• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ శీతోష్ణస్థితి

 

మాదిరి ప్ర‌శ్న‌లు

 

1. భారత ప్రభుత్వ వాతావరణ శాఖ (IMD) ప్రకారం భారతదేశంలో ఎన్ని రుతువులు ఉన్నాయి?
జ: 4

 

2. నైరుతి రుతుపవనాల ఆఖర్లో ఏర్పడే వేడిని ఏమని పిలుస్తారు?
జ: అక్టోబరు హీట్

 

3. నైరుతి రుతుపవన కాలం ఏది?
జ: జూన్ - సెప్టెంబరు

 

4. తెలంగాణ అంతటా రుతుపవనాలు ఎప్పటి వరకు విస్తరిస్తాయి?
జ: జూన్ నెలాఖరు వరకు

 

5. తెలంగాణ శీతోష్ణస్థితిని ఏమంటారు?
జ: ఉష్ణమండల వర్షఛాయ శీతోష్ణస్థితి

 

6. ఒక ప్రాంతం ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతం, వర్షపాతం మొదలైన అంశాల దీర్ఘకాల సగటును ఏమంటారు?
జ: శీతోష్ణస్థితి

 

7. సముద్ర ప్రభావం లేని కారణంతో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో అధిక చలి ఉండటాన్ని ఏమంటారు?
జ: ఖండాతర్గత శీతోష్ణస్థితి

 

8. తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం ఉన్న ప్రదేశం?
జ: ఉత్తర తెలంగాణ

 

9. హైదరాబాద్ సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
జ: 600 మీటర్లు

 

10. తెలంగాణలో వర్షపాతం తక్కువగా ఉండటానికి కారణం?
జ: వర్షఛాయ ప్రాంతం కావడం.

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌