• facebook
  • whatsapp
  • telegram

బహుళ ప్రయోజనాల పరమాణు పరిజ్ఞానం!

అణు సాంకేతికత

 

 

జలాంతర్గాములు, విమాన వాహక నౌకలను నడిపించేందుకు అవసరమైన విద్యుత్తును భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి, క్యాన్సర్‌ చికిత్సకు, మేలైన వంగడాలను రూపొందించడానికి, ఇంకా అనేక రకాల అవసరాల కోసం అణుశక్తిని వినియోగిస్తున్నారు. అణుసాంకేతికతతో ఆ శక్తిని సృష్టిస్తారు. వివిధ ప్రయోజనాల కోసం పరమాణువులను  ఉపయోగించడానికి అనుసరించే సూత్రాలు, ప్రక్రియలనే అణుసాంకేతికత అంటారు. దానిని వాడుతున్న తీరును, పొందుతున్న లాభాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. సంబంధిత పరిశోధనా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రధాన విధులపై తగిన అవగాహన పెంచుకోవాలి. 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

1.    కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

ఎ) హోమి జహంగీర్‌ బాబాను భారత అణు సాంకేతికత పితామహుడు అంటారు.

బి) భారతదేశంలో అణుశక్తి సాంకేతికత ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (TIFR) ఏర్పాటుతో ప్రారంభమైంది.

1) ఎ సరైంది. ఇది బితో సంబంధం కలిగి ఉంటుంది.   2) ఎ సరైంది, బి సరైంది కాదు.

3) ఎ సరైంది కాదు, బి సరైంది.  4) ఎ, బి లు రెండూ సరికావు.


2.   కిందివాటిలో అణుశక్తి సాంకేతికతకు సంబంధించిన ప్రయోగశాలలు, అవి ఉన్న ప్రాంతాలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ 1) కోల్‌కతా
బి) ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ 2) ముంబయి
సి) రాజారామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ 3) హైదరాబాద్‌
డి) వేరియబుల్‌ ఎనర్జీ సైక్లోట్రాన్‌ సెంటర్‌ 4) కల్పకం (తమిళనాడు)
ఇ) అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ 5) ఇందౌర్‌ (మధ్యప్రదేశ్‌)

1) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1     2) ఎ-2, బి-4, సి-5 డి-1, ఇ-3 

3) ఎ-4, బి-2, సి-5, డి-3, ఇ-1     4) ఎ-1, బి-5, సి-3, డి-2, ఇ-4


3. అణు సాంకేతికత ప్రయోగశాలల గురించి కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను ఇతర అణు సాంకేతికత ప్రయోగశాలలకు అమ్మ లాంటిది అంటారు.

బి) బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌.. యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌లో పాలుపంచుకుంటుంది.

సి) కల్పకంలోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌.. యురేనియం తవ్వకాలు, శుద్ధిపై పనిచేస్తుంది.

డి) హైదరాబాద్‌లోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ సంస్థ యురేనియం, థోరియం నిల్వల్ని గుర్తిస్తుంది.

1) ఎ, బి        2) బి, సి, డి   

3) ఎ, సి, డి    4) ఎ, బి, డి


4. కిందివాటిలో ఎన్ని జతలు సరైనవో గుర్తించండి.

ఎ) హెవీ వాటర్‌ బోర్డ్‌ ప్రధాన కార్యాలయం - ముంబయి

బి) మొదటి హెవీ వాటర్‌ ప్లాంట్‌ - నంగల్‌ (పంజాబ్‌)

సి) న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ - దిల్లీ

డి) బోర్డ్‌ ఆఫ్‌ రేడియేషన్‌ అండ్‌ ఐసోటోప్‌ టెక్నాలజీ - హైదరాబాద్‌

ఇ) న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ - బెంగళూరు

1) 2 జతలు       2) 3 జతలు   

3) 4 జతలు       4) 5 జతలు


5. హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ సంస్థ ఏ రకమైన విధులు నిర్వర్తిస్తుంది?

ఎ) న్యూక్లియర్‌ ఫ్యూయల్, రియాక్టర్‌ కోర్‌కు సంబంధించిన పరికరాలను అందిస్తుంది.

బి) ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌కు సంబంధించిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కోర్‌ పరికరాలను అందిస్తుంది.

సి) సహజ, ఎన్‌రిచ్‌డ్‌ యురేనియం ఇంధనాన్ని అందిస్తుంది.

1) ఎ, బి    2) బి, సి   3) ఎ, సి   4) ఎ, బి, సి


6. ముంబయిలోని న్యూక్లియర్‌ కార్పొరేషన్‌ సంస్థ విధులకు సంబంధించి కిందివాటిలో సరికానివి -

ఎ) న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ డిజైన్, నిర్మాణం.

బి) న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌లో అణువిద్యుత్‌ ఉత్పత్తి జరపడం.

సి) అణువిద్యుత్తును ఉపయోగించి పరిశ్రమలను నడిపించడం.

డి) బొగ్గును మండించి అణువిద్యుత్‌ను తయారుచేయడం.

1) ఎ, బి     2) సి, డి     3) ఎ, సి     4) బి, డి


7.  అణు సాంకేతికత పరిశోధనాశాలలు, అవి ఉన్న ప్రదేశాలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) హెవీవాటర్‌ బోర్డు 1) హైదరాబాద్‌
బి) న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ 2) జాదుగూడ (ఝార్ఖండ్‌) 
సి) బోర్డ్‌ ఆఫ్‌ రేడియేషన్‌ అండ్‌ ఐసోటోప్‌ టెక్నాలజీ 3) నంగల్‌ (పంజాబ్‌)
డి) న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ 4) ముంబయి
ఇ) యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ 5) ముంబయి

1) ఎ-2, బి-4, సి-3, డి-5, ఇ-1    2) ఎ-4, బి-2, సి-3, డి-1, ఇ-5

3) ఎ-4, బి-1, సి-2, డి-5, ఇ-3    4) ఎ-3, బి-1, సి-4, డి-5, ఇ-2


8.  హరియాణాలోని బహదూర్‌గర్హ్‌లో ఉన్న గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్‌ సంస్థ కింది ఏ విధులను నిర్వర్తిస్తుంది?

ఎ) అణుశక్తి సాంకేతికతపై శిక్షణ  

బి) ప్రపంచ అణుశక్తిగా భాగస్వామ్యాన్ని పెంచడం

సి) అణుశక్తిపై సెమినార్‌లు, వర్క్‌షాప్‌లను నిర్వహించడం

1) ఎ, బి  2) బి, సి   3) ఎ, బి, సి  4) ఎ, సి 


9. అణుశక్తి సాంకేతికతను వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు?

ఎ) గామా కిరణాలను ఉపయోగించి ఉత్పరివర్తన ప్రజననం ద్వారా మేలైన వంగడాలను రూపొందించడం.

బి) మొక్కలు ఎరువులను ఏ విధంగా శోషించుకుంటున్నాయో గుర్తించడం.

సి) అయోనైజింగ్‌ రేడియేషన్‌ను ఉపయోగించి స్టెరైల్‌ ఇన్‌సెక్ట్‌ టెక్నిక్‌ (SIT) ద్వారా కీటకాలను నియంత్రించడం.

1) ఎ, సి  2) బి, సి  3) ఎ, బి  4) ఎ, బి, సి


10. అణుశక్తి సాంకేతికత వినియోగం గురించి కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) గామా కిరణాలను ఉపయోగించి ఆహార పదార్థాలను సూక్ష్మజీవరహితం చేయడం.

బి) రేడియేషన్‌ను ఉపయోగించి నీటిని శుభ్రపరచడం.

సి) పరిశ్రమలు, పరిశోధనల్లో రేడియోధార్మిక ఐసోటోపులను ట్రేసర్‌లుగా వాడటం.

డి) రేడియోధార్మిక పదార్థాలను క్యాన్సర్‌ చికిత్సకు ఔషధాలుగా కీమోథెరపీలో భాగంగా వాడటం.

ఇ) అణుశక్తిని ఉపయోగించి వాణిజ్యపరంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం.

1) బి, డి       2) ఎ, సి   

3) ఎ, బి, సి       4) బి, సి, డి


11. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) అణుశక్తిని ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు.

బి) రేడియో ఐసోటోపులను వ్యాధి నిర్ధారణలో వాడుతున్నారు.

సి) అణు సాంకేతికతను క్యాన్సర్‌ చికిత్సకు వాడుతున్నారు.

డి) అణు సాంకేతికత ద్వారా విడుదలయ్యే గామా కిరణాలను ఆసుపత్రుల్లో వైద్యపరికరాలు, వస్తువులను సూక్ష్మ జీవరహితం చేయడానికి వాడుతున్నారు.

ఇ) అణుశక్తిని కార్లు, బస్సులు లాంటి వాటిని నడపడానికి వాడుతున్నారు.

1) ఎ, బి, సి, ఇ     2) ఎ, బి, సి, డి  

3) బి, సి, డి, ఇ      4) సి, డి, ఇ


12. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) అణువిద్యుత్‌ శక్తిని ఉపయోగించి జలాంతర్గాములు, విమాన వాహక నౌకలను నడుపుతున్నారు.

బి) అణువిద్యుత్‌ శక్తిని ఉపయోగించి ఉప్పునీటిని మంచినీటిగా మారుస్తున్నారు.

సి) స్పేస్‌ ప్రోబ్‌లలో న్యూక్లియర్‌ రియాక్టర్‌లను వాడుతున్నారు.

డి) అణు సాంకేతికత అన్నివిధాల హానికరం. దీన్ని మానవ అవసరాల కోసం వాడుకోవడం కుదరదు.

1) ఎ, బి, డి 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) ఎ, డి


13. కింది వాక్యాలను గమనించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) ప్రోటియమ్, డ్యుటీరియమ్, ట్రిటియమ్‌లు హైడ్రోజన్‌ ఐసోటోపులు.

బి) ట్రిటియమ్‌కు రేడియో ధార్మికత ఉంటుంది.

1) ఎ, బి లు సరైనవి. బి తో ఎ సంబంధం చూపుతుంది.

2) ఎ, బి లు సరైనవి. బి తో ఎ సంబంధం చూపదు.

3) ఎ సరైంది, బి సరైంది కాదు.    4) ఎ, బి లు రెండూ సరికావు.


14. ఐసోటోపులకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) ఐసోటోపులకు ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది. కానీ వేర్వేరు పరమాణు భారాలుంటాయి.

బి) ఐసోటోపుల్లో ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్‌లు ఉంటాయి. కానీ వేర్వేరు సంఖ్యల్లో న్యూట్రాన్లుంటాయి.

సి) సహజంగా ఉండే కొన్ని ఐసోటోపులకు రేడియోధార్మికత ఉంటుంది.

డి) రేడియోధార్మిక ఐసోటోపులను మానవుడు తయారుచేయవచ్చు.

ఇ) రేడియోధార్మిక ఐసోటోపులను వివిధ ప్రయోజనాలకు వాడుతున్నారు.

1) ఎ, బి, సి, డి    2) ఎ, సి, డి, ఇ

3) ఎ, బి, సి, డి, ఇ    4) బి, సి, డి, ఇ


15. కింది జతలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) రేడియోకార్బన్‌ 1) రక్తనాళాల్లో అడ్డంకులు గుర్తించడానికి
బి) రేడియో క్లోరైడ్‌ 2) శిలాజ వయసును గుర్తించడానికి
సి) యురేనియం-238 3) నీటి వయసును గుర్తించడానికి
డి) రేడియో అయోడిన్‌ 4) కణతులు గుర్తించడానికి
ఇ) రేడియో సోడియం 5) భూమి/శిలల వయసును గుర్తించడానికి

1) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1     2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5

3) ఎ-3, బి-2, సి-1, డి-4, ఇ-5     4) ఎ-2, బి-3, సి-5, డి-4, ఇ-1


16. రేడియోధార్మిక ఐసోటోపులకు సంబంధించి కిందివాటిలో ఎన్ని జతలు సరైనవి?

ఎ) రేడియో సల్ఫర్‌ - మొక్కలు ఖనిజ లవణాల శోషణ గుర్తించడానికి

బి) కోబాల్ట్‌-60 - క్యాన్సర్‌ చికిత్స, నిర్ధారణ

సి) రేడియో ఐరన్‌ - రక్త పరిమాణాన్ని గుర్తించడానికి

డి) రేడియో సీజియం - లోహపు కడ్డీల మందం తెలుసుకోవడానికి

ఇ) రేడియో ఫాస్ఫరస్‌ - రక్త వ్యాధులను గుర్తించడానికి

1) 5 జతలు     2) 4 జతలు 

3) 3 జతలు     4) 2 జతలు


17. కింది వాక్యాలను గమనించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

ఎ) ఒక ఔషధానికి రేడియో ఐసోటోపును ట్రేసర్‌గా వాడితే దాన్ని రేడియో ఫార్మాస్యూటికల్‌ అంటారు.

బి) రేడియో ఐసోటోపును శరీరంలోకి పంపి దానినుంచి వెలువడే గామా కిరణాల సహాయంతో రోగనిర్ధారణ చేయడాన్ని న్యూక్లియర్‌ ఇమేజింగ్‌ అంటారు.

1) ఎ సరైంది, బి సరైంది కాదు. ఈ రెండు వేర్వేరు అంశాలకు చెందినవి.

2) ఎ సరైంది కాదు, బి సరైంది. ఈ రెండు ఒకే అంశానికి సంబంధించినవి.

3) ఎ, బి లు సరైనవి. ఈ రెండూ ఒకే అంశానికి సంబంధించినవి.

4) ఎ, బి రెండూ సరైనవి కావు. ఇవి వేర్వేరు అంశాలు.


18. వైద్యరంగంలో రేడియో ఐసోటోపులకు సంబంధించి కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి. 

ఎ) సీజియం - 131 1) ఆర్ద్రరైటిస్‌ను నొప్పి నివారణకు వాడతారు.
బి) హాలోమియమ్‌ - 166 2) థైరాయిడ్‌ క్యాన్సర్‌ చికిత్సకు
సి) ఐయోడిన్‌ - 131 3) శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ అధ్యయనానికి
డి) ఐరన్‌ - 59 4) కాలేయ కణుతుల గుర్తింపు, చికిత్సకు
ఇ) సోడియం - 24 5) ప్లీహంలో ఇనుము జీవక్రియ అధ్యయనానికి 
ఎఫ్‌) యిర్‌బియం (Ebium)  - 169 (6) బ్రాకీ థెరపీలో వాడుతారు

1) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-6, ఎఫ్‌-1 (2) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2, ఎఫ్‌-1

3) ఎ-6, బి-4, సి-2, డి-3, ఇ-5, ఎఫ్‌-1 (4) ఎ-6, బి-4, సి-2, డి-6, ఇ-3, ఎఫ్‌-1



సమాధానాలు

1-1; 2-2; 3-4; 4-1; 5-4; 6-2; 7-4; 8-3; 9-4; 10-1;  11-2; 12-2; 13-1; 14-3; 15-4; 16-1; 17-3; 18-4.

 


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 18-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌