• facebook
  • whatsapp
  • telegram

 ఐరోపా ఖండం

పచ్చల ద్వీపం.. రొట్టెల దేశం!

 

పొడవైన సముద్ర తీరం, విశాలమైన మైదానాలు, కఠిన శిలలతో నిండిన పర్వతాలు, అనేక నదులు, దీవుల ఖండం యూరప్‌. అమెరికా, ఆసియాల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో విస్తరించి ఉంది. రొట్టెల దేశంగా పేరు పొందిన స్కాట్లాండ్, పచ్చల ద్వీపంగా ప్రసిద్ధికెక్కిన ఐర్లాండ్, వేయి సరస్సుల ఫిన్లాండ్‌ లాంటి దేశాలను కలిగి ఉంది.  రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రపంచంపై అత్యంత ప్రభావాన్ని చూపుతోంది. అభివృద్ధికి, ఆధునికతకు చిరునామాగా నిలిచింది. చారిత్రక కట్టడాలు, నగరాలు, మనోహరమైన పర్యాటక ప్రదేశాలతో కూడిన ఈ ఖండం భౌగోళిక స్వరూపం, సరిహద్దులు తదితర విశేషాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

ఐరోపా ఖండం 34o నుంచి 81o ఉత్తర అక్షాంశాలు; 24oపశ్చిమ రేఖాంశం నుంచి 69o తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇది ఆస్ట్రేలియా తర్వాత రెండో చిన్న ఖండం. ప్రపంచ విస్తీర్ణంలో 6.8% భూభాగం కలిగి ఉంది. ఈ ఖండంలో 50 దేశాలున్నాయి. ఆసియా, ఐరోపాలను కలిపి ‘యురేషియా’ అని పిలుస్తారు. స్కాండివేనియా దేశాలు - ఐస్‌లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్‌.

* ప్రపంచంలో ఉత్తర సరిహద్దుగా ఉన్న రాజధాని నగరం - రెక్జావిక్‌. ఇది ఐస్‌లాండ్‌ రాజధాని.

* ప్రపంచంలో అతి పెద్ద దీవి గ్రీన్‌లాండ్‌. ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నప్పటికీ ఐరోపాలోని డెన్మార్క్‌ రాజ్యంలో భాగంగా కొనసాగుతోంది.

* ప్రపంచంలో తలసరి జల విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉన్న దేశం నార్వే.

* ఫిన్లాండ్‌ను ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అండ్‌ లేక్స్‌’ అని పిలుస్తారు.

* ‘మాంచెస్టర్స్‌ ఆఫ్‌ ఇటలీ’గా వ్యవహరించే మిలాన్‌ నగరం ‘పోనది’ ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం నూలు, పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి.

* డెట్రాయిట్‌ ఆఫ్‌ ఇటలీ - టూరిన్‌. ఇటలీ ఆటోమొబైల్‌ పరిశ్రమకు ప్రసిద్ధి.

* ఐరోపాలో భూపరివేష్టిత దేశం స్విట్జర్లాండ్‌. ఈ దేశ భూభాగం 60% ఆల్ప్స్‌ పర్వతాలతో నిండి ఉంటుంది. 

* రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ను ‘బ్రిటిష్‌ వేల్స్‌’ అంటారు.

* యూకే అంటే ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, ***, బానల్‌ దీవులు.

* గ్రేట్‌ బ్రిటన్‌లోని ప్రాంతాలు ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్‌.

* బాల్టిక్‌ దేశాలు అంటే లిథుయేనియా, లాత్వియా, ఎస్తోనియా.

* ఐర్లాండ్‌ను ‘పచ్చల ద్వీపం’ (ఎమరాల్డ్‌ ఐలాండ్‌) అని, స్విట్జర్లాండ్‌ను ‘ఐరోపా క్రీడా మైదానం’ అని పిలుస్తారు.

ఇటలీలోని వెనిస్‌ నగరాన్ని ‘అడ్రియాటిక్‌ సముద్ర మహారాణి’గా వ్యవహరిస్తారు. ఇంగ్లండ్‌లోని స్కాట్లాండ్‌ను రొట్టెల దేశంగా, ఫిన్లాండ్‌ను ‘వేయి సరస్సుల దేశం’గా పిలుస్తారు. స్కాట్లాండ్‌లోని అబెర్డీన్‌ను ‘నల్లరాయి నగరం’గా పేర్కొంటారు. ఐరోపా యుద్ధ రంగం (కాక్‌పిట్‌ ఆఫ్‌ యూరప్‌)గా బెల్జియంకు పేరుంది. ఇటలీలోని రోమ్‌ను ‘శాశ్వత నగరం, సప్త పర్వతాల నగరం’గా పిలుస్తారు.

* యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో అత్యధిక ప్రదేశాలున్న దేశంగా ఇటలీ నిలిచింది.

* ప్రపంచంలో ‘డబుల్‌ లాండ్‌ లాక్‌డ్‌’ అని పిలిచే నగరం లిచెన్‌ స్టెయిన్‌. ఇది స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాలతో ఆవరించి ఉంటుంది.


ఐరోపాలోని బొగ్గు క్షేత్రాలు: 

* లొరైన్‌ బొగ్గు క్షేత్రం - ఫ్రాన్స్‌ 

* ఉరల్‌ బొగ్గు క్షేత్రం - రష్యా

* సైపీలియా బొగ్గు క్షేత్రం - పోలండ్‌

* డోనేట్‌ హరివాణం - ఉక్రెయిన్‌

* కుజినెట్క్స్‌ - సైబీరియా 

* కరగండ హరివాణం - కజకిస్థాన్‌

 

నౌకా నిర్మాణ పరిశ్రమ:  

* స్కాట్లాండ్‌ - ఎడింబరో

* ఇంగ్లండ్‌ - బ్రిస్టల్‌ 

* జర్మనీ - హంబర్గ్‌ 

* ఫిన్లాండ్‌ - హెల్సెంకీ

* ఫ్రాన్స్‌ - మార్సెయిల్స్‌

* లొంబార్డీ - ఇటలీ

 

ముఖ్యమైన పర్వతాలు:

* కోలెన్‌ పర్వతాలు - నార్వే, స్వీడన్‌ సరిహద్దులు

* పెన్నైన్‌ పర్వతాలు - గ్రేట్‌ బ్రిటన్‌

* కాంటా బరైన్‌ పర్వతాలు - స్పెయిన్‌

* పైరనీస్‌ - ఫ్రాన్స్, స్పెయిన్‌లను వేరుచేస్తున్నాయి.

* సియోర్రా మొరేనా, పియర్రా నెవడా పర్వతాలు - స్పెయిన్‌

* అవనైస్‌ పర్వతాలు - ఇటలీ

* వాస్‌ జెస్‌ పర్వతాలు - ఫ్రాన్స్, ఇటలీ

* ఆల్ప్స్‌ పర్వతాలు - ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌. ఫ్రాన్స్‌లోని ఈ పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఉంది. అది బ్లాంక్‌ శిఖరం. (4807 మీ.)

* డినారిక్‌ పర్వతాలు - యుగోస్లోవియా

* కార్ఫేథియాస్‌ పర్వతాలు - పోలండ్, ఉక్రెయిన్, రుమేనియా

* బాల్కన్‌ పర్వతాలు - బల్గేరియా

* యూరాల్‌ పర్వతాలు - రష్యా (ఐరోపా నుంచి ఆసియాను వేరు చేస్తున్నాయి.)

* కాకస్‌ పర్వతాలు - ఆసియాను యూరప్‌ నుంచి వేరు చేస్తున్నాయి. ఇందులో ఆసియాలో ఎత్తయిన శిఖరం ‘ఎల్‌బర్జ్‌’.

* బ్లాక్‌ ఫారెస్ట్‌ - జర్మనీ

 

ముఖ్యమైన సింధు శాఖలు:

* రిగా సింధుశాఖ - ఎస్టోనియా, లాత్వియాలను వేరు చేస్తుంది. బాల్టిక్‌ సముద్రం.

* ఫిన్లాండ్‌ సింధుశాఖ - ఫిన్లాండ్, ఎస్టోనియాలను వేరు చేస్తుంది. బాల్టిక్‌ సముద్రం.

* బోత్నియా సింధుశాఖ - స్వీడన్, ఫిన్లాండ్‌లను వేరు చేస్తుంది. బాల్టిక్‌ సముద్రం.

* ఇంగ్లిష్‌ ఛానల్‌ - బ్రిటన్, ఫ్రాన్స్‌లను వేరు చేస్తుంది. అట్లాంటిక్‌ మహాసముద్రం

* బిస్కే అఖాతం - ఫ్రాన్స్, స్పెయిన్‌లను వేరు చేస్తుంది. అట్లాంటిక్‌ మహాసముద్రం.

 

ముఖ్యమైన జలసంధులు                                    

 జిబ్రాల్టర్‌: మధ్యధరా తాళం చెవి అంటారు. యూరప్, ఆఫ్రికాను వేరు చేస్తుంది. మధ్యధరా, అట్లాంటిక్‌ సముద్రాలను కలుపుతుంది. 

బోనిఫాసియో: సార్డీనియా (ఇటలీ), కార్సికా (ఫ్రాన్స్‌) మధ్య ఉంది. టెర్రీ హినియన్, మధ్యధరా సముద్రాలను కలుపుతుంది. 

మెస్సివా: సిసిలీ, ఇటలీ మధ్య ఉంది. టెర్రీ హినియన్, మధ్యధరా సముద్రాలను కలుపుతుంది.

ఒట్రాంటో: ఇటలీ, బాల్కన్‌ ద్వీపంను వేరు చేస్తుంది. అడ్రియాటిక్‌ను, బయోనీయస్‌ సముద్రంతో కలుపుతుంది.


        

ముఖ్యమైన ద్వీపకల్పాలు:

ఐబీరియా ద్వీపకల్పం: బిస్కే అఖాతం, మధ్యధరా, అట్లాంటిక్‌ సముద్ర జలాలతో చుట్టి ఉంటుంది. ఇందులోని దేశాలు స్పెయిన్, పోర్చుగల్‌.

బాల్కన్‌ ద్వీపకల్పం: నల్ల సముద్రం, ఏజియన్, అడ్రియాటిక్‌ సముద్ర జలాలతో ఆవరించి ఉంటుంది. బల్గేరియా, మాసిడోనియా, అల్బేనియా, గ్రీస్‌ దేశాలు ఇందులో ఉన్నాయి.

మాగల్లాస్‌ జలసంధి: దక్షిణ అమెరికా దక్షిణ సరిహద్దులను అర్జెంటీనాలోని టియర్రా డెల్‌ప్యూగో నుంచి వేరు చేస్తుంది.

బ్రౌక్‌ జలసంధి: దక్షిణ అమెరికాకు అంటార్కిటికాకు మధ్య ఉండే జలసంధి.

 

 

 రచయిత: జయకర్‌ సక్కరి                           

Posted Date : 07-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌