• facebook
  • whatsapp
  • telegram

శాతాలు

*  శాతం అంటే వందకు అని అర్థం. శాతానికి గుర్తు %(Percent).

*  శాతాలను భిన్నరూపంలోకి మార్చాలంటే ఇచ్చిన సంఖ్య లేదా అంకెను 100తో భాగించాలి.

* భిన్నాలను శాతాల్లోకి మార్చాలంటే, ఇచ్చిన భిన్నాన్ని 100 తో గుణించి, శాతం గుర్తును ఉపయోగించాలి.

శాతాలను ఒక వస్తువు మార్పును (పెరుగుదల లేదా తగ్గుదల) కనుక్కోవడానికి ఉపయోగిస్తారు.    

1.  x అనేది 70 లో 15% అయితే x విలువ ఎంత?

సాధన: 

 

2. x లో 40%, 484 అయితే x విలువ ఎంత?

సాధన: x లో 40% = 484 


           

3. 85 లో x%, 15 అయితే x విలువ ఎంత?
సాధన: 85 లో x % = 15


            

4. ఒక పరీక్షలో A అనే విద్యార్థి 75 మార్కులకు 30 మార్కులు; B అనే విద్యార్థి 60 మార్కులకు 25 సాధించారు. దీన్ని బట్టి ఏ విద్యార్థి స్థాయి బాగుందని చెప్పవచ్చు?
సాధన: విద్యార్థి A మార్కుల శాతం

   
 విద్యార్థి B మార్కుల శాతం
          
పై వివరణను అనుసరించి విద్యార్థి B స్థాయి బాగుందని చెప్పవచ్చు.

 

5. A జీతం, B జీతం కంటే 20% ఎక్కువ. అయితే B జీతం- A జీతం కంటే ఎంత శాతం తక్కువ?
సాధన: B జీతం = 100 అనుకుందాం
          A జీతం = 120 అవుతుంది. B జీతం A జీతం కంటే

  
              అంటే  16.67%  తక్కువ.

 

6. A, B అనే ఇద్దరు వ్యక్తుల జీతాల నిష్పత్తి 3 :  అయితే A జీతం, B జీతం కంటే ఎంత శాతం ఎక్కువ?
సాధన: A, B ల జీతాల నిష్పత్తి = 3 : 
                                              = 3 :     =    9  :  8
A జీతం B కంటే 1 ఎక్కువ. కాబట్టి A జీతం B కంటే     అంటే 12.5% ఎక్కువ.

 

7. 2001లో ఒక వాచీ ఖరీదు రూ. 12,000. కానీ రూపాయి విలువ పతనమవడం వల్ల దాని విలువ రూ. 15,000గా పరిగణిస్తారు. అయితే వాచీ ధరలో పెరుగుదల శాతం ఎంత?
సాధన: 2001లో వాచీ ఖరీదు రూ.12,000. రూపాయి విలువ పతనమవడం వల్ల దాని విలువ రూ.15,000 
       వాచీ ధరలో పెరుగుదల శాతం 


      
        
8. ఒక నిర్ణీత మొత్తంలో 84%, 714. అయితే ఆ మొత్తంలో 92% ఎంత?
సాధన: నిర్ణీత మొత్తం x అనుకుంటే x లో 84% = 714 


            
9. 1990 - 1995 మధ్యకాలంలో గోధుమల ఉత్పత్తి 75%; 1995 -2000 మధ్యకాలంలో 100%. అయితే 1990-2000 మధ్య కాలంలో ఉత్పత్తి శాతం ఎంత?
సాధన: 1990 లో గోధుమల ఉత్పత్తి శాతం 100 అనుకుంటే, 1995 లో గోధుమల ఉత్పత్తి శాతం 175 అవుతుంది.
పై దత్తాంశం నుంచి 1995 - 2000 మధ్య కాలంలో గోధుమల ఉత్పత్తి 100% కాబట్టి,
గోధుమల ఉత్పత్తి శాతం = 175 + 175 = 350 అవుతుంది
1990 లో 100%గా ఉన్న ఉత్పత్తి 1990 - 2000 మధ్య కాలంలో 350% అయ్యింది. కాబట్టి 1990-2000 మధ్యకాలంలో గోధుమల ఉత్పత్తి 250%.

 

10. ఒక విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థుల పెరుగుదల శాతం 2000 - 2001 లో 10% ,
2001 - 2002 లో 25%, 2002 - 2003 లో 5% అయితే 2000 నుంచి 2003 వరకు మొత్తం గ్రాడ్యుయేట్ విద్యార్థుల పెరుగుదల శాతం ఎంత?
సాధన: 2000లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 100 గా తీసుకుంటే
2001లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య = 100 +100 లో 10% = 100 +10 = 110
2002లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య = 110 +110 లో 25% = 110 + 27.5 = 137.5
2003లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య = 137.5 +137.5 లో 5%
                                                          = 137.5 + 6.88 = 144.38
దత్తాంశం నుంచి 2000 లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 100 గా తీసుకుంటే 2003 లో ఆ విద్యార్థుల సంఖ్య 144.38 కాబట్టి పెరుగుదల 44.38%

 

11. ఒక సంస్థలో 100మంది ఉద్యోగులకు నెలకు సరాసరి జీతం రూ. 16000. ఆ సంస్థ యాజమాన్యం ప్రతి ఉద్యోగి జీతం 5% పెంచి, ప్రతినెలా వారికి రవాణా ఖర్చులకు ఇస్తున్న 800 రూపాయలను నిలిపేసింది. అయితే ఆ ఉద్యోగుల నెల జీతాల సరాసరి ఎంత?
సాధన: సంస్థలో 100 మంది ఉద్యోగుల నెలవారీ సరాసరి జీతం = రూ. 16000
ప్రతి ఒక్క ఉద్యోగి జీతం 5% పెంచితే, వారి జీతాల్లో సరాసరి పెరుగుదల కూడా 5% అవుతుంది. 
   జీతాల్లో పెరుగుదల = రూ. 16000 లో 5% 
 రూ.800 
   నెలవారీ జీతాల సరాసరి = రూ.16,800
రవాణా ఖర్చుల కోసం ఇస్తున్న 800 రూపాయలను పై మొత్తంలో నుంచి తీసేస్తే,
వారి నెలవారీ జీతాల సరాసరి రూ. 16,000 అవుతుంది.

 

12. ఒక సమూహంలో 70% మంది పురుషులు, 30% మంది వివాహితులు. వారిలో 2/7 వ వంతు మంది పురుషులు వివాహితులు అయితే, అవివాహితులైన స్త్రీల భిన్నం ఎంత?
సాధన: ఒక సమూహంలో పురుషుల శాతం = 70%
   స్త్రీల శాతం = 30% వివాహితుల శాతం = 30%
  అవివాహితుల శాతం = 70%
వివాహితులైన పురుషులు =    వంతు
   అవివాహితులైన పురుషులు   వంతు
అవివాహితులైన స్త్రీల సంఖ్య x అనుకుంటే

    అవివాహితులైన స్త్రీల భిన్నం 

 

13. ఒక వస్తువు విలువ రూ. 20,000. దాని విలువ మొదటి సంవత్సరంలో 5%, తర్వాత ఏడాదిలో 4%, 3వ సంవత్సరం లో 2% తగ్గితే మూడేళ్ల తర్వాత దాని విలువ ఎంత?
సాధన: వస్తువు విలువ మొదటి సంవత్సరంలో 5%; 2, 3 సంవత్సరాల్లో 4%, 2% తగ్గింది.
   3 సంవత్సరాల తర్వాత దాని విలువ = 20,000 × 0.95 × 0.96 × 0.98 = రూ. 17,875.2    

 

14. ఒక గృహిణి తన నెలవారీ బడ్జెట్‌లో బంగాళాదుంపల కోసం రూ. 800 ఖర్చు చేస్తుంది. అయితే, ఈ ఏడాది బంగాళాదుంపల ఉత్పత్తి తక్కువకావడం వల్ల ఒక కేజీపై 60% ధర పెరిగింది. ఈ కారణంగా తను సాధారణంగా నెలకు కొనే దుంపల్లో 30 కేజీలు తక్కువ కొనాలనుకుంది. అయితే ఈ ఏడాదిలో బంగాళాదుంపల ధర ఎంత?
సాధన: బంగాళాదుంపల్లో ఒక కిలోకి పెరుగుదల శాతం = 60%
కాబట్టి వాడకంలో తగ్గుదల శాతం

ఈ తగ్గుదల శాతం, 30 కిలోలకు సమానం కాబట్టి 100% బంగాళదుంపల వాడకం
   80 కిలోలు.
   గృహిణి ప్రతినెలా 80 కిలోల బంగాళాదుంపలు కొంటుంది. కానీ ధరల్లో పెరుగుదల కారణంగా 30 కిలోలు తక్కువ కొనింది. అంటే 80 - 30 = 50 కిలోలు కొనింది. బంగాళాదుంపల కోసం నెలవారీ ఖర్చు = రూ. 800
   ఈ ఏడాదిలో 1 కేజీ బంగాళా దుంపల విలువ    రూ. 16 

 

15. రామ్ రాబడిలో పొదుపు, వ్యయాల నిష్పత్తి 2 : 3. అతడి ఆదాయం 10% పెరిగితే, ఖర్చు కూడా 12% పెరుగుతుంది. అయితే అతడి పొదుపు శాతం ఎంత పెరుగుతుంది?
సాధన: రామ్ మొత్తం ఆదాయం 100 రూపాయలు అనుకుంటే, అతడి పొదుపు, వ్యయాల నిష్పత్తి 
               = 2 : 3 కాబట్టి

 

16. ఒక పట్టణ జనాభాలో పెరుగుదలలు మొదటి, రెండు, మూడు సంవత్సరాల్లో వరసగా 5% , 10% , 20% గా నమోదయ్యాయి. అయితే మూడేళ్ల తర్వాత ఆ పట్టణ జనాభాలో సగటు పెరుగుదల శాతం ఎంత?
సాధన: ఒక పట్టణ జనాభా 100 అనుకుంటే    3 సంవత్సరాల తర్వాత జనాభా

3 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభాలో పెరుగుదల శాతం R అనుకుంటే
3 సంవత్సరాల తర్వాత జనాభా 


 

Posted Date : 20-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌