• facebook
  • whatsapp
  • telegram

సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్లు 

సరికొత్త రక్షణ రంగ అస్త్రం సూసైడ్‌ డ్రోన్‌!

భారత్‌ ఆకాశ్‌ క్షిపణిని తయారుచేసింది. అమెరికా, రష్యాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంది. గగనతల రక్షణ వ్యవసను బలోపేతం చేసింది. వ్యాధుల నుంచి రక్షణకు వ్యాక్సిన్‌లు తయారవుతున్నాయి. నాసా లాంటి సంసలతో కలిసి ఇస్రో సరికొత్త ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఏర్పాట్లు సాగుతున్నాయి. క్షయ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు. ఈ విధమైన సమకాలీన పరిణామాలపై అభ్యరులకు అవగాహన ఉండాలి. సంబంధిత రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, గత సంవత్సర కాలంలో సాధించిన విజయాలు, దేశంలో జరిగిన ఆవిష్కరణలు, అభివృద్ధి అంశాలను పోటీపరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

మాదిరి ప్రశ్నలు


1. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) భారతదేశం ఉపరితలం నుంచి గాలిలోకి   ప్రయోగించే క్షిపణి ఆకాష్‌ను తయారుచేసింది.

బి) భారతదేశం అమెరికా నుంచి నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌--II  సిస్టం (NASAMS-2)  దిగుమతి చేసుకుంటోంది.

సి) పై రెండు క్షిపణులు గగనతల రక్షణ వ్యవసలో భాగంగా ఉంటాయి.

1) ఎ మాత్రమే     2) ఎ, బి    3) ఎ, బి, సి     4) బి, మాత్రమే 


2.  కింది వాక్యాలను పరిశీలించండి.

 ఎ) భారత రక్షణ రంగ పరిశోధన సంస- డీఆర్‌డీవో ప్రాజెక్ట్‌ ‘కుష’లో భాగంగా ‘లాంగ్‌ రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్స్‌ (LRSAM) లను అభివృద్ధి చేస్తోంది.

బి) భారతదేశం ఎస్‌ - 400 గగనతల రక్షణ   వ్యవసను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

1) ఎ, బి లు సరైనవి. ఇవి రెండూ ఒకే అంశానికి సంబంధించినవి.

2) ఎ సరైంది, బి సరైంది కాదు. ఇవి వేర్వేరు అంశాలు.

3) ఎ, బి లు సరైనవి కావు. ఇవి రెండూ వేర్వేరు అంశాలు.

4) ఎ సరైంది కాదు, బి సరైంది. ఇవి ఒకే అంశానికి చెందినవి.


3.  చంద్రయాన్‌-3లోని ‘లిక్విడ్‌ అపోజి మోటార్‌(LAM) '  దేనికోసం ఉపయోగపడుతుంది?

1) ఉపగ్రహాన్ని ఉంచిన రాకెట్‌కు శక్తినివ్వడానికి.

2) చంద్రయాన్‌ - 3 ఉపగ్రహం కక్ష్యను     మార్చేందుకు లేదా కక్ష్యను పెంచడానికి. 

3) ఉపగ్రహం ఎక్కువ వేగంగా కక్ష్యలో తిరగడానికి.

4) రాకెట్‌ నుంచి ఉపగ్రహం విడిపోవడానికి.


4. భారతదేశం 2023 - 2024 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘పీఎమ్‌ - ప్రణామ్‌’ పథకం ముఖ్య ఉద్దేశం?

1) వ్యవసాయ రంగంలో నూతన వంగడాల సృష్టి, అధిక దిగుబడులు సాధించడం.

2) రసాయనిక ఎరువులను సమతుల్యంగా వాడటం, ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని       ప్రోత్సహించడం.

3) ఎరువులకు సబ్సిడీలను పెంచి వాటిని ఎక్కువగా వాడేలా ప్రోత్సహించడం.

4) రసాయనిక ఎరువుల ఉత్పత్తి పెంచడం.


5.  భారతదేశం ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెలికాప్టర్‌ల గురించి ఇచ్చిన జతలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) ధ్రువ్‌ 1) తేలిక రకం హెలికాప్టర్‌
బి) ప్రచండ్‌ 2) మల్టీరోల్‌ హెలికాప్టర్‌
సి) రుద్ర   3) దాడిచేసే హెలికాప్టర్‌
డి) చినూక్‌ 4) భారీ సామగ్రిని   తరలించే హెలికాప్టర్‌

1) ఎ-2, బి-1, సి-3, డి-4    2) ఎ-4 బి-2, సి-1, డి-3

3) ఎ-4 బి-2, సి-3, డి-1     4) ఎ-1, బి-2, సి-3, డి-4


6. గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు  వేటిని అభివృద్ధి చేశారు?

ఎ) ఎన్విరాన్‌మెంట్‌ కంట్రోల్‌ అండ్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టం.

బి) ఇంటిగ్రేటెడ్‌ వెహికల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం

సి) క్రూ ఎస్కేపింగ్‌ సిస్టం.

1) ఎ, బి     2) బి, సి    3) ఎ, బి, సి    4) ఎ మాత్రమే


7. ‘సెర్వావాక్‌’ వ్యాక్సిన్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) దీన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు వాడుతున్నారు.

బి) ఇది క్వాడ్రివాలెంట్‌ వ్యాక్సిన్‌ అంటే నాలుగు రకాల హెచ్‌పీవీ వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

సి) సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు  చేసిన స్వదేశీ వ్యాక్సిన్‌.

1) ఎ మాత్రమే    2) ఎ, బి    3) బి, సి     4) ఎ, బి, సి 


8. ‘న్యూరాలింక్‌’ ప్రాజెక్టు దేనికి సంబంధించింది?

1) మానవ మెదడు మార్పిడికి సంబంధించిన ప్రయోగం.

2) మానవ ఆలోచనలు నియంత్రించే టెక్నాలజీ ప్రాజెక్టు.

3) మానవ మెదడులో చిప్‌ అమర్చే ప్రాజెక్టు.

4) మెదడులోని న్యూరాన్‌లను అనుసంధానం చేసే ప్రాజెక్టు.


9.  కిందివాటిలో సరికాని వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) ‘కావేరి ప్రాజెక్టు’ - జెట్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది.

బి) తేలిక రకం యుద్ధవిమానం తేజస్‌లో ఎఫ్‌ - 414 ఇంజిన్‌ను అమర్చారు.

సి) ఫ్రెంచ్‌ సంస సాఫ్రాన్‌ ఇంజిన్‌ను జీఎస్‌ఎల్‌వీలో అమర్చారు.

డి) వికాస్‌ ఇంజిన్‌ను టీ - 90 యుద్ధ ట్యాంకులో అమర్చారు.

1) ఎ, బి   2) సి, డి   3) ఎ, సి   4) బి, డి


10. కిందివాటిని గమనించి, సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) నాసా, ఇస్రో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహం ‘నిస్సార్‌’.

బి) ఇస్రో పునర్వినియోగ వాహక నౌక పేరు ‘పుష్పక్‌’.

1) ఎ, బి లు రెండూ సరైనవి. వీటికి ఒకదానికొకటి సంబంధం లేదు.

2) ఎ సరైంది, బి సరైంది కాదు. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధం కలిగి ఉన్నాయి.

3) ఎ సరైంది కాదు, బి సరైంది.

4) ఎ, బి లు రెండూ సరికావు.


11.  కింది వాక్యాల్లో సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) ఇటీవల పరీక్షించిన అగ్ని - V ఎమ్‌ఐఆర్‌వీకి పెట్టిన పేరు మిషన్‌ దివ్యాస్త్ర.

బి) మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’కి ఇటీవల నలుగురు వ్యక్తులను ఎంపిక చేశారు. వీరిని శక్తియాన్స్‌ అని పిలుస్తారు.

సి) సూసైడ్‌ డ్రోన్‌గా పిలిచే నాగాస్త్ర  I ను ఇటీవల అభివృద్ధి చేశారు.

డి) ఎంక్యూ - 9బీ డ్రోన్‌లను భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

1) ఎ, బి    2) బి, సి, డి    3) ఎ, డి    4) ఎ, బి, సి, డి


12. కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పోఖ్రాన్‌లో  నిర్వహించిన సైనిక విన్యాసాలు - భారత్‌ శక్తి.

బి) భారతదేశం 2025-26 వరకు 20% ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపాలని నిర్ణయించింది.

సి) కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఎయిరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి పునర్వినియోగ ప్రయోగ వాహకనౌకను పరీక్షించారు.

1) ఎ, సి   2) బి, సి  3) ఎ, బి, సి   4) ఎ, బి


13. భారతదేశంలో క్షయవ్యాధి నివారణ, నియంత్రణకు సంబంధించి సరికానిది ఏది?

1) ప్రపంచ ఆరోగ్య సంస 2030 నాటికి క్షయను నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

3) ‘నిక్షయ్‌ పోషణ’ కార్యక్రమంలో భాగంగా అందరికీ బీసీజీ టీకాలు ఇస్తున్నారు.

4) నేషనల్‌ స్ట్రాటిజిక్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2017 - 2025 క్షయ వ్యాధి నివారణకు రూపొందించారు.


14. కిందివాటిలో ఏ న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్‌ క్రిటికాలిటీ సాధించింది?

1) కాక్రపార్‌ అటామిక్‌ పవర్‌ ప్లాంట్‌ - 4

2) కూడన్‌కుళమ్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ - I

3) తారాపుర్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ - I

4) నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ - 2


15. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంసల గురించిన ఇచ్చిన వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) చెన్నైకి చెందిన అగ్నికుల్‌ కాస్‌మోస్‌ అనే సంస మొదటి 3  దీ ప్రింటింగ్‌ ఇంజిన్‌ ‘అగ్నిలెట్‌’ను తయారుచేసింది.

బి) అగ్నికుల్‌ సంసకు చెందిన సబ్‌ఆర్బిటాల్‌ టెక్నలాజికల్‌ డెమాన్‌స్ట్రేటర్‌ రాకెట్‌ - అగ్నిబాన్‌.

సి) అగ్నికుల్‌ కాస్‌మోస్‌కు సహాయం అందిస్తోంది ఇస్రో, ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌.

1) ఎ   2) బి, సి   3) ఎ, సి   4) ఎ, బి, సి


16. కింది వాక్యాల్లో సరైన వాటిని ఎన్కుకోండి.

ఎ) తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో రాకెట్‌ ప్రయోగ వేదికను నిర్మిస్తున్నారు.

బి) ఇస్రో మొదటి రాకెట్‌ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఉంది.

సి) భారతదేశం బ్రహ్మోస్‌ క్షిపణిని ఫిలిప్పీన్స్‌కు  ఎగుమతి చేస్తోంది.

డి) మిగ్‌ - 21 జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ‘ఎగిరే    శవపేటికలు’ అంటారు.

1) ఎ, బి    2) ఎ, బి, సి, డి         3) బి, సి    4) సి, డి


17. ఇస్రోకు సంబంధించిన కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) జనవరి 1, 2024న పీఎస్‌ఎల్‌వీ - సీ70 ద్వారా చంద్రయాన్‌ - 3 ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

బి) పీఎస్‌ఎల్‌వీ - సీ57 ద్వారా ఆదిత్య - ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

సి) DS - SAR అనే ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ - సీ56 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

డి) పీఎస్‌ఎల్‌వీ - సీ58 ద్వారా త్వరలో గగన్‌యాన్‌ను ప్రయోగించనున్నారు.

1) ఎ, డి    2) బి, సి   3) సి, డి    4) బి, డి


18. జీఎస్‌ఎల్‌వీ గురించి కిందివాటిలో సరైన వాటిని పరిశీలించి, ఎన్నుకోండి.

ఎ) జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్‌14 ద్వారా ‘ఇన్‌శాట్‌ - 3డీఎస్‌’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

బి) 2024, ఫిబ్రవరి 17న జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్‌14 - ఇన్‌శాట్‌-3డీ మిషన్‌ను నిర్వహించింది.

సి) జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్‌12 ద్వారా ఎన్‌వీఎస్‌ - 01  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

1) ఎ, బి       2) బి, సి     3) ఎ, బి, సి    4) ఎ మాత్రమే

 


సమాధానాలు

1-3; 2-1; 3-2; 4-2; 5-4; 6-3; 7-4; 8-3; 9-2; 10-1; 11-4; 12-3; 13-3; 14-1; 15-4; 16-2; 17-1; 18-3. 

డాక్టర్‌ బి. నరేష్‌
 

Posted Date : 21-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు