• facebook
  • whatsapp
  • telegram

జీవ అణువులు

1. కిందివాటిలో ఏ బృహదణువులను జీవ అణువులుగా పేర్కొంటారు?
i) కార్బోహైడ్రేట్‌లు       ii) ప్రోటీన్‌లు 
iii) న్యూక్లిక్‌ ఆమ్లాలు      iv) లిపిడ్‌లు
1) i, ii, iii       2) ii, iii, iv      3) i, iii, iv        4) i, ii, iii, iv 


2. కిందివాటిలో వేటిని కార్బోహైడ్రేట్‌లుగా పేర్కొంటారు?
i) దృక్‌ అణు సాదృశ్యాన్ని ప్రదర్శించే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్‌ సమ్మేళనాలు.
ii) దృక్‌ అణుసాదృశ్యాన్ని ప్రదర్శించే  పాలీహైడ్రాక్సీ కీటోన్‌ సమ్మేళనాలు.
iii) జల విశ్లేషణ చెందించినప్పుడు దృక్‌ అణు సాదృశ్యాన్ని ప్రదర్శించే పాలీ హైడ్రాక్సీ ఆల్డిహైడ్‌ లేదా కీటోన్‌ సమ్మేళనాలను ఉత్పత్తిచేసే సమ్మేళనాలు.
1) i, ii, iii         2) ii, iii         3) i, iii         4) i, ii


3. తియ్యటి రుచి కలిగిన కార్బోహైడ్రేట్‌ సమ్మేళనాలు ఏవి?
1) స్టార్చ్‌          2) చక్కెరలు లేదా సుగర్‌లు
3) ట్రయోస్‌లు  4) ఆల్డోజ్‌లు


4. జలవిశ్లేషణ చర్యలను కొనసాగించినప్పటికీ కింది ఏ కార్బోహైడ్రేట్‌ తరగతి సరళ కార్బోహైడ్రేట్‌లను ఉత్పత్తి చేయలేదు?
1) పాలీశాకరైడ్‌లు    2) డైశాకరైడ్‌లు
3) మోనోశాకరైడ్‌లు    4) అలిగోశాకరైడ్‌లు


5. కింది అంశాలను జతపరచండి.
కార్బోహైడ్రేెట్‌ రకం      ఉదాహరణ
i) మోనోశాకరైడ్‌        a) హయలురోనిక్‌ యాసిడ్‌ 
ii) డైశాకరైడ్‌            b) సెల్యులోజ్‌
iii) హెమోపాలీశాకరైడ్‌   c) లాక్టోజ్‌
iv) హెటిరోపాలీశాకరైడ్‌   d) గ్లూకోజ్‌
1) i-c, ii-a, iii-d, iv-b           2) i-c, ii-d, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d           4) i-d, ii-c, iii-b, iv-a


6. మానవ శరీరంలో ఏ రకానికి చెందిన మోనోశాకరైడ్‌లు అధికంగా కనిపిస్తాయి?
1) D రకం      2) L  రకం       3) LD రకం       4) DL రకం


7. కింది కార్బోహైడ్రేట్‌లను సరిగా జతపరచండి.
 జాబితా - ఎ          జాబితా - బి
i) డైశాకరైడ్‌         a) వెర్బాస్కోజ్‌
ii) ట్రైశాకరైడ్‌       b) స్టాకియోజ్‌
iii) టెట్రాశాకరైడ్‌  c) రఫినోజ్‌
iv) పెంటాశాకరైడ్‌  d) మాల్టోజ్‌
1) i-d, ii-c, iii-b, iv-a          2) i-b, ii-a, iii-c, iv-d
3) i-c, ii-d, iii-b, iv-a          4) i-c, ii-a, iii-d, iv-b 


8. కిందివాటిలో భూమిపై చాలా విరివిగా కనిపించే జీవ అణువు?
1) ప్రోటీన్‌లు      2) లిపిడ్‌లు
3) న్యూక్లిక్‌ ఆమ్లాలు    4) కార్బోహైడ్రేట్లు


9. కిందివాటిలో కార్బోహైడ్రేట్ల ప్రధాన కర్తవ్యాలు ఏవి?
i) నిల్వ ఆహార పదార్థాలుగా ఉండటం.
ii) నిర్మాణాత్మక కవచ పదార్థాలుగా ఉండటం. 
iii) శక్తినిచ్చే పదార్థాలుగా శ్వాసక్రియలో పాల్గొనడం.
1) i, ii, iii            2) i, ii            3) ii, iii          4) i, iii 


10. కార్బోహైడ్రేట్ల సాధారణ ఫార్ములాను ఎలా సూచిస్తారు?
1) (C4H2O)n            2) (C6H2O)n
3) (CH2O)n              4) (CH2O)n COOH
 


11. కిందివాటిలో అతి సరళమైన, చిన్నదైన ట్రయోజ్‌ కార్బోహైడ్రేట్‌ ఏది?
1) రైబోజ్‌       2) గ్లూకోజ్‌       3) గ్లిసరాల్డిహైడ్‌       4) గ్లైసిన్‌


12. కింది కార్బోహైడ్రేట్లను వాటిలో ఉండే కర్బన పరమాణువులు సంఖ్య ఆధారంగా జతపరచండి.
కార్బోహైడ్రేట్‌       కర్బన పరమాణువుల సంఖ్య
i) ట్రయోజ్‌         a) 6
ii) టెట్రోజ్‌          b) 5
iii) పెంటోజ్‌        c) 4
iv) హెక్సోజ్‌        d) 3
1) i-c, ii-d, iii-b, iv-a           2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d           4) i-c, ii-d, iii-a, iv-b

 

13. కిందివాటిలో ఎపిమర్‌లకు ఉదాహరణ?
1) గ్లూకోజ్, రైబోజ్‌        2) గ్లూకోజ్, గలాక్టోజ్‌
3) గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌        4) ఫ్రక్టోజ్, సుక్రోజ్‌


14.  కింది కార్బోహైడ్రేట్‌లను జతపరచండి.
జాబితా - ఎ    జాబితా - బి
i) హెప్టోజ్‌       a) ఎరిత్రోజ్‌
ii) హెక్సోజ్‌     b) రైబోజ్‌
iii) పెంటోజ్‌    c) గ్లూకోజ్‌
iv) టెట్రోజ్‌     d) సుడోహెప్టులోజ్‌
1) i-c, ii-d, iii-b, iv-a           2) i-d, ii-c, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a           4) i-c, ii-d, iii-a, iv-b 

 

15. కిందివాటిలో ఆల్డోజ్‌ చక్కెరకు ఉదాహరణ కానిది?
1) గలాక్టోజ్‌      2) అరాబినోజ్‌ 
3) ఎరిత్రోజ్‌     4) ఫ్రక్టోజ్‌ 


16. కిందివాటిలో కీటోజ్‌ చక్కెరకు ఉదాహరణ కానిది ఏది?
1) రిబ్యులోజ్‌       2) జైల్యులోజ్‌       3) గ్లూకోజ్‌       4) టాలోజ్‌


17. కింది అంశాలను జతపరచండి.
జాబితా - ఎ    జాబితా - బి
i) మాల్టోజ్‌      a) మాల్ట్‌ సుగర్‌
ii) లాక్టోజ్‌       b) మిల్క్‌ సుగర్‌
iii) సుక్రోజ్‌     c) కేన్‌ సుగర్‌
1) i-a, ii-b, iii-c          2) i-b, ii-a, iii-c
3) i-c, ii-b, iii-a          4) i-b, ii-c, iii-a 


18. ఫంగల్‌ సెల్యులోజ్‌గా పిలిచే పాలీశాకరైడ్‌?
1) కైటిన్‌         2) కెరాటిన్‌  
3) కాల్షియం కార్బోనేట్‌    4) కొల్లాజిన్‌


19. గ్లైకో లిపిడ్‌లు, గ్లైకో ప్రోటీన్‌లను ఏర్పర్చే కార్బోహైడ్రేట్‌లు...
1) మోనోశాకరైడ్‌లు      2) అలిగోశాకరైడ్‌లు 
3) మోనోపాలీశాకరైడ్‌లు     4) హెటిరోపాలీశాకరైడ్‌లు


20. మధుమేహం ఉన్నవారికి వైద్యులు కార్బోహైడ్రేట్లను కింది ఏ రూపంలో ఆహారంగా తీసుకోమని సూచిస్తారు?
1) మోనోశాకరైడ్‌లు      2) డైశాకరైడ్‌లు  
3) పాలీశాకరైడ్‌లు        4) గ్లైకోలిపిడ్‌లు


21. కార్బోహైడ్రేట్లను ప్రాథమికంగా గుర్తించేందుకు చేసే పరీక్ష?
1) అయోడిన్‌ పరీక్ష       2) మాలిష్‌ పరీక్ష  
3) బార్‌ఫోయిడ్‌ పరీక్ష    4) ఓసజోన్‌ పరీక్ష


22. కిందివాటిలో అతి సరళమైన ఎమైనో ఆమ్లం ఏది?
1) గ్లైసిన్‌       2) ఎలనిన్‌       3) ఆస్పార్జిన్‌      4) టైరోసిన్‌


23. ఎమైనో ఆమ్లాలు కిందివాటిలో దేని నుంచి సంశ్లేషణ చెందుతాయి?
1) ఫాటీ ఆమ్లాలు      2) లవణ పదార్థాలు   
3) స్వేదన తైలాలు   4) ఆల్ఫా  కీటోగ్లుటారిక్‌ ఆమ్లం


24. నిజకేంద్రక జీవుల్లో ఏ పాలీపెప్టైడ్‌ శృంఖలంలోనైనా మొదటగా వ్యవస్థితమయ్యే ఎమైనో ఆమ్లం ఏది?
1) వాలైన్‌        2) ట్రిప్టోఫాన్‌ 
3) మిథియోనైన్‌    4) ఎలనిన్‌


25. ప్రకృతిసిద్ధమైన ప్రోటీన్‌లను కలిగిఉండేవి?
1) D - ఎమైనో ఆమ్లాలు         2) L - ఎమైనో ఆమ్లాలు
3) S - ఎమైనో ఆమ్లాలు         4) P - ఎమైనో ఆమ్లాలు


26. కింది ఏ ఎమైనో ఆమ్లం తియ్యటి రుచిని కలిగి ఉంటుంది?
1) ఎలనిన్‌       2) గ్లుటామిక్‌ ఆమ్లం 
3) హిస్టిడేన్‌      4) గ్లైసిన్‌


27. కిందివాటిలో న్యూరోట్రాన్స్‌మీటర్లుగా పనిచేసే పదార్థాలు ఏవి?
1) కార్బోహైడ్రేట్‌లు      2) లిపిడ్‌లు
3) ఎమైనో ఆమ్లాలు      4) న్యూక్లిక్‌ ఆమ్లాలు


28. కిందివాటిలో నిరోధక న్యూరోట్రాన్స్‌మీటర్లుగా పనిచేసే ఎమైనో ఆమ్లాలు?
i) GABA                  ii) గ్లైసిన్‌  
iii) బీటా ఎలనిన్‌            iv) టారిన్‌
1) ii, iii, iv          2) i, ii, iii           3) i, iv          4) i, ii, iii, iv 

29. ఉత్తేజకరమైన న్యూరోట్రాన్స్‌మీటర్లుగా పనిచేసే ఎమైనో ఆమ్లానికి ఉదాహరణ?
i) L - గ్లుటామేట్‌     ii) L - ఆస్పార్టేట్‌        iii) L -  సిస్టీన్‌
1) i, ii, iii            2) ii, iii            3) i, iii   4) i, ii 


30.  SDS PAGE టెక్నిక్‌లో ఉపయోగించే బఫర్లలో సాధారణంగా ఉండే ఎమైనో ఆమ్లం ఏది?
1) ఆస్పార్టిక్‌ ఆమ్లం     2) గ్లుటామిక్‌ ఆమ్లం   
3) గ్లైసిన్‌         4) లైసిన్‌


31. ప్రోటీన్ల నిర్మాణానికి సంబంధించి ఆల్ఫా హెలిక్స్‌ నిర్మాణంలో పాల్గొనని ఎమైనో ఆమ్లం ఏది?
1) ప్రోలీన్‌      2) గ్లుటామిక్‌ ఆమ్లం
3) ఆస్పార్టిక్‌ ఆమ్లం     4) లైసిన్‌


32. ప్రోటీన్‌ సంశ్లేషణలో పాల్గొనే ఎమైనో ఆమ్లాల సంఖ్య....
1) 20         2) 22         3) 24         4) 26 


33. అంతిమ కోడాన్‌లు లేదా ముగింపు కోడాన్లను గుర్తించే ఎమైనో ఆమ్లాలకు ఉదాహరణలు?
i) సెలెనోసిస్టీన్‌         ii)  సిస్టీన్‌          iii) పైరోలైసిన్‌
1) i, ii         2) ii, iii         3) i, iii         4) i, ii, iii 


34. గ్లూకోజెనిక్‌ ఎమైనో ఆమ్లాలు కానివి?
1) ల్యూసిన్, ఐటోల్యూసిన్‌ 
2) టైరోసిన్, లైసిన్‌    3) గ్లైసిన్, లైసిన్‌ 
4) ల్యూసిన్, లైసిన్‌


35. కిందివాటిలో కీటోజెనిక్‌ ఎమైనో ఆమ్లాలకు ఉదాహరణలు?
i) ల్యూసిన్‌         ii) లైసిన్‌         iii) ట్రిప్టోఫాన్‌        iv) గ్లైసిన్‌
1) i, ii          2) ii, iii            3) iii, iv         4) ii, iv


36. కిందివాటిలో గ్లూకోజెనిక్, కీటోజెనిక్‌ ఎమైనో ఆమ్లాలకు ఉదాహరణలు?
i) ఐసోల్యూసిన్‌     ii)  థ్రియోనైన్‌        iii) టైరోసిన్‌  
1) i, ii          2) ii, iii          3) i, iii           4) i, ii, iii


37. కిందివాటిలో బయోప్లాస్టిక్‌కు ఉదాహరణ?
1) పాలీగ్లుటామిక్‌ ఆమ్లం        2) పాలీఆస్పార్టేట్‌   
3) పాలీ  L - లైసిన్‌        4) పాలీ గ్లైసిన్‌


38. DNA పోచ న్యూక్లియోసోమ్‌గా బంధితమవడానికి అవసరమైన ప్రోటీన్‌లు...
1) ఆల్బ్యుమిన్‌లు      2) టైరోసిన్‌లు   
3) హీమోగ్లోబిన్‌లు       4) హిస్టోన్‌లు


39. హిస్టోన్‌లు ఏ ఆవేశాన్ని కలిగిఉంటాయి?
1) తటస్థ       2) రుణాత్మక       3) ధనాత్మక       4) ద్విధ్రువ


40. హిస్టోన్‌ ప్రోటీన్లలో ప్రధానంగా ఉండే ఎమైనో ఆమ్లాలు?
i) లైసిన్‌       ii) అర్జినైన్‌      iii)  గ్లైసిన్‌
1) i, ii           2) ii, iii          3) i, iii       4) i, ii, iii 


41. ప్రామాణిక ఎమైనో ఆమ్లాల్లో (స్టాండర్డ్‌ ఎమైనో ఆమ్లాల్శు పెద్దది ఏది?
1) గ్లైసిన్‌       2) ట్రిప్టోఫాన్‌        3) టైరోసిన్‌       4) అర్జినైన్‌


42. ప్రామాణిక ఎమైనో ఆమ్లాలన్నింటిలో ఏది అతితక్కువగా ప్రోటీన్ల నిర్మాణంలో పాలుపంచుకుంటుంది?
1) లైసిన్‌         2) ప్రోలిన్‌          3) ట్రిప్టోఫాన్‌         4) గ్లైసిన్‌


43. కిందివాటిలో జ్విట్టర్‌ అయాన్‌ లేదా ద్విధ్రువ అయాన్‌ రూపంలో ఉండే జీవ అణువు...
1) కార్బోహైడ్రేట్‌       2) లిపిడ్‌  
3) ఎమైనో ఆమ్లం      4) థైరాక్సిన్‌


44. కిందివాటిలో ఆవశ్యక ఎమైనో ఆమ్లాలకు ఉదాహరణలు...  
i) హిస్టిడేన్‌        ii) ల్యూసిన్‌ 
iii) లైసిన్‌          iv) ఫినైల్‌ ఎలనైన్‌
1) i, ii, iii           2) ii, iii, iv
3) iii, iv            4) i, ii, iii, iv 

 

45. అనావశ్యక ఎమైనో ఆమ్లాలకు ఉదాహరణలు  
i) ఆస్పార్జిన్‌        ii) గ్లైసిన్‌ 
iii) టైరోసిన్‌        iv) ప్రోలిన్‌
1) ii, iii, iv           2) i, ii, iii
3) i, iii, iv            4) i, ii, iii, iv 


46. ఆహారం ద్వారా తప్పనిసరిగా మానవ శరీరానికి అందాల్సిన ఎమైనో ఆమ్లాలు ఏవి?
1) ఆవశ్యక ఎమైనో ఆమ్లాలు
2) అనావశ్యక ఎమైనో ఆమ్లాలు 
3) ప్రామాణిక ఎమైనో ఆమ్లాలు
4) సామాన్య ఎమైనో ఆమ్లాలు

 

47. ప్రోటీన్ల ఏర్పాటులో ఎమైనో ఆమ్లాలు కింది ఏ బంధాలతో అనుసంధానించి ఉంటాయి?
1) పెప్టైడ్‌ బంధం            2) హైడ్రోజన్‌ బంధం   
3) అయానిక బంధం       4) గ్లైకోసైడిక్‌ బంధం


48. ప్రోటీన్‌ ప్రాథమిక నిర్మాణం దేన్ని తెలుపుతుంది?
1) ప్రోటీన్‌ అణువు త్రిమితీయ నిర్మాణాన్ని.
2) అనుసంధానమైన ఎమైనో ఆమ్లాల రేఖీయ అమరికను.
3) మెలికల రూపంలో వ్యవస్థితమయ్యే ప్రోటీన్‌ నిర్మాణాన్ని.
4) ప్రోటీన్‌ అణువు ఉపప్రమాణాల సంఖ్యను


49. కిందివాటిలో పెప్టైడ్‌ బంధానికి సంబంధించి సరైనవి ఏవి?
i) దృఢమైంది   
ii) పాక్షిక ద్విబంధ లక్షణాన్ని కలిగి ఉంటుంది
iii) ఒకే తలంలో ఉండే బంధం   
iv) సంయోజనీయ బంధం
1) i, ii, iii          2) ii, iii, iv           3) i, iv         4) i, ii, iii, iv


50. రసాయనికంగా ఎంజైమ్‌లు.....
1) కార్బోహైడ్రేట్‌లు       2) లిపిడ్‌లు
3) ప్రోటీన్‌లు       4) జన్యు పదార్థాలు


51. డైపెప్టైడ్‌ అంటే.....
1) రెండు ఎమైనో ఆమ్లాలను ఒక పెప్టైడ్‌ బంధంతో అనుసంధానించి ఉండేది.
2) రెండు ఎమైనో ఆమ్లాలను రెండు పెప్టైడ్‌ బంధాలతో అనుసంధానించి ఉండే బృహదణువు.
3) రెండు ఎమైనో ఆమ్లాలు, మూడు ఎమైనో సమూహాలను కలిగి ఉండే రసాయన పదార్థం.
4) రెండు కార్బాక్సిలిక్‌ ఆమ్ల సమూహాలు, రెండు ఎమైనో సమూహాలను కలిగి ఉండే పదార్థం.


52. ప్రోటీన్‌ ద్వితీయ శ్రేణి నిర్మాణంలో సర్వ సాధారణమైంది ఏది?
1) ఆల్ఫా హెలిక్స్‌      2) బీటా సమాంతర హెలిక్స్‌
3) బీటా త్రిమితీయాలు    4) గామా నిర్మాణాలు


53. ప్రోటీన్‌ల టెర్షియరీ నిర్మాణానికి ఆధారాన్ని చేకూర్చే బంధాలు ఏవి?
i) పెప్టైడ్‌ బంధం   ii) హైడ్రోజన్‌ బంధం
iii) డైసల్ఫైడ్‌ బంధం
1) i, ii           2) ii, iii         3) i, iii         4) i, ii, iii 

 

54. కిందివాటిలో డైసల్ఫైడ్‌ బంధాన్ని ఏర్పరిచేవి?
1) సిస్టీన్‌ ప్రమాణాలు       2) ప్రోలీన్‌ ప్రమాణాలు
3) హిస్టిడీన్‌ ప్రమాణాలు     4) వాలీన్‌ ప్రమాణాలు


55. కిందివాటిలో ప్రోటీన్‌ త్రిమితీయ నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి సహకరించే సాంకేతికతను గుర్తించండి.
i) న్యూక్లియర్‌ మాగ్నటిక్‌ రిజొనెన్స్‌
ii)  X - ray క్రిస్టలోగ్రఫీ
iii) స్పెక్ట్రోఫొటోమెట్రీ
1) i, ii, iii        2) i, iii         3) i, ii        4) ii, iii 


56. కిందివాటిలో ఏ కారకం ప్రోటీన్‌ల సహజ లక్షణాన్ని మార్చలేదు?
1) వేడి లేదా ఉష్ణం   2) విద్యుదావేశం
3) pH లో మార్పు   
4) కర్బన ద్రావణి ప్రమేయం


57. ప్రోటీన్‌ త్రిమితీయ నిర్మాణాన్ని నిర్దేశించేది ఏది?
1) పెప్టైడ్‌ బంధ పరిమితి, బంధబలం
2) ఎమైనో ఆమ్లాల వరుసక్రమం
3) ఇతర పాలీపెప్టైడ్‌లతో ప్రోటీన్‌కు ఉండే చర్యలు
4) హైడ్రోజన్, కార్బన్‌ పరమాణు నిష్పత్తి


58. ఫ్రెడరిక్‌ సాంజర్‌ ఏ ప్రోటీన్‌ వరుస క్రమాన్ని కనుక్కున్నారు?
10 మయోసిన్‌       2) ఇన్యులిన్‌   
3) ఇన్సులిన్‌        4) గ్లోబిన్‌


59. ప్రోటీన్‌ లోపం వల్ల మానవుడిలో కనిపించే ప్రధాన లక్షణాలు?
i) బరువు తగ్గడం     ii) కండరాల అలసట     
iii) కండర బలం తగ్గడం       iv) శ్వాస తీసుకోలేకపోవడం
1) i, ii, iii          2) ii, iii, iv     3) i, iii, iv        4) i, ii, iii, iv 

 

60. కిందివాటిలో ప్రోటీన్‌ విధి కానిది ఏది?
1) జీర్ణక్రియకు సహకరించడం.
2) జన్యు సమాచారాన్ని తర్వాతి తరాలకు అందించడం.
3) చొరబడిన పరాన్న జీవులతో పోరాడే శక్తిని కలిగి ఉండటం.
4) రక్తం ద్వారా ఆక్సిజన్‌ను రవాణా చేసే శక్తిని కలిగి ఉండటం.


61. ప్రోటీన్‌ లోపించడం వల్ల కలిగే వ్యాధి ...
1) అతినిద్ర     2) రక్తహీనత
3) క్వాషియోర్కర్‌   4) హైపోథైరాయిడిజం


62. మిల్క్‌ ప్రోటీన్‌గా పేర్కొనే ‘కెసీన్‌’ కింది ఏ రకానికి చెందిన ప్రోటీన్‌?
1) న్యూక్లియోప్రోటీన్‌      2) లిపోప్రోటీన్‌
3) గ్లైకోప్రోటీన్‌        4) ఫాస్ఫోప్రోటీన్‌


63. కిందివాటిలో యాంటీ క్యాన్సర్‌ పెప్టైడ్‌ ఏది?
1) బ్లియోమైసిన్‌        2) మిథోట్రెక్సేట్‌   
3) సైటోసిన్‌ అరాబినోసైడ్‌      4) డీఆక్సీఇనోసిన్‌


64. ప్రోటీన్‌లు మెలితిరగడానికి సహకరించే చాపెరాన్‌లు సాధారణంగా .....
1) విటమిన్‌లు       2) కార్బోహైడ్రేట్‌లు
3) ఎమైడ్‌లు         4) లిపిడ్‌లు


65. కిందివాటిలో లిపిడ్‌లుగా చెప్పదగినవి ఏవి?
i)  కొవ్వులు       ii) నూనెలు        iii) మైనం
1) i, ii        2) ii, iii         3) i, iii         4) i, ii, iii 


66. కిందివాటిలో మొలకెత్తే విత్తనాల్లో ఎక్కువగా ఉనికిని చూపే ఎంజైమ్‌లు....
1) లైపేజ్‌లు        2) ప్రోటియేజ్‌లు
3) సెల్యులేజ్‌లు   4) న్యూక్లియేజ్‌లు


67. ఫాటీ ఆమ్లాల బీటా ఆక్సీకరణం జరిగే కణాంగం.....
1) పెరాక్సీజోమ్‌లు     2) మైటోకాండ్రియా
3) రైబోజోమ్‌లు     4) కేంద్రకం


68. కొవ్వుల్లో  −OH ప్రమేయ సమూహాల సంఖ్యను తెలిపేది?
1) రిచర్డ్‌ - మిసెల్‌ సంఖ్య        2) పోలెన్‌స్కీ సంఖ్య
3) అయోడిన్‌ సంఖ్య    4) ఎసిటైల్‌ సంఖ్య


69. లిపిడ్‌ సంబంధ ఆహార పదార్థాలు పులిసినట్లుగా ఉండి, వాటి నుంచి దుర్వాసన వస్తుంది. దీనికి కారణం ఏమిటి?
1) ఫాటీ ఆమ్లాల క్షయకరణ చర్యలు
2) అసంతృప్త ఫాటీ ఆమ్లాల హైడ్రోజనీకరణం
3) సంతృప్త ఫాటీ ఆమ్లాల డీహైడ్రోజినేషన్‌
4) ఫాటీ ఆమ్లాల ఆక్సీకరణం


70. కిందివాటిలో ఉత్పన్న లిపిడ్‌లకు ఉదాహరణ?
i) టెర్పిన్‌లు      ii) స్టెరాయిడ్‌లు       iii) కెరోటినాయిడ్‌లు
1) i, ii, iii          2) i, iii         3) ii, iii          4) i, ii 


71. లిపిడ్‌లలో అసంతృప్తతను తెలిపే సంఖ్య ఏది?
1) అయోడిన్‌ సంఖ్య        2) సపోనిఫికేషన్‌ సంఖ్య
3) రిచర్డ్‌ - మిసెల్‌ సంఖ్య    4) పోలెన్‌స్కీ సంఖ్య


72. లిపిడ్‌ సాపేక్ష గురుత్వం .....
1) 1.5         2) 1.0         3) 0.8         4) 0.2 

 

73. కిందివాటిలో అసంతృప్త ఫాటీ ఆమ్లాలకు ఉదాహరణ .....
i) లినోలియిక్‌ ఆమ్లం      ii) ఓలియిక్‌ ఆమ్లం
iii) పామిటోలియిక్‌ ఆమ్లం
1) i, ii        2) ii, iii         3) i, iii        4) i, ii, iii


74. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ట్రైగ్లిజరైడ్‌లు ఏవి?
1) నూనెలు     2) ఘనాలు      3) కొవ్వులు       4) నెయ్యి


75. కొవ్వుల నుంచి గ్లూకోజ్‌ల సంశ్లేషణను ఏమంటారు?
1) గ్లైకాలిసిస్‌       2) క్రెబ్స్‌ వలయం   
3) సపోనిఫికేషన్‌       4) గ్లూకో నియోజెనిసిస్‌


76. క్షారాలతో కొవ్వుల జలవిశ్లేషణను ..... అంటారు.
1) కొయాగ్యులేషన్‌      2) సపోనిఫికేషన్‌    
3) సల్ఫోనిఫికేషన్‌      4) ఆర్కోనిఫికేషన్‌


77. ఫాస్ఫో లిపిడ్‌కు ఉదాహరణ .....
1) స్టీరాల్‌       2) కొలెస్ట్రాల్‌    
3) లెసిథిన్‌     4) స్టెరాయిడ్‌


78. కిందివాటిలో ఆవశ్యక ఫాటీ ఆమ్లాలకు ఉదాహరణ ......
i) లినోలియిక్‌ ఆమ్లం   
ii) అరాకిడోనిక్‌ ఆమ్లం 
iii) లినోలినిక్‌ ఆమ్లం
1) i, ii         2) ii, iii         3) i, iii         4) i, ii, iii 


79. మోనో అన్‌సాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లానికి ఉదాహరణ ...
1) ఓలియిక్‌ ఆమ్లం      2) అరాకిడోనిక్‌ ఆమ్లం
3) పామిటిక్‌ ఆమ్లం      4) లినోలినిక్‌ ఆమ్లం


80. సకశేరుకాల్లో కొవ్వులు నిల్వ ఉండే కణజాలం ......
1) హెపటోసైట్‌లు     2) మెలనోసైట్‌లు
3) అడిపోసైట్‌లు      4) ఆస్టెరోసైట్‌లు


81. పక్షుల్లో ఉండే ఏ ప్రత్యేక గ్రంథి మైనాన్ని స్రవిస్తుంది?
1) థైరాయిడ్‌ గ్రంథి      2) ప్రీన్‌ గ్రంథి
3) పీనియన్‌ దేహం       4) పెరిటోనియల్‌ గ్రంథి


82. కొలెస్ట్రాల్‌ కింది ఏ పదార్థాల సంశ్లేషణకు ప్రారంభ పదార్థంగా పనిచేస్తుంది?
i) పైత్యరస వర్ణకాలు   
ii) పైత్యరస లవణాలు
iii) లైంగిక హార్మోన్‌లు  iv) విటమిన్‌ - డి
1) i, ii, iv         2) ii, iii, iv           3) i, ii, iii          4) i, ii, iii, iv


83. మానవుడిలో సీరమ్‌ కొలెస్ట్రాల్‌ సాధారణ విలువ ఎంత?
1) 100-200 mg/dl         2) 150-220 mg/dl
3) 1.5-2.5 mg/dl          4)20-40 mg/dl 


84. లిపిడ్‌ల సపోనిఫికేషన్‌ చర్యలో ఏర్పడే పదార్థాలు ఏవి?
1) గ్లూకోజ్, గ్లిసరాల్‌         2) గ్లిసరాల్, ఫాటీ ఆమ్లాలు
3) ఫాటీ ఆమ్లాలు, గ్లూకోజ్‌        4) గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌


85. అసంతృప్త ఫాటీ ఆమ్లాలను కలిగిన లిపిడ్‌లు గది ఉష్ణోగ్రత వద్ద ఏ రూపంలో ఉంటాయి?
1) ప్లాస్మా రూపం         2) ఘన రూపం    
3) ద్రవ రూపం           4) వాయు రూపం


86. ఫాటీ ఎసైల్‌ మిథైల్‌ ఎస్టర్ల మిశ్రమాలను వేరుచేయడానికి ఉపకరించే సాంకేతికత ఏది?
1) అబ్జార్‌ప్షన్‌ క్రొమటోగ్రఫీ       4) థిన్‌ లేయర్‌ క్రొమటోగ్రఫీ
3) సెంట్రిఫ్యుగేషన్‌       4) గేస్‌ - లిక్విడ్‌ క్రొమటోగ్రఫీ


87. స్పింగో లిపిడ్‌లన్నింటిలో కనిపించే అను ఘటకం ఏది?
1) ఎమైనో ఆల్కహాల్‌       2) కార్బోహైడ్రేట్‌    
3) ఎమైనో ఆమ్లం     4) ఎమైనో ఎస్టర్‌ సల్ఫేట్‌


88. ఎమైడ్‌ బంధాన్ని కలిగి ఉండే లిపిడ్‌ ఏది?
1) కొలెస్ట్రాల్‌       2) ఫాస్ఫాటిడిక్‌ ఆమ్లం
3) స్పింగోమైలీన్‌     4) ఫాస్ఫాటిడిల్‌ ఎస్టర్‌


89. లిపిడ్‌లను వేరు చేశాక వాటిని గుర్తించడానికి గిలిదిలో వాడే రంజకం ఏది?
1) అలిజారిన్‌     2) మోర్డరిట్‌   
3) ఫస్‌బిన్‌      4) రోడమీన్‌


90. థిన్‌లేయర్‌ క్రొమటోగ్రఫీలో వేగంగా సంచరించే లిపిడ్‌ ఏది?
1) తేనెటీగల మైనం    2) కొలెస్ట్రాల్‌
3) ఫాస్ఫోటైడిల్‌ ఇనోసిటాల్‌      4) స్టెరాయిడల్‌ సల్ఫేట్‌


91. కిందివాటిలో లిపిడ్‌లకు సంబంధించి సరికానిది ఏది?
1) లిపిడ్‌లు చాలా బలమైన హైడ్రోఫోబిక్‌ లేదా ఎంఫిపథిక్‌ సమ్మేళనాలు.
2) లిపిడ్‌లు నీటిలో చాలా ఎక్కువగా కరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
3) లిపిడ్‌లను జీవ కణజాలాల నుంచి సంగ్రహించడానికి కర్బన ద్రావణాలు అవసరం.
4) లిపిడ్‌లు నీటిలో కరిగే స్వభావాన్ని కలిగి ఉండవు.


92. ఆహారంలో స్వీకరించే లిపిడ్‌లు ఏ రూపంలో రవాణా అవుతాయి?
1) ఖైలోమైక్రాన్స్‌       2) లిపోసోమ్‌లు
3) లిపిడ్‌ గ్లోబ్యూల్స్‌   4) తైల దేహాలు


93. ఫాటీ ఆమ్లాల శృంఖలంలో కార్బన్‌ పరమాణువులు పెరిగితే ఏం జరుగుతుంది?
1) బాష్పీభవన స్థానం పెరుగుతుంది.   
2) బాష్పీభవన స్థానం తగ్గుతుంది.
3) ద్రవీభవన స్థానం పెరుగుతుంది.   
4) ద్రవీభవన స్థానం తగ్గుతుంది.

 


సమాధానాలు: 1-4, 2-1, 3-2, 4-3, 5-4, 6-1, 7-1, 8-4, 9-1, 10-3, 11-3, 12-2, 13-2, 14-3, 15-4, 16-3, 17-1, 18-1, 19-2, 20-3, 21-2, 22-1, 23-4, 24-3, 25-2, 26-4, 27-3, 28-4, 29-1, 30-3, 31-1, 32-2, 33-3, 34-4, 35-1, 36-4, 37-2, 38-4, 39-3, 40-1, 41-2, 42-3, 43-3, 44-4,  45-4, 46-1, 47-1, 48-2, 49-4, 50-3, 51-1, 52-1, 53-4, 54-1, 55-3, 56-2, 57-2, 58-3, 59-1, 60-2, 61-3, 62-4, 63-1, 64-4, 65-4, 66-1, 67-2, 68-4, 69-4, 70-1, 71-1, 72-3, 73-4, 74-1, 75-4, 76-2, 77-3, 78-4, 79-1, 80-3, 81-2, 82-2, 83-1, 84-2, 85-3, 86-4, 87-1, 88-3, 89-4, 90-1, 91-2, 93-1, 93-3.

Posted Date : 06-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌