• facebook
  • whatsapp
  • telegram

జంతు ప్రపంచం

* జంతువులను గురించి అధ్యయనం చేసే జీవశాస్త్ర శాఖ జంతుశాస్త్రం (Zoology).
*  జంతుశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్.
*  జంతువులను పృష్ట వంశం (వెన్నెముక) ఉండటం, లేకపోవడం ఆధారంగా చేసుకుని రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు. 1) అకసేరుకాలు (New Chordates): 2) సకసేరుకాలు (Chordata)..అకసేరుకాలు: ఇవి వెన్నెముక లేని జీవులు. వీటిని సుమారు 9 వర్గాలుగా విభజించారు.
సకసేరుకాలు వీటిలో వెన్నెముక అనే నిర్మాణం ఉంటుంది. వీటిని 5 వర్గాలుగా వర్గీకరించారు.

 

ప్రోటోజోవా
* ఇవి పురాతనమైన, సరళమైన శరీర నిర్మాణం ఉన్న జీవులు.

* వీటి అధ్యయన శాస్త్రం ప్రోటోజువాలజీ. ప్రోటోజోవా అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త గోల్డ్‌ఫస్.
* ఈ జీవుల చలనాంగాలు ప్రధానంగా మిథ్యాపాదం, శైలికలు, కశాభాలు.
* ఈ వర్గానికి చెందిన ఆకారంలేని, మిథ్యాపాదాలు చలనాంగంగా ఉన్న జీవి అమీబా.
* అమీబాలో శ్వాసక్రియ విసరణ ద్వారా జరుగుతుంది.
* యూగ్లీనాలో క్రొమటోఫోర్‌లు ఉండటం వల్ల ఇది కిరణజన్య సంయోగ క్రియను జరుపుకోగలదు. దీనిలో చలనాంగాలు కశాభాలు.
* స్లిస్పర్ (పాదరక్షలు) ఆకారంలో ఉండే ప్రోటోజోవన్ పేరు పారామీసియం.(Slipper animalcule) దీని చలనాంగాలు శైలికలు.
* ఈ వర్గంలో వివిధ వ్యాధులను కలుగజేసే పరాన్నజీవులు కూడా ఉంటాయి.
ఉదాహరణలు:
i) ప్లాస్మోడియం పాల్సీపారమ్ - మలేరియా జ్వరం
ii) ఎంటమిబా జింజివాలిస్ - పయేరియా
iii) ట్రైకోమోనాస్ వజైనాలిస్ - ట్రైకోమోనియాసిస్
iv) ట్రిపనో సోమాక్రూజై - చాగాస్ వ్యాధి
v) ట్రిసనోసోమా గాంబియన్సి - అతి నిద్ర వ్యాధి

 

పొరిఫెరా
* శరీరంపై రంధ్రాలు ఉండే జీవులను పొరిఫెరాలో చేర్చారు.

* ఈ జీవుల శరీరంపై ఉన్న రంధ్రాలకు ఆస్కులం (Osulum) అని పేరు.
* వీటిని సాధారణంగా స్పంజికలు అని పిలుస్తారు.
* జంతు రాజ్యంలో మొదటి బహుకణ నిర్మిత శరీర దేహం ఉన్న జీవులుగా వీటిని చెప్పవచ్చు.
* పొరిఫెరా అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త రాబర్ట్ఇగ్రాంట్.
* ఈ జీవులకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని పారాజువాలజీ అంటారు.
* ఈ జీవులు ప్రధానంగా జలచర జీవులు. సాధారణంగా స్థాన బద్ధజీవులు.
* వీటి శరీరం లోపల కాలువ లాంటి కుల్యావ్యవస్థ (Canal System) ఉంటుంది.
* వీటి శరీరం కాల్షియం కార్బొనేట్ (CaCO3) లేదా సిలికాన్ డైయాక్సైడ్ (SiO2) తో ఏర్పడుతుంది.
ఉదాహరణలు:
i) యూస్పాంజియా (Bathroom Sponge) సాధారణంగా స్నానపు గదుల్లో ఉపయోగిస్తారు.
ii) యూప్లక్టెల్లా (Venus flowerbasket) దీన్ని జపాన్‌లో పెళ్లి కానుకగా ఉపయోగిస్తారు.
iii) క్లయోనా (Boring Sponge) ముత్యపు చిప్పలకు రంధ్రం చేస్తుంది.
iv) కాలినా - Deadman's finger

 

సిలెంటెరేటా (నిడేరియా)
* సిలెంటెరాన్ అనే ఖాళీ శరీర కుహరం ఉండే జీవులు సిలెంటిరేటా జీవులు.

* ఇవి సౌష్టవయుతమైన శరీరం ఉండి, కణజాల స్థాయి వరకూ అభివృద్ధి చెందివున్న శరీర నిర్మాణం ఉంటుంది.
* ఈ జీవులు కణాంతర లేదా కణబాహ్య జీర్ణక్రియను జరుపుకుంటాయి.
* ఇవి బహురూపకతను (Polymorphism) ప్రదర్శిస్తాయి.
* వీటిలో ఆత్మరక్షణకు, ఆహార సేకరణకు సహకరించే దంశ కణాలు ఉంటాయి. (Cridoblast Cells)
* ల్యూకార్ట్ అనే శాస్త్రవేత్త సీలెంటెరేటా అనే పదాన్ని ప్రతిపాదించాడు.
ఉదాహరణలు:
i) పెన్నాట్యులా - సీసెన్
ii) గార్గోనియా - సీఫేన్
iii) కొరాలియం - రెడ్ కోరల్
iv) హిలియోపొరా - బ్లూకోరల్
v) ఏంటీపేథస్ - బ్లాక్‌కోరల్
vi) ఆరేలియా - జెల్లీఫిష్
vii) ట్యూబీపొరా - ఆరెంజ్ పైప్ కోరల్
* సిలెంటెరేటా జీవుల కర్పరాలు (ప్రవాళాలు) ప్రవాళభిత్తికలుగా ఏర్పడతాయి. ప్రపంచంలో అధిక వైవిధ్యం ఉన్న ప్రవాళాలు ఉన్న ప్రదేశం పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజి దీవులు. అతిపెద్ద ప్రవాళభిత్తిక ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్. మన దేశంలో అత్యంత వైవిధ్య భరితమైన ప్రవాళాలు నికోబార్ దీవుల్లో ఉన్నాయి.

 

ప్లాటిహెల్మింథిస్
* వీటి శరీర పృష్ట ఉదర భాగాలు బల్లపరుపుగా ఉండటం వల్ల వీటిని బల్లపురుగులు అంటారు.

* ఇది త్రిస్తరిత (Triploblastic), శరీర కుహర రహిత జీవులు. అవయవాలు  మొదటగా జంతురాజ్యంలో ప్రదర్శించిన జీవాలను వీటిలో చేర్చారు.
* వీటి విసర్జక అవయవాలు జ్వాలా కణాలు.
* వీటిలో చాలా జీవాలు పరాన్నజీవనాన్ని గడిపేవిగానే ఉంటాయి.
ఉదాహరణలు:
i) టీనియా సాజినేటా - బీఫ్ టేప్‌వామ్
ii) టీనియా సోలియం - ఫోర్క్ టేప్‌వామ్
iii) ఫేసియోలా హెపాటికా - లివర్ ఫ్లూక్
iv) షిస్టోసోమా హిమటోబియం - బ్లడ్‌ఫ్లూక్

 

నిమాటె హెల్మింథిస్
* గుండ్రని, దారాల లాంటి శరీర నిర్మాణం ఉండటం వల్ల వీటిని దారపు పురుగులు లేదా గుండ్రటి పురుగులు అని పిలుస్తారు.

* శరీరం పొడవుగా, స్తూపాకారంగా ఉంటూ మిథ్యా శరీర కుహురంతో ఉంటాయి.
* సుమారు ఈ వర్గపు జీవులన్నీ పరాన్నజీవులే.
ఉదాహరణలు:
i) ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ (ఏలికపాము, గుండ్రటిపాము) - రక్తహీనత వస్తుంది.
ii) ఉకరేరియా బాంక్రాఫ్టి (సైవేరియావామ్) - బోదకాలు వస్తుంది.

 

ఆర్థ్రోపొడా
* కీళ్లతో కూడిన ఉపాంగాలు లేదా అతుకులు ఉన్న కాళ్లు ఉండే జీవులను ఈ వర్గంలో చేర్చారు.

* వాన్‌సీబోల్డ్ అనే శాస్త్రవేత్త ఆర్థ్రోపొడా అనే పదాన్ని ప్రతిపాదించాడు.
* ఈ జీవులు జంతురాజ్యంలో అత్యధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి దీన్ని జంతురాజ్యంలో అతి పెద్ద వర్గంగా చెప్పవచ్చు.
* వీటిలో నిజశరీర కుహరం లోపించి, దాని స్థానంలో రక్త కుహరం ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తనాళాలు ఉండవు. కోటరాలు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి.
* ఈ జీవుల దేహం ఖైటిన్ (Chitin) నిర్మిత తొడుగుతో ఆవరించి ఉంటుంది.
ఉదాహరణలు:
i) కీటకాలు (వీటి అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటారు)
ii) తేనెటీగలు (వీటి పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు)
iii) రాక్ తేనెటీగ (ఎపిస్ డార్సీటా)
iv) ఇండియన్ తేనెటీగ (ఎపిస్ ఇండిక)
v) లక్కపురుగు (లాక్సిఫర్ లక్క)

 

మొలస్కా
* శరం ఉండే జీవులను మొలస్కా వర్గంలో చేర్చారు. 
* మొలస్కా జీవుల అధ్యయన శాస్త్రాన్ని మొలకాలజీ  అంటారు.

* వీటి శరీరాన్ని ఆవరిస్తూ కాల్షియం కార్బొనేట్‌తో ఏర్పర్చిన కర్పరం ఉంటుంది.
* ఈ జీవుల కర్పరాలను గురించిన అధ్యయన శాస్త్రాన్ని కాంకాలజీ అంటారు.
* జంతురాజ్యంలో ఈ జీవులను రెండో అతిపెద్ద వర్గంగా చెప్పవచ్చు.
ఉదాహరణలు:
i) నత్త: దీని రక్తం నీలి రంగులో ఉంటుంది. ఆహార పదార్థాలను ముక్కలు చేయడానికి సహకరించే రాడ్యులా అనే ప్రత్యేక నిర్మాణం ఉంటుంది.
ii) ముత్యపు చిప్ప: (పింక్పడా వల్గారిస్) వీటిలో ముత్యాలు ఏర్పడతాయి. ముత్యంతో ఉండే ప్రధాన రసాయనాలు కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్. ముత్యం మెరవడానికి కారణం నెక్రియస్ అనే పొర.
iii) ఆక్టోపస్: (డెవిల్ ఫిష్) దీంట్లో కర్పరం ఉండదు.

 

ఎకైనోడర్మేటా
* ఇవి శరీరం అంతా ముళ్ల లాంటి నిర్మాణాలతో ఉంటాయి.

* ఇవి కేవలం సముద్రపు ఆవాసాలకు మాత్రమే పరిమితం అవుతాయి.
* జల ప్రసరణ వ్యవస్థ (Water vascular system) ఉండే జంతువర్గం ఇది.
* ఈ జీవులకు తెగిన అవయవాలను తిరిగి పొందేశక్తి (పునరుత్పత్తి శక్తి) ఉంటుంది.
ఉదాహరణలు:
i) సముద్రపు నక్షత్రాలు - ఆస్టరాయిడియా జీవులు
ii) బ్రిటిల్ స్టార్స్ - ఒఫియురాయిడియా జీవులు
iii) సముద్రపు దోసకాయలు - హాలోధురాయిడియా జీవులు.

 

చేపలు
* చేపలకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని ఇక్తియాలజీ అంటారు.

* చేపలు సకసేరుకాల్లో అతిపెద్ద సమూహం.
* చేపల స్వర్ణయుగాన్ని డెనోనియన్ యుగం అంటారు.
* చేపల శ్వాసక్రియను మొప్పల ద్వారా జరుపుకుంటాయి. అయితే డిప్నాయ్ రకానికి చెందిన చేపల్లో శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది.
* చేపల హృదయంలో కర్ణిక, జఠరిక అనే రెండు గదులు ఉంటాయి.
* అస్థిపంజరం ఆధారంగా చేపలు రెండు రకాలు. మృదులాస్థి చేపలు (సొరచేప), అస్థి చేపలు (కొరమీను, కేట్‌ఫిష్).
* సముద్రపు నీటి నుంచి మంచినీటికి వలస వెళ్లే చేపలను అనాండ్రోమస్ చేపలు అంటారు (షార్క్, సొరచేప)
* మంచి నీటి నుంచి సముద్రపు నీటికి వలసలు వెళ్లే చేపలను కెటాండ్రోమస్ చేపలు అంటారు (ఈల్‌చేప).
* చేపల పొలుసుల్లో డెంటయిన్‌ను పోలి ఉండే కాస్మిన్ (Cosmine) అనే పదార్థం ఉంటుంది.
* చేపలు బాహ్య ఫలదీకరణాన్ని చూపించే జీవులు.
* చేపలు సాధారణంగా అమ్మోనియా పదార్థాన్ని విసర్జిస్తుంటాయి.
* సొరచేపలో మాత్రం యూరియా విసర్జన పదార్థంగా ఉంటుంది.
* చేపల్లో ప్రమాదకరమైన షార్క్‌చేప శిశోత్పాదకతను ప్రదర్శిస్తుంది.
* మురుగునీటి కుంటల్లో దోమల గుడ్లను, లార్వాను తిని దోమల జనాభాను నియంత్రించే జీవ నియంత్రణా సామర్థ్యం ఉన్న చేప గాంబూసియా.
* పొలుసులు లేని చేప క్యాట్‌ఫిష్. ఆఫ్రికన్ కేట్‌ఫిష్ పెంపకాన్ని మన దేశం నిషేధించింది. దీని ఉనికి దేశీయంగా ఉన్నప్పటికీ చాలా చేపల మనుగడకు హానికరంగా పరిణమిస్తుంది.

 

ఉభయచరాలు
* నీటిలోనూ, నేలపైనా రెండు ఆవాసాల్లోనూ జీవించే వాటిని ఉభయచరాలుగా వర్గీకరించారు.

* వీటి అధ్యయాన్ని హెర్పటాలజీ అని అంటారు.
* ఇవి చతుష్పాదక శీతల రక్తజీవులు.
* ఈ జీవులు సాధారణంగా రూప విక్రయాన్ని ప్రదర్శిస్తాయి.
* చర్మ శ్వాసక్రియ, ద్వితీయ శ్వాసక్రియ విధానంగా పుపుస శ్వాసక్రియ ప్రధానంగా ఉంటుంది. అయితే సాలమండర్‌లు, చిన్న కప్పల్లో ఊపిరితిత్తులు లోపించి ఉంటాయి.
ఉదాహరణలు:
i) కప్పలు: దీని అధ్యయన శాస్త్రాన్ని బాట్రకాలజీ అంటారు. బాహ్య ఫలదీకరణం జరుపుకుంటాయి. కప్ప లార్వాని టాడ్‌పోల్ అంటారు. కప్ప గుడ్లను స్పాన్  శుక్రకణ సమూహాన్ని మిల్ట్  అంటారు. ఆంప్లెక్సరీ మెత్తలు అనే ప్రత్యేక నిర్మాణాలు మగకప్పల్లో ఉంటాయి. కప్పల హృదయం మూడు గదులతో (2 కర్ణికలు, ఒక జఠరిక) నిర్మితమై ఉంటుంది.
ii) సాలమండర్స్: వీటి పూర్వాంగాలు, చరమాంగాలు సమానంగా ఉంటాయి. నీయోటానీని చూపే వీటి లార్వా పేరు ఆక్సోలోటల్. ఇండియన్ సాలమండర్ టైలటోట్రిటన్. సాలమండర్స్ ఎక్కువగా ఉత్తర అమెరికాలో విస్తరించి ఉంటాయి.
iii) సిసీలియన్లు: ఇవి చలనాంగాలు లేని అంధజీవులు . ప్రధానంగా బొరియల్లో ఆవాసముంటాయి. ఇక్తియోఫిస్, గెగెనోఫిస్ లాంటి వాటిని వీటిలో చేర్చారు.

 

సరీసృపాలు
* పాకే జంతువులను సరీసృపాల వర్గంలో చేర్చారు.

* వీటి అధ్యయన శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారు.
* సరీసృపాలు శీతల రక్తజీవులు, వీటి హృదయంలో మూడు గదులు ఉంటాయి (2 కర్ణికలు, 1 జఠరిక). మొసలిలో మాత్రం అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న నాలుగు గదుల హృదయం కనిపిస్తుంది.
* మిసోజోయిక్ యుగాన్ని వీటి స్వర్ణ యుగంగా పేర్కొంటారు. ఇవి అస్థిరోష్ణజీవులు.
ఉదాహరణలు: సర్పాలు: వీటి అధ్యయన శాస్త్రాన్ని సర్పెంటాలజీ లేదా ఒఫియోలజీ అంటారు. విషరహిత సర్పాలు కరిచినప్పుడు అనేక గాట్లుపడి 'U' ఆకారంలో కనిపిస్తుంది. కొండచిలువ, పసరిక పాము, జెర్రిపాము మొదలైనవి వీటికి ఉదాహరణలు. విషసర్పాలు కరిచినప్పుడు 2 గాట్లు పడతాయి. వీటిలో రదనికలు కోరలుగా రూపాంతరం చెందుతాయి. నల్లతాచు, నాగుపాము, కట్లపాము, సముద్ర పాములు, రక్తపింజర మొదలైనవి విషసర్పాలకు ఉదాహరణలు.

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌