• facebook
  • whatsapp
  • telegram

నిశ్చితం - కారణం

సూచనలు (ప్ర. 1 - 16): ప్రశ్నల్లో నిశ్చితం (A), కారణం (R) ఉన్నాయి. కింది ఆప్షన్స్‌ ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

ఎ) A, Rరెండూ సరైనవి, A కి R సరైన వివరణ

బి) A, R రెండూ సరైనవి, A  కి R సరైన వివరణ కాదు

సి) A సరైంది కానీ R తప్పు

డి) A  సరైంది కాదు కానీ  R సరైంది  

ఇ) A, R రెండూ సరైనవి కాదు 


1. నిశ్చితం (A): సుభాష్‌ చంద్రబోస్‌ 1939లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

కారణం (R):సుభాష్‌ చంద్రబోస్‌ భారత స్వాతంత్య్ర లీగ్‌ను ఆగ్నేయాసియాలో ప్రారంభించేందుకు కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు.

సాధన: నిశ్చితం (A) సరైంది. కానీ కారణం (R) సరైంది కాదు. 

సమాధానం: సి


2. నిశ్చితం (A): గ్రాఫైట్‌కి జారుడు స్వభావం ఉంటుంది. దీన్ని కందెనగా ఉపయోగిస్తారు.

కారణం (R): గ్రాఫైట్‌లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.

సాధన: A, R రెండూ సరైనవే. గ్రాఫైట్‌కి జారుడు స్వభావం ఉండటం వల్ల దాన్ని కందెనగా ఉపయోగిస్తారు. దీనికి కారణం స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లు కాదు. కాబట్టి A కి R సరైన వివరణ కాదు.

సమాధానం: బి


3. నిశ్చితం (A): క్లోరోఫ్లోరోకార్బన్ల (సీఎఫ్‌సీ) వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు.

కారణం (R):వీటి కారణంగా చర్మ క్యాన్సర్‌ వస్తుంది.

సాధన:  A సరైంది. సీఎఫ్‌సీ వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. కానీ ళి సరైంది కాదు. దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతోంది.

సమాధానం: సి


4. నిశ్చితం (A): శీతాకాలంలో తెల్లటి వస్త్రాలు ధరించడానికి ప్రజలు ఇష్టపడతారు.

కారణం (R): తెల్లటి వస్త్రాలు వేడిని పరావర్తనం చేసే మంచి సాధనాలు.

సాధన: A సరైంది కాదు. R సరైంది.

తెల్లటి వస్త్రాలు వేడిని పరావర్తనం చెందించే మంచి సాధనాలు.

సమాధానం: డి


5. నిశ్చితం (A): 21 మార్చి, 23 సెప్టెంబరు రోజుల్లో రాత్రి, పగటి సమయాలు సమానంగా ఉంటాయి.

కారణం (R): భూమధ్య రేఖ రెండు ధృవాలకు సమాన దూరంలో ఉంటుంది.

సాధన: నిశ్చితం (A), కారణం  (R) రెండూ సరైనవే. (A), కి (R)   సరైన వివరణ.

ఆ రెండు రోజుల్లో భూమధ్య రేఖకు, ధృవాలకు మధ్య దూరం సమానం అవుతుంది.

సమాధానం:


6. నిశ్చితం  (A):  ఇథైల్‌ ఆల్కహాల్‌ (C2H5OH), నీరు (H2O) మిశ్రమాన్ని పూర్తిగా వేరు చేయొచ్చు. 

కారణం (R): నీరు మరిగే స్థానం 100°C. ఆల్కహాల్‌ మరిగే స్థానం 80°C

సాధన: నిశ్చితం (A) సరైంది కాదు. కారణం  (R)  సరైంది.

సమాధానం: డి


7. నిశ్చితం (A): ఆనకట్టల్లో నిల్వ చేసిన నీటికి స్థితిశక్తి ఉంటుంది.

కారణం (R): స్థితి, గతిశక్తుల మొత్తం రసాయన శక్తి అవుతుంది.

సాధన: A సరైంది. కానీ R సరైంది కాదు.

భూ ఉపరితలానికి కొంత ఎత్తులో స్థిరంగా ఉన్న వస్తువులు అన్నింటిలో స్థితిశక్తి + గత్తి శక్తి = యాంత్రిక శక్తి

సమాధానం: సి


8. నిశ్చితం (A): కోడిగుడ్డుపై బలం ప్రయోగించినప్పుడు అది పగులుతుంది.

కారణం (R): ప్రమాణ వైశ్యాలంపై ప్రయోగించిన బలాన్ని పీడనం అంటారు.

సాధన: A, R రెండూ సరైనవి. (A) కి (R) సరైన వివరణ ఇస్తుంది.

సమాధానం:


9. నిశ్చితం (A): ధృవాల వద్ద వస్తువులు అధిక భారాన్ని కలిగి ఉంటాయి. 

కారణం (R) : ధృవాల వద్ద భూమి గురుత్వ త్వరణం విలువ గరిష్ఠం.

సాధన: A, R సరైనవి.  (A) కి (R) సరైన వివరణ.

సమాధానం:


10. నిశ్చితం ( A ): న్యూక్లియర్‌ రియాక్టర్‌లో భారజలాన్ని మోడరేటర్‌లా ఉపయోగిస్తారు.

కారణం (R): న్యూక్లియర్‌ రియాక్టర్‌లో కేంద్రక విచ్ఛిత్తి కోసం థర్మల్‌ న్యూట్రాన్‌లను ఉపయోగిస్తారు.

సాధన: A, R రెండూ సరైనవి A కి R సరైన వివరణ ఇస్తుంది.        

సమాధానం:


11. నిశ్చితం (A):ఎత్తయిన ప్రాంతాల్లో ఆహార పదార్థాలను ఉడికించడానికి ముందు వాటికి ఉప్పు కలుపుతారు.

కారణం (R): ఎత్తయిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనిష్ఠం.

సాధన: A, R సరైనవి.(A) కి (R) సరైన వివరణ.

సమాధానం:


12. నిశ్చితం (A): O గ్రూప్‌ బ్లడ్‌ ఉన్నవారు విశ్వగ్రహీతలు.

కారణం (R): O గ్రూప్‌ బ్లడ్‌లో ప్రతిజనకాలు ఉండవు.

సాధన:  A సరైంది కాదు, కానీ R సరైంది.  O గ్రూప్‌ బ్లడ్‌ వారిని విశ్వదాతలు అంటారు.

ఎందుకంటే O గ్రూప్‌ రక్తంలో ప్రతిజకాలు ఉండవు. అవి ప్రతి రక్షకాలను ఏర్పరచుకోవు. కాబట్టి ఈ రకం రక్తాన్ని ఏ గ్రూప్‌ రక్తం కలిగిన వారికైనా ఎక్కించవచ్చు.

సమాధానం: డి


13. నిశ్చితం (A): పర్వతాల పైకి వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది.

కారణం (R): వాతావరణంలో పైన ఉండే గాలి శుద్ధంగా ఉంటుంది.

సాధన: A సరైంది కాదు,  కానీ R సరైంది. వాతావరణంలో పైకి వెళ్లేకొద్దీ పీడనం పెరుగుతుంది. గాలి శుద్ధంగా ఉంటుంది.

సమాధానం: డి


14. నిశ్చితం (A): ఎయిడ్స్‌కి వ్యాక్సిన్‌ లేదు.

కారణం (R): ఎయిడ్స్‌ వాక్సిన్‌ తయారీకి చాలా ఖర్చు అవసరం.

సాధన: A సరైంది కానీ R సరికాదు. ఎయిడ్స్‌కి కారణమైన వైరస్‌ దాని జెనెటిక్‌ కోడ్‌ను (వారసత్వ కోడ్‌) మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి  ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తయారీ సాధ్యపడలేదు.

సమాధానం: సి


15. నిశ్చితం (A): జేమ్స్‌ చాడ్విక్‌ ఎలక్ట్రాన్‌ను కనుక్కున్నారు.

కారణం (R): ఎలక్ట్రాన్‌ ఆవేశం తటస్థం. కాబట్టి దాన్ని కనుక్కోవడం అసాధ్యం.

సాధన: A ,R  రెండూ సరైనవి కాదు. ఎలక్ట్రాన్‌ను జె.జె.థామ్సన్‌ కనుక్కున్నారు. ఎలక్ట్రాన్‌ అవేశం రుణాత్మకం.

సమాధానం:


16. నిశ్చితం (A): కొవ్వులను ఆక్సీకరణం చెందించిప్పుడు అవి విడుదల చేసే శక్తి, కార్బోహైడ్రేట్‌లను ఆక్సీకరణం చేసినప్పుడు విడుదలయ్యే శక్తిలో సగం ఉంటుంది.

కారణం(R): కార్బోహైడ్రేట్స్‌లో ఉండే ఆక్సిజన్‌ కంటే కొవ్వుల్లో ఉండే ఆక్సిజన్‌ తక్కువ.

సాధన: నిశ్చితం (A), కారణం (R) సరైనవి కావు. కార్బోహైడ్రేట్ల ఆక్సీకరణం వల్ల విడుదలయ్యే శక్తి కంటే కొవ్వుల ఆక్సీకరణం వల్ల అధిక శక్తి విడుదల అవుతుంది. 

సమాధానం:


రచయిత

బూసర గణేష్, 

విషయ నిపుణులు 

Posted Date : 12-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌