• facebook
  • whatsapp
  • telegram

వాయు, జల కాలుష్యాలు

‘కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి!’

 

 


సమస్త జీవులకు గాలి, నీరు ప్రాణాధారం. అవి స్వచ్ఛంగా ఉంటేనే జీవరాశులన్నీ ప్రశాంతంగా, ఆరోగ్యంగా మనగలుగుతాయి. అభివృద్ధి పరిణామ క్రమంలో మానవుడి చర్యలతో పీల్చే గాలి, తాగే నీరు కలుషితమవుతున్నాయి. నదులు, సరస్సులు వంటి ప్రధాన నీటివనరుల్లో వ్యర్థాలు, విష లోహాలు పేరుకుపోతున్నాయి. పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతో పట్టణ ప్రాంతాలు, పారిశ్రామికవాడల్లో గాలి విషతుల్యంగా మారింది. ఈ కాలుష్యాల్లో రకాలు, వాటి ప్రభావాలు, వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై పరీక్షార్థులకు తగిన పరిజ్ఞానం ఉండాలి. కాలుష్యాలకు కారణమయ్యే లోహాలు, వాయువులు, అవి వెలువడే ప్రక్రియలు, దేశంలో కాలుష్య స్థాయిని నిర్ధారించే ప్రమాణాలు, సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

 

కాలుష్యం అనే పదాన్ని ఇంగ్లిష్‌లో పొల్యూషన్‌ అంటారు. ‘పొల్యుటోనియం’ అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. లాటిన్‌లో దీని అర్థం ‘అపరిశుభ్రత’. ‘‘ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉన్న కొన్ని అవాంఛనీయ పదార్థాలు గాలిలోకి పరిమితికి మించి చేరినప్పుడు అవి వాతావరణ సంఘటనంలో మార్పు తీసుకురావడం వల్ల జీవులు, వాటి పరిసరాలకు హాని కలిగించే స్థితే వాయు కాలుష్యం’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. ‘‘ఏవైనా అవాంఛనీయ     పదార్థాలు నీటితో కలిసి ఆ నీటిని భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన మార్పులకు గురిచేసి, తాగడానికి వీల్లేని స్థితికి చేర్చడమే జలకాలుష్యం’’గా పేర్కొంది.

భారతీయ ప్రమాణాల సంస్థ ప్రకారం తాగునీటికి కింది నాణ్యతా ప్రమాణాలు ఉండాలి.


1. రంగు, రుచి, వాసన లాంటి లక్షణాలు ఉండరాదు.

2. నీటి pH 6.0 - 9.0 మధ్య ఉండాలి.

3. కరిగి ఉన్న O2 కనీసం 3 ppm ఉండాలి.


1.    దిల్లీలో వాయు కాలుష్యానికి కిందివాటిలో ఏది ఎక్కువ కారణం?

1) రాజస్థాన్‌లో పంట కోశాక మోళ్లను (గడ్డి మోపులు) తగలబెట్టడం    2) పంజాబ్‌లో పంట కోశాక మోళ్లను తగలబెట్టడం

3) పంజాబ్‌లో వంట చెరకు వాడకం  4) రాజస్థాన్‌లో వంట చెరకు వాడకం


2.     కిందివాటిలో ‘హైపాక్సియా’ అంటే ఏది?

1) నీటిలో లేదా గాలిలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆమ్లజని పెరగడం.

2) మహాసముద్రాల్లో కరిగి ఉన్న ఆమ్లజనిలో     పెరుగుదల

3) వాతావరణం పైపొరల్లో ఓజోన్‌గా మారడం వల్ల ఆమ్లజనిలో తగ్గుదల

4) నీటిలో లేదా గాలిలో ఆమ్లజని బాగా తగ్గితే ప్రాణవాయువును పీల్చే జీవాల ఉనికికి ముప్పు     ఏర్పడటం


3.     ‘పట్టణ ఉష్ణ ద్వీపం’ అంటే ఏమిటి?

1) చలికాలంలో కృత్రిమ ఉష్ణం ద్వారా ఉంచిన ఒక పట్టణం

2) నిరాశ్రితుల కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన  ఉష్ణీకరణ వ్యవస్థ ఉన్న కృత్రిమ ద్వీపం

3) పట్టణంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక  ఉష్ణోగ్రత అనుభూతి చెందుతున్న ఒక ప్రాంతం

4) చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల కంటే అధిక  ఉష్ణోగ్రతను అనుభూతి చెందుతున్న ఒక ప్రాంతం


4.     వాయునాణ్యత కొలిచేందుకు జాతీయ వాయునాణ్యతా సూచీలో ఎన్ని కలుషిత పదార్థాలను పరిశీలిస్తారు?

1) 3      2) 5     3) 7      4) 8


5.     భారత్‌లోని ఒక ప్రదేశంలో వాయునాణ్యతా సూచీ 100 ఉంటే అక్కడ వాయునాణ్యత ఎలా ఉన్నట్లు?

1) బాగుంది     2) సంతృప్తికరం 

3) ఒక మోస్తరుగా ఉంది     4) బాగాలేదు


6.     కప్పడం వల్ల ఉపయోగం ఏమిటి?

1) పనివారు స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా ఉంటుంది    2) శీతాకాలంలో వేడిని కాపాడుతుంది

3) నేలలో తడి ఆరిపోకుండా చూస్తుంది   4) దొంగలు పంటను పట్టుకుపోకుండా కాపాడుతుంది


7.    ఎక్కువ జీవ ఆమ్లజని డిమాండ్‌ దేన్ని సూచిస్తుంది?

1) ఎక్కువ స్థాయిలో సూక్ష్మజైవిక కాలుష్యం    2) తక్కువ స్థాయిలో సూక్ష్మజైవిక కాలుష్యం

3) సూక్ష్మజైవిక కాలుష్యం లేకపోవడం    4) నీరు పూర్తిగా పరిశుభ్రంగా ఉండటం


8. ‘కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి’ అనే సూత్రం ప్రకారం-

1) కాలుష్య కారకులకు జైలు శిక్ష వేస్తారు.

2) అన్ని పరిశ్రమల నుంచి కాలుష్య పన్ను వసూలు చేస్తారు.

3) ప్రభుత్వమే అతిపెద్ద కాలుష్య కారకం కాబట్టి, కాలుష్య పరిహార నిధిని ఏర్పాటు చేస్తుంది. 

4) వాతావరణానికి కారకులు చేసిన నష్టానికి పరిహారం, కాలుష్య నివారణ చర్యలకు అయ్యే మొత్తం వారి నుంచే వసూలు చేస్తారు.


9.     కిందివాటిలో నదులు, సరస్సుల్లో సేంద్రియ కాలుష్యాన్ని కొలిచే సూచికల్లో కీలకమైంది?

1) గుర్రపు డెక్క         2) జీవరసాయన ఆమ్లజని డిమాండ్‌

3) కరిగిన పదార్థాల మొత్తం      4) pH విలువ


10. కిందివాటిలో భారత్‌లో సెల్‌ టవర్ల వికిరణం వల్ల బాగా ప్రభావితమైన పక్షి ఏది?

1) చిలుక   2) పావురం   3) కాకి   4) పిచ్చుక


11. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కార్బన్‌ డయాక్సైడ్‌ను వెలువరిస్తున్న దేశం ఏది?

1) అమెరికా   2) జపాన్‌   3) చైనా   4) ఇండియా


12. అడవులు నరకడాన్ని నిషేధించిన మొదటి దేశం ఏది? 

1) నార్వే  2) డెన్మార్క్‌  3) స్వీడన్‌  4) ఫిన్లాండ్‌


13. ప్రతిపాదన (ఎ): వ్యవసాయ నిపుణుల అంచనా ప్రకారం భారతదేశం ఏటా 5 బిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ నేలను నేలకోతరూపంలో కోల్పోతోంది.

కారణం (ఆర్‌): నేలకోతను అరికట్టడానికి ఆదివాసీలు ‘పోడు’ వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పించాలి.

1) ఎ, ఆర్‌ రెండూ ఒప్పు, ఎ కి ఆర్‌ సరైన వివరణ.

2) ఎ, ఆర్‌ రెండూ ఒప్పు కానీ, ఎకి ఆర్‌ సరైన వివరణ కాదు.

3) ఎ ఒప్పు, కానీ ఆర్‌ తప్పు.   4) ఎ తప్పు, కానీ ఆర్‌ ఒప్పు.


14. ‘కేటలైటిక్‌ కన్వర్టర్‌’ ఉపకరణాన్ని దేనిలో ఉపయోగిస్తారు?

1) పాలిమర్‌ తయారీ కేంద్రం     2) న్యూక్లియర్‌ రియాక్టర్‌ 

3) ఆటోమొబైల్‌ ఎగ్జాస్ట్‌ యూనిట్‌-1     4) నీటిశుద్ధి ప్లాంట్‌ 


15. అన్నిరకాల వాయు కాలుష్యానికి ప్రధాన కారణం?

1) ఆంత్రో పొజెనిక్‌ యాక్టివిటీ   2) లోపభూయిష్ట సాంకేతికత 

3) కంబశ్చన్‌     4) పారిశ్రామిక వృద్ధి


16. ‘బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌’ దీన్ని కొలవగలదు-

1) పారిశ్రామిక కాలుష్యం     2) వాయు కాలుష్యం 

3) అకర్బన కాలుష్యం

4) సేంద్రియ వ్యర్థ్యాలను డీకంపోజ్‌ చేసే సూక్ష్మజీవులకు కావాల్సిన కరిగి ఉన్న O2


17. కింద పేర్కొన్న వాటిలో ఏది మహా నగరాల్లో వాయు కాలుష్యానికి కారణమవుతోంది?

1) కాడ్మియం     2) క్రోమియం 

3) లెడ్‌     4) కాపర్‌


18. నీటిలో ఆల్గే వృద్ధి చెందడానికి కారణం?

1) నీటిలో పెద్ద మొత్తంలో క్లోరైడ్స్‌ ఉండటం.

2) నీటిలో పెద్ద మొత్తంలో COD ఉండటం.

3) నీటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉండటం.

4) నీటిలో పెద్ద మొత్తంలో BOD ఉండటం.


19. మానవులకు ఆస్తమా దేనివల్ల వస్తుంది?

1) నీటి కాలుష్యం     2) అధిక ఆహారం

3) నేల కాలుష్యం     4) గాలి కాలుష్యం


20. ‘ఇటాయ్‌ ఇటాయ్‌’ అనే వ్యాధి  దేనివల్ల వస్తుంది?

1) కార్బన్‌     2) మాంగనీస్‌ 

3) కాడ్మియం     4) ఏదీకాదు


21. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) స్నో బ్లైండ్‌నెస్‌ - పరారుణ కిరణాలు     2) హరితగృహ ప్రభావం - మీథేన్‌

3) ఓజోన్‌ క్షీణత - క్లోరోఫ్లోరో కార్బన్‌లు    4) జీవ వృద్ధీకరణ - బెంజిన్‌ హెక్సాక్లోరైడ్‌


22. కిందివాటిలో ఏది మానవ శరీరాల నుంచి గంగానది నీటిలో చేరే ప్రధాన కాలుష్యం?

1) హైడ్రా 2) అమీబా 3) రోటా వైరస్‌ 4) కోలిఫార్మ్‌


23. పర్యావరణాన్ని రక్షించగలిగిన మూడు R లు (ఆంగ్లభాష పదాల్లో) ఏవి?

1) రివర్స్, రీసైకిల్, రెన్యూ     2) రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్‌

3) రీసైకిల్, రెన్యూ, రీయూజ్‌     4) రీజనరేట్, రీసైకిల్, రెస్టిట్యూట్‌


24. యూట్రోఫిక్‌ నీటికుంటల్లో విరివిగా పెరిగే ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక నీటి కలుపుమొక్క ఏది?

1) వాటర్‌ హైసింత్‌     2) వాటర్‌ లిల్లీ 

3) డక్‌వీడ్‌     4) వాటర్‌ లెట్యూస్‌ 


25. బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. దాన్ని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలువడే వాయువులు..

ఎ) బొగ్గుపులుసు వాయువు     బి) సల్ఫర్‌ డయాక్సైడ్‌ 

సి) నైట్రోజన్‌ ఆక్సైడ్‌        డి) మీథేన్‌ 

1) ఎ, డి     2) ఎ, బి, సి, డి          3) ఎ, బి, సి     4) ఎ, సి, డి 


26. కార్బన్‌ మోనాక్సైడ్‌కి సంబంధించి కింద పేర్కొన్న వాటిలో సరైంది ఏది?

ఎ) మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది

బి) సికిల్‌సెల్‌ ఎనీమియాకు చికిత్స చేసేందుకు   సహాయపడుతుంది

సి) న్యూరోట్రాన్స్‌మీటర్‌లా పనిచేస్తుంది

1) ఎ, బి, సి   2) ఎ మాత్రమే

3) ఎ, సి     4) సి మాత్రమే


27. బయలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ దేనిని సూచిస్తుంది? 

1) ఎక్కువ స్థాయి సూక్ష్మజీవుల కాలుష్యాన్ని

2) తక్కువ స్థాయి సూక్ష్మజీవుల కాలుష్యాన్ని

3) ఎలాంటి కాలుష్యం లేకపోవడం

4) నీరు అతి స్వచ్ఛమైంది


28. కిందివాటిలో 3 ప్రధాన కాలుష్య రకాలు (రూపాలు) ఏవి? 

ఎ) వాయు కాలుష్యం     బి) నీటి కాలుష్యం 

సి) ధ్వని కాలుష్యం     డి) ధరిత్రి కాలుష్యం

1) ఎ, బి, సి      2) బి, సి, డి 

3) సి, డి, ఎ     4) డి, ఎ, బి


29. కిందివాటిలో ఏ కలుషితాలు ఉంటే మున్సిపల్‌ సీవేజ్‌ స్లడ్జ్‌ ఎరువుగా పనికిరాదని నిర్ణయించవచ్చు?

1) నైట్రేట్స్‌         2) ఫాస్ఫేట్స్‌ 

3) భారీ లోహాలు         4) అమ్మోనియా


30. శబ్దకాలుష్యం ప్రకారం, మానవుడి చెవిలో నొప్పి  కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు ఎంత?

1) 40 డీబి 2) 80 డీబి 3) 100 డీబి 4) 120 డీబి 


31. కిందివాటిని జతపరచండి.

జాబితా-1 జాబితా-2
ఎ) CO2 1) భవనాలు, చారిత్రక కట్టడాలు త్వరగా శిథిలమవడం.
బి) SO2 2) ఆకులపై కణజాల క్షయ మచ్చలు ఏర్పడటం
సి) NO 3) తలనొప్పి, మసకబారిన దృష్టి
డి) CO 4) హరితగృహ ప్రభావం

1) ఎ-2, బి-1, సి-4, డి-3      2) ఎ-2, బి-4, సి-3, డి-1 

3) ఎ-4, బి-2, సి-3, డి-1      4) ఎ-4, బి-1, సి-2, డి-332. కిందివాటిని జతపరచండి.

జాబితా - 1 జాబితా - 2
ఎ) మీథేన్‌ 1) నాక్‌-సీ-సిండ్రోమ్‌ 
బి) ఫాస్ఫేట్‌లు 2) గ్లోబల్‌ వార్మింగ్‌ 
సి) ప్రియాన్‌లు 3) సరస్సుల్లో మంజరి ఏర్పడటం
డి) ఫ్లోరైడ్‌లు 4) డౌన్‌ సిండ్రోమ్‌ 
  5) ఓజోన్‌ తగ్గుదల

1) ఎ-4, బి-3, సి-5, డి-2      2) ఎ-2, బి-3, సి-5, డి-1 

3) ఎ-2, బి-3, సి-5, డి-4     4) ఎ-5, బి-2, సి-4, డి-1సమాధానాలు

1-2, 2-4, 3-4, 4-4, 5-2, 6-3, 7-1, 8-4, 9-2, 10-4, 11-3, 12-1, 13-3, 14-3, 15-3, 16-4, 17-3, 18-3, 19-4, 20-3, 21-1, 22-4, 23-2, 24-1, 25-3, 26-1, 27-1, 28-4, 29-3, 30-4, 31-4, 32-2.


రచయిత: ఇ.వేణుగోపాల్‌

Posted Date : 26-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌