• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ పరిశీలనలో సౌండింగ్‌ రాకెట్లు!

అంతరిక్ష సాంకేతికత

 

 

అంతరిక్షంలో యంత్రాల వినియోగం, పరిశోధన కోసం ఉపయోగించే సాంకేతికతనే అంతరిక్ష సాంకేతికత అంటారు. మొబైల్‌ సేవలు, టీవీ ప్రసారాలు, వాతావరణ సమాచారం, రిమోట్‌ సెన్సింగ్, నావిగేషన్‌ లాంటి నిత్యావసర సేవలన్నింటికీ  ఆ టెక్నాలజీనే ఆధారం. ఉపగ్రహాలు, వాటి వాహక నౌకలు, ప్రయోగ కేంద్రాలు, అంతరిక్ష పరిశోధన సంస్థలన్నీ ఇందులో భాగమే. అంతరిక్ష విజ్ఞానంలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. పౌరసేవలతో పాటు రక్షణ, ఆర్థిక ప్రయోజనాలెన్నో ముడిపడి ఉన్న ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. అంతరిక్ష రంగంలో దేశ ప్రస్థానం, చేసిన ప్రయోగాలు, ముఖ్యమైన ఉపగ్రహాలు, సంబంధిత పదజాలం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


1.    భారత అంతరిక్ష సాంకేతికత గురించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) విక్రమ్‌ సారాభాయ్‌ని భారత అంతరిక్ష శాస్త్ర పితామహుడు అంటారు.

బి) భారతదేశంలో అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు ‘ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌’ స్థాపనతో ప్రారంభమయ్యాయి. 

సి) సౌండింగ్‌ రాకెట్‌ల ప్రయోగానికి 1962లో తుంబా ఈక్విటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌   స్టేషన్‌ను ప్రారంభించారు.

డి) అంతరిక్ష కార్యక్రమాలను వేగవంతం చేయడానికి 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ను ప్రారంభించారు.

1) ఎ, బి, సి, డి  2) బి, సి, డి    3) ఎ, సి  4) బి, డి


2.  భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు, అవి ఉన్న ప్రదేశాలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌    1) బెంగళూరు

బి) విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌     2) నెల్లూరు (ఆంధ్రప్రదేశ్‌)

సి) యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌    3) తిరువనంతపురం

డి) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌    4) తిరువనంతపురం

ఇ) యు.ఆర్‌.రావు  శాటిలైట్‌ సెంటర్‌    5) బెంగళూరు

1) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5

2) ఎ-3, బి-4, సి-1, డి-2, ఇ-5

3) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5

4) ఎ-1, బి-3, సి-4, డి-2, ఇ-5


3.   కిందివాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ - వాహక నౌకల ఇంధనాల గురించి పరిశోధన చేస్తుంది.

బి) తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ - వాహక నౌకల నిర్మాణం, డిజైన్‌ను అభివృద్ధి చేస్తుంది.

సి) బెంగళూరులోని యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌ -   ఉపగ్రహాల డిజైన్‌ను పర్యవేక్షిస్తుంది.

డి) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఉపగ్రహాల నియంత్రణ జరుగుతుంది.

1) ఎ, బి, సి  2) బి, సి, డి 3) సి, డి 4) ఎ, బి


4. కిందివాటిలో ఎన్ని జతలు సరైనవి?

ఎ) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ - ఇస్రో రాకెట్‌ ప్రయోగ కేంద్రం.

బి) యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌ - ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

సి) యు.ఆర్‌.రావు శాటిలైట్‌ సెంటర్‌ - ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతుంది.

డి) నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ - రిమోట్‌ సెన్సింగ్‌ డేటా సంగ్రహణ, విశ్లేషణ చేస్తుంది.

1) 2 జతలు 2) ఒక జత 3) 4 జతలు 4) 3 జతలు


5. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ గురించి కిందివాటిలో సరైంది ఏది?    

ఎ) ఈ సంస్థ తిరువనంతపురంలో ఉంది.

బి) ఇది ఆసియాలోనే మొదటి స్పేస్‌ యూనివర్సిటీ.

సి) ఈ సంస్థ అంతరిక్ష సాంకేతికతకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది.

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే

3) ఎ, బి, సి    4) సి మాత్రమే


6.  కింది అంతరిక్ష పరిశోధన సంస్థలు, అవి ఉన్న ప్రదేశాలను సరిగా జతపరచండి.

ఎ) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌    1) బెంగళూరు 

బి) నేషనల్‌ అట్మాస్ఫియరిక్‌ రిసెర్చ్‌ లేబోరేటరీ    2) హసన్‌ (కర్ణాటక)

సి) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ    3) తిరువనంతపురం    

డి) ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌    4) దెహ్రాదూన్‌   

ఇ) మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ    5) తిరుపతి

1) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1

2) ఎ-3, బి-2, సి-1, డి-4, ఇ-5

3) ఎ-4, బి-5, సి-3, డి-1, ఇ-2

4) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5


7. 2019, మార్చి 6న ఏర్పాటు చేసిన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ గురించి కిందివాటిలో సరికాని వాక్యం ఏది?

ఎ) ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ నియంత్రణలో ఉంటుంది.

బి) అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసులను నియంత్రిస్తుంది.

సి) ఉపగ్రహాల లాంచింగ్‌ సేవలు, ట్రాన్స్‌పాండర్‌ల లీజు, రిమోట్‌ సెన్సింగ్‌ సేవలు లాంటివి నిర్వహిస్తుంది.

డి) ఇది ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగిస్తుంది.

ఇ) వాహక నౌకల తయారీని పరీక్షిస్తుంది.

1) ఎ, బి   2) సి, డి  3) ఎ, ఇ  4) డి, ఇ


8. భూ దిగువ ఉపగ్రహ కక్ష్య (లోఎర్త్‌ ఆర్బిట్‌) గురించి కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) ఈ కక్ష్య ఎత్తు భూమి నుంచి 200-2000 కి.మీ.

బి) హబుల్‌ టెలిస్కోపు 560 కి.మీ. భూదిగువ  ఉపగ్రహకక్ష్యలో ఉంది.

సి) భూపరిశీలన ఉపగ్రహాలు, రిమోట్‌ సెన్సింగ్‌  ఉపగ్రహాలు ఈ కక్ష్యలో ఉంటాయి.

1) ఎ, బి, సి  2) బి, సి  3) ఎ, సి  4) బి మాత్రమే


9. కింది వాక్యాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.  

ఎ) జియోస్టేషనరీ ఉపగ్రహ కక్ష్య ఎత్తు 35,786 కి.మీ.

బి) సమాచార ఉపగ్రహాలను జియోస్టేషనరీ కక్ష్యలో ప్రవేశపెడతారు.

సి) సమాచార ఉపగ్రహాల్లో ఉన్న ట్రాన్స్‌పాండర్‌లు సమాచార చేరవేతకు ఉపయోగపడుతాయి.

డి) ట్రాన్స్‌పాండర్‌లు ఉపగ్రహానికి, యాంటిన్నాలకు మధ్య సంధానకర్తగా పనిచేస్తాయి.

1) ఎ, బి 2) బి, సి, డి 3) ఎ, బి, సి, డి 4) సి, డి


10. భారత అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.

ఎ) భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట.

బి) ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అంతరిక్ష ప్రయోగాల కోసం తయారుచేశారు. 

సి) భారతదేశ రెండో ఉపగ్రహం భాస్కర-1.

డి) ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1975, ఏప్రిల్‌ 19న రష్యా వాహక నౌక సహాయంతో కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఇ) భాస్కర-1 ఉపగ్రహాన్ని భూవనరులు, వాతావరణ పరిశోధనల కోసం నిర్మించారు.

1) ఎ, బి, సి, డి, ఇ     2) బి, సి, డి      

3) సి, డి, ఇ      4) బి, సి, ఇ


11. సౌండింగ్‌ రాకెట్ల గురించి కిందివాటిలో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) సౌండింగ్‌ రాకెట్‌లలో 2 దశల ఘన ఇంధనం ఉంటుంది.

బి) వీటిని ప్రయోగించే సమయంలో శబ్దం ఉత్పత్తి అవదు. 

సి) వీటిని వాతావరణ పరిశీలనకు వినియోగిస్తారు.

డి) సౌండింగ్‌ రాకెట్‌లను మొదట సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పరీక్షించారు.

ఇ) భారతదేశ మొదటి సౌండింగ్‌ రాకెట్‌ రోహిణి - 75.

1) ఎ, బి   2) డి, ఇ   3) బి, డి   4) బి, సి 


12. ఇస్రో వాహక నౌకలు, అవి మోసుకెళ్లే పెలోడ్‌లను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) SLV     1) 1550 కిలోలు

బి) ASLV     2) 2 టన్నులు

సి) PSLV     3) 150 కిలోలు

డి) GSLV     4) 500 కిలోలు

ఇ) SSLV     5) 40 కిలోలు

1) ఎ-3, బి-2, సి-4, డి-5, ఇ-1

2) ఎ-5, బి-3, సి-1, డి-2, ఇ-4

3) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1

4) ఎ-1, బి-5, సి-2, డి-3, ఇ-4


13. శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (SLV) కి సంబంధించి కిందివాటిలో సరైనవాటిని గుర్తించండి.    

ఎ) ఇది 40 కిలోల ఉపగ్రహాలను 305 కి.మీ.  భూదిగువ కక్ష్యలో ప్రవేశపెడుతుంది.

బి) దీనిలో 4 దశల ఘన ఇంధనం ఉంటుంది.

సి) భారతదేశంలో మొదట ప్రయోగించిన వాహక నౌక SLV-3E1 

డి) విజయవంతమైన మొదటి వాహక నౌక SLV-3E2 

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, బి, సి  4) ఎ, బి, సి, డి


14. పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (PSLV)   గురించి కిందివాటిలో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) ఇది భారతదేశ మొదటి వాహక నౌక.

బి) దీని సహాయంతో ఉపగ్రహాలను జియోస్టేషనరీ కక్ష్యలో ప్రవేశపెట్టొచ్చు.

సి) దీనిలో 4 దశల్లో ఏకాంతరంగా ఘన, ద్రవ ఇంధనాలుంటాయి.

డి) ఇది మొదటి ద్రవ ఇంధనాన్ని ఉపయోగించుకున్న రాకెట్‌.

ఇ) దీనిలో 2వ దశలో వికాస్‌ ఇంజిన్‌ ఉంటుంది.

1) డి, ఇ   2) ఎ, బి   3) సి, డి  4) ఎ, ఇ


15. పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ ద్వారా ప్రయోగించిన కింది ఉపగ్రహాలను సరైన క్రమంలో అమర్చండి.

ఎ) PSLV - D2    1) ఆస్ట్రోశాట్‌

బి) PSLV - C2    2) పూర్తి విదేశీ ఉపగ్రహాల ప్రయోగం

సి) PSLV - C4     3) మెగా ట్రాఫిక్స్‌

డి) PSLV - C18     4) మెట్‌శాట్‌ - I

ఇ) PSLV - C23     5) ఓషన్‌శాట్‌ - I

ఎఫ్‌) PSLV - C30     6) IRSP2

1) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5, ఎఫ్‌-6    2) ఎ-3, బి-2, సి-4, డి-5, ఇ-1, ఎఫ్‌-6

3) ఎ-6, బి-3, సి-2, డి-1, ఇ-4, ఎఫ్‌-5    4) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2, ఎఫ్‌-1


16. కింది వాక్యాలను పరిశీలించి సరికాని వాటిని ఎన్నుకోండి.

ఎ) మెట్‌శాట్‌-1 ఉపగ్రహాన్ని కల్పనా-1 గా పిలుస్తారు.

బి) IRS n P4 ఉపగ్రహాన్ని ఓషన్‌ శాట్‌ - 1 గా    పిలుస్తారు.

సి) PSLV - C1 వాహక నౌక ద్వారా మొత్తం విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు.

డి) ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన మొదటి PSLV వాహక నౌక PSLV - D2

1) బి    2) సి    3) బి, సి   4) ఎ, డి


17. PSLV వాహక నౌక గురించి కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) దీన్ని ఇస్రో పనిగుర్రం అని పిలుస్తారు.

బి) ఇప్పటివరకు అత్యధికంగా వినియోగించిన వాహక నౌక.

సి) ద్రవఇంధనం ఉన్న మొదటి వాహక నౌక.

డి) దీని ద్వారా 1700 కిలోల వరకు బరువున్న  ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టొచ్చు.

1) బి, సి  2) ఎ, బి  3) సి, డి  4) ఎ, బి, సి, డి


18. కింది వాక్యాలను పరిశీలించి, సరికానివి గుర్తించండి.

ఎ) ఆస్ట్రోశాట్‌ను ఆస్ట్రానమి శాటిలైట్‌ అంటారు.

బి) ఆస్ట్రోశాట్‌ అనేది మల్టీ వేవ్‌ లెన్త్‌ స్పేస్‌ అబ్జర్వేటరీ.

సి) ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహాన్ని GSLV-17D దీ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టారు.

డి) ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహం విశ్వం గురించి అధ్యయనానికి ఉపయోగపడుతుంది.

1) ఎ     2) బి    3) సి     4) డి



సమాధానాలు

1-1; 2-2; 3-3; 4-4; 5-3; 6-3; 7-4; 8-1; 9-3;  10-1; 11-3; 12-2; 13-4; 14-2; 15-4; 16-2; 17-4; 18-3.

 


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 

Posted Date : 08-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌