• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యం

ఉభయచరాల స్వర్గధామం పశ్చిమ కనుమలు!

 

 

భూమిపై జీవుల మధ్య ఉండే భేదమే జీవవైవిధ్యం. ఇది సృష్టి సహజ లక్షణం. ఆహారచట్రంలో జీవులన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తుంటాయి. అయితే  మానవుడి చర్యల కారణంగా ప్రకృతిలోని ఈ సమతూకం దెబ్బతింటోంది. పర్యావరణ కాలుష్యం, పురుగుమందుల వినియోగంతో జీవవైవిధ్యం క్షీణిస్తోంది. ఈ అంశం ప్రాధాన్యం, పర్యవసానాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవ వైవిధ్య ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలు, వ్యవస్థాగతంగా జరుగుతున్న సంరక్షణ చర్యలు, సంబంధిత ఒప్పందాలు, చట్టాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

 

జీవావరణంలో భౌమ, జలావరణ వ్యవస్థల్లోని సమస్త జీవజాతుల మధ్య జన్యు, జాతుల, ఆవరణ వ్యవస్థల పరమైన తేడాలు, వైవిధ్యతనే ‘జీవవైవిధ్యం’ అంటారు. 1992లో బ్రెజిల్‌లోని రియోలో జరిగిన జీవవైవిధ్య ఒప్పంద సదస్సులో ఈ నిర్వచనం ఇచ్చారు. 1986లో రోసెన్‌ అనే శాస్త్రవేత్త జీవవైవిధ్యం అనే పదాన్ని ప్రతిపాదించారు. విల్సన్‌ అనే వ్యక్తి ‘బయోడైవర్సిటీ’ అనే   పుస్తకాన్ని విడుదల చేసి జీవ వైవిధ్యానికి విశేష ప్రాచుర్యం కల్పించారు. భూమిపై ఉండే జీవవైవిధ్యాన్ని  3 రకాలుగా పేర్కొంటారు. అవి.. 1) జన్యు వైవిధ్యం  2) జాతుల వైవిధ్యం 3) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం


1.    2021, 2022 సంవత్సరాలకు 15వ జీవవైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది?

1) టోక్యో     2) న్యూయార్క్‌   

3) బ్రెజిల్‌       4) చైనా


2.     ‘పర్యావరణ వనరులు, జీవవైవిధ్యం, దేశ వారసత్వ సంపదను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.’ అని పేర్కొనే రాజ్యాంగంలోని నిబంధన ఏది?

1) 48 ఎ     2) 49 ఎ 

3) 50 ఎ(జి)    4) 51 ఎ(జి)


3.     ‘పర్యావరణ వనరులను, జీవవైవిధ్యతను, దేశ  వారసత్వ సంపదను పరిరక్షించే బాధ్యత దేశ పౌరులదే.’ అని పేర్కొనే రాజ్యాంగంలోనే నిబంధన-

1) 48 ఎ  2) 49 ఎ 3) 50 ఎ(జి) 4) 51 ఎ(జి)


4.     జీవవైవిధ్య ఒప్పందం (సీబీడీ) అమల్లోకి వచ్చిన సంవత్సరం?

1) 1992  2) 1993  3) 1994  4) 1995


5.     కిందివాటిని జతపరచండి. 

పరిశోధన సంస్థ కేంద్ర కార్యాలయం
1) ద ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ ప్లాంట్‌ జీనోమిక్‌ రిసెర్చ్‌ ఎ) రోమ్‌
2) ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమీ ఎరిడ్‌ ట్రాపిక్స్‌ బి) హైదరాబాద్‌
3) ట్రాపికల్‌ బొటానికల్‌ గార్డెన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సి) త్రివేండ్రం
4) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ జీనోమిక్‌ రిసోర్సెస్‌ డి) న్యూఢిల్లీ

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి        2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి         4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి


6.     దేశంలో ఉభయచర, సరీసృప జాతుల వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం?

1) తూర్పు హిమాలయాలు     2) పశ్చిమ హిమాలయాలు    

3) పశ్చిమ కనుమలు    4) తూర్పు కనుమలు


7.     అంతర్జాతీయ జీవవైవిధ్య ఒప్పందానికి సంబంధించిన సీఓపీ-13వ సదస్సు 2016, డిసెంబరులో ఎక్కడ జరిగింది?

1) జెనీవా     2) రోమ్‌ 

3) డర్బన్‌     4) కాన్‌కున్‌ (మెక్సికో)


8.     కిందివాటిలో వన్యమృగ సంరక్షణకు సంబంధించి ‘స్థానిక జాతులు’ అనే పదాన్ని సంపూర్ణంగా నిర్వచించే వాక్యం ఏది?

1) పరాన్నజీవుల దాడి వల్ల సందిగ్ధ స్థితిలో ఉన్న జాతుల సంఖ్య తగ్గడం.

2) అన్ని ప్రాంతాల్లో నివసించే జాతులు.

3) ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న జాతులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే నివసించడం.

4) కొన్ని నిర్దిష్ట ప్రాంతాలను మాత్రమే ఆవాసంగా చేసుకుని నివసించే జాతులు. ఇవి ఇతర ప్రాంతాల్లో నివసించలేవు.


9.     బయోస్ఫియర్‌ పరిధిలోని ఏ ప్రాంతంలో మానవ చర్యలను అనుమతిస్తారు?

1) కోర్‌ మండలం      2) బఫర్‌ మండలం  3) పరివర్తన మండలం      4) సుస్థిర మండలం

10. భారతదేశంలో మామిడి పంటకు సంబంధించి విభిన్న రుచులు, రంగులు, స్థాయుల్లో సుక్రోజ్‌ శాతం, నార శాతంతో భిన్నరకాల జాతులు ఉండటానికి కిందివాటిలో కారణమైన అంశమేది?

1) జాతుల వైవిధ్యం      2) ఉత్పరివర్తనాల ప్రేరేపణ 

3) సంకరీకరణం      4) జన్యు వైవిధ్యం


11. వ్యవసాయ పంట మొక్కలకు సంబంధించి జన్యు వైవిధ్యం (Genetic Diversity) ప్రమాద స్థితిలో పడటానికి కిందివాటిలో కారణమేది?

1) అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ప్రవేశపెట్టడం

2) రసాయనిక ఎరువులను పరిమితికి మించి వినియోగించడం

3) జీవక్రిమిసంహారకాలను పరిమితికి మించి వినియోగించడం    4) పైవన్నీ


12. కిందివాటిని పరిశీలించండి.

ప్రతిపాదన (A): ఉష్ణమండల వర్షారణ్య ఆవరణ వ్యవస్థల్లో జాతుల వైవిధ్యం అత్యధికంగా ఉంది

కారణం (R): జాతుల వైవిధ్యం అంటే ప్రమాణ వైశాల్యం ఉన్న భూభాగంలో ఎక్కువ సంఖ్యలో జీవులు నివసిస్తూ ఉండటం

1) A, R లు నిజమైనవి. A కి R సరైన వివరణ.

2) A, R లు నిజమైనవి. కానీ, A కి R సరైన వివరణ కాదు.

3) A నిజమైంది, R నిజమైంది కాదు.

4) A నిజమైంది కాదు, R నిజమైంది.


13. కిందివాటిలో జాతుల వైవిధ్యం అతి తక్కువగా ఉండే ఆవరణ వ్యవస్థ ఏది?

1) ఎడారి      2) టండ్రా  

3) గడ్డిమైదానం      4) ఆకురాల్చు అడవులు


14. కిందివాటిని జతపరచండి.

పరిశోధనా సంస్థ   కేంద్ర కార్యాలయం
1) ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎ) హైదరాబాద్‌
2) ఫారెస్ట్‌ రిసెర్చ్‌ సెంటర్‌ బి) జబల్‌పుర్‌
3) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌  సి) దేహ్రాదూన్‌
4) ట్రాపికల్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డి) కోయంబత్తూర్‌ 

1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి        2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి         4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి


15. పశ్చిమ కనుమలు - శ్రీలంక ఇకలాజికల్‌ హాట్‌ స్పాట్‌కి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) ఈ ప్రాంతంలో స్థానిక జాతులు తక్కువగా ఉన్నాయి.

బి) 60% ఉభయచరాలు, సరీసృపాలు ఈ ప్రాంతానికి స్థానికమైనవి.

సి) అగస్త్యమలై కొండలు ఇకలాజికల్‌ హాట్‌స్పాట్‌లోని ఎక్కువ జీవజాతులకు నిలయమైన ప్రాంతాలు.

1) ఎ, బి               2) బి, సి   

3) సి మాత్రమే          4) ఎ, బి, సి 


16. కింది ప్రవచనాలను పరిశీలించి, నిజమైన వాటిని గుర్తించండి.

ఎ) జీవవైవిధ్య చట్టం-2002ను పార్లమెంటు చట్టబద్ధం చేసింది.

బి) 1992 ధరిత్రీ సమావేశంలో ఆమోదించిన ‘కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్సిటీ (CBD) లోని నిబంధనలను దేశంలో అమలు చేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే  

3) ఎ, బి      4) ఏదీకాదు


17. ఏదైనా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో జీవవైవిధ్య ప్రమాద స్థిÄతిని ఎదుర్కోవడానికి ఉన్న కారణాల్లో కిందివాటిలో ఒక అంశం కానిది?

1) గ్లోబల్‌ వార్మింగ్‌            2) ఆవాసాలు విచ్ఛిన్నమవడం

3) పరస్థానీయ జాతుల ప్రవేశం         4) శాకాహారాన్ని ప్రోత్సహించడం


18. జీవవైవిధ్య క్షీణతకు సంబంధించి కిందివాటిలో మానవ ప్రేరిత కారణాలేవి? 

ఎ) ఆవాసాల విస్తృతి తగ్గిపోవడం

బి) వన్యజాతి జీవుల్లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలను పరిమితికి మించి దోపిడీ చేయడం

సి) పర్యావరణ కాలుష్యం    డి) గ్లోబల్‌ వార్మింగ్‌

1) ఎ, బి, సి        2) ఎ, బి, డి        

3) సి, డి           4) ఎ, బి, సి, డి 


19. ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ద కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ సంస్థ’ ప్రచురించే ‘రెడ్‌ డేటా బుక్‌’ కిందివాటిలో ఏ అంశాలను తెలియజేస్తుంది?

1) స్థానీయ వృక్ష, జంతు జాతుల గురించి

2) ప్రమాద స్థితి ఎదుర్కొంటున్న వృక్ష, జంతు జాతుల గురించి

3) వివిధ రక్షిత ప్రాంతాలు, సహజ వనరుల సంరక్షణ గురించి

4) పైవన్నీ


20. కిందివాటిలో జీవవైవిధ్యంలో ముఖ్యమైన అంశం కానిదేది?

1) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం       2) జన్యు వైవిధ్యం

3) జాతుల వైవిధ్యం            4) అటవీ వైవిధ్యం


21. ‘జీవవైవిధ్యం’ అనే పదాన్ని మొదటగా సూచించినవారు?

1) విట్టేకర్‌      2) రోసెన్‌  

3) విల్సన్‌      4) నార్మన్‌ మేయర్స్‌


22. పశ్చిమ కనుమలు - ద్వీపసమూహాలతో కూడిన ఇకలాజికల్‌ హాట్‌స్పాట్స్‌కు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, నిజమైన దాన్ని గుర్తించండి.

ఎ) ఈ ప్రాంతంలో జీవవైవిధ్యంలో అత్యధిక శాతం స్థానికమైనవి.

బి) దాదాపు 60% ఉభయచర, సరీసృప జాతులు ఈ ప్రాంతానికి స్థానీయమైనవి.

1) ఎ, బి         2) ఎ మాత్రమే     

3) బి మాత్రమే         4) ఏదీకాదు


23. కింది ప్రవచనాలను పరిశీలించి నిజమైన వాటిని గుర్తించండి.

ఎ) స్థానికత అంటే ఏదైనా ఒక జాతి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మాత్రమే నివసిస్తూ, ఇతర ప్రాంతాల్లో నివసించకపోవడం.

బి) ఇకలాజికల్‌ హాట్‌స్పాట్‌ అనే పదాన్ని మొదటగా ‘నార్మన్‌ మేయర్స్‌’ అనే శాస్త్రవేత్త ఉపయోగించారు.

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే

3) ఎ, బి            4) ఏదీకాదు 


24. ఇకలాజికల్‌ హాట్‌స్పాట్‌ అనే భావనను మొదటిసారిగా అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త?

1) విల్సన్‌      2) లోజాయ్‌  

3) నార్మన్‌ మేయర్స్‌      4) రోసెన్‌


25. నిమ్నజాతి జీవుల మధ్య ఉండే జన్యువుల సంఖ్యలోని తేడాలు, ఒక జాతి జీవుల్లోని జన్యువుల లక్షణాల్లో తేడాలను సూచించేది?

1) జన్యు వైవిధ్యం     2) జాతుల వైవిధ్యం  

3) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం      4) జీవ సముదాయాల వైవిధ్యం


26. కిందివాటిలో భారతదేశంలో ఇకలాజికల్‌ హాట్‌స్పాట్‌ కానిది-

1) పశ్చిమ కనుమలు - శ్రీలంకలో ద్వీప సమూహాలు          2) హిమాలయాలు

3) ఇండో-బర్మన్‌ ప్రాంతం                           4) తూర్పు కనుమలు

 


సమాధానాలు

1-4; 2-1; 3-4; 4-2; 5-1; 6-3; 7-4; 8-4; 9-3; 10-4; 11-1; 12-3; 13-2; 14-4; 15-2; 16-3; 17-4; 18-4; 19-2; 20-4; 21-2; 22-1; 23-3; 24-3; 25-1; 26-4.


రచయిత: ఇ.వేణుగోపాల్‌

Posted Date : 16-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌