• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది?
జ: 4 రాష్ట్రాలు

 

2. రంగారెడ్డి జిల్లా ఏ తేదీన ఏర్పడింది?
జ: 15 ఆగస్టు 1978

 

3. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత?
జ: 3.52 కోట్లు

 

4. అమ్రాబాద్ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
జ: మహబూబ్‌నగర్

 

5. తెలంగాణలోని ఏ ప్రాంతంలో దక్కన్ నాపలను అధికంగా చూడొచ్చు?
జ: పశ్చిమ ప్రాంతం

 

6. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మండలాలున్న జిల్లా ఏది?
జ: మహబూబ్‌నగర్

 

7. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జన సాంద్రత ఉన్న జిల్లాల్లో మొదటిది హైదరాబాద్ అయితే రెండో జిల్లా ఏది?
జ: రంగారెడ్డి

 

8. వైశాల్యపరంగా తెలంగాణ భారతదేశంలో ఎన్నో అతి పెద్ద రాష్ట్రం?
జ: 12

 

9. ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక సరిహద్దు ఉంది?
జ: ఆంధ్రప్రదేశ్

 

10. తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?
జ: మహబూబ్‌నగర్

 

11. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తేదీ ఏది?
జ: జూన్ 2, 2014

 

12. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధిక జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్న తెలంగాణ జిల్లా ఏది?
జ: ఖమ్మం

 

13. తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లా ఏది?
జ: ఆదిలాబాద్

 

14. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి?
జ: 6

 

15. హైదరాబాద్ సముద్ర మట్టానికి సుమారు ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
జ: 600 మీ

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌