• facebook
  • whatsapp
  • telegram

అనలిటికల్ పజిల్స్  

  జనరల్ స్టడీస్ విశ్లేషణ సామర్థ్యంలో మరో ముఖ్యాంశం 'అనలిటికల్ పజిల్స్'. ఇచ్చిన సమాచారం ఆధారంగా పటం లేదా పట్టికను రూపొందించుకోవడం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు సులువుగా గుర్తించవచ్చు.

 

1. A, B, C, D అనే నలుగురు బాలికలు; E, F, G, H అనే నలుగురు బాలురు ఒక అష్టభుజాకార బల్ల చుట్టూ కింది విధంగా కూర్చున్నారు. ఏ ఇద్దరు బాలురు పక్కపక్కన కూర్చోరు. A, E కి కుడివైపు; D కి ఎదురుగా కూర్చుంది. F, B కి ఎడమవైపు కూర్చున్నాడు. G, C కి ఎడమవైపు కూర్చున్నాడు కానీ Dకి పక్కన కూర్చోలేదు.

 

1) B ఎవరి మధ్య కూర్చుంది?
ఎ) F, G బి) E, F సి) H, F డి) G, D
సమాధానం: (బి)

 

2) H కి కుడివైపు ఎవరు కూర్చున్నారు?
ఎ) D బి) C సి) B డి) A
సమాధానం: (ఎ)

 

3) A, C కి ఎదురుగా ఉన్నవారితో పరస్పరం స్థానాన్ని మార్చుకుంటే, నీ కి కుడివైపు ఎవరు ఉంటారు?
ఎ) E బి) B సి) A డి) G
సమాధానం: (సి)
వివరణ: దత్తాంశం నుంచి కిందివిధంగా చిత్రాన్ని రూపొందించవచ్చు. ఏ ఇద్దరు బాలురు పక్కపక్కన కూర్చోరు. అంటే బాలురు ఒక్కో స్థానం విడిచి కూర్చుంటే, మిగిలిన స్థానాల్లో బాలికలు కూర్చుంటారు.

 

2. S1, S2, S3, S4, S5, S6 అనే రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒక రైలు T1, S1 నుంచి S6 కు; మరో రైలు T2, S6 నుంచి S1కు బయలుదేరాయి. ఈ రైళ్లు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరేందుకు 30 నిమిషాలు పడుతుంది. అలాగే ప్రతి స్టేషన్‌లో 10 నిమిషాలు ఆగుతాయి. T1 రైలు S4 స్టేషన్‌ను ఉదయం 8.20 గంటలకు, T2 రైలు S3 స్టేషన్‌ను ఉదయం 9.00 గంటలకు చేరుకుంటాయి. అయితే T1, T2 రైళ్లు ఏ సమయంలో వరుసగా S1, S6 నుంచి బయలుదేరుతాయి?

ఎ) ఉదయం 6.30 గంటలు, ఉదయం 7 గంటలు
బి) ఉదయం 6 గంటలు, ఉదయం 6.30 గంటలు
సి) ఉదయం 6.30 గంటలు, ఉదయం 7.10 గంటలు
డి) ఉదయం 6.10 గంటలు, ఉదయం 6.30 గంటలు
సమాధానం: (సి)
వివరణ: పై దత్తాంశం ఆధారంగా కింది పట్టికను రూపొందించవచ్చు.

పట్టిక నుంచి T1 ఉదయం 6.30 గంటలకు, T2 రైలు ఉదయం 7.10 గంటలకు ఆయా స్టేషన్ల నుంచి బయలుదేరుతాయి.

 

3. A, B, C, D, E, F, G, H అనే వ్యక్తులు ఎరుపు, నీలం, నలుపు, తెలుపు, గులాబీ, ఆరెంజ్, పసుపు, ఇండిగో రంగులను కిందివిధంగా ఇష్టపడతారు.
i) A ఎరుపు లేదా ఇండిగో ఇష్టపడడు.
ii) B, C ల్లో ఒకరు పసుపు రంగును ఇష్టపడతారు.
iii) E గులాబీ లేదా ఇండిగోల్లో ఏదో ఒకటి ఇష్టపడతాడు.
iv) G, H ల్లో ఒకరు తెలుపు రంగును ఇష్టపడతారు.
v) B నలుపు రంగును ఇష్టపడతాడు, D నీలం రంగును ఇష్టపడడు.
vi) F, G గులాబీ లేదా నీలం రంగులను ఏ క్రమంలోనైనా ఇష్టపడతారు.

 

1) ఎరుపు రంగును ఇష్టపడేవారు ఎవరు?
ఎ) B బి) C సి) G డి) D
సమాధానం: (డి)

 

2) కిందివాటిలో ఏది సత్యం?
ఎ) B నీలం రంగును ఇష్టపడతాడు
బి) F గులాబీ రంగును ఇష్టపడతాడు
సి) A ఆరెంజ్ రంగును ఇష్టపడతాడు
డి) G గులాబీ రంగును ఇష్టపడతాడు
సమాధానం: (సి)

 

3) A, E లు ఇష్టపడే రంగులు ఏవి?
ఎ) ఎరుపు, ఇండిగో బి) ఎరుపు, గులాబీ సి) నలుపు, ఇండిగో డి) ఆరెంజ్, ఇండిగో
సమాధానం: (డి)
వివరణ: (vi) నుంచి F, G లు గులాబీ లేదా నీలం రంగులను ఏ క్రమంలోనైనా ఇష్టపడతారు.
(iii) నుంచి E గులాబీ లేదా ఇండిగో రంగుల్లో ఏదో ఒకటి ఇష్టపడతారు. కాబట్టి E ఇండిగోను ఇష్టపడతాడు.
(v) నుంచి B నలుపు రంగును ఇష్టపడతాడు. కానీ (ii) నుంచి B, C ల్లో ఒకరు పసుపు రంగును ఇష్టపడతాడు.కాబట్టి C పసుపు రంగును ఇష్టపడతాడు.
(iv) నుంచి G, H ల్లో ఒకరు తెలుపు రంగును ఇష్టపడతారు. కాబట్టి H తెలుపు రంగును ఇష్టపడతాడు.
A, D వ్యక్తులు మిగిలిన రంగులైన ఎరుపు, ఆరెంజ్‌లలో ఏదో ఒకటి ఇష్టపడతారు.
(i) నుంచి A ఎరుపు ఇష్టపడడు. కాబట్టి A ఆరెంజ్ రంగునే ఇష్టపడతాడు. D ఎరుపును ఇష్టపడతాడు.
పై వివరణ నుంచి వ్యక్తులు, రంగుల క్రమాన్ని పక్క విధంగా రాయవచ్చు.

 

4. ఒక వ్యాపారి వద్ద P, Q, R, S, T అనే అయిదు ఇనుప దిమ్మెలు ఉన్నాయి.

i) P అనే ఇనుప దిమ్మె Q కు రెట్టింపు బరువు ఉంది.
ii) Q అనే ఇనుప దిమ్మె R కు 4 1/2 రెట్లు బరువు ఉంది.
iii) R, T లో సగం బరువు ఉంది.
iv) T, P కంటే తక్కువ బరువు; R కంటే ఎక్కువ బరువు ఉంది.
v) S, R కంటే ఎక్కువ బరువు ఉంది.

 

1) కిందివాటిలో ఎక్కువ బరువు ఉండే దిమ్మె ఏది?
ఎ) P బి) Q సి) R డి) S
సమాధానం: (సి)

 

2) కిందివాటిలో ఎక్కువ బరువు ఉండే దిమ్మె ఏది?
ఎ) P బి) Q సి) R డి) S
సమాధానం: (ఎ)

 

3) బరువుల ఆధారంగా దిమ్మెల ఆరోహణ క్రమం ఏది?
ఎ) P, Q, T, S, R బి) Q, S, T, P, R సి) R, P, S, Q, T డి) P, Q, S, T, R
సమాధానం: (ఎ)

 

4) కింది ఏ జత దిమ్మెల కంటే T ఎక్కువ బరువు ఉంటుంది?
ఎ) S, Q బి) S, R సి) P, R డి) P, Q
సమాధానం: (బి)
వివరణ: దత్తాంశాన్ని విశ్లేషిస్తే

(4), (5), (6) నుంచి P > Q > T > S > R.

 

5. ఒక బల్లపై 5 పుస్తకాలను కింది విధంగా అమర్చారు.
i) ఆంగ్లం, భౌతికశాస్త్రం పుస్తకాల మధ్యలో గణితశాస్త్రం పుస్తకం ఉంది.
ii) రసాయనశాస్త్ర పుస్తకం మీద భౌతికశాస్త్ర పుస్తకం ఉంది.
iii) బయాలజీ, గణితశాస్త్రం పుస్తకాల మధ్య రెండు పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చరిత్ర.

 

1) వరుసలో కింద ఉన్న పుస్తకం ఏది?
ఎ) చరిత్ర బి) గణితశాస్త్రం సి) రసాయనశాస్త్రం డి) భౌతికశాస్త్రం
సమాధానం: (సి)

 

2) వరుసలో కింది నుంచి మూడో పుస్తకమేది?
ఎ) చరిత్ర బి) గణితశాస్త్రం సి) రసాయనశాస్త్రం డి) భౌతికశాస్త్రం
సమాధానం: (బి)

Posted Date : 20-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌