మాదిరి ప్రశ్నలు
1. అమరావతి శిల్పకళకు ఆధారం?
జ: మహాయాన బౌద్ధం
2. తెలంగాణలోని బౌద్ధ స్తూపాలను కిందివాటిలో దేన్ని అనుసరించి నిర్మించారు?
1) సాంచి 2) అమరావతి 3) సారనాథ్ 4) కార్లే
జ: 1(సాంచి)
3. 'ఫణిగిరి' ప్రఖ్యాత బౌద్ధ స్తూపం ఏ జిల్లాలో ఉంది?
జ: నల్గొండ
4. తెలంగాణలో ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఇక్ష్వాకులు మొదట ఏ ఆలయాన్ని నిర్మించారు?
జ: పుష్పభద్ర స్వామి
5. కిందివాటిలో 'వేసర శైలి'లో నిర్మించిన ఆలయాలు?
ఎ) వేములవాడ బి) ధర్మపురి
సి) ఆలంపూర్ డి) కొలనుపాక జైన మందిర్
జ: అన్నీ
6. ఇసుక పునాదులపై దేవాలయాలు నిర్మించడం ఎవరి కాలం నాటి వాస్తుశిల్ప ప్రత్యేకత?
జ: కాకతీయులు
7. కాకతీయుల శిల్పకళా వైభవానికి కీర్తి పతాకంగా భావించే వేయిస్తంభాల గుడిని ఎవరు నిర్మించారు?
జ: రుద్రదేవుడు
8. కిందివాటిలో కాకతీయుల కాలం నాటి ఏ ఆలయాన్ని నక్షత్రాకారంలో నిర్మించారు?
1) వేయిస్తంభాల గుడి 2) రామప్ప 3) స్వయంభూ దేవాలయం 4) సిద్ధేశ్వరాలయం
జ: 2(రామప్ప)
9. వివిధ భంగిమల్లో మలచిన మదనిక, నాగినుల శిల్పాలు ఏ దేవాలయంలో ఉన్నాయి?
జ: రామప్ప
10. హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షించారు?
జ: హుస్సేన్ షా-వలీ
11. కుతుబ్‌షాహీ సుల్తాన్లు నిర్మించిన 'పురానాపూల్' వంతెనలో ఎన్ని ఆర్చ్‌లు ఉన్నాయి?
జ: 22
12. భూఉపరితలం నుంచి గోల్కొండ ఖిల్లాలోని భవన నిర్మాణాల గరిష్ఠ ఎత్తు ఎంత?
జ: 400 మీ.
13. 'మక్కామసీదు' నిర్మాణాన్ని ఎన్ని సంవత్సరాల్లో పూర్తిచేశారు?
జ: 77 సంవత్సరాలు
14. 'హయత్ నగర్'ను ఎవరు నిర్మించారు?
జ: హయత్ భక్షీ బేగం
15. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణ ప్రణాళికను రూపొందించిన శిల్పి ఏ దేశస్థుడు?
జ: బెల్జియం