• facebook
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

1. కెంపు (Ruby) అనే రత్నం ఏ లోహ సమ్మేళనం?


1 ) బంగారం    2 ) వెండి   3 ) అల్యూమినియం    4 ) మెగ్నీషియం


2. కింది ఏ జల ద్రావణం విద్యుదాత్మకతను ప్రదర్శిస్తుంది?


1 ) నిమ్మరసం    2 ) చక్కెర ద్రావణం  3 ) కాస్టిక్‌ సోడా ద్రావణం   4 ) సాధారణ ఉప్పు ద్రావణం 


3. తలలో చుండ్రును నియంత్రించడానికి కింది దేన్ని ఉపయోగిస్తారు?


1 ) సల్ఫర్‌     2 ) కాల్షియం     3 ) మెగ్నీషియం    4 )పైవన్నీ


4. వాషింగ్‌ సోడా రసాయన నామం ఏమిటి?


1 ) సోడియం క్లోరైడ్‌   2 ) సోడియం కార్బొనేట్‌    3 ) సోడియం బైకార్బొనేట్‌  4 ) సోడియం హైడ్రాక్సైడ్‌


5. కిందివాటిలో వాషింగ్‌ సోడాకు సంబంధించి సరైంది ఏది?


ఎ) ఇది ఒక పారదర్శక స్పటిక ఘన పదార్థం.


బి) ఇది నీటిలో కరుగుతుంది.


సి) ఇది ఆమ్లస్వభావాన్ని కలిగి ఉంటుంది.( pH విలువ = 11 )


1 ) ఎ, బి      2 ) బి, సి     3 ) ఎ, సి      4 ) పైవన్నీ


6. కింది అంశాలను జతపరచండి.

రసాయన పదార్థం  రసాయన ఫార్ములా
a) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం  i) H2SO4
b)  సల్ఫ్యూరిక్‌ ఆమ్లం  ii) HNO
c) నైట్రిక్‌ ఆమ్లం  iii) CH3COOH 
d)  ఎసిటిక్‌ ఆమ్లం  iv) HCl

1) a-i, b-iv, c-ii, D-iii 

2) a-iv, b-i, c-iii, d-ii 

3) a-iv, b-ii, c-i, d-iii 

4) a-iv, b-i, c-ii, d-iii

7. కిందివాటిలో పెరుగులో ఉండే ఆమ్లం ఏది?

1 ) సిట్రిక్‌ ఆమ్లం (Citric acid) 

2 ) లాక్టిక్‌ ఆమ్లం (Lactic acid) 

3) ఆక్సాలిక్‌ ఆమ్లం (Oxalic acid) 

4) ఫార్మిక్‌ ఆమ్లం (Formic acid) 


8. కింది అంశాలను జతపరచండి.

   

జాబితా   I        జాబితా   II
 పొడిమంచు    i 
 ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌    ii CaSO4.2 H2O  
 జిప్సం       iii CO

1) a-iii, b-ii, c-i   2) a-ii, b-i, c-iii  3) a-iii, b-i, c-ii    4) a-i, b-iii, c-ii 


9. కిందివాటిలో ఏ లోహం కిరోసిన్‌పై తేలుతుంది?


1 ) సోడియం    2) పొటాషియం 3) లిథియం    4 ) పైవన్నీ


10. కింది ఏ పదార్థాలను గుర్తించటానికి అయోడిన్‌ పరీక్షను ఉపయోగిస్తారు?


1) ప్రోటీన్‌లు    2 ) కొవ్వులు   3 ) పిండిపదార్థాలు    4) ఏదీకాదు


11. ప్రోటీన్‌ ఉనికిని గుర్తించటానికి ఉపయోగించే పరీక్ష ఏది?


1 ) అయోడిన్‌ పరీక్ష     2) బైయురెట్‌ పరీక్ష    3 ) టోలెన్స్‌ పరీక్ష     4 ) పైవన్నీ


12. హబుల్స్‌ పరీక్ష (Hubble’s test)ని ఏ పదార్థాలను గుర్తించటానికి ఉపయోగిస్తారు?


1 ) కొవ్వులు    2) ప్రోటీన్‌లు   3 ) ఆల్కహాల్‌    4 ) ఫినాల్‌


13. కాల్షియం హైడ్రాక్సైడ్‌ రసాయన ఫార్ములా?


1 )  CaCO        2) Ca(OH)   3) CaSO4    4. Ca(NO3)


14. కిందివాటిలో బయోగ్యాస్‌ సంఘటనం ఏది?


1 ) మీథేన్‌: 50-75%,  కార్బన్‌ డైఆక్సైడ్‌: 25-50%,  నైట్రోజన్‌: 10-20%    


2 ) ప్రొపేన్‌: 20-50%,  కార్బన్‌ డైఆక్సైడ్‌: 25-50%,  హైడ్రోజన్‌: 50-60%


3 ) మీథేన్‌: 10-20%,  కార్బన్‌ డైఆక్సైడ్‌: 50-60%,  నైట్రోజన్‌: 30-50%     


4 ) ప్రొపేన్‌: 40-50%,  కార్బన్‌ డైఆక్సైడ్‌: 30-40%, నైట్రోజన్‌: 25-30%


15. కిందివాటిలో మీథేన్‌ వాయువుకు సంబంధించి సరైంది ఏది?


ఎ) మీథేన్‌ వాయువును మార్ష్‌ వాయువు అంటారు.


బి) మీథేన్‌ ఉద్గారాలకు ప్రధాన మూలం - వరి పొలాలు


సి) మీథేన్‌ వాయువు రసాయన ఫార్ములా  CH


1 ) ఎ, బి      2 ) బి, సి     3 ) ఎ, సి      4 ) పైవన్నీ


16. కింది ఏ అలోహానికి యాంటీసెప్టిక్‌ స్వభావం ఉంది?


1 ) ఫ్లోరిన్‌       2 ) బ్రోమిన్‌    


3 ) అయోడిన్‌    4 ) ఏదీకాదు


17. జ్వర నిరోధకాలను ఏమంటారు?


1 ) యాంటీ బయాటిక్స్‌ 


2 ) యాంటీసెప్టిక్స్‌


3 ) యాంటీ పైరెటిక్స్‌


4 ) యాంటీ వైరల్స్‌


18. కిందివాటిలో థర్మోసెట్టింగ్‌ ప్లాస్టిక్‌కు ఉదాహరణ?


1 ) పి.వి.సి.   2 ) పాలిథీన్‌      3 ) బేకలైట్‌    4 ) పాలిస్టర్‌ 


19. అగ్నిమాపక యంత్రాల్లో సాధారణంగా ఉపయోగించే వాయువు ఏది?


1 ) నైట్రోజన్‌    2 ) ఆక్సిజన్‌    3 ) హైడ్రోజన్‌    4 ) కార్బన్‌ డైఆక్సైడ్‌


20. టమాటాలు ఎరుపు రంగులో ఉండటానికి కారణమయ్యే పదార్థం ఏది?


1 ) కెరోటిన్‌    2 ) లైకోపిన్‌    3 ) ఆంథోసయనిన్‌    4 ) క్లోరోఫిల్‌


21. కిందివాటిలో ఏ వాయువు కుళ్లిన కోడిగుడ్ల వాసనను కలిగి ఉంటుంది?


1 ) కార్బన్‌ మోనాక్సైడ్‌     2 ) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌    3 ) మీథేన్‌    4 ) కార్బన్‌ డైఆక్సైడ్‌


22. గాయాన్ని శుభ్రం చేయటానికి కింది ఏ పదార్థాన్ని వాడతారు? (ఇది క్రిమిసంహారిణిగా పని చేస్తుంది.)


1 ) క్లోరిన్‌ జలం     2 ) ఎసిటోన్‌    3 ) హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌    4 ) సోడియం క్లోరైడ్‌


23. దంతక్షయాన్ని నివారించటానికి నీటిలో కింది దేన్ని కలుపుతారు?


1 ) క్లోరిన్‌    2 ) అయోడిన్‌     3 ) ఫ్లోరిన్‌    4 ) బ్రోమిన్‌


24. కిందివాటిలో ఇంధనానికి ఉదాహరణ ఏది?


1 ) సీఎన్‌జీ      2 ) గ్యాసోలిన్‌     3 ) 1, 2      4 ) ప్రొపేన్‌


25. ఎరువుల తయారీలో ఉపయోగించే వాయువు ఏది?


1 ) నైట్రోజన్‌    2 ) అమ్మోనియా    3 ) ఆక్సిజన్‌    4 ) కార్బన్‌ మోనాక్సైడ్‌


26. ఫ్లోరోసెంట్‌ బల్బుల్లో కింది దేన్ని లేపనంగా ఉపయోగిస్తారు?


1 ) ఆర్గాన్‌    2 )నియాన్‌     3 ) క్రిప్టాన్‌    4 ) పాదరసం


27. పుదీనాలో శీతలీకరణ అనుభూతికి  (Cooling Sensation) కారణమయ్యే సమ్మేళనం ఏది?


1 ) కర్పూరం       2 ) మెంథాల్‌


3 ) యూకలిప్టాల్‌      4 ) సాలిసిలిక్‌ యాసిడ్‌ 


28. హానికరమైన  UV కిరణాల నుంచి రక్షించడానికి సన్‌స్క్రీన్‌లో ఉపయోగించే రసాయనం?


1 ) సిలికా (SiO2


2 ) టైటానియం డయాక్సైడ్‌ (TiO2)


3 ) సోడియం ఆక్సైడ్‌ (Na2O)    


4 ) మెగ్నీషియం ఆక్సైడ్‌ (MgO)


29. దుస్తులపై మరకలను తొలగించేందుకు డ్రైక్లీనింగ్‌లో ఉపయోగించే రసాయం ఏది?


1 ) పర్‌క్లోరో ఇథిలిన్‌      2 ) టోలిన్‌     3 ) ఎసిటిలిన్‌      4 ) ఏదీకాదు


30. కింది అంశాలను జతపరచండి.


జాబితా I   జాబితా  II


 ఆల్కహాల్‌    i  ఎసిటిక్‌ ఆమ్లం


 వెనిగర్‌    ii  ఆస్కార్బిక్‌ ఆమ్లం


 విటమిన్‌ - C    iii ఇథనాల్‌


1) a-ii, b-i, c-ii    2) a-iii, b-i, c-ii    3) a-i, b-iii, c-ii   4) a-iii, b-ii, c-i 


31. కింది అంశాలను జతపరచండి.


   జాబితా  I       జాబితా  II


a) టేబుల్‌ సాల్ట్‌     i) NaClO 


b) నీరు    ii) NaCl 


c) బ్లీచ్‌    iii) H2


1) a-ii, b-i, c-iii 2) a-i, b-iii, c-ii 3) a-ii, b-iii, c-i 4) a-iii, b-ii, c-i 

32. సున్నపురాయిలో ప్రధాన అనుఘటకం ఏది?


1 ) కాల్షియం కార్బొనేట్‌


2 ) మెగ్నీషియం కార్బొనేట్‌


3 ) మెగ్నీషియం సల్ఫేట్‌    


4 ) కాల్షియం సల్ఫేట్‌


33. వెల్లుల్లి విలక్షణ వాసనకు కారణమయ్యే రసాయన సమ్మేళనం?


1 ) సల్ఫర్‌ డైఆక్సైడ్‌      2 ) అల్లిసిన్‌     3 ) ఎసిటిక్‌ ఆమ్లం      4 ) ఇథనాల్‌


34. కిందివాటిలో రసాయన మార్పునకు ఉదాహరణ ఏది?


1 ) మంచు కరగడం    


2 ) నీటిలో ఉప్పు కరగడం


3 ) ఇనుము తుప్పు పట్టడం 


4 ) కాగితం ముక్కను చింపడం


35. సహజ రబ్బరులో ప్రధాన అనుఘటకం ఏది?


1 ) సెల్యులోజ్‌    2 ) స్టార్చ్‌  3 ) లేటెక్స్‌     4 ) పాలీఎస్టర్‌


సమాధానాలు :1-3  2-2  3-1  4-2  5-4  6-4  7-2  8-3  9-3  10-3  11-2  12-1  13-2  14-1  15-4  16-3  17-3  18-3  19-4  20-2  21-2  22-3  23-3  24-3  25-2  26-4  27-2  28-2  29-1  30-2  31-3  32-1  33-2  34-3  35-3  

మరికొన్ని...


1. శీతలీకరణ వ్యవస్థలలో శీతలీకరణిగా ఉపయోగపడే పదార్థం ఏది?


1 ) ఎసిటోన్‌     2 ) ఇథనాల్‌   3 ) ఆక్సిజన్‌     4 ) అమ్మోనియా


2. అరటిపండ్ల విలక్షణ సువాసనకు కారణమైన రసాయన సమ్మేళనం ఏది?

 1 )ఎసిటిక్‌ ఆమ్లం    2 ) అల్లిసిన్‌    3 ) సిట్రిక్‌ ఆమ్లం    4 ) ఇథైల్‌ ఎసిటేట్‌


3. బాణాసంచా కాల్చినప్పుడు పసుపురంగు మంట ఏర్పడటానికి కారణమయ్యే మూలకం ఏది?


1 ) పొటాషియం     2 ) సోడియం  3 ) రాగి    4 ) బేరియం


4. కెంపు ఎరుపు రంగులో ఉండటానికి కారణమయ్యే లోహ అయాన్‌ ఏది?


1 ) క్రోమియం    2 ) కోబాల్ట్‌   3 ) ఇనుము    4 ) నికెల్‌


5. ద్రవస్థితిలో లభించే బ్రోమిన్‌ ఏ రంగులో ఉంటుంది?


1 ) పసుపు    2 ) ఎరుపు    3 ) ఆరెంజ్‌    4 ) నీలం


6. పసుపులోని ఏ సమ్మేళనం దాని రంగుకు కారణం?


1 ) కర్కుమిన్‌       2 ) కెఫిన్‌    3 ) థియోబ్రోమిన్‌    4 ) క్యాప్సైనిన్‌


7. క్యారెట్‌ నారింజ రంగులో ఉండటానికి కింది ఏ పదార్థం కారణం?


1 ) లైకోపీన్‌    2 ) బీటా కెరోటిన్‌    3 ) ఆంథోసైనిన్‌    4 ) టానిన్‌ 


8. ముడి ఇనుమును ఉక్కుగా మార్చడానికి ఉపయోగించే పారిశ్రామిక ప్రక్రియను ఏమంటారు?  


1 ) హేబర్‌ పద్ధతి    2 ) బెస్సిమర్‌ ప్రక్రియ    3 ) విద్యుద్విశ్లేషణ    4 ) పాలిమరీకరణం


9. పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే పదార్థం ఏది?


1 ) గ్లిజరిన్‌       2 ) అమ్మోనియం నైట్రేట్‌  3 ) సోడియం హైడ్రాక్సైడ్‌   4 ) పొటాషియం హైడ్రాక్సైడ్‌


10. కింది ఏ ప్రక్రియ ద్వారా ఇనుమును దాని ధాతువు నుంచి సంగ్రహిస్తారు?


1) బెస్సిమర్‌ ప్రక్రియ      2 ) విద్యుద్విశ్లేషణ   3 ) ప్రగలనం      4 ) ఏదీకాదు


11. సబ్బు తయారీలో ఉపయోగించే క్షారం ఏది?


1 ) సోడియం క్లోరైడ్‌    2 ) సోడియం హైడ్రాక్సైడ్‌  3 ) సోడియం కార్బొనేట్‌    4 ) పైవన్నీ


12. కింది ఏ రకమైన కొవ్వు ఆమ్లం గుండెకు ఆరోగ్యకరం?


1 ) సంతృప్త కొవ్వు ఆమ్లాలు        2 ) ట్రాన్స్‌ ఫాటీ ఆమ్లాలు  3 ) మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు     4 ) పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 


13. కిందివాటిలో సరికాని జత?


1 ) ఫార్మలిన్‌ - ఫార్మాల్డిహైడ్‌ జల ద్రావణం     2) మిశ్రమ ఎరువు - యూరియా      3) క్విక్‌సిల్వర్‌ - పాదరసం    4) పొగాకు - నికోటిన్‌


14. శీతల పానీయాల్లో నిమ్మపండు వాసన కోసం ఉపయోగించే రసాయన పదార్థం ఏది?


1) వెనిగర్‌      2) సిట్రోనెల్లాల్‌   3) ఇథనాల్‌      4) సెల్యులోజ్‌


15. బ్లీచింగ్‌ పౌడర్‌ నీటిలో వేసినప్పుడు విడుదలయ్యే వాయువు? 


1) క్లోరిన్‌      2) ఆక్సిజన్‌   3) నైట్రోజన్‌      4) హైడ్రోజన్‌  


 సమాధానాలు ;1-4  2-4  3-2  4-1  5-2  6-1  7-2  8-2  9-2  10-4  11-2  12-4  13-2  14-2  15-1 


రచయిత

డాక్టర్‌ పి. భానుప్రకాష్‌


 

Posted Date : 28-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌