• facebook
  • whatsapp
  • telegram

వాహక నౌకలు, నావిగేషన్, సాంకేతికతలు

(అంతరిక్ష సాంకేతికత)

 

విమానాల ట్రాఫిక్‌ను నియంత్రించే గగన్‌!

 

 

విశ్వవీధిలో తిరిగే శాటిలైట్, ఇంట్లో టీవీ, చేతిలో సెల్‌ఫోన్, రిమోట్‌ సెన్సింగ్‌ తదితర సుదూర సమాచార వ్యవస్థలన్నీ అంతరిక్ష సాంకేతికతతోనే పనిచేస్తాయి. పౌర, వైమానిక, సైనిక అవసరాలను తీర్చడంలో ఇవి అత్యంత అవసరమైనవి. స్పేస్‌ టెక్నాలజీలో ముందంజలో ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ఈ రంగంలో మన శక్తిసామర్థ్యాలు, వనరులు, ఇతర వ్యవస్థల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఇస్రో ప్రస్థానం, ఇటీవల ప్రయోగించిన ముఖ్యమైన ఉపగ్రహాలు, వాటిని తీసుకెళ్లిన వాహక నౌకలు, లక్ష్యాలు, అందుతున్న ప్రయోజనాలపై తగిన అవగాహనతో ఉండాలి.

 

1. ఇస్రో అభివృద్ధి చేసిన వాహక నౌకల సాంకేతికత గురించి కింది వాటి నుంచి సరైన వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) ఇస్రో ఇప్పటివరకు 5 రకాల వాహక నౌకలను అభివృద్ధి చేసింది

బి) భారతదేశ మొదటి వాహకనౌక - SLV    (శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌)

సి) ఇస్రో అత్యధికంగా ఉపయోగించిన వాహకనౌక - PSLV

డి) భారతదేశం వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన వాహక నౌక - GSLV

ఇ) ఇస్రో ఇటీవల అభివృద్ధి చేసిన వాహక నౌక - SSLV

1) ఎ, బి, సి     2) బి, సి, డి, ఇ 

3) ఎ, బి, సి, డి, ఇ    4) బి, సి


2. కిందివాటిలో GSLV గురించి సరికాని వాక్యాలను గుర్తించండి.

A) దీనిలో 3 దశలుంటాయి.

B) మొదటి దశ ఘన ఇంధనం, రెండో దశ ద్రవ ఇంధనం, మూడో దశ క్రయోజనిక్‌ దశ.

C) ఇది INSAT, GSAT ఉపగ్రహాలను కక్ష్యలో  ప్రవేశపెడుతుంది.

D) ఈ వాహకనౌక 10 టన్నుల ఉపగ్రహాలను మోసుకుపోతుంది.

E) ఇది సమాచార ఉపగ్రహాలను భూదిగువ కక్ష్యలో ప్రవేశపెడుతుంది.

1) A, B, D         2) D, E 

3) B, C, D , E         4) A, C 


3.  GSLV ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కింది ఉపగ్రహాలను సరైన క్రమంలో అమర్చండి. 

ఎ) GSLV-D2    1) CARE మిషన్‌ 

బి) GSLV-F9     2) GSAT-19

సి) GSLV-12     3) SARC ఉపగ్రహం 

డి) GSLV-MK-III-01     4) GSAT-2

ఇ) GSLV-MK-III-X    5) NVS-01

1) ఎ-2, బి-3, సి-4, డి-2, ఇ-1     2) ఎ-4, బి-3, సి-2,  డి-1, ఇ-5 

3) ఎ-4, బి-3, సి-5, డి-2, ఇ-1        4) ఎ-5,  బి-4, సి-2,  డి-3, ఇ-1 


4. GSLV ద్వారా సాధించిన విజయాల గురించి కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి. 

ఎ) మొదటిసారిగా విజయవంతంగా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన GSLV వాహకనౌక - GSLV-D2

బి) GSLV-F9 ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహం సౌత్‌ ఏషియన్‌ శాటిలైట్‌

సి) GSLV-MK-III-MI ద్వారా చంద్రయాన్‌-2 ను ప్రయోగించారు. 

డి) GSLV-MK-III-X ద్వారా క్రూ మాడ్యూల్‌   అట్మాస్ఫియరిక్‌ రిఎంట్రీ¨ ఎక్స్‌పరిమెంట్‌ను    నిర్వహించారు.

1) ఎ, బి 2) బి, సి 3) సి, డి     4) ఎ, బి, సి, డి


5. కిందివాటిలో ఎన్ని వాక్యాలు సరైనవో గుర్తించండి.

ఎ) భూమి నుంచి 35,786 కి.మీ.ఎత్తులో ఉన్న కక్ష్యను జియోసింక్రోనస్‌ లేదా జియోస్టేషనరీ కక్ష్య అంటారు.

బి) 5,854 కిలోల బరువున్న GSAT-II ఉపగ్రహాన్ని ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టారు.

సి) GSLV-F10 ద్వారా 2021, ఆగస్టు 21న ప్రయోగించిన EOS-03 విజయవంతమైంది.

డి) సౌత్‌ ఏషియన్‌ శాటిలైట్‌ అనేది సమాచార, వాతావరణ పరిశీలన ఉపగ్రహం.

ఇ) భారతదేశం ఇప్పటివరకు కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అత్యంత బరువైన ఉపగ్రహం GSAT-19.

1) ఎ, బి, సి, డి    2) బి, సి, డి, ఇ

3) ఎ, బి, డి, ఇ     4) సి, డి, ఇ


6. కిందివాటిలో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) GSLV-MK-III మిషన్‌ను LVM-3-M2 వన్‌ వెబ్‌ ఇండియా-I మిషన్‌ అంటారు.

బి) LVM-3 ద్వారా మొదటి వాణిజ్య మిషన్‌ వన్‌వెబ్‌ సంస్థ వారి 36 ఉపగ్రహాలను కక్ష్యలో  ప్రవేశపెట్టింది.

సి) వన్‌వెబ్‌ ఇండియా-I మిషన్‌ అనేది న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ద్వారా జరిగింది.

డి) LVM-3 ద్వారా ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాల బరువు 7,479 కిలోలు.

ఇ) ఇండియా LVM-3 ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు జియోస్టేషనరీ ఉపగ్రహాలు.

1) ఎ, బి  2) డి, ఇ  3) బి, సి  4) ఎ, సి


7. ఇచ్చిన వాటిలో సరైన జతలను గుర్తించండి.

ఎ) SSLV-D1 - 7 ఆగస్టు, 2022లో ప్రయోగం

బి) SSLV-D2 - 10 ఫిబ్రవరి, 2023లో ప్రయోగం  

సి) SSLV - 1,000 కిలోల బరువు మోసుకెళుతుంది

డి) భారత్‌లో మొదటి ప్రైవేటు రాకెట్‌  - ధ్రువ

ఇ) స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌ - విక్రమ్‌ S రాకెట్‌ తయారీ.

1) ఎ, బి, ఇ      2) ఎ, బి, సి 

3) సి, డి, ఇ     4) ఎ, సి, డి


8. సమాచార ఉపగ్రహాల గురించి కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) వీటిని జియోస్టేషనరీ కక్ష్యలో ప్రవేశపెడతారు.

బి) భారతదేశ మొదటి ఇన్‌శాట్‌ ఉపగ్రహం INSAT-1A.

సి) GSAT, EDUSAT అనేవి సమాచార ఉపగ్రహాలు.

డి) సమాచార ఉపగ్రహాల్లో ట్రాన్స్‌పాండర్‌లు అనే పరికరాలుంటాయి.

ఇ) సమాచార ఉపగ్రహాలను  GSLV ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడతారు.

1) ఎ, బి, సి, డి, ఇ      2) ఎ, బి, సి 

3) బి, సి, డి, ఇ     4) ఎ, బి, డి


9. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

ఎ) సమాచార ఉపగ్రహాలు 1) NISUA, ANUSAT
బి) భూపరిశీలనా ఉపగ్రహాలు 2) ఆస్ట్రోశాట్, చంద్రయాన్‌-2
సి) ప్రయోగాల కోసం పంపిన ఉపగ్రహాలు 3) IRNSS, GSAT-10
డి) నావిగేషన్‌ ఉపగ్రహాలు 4) ఆర్యభట్ట, రోహిణి
ఇ) డీప్‌స్పేస్, అంతరిక్ష శోధన ఉపగ్రహాలు 5) ఓషన్‌శాట్, రిశాట్‌
ఎఫ్‌) యూనివర్సిటీల ఉపగ్రహాలు 6) INSAT, HAMSAT

 1) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2, ఎఫ్‌-1  2) ఎ-6, బి-5, సి-3, డి-2, ఇ-4, ఎఫ్‌-1

3) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5, ఎఫ్‌-6   4) ఎ-1, బి-2, సి-3, డి-5, ఇ-4, ఎఫ్‌-6


10. భారతదేశంలో వినియోగిస్తున్న గగన్‌ (GAGAN) వ్యవస్థ గురించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఇది GPS ఆధారిత నావిగేషన్‌ వ్యవస్థ. 

బి) GSAT-8, GSAT-10 ఉపగ్రహాలు దీని కోసం పనిచేస్తున్నాయి.

సి) ఇస్రో, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వారు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు.

డి) ఇది విమానాల ఎయిర్‌ ట్రాఫిక్‌ నియంత్రణకు ఉపయోగపడుతుంది.

1) ఎ, బి,  2) బి, సి  3) ఎ, డి  4) ఎ, బి, సి, డి


11. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నావిగేషన్‌ వ్యవస్థలకు సంబంధించి కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

ఎ) గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ 1) రష్యా
బి) గ్లోనాస్‌ 2) ఇండియా
సి) గెలీలియో 3) అమెరికా 
డి) జినిత్‌  4) చైనా
ఇ) బిడోయు 5) జపాన్‌
ఎఫ్‌) నావిక్‌  6) యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ

1) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5, ఎఫ్‌-6    2) ఎ-3, బి-1, సి-6, డి-5, ఇ-4, ఎఫ్‌-2

3) ఎ-5, బి-2, సి-4, డి-3, ఇ-6, ఎఫ్‌-1    4) ఎ-1, బి-3, సి-5, డి-2, ఇ-4, ఎఫ్‌-6 


12. కింది వాక్యాలను పరిశీలించి, సరైన దాన్ని ఎన్నుకోండి.

ఎ) భారతదేశంలో ప్రైవేటు రంగంలో మొదట రాకెట్‌ను తయారుచేసింది స్కైరూట్‌ ఎయిరో స్పేస్‌.

బి) విక్రమ్‌ - S రాకెట్‌ ఒకే దశలో ఘన ఇంధనంతో 80 కిలోల ఉపగ్రహాలను 100 కి.మీ. ఎత్తుకు చేరుస్తుంది.

1) ‘ఎ’ సరైంది, ‘బి’ సరైంది కాదు. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధం లేని వాక్యాలు.

2) ‘ఎ, బి’ లు సరైనవి. ఇవి రెండూ ఒకదాంతో మరొకటి సంబంధం చూపుతాయి.

3) ‘ఎ’ సరైంది కాదు, ‘బి’ సరైంది. ఇవి రెండూ సంబంధం లేని వాక్యాలు.

4) ఎ, బి లు రెండూ సరైనవి కావు. రెండూ ఒకదాంతో మరొకటి సంబంధం లేని వాక్యాలు.


13. ఇండియన్‌ రీజినల్‌ నావిగేషనల్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ గురించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.

ఎ) ఈ వ్యవస్థలో భాగంగా PSLV-C22 ద్వారా ప్రయోగించిన మొదటి ఉపగ్రహం - IRNSS-1A

బి) ఈ వ్యవస్థకు పెట్టిన పేరు నావిక్‌ (నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కన్‌స్టెల్లేషన్‌)

సి) ఈ వ్యవస్థ భారతదేశమంతటా, సరిహద్దుల నుంచి 1500 కి.మీ. వరకు పనిచేస్తుంది.

డి) ఈ వ్యవస్థ భూతల, వాయుమార్గాల నావిగేషన్, వాహనాల ప్రయాణ మార్గం గుర్తింపు, విపత్తు నిర్వహణ లాంటి వాటికి పనిచేస్తుంది.

1) ఎ, బి, సి    2) ఎ, బి, సి, డి

3)  బి, సి, డి          4) ఎ, సి, డి


14. క్రయోజెనిక్‌ టెక్నాలజీ గురించి కిందివాటిలో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను GSLV మూడో దశలో ఉపయోగిస్తారు.

బి) క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో పెట్రోల్‌ ఇంధనంగా వాడతారు.

సి) భారతదేశం మొదటి క్రయోజెనిక్‌ ఇంజిన్‌లను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది.

డి) భారతదేశం తన మొదటి స్వదేశీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌లను విజయవంతంగా పరిక్షించిన రాకెట్‌ - GSLV - D5

ఇ) క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో ద్రవహైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు.

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, డి, ఇ  4) డి, ఇ


15. కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను మొదటగా GSLV-D1లో వాడింది.

బి) భారతదేశం తన స్వదేశీ క్రయోజెనిక్‌ పరీక్షను 1998లో చేసింది.

సి) అధికశక్తి ఉన్న క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను GSLVMK-III లో ఉపయోగించారు.

డి) ఇప్పటివరకు క్రయోజెనిక్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసిన దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా,  ఇండియా.

ఇ) సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో శుద్ధి చేసిన కిరోసిన్‌ను ఇంధనంగా వాడతారు.

1) ఎ, బి, సి, డి, ఇ      2) బి, సి      3) డి, ఇ     4) ఎ, బి 



సమాధానాలు


1) 3 2) 2 3) 3 4) 4 5) 3 6) 2 7) 1 8) 1 9) 1  10) 4 11) 2 12) 2 13) 2 14) 2 15) 1. 


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 
 

Posted Date : 20-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌