• facebook
  • whatsapp
  • telegram

గడియారాలు - దోష సమయం

సమయాన్ని సరిచేస్తే స‌మాధానం!

  గడియారం ఆగిపోతే ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. గంట కాస్త ముందే కొట్టేస్తే బస్టాండుకు వెళ్లి బస్సు కోసం పడిగాపులు కాయాలి. దీనినే ‘దోష సమయం’ అంటారు.  అందుకే ఎప్పటికప్పుడు సరైన సమయం కోసం గడియారాన్ని సరిచేస్తుంటారు. అదే రీజనింగ్‌లోనూ చేస్తే మార్కులు సంపాదించుకోవచ్చు. 

 

ఒక గడియారంలోని ముళ్లు భ్రమణంలో ఉన్న సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ గడియారం సరైన సమయాన్ని సూచించదు. దీన్నే ‘సమయంలో దోషం’ అంటారు. ఈ దోష సమయం ప్రధానంగా రెండు రకాలు.

1) సమయాన్ని పొందడం (Gaining time)

2) సమయాన్ని కోల్పోవడం (Losing time)

సమయాన్ని పొందడం: ఒక గడియారం అది సూచించాల్సిన సమయం కంటే ఎక్కువగా సూచిస్తుంటే ఆ గడియారం సమయాన్ని పొందింది అంటారు.

ఉదా: సరైన సమయం ఉదయం 8:00 సూచించాల్సిన ఒక గడియారం ఉదయం 8:05 గా సూచిస్తే ఆ గడియారం 5 నిమిషాల సమయాన్ని పొందింది అంటారు. అంటే దోషం 5 నిమిషాలు.

* గడియారం సమయాన్ని పొందుతున్న సందర్భంలో అది సూచించాల్సిన సరైన సమయాన్ని కనుక్కోవడానికి దోష సమయాన్ని తీసివేయాలి.

సమయాన్ని కోల్పోవడం: ఒక గడియారం అది సూచించాల్సిన సమయం కంటే తక్కువగా సూచిస్తే ఆ గడియారం సమయాన్ని కోల్పోతుంది అంటారు.

ఉదా: సరైన సమయం ఉదయం 8:00 సూచించాల్సిన ఒక గడియారం ఉదయం 7:56 గా సూచిస్తుంటే ఆ గడియారం 4 నిమిషాల సమయాన్ని కోల్పోయింది అంటారు. అంటే దోషం 4 నిమిషాలు.

* గడియారం సమయాన్ని కోల్పోతున్న సందర్భంలో అది సూచించాల్సిన సరైన సమయాన్ని కనుక్కోవడానికి కోల్పోయిన సమయాన్ని (దోష సమయాన్ని) కలపాలి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. ఆగిపోయిన గడియారం ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది?

1) 1   2) 2   3) 3  4) సూచించదు

జవాబు: 2

సాధన: ఉదయం సమయం, సాయంత్రం సమయం రెండూ ఉంటాయి. కాబట్టి రెండు సార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది.

 

2. ఉదయం 8 గంటలకు సరైన సమయాన్ని సూచించిన గడియారం, ప్రతి ఒక గంట సమయానికి 5 నిమిషాల సమయాన్ని పొందింది. అయితే అదే రోజు రాత్రి 9 గంటలకు అది చూపే సమయం ఎంత?

1) 10:15 pm       2) 9:15 pm  

3) 8:05 pm        4) 10:05 pm

జవాబు: 4

సాధన: ఉదయం 8 నుంచి సాయంత్రం 9 గంటల మధ్య సమయం 13 గంటలు.

 

3. మధ్యాహ్నం ఒంటిగంటకు సరైన సమయాన్ని సూచించిన ఒక గడియారం ప్రతి ఒక గంట సమయానికి 3 నిమిషాలు కోల్పోతుంది. అయితే ఆ తర్వాత రోజు ఉదయం 10 గంటలకు ఆ గడియారం సూచించే సమయం?

1) 11:03 am       2) 8:50 am  

3) 11:05 am          4) 8:57 am

జవాబు: 4

సాధన: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తర్వాతి రోజు ఉదయం 10 గంటల వరకు మొత్తం 21 గంటలు

 

4. ఉదయం 5 గంటలకు సరైన సమయాన్ని సూచిస్తున్న ఒక గడియారం ప్రతి 24 గంటల సమయంలో 16 నిమిషాలను కోల్పోతుంది. అయితే నాలుగో రోజు ఆ గడియారం రాత్రి 10 గంటలు సూచిస్తే అప్పుడు సరైన సమయం ఎంత?

1) 11:00 pm       2) 9:00 pm 

3) 8:00 pm         4) 12:00 pm

జవాబు: 1

సాధన: ఉదయం 5 గంటల నుంచి నాలుగో రోజు రాత్రి 10 గంటల వరకు మొత్తం సమయం 89 గంటలు.

24 గంటలు - 16 నిమిషాలు = 23 గంటల 44 నిమిషాలు

23 గంటల 44 నిమిషాల సమయానికి సరైన సమయం 24 గంటలు


 

 

5. ఒక గడియారం సోమవారం ఉదయం 7 గంటలకు సరైన సమయాన్ని చూపించింది. ఆ గడియారం ప్రతి 24 గంటల సమయానికి 15 నిమిషాలు కోల్పోతుంది. తర్వాత శుక్రవారం ఉదయం ఆ గడియారం 6 గంటలుగా సమయం చూపిస్తే  అప్పుడు సరైన సమయం ఎంత?

1) 7:15 am శుక్రవారం    2) 6:30 am శుక్రవారం

3) 7:00 am శుక్రవారం    4) 6:15 am శుక్రవారం

జవాబు: 3

సాధన: సోమవారం ఉదయం 7:00 నుంచి శుక్రవారం ఉదయం 6:00 వరకు మొత్తం 95 గంటలు

24 గంటలు  15 నిమిషాలు = 23 గంటల 45 నిమిషాలు

 

 

6.  01-01-2018న ఒక గడియారాన్ని ఉదయం 8:00 గంటల వద్ద సరిచేసి పెట్టారు. ఆ గడియారం 24 గంటల్లో 15 నిమిషాల సమయాన్ని అదనంగా చూపిస్తుంది. 04-01-2018న నిజమైన సమయం ఉదయం 10 గంటలు. అయితే ఆ గడియారం చూపే సమయం ఎంత? (దాదాపుగా)

1) 10:45 am      2) 11:00 am  

3) 10:46 am       4) 11:05 am

జవాబు: 3

సాధన: 01-01-2018 ఉదయం 8 గంటల నుంచి 04-01-2018 ఉదయం 10 గంటల వరకు మొత్తం సమయం 3 రోజుల 2 గంటలు.

పశ్నలో దాదాపుగా అని అడిగారు కాబట్టి

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి 

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌