• facebook
  • whatsapp
  • telegram

క్యాలెండర్‌

అదనంగా వచ్చేవి విషమ దినాలు!

 

టీఎస్‌పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-1తో పాటు ఎస్‌.ఐ., కానిస్టేబుల్, గ్రూప్‌-2, 3, 4 పరీక్షల్లో రీజనింగ్‌లో భాగంగా క్యాలెండర్‌ అధ్యాయం  నుంచి కచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో ప్రధానంగా ఒక తేదీ ఇస్తే ఆ రోజు ఏ వారమో కనుక్కోవడం, విషమ దినాలు, సాధారణ సంవత్సరం, లీపు ఏడాది, నెలను పోలిన నెల, సంవత్సరాన్ని పోలిన సంవత్సరం లాంటి అంశాలపైన అవగాహన పెంచుకోవాలి. దీని కోసం రోజులు, నెలలు, సంవత్సరాలకు సంబంధించిన కోడ్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి.

 

మోడల్‌ - 1


* వారానికి 7 రోజులు ఉంటాయి. కాబట్టి ఇచ్చిన రోజులను 7తో భాగిస్తే వచ్చే శేషాన్ని అదనపు రోజులు లేదా విషమ రోజులు లేదా విషమ దినాలు అంటారు. 

 

1. 45 రోజులకు ఉండే అదనపు రోజులు ఎన్ని? 

1) 5        2) 2      3) 1     4) 3 

జవాబు: 4

సాధన: 

 శేషం 3 కాబట్టి 45 రోజులకు ఉండే అదనపు రోజులు 3

 

2. సాధారణ సంవత్సరంలోని అదనపు రోజులు ఎన్ని? 

1) 2            2) 1          3) 0          4) 4

జవాబు: 2

సాధన: సాధారణంగా ఏడాదికి 365 రోజులు ఉంటాయి.  కాబట్టి 

        

శేషం 1, భాగఫలం 52 అంటే సాధారణ సంవత్సరంలో 52 వారాలు, ఒక అదనపు రోజు ఉంటాయి. 

 

3. లీపు సంవత్సరంలోని అదనపు రోజులు ఎన్ని?

1) 1      2)      3 3) 2      4) 0

జవాబు: 3

సాధన: లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి.

శేషం 2, భాగఫలం 52. అంటే లీపు సంవత్సరంలో 52 వారాలు, 2 అదనపు రోజులు ఉంటాయి.

 

మోడల్‌ - 2

* అదనపు రోజులు లేదా విషమ దినాలకు సంబంధించి కొన్నిరకాల అనువర్తనాలు.  

* క్యాలెండ‌ర్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల్లో కొన్ని రోజుల తర్వాత అని అడిగితే శేషాన్ని కలపాలి. కొన్ని రోజుల కిందట అని అడిగితే శేషాన్ని తీసేయాలి. క‌చ్చితంగా ఒకరోజు గురించి అడిగితే శేషానికి 1 తగ్గించి కలపాలి. 

 

4. ఈ రోజు ఆదివారం అయితే 67 రోజుల తర్వాత ఏ వారం వస్తుంది?

1) సోమవారం         2) బుధవారం            3) శుక్రవారం        4) గురువారం 

జవాబు: 4

సాధన: వారానికి ఏడు రోజులు కాబట్టి 

అదనపు రోజులు 4

* ఆదివారం + 4 రోజులు = గురువారం

 

5. ఈ రోజు శుక్రవారం అయితే 150 రోజుల కిందట ఏ వారం?

1) మంగళవారం         2) ఆదివారం     3) సోమవారం         4) శనివారం

జవాబు: 1

సాధన: 

అదనపు రోజులు 3

* శుక్రవారం - 3 = మంగళవారం

 

6. ఈ రోజు సోమవారం అయితే 183వ రోజు ఏ వారం అవుతుంది?

1) సోమవారం   2) గురువారం   3) శనివారం   4) ఆదివారం

జవాబు: 1

సాధన: 

అదనపు రోజులు 1 

* సోమవారం + (1 - 1) = సోమవారం

 

 

మోడల్‌ - 3


* ఒక నెలలో ఏయే తేదీల్లో ఏ రోజులు వస్తాయో, మరొక నెలలో ఆయా తేదీల్లో అవే రోజులు వస్తే ఆ రెండు నెలలు ఒకే క్యాలెండర్‌ను పోలి ఉన్నాయని అంటారు. 

* సాధారణ సంవత్సరంలో జనవరి, అక్టోబరు నెలలు ఒకే క్యాలెండర్‌ను పోలి ఉంటాయి.

* లీపు సంవత్సరంలో జనవరి, జులై నెలలు ఒకే క్యాలెండర్‌ను పోలి ఉంటాయి.

* ఒక ఏడాదిలోని ప్రతి నెల ఏయే తేదీల్లో ఏయే రోజులు వస్తాయో, మరో సంవత్సరంలో ఆయా తేదీల్లో అవే రోజులు వస్తే ఆ రెండు సంవత్సరాలు ఒకే క్యాలెండరును పోలి ఉన్నాయి అంటారు. 

 

7. 2022వ సంవత్సరాన్ని పోలిన ఏడాది వెంటనే మళ్లీ ఎప్పుడు వస్తుంది?

1) 2030        2) 2028        3) 2033    4) 2035

జవాబు: 3

సాధన:  

అదనపు రోజుల మొత్తం = 1 + 2 + 1 + 1 + 1 + 2 + 1 + 1 + 1 + 2 + 1 = 14

అదనపు రోజుల మొత్తం 7 యొక్క గుణిజం వచ్చే వరకు పై విధానాన్ని కొనసాగించాలి. 

కాబట్టి 2022, 2033 సంవత్సరాలు ఒకే క్యాలెండర్‌ను పోలి ఉంటాయి.

 

8. 2025వ సంవత్సరాన్ని పోలిన ఏడాది వెంటనే మళ్లీ ఎప్పుడు వస్తుంది? 

1) 2028       2) 2031        3) 2032    4) 2035

జవాబు: 2

సాధన: 

   అదనపు రోజుల మొత్తం = 1 + 1 + 2 + 1 + 1 + 1 

                                          = 7 (7 గుణిజం)

కాబట్టి 2025, 2031 సంవత్సరాలు ఒకే క్యాలెండరును పోలి ఉంటాయి. 

 

9. 2033వ ఏడాదిని పోలిన సంవత్సరం తిరిగి ఎప్పుడు వస్తుంది? 

1) 2037          2) 2040            3) 2038          4) 2039

జవాబు: 4

సాధన:  

​​​​​​

      అదనపు రోజుల మొత్తం = 1 + 1 + 2 + 1 + 1 + 1 = 7

∴ 2033, 2039 సంవత్సరాలు ఒకే క్యాలెండరును పోలి ఉంటాయి. 

 

సంవత్సరాన్ని పోలిన సంవత్సరాన్ని కింది విధంగా కూడా కనుక్కోవచ్చు. 

* 2024 లీపు సంవత్సరం

* 2025 లీపు సంవత్సరం తర్వాత వచ్చే మొదటి ఏడాది

* 2026 లీపు సంవత్సరం తర్వాత వచ్చే రెండో ఏడాది

* 2027 లీపు సంవత్సరం తర్వాత వచ్చే మూడో ఏడాది

* లీపు సంవత్సరం తర్వాతి సంవత్సరాన్ని పోలిన ఏడాదిని కనుక్కోవడానికి 6ను కలపాలి. 

ఉదా: 2025 + 6 = 2031

 

* లీపు సంవత్సరం తర్వాత 2వ, 3వ సంవత్సరాలను పోలిన ఏడాదిని కనుక్కోవడానికి 11ను కలపాలి.

ఉదా: 2026 + 11 = 2037, 2027 + 11 = 2038

 

* లీపు సంవత్సరాన్ని పోలిన సంవత్సరాన్ని కనుక్కోవడానికి 28ని కలపాలి. 

ఉదా: 2024 + 28 = 2052

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  దిశ నిర్దేశ పరీక్ష

   పజిల్‌ టెస్ట్‌

‣  పదాల తార్కిక అమరిక

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 16-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌