• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం

సంగ్రామాలతో క్షీణించిన సామ్రాజ్యవాదాలు!
 

 

 

ఆధునిక ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని వినాశనాన్ని మిగిల్చి, ఎన్నో విప్లవాత్మక మార్పులకు కారణమైన పరిణామాలే రెండు ప్రపంచయుద్ధాలు. ఆ రెండు సందర్భాల్లోనూ ఐరోపా కేంద్రంగా తలెత్తిన అలజడులు, ఆధిపత్య ధోరణులు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. తూర్పున జపాన్‌ నుంచి పశ్చిమాన అమెరికా వరకు ప్రపంచంలోని ప్రధాన, కీలక దేశాలన్నీ యుద్ధాల్లో పాల్గొని తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం పర్యవసానంగా తలెత్తిన మాంద్యం, ప్రజాస్వామ్యానికి ఆదరణ, నానాజాతి సమితి ఏర్పాటై విఫలమవడం, పారిశ్రామికీకరణ, రష్యాలో నియంతృత్వంపై తిరుగుబాటు, జర్మనీ విజృంభణ, తిరిగి ప్రపంచ యుద్ధానికి సిద్ధమైన కూటములు లాంటి పరిణామక్రమాన్ని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ప్రపంచ సంగ్రామాలతో వలసవాద, సామ్రాజ్యవాదాలు క్షీణించి అమెరికా, రష్యా లాంటి కొత్త శక్తులు ఆవిర్భవించిన తీరు, అనంతర పర్యవసానాలను అర్థం చేసుకోవాలి.


1. 20వ శతాబ్దానికి సంబంధించి కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) ప్రజల్లో ప్రజాస్వామ్య ఆకాంక్షలు చిగురుతొడగ సాగాయి.

2) విజ్ఞానశాస్త్రం కొత్త శిఖరాలను అందుకుని     పరమాణువు జీవుల రహస్యాన్ని ఛేదించింది.

3) ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలు వలస పాలన కిందే ఉన్నాయి.

4) మహిళలకు పాశ్చాత్య దేశాల్లో మొదటగా ఓటుహక్కు కల్పించారు.


2. మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ఏ దేశం, దాని మిత్రదేశాల ఓటమితో ముగిసింది?

1) జపాన్‌   2) జర్మనీ   3) రష్యా   4) ఇటలీ

 


3. ఏ శతాబ్దం ముగిసేనాటికి ఐరోపా శక్తుల మధ్య వలస ప్రాంతాల కోసం పోటీ మొదలైంది? 

1) 17వ   2) 18వ   3) 19వ    4) 20వ


4. సైనికవాదం నేపథ్యంలో ముఖ్యమైన అంశాలు ఏవి?

1) పెద్ద సంఖ్యలో శాశ్వత సైన్యాన్ని పెంచడం.

2) ఆయుధాలు సమకూర్చుకోవడంలో ఒక దేశంతో మరొకటి పోటీ పడటం.

3) తమ దేశ ప్రజలను మానసికంగా యుద్ధానికి సంసిద్ధం చేయడం.

4) పైవన్నీ.


5. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాలపై దండెత్తకుండా నానాజాతి సమితి ఏ దేశాలను నివారించలేకపోయింది?

1) జర్మనీ, ఇటలీ        2) జర్మనీ, జపాన్‌     

3) రష్యా, అమెరికా       4) జపాన్, అమెరికా


6. హిట్లర్‌ను ‘సంతృప్తిపరచడం’ అనే విధానాన్నిఇంగ్లాండ్‌ ఎందుకు అవలంభించింది?    

1) రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండేందుకు

2) జపాన్‌ దూకుడు వ్యవహారాన్ని తగ్గించేందుకు

3) ఇటలీలోని ఫాసిజంను నియంత్రించడానికి

4) రష్యాలో సంభవించిన సామ్యవాద విప్లవ వ్యాప్తిని నియంత్రించడానికి


7. ఐక్యరాజ్య సమితి ఏ సిద్ధాంతాల ఆధారంగా    ఏర్పడింది?

ఎ) శాంతిని నెలకొల్పడం

బి) మానవ హక్కులను కాపాడటం

సి) అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం

డి) సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం

1) ఎ, బి        2) ఎ, బి, సి, డి   

3) ఎ, బి, డి       4) ఎ, బి, సి


8. కిందివాటిలో 1914లో ఏది ఏర్పడింది?

1) నానాజాతి సమితి    

2) తీవ్ర ఆర్థిక మాంద్యం

3) ఐక్యరాజ్య సమితి ఏర్పాటు

4) అంతర్జాతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమ సంస్థ


9. 1917, మార్చి 8న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంలో 10 వేల మంది మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టి ఏది కావాలని కోరారు?

1) పితృభూమి గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని కోరారు.

2) మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కావాలని కోరారు.

3) సామ్యవాద వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.

4) శాంతి, రొట్టె కావాలని కోరారు.


10. ఉమ్మడి క్షేత్రాలతో చిన్న రైతుల ఉత్పత్తికి స్వస్తి పలకాలని ప్రయత్నించిన దేశం?

1) చైనా   2) రష్యా   3) అమెరికా   4) జర్మనీ


11. అమెరికాలోని సంక్షేమ వ్యవస్థకు ఒక చట్రాన్ని ఏర్పరచిన ‘సామాజిక భద్రతా విధానం’ను      ప్రవేశపెట్టినవారు?

1) రూజ్వెల్ట్‌                     2) ఉడ్రోవిల్సన్‌    

3) అబ్రహాం లింకన్‌       4) వాషింగ్టన్‌


12. ఆర్థిక మాంద్యం సమయంలో ఏ దేశంలోని   పురుషులు వీధుల్లో ‘ఏ పని చేయడానికైనా సిద్ధం’ అని రాసి ఉన్న కార్డులను మెడలో తగిలించుకుని కనిపించేేవారు?

1) రష్యా   2) ఇంగ్లాండ్‌  3) జర్మనీ  4) ఇటలీ


13. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) జపాన్‌ - డైట్‌           2) జర్మనీ - రీచ్‌ స్టాగ్‌

3) రష్యా - డ్యూమా       4) అమెరికా - గెస్టాపో


14. ఏ దేశాల ఆర్థిక పరిస్థితి కుప్పకూలడంతో వాటి ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా మార్షల్‌ ప్రణాళిక నిధులతో ముందుకొచ్చింది?

1) ఇటలీ, జర్మనీ        2) జర్మనీ, జపాన్‌    

3) జపాన్, ఇటలీ        4) ఇంగ్లాండ్, ఫ్రాన్స్


15. అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఉన్న దేశం కావాలని కోరుకున్నది ఎవరు?

1) ఉదారవాదులు       2) రాడికల్స్‌    

3) సంప్రదాయవాదులు       4) కులీనులు


16. ‘‘వ్యక్తులు సంఘాలుగా ఏర్పడి, సహకార     సంఘాలతో వస్తూత్పత్తి చేసి గడించిన లాభాలను, వారు చేసిన పని మేరకు పంచుకోవాలి.’’ అని చెప్పినవారు?

1) రాబర్ట్‌ ఓవెన్‌        2) కార్ల్‌మార్ల్స్‌    

3) లూయీ బ్లాంక్‌       4) ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌


17. లెనిన్‌ ఏప్రిల్‌ సిద్ధాంతాలు ఏవి?

1) యుద్ధాన్ని ముగింపునకు తీసుకురావడం

2) భూమిని రైతులకు పంపిణీ చేయడం

3) బ్యాంకుల్ని జాతీయం చేయడం

4) పైవన్నీ


18. రష్యాలో అంతర్యుద్ధం జరిగిన కాలం?

1) 1917-18        2) 1918-19    

3) 1919-20       4) 1918-20


19. 1929లో ఆర్థిక మాంద్యం ప్రభావం ముందుగా ఏ దేశంలో ప్రారంభమైంది?

1) రష్యా   2) అమెరికా   3) జర్మనీ   4) ఇటలీ


20. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటినీ యూదుల కుట్రగా పేర్కొన్నది ఎవరు?

1) హిట్లర్‌        2) ముస్సోలిని   

3) చర్చిల్‌       4) బిస్మార్క్‌


21. రష్యా తీవ్ర మాంద్యానికి గురికాకపోవడానికి కారణాలు?

ఎ) అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం     కాకపోవడం.

బి)ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం కలిగి ఉండటం.

సి) ఏది ఉత్పత్తి చేయాలో, ఎంత ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయించేది.

 డి)   ఏదీకాదు

1) సి    2) బి    3) ఎ, బి   4) ఎ, బి, సి


22. ఏ శతాబ్దం ఎన్నో ఆశలు, ప్రయోగాలు,      ప్రమాదకర పరిణామాల సమ్మేళనంగా మారింది?

1) 20వ   2) 19వ  3) 18వ    4) 17వ


23. ప్రపంచమంతటా విశాల వలస సామ్రాజ్యాలు స్థాపించిన దేశం?

1) అమెరికా        2) జర్మనీ   

3) ఫ్రాన్స్‌       4) ఇంగ్లాండ్‌


24. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై 1945లో అణుబాంబులు వేసిన దేశం?

1) రష్యా  2) అమెరికా  3) జర్మనీ  4) ఏదీకాదు


25. అణుబాంబులు ఉపయోగించడం వల్ల దశాబ్దాల పాటు కొనసాగే వ్యాధులు ఏవి?

1) ల్యుకేమియా       2) క్యాన్సర్‌   

3) మెదడువాపు       4) 1, 2


26. అక్ష లేదా కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశం?

1) ఇటలీ   2) ఆస్ట్రియా   3) జర్మనీ   4) టర్కీ


27. ఆర్చ్‌ డ్యూక్‌ ఫ్రాంజ్‌ ఫెర్డినాండ్‌ హత్య ఏ  యుద్ధానికి తక్షణ కారణమైంది?

1) మొదటి ప్రపంచ యుద్ధం    

2) రెండో ప్రపంచ యుద్ధం

3) ప్రచ్ఛన్న యుద్ధం       

4) పశ్చిమాసియా యుద్ధం


28. సెర్బియాపై ఏ దేశం యుద్ధం ప్రకటించడంతో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది?

1) జర్మనీ  2) ఇటలీ  3) ఆస్ట్రియా  4) అమెరికా


29. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మిత్ర దేశాలు ఏ దేశంతో వర్సయిల్స్‌ ఒప్పందం చేసుకున్నాయి?

    1) ఇటలీ   2) జర్మనీ   3) ఆస్ట్రియా   4) టర్కీ


30. 1871లో ఫ్రాన్స్‌ నుంచి జర్మనీ స్వాధీనం  చేసుకున్న ప్రాంతాలేవి?

1) ఆల్వాస్‌  2) లోరైన్‌   3) 1, 2  4) ఏదీకాదు


31. వర్సయిల్స్‌ శాంతి సమావేశానికి ఆహ్వానం  లభించని దేశాలు ఏవి?

1) రష్యా                        2) జర్మనీ   

3) ఆస్ట్రియా, టర్కీ       4) పైవన్నీ


32. నానాజాతి సమితి ఏర్పాటులో కీలక పాత్ర   పోషించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు?

1) ఉడ్రో విల్సన్‌        2) రూజ్వెల్ట్‌

3) థామస్‌ మన్రో       4) మార్షల్‌


33. ‘వర్సయిల్స్‌ ఒప్పందం తమపై విధించిన     షరతులు తమను బానిసత్వంలోకి నెడుతున్నాయి’ అని ఏ దేశస్థులు భావించారు?

1) రష్యా   2 ఇటలీ   3 జర్మనీ   4 ఆస్ట్రియా


34. రష్యాలో ఏ సంవత్సరంలో విప్లవం సంభవించి కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడింది?

1) 1905   2)  1917   3)  1919   4)  1920


35. ఇంగ్లాండ్‌లో మహిళలకు ఏ సంవత్సరంలో ఓటు హక్కు లభించింది?

1)  1918   2)  1919   3)  1920   4) 1922


36. ప్రపంచ యుద్ధాలకు ముందు అత్యంత  శక్తిమంతంగా ఉండి, ఆ తర్వాత ద్వితీయ శ్రేణికి పడిపోయిన దేశం?

1)  జర్మనీ  2)  రష్యా  3)  ఇంగ్లాండ్‌  4)  అమెరికా


37. ‘మెయిన్‌కాంఫ్‌’ అనే గ్రంథాన్ని రచించింది?

1)  హెర్బర్డ్‌ స్పెన్సర్‌        2)  చార్లెస్‌ డార్విన్‌

3)  అడాల్ఫ్‌ హిట్లర్‌       4)  గోబెల్స్‌


38. పాఠశాల పిల్లలకు సంబంధించి నాజీ భావజాలం ఏమిటి?

1)  పిల్లలకు విద్య అవసరం లేదని వారు నమ్మారు.

2)  పాఠశాల లోపల, వెలుపల పిల్లలపై నియంత్రణ ఉంచాలి.

3)  పిల్లలందరినీ సమానంగా పరిగణించాలి.

4)  పిల్లలందరినీ సమానంగా చూడరాదు.


39. కిందివాటిలో యూదుల పట్ల నాజీల ద్వేషానికి కారణం-

1)  యూదుల్ని క్రీస్తు హంతకులుగా పరిగణించారు.

2)  వారు వడ్డీ వ్యాపారులు.

3)  యూదులు ఎప్పుడూ నాజీలను మోసం చేశారు.

4)  1, 2


40. ఏ సంఘటన యూఎస్‌ఏను రెండో ప్రపంచ   యుద్ధంలో పాల్గొనేలా చేసింది?

1)  తూర్పు ఐరోపాపై హిట్లర్‌ దాడి

2)  యూదుల మారణహోమానికి సంబంధించిన హిట్లర్‌ విధానం

3)  ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల నిస్సహాయత

4)  పెర్ల్‌ హార్బర్‌ వద్ద యూఎస్‌   స్థావరంపై జపాన్‌ దాడి

సమాధానాలు
1-3; 2-2; 3-3; 4-4; 5-1; 6-4; 7-2; 8-4; 9-4; 10-2; 11-1; 12-3; 13-4; 14-2; 15-2; 16-3; 17-4; 18-4; 19-2; 20-1; 21-4; 22-1; 23-4; 24-2; 25-4; 26-3; 27-1; 28-3; 29-2; 30-3; 31-4; 32-1; 33-3; 34-2; 35-1; 36-3; 37-3; 38-2; 39-4; 40-4.

 

 

 

 

రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 

 

Posted Date : 26-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు