• facebook
  • whatsapp
  • telegram

విచ్ఛిత్తి కంటే సంలీనంతోనే అధిక శక్తి!

కేంద్రక చర్యలు - అణు రియాక్టర్లు

 


అణువుల్లో జరిగే కేంద్రక విచ్ఛిత్తి, సంలీనాలను కలిపి కేంద్రక చర్యలు అంటారు. వీటివల్ల అనంత శక్తి వెలువడుతుంది. దానిని నియంత్రిత పరిస్థితుల్లో ఎన్నోరకాలుగా మానవ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. పెను విధ్వంసం సృష్టించే అణ్వస్త్రాలనూ ఉత్పత్తి చేస్తున్నారు. వీటి ఆధారంగా ఏర్పాటైన అణురియాక్టర్లు అణువిద్యుత్తు ఉత్పత్తికి, రేడియో ఐసోటోపుల తయారీకి ఉపయోగపడుతున్నాయి. రియాక్టర్లలో రకాలు, వాటిలో వినియోగించే ఇంధనాల గురించి అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. పెరుగుతున్న విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా అణురియాక్టర్లను ఏర్పాటు చేసిన ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలతో పాటు స్థాపిత, వినియోగ సామర్థ్యాలపై అవగాహన పెంచుకోవాలి. 

 


1.    కిందివాటిలో కేంద్రక విచ్ఛిత్తికి సంబంధించి  సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) ఒక భార కేంద్రకం రెండు లేదా అంతకంటే ఎక్కువ తేలిక కేంద్రకాలుగా విచ్ఛిన్నం కావడం.

బి) కేంద్రక విచ్ఛిత్తి సహజంగా జరుగుతుంది.

సి) న్యూక్లియర్‌ రియాక్టర్‌లలో జరిగే చర్య కేంద్రక     విచ్ఛిత్తి. 

డి) కేంద్రక విచ్ఛిత్తి వల్ల శక్తి వెలువడుతుంది.

1) ఎ, బి, సి        2) బి, సి, డి     

3) ఎ, బి, సి, డి        4) ఎ బి, సి


2.    న్యూక్లియర్‌ రియాక్టర్లకు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) న్యూక్లియర్‌ రియాక్టర్లలో కేంద్రక సంలీనం జరుగుతుంది.

బి) న్యూక్లియర్‌ రియాక్టర్లలో కేంద్రక విచ్ఛిత్తి నియంత్రిత పరిస్థితుల్లో జరుగుతుంది.

సి) న్యూక్లియర్‌ రియాక్టర్లలో యురేనియం, ప్లూటోనియంలను ఇంధనంగా వాడతారు 

డి) న్యూక్లియర్‌ను ఉపయోగించి అణువిద్యుత్‌ను తయారుచేయవచ్చు.

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే   

3) ఎ, బి        4) ఎ, సి  


3.     కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.

ఎ) రెండు తేలికైన కేంద్రకాలు కలిసి భారకేంద్రకంగా ఏర్పడటాన్ని కేంద్రక సంలీనం అంటారు.

బి) సూర్యుడిలో జరిగే చర్య కేంద్రక సంలీనం.

సి) కేంద్రక విచ్ఛిత్తి కంటే కేంద్రక సంలీనంలో ఎక్కువ శక్తి విడుదలవుతుంది.

డి) కేంద్రక సంలీనంలో ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఏర్పడవు.

1) బి, సి డి       2) ఎ, బి, సి, డి   

3) ఎ, బి, సి       4) బి, సి 


4.     కిందివాటిని జతపరచండి.

ఎ) యురేనియం  1) కేంద్రకం సంలీనం

బి) సూర్యుడు    2) కేంద్రక విచ్ఛిత్తి 

సి) మితకారులు  3) బోరాన్, కాడ్మియం కడ్డీలు 

డి) నియంత్రణ కడ్డీలు 4) బెరీలియం, గ్రాఫైట్‌

1) ఎ-1; బి-3; సి-4; డి-2       2) ఎ-2; బి-1; సి-4; డి-3

3) ఎ-2; బి-3; సి-1; డి-4       4) ఎ-4; బి-2; సి-3; డి-1


5.     కేంద్రక విచ్ఛిత్తిలో జరిగే శృంఖల చర్యకు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) అణుబాంబులో శృంఖల చర్య అనియంత్రిత పరిస్థితుల్లో జరుగుతుంది.

బి) న్యూక్లియర్‌ రియాక్టర్‌లో శృంఖల చర్య నియంత్రణ పరిస్థితుల్లో జరుగుతుంది.

సి) న్యూక్లియర్‌ రియాక్టర్‌లో శృంఖల చర్యను నియంత్రించడానికి మితకారులు, నియంత్రణ కడ్డీలను వాడతారు.

డి) శృంఖల చర్య జరగడానికి యురేనియం, ప్లూటోనియం లాంటి అణుఇంధనాలు అవసరం.

1) ఎ, సి, డి       2) ఎ, బి, సి   

3) బి, సి, డి       4) ఎ, బి, సి, డి


6.     కిందివాటిని గమనించండి.

ఎ) బెరీలియం గ్రాఫైట్, భారజలంను మితకారులుగా వాడతారు.

బి) బోరాన్, కాడ్మియం కడ్డీలను నియంత్రణ కడ్డీలుగా వాడతారు.

పై వాక్యాల ఆధారంగా కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

1) ఎ, బిలు సరైనవి, ఎ వాక్యం బి తో సంబంధం చూపుతుంది.

2) ఎ, బిలు సరైనవి కావు, ఎ వాక్యం బి తో సంబంధాన్ని చూపదు.

3) ఎ సరైంది, బి సరైంది కాదు. 

4) ఎ సరైంది కాదు, బి సరైంది.


7. కిందివాటిలో కేంద్రక సంలీనానికి సంబంధించి సరికానిది?

ఎ) కేంద్రక సంలీనంను థర్మో న్యూక్లియర్‌ రియాక్షన్‌ అంటారు.

బి) సూర్యుడిలో జరిగే చర్య కేంద్రక సంలీనం.

సి) హైడ్రోజన్‌ బాంబు కేంద్రక సంలీనంపై ఆధారపడి పనిచేస్తుంది.

డి) హీలియం అణువులు కలిసిపోయి హైడ్రోజన్‌ ఏర్పడే చర్య కేంద్రక సంలీనం. 

ఇ) గ్రహాల్లో జరిగే చర్య కేంద్రక సంలీనం.

1) ఎ, బి   2) డి, ఇ   3) సి, డి   4) బి, సి


8. న్యూక్లియర్‌ రియాక్టర్‌కు సంబంధించి కిందివాటిని జతపరచండి.

ఎ) న్యూక్లియర్‌ రియాక్టర్‌ను చల్లబరిచేవి    1) యురేనియం, ప్లూటోనియం         

బి) న్యూట్రాన్‌ల వేగాన్ని తగ్గించేవి    2) బోరాన్, కాడ్మియం

సి) న్యూట్రాన్‌లు శోషించేవి    3) బెరీలియం, గ్రాఫైట్‌

డి) ఇంధనంగా ఉపయోగించేవి    4) భారజలం, ద్రవ సోడియం

1) ఎ-2; బి-3; సి-4; డి-1       2) ఎ-4; బి-3; సి-2; డి-1

3) ఎ-3; బి-2; సి-1; డి-4       4) ఎ-1; బి-3; సి-2; డి-4


9.     కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) భారతదేశ మొదటి పరిశోధనా రియాక్టర్‌ అప్సర. 

బి) అప్సర పరిశోధనా రియాక్టర్‌ స్విమ్మింగ్‌ పూల్‌ రకానికి చెందింది.

సి) న్యూక్లియర్‌ రియాక్టర్‌లు అణువిద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగపడతాయి.

డి) అప్సర రియాక్టర్‌ను 1956లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సహకారంతో నిర్మించారు.

ఇ) భారతదేశంలో అణువిద్యుత్తు ఉత్పత్తి న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. 

1) ఎ, బి, సి, డి, ఇ 2) బి, సి, డి 3) ఎ, డి, ఇ 4) సి, డి


10. భారతదేశంలో పరిశోధనా రియాక్టర్లకు సంబంధించి కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

ఎ) అప్సర    1) ప్లూటోనియం ఆక్సైడ్‌ ఇంధనంగా వాడుకుంటుంది

బి) సిరస్‌    2) యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సహకారంతో నిర్మించారు

సి) పూర్ణిమ   3) కెనడా ఇండియన్‌ రియాక్టర్‌

డి) కామిని   4) నేషనల్‌ ఫెసిలిటీ ఫర్‌ న్యూట్రాన్‌ బీమ్‌ రిసెర్చ్‌

ఇ) ధ్రువ    5) U-233ను ఇంధనంగా వాడే ఒకే ఒక రియాక్టర్‌

1) ఎ-2; బి-3; సి-1; డి-5; ఇ-4     2) ఎ-3; బి-1; సి-4; డి-2; ఇ-5

3) ఎ-5; బి-4; సి-3; డి-2; ఇ-1    4) ఎ-1; బి-2; సి-4; డి-3; ఇ-5


11. భారతదేశంలో అణువిద్యుత్‌ రియాక్టర్లు, ఉన్న ప్రాంతాలను జతపరచండి.

ఎ) తారాపుర్‌ అటామిక్‌     1) గుజరాత్‌ పవర్‌ స్టేషన్‌   

బి) రాజస్థాన్‌ అటామిక్‌     2) ఉత్తర్‌ప్రదేశ్‌ పవర్‌ స్టేషన్‌   

సి) మద్రాస్‌ అటామిక్‌       3) కోటా పవర్‌ స్టేషన్‌    

డి) కైగా జనరేటింగ్‌     4) కల్పకం స్టేషన్‌     

ఇ) నరోరా అటామిక్‌     5) కర్ణాటక పవర్‌ స్టేషన్‌ 

ఎఫ్‌) కాక్రపార్‌ అటామిక్‌     6) మహారాష్ట్ర పవర్‌స్టేషన్‌ 

1) ఎ-6; బి-3; సి-4; డి-5; ఇ-2; ఎఫ్‌-1

2) ఎ-4; బి-2; సి-5; డి-1; ఇ-3; ఎఫ్‌-6

3) ఎ-1; బి-3; సి-4; డి-2; ఇ-5; ఎఫ్‌-6 

4) ఎ-6; బి-1; సి-2; డి-4; ఇ-5; ఎఫ్‌-3


12. కుడంకుళం న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీన్ని రష్యా సహకారంతో నిర్మించారు.

బి) ఇది తమిళనాడులో ఉంది.

సి) దీని సామర్థ్యం 1000 మెగావాట్లు.  

డి) దీన్ని వొడా వొడా ఎనర్జీ రియాక్టర్‌ (వీవీఈఆర్‌) అంటారు

1) ఎ, బి      2) బి, సి 

3) సి, డి      4) ఎ, బి, సి, డి


13. తారాపుర్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ గురించి కింది వాక్యాల్లో సరికానిది?

ఎ) ఇది పరిశోధనా రియాక్టర్‌.

బి) వీటిలో మొదటి రెండు యూనిట్లు బాయిలింగ్‌ వాటర్‌ రియాక్టర్లు.

సి) మొదటి యూనిట్‌ను అమెరికా సహకారంతో నిర్మించారు.

డి) మొదటి రెండు యూనిట్లలో ఒక్కోదాని సామర్థ్యం 160 మెగావాట్లు.

ఇ) ఈ పవర్‌ స్టేషన్‌ కర్ణాటకలో ఉంది.

1) ఎ, ఇ    2) బి, సి  3) సి, డి   4) డి, ఇ 


14. కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) రాజస్థాన్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ను కెనడా సహకారంతో నిర్మించారు.

బి) కర్ణాటకలోని కైగా జనరేటింగ్‌ స్టేషన్‌-1 ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ రోజులు విద్యుత్తు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.

1) ఎ, బిలు సరైనవి. ఇవి రెండూ ఒకే అంశానికి సంబంధించినవి.

2) ఎ సరైంది, బి సరైంది కాదు. ఇవి రెండూ వేర్వేరు అంశాలు.

3) ఎ సరైంది కాదు, బి సరైంది. ఇవి ఒకే అంశానికి సంబంధించినవి.

4) ఎ, బిలు సరైనవి కావు. ఇవి ఒకదాంతో ఒకటి సంబంధాన్ని చూపవు.


15. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) భారతదేశంలో ప్రస్తుతం 22 న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి.

బి) భారతదేశంలో ప్రస్తుతం మొత్తం అణువిద్యుత్తు ఉత్పత్తి 6780 మెగావాట్లు. 

సి) భారతదేశంలో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న అణువిద్యుత్తు, మొత్తం విద్యుత్తు ఉత్పత్తిలో 50 శాతం.

డి) కుడంకుళం న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ - I 1000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. 

1) ఎ, బి, సి, డి       2) బి, సి, డి   

3) ఎ, బి, డి       4) ఎ, సి


16. భారతదేశ మూడు దశల న్యూక్లియర్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించి సరైంది?

ఎ) మొదటి దశలో ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌లను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.

బి) రెండో దశలో ఫాస్ట్‌బ్రీడర్‌ రియాక్టర్‌లను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.

సి) మూడో దశలో అడ్వాన్స్‌డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌లను ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.

1) ఎ, బి      2) ఎ, బి, సి  

3) బి, సి      4) ఎ, సి 


17. కిందివాటిలో సరైన జతలు ఎన్ని?

ఎ) ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌ - యురేనియం 237 ఇంధనం

బి) ఫాస్ట్‌బ్రీడర్‌ రియాక్టర్‌ - ప్లూటోనియం 240 ఇంధనం

సి) అడ్వాన్స్‌డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్‌ - యురేనియం 233 ఇంధనం

1) 2 జతలు      2) 1 జతలు   

3) 3 జతలు      4) ఏదీకాదు 


18. కిందివాటిలో సరైంది?

ఎ) భారతదేశ మొదటి అణు పరీక్షను 1974, మే 18న నిర్వహించారు.

బి) భారతదేశ మొదటి అణు పరీక్ష పేరు స్మైలింగ్‌ బుద్ధ.

సి) భారతదేశ రెండో అణు పరీక్ష పేరు ఆపరేషన్‌ శక్తి.

డి) భారతదేశ రెండోసారి అణు పరీక్షను 1998, మే 11 నుంచి 13 వరకు నిర్వహించారు.

1) ఎ, బి   2) బి, సి   3) ఎ, బి, సి   4) ఎ, బి, సి, డి 


19. కింది వాక్యాల్లో ఎన్ని సరైనవి?

ఎ) యురేనియం 235 శాతం ఎక్కువగా ఉంటే దాన్ని ఎన్‌రిచ్‌డ్‌ యురేనియం అంటారు.

బి) అణుబాంబు తయారీకి 90% యురేనియం-235 ఉన్న ఎన్‌రిచ్‌డ్‌ యురేనియం అవసరం.

సి) సహజ యురేనియంలో యురేనియం 235 శాతం ఎక్కువ.

డి) సహజ యురేనియంను నేరుగా న్యూక్లియర్‌ రియాక్టర్‌లో వాడతారు.

1) 3 వాక్యాలు 2) 4 వాక్యాలు  3) 2 వాక్యాలు 4) ఏదీకాదు



సమాధానాలు

1-3; 2-1; 3-2; 4-2; 5-4; 6-1; 7-2; 8-2; 9-1; 10-1; 11-1; 12-4; 13-1; 14-1; 15-3; 16-2; 17-1; 18-4; 19-3.


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌
 

Posted Date : 15-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌