష్ట్ర


31. కిందివాటిలో గంగానది ఉపనదుల్లో భిన్నమైంది? 

1) యమునా   2)గాగ్రా    3)సోన్‌    4) పున్‌పున్‌


32. లద్దాఖ్‌లో ప్రవహిస్తూ సింధూ నదిలో కలిసే ఉప నదులను గుర్తించండి.

ఎ) గిల్‌గిట్‌     బి) కాబూల్‌    సి) ష్వోక్‌     డి) జస్కార్‌

1) ఎ, బి   2)బి, సి   3)సి, డి    4) డి, ఎ


33. రావినదికి ఉన్న పేర్లు గుర్తించండి.

ఎ) అస్కిని       బి) వితస్థ   సి) ఐరావతి       డి) పరూషిని

1) ఎ, బి   2)బి, సి   3)డి, ఎ    4) సి, డి


34. పెషావర్‌ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?

1) సింధూ     2)గిల్‌గిట్‌    3)కాబుల్‌     4) కుర్రాం

 

35. కిందివాటిలో యమునా నది ఉపనదుల్లో భిన్నమైంది గుర్తించండి.

1) చంబల్‌    2)సింధ్‌   3)బెట్వా    4) హిండాన్‌

 

36. కింది ద్వీపకల్ప నదుల్లో దక్షిణ గంగ అని పిలిచే నది?

 1) కృష్ణా      2)పెన్నా   3)మహానది    4) కావేరి


37. బెంగళూరు ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది?

1) కభిని      2)భవాని    3)ఆర్కావతి      4) షింష


38. గోదావరి నది ఏడు పాయల్లో ఒకటైన గౌతమి ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది?

1) కొమరగిరి పట్నం     2)యానాం   3)అంతర్వేది     4) బెండమూరి లంక


39. కిందివాటిలో గోదావరి నదికి కుడివైపు ఉండే ముఖ్యమైన ఉపనదిని గుర్తించండి.

1) మంజీరా     2)ప్రాణహిత   3)ఇంద్రావతి     4) పూర్ణ


40. కొయానా నదిపై కొయానా డ్యామ్‌ వల్ల ఏర్పడిన జలాశయం?

1) హిమాయత్‌ సాగర్‌     2)శివాజీ సాగర్‌    3)నిజాం సాగర్‌     4) ఇందిరా సాగర్‌


41. కిందివాటిలో సబర్మతి నది ఉపనది కానిది?

1) వాకల్‌      2)హత్‌మతి   3)నేష్వా      4) ఒంగ్‌


42. కిందివాటిలో నాగావళి నదికి ఉపనది కానిది గుర్తించండి. 

1) ఝంఝావతి    2)వేగవతి    3)మహేంద్ర తనయ    4) వొట్టిగడ్డ


43. కిందివాటిలో ఘగ్గర్‌ నదికి ఉపనది కానిది-

1) మార్కండ     2) కౌసల్య    3)తాంగ్రి     4) జోజారి

 

44. అనంతనాగ్‌ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?

1) సింధు    2) జీలం   3) చినాబ్‌    4) రావి 


45. సింధు నది ఉపనదుల్లో భిన్నమైంది గుర్తించండి.

1) కాబుల్‌    2) రావి   3)ష్వోక్‌     4) కిసాన్‌ గంగ


46. గంగా నది ఉపనదుల్లో భిన్నమైంది గుర్తించండి.

1) గండక్‌   2) గాగ్రా  3) శారద       4) కోసి

 

47. కిందివాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది? 

1) మహానంద   2)మహా నది     3)మహి నది   4) మహేంద్ర తనయ


48. కిందివాటిలో ఉత్తరం వైపు ప్రవహించని నది? 

1) చంబల్‌     2)బెట్వా    3)కెన్‌      4) సోన్‌ 


49. కిందివాటిలో దక్షిణానికి ప్రవహించే నదులేవి? 

 ఎ) గండక్‌   బి) కోసి    సి) చంబల్‌    డి) కెన్‌ 

1) ఎ, బి   2)బి, సి  3)సి, డి   4) డి, ఎ


50. కిందివాటిలో గోదావరి ఉపనది కానిది-

1) ప్రాణహిత   2)ఇంద్రావతి    3)మంజీర   4) మున్నేరు  

 

సమాధానాలు 

1-1; 2-2; 3-3; 4-1; 5-3; 6-1; 7-2; 8-1; 9-1; 10-2; 11-3;12-2; 13-3; 14-1; 15-2; 16-3; 17-3; 18-4; 19-1; 20-2;21-3; 22-1; 23-2; 24-3; 25-2; 26-3; 27-1; 28-4; 29-3;30-1; 31-2; 32-3; 33-4; 34-3; 35-4; 36-4; 37-3; 38-2;39-1; 40-2; 41-4; 42-3; 43-4; 44-2; 45-4; 46-3; 47-3;48-4; 49-1; 50-4.

 

రచయిత : బండ్ల. శ్రీధర్ 

Posted Date : 09-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌