• facebook
  • whatsapp
  • telegram

కోడింగ్‌ - డీకోడింగ్‌

సంకేత నియమాల్లోనే సరైన సమాధానం!

ఒక రూపంలో ఇచ్చిన సమాచారాన్ని మరో రూపంలో అర్థం చేసుకోవడం అంత తేలికకాదు. అందుకు తార్కిక ఆలోచనా శక్తి అవసరం. వేగంగా విశ్లేషించగలిగే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల్లో ఆ విధమైన నైపుణ్యాలను పరీక్షించేందుకే రీజనింగ్‌ సబ్జెక్టులో భాగంగా  ‘కోడింగ్‌-డీకోడింగ్‌’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నిర్దిష్ట నియమాలతో, సంకేత భాషలో అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, నమూనాలతో ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, సంబంధాలను అర్థం చేసుకొని సమాధానాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. తగిన ప్రాక్టీస్‌ చేస్తే వందశాతం మార్కులు సంపాదించుకోవచ్చు.  


‘కోడింగ్‌ - డీకోడింగ్‌’ అనే అంశానికి సంబంధించి పోటీ పరీక్షల్లో ఆంగ్ల అక్షరమాల అనురూప సంఖ్యల ఆధారంగానే కాకుండా కొన్ని రకాల ప్రశ్నలు నిర్దిష్ట నియమాల ప్రకారం కూడా ఉంటాయి. ఈ నియమాలు అచ్చులు, హల్లులు, సరిసంఖ్యలు, బేసి సంఖ్యలు, వివిధ రకాల గుర్తులు లాంటి భావనలతో ఉంటాయి. వీటిలో ‘మరియు’, ‘లేదా’ అనే అంశాలతో ఉన్న నియమాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.


మాదిరి ప్రశ్నలు


సూచనలు (1 - 3): కింది పట్టిక, నియమాల ఆధారంగా సంబంధిత ప్రశ్నలకు జవాబులు రాయండి. 

నియమాలు: 

1) మొదటి అక్షరం అచ్చు మరియు చివరి అక్షరం హల్లు అయితే వాటి కోడ్‌లను పరస్పరం మార్చాలి.


2) మొదటి అక్షరం హల్లు మరియు చివరి అక్షరం అచ్చు అయితే ఆ రెండింటినీ Rs తో కోడ్‌ చేయాలి.


3) మొదటి అక్షరం మరియు చివరి అక్షరం రెండూ హల్లులు అయితే ఆ రెండింటినీ చివరి అక్షరం కోడ్‌తో సూచించాలి.


1.   HEUPKI కోడ్‌ ఏది?

వివరణ: HEUPKI

మొదటి అక్షరం హల్లు, చివరి అక్షరం అచ్చు కాబట్టి ఆ రెండింటినీ  తో కోడ్‌ చేయాలి. మిగతా అక్షరాలకు కోడ్‌ను పట్టిక నుంచి రాయగా

జ: 2


 

2.    EWPKIH కోడ్‌ ఏది?


వివరణ: మొదట అక్షరం అచ్చు, చివరి అక్షరం హల్లు కాబట్టి వాటి కోడ్‌లను పరస్పరం మార్చాలి. మిగతా అక్షరాలకు కోడ్‌ను పట్టిక నుంచి రాయగా

జ: 4 


 

3.   RTDAVB కోడ్‌ ఏది?

వివరణ:  RTDAVB

మొదటి అక్షరం, చివరి అక్షరం రెండూ హల్లులు కాబట్టి ఆ రెండింటినీ చివరి అక్షరం కోడ్‌తో సూచించాలి.


జ: 3


 

సూచనలు (4 - 8): కింది పట్టిక, నియమాల ఆధారంగా సంబంధిత ప్రశ్నలకు జవాబులు రాయండి. 

నియమాలు: 

1) ఒకవేళ మొదటి అంకె సరి మరియు చివరి అంకె బేసి అంకె అయితే ఆ రెండింటినీ మొదటి అంకె కోడ్‌తో సూచించాలి. 


2) ఒకవేళ మొదటి అంకె బేసి మరియు చివరి అôకె సరి అంకె అయితే వాటి కోడ్‌లను పరస్పరం మార్చాలి.


3) ఒకవేళ మొదటి మరియు చివరి అంకెలు బేసి అంకెలు అయితే ఆ రెండింటినీ చివరి అంకె కోడ్‌తో సూచించాలి.


4) మొదటి మరియు చివరి అంకెలు సరి అంకెలు అయితే ఆ రెండింటినీ ఆ సమూహంలోని గరిష్ఠ అంకె కోడ్‌తో సూచించాలి.



4.    243578 కోడ్‌ ఏది?

వివరణ: మొదటి, చివరి అంకెలు సరి అంకెలు కాబట్టి సమూహంలోని గరిష్ఠ అంకె (8) కోడ్‌తో వాటిని సూచించాలి.


జ: 2



5.    124567 కోడ్‌ ఏది?

 

వివరణ: 124567
మొదటి, చివరి అంకెలు బేసి అంకెలు కాబట్టి చివరి అంకె కోడ్‌తో ఆ రెండింటినీ సూచించాలి.


 

జ: 4 


 

6.    697845 కోడ్‌ ఏది?

వివరణ: 697845

మొదటి అంకె సరి, చివరి అంకె బేసి అంకె కాబట్టి ఈ రెండింటినీ మొదటి అంకె కోడ్‌తో సూచించాలి.


జ: 1



7.     987366 కోడ్‌ ఏది?

వివరణ: 987366

మొదటి అంకె బేసి, చివరి అంకె సరి కాబట్టి వాటి కోడ్‌లను పరస్పరం మార్చాలి.


జ: 2



8.    928657 కోడ్‌ ఏది?

వివరణ: 928657

మొదటి, చివరి అంకెలు బేసి అంకెలు కాబట్టి ఈ రెండింటినీ చివరి అంకె కోడ్‌తో సూచించాలి.


జ: 3


సూచనలు (9 - 13): కింది పట్టిక, నియమాల ఆధారంగా సంబంధిత ప్రశ్నలకు జవాబులు రాయండి.

నియమాలు: 

1) మొదటి మరియు చివరి అక్షరాలు అచ్చులు అయితే కోడ్‌ను వ్యతిరేక దిశలో రాయాలి. 


2) పదంలో ఒకవేళ ఎక్కడైనా అచ్చు లేకపోతే మొదటి మూడు అక్షరాల కోడ్‌ను వ్యతిరేక దిశలో రాయాలి.


3) ఒకవేళ రెండు, నాలుగో స్థానాల్లోని అక్షరాలు హల్లులు అయితే వాటి కోడ్‌లను పరస్పరం మార్చాలి. 


గమనిక: ఒకవేళ ఇచ్చిన పదం ఒకటి కంటే ఎక్కువ నియమాలను పాటిస్తే రెండో నియమాన్ని మాత్రమే వర్తింపజేయాలి.



9.    UXAMF కోడ్‌ ఏది?


వివరణ: UXAMF

రెండు, నాలుగో స్థానాల్లోని అక్షరాలు హల్లులు కాబట్టి వాటి కోడ్‌లను పరస్పరం మార్చాలి. మిగతా కోడ్‌లను పట్టిక నుంచి రాయగా


జ: 1



10.    GIFEM కోడ్‌ ఏది?

వివరణ: GIFEM

మొదటి, చివరి అక్షరాలు హల్లులు. రెండు, నాలుగో స్థానాల్లోని అక్షరాలు హల్లులు కాదు కాబట్టి

జ: 2



11.   WJSFC కోడ్‌ ఏది?

వివరణ: WJSFC

పదంలో ఎక్కడ కూడా అచ్చులేదు కాబట్టి మొదటి మూడు అక్షరాల కోడ్‌లను వ్యతిరేకంగా రాయాలి.


జ: 3




12.    AHIUE కోడ్‌ ఏది?

వివరణ: మొదటి, చివరి అక్షరాలు హల్లులు కాబట్టి కోడ్‌ను వ్యతిరేకంగా రాయాలి.


జ: 1


 

13.    HCYUX కోడ్‌ ఏది?

వివరణ: HCYUX అనే పదం ఏ నియమాన్ని పాటించదు కాబట్టి పట్టిక నుంచి

జ: 2


రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

 


 

Posted Date : 30-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌