• facebook
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

1. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?

1) ఆర్బిటాల్‌      2) కక్ష్య       3) కర్పరం       4) ఉపకక్ష్య


2. 136C లోని న్యూట్రాన్‌ల సంఖ్య?

1) 6    2) 13   3) 7     4) 19


3. కింది వాటిలో సరికాని జత ఏది? 


4. కింది వాటిలో s-ఆర్బిటాల్‌ ఆకారం?

1) డంబెల్‌         2) డబుల్‌ డంబెల్‌       3) గోళాకారం     4) పైవేవీ కావు

 

5. ఒక మూలకం పరమాణువులోని మొదటి కక్ష్యలో ఎన్ని ఉపకక్ష్యలు ఉంటాయి?

1) 1      2) 2      3) 3      4) 4

 

6. పరమాణువులోని రెండో కక్ష్యలోని ఉపకక్ష్యలు ఏవి?

1) s,p,d      2) p,d     3) s,p     4) s,p,d,f

 

7. ఒక పరమాణువులోని నాలుగో కక్ష్యలోని ఆర్బిటాళ్ల సంఖ్య?

1) 2    2) 4    3) 9   4) 16

 

8. జర్మేనియం మూలకం రసాయన సంకేతం?

1) Ge    2) Gm      3) Je    4) Ga


9. సోడియం మూలకం లాటిన్‌ నామం ఏమిటి?

1) ఆరమ్‌      2) నాట్రియం    3) క్యూప్రమ్‌     4) ఫెర్రమ్‌

 

10. కింది వాటిలో సరికాని జత?

 మూలకం          సంకేతం

1) ఆర్గాన్‌              Ar

2)నియాన్‌             Ni

3) గ్జినాన్‌              Xe

4) హీలియం          He


11. కింది వాటిలో వెండి రసాయన సంకేతం ఏమిటి?

1) Au     2) Ag     3) Ar     4) పైవేవీ కావు


12. రూథర్‌ఫర్డ్‌ α కిరణ విక్షేపణ ప్రయోగం దేని ఆవిష్కరణకు కారణమైంది?

1) ప్రోటాన్‌    2) ఎలక్ట్రాన్‌      3) 1, 2     4) కేంద్రకం


13. ఎలక్ట్రాన్‌ ఆవేశాన్ని లెక్కించిన శాస్త్రవేత్త?

1) రూథర్‌ఫర్డ్‌      2) నీల్స్‌బోర్‌      3) ఆర్‌.ఎ.మిల్లికన్‌    4) జె.జె.థామ్సన్‌

 

14. కింది ఏ ప్రయోగం ద్వారా ఎలక్ట్రాన్‌ ఆవేశాన్ని లెక్కించారు?

1) α కిరణ విక్షేపణ ప్రయోగం    2) నూనె చుక్క ప్రయోగం    3) రుణ ధృవ కిరణాల ప్రయోగం    4)1, 2

 

15. ఆనోడ్‌ కిరణాలు లేదా కెనాల్‌ కిరణాల అతి సూక్ష్మ కణాన్ని ఏమంటారు?

1) ఎలక్ట్రాన్‌   2) ప్రోటాన్‌   3) న్యూట్రాన్‌   4) 1, 2

 

16. హైడ్రోజన్‌ అయాన్‌ (H+) లోని ఏకైక సూక్ష్మ కణం ఏది? 

1) ఎలక్ట్రాన్‌     2) న్యూట్రాన్‌      3)  ప్రోటాన్‌     4)పైవేవీ కావు


17. కింది వాటిలో ఆనోడ్‌ కిరణాలకు సంబంధించి సరైంది?

ఎ. ఆనోడ్‌ కిరణాలు రుజుమార్గంలో ప్రయాణిస్తాయి.     బి. ఆనోడ్‌ కిరణాలు ప్రయాణించే మార్గంలో విద్యుత్‌ క్షేత్రం ఉంచితే కేథోడ్‌ వైపునకు విచలనం చెందుతాయి.

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే     3) 1, 2         4) పైవేవీ కావు

18. కింది వాటిని జతపరచండి.

  జాబితా- I                 జాబితా-II

ఎ. పరమాణు సంఖ్య        i) న్యూక్లియాన్ల సంఖ్య

బి. ద్రవ్యరాశి సంఖ్య         ii) 6.023 x1023

సి. అవగాడ్రో సంఖ్య         iii) ప్రోటాన్‌ల సంఖ్య

1) ఎ-ii, బి-i, సి-iii      2) ఎ-iii, బి-ii, సి-i      3) ఎ-i, బి-iii, సి-ii      4)ఎ-iii, బి-i, సి-ii


19. కింది ఏ మూలకాలకు వాటి ఆంగ్లనామంలోని మొదటి అక్షరం, మూడు లేదా తరువాతి అక్షరాలు సంకేతంగా ఉన్నాయి?

i) సీసియం        ii) ప్లాటినం   iii) కాల్షియం   iv) సల్ఫర్‌     v) క్లోరిన్‌     vi) జింక్‌

1) i, vi, v       2) ii, iii,v, vi     3) i, ii, v, vi       4) ii, iv, vi 


20. పొటాషియం (K) లాటిన్‌ నామం ఏమిటి?

1) నేట్రియం    2) కాలియం   3) అర్జెంటినం    4) క్యూప్రమ్‌


21. కింది వాటిలో శాస్త్రవేత్త పేరుతో ఉన్న మూలకం ఏది?

1) క్యూరియం    2) నోబీలియం   3) ఫెర్షియం     4) పైవన్నీ

 

22. కింది వాటిలో గ్రహాల పేరుపై ఉన్న మూలకం ఏది?

1) యురేనియం    2)జర్మేనియం 3) నెఫ్ట్యూనియం    4) 1, 3


23. కింది ఏ మూలకాలకు వాటి ఆంగ్ల నామంలోని మొదటి రెండు అక్షరాలు సంకేతాలుగా ఉన్నాయి?

i) ఫ్లోరిన్‌     ii)  బ్రోమిన్‌      iii)  రేడాన్‌     iv) హీలియం    v) బోరాన్‌   vi) లిథియం

1) ii, iii, iv, v     2) ii, iv, vi    3) i, v, vi       4) i, ii, iii


24. కింది ఏ శాస్త్రవేత్త పుచ్చకాయ పరమాణు నమూనాను ప్రతిపాదించారు?

1) రూథర్‌ఫర్డ్‌    2) జె.జె.థామ్సన్‌     3) నీల్స్‌బోర్‌    4) సోమర్‌ఫీల్డ్‌ 


25. గ్రహమండల పరమాణు నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) నీల్స్‌బోర్‌     2) జె.జె.థామ్సన్‌   3) రూథర్‌ఫర్డ్‌   4) లాండే 


26. ఒక స్థిర కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్‌ కోణీయ ద్రవ్యవేగం mvr కింది వాటిలో దేనికి సమానం?

1) nh/2𝝅     2) nh𝝅     3) 2𝝅/nh      4) nh+2𝝅


27. ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించినవారు?

1) లాండే    2) నీల్స్‌బోర్‌    3) సోమర్‌ఫీల్డ్‌      4) జె.జె.థామ్సన్‌


28. డీబ్రోలీ ప్రకారం ఎలక్ట్రాన్‌కు ఏ స్వభావం ఉంటుంది?

1) కణ స్వభావం    2) తరంగ స్వభావం     3) 1, 2      4) పైవేవీకావు


29. కింది వాటిలో ప్రధాన క్వాంటం సంఖ్య (n) విలువలు?

1) 0, 1, 2, 3, 4...    2) 1, 2, 3, 4,..   3) +1/2,-1/2        4) +1/2,+3/2,+5/2


30. కింది వాటిలో ప్రధాన క్వాంటం సంఖ్యకు (n) సంబంధించి సరైంది?

i) ప్రధాన క్వాంటం సంఖ్య కర్పరాన్ని గుర్తిస్తుంది.     ii) ప్రధాన క్వాంటం సంఖ్య పెరిగేకొద్దీ ఎలక్ట్రాన్‌కు కేంద్రకానికి మధ్య దూరం పెరుగుతుంది.

iii) ఒక కర్పరంలో పరిమితమయ్యే ఆర్బిటాల్‌ సంఖ్య n2 కు సమానం.

1) i, ii       2) ii, iii       3) i, iii         4) పైవన్నీ


31. అజిముతల్‌ క్వాంటం సంఖ్యను (Azimuthal quantum number) ప్రతిపాదించినవారు?

1) సోమర్‌ఫీల్డ్‌   2) నీల్‌బోర్‌     3) లాండే    4) హైసన్‌బర్గ్‌


32. ఆర్బిటాల్‌ త్రిమితీయ ఆకారాన్ని తెలియజేసే క్వాంటం సంఖ్య?

1) అజిముతల్‌ క్వాంటం సంఖ్య    2) ప్రధాన క్వాంటం సంఖ్య   3) స్పిన్‌ క్వాంటం సంఖ్య    4) అయస్కాంత క్వాంటం సంఖ్య


సమాధానాలు

1-1   2-3    3-4   4-3    5-1    6-3   7-4    8-1    9-2     10-2     11-2    12-4     13-3   14-2    15-2   16-3    17-3    18-4    19-3    20-2    21-4     22-4    23-2    24-2    25-3   26-1   27-2    28-3    29-2   30-3    31-1     32-1


మరికొన్ని...

1. ఇచ్చిన  n విలువకు, ఆమోదయోగ్యమైన ః  విలువలు ఏవి?

1) l = 0, 1, 2, 3, ...(n-1)       2) l = 1, 2, 3, 4,...(n-1)      3) l=1/2, 2,3/2 ,4,5/2 ...(n-1)        4) l=+1/2,-1/2

2. అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) నీల్స్‌బోర్‌    2) సోమర్‌ఫీల్‌    3) లాండే       4) డీబ్రోలీ


3. అక్షాంశ పరంగా ఆర్బిటాల్‌ ప్రాదేశిక దిగ్విన్యాస సమాచారాన్ని తెలిపే క్వాంటం సంఖ్య ఏది?

1) స్పిన్‌ క్వాంటం సంఖ్య       2) ప్రధాన క్వాంటం సంఖ్య        3) అజిముతల్‌ క్వాంటం సంఖ్య          4) అయస్కాంత క్వాంటం సంఖ్య 

 

4. నిర్దిష్ట l విలువకు సాధ్యపడే అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు?

1)  l-1       2) l+1      3)  2l+1         4) 2l-1

5. అజిముతల్‌ క్వాంటం సంఖ్య l = 2 అయితే, సాధ్యపడే అయస్కాంత క్వాంటం సంఖ్య (ml) విలువలు ఏవి?

1) +1,+2,+3,+4,+5    2) -2, -1, 0, +1, +2        3) 0, 1, 2, 3, 4         4) +1/2,-1/2


6. కింది వాటిలో అయస్కాంత క్వాంటం సంఖ్యకు సంబంధించి సరైన ప్రవచనం?

i) ఇది ఒక ఉపకర్పరంలోని ఆర్బిటాళ్ల సంఖ్యను తెలియజేస్తుంది.

ii) ఇచ్చిన l విలువకు ఎన్ని ml విలువలుంటాయో, ఆ ఉపకర్పరానికి అదే సంఖ్యలో ఆర్బిటాళ్లు ఉంటాయి.

1) i మాత్రమే      2) ii మాత్రమే       3) i, ii      4) పైవేవీకావు


7. కింది వాటిని జతపరచండి. 

 

సమాధానాలు

1-1    2-3      3-4      4-3      5-2        6-3       7-1

* ఎలక్ట్రాన్‌ సంభావ్యత సాంద్రత ప్రమేయం సున్నా ఉన్న ప్రదేశాలను ఏమంటారు?

1) నోడ్‌లు    2) ఆర్బిటాళ్లు      3) కక్ష్యలు    4) ఉపకర్పరాలు

జవాబు: 1

* కింది ఏ నియమం ప్రకారం ఎలక్ట్రాన్‌కు కచ్చితమైన స్థానం, కచ్చితమైన ద్రవ్యవేగం ఏకకాలంలో నిర్ణయించటం అసాధ్యం?

1) పౌలీవర్జన సూత్రం    2) హైసన్‌బర్గ్‌ అనిశ్చితత్వ నియమం    3) ఆఫ్‌బౌ నియమం   4) డీబ్రోలీ నియమం

జవాబు: 2

రెండు స్థిర శక్తి స్థాయుల మధ్య ఎలక్ట్రాన్‌ పరివర్తనం చెందడానికి శోషించుకునే లేదా ఉద్గారమయ్యే శక్తి ఎంత?

 జవాబు: 1 

Posted Date : 14-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌