• facebook
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

1. వెల్లుల్లి ఘాటైన వాసనకు కారణం ఏమిటి?
1) ఫాస్ఫరస్‌ సమ్మేళనాలు   
2) క్లోరిన్‌ సమ్మేళనాలు  
3) సల్ఫర్‌ సమ్మేళనాలు   
4) మెగ్నీషియం సమ్మేళనాలు


2. కింది దేనిలో విద్యుత్‌ వాహకత అధికంగా ఉంటుంది?
1) స్వేదన జలం    2) సముద్రపు నీరు 
3) ఇథైల్‌ ఆల్కహాల్‌  4) స్వచ్ఛమైన నీరు 


3. వేసవిలో మట్టికుండలోని నీరు చల్లగా ఉండటానికి కారణం ఏమిటి?

1) పీడనం      2) నీరు ఆవిరి కావడం   

3) కుండలోని మలినాలు  4) సాంద్రత


4. డెట్టాల్లోని క్రియాశీల పదార్థం ఏది?
1) నీరు     2) క్లోరోగ్జైలెనాల్‌   
3) ఫినాల్‌  3) మిథైల్‌ ఆల్కహాల్‌


5. కిందివాటిని జతపరచండి.
జీవాణువు                  లోహకేంద్రం

A) హిమోగ్లోబిన్‌        i) కోబాల్ట్‌

B) క్లోరోఫిల్‌              ii) ఇనుము

C) విటమిన్‌ B12      iii) మెగ్నీషియం
1) A - ii, B - iii, C - i     2) A - ii, B - i, C - iii
3) A - i, B - iii, C - ii     4) A - iii, B - ii, C - i


6. కిందివాటిలో తక్కువ వాతావరణ కాలుష్యాన్ని కలిగించే ఇంధనం ఏది?

1) పెట్రోల్‌          2) బొగ్గు  
3) డీజిల్‌          4) హైడ్రోజన్‌  


7. కిందివాటిలో అత్యంత సాంద్రత ఉన్న లోహం ఏది?
1) హైడ్రోజన్‌       2) సోడియం   

3) ఆస్మియం         4) పొటాషియం


8. కంటిచూపుపై ప్రభావం చూపే రసాయన పదార్థం ఏది?

1) మిథైల్‌ ఆల్కహాల్‌     2) ఇథైల్‌ ఆల్కహాల్‌ 

3) 1, 2             4) పైవేవీకావు


9. ఒక పరమాణువు ధనావేశ అయాన్‌గా మారినప్పుడు ఏం జరుగుతుంది?

1) పరమాణు వ్యాసార్ధం పెరుగుతుంది.
2) పరమాణు వ్యాసార్ధం తగ్గుతుంది. 
3) పరమాణు భారం తగ్గుతుంది.
4) పరమాణు భారం పెరుగుతుంది.


10. కిందివాటిలో లోహక్షయాన్ని అరికట్టే విధానాలు ఏవి?

1) మిశ్రమ లోహం చేయడం 
2) గాల్వనైజేషన్‌ 
3) ఎలక్ట్రోప్లేటింగ్‌        
4) పైవన్నీ


11. నీటిలోని బ్యాక్టీరియాను సంహరించేందుకు ఉపయోగించే వాయువు ఏది?

1) క్లోరిన్‌      2) ఫ్లోరిన్‌       3) నైట్రోజన్‌      4) ఆర్గాన్‌


12. ముడి చమురు నుంచి పెట్రోల్‌ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు?

1) స్వేదనం      2) అంశిక స్వేదనం     3) భర్జనం       4) ప్రగలనం


13. కిందివాటిలో భిన్నమైంది ఏది?

1) బెంజీన్‌       2) ఇథైల్‌ ఆల్కహాల్‌    3) సాధారణ లవణం    4) గ్లూకోజ్‌


14. శీతాకాలంలో బంకమట్టి పెళ్లలుగా విరగడానికి కారణం ఏమిటి?

1) మట్టిలోని సిలికా ఆవిరి కావడం   

2) నీటి అధిక తలతన్యత   

3) మట్టిలోని నీరు ఆవిరి కావడం  

4) నీటి అసంగత వ్యాకోచం


15. డ్యుటీరియం కేంద్రకంలో ఉండే ప్రోటాన్, న్యూట్రాన్‌ల సంఖ్య వరుసగా?

1) 1, 2        2) 0, 2 

3) 1, 1        4) 2, 1


16. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక లీటర్‌ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం మోల్‌ల సంఖ్యను ఏమంటారు?

1) నార్మాలిటీ        2) మొలాలిటీ   

3) మోల్‌భాగం       4) మొలారిటీ


17. కింది అంశాలను జతపరచండి.

  విషయం               శాస్త్రవేత్త

A. విద్యుద్విశ్లేషణ    i) జి.ఎన్‌.లూయిస్‌

B. పరమాణు           ii) మైకేల్‌ ఫారడే

  కేంద్రక ఆవిష్కరణ

C. సమయోజనీయ బంధం iii) రూథర్‌ఫర్డ్‌

1) A - iii, B - ii, C - i     2) A - ii, B - i, C - iii

3) A - ii, B - iii, C - i     4) A - i, B - iii, C - ii


18. కిందివాటిని జతపరచండి.

హైడ్రోజన్‌ సమ్మేళనం       రసాయన ఫార్ములా

A. నీరు                             i) D2O  
B. భారజలం                    ii) H2O2
C. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌     iii) H2O
1) A - iii, B - i, C - ii       2) A - iii, B - ii, C - i

3) A - ii, B - i, C - iii     4) A - i, B - iii, C - ii


19. కింది అంశాలను జతపరచండి.

pH విలువ     పదార్థ స్వభావం
A) 3                 i) క్షారం
B) 7                ii) ఆమ్లం
C) 11              iii) తటస్థం
1) A - iii, B - ii, C - i        2) A - ii, B - i, C - iii

3) A - i, B - iii, C - ii        4) A - ii, B - iii, C - i


20. పదార్థాలను గాలి సమక్షంలో మండించడాన్ని ఏమంటారు?

1) భర్జనం       2) క్షయకరణం      3) వల్కనీకరణం      4) ఎచ్చింగ్‌


21. స్వచ్ఛమైన సిలికాన్‌ను ఏమంటారు?

1) కార్బోరండం       2) క్వార్ట్జ్‌     3) పొడిమంచు       4) నైట్రోలిమ్‌


22. కిందివాటిని జతపరచండి.

ఆర్బిటాల్‌               ఆకృతి

A) s - ఆర్బిటాల్‌       i) క్లిష్టమైన ఆకృతి 

B) p - ఆర్బిటాల్‌      ii) డబుల్‌ డంబెల్‌ ఆకారం 

C) d- ఆర్బిటాల్‌       iii) గోళాకారం  

D) f - ఆర్బిటాల్‌       iv) డంబెల్‌ ఆకారం (ముద్గరాకారం)

1) A - iii, B - iv, C - i, D - ii 
2) A - ii, B - iv, C - i, D - iii
3) A - iii, B - iv, C - ii, D - i
4) A - iv, B - iii, C - ii, D - i


23. బాహ్య కర్పరం అసంపూర్తిగా ఎలక్ట్రాన్‌లతో నిండి ఉన్న మూలకాలను ఏమంటారు?
1) జడవాయువులు        2) ప్రాతినిధ్య మూలకాలు
3) పరివర్తన మూలకాలు    4) అంతర పరివర్తన మూలకాలు


24. సోడాలైమ్‌ ఏ రసాయనాల మిశ్రమం?

1)  సోడియం హైడ్రాక్సైడ్‌ + కాల్షియం హైడ్రాక్సైడ్‌    

2) సోడియం సల్ఫేట్‌ + కాల్షియం హైడ్రాక్సైడ్‌

3) సోడియం హైడ్రాక్సైడ్‌ + కాల్షియం సల్ఫేట్‌

4) సోడియం సల్ఫేట్‌ + కాల్షియం సల్ఫేట్‌


25. థెర్మిట్‌ మిశ్రమం అంటే ఏమిటి?

1) 1 : 3 నిష్పత్తిలో Al పొడి, Fe2CO3 ల మిశ్రమం
2) 1 : 3 నిష్పత్తిలో Al  పొడి, Al2O3 ల మిశ్రమం
3) 1 : 3 నిష్పత్తిలో Mg పొడి, Fe2Oల మిశ్రమం
4) 3 : 1 నిష్పత్తిలో  Al పొడి, CaO ల మిశ్రమం


26. కిందివాటిలో ఆమ్ల ఆక్సైడ్‌లు ఏవి?

i)  CO2    ii) CO     iii) SiO2    iv) MgO
1) i మాత్రమే         2) i, ii      3) i, iii         4) i, ii, iii 


27. కిందివాటిలో గ్రాఫైట్‌కు సంబంధించి సరికానిది ఏది?

1) గ్రాఫైట్‌ కార్బన్‌ రూపాంతరం 
2) గ్రాఫైట్‌ మంచి ఉష్ణ, విద్యుత్‌ వాహకం
3) గ్రాఫైట్‌ను పెన్సిళ్ల తయారీలో ఉపయోగిస్తారు
4) దీనిలో ప్రతి కార్బన్‌ పరమాణువు నాలుగు ఇతర కార్బన్‌ పరమాణువులతో బంధితమై ఉంటుంది.


28. మార్షల్‌ ఆమ్లం అని దేన్ని అంటారు?
1) పెరాక్సీమోనో సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 
2) పెరాక్సీ డై సల్ఫ్యూరిక్‌ ఆమ్లం
3) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 
4) పైరో సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 


29. ఆక్సిజన్‌ను కనుకున్న శాస్త్రవేత్త ఎవరు?

1)  సి.డబ్ల్యూ. షీలే  2) ఎ. లెవోయిజర్‌ 

3) ఆర్‌. బాయిల్‌      4) అవగాడ్రో

30. పదార్థాలు హైడ్రోజన్‌ను కోల్పోవడాన్ని లేదా ఆక్సిజన్‌ను పొందడాన్ని ఏమంటారు?

1) క్షయకరణం       2) జలవిశ్లేషణం 

3) తటస్థీకరణం       4) ఆక్సీకరణం


31. సల్ఫర్‌ ఒక .....అణువు.

1) ద్విపరమాణుక        2) త్రిపరమాణుక 

3) అష్టపరమాణుక      4) ఏకపరమాణుక


32. కిందివాటిలో సహజవాయువు రంగంలో సేవలందిస్తున్న సంస్థ ఏది?
1) ONGC        2) GAIL

3) 1, 2            4) NTPC


33. భారతదేశపు అతిపెద్ద పరిశోధన సంస్థ అయిన CSIR పూర్తి పేరు ఏమిటి?
1) కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌
2) సెంటర్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌
3) కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండియన్‌  రిసెర్చ్‌
4) కార్పొరేషన్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండియన్‌ రిసెర్చ్‌


34. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం       2) హైదరాబాద్‌ 

3) ఫరీదాబాద్‌       4) బెంగళూరు


35. గోబర్‌గ్యాస్‌లో ఉన్న ప్రధాన వాయువు ఏది?
1) బ్యూటేన్‌       2) మీథేన్‌    3) ఎసిటిలీన్‌     4) కార్బన్‌ డైఆక్సైడ్‌


36. కిందివాటిలో వాయు కాలుష్యానికి కారణాలు ఏవి?
1) పరిశ్రమల నుంచి వెలువడే హానికరమైన వాయువులు
2) అడవుల నరికివేత
3) థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే హానికరమైన పదార్థాలు
4) పైవన్నీ


37. కిందివాటిలో గ్రీన్‌హౌస్‌ వాయువులు ఏవి?

1) మీథేన్‌      2) కార్బన్‌ డైఆక్సైడ్‌ 

3) నైట్రస్‌ ఆక్సైడ్‌     4) పైవన్నీ


38. యాంటీసెప్టిక్‌గా ఉపయోగపడే బోరిక్‌ ఆమ్లం రసాయన ఫార్ములా ఏమిటి?

1) H3BO3                    2) B2H6  
3) Na2B4O7.10H2O     4) B2O3


39. కిందివాటిలో ‘సూపర్‌ హాలోజన్‌’ అని దేన్ని అంటారు?
1) క్లోరిన్‌        2) బ్రోమిన్‌ 

3) ఫ్లోరిన్‌    4) సిలికాన్‌


40. ఎర్రనేలలు ఆ రంగులో ఉండేందుకు కారణం ఏమిటి?
1) వాటిలో ఉండే ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ 

2) వాటిలో ఉండే నైట్రిక్‌ ఆక్సైడ్‌

3) వాటిలో ఉండే జింక్‌ ఆక్సైడ్‌

4) పైవన్నీ


41. పాదరసం (మెర్క్యురీ) మూలకం లాటిన్‌ పేరు ఏమిటి?
1) హైడ్రార్జిరమ్‌      2) ప్లంబం     3) ఆరమ్‌      4) కాలియం


42. ఆమ్లం +  క్షారం →  ......+ ...... + ఉష్ణం

1) లవణం, నీరు       2) లవణం, ఆక్సిజన్‌ 

3) నైట్రోజన్, నీరు      4) కార్బన్‌ డైఆక్సైడ్, ఆక్సిజన్‌


43. కిందివాటిని జతపరచండి.

జాబితా - I                  జాబితా - II

A) ఆస్ప్రిన్‌               i) యాంటీబయాటిక్‌
B) అమాక్సిసిలిన్‌    ii) నార్కోటిక్‌
C) హెరాయిన్‌         iii) అనాల్జెసిక్‌
1) A - ii, B - i, C - iii    2) A - iii, B - ii, C - i
3) A - i, B - iii, C - ii    4) A - iii, B - i, C - ii


44. కిందివాటిలో అత్యధిక లోహ స్వభావం ఉన్న మూలకం ఏది?

1) ఫ్లోరిన్‌      2) క్లోరిన్‌       3) బ్రోమిన్‌     4) ఆక్సిజన్‌


45. మంచు కంటే తక్కువ ఉష్ణోగ్రతలను పొందేందుకు ఉపయోగపడేది?
1) పొడిమంచు   
2) మంచు + సాధారణ ఉప్పు 
3) ఆల్కహాల్‌     4) 1, 2


46. వంటగ్యాస్‌లో ఉండే బ్యూటేన్‌ వాయువు ఫార్ములా ఏమిటి?

1)  C2H6           2)  C3H8      3) C4H10       4) CH4


47. వెనిగర్‌ అంటే ఏమిటి?

1) సజల హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం

2) సజల ఆగ్జాలిక్‌ ఆమ్లం 

3) సజల సిట్రిక్‌ ఆమ్లం 

4) సజల ఎసిటిక్‌ ఆమ్లం 


48. ఎరువుల తయారీకి ముడిపదార్థం అయిన అమ్మోనియాను వేటి నుంచి తయారుచేస్తారు?

1) నైట్రోజన్‌ + ఆక్సిజన్‌   

2) నైట్రోజన్‌ + హైడ్రోజన్‌ 

3) నైట్రోజన్‌ + సోడియం 

4) నైట్రోజన్‌ + క్లోరిన్‌

 

49. ఆధునిక రసాయనశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? 
1) ఆంటోనీ లెవోయిజర్‌       2) జాన్‌ డాల్టన్‌   
3) జె.జె.థామ్సన్‌            4) నీల్స్‌ బోర్‌


50. కిందివాటిలో ద్రవ్యనిత్యత్వ నియమానికి సంబంధించి సరైంది ఏది?
1) ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించవచ్చు, నాశనం చేయొచ్చు.
2) ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించవచ్చు, కానీ నాశనం చేయలేం.
3) ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేం, నాశనం చేయలేం.
4) ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేం, కానీ నాశనం చేయొచ్చు.


51. కింది వాటిలో ఏ ఉప పరమాణు కణం రుణావేశాన్ని కలిగి ఉంటుంది?
1) ఎలక్ట్రాన్‌     2) ప్రోటాన్‌      3) న్యూట్రాన్‌      4) పైవేవీకావు


52. తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్‌ల సంఖ్యను ఏమంటారు?
1) అవగాడ్రో సంఖ్య      2) పరమాణు సంఖ్య  
3) ద్రవ్యరాశి సంఖ్య     4) క్వాంటం సంఖ్య


53. కిందివాటిలో పరమాణువుకు సంబంధించి సరికానిది? 
1) పరమాణువులోని కేంద్రకం ధనావేశాన్ని కలిగి ఉంటుంది.
2) కేంద్రకంలోని ఎలక్ట్రాన్‌ల వల్ల పరమాణువుకు ధనావేశం వస్తుంది.
3) కేంద్రకానికి, ఎలక్ట్రాన్లకు మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది.
4) కేంద్రకంలోని ప్రోటాన్‌ల వల్ల పరమాణువుకు ధనావేశం వస్తుంది.


54. రెండు, మూడో కక్ష్యలో ఉండే ఉపకక్ష్యల సంఖ్య వరుసగా...
1) 3, 2      2) 2, 2     3) 2, 3    4) 3, 3


55. కిందివాటిలో పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య ఒకే రకంగా (సమానంగా) ఉండే మూలకం?
1) నైట్రోజన్‌      2) ఆక్సిజన్‌       3) హైడ్రోజన్‌      4) హీలియం


56. కిందివాటిని జతపరచండి.
 జాబితా - i                       జాబితా - ii
A) 1 ఆంగ్‌స్ట్రామ్‌ (A)    i) 10-12 మీటర్లు
B) 1 పికో మీటర్‌ (pm)   ii) 10-15 మీటర్లు
C) 1 ఫెర్మి (fm)             iii) 10-10 మీటర్లు
1) A-i, B-iii, C-ii                2) A-iii, B-ii, C-i
3) A-ii, B-i, C-iii                4) A-iii, B-i, C-ii 


57. కింది ఏ నియమం ప్రకారం, పీడనాన్ని పెంచితే ద్రావణంలోని వాయువు ద్రావణీయత పెరుగుతుంది?
1) హెన్రీ నియమం        2) రౌల్ట్స్‌ నియమం   
3) చార్లెస్‌ నియమం       4) బాయిల్‌ నియమం


58. కిందివాటిలో సజాతీయ మిశ్రమ ద్రావణాన్ని ఏర్పరిచే పదార్థాలు ఏవి?
1) నీరు + ఆల్కహాల్‌   2) నీరు + పెట్రోల్‌   
3) నీరు + గ్లిజరాల్‌       4) 1, 3


59. మేఘం ఏ రకానికి చెందిన కొల్లాయిడ్‌ ద్రావణం?
1) వాయువులో వాయు పదార్థం 
2) వాయువులో ఘన పదార్థం   
3) ద్రవంలో వాయు పదార్థం 
4) వాయువులో ద్రవ పదార్థం


60. రక్తం ఏ రకం కొల్లాయిడ్‌ ద్రావణం?
1) ఎమల్షన్‌      2) జెల్‌  3) ఘన సాల్‌  4) సాల్‌ 


61. పాలలోని ఘటకాలు వేరుపడకుండా స్థిరంగా ఉండేందుకు అందులోని ఏ ఎమల్సీకరణ కారకం కారణం?
1) టార్టారిక్‌ ఆమ్లం      2) లాక్టిక్‌ ఆమ్లం 
3)  కేసిన్‌             4) పైవన్నీ


62. కిందివాటిలో విద్యుత్‌ బంధకాలు ఏవి?
1) వెండి      2) వజ్రం     3) శుద్ధమైన నీరు     4) 2, 3


63. ఇసుక, రాళ్లలో సిలికాన్‌ ఏ రూపంలో అధికంగా  లభిస్తుంది?
1) సిలికాన్‌ డైఆక్సైడ్‌     2) సిలికోన్‌  
3) సిలికేట్‌            5) సిలికాన్‌ కార్బైడ్‌


64. కింది వాటిలో మూలకాల రారాజు అని ఏ రసాయనాన్ని పిలుస్తారు?
1) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం     2) కార్బన్‌  
3) బంగారం           4) ప్లాటినం


65. 1 మోల్‌ = ......అణువులు
1) 6.023 x 1021   2) 6.023 x 1022 
3) 6.023 x 1023   4) 6.023 x 1024


66. ప్రమాణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద 1 మోల్‌ ఆదర్శ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం ఎంత?
1) 22.4 లీటర్లు        2) 11.2 లీటర్లు 
3) 5.6 లీటర్లు          4)18.2 లీటర్లు


67. కిందివాటిలో ఆదర్శవాయు సమీకరణం ఏది?
1) P(V − -b) = nRT    2) (P + a)(V − b) = nRT P
3)  PV = nRT           4)  P/V = nRT 


68. అధిక పీడనం వద్ద ఉన్న వాయువును తక్కువ పీడనం గల ప్రాంతానికి వ్యాకోచింపజేసినప్పుడు వాయువు చల్లబడుతుంది. దీన్నే ........ఫలితం అంటారు?
1) జౌల్‌ - థామ్సన్‌ ఫలితం
2) ఫొటో - ఎలక్ట్రిక్‌ ఫలితం  
3) కాంప్టన్‌ ఫలితం      
4) సీబెక్‌ ప్రభావం


69. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
1) స్పటిక ఘన పదార్థాల భౌతిక ధర్మాలు వివిధ దిశల్లో వేర్వేరుగా ఉంటాయి.
2) అస్పటిక ఘన పదార్థాల భౌతిక ధర్మాలు ఏ దిశ నుంచి చూసినా ఒకేలా ఉంటాయి.
3) స్పటిక ఘన పదార్థాల్లో అణువులు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి.
4) స్పటిక ఘన పదార్థానికి కచ్చితమైన, నిర్దిష్టమైన ద్రవీభవన స్థానం ఉండదు.


70. అన్ని ఉష్ణోగ్రతలు, గాఢతల వద్ద ఏ నియమాన్ని పాటించే ద్రావణాన్ని ఆదర్శ ద్రావణం అంటారు?
1) రౌల్ట్స్‌ నియమం     2) హెన్రీ నియమం 
3) చార్లెస్‌ నియమం    4) స్టార్క్‌ - ఐన్‌స్టీన్‌ నియమం


71. మోల్‌ సంఖ్య =
1) భారం/ ఘనపరిమాణం      2) భారం/ అణుభారం
3) అణుభారం/భారం             4) ఘనపరిమాణం/అణుభారం          


72. ఒక భౌతిక రాశి ప్రయోగ కొలతలు, ఆ భౌతిక రాశి నిజ విలువకు ఎంత దగ్గరగా ఉన్నాయో తెలిపే భావనను ఏమంటారు?
1) సునిశితత్వం           2) కచ్చితత్వం 
3) అనిశ్చితత్వం          2) ఏకరూపత


73. ఒక భౌతిక రాశి ప్రయోగ కొలతలు ఒకదానికొకటి ఎంత దగ్గరగా ఉన్నాయో తెలిపే భావనను ఏమంటారు?
1) కచ్చితత్వం           2) అనిశ్చితత్వం  
3) సునిశితత్వం         4) వ్యత్యాసం


74. ఒక భౌతిక రాశి నిజ విలువకు, ప్రయోగ విలువకు మధ్య ఉన్న సంఖ్యాత్మక తేడాను ఏమంటారు?
1) కచ్చితత్వం          2) సునిశితత్వం 
3) సార్థక సంఖ్య        4) దోషం (Error) 


75. కింది వాటిని జతపరచండి.
ఉప పరమాణు కణం       ద్రవ్యరాశి
A) ఎలక్ట్రాన్‌                 i) 1.672 x 10-24 గ్రా.
B) ప్రోటాన్‌                  ii) 1.674 x 10-24 గ్రా.
C) న్యూట్రాన్‌              iii) 9.109 x 10-28 గ్రా.
1) A-iii, B-ii, C-i            2) A-ii, B-i, C-iii
3) A-iii, B-i, C-ii             4) A-i, B-iii, C-ii 


76. కిందివాటిలో సమ్మేళనానికి ఉదాహరణ ఏది?
1) సోడియం      2) ఇనుము      3) నీరు      4) బంగారం


77. ఒక పరమాణువులోని మూడో కక్ష్యలో కేంద్రకం చుట్టూ తిరిగే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య ఎంత?
1) 2        2) 8        3) 32        4) 18


78. మానవుడు వాడిన మొదటి లోహం ఏది?
1) బంగారం       2) ఇనుము      3) రాగి      4) తగరం 


79. ప్రోటాన్‌ ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్‌ ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది?
1) 1006      2) 1836       3) 836       4) 180


80. కిందివాటిలో విద్యుత్‌ అయస్కాంత తరంగాలు (Electromagnetic Radiation) ఏవి?
1) α - కణాలు     2) β - కణాలు  
3) γ  - కణాలు    4) పైవన్నీ


81. కిందివాటిలో పాజిట్రాన్‌ (Positron) ఏది?
1) −1e0           2) +1e0
3) 1H1           4) 0n1


82. అర్ధవాహకంలో ఆవేశ వాహక కణాలు ఏవి?
1) హోల్‌లు      2) ఎలక్ట్రాన్లు     3) 1, 2     4) న్యూట్రాన్లు


83. నిర్దిష్ట ఘనపరిమాణం ఉన్న ద్రవాలను కొలిచేందుకు ఉపయోగించే పరికరాలు ఏవి?
1) బ్యూరెట్‌  2) పిపెట్‌   3) కొలజాడీ   4) పైవన్నీ


84. కిందివాటిలో బాయిల్‌ సూత్రం ఏది?
1) పీడనం  ∝ ఘనపరిమాణం 
2) ఘనపరిమాణం  ఉష్ణోగ్రత 
3) పీడనం ∝  1/ఘనపరిమాణం
4) పీడనం 1/ఉష్ణోగ్రత


85. కిందివాటిలో సాంద్రతకు ప్రమాణాలు ఏవి?
1) గ్రా./సెం.మీ.3       2) కి.గ్రా./మీ.3 
3) గ్రా./మి.లీ.           4) పైవన్నీ


86. కిందివాటిలో సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ఏవి?
1)  గ్రా./సెం.మీ.3    2) కి.గ్రా./మీ.3
3) గ్రా./మి.లీ.         4) ప్రమాణాలు ఉండవు


87. మెగ్నీషియం, అల్యూమినియం మూలకాల సంయోజనీయత వరుసగా?
1)  2, 3      2) 3, 2     3) 2, 2    4) 3, 3


88. రేడియోధార్మికతకు కారణం ఏమిటి?
1) అస్థిర కేంద్రకం       2)స్థిర కేంద్రకం 
3) స్థిర అష్టక విన్యాసం   4) అస్థిర భౌతిక స్థితి


89. కిందివాటిలో రూపాంతరతను ప్రదర్శించే మూలకం ఏది?
1)  సల్ఫర్‌      2) ఫాస్ఫరస్‌       3) కార్బన్‌       4) పైవన్నీ


90. కిందివాటిలో చలువరాయి రసాయన నామం ఏమిటి?
1) సోడియం క్లోరైడ్‌       2) మెగ్నీషియం కార్బొనేట్‌ 
3) కాల్షియం క్లోరైడ్‌       4) కాల్షియం కార్బొనేట్‌


91. ఘటానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
1) విద్యుత్‌ శక్తి కాంతిగా మారుతుంది.
2) రసాయన శక్తి విద్యుత్‌ శక్తిగా మారుతుంది.
3) విద్యుత్‌ శక్తి రసాయన శక్తిగా మారుతుంది. 
4) యాంత్రిక శక్తి విద్యుత్‌ శక్తిగా మారుతుంది.


92. మొట్టమొదటిసారి విద్యుత్‌ ఘటాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
1) ఎడిసన్‌      2) వోల్టా      3) డాల్టన్  ‌   4) టెస్లా


93. కిందివాటిని జతపరచండి.
కర్బన పదార్థం      పరమాణు సూత్రం
A) క్లోరోఫాం                   i) CH4 
B) మిథైల్‌ ఆల్కహాల్‌   ii) CHCl3 
C) మీథేన్‌                   iii) CH3OH 
1) A-ii, B-i, C-iii          2) A-i, B-iii, C-ii
3) A-ii, B-iii, C-i         4) A-iii, B-ii, C-i 


94. కిందివాటిలో సాధారణ పీడనం, ఉష్ణోగ్రతలను గుర్తించండి.
1) 1 అట్మాస్ఫియర్, 100°C 
2) 760 అట్మాస్ఫియర్,  0°C 
3) 10 అట్మాస్ఫియర్,   0°C    
4) 105 పాస్కల్,  0°C   


95. కాల్షియం కార్బొనేట్‌  కాల్షియం ఆక్సైడ్ +  కార్బన్‌ డైఆక్సైడ్‌
 ఇది ఏ రకమైన రసాయన చర్యకు ఉదాహరణ?
1) రసాయన వియోగ చర్య  
2) రసాయన స్థానభ్రంశ చర్య 
3) రసాయన సంయోగ చర్య 
4) రసాయన ద్వంద్వ వియోగ చర్య


96. కిందివాటిలో తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం మధ్య సంబంధాన్ని గుర్తించండి.


97. సవ్యదిశ, అపసవ్య దిశలో తిరిగే ఎలక్ట్రాన్‌ స్పిన్‌ విలువలు ఎంత?


98. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌లను కనుక్కునే సంభావ్యత అధికంగా ఉండే ప్రదేశాన్ని ఏమంటారు?
1)  కర్పరం     2) కక్ష్య     3) ఉపకక్ష్య     4 ఆర్బిటాల్‌


99. అష్టక ఎలక్ట్రాన్‌ విన్యాసం లేని ఉత్కృష్ట వాయువు ఏది?
1)  హీలియం       2) నియాన్‌      3) ఆర్గాన్‌     4) క్రిప్టాన్‌


100. కార్బన్‌ మూలకం సంయోజకత ఎంత?
1) 1       2) 2      3) 4       4) 0


101. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఉపయోగించే చక్కెర?
1) ఫ్రక్టోజ్‌      2) గ్లూకోజ్‌     3) సుక్రోజ్‌     4) లాక్టోజ్‌


102. పెట్రోల్, డీజిల్‌లోని ప్రధాన మూలకాలు ఏవి?
1) కార్బన్‌     2) హైడ్రోజన్‌      3) ఫాస్ఫరస్‌  4) 1, 2

 

సమాధానాలు: 1-;3 2-2; 3-2; 4-2; 5-1; 6-4; 7-3; 8-1; 9-2; 10-4; 11-1; 12-2; 13-3; 14-4; 15-3; 16-4; 17-3; 18-1; 19-4; 20-1; 21-2; 22-3; 23-2; 24-1; 25-1; 26-3; 27-4; 28-2; 29-1; 30-4; 31-3; 32-3; 33-1; 34-2; 35-2; 36-4; 37-4; 38-1; 39-3 ;40-1 41-1; 42-1; 43-4; 44-1; 45-4; 46-3; 47-4; 48-2; 49-1; 50-2; 51-1 52-2; 53-2; 54-3; 55-3; 56-4; 57-1; 58-4; 59-4; 60-4; 61-3; 62-4; 63-1; 64-2; 65-3; 66-1; 67-3; 68-1; 69-4; 70-1; 71-2; 72-2; 73-3; 74-4; 75-3; 76-3; 77-4; 78-3; 79-2; 80-3; 81-2; 82-3; 83-4; 84-3; 85-4; 86-4; 87-1; 88-1; 89-4; 90-4; 91-2; 92-2; 93-3; 94-4; 95-1; 96-4; 97-2; 98-4; 99-1; 100-3; 101-2; 102-4. 

Posted Date : 19-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌