• facebook
  • whatsapp
  • telegram

ర‌సాయ‌నశాస్త్రం- మౌలిక అంశాలు

1. వృక్ష, జంతు కళేబరాలు కుళ్లకుండా  ఉండటానికి ఏ రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు?

జ‌: ఫార్మలిన్‌     


2. పొటాషియం నైట్రేట్, కోక్, గంధకం మిశ్రమాన్ని దేనికి ఉపయోగిస్తారు?

జ‌: తుపాకీ మందుగా

 


3. పేలుడు పదార్థంగా ఉపయోగించే అమ్మోనాల్‌ వేటి మిశ్రమం?

జ‌:  అల్యూమినియం పొడి + అమ్మోనియం నైట్రేట్‌


4. 10% కార్బన్‌ డైఆక్సైడ్, 90% ఆక్సిజన్‌ వాయువుల మిశ్రమాన్ని ఏమంటారు?

జ‌:  కార్బోజన్‌

 

5. కిందివాటిలో అత్యధిక కాటనేషన్‌ సామర్థ్యం ఉన్న మూలకం ఏది?

జ‌:  కార్బన్‌


6. కిందివాటిలో అలోహం ఏది?

1) ఫ్లోరిన్‌       2) ఆక్సిజన్‌     3) 1, 2          4) యురేనియం

జ‌:  1, 2
 

7. కిందివాటిలో అతి భారయుతమైన మూలకం ఏది?

1) హీలియం        2) యురేనియం    3) ఇనుము         4)  జింక్‌

జ‌:  యురేనియం
 

8. ‘గమాక్సిన్‌’ రసాయన నామం ఏమిటి?

జ‌:   బెంజీన్‌ హెక్సాక్లోరైడ్‌

 

9. ‘ఫైర్‌డాంప్‌’ అని ఏ వాయువును పిలుస్తారు?

జ‌:   మీథేన్‌ 

 

10. కింది అంశాలను జతపరచండి.

సాధారణ నామం        రసాయన నామం

a)  మైలుతుత్తం         i) సోడియం సల్ఫేట్‌

b) జిప్సం                   ii) కాల్షియం సల్ఫేట్‌

c) సాల్ట్‌కేక్‌                iii) కాపర్‌ సల్ఫేట్‌

జ‌:  a-iii, b-ii, c-i


11. కిందివాటిలో ‘ఆమ్లాల రాజు’ అని దేన్ని అంటారు?

1) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం   2) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం   3)  ఎసిటిక్‌ ఆమ్లం     4) నైట్రిక్‌ ఆమ్లం

జ‌:  సల్ఫ్యూరిక్‌ ఆమ్లం


12. చక్కెర లేదా సుక్రోజ్‌ రసాయన ఫార్ములా?

జ‌:  C12H22O11


13. కిందివాటిలో అతి తేలికైన, బరువైన మూలకాలు ఏవి?

1) లిథియం, ఆస్మియం   2)ఆస్మియం, లిథియం

3) అల్యూమినియం, ఆస్మియం    4) ఆస్మియం, అల్యూమినియం

జ‌: లిథియం, ఆస్మియం


14. సోడియం లోహాన్ని ఎందులో నిల్వ చేస్తారు?

జ‌:  కిరోసిన్‌    


15. నిప్పు ఆర్పే యంత్రం (Fire Extinguisher) లో ఉండే వాయువు....

జ‌:  కార్బన్‌ డైఆక్సైడ్‌ 

 

16. పాలు ఏ రకానికి చెందిన కొల్లాయిడ్‌ ద్రావణం?

జ‌:   నీటిలో కొవ్వు విక్షేపణ చెందితే ఏర్పడింది

 

17. నాన్‌స్టిక్‌ వంట పాత్రలపై కింది ఏ పూత ఉంటుంది?

జ‌:   టెఫ్లాన్‌     


18. కిందివాటిలో పాలిమర్‌కు ఉదాహరణ ఏది?

1) పాలు      2) సుక్రోజ్‌    3) సహజ రబ్బరు     4) బ్యూటేన్‌

జ‌:  సహజ రబ్బరు


19. ఎరువుల్లో ఉండే మూడు ముఖ్య మూలకాలు ఏవి?

జ‌: నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం

 

20. రసాయనికంగా నీరు ఒక.....

జ‌: ఆక్సైడ్‌        

 

21. వర్షపు నీరు pH విలువ ఎంత?

జ‌:  5.6


22. కిందివాటిలో మిశ్రమ ఎరువుకు ఉదాహరణ?

1) అమ్మోనియం సల్ఫేట్‌  2) యూరియా  3) అమ్మోనియం క్లోరైడ్‌  4) NPK

జ‌:  NPK


23. కింది ఏ వాయువులను ఉపయోగించి అమ్మోనియా వాయువును తయారు చేస్తారు?

1) ఉదజని, ఆక్సిజన్‌  2) నత్రజని, క్లోరిన్‌    3) ఉదజని, నత్రజని   4) నత్రజని, ఆక్సిజన్‌

జ‌: ఉదజని, నత్రజని


24. సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సెరామిక్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది?

జ‌:  జాదవ్‌పూర్‌      


25. కింది అంశాలను జతపరచండి.

జాబితా-ఎ              జాబితా-బి

a) లిథియం     i) మూలకాల రారాజు

b) కార్బన్‌      ii) మందకొడి వాయువు

c) నైట్రోజన్‌     iii) తేలికైన లోహం

జ‌: a-iii, b-i, c-ii


26. కింది అంశాలను జతపరచండి.

     జాబితా-ఎ                    జాబితా-బి

a) సహజ వాయువు            i) ఆస్ప్రిన్‌

b) అనాల్జెసిక్‌                     ii) సోడియం థయోసల్ఫేట్‌

c)  హైపో                           iii) మీథేన్‌

జ‌:  a-iii, b-i, c-ii


27. కిందివాటిలో సరైనవి ఏవి?

i) వజ్రం కార్బన్‌ మూలకం రూపాంతరం.

ii)  క్లోరిన్‌ ఘాటైన వాసన కలిగిన ప్రమాదకర వాయువు.

iii) ఫ్లోరిన్‌ అత్యధిక చర్యాశీలతను ప్రదర్శించే హాలోజన్‌ మూలకం.

iv) పెట్రోలియం వివిధ హైడ్రోకార్బన్‌ల మిశ్రమం.

జ‌:  i, ii, iii, iv


28. కిందివాటిలో ‘మాల్ట్‌ షుగర్‌’ అని దేన్ని అంటారు?

1) ఫ్రక్టోజ్‌         2) లాక్టోజ్‌     3) మాల్టోజ్‌       4) సెల్యులోజ్‌

జ‌: మాల్టోజ్‌


29. ప్రతి ద్రవ పదార్థం తన ఉపరితలాన్ని ఏ విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది?

జ‌:  కనిష్ఠంగా 

 

30. ప్రోటీన్‌లు అధికంగా అభించే పదార్థాలు ఏవి?

1) మాంసం        2) పాలు         3) సోయాచిక్కుడు       4) పైవన్నీ

జ‌:  పైవన్నీ

 
31. కిందివాటిలో విటమిన్‌ ఏది?

1) ఎసిటిక్‌ ఆమ్లం   2) సిట్రిక్‌ ఆమ్లం   3) ఫోలిక్‌ ఆమ్లం   4) ఫార్మిక్‌ ఆమ్లం

జ‌: ఫోలిక్‌ ఆమ్లం


32. కింది అంశాలను జతపరచండి.

   జబితా-ఎ                జాబితా-బి

a) విటమిన్‌లు           i) శక్తి నిల్వలు

b) ఎంజైమ్‌లు            ii) సూక్ష్మపోషకాలు

c) కొవ్వులు               iii) ప్రోటీన్‌లు

జ‌: a-ii, b-iii, c-i
 

33. కిందివాటిలో స్థూల పోషకాలు ఏవి?

1) కార్బోహైడ్రేట్‌లు      2) ప్రోటీన్‌లు      3) కొవ్వులు      4) పైవన్నీ

జ‌:  పైవన్నీ


34. మనం తీసుకునే ఆహారంలో అధికంగా....... ఉంటాయి.

జ‌:  కార్బోహైడ్రేట్‌లు


35. కార్బోహైడ్రేట్‌లలో రసాయనికంగా ఉండే మూలకాలు ఏవి?

1) కార్బన్‌        2) ఆక్సిజన్‌      3) హైడ్రోజన్‌       4) పైవన్నీ

జ‌: పైవన్నీ


36. సుక్రోజ్‌ను జలవిశ్లేషణ చేస్తే ఏర్పడే చక్కెర.....

i) ఫ్రక్టోజ్‌        ii) గ్లూకోజ్‌      iii) సెల్యులోజ్‌        iv) మాల్టోజ్‌

జ‌:  i, ii           


37. రక్తంలో ఏ చక్కెర స్థాయి ఎక్కువ అవడాన్ని డయాబెటిస్‌ అంటారు?

జ‌:  గ్లూకోజ్‌ 


38. బీట్‌రూట్‌ నుంచి ఏ రకం చక్కెరను తయారు చేస్తారు?

జ‌: సుక్రోజ్‌        


39. ప్రోటీన్‌లలో ఉండే మూలకాలు ఏవి?

i) కార్బన్‌   ii) ఆక్సిజన్‌   iii) నైట్రోజన్‌   iv) సల్ఫర్‌  v) హైడ్రోజన్‌   vi) లెడ్‌

జ‌: i, ii, iii, iv, v
 

40. కిందివాటిలో రసాయన శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చేది ఏది?

1) డైనమో        2) బ్యాటరీ    3) పైరోమీటర్‌       4) గాల్వనోమీటర్‌

జ‌: బ్యాటరీ


41. పదార్థ ఘనపరిమాణానికి ప్రమాణం ఏది?

1) కేజీ           2) మీటర్‌3          3) సెం.మీ.3         4) 1, 2

జ‌: 1, 2


42. కింది అంశాలను జతపరచండి.

జాబితా - ఎ         జాబితా - బి

a) పార్‌సెక్‌         i) 10-15 మీటర్‌

b)  ఫెర్మీ           ii)107 ఎర్గ్‌

c) జౌల్‌            iii) 3.26 కాంతి సంవత్సరాలు

జ‌: a-iii, b-i, c-ii


43. పరమ శూన్య ఉష్ణోగ్రత = ........ C

జ‌: - 273     


44. వాతావరణ పీడనం విలువ నెమ్మదిగా తగ్గితే, అది దేన్ని సూచిస్తుంది?

జ‌:  వర్షం రాకను    

Posted Date : 28-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌