• facebook
  • whatsapp
  • telegram

ప్రవాహ విద్యుత్తు

వలయంలో సాగే శక్తి ప్రసారం!

ఇక్కడ స్విచ్‌ వేస్తే అక్కడెక్కడో బల్బు వెలుగుతుంది, మొబైల్‌ ఛార్జింగ్‌ మొదలవుతుంది, టీవీలు, కంప్యూటర్లు ఆన్‌ అవుతాయి. వైర్ల ద్వారా విద్యుత్తు ఆ వస్తువులకు చేరడంతో అవి పని చేయడం ప్రారంభిస్తాయి. అదే విద్యుత్తు ప్రవాహం. భౌతికశాస్త్రం పరిభాషలో చెప్పాలంటే ఒక వాహకం ద్వారా సాగే శక్తిపూరిత ఎలక్ట్రాన్ల ప్రవాహమే విద్యుత్తు. ఆ విధంగా ప్రసారమయ్యే విద్యుత్తునే ప్రవాహ విద్యుత్తు అంటారు. ఇందులో వాహకాలతోపాటు నిరోధాలు, బంధకాలు, కెపాసిటర్లు తదితరాలు ఉంటాయి. నిత్యజీవితంలో అత్యంత ప్రధాన భాగమైన ఈ ప్రవాహ విద్యుత్తు పనిచేసే విధానం, ఉపయోగించే పరికరాలు, వాటి అనువర్తనాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


1. ఘటాల్లో రసాయన శక్తి ఏ శక్తిగా మారుతుంది?

జవాబు: విద్యుత్‌ శక్తి 2. విద్యుత్‌ నిరోధకత దేనిపై ఆధారపడుతుంది?

1) మధ్యచ్ఛేద వైశాల్యం     2) పదార్థ స్వభావం       3) పొడవు         4) పైవన్నీ

  జవాబు: పైవన్నీ3. మానవ శరీరంలో విద్యుత్‌ ఘాతం కలగడానికి ప్రధాన కారణం గుర్తించండి.

    జవాబు:అధిక ఓల్టేజీ     


 

4. లైటనింగ్‌ కండక్టర్‌ను ఏ లోహంతో తయారు చేస్తారు?

    జవాబు: కాపర్‌    

 

 

5. విద్యుత్‌ బల్బ్‌లు, కంటి అద్దాల్లో ఉపయోగించే గాజు రకం?

 జవాబు: ప్లింట్‌ గాజు    6. ఫొటో విద్యుత్‌ ఘటం ఏ విధమైన మార్పును కలిగిస్తుంది?    

జవాబు: కాంతిశక్తి విద్యుత్‌ శక్తిగా 7. రెక్టిఫయర్‌ను ఉపయోగించడానికి కారణం?      

జవాబు: ఏసీని డీసీగా మారుస్తుంది.


 

8.కిందివాటిలో విద్యుత్‌ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం?

 జవాబు: గ్రాఫైట్‌ 9. ఎలక్ట్రికల్‌ ఐరన్‌ బాక్స్‌లో ఉపయోగించే అబ్రకం ఒక

జవాబు: విద్యుత్‌ బంధకం, ఉష్ణ వాహకం 

 

 

10. అనంత సంఖ్యలో ఆవేశాలున్న భూమి ఫలిత విద్యుత్‌ పొటెన్షియల్‌ ఎన్ని ఓల్ట్‌లు?

జవాబు: శూన్యం  11. నిరోధం, ఓల్టేజీ, కరెంట్‌లను కొలిచే పరికరం?

జవాబు:మల్టీ మీటరు     


 

12. గృహ అవసరాల కోసం 240 HZ వద్ద సరఫరా చేస్తున్న ఏకాంతర విద్యుత్‌ పౌనఃపున్యం?

 జవాబు: 50HZ


 

13. అధిక ఉష్ణోగ్రత వద్ద అతి వాహకతను ప్రదర్శించే పదార్థం?

జవాబు: పింగాణి  

 

 

14. వాతావరణంలో అధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన లైట్లను ఉపయోగిస్తారు?

 జవాబు: ఫ్లోరోసెంట్‌ ఆవిరి దీపాలు 


 

15. ఫ్యూజ్‌ వైర్‌ను ఏ మిశ్రమ లోహాలతో తయారు చేస్తారు? 

జవాబు: తగరం, సీసం

 

 

16. కంప్యూటర్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ చిప్స్‌ను దేంతో తయారు చేస్తారు?

జవాబు: సిలికాన్‌  17. ఒక విద్యుత్‌ కెటిల్‌లో నీరు దేనివల్ల వేడెక్కుతుంది?

జవాబు: సంవహనం 

 


18. అర్ధవాహకాన్ని వేడి చేస్తే దాని వాహకత్వంలో జరిగే మార్పును గుర్తించండి.

 జవాబు:పెరుగుతుంది 19. విద్యుత్‌ వలయానికి సమాంతరంగా కలిపే పరికరం?

జవాబు: ఓల్ట్‌ మీటరు     20. పొడి బ్యాటరీలో ఉపయోగించే ఎలక్ట్రోలైట్లు?

జవాబు: అమ్మోనియం క్లోరైడ్, జింక్‌ క్లోరైడ్‌

 


21. డైనమో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?

జవాబు: విద్యుదయస్కాంత ప్రేరణ

 

 

22. కింది వాటిలో ఏ బల్బును వెలుతురు కోసం అత్యధికంగా ఉపయోగిస్తారు?

జవాబు:టంగ్‌స్టన్‌ ఫిలమెంట్‌ బల్బు 

 

 

23. కిందివాటిలో అధిక వాతావరణ కాలుష్యాన్ని కలిగించే ఎలక్ట్రిసిటీ తయారీ పద్ధతి?

జవాబు: కోల్‌   

 

 

24. విద్యుత్‌ వలయంలో కెపాసిటర్‌ను ఉపయోగించడానికి కారణం?

జవాబు:విద్యుత్‌ను నిల్వ చేయడానికి 

 

 

25. విద్యుత్‌ ఫ్యూజ్‌ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? 

జవాబు: జౌల్‌ ఫలితం    


 

26. అతి తక్కువ విద్యుత్‌ ప్రవాహాలను కొలవడానికి ఉపయోగించే పరికరం?

జవాబు: గాల్వనో మీటరు    

 

 

27. ఫిలమెంట్‌ను మందం తక్కువగా, పొడవు ఎక్కువగా ఉండేలా అమర్చడానికి కారణం ఏమిటి?

జవాబు: పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది.

 

 

28. ఎలక్ట్రికల్‌ హీటర్, ఐరన్‌ బాక్స్, కుక్కర్‌లలో వాడే ఫిలమెంట్‌ను ఏ మిశ్రమ లోహంతో తయారు చేస్తారు?

జవాబు:నిక్రోమ్‌

 

 

29. ఫ్యాన్‌ రెగ్యులేటర్స్, రేడియోల్లో వాల్యూమ్‌ కంట్రోల్‌ కోసం ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు?

జవాబు: రియోస్టాట్‌     

 

 

30. ఇంట్లో ఓ బల్బు కాలిపోయినప్పటికీ మిగిలిన ఉపకరణాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. వీటిని ఏ సంధానంలో అమరుస్తారు?

జవాబు:సమాంతర సంధానం 

 

 

31. ట్రాన్సిస్టర్, టార్చిలైట్, గోడ గడియారాలు, రేడియోల్లో ఉపయోగించే ఘటాలు?

జవాబు: అనార్ద్ర ఘటం32. తీగల ద్వారా విద్యుత్‌ ప్రవహిస్తున్నప్పుడు దానిచుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

జవాబు:ఆయిర్‌స్టెడ్‌     


 

33. టెలిఫోన్, విద్యుత్‌ స్తంభాలు, వంతెనలు తుప్పుపట్టకుండా వాటి తలాలపై జింక్‌ లోహంతో పూతపూసే ప్రక్రియను ఏమంటారు?

జవాబు:గాల్వనైజేషన్‌      34. ఛార్జ్‌ చేసే బ్యాటరీని కనుక్కున్న శాస్త్రవేత్త?

జవాబు: గాస్టన్‌ ప్లాంటే

 


35. సూపర్‌ కండక్టివిటీని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

జవాబు:కామర్లింగ్‌ ఓమ్స్‌     

 


36. రిఫ్రిజిరేటర్‌ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?

జవాబు:ఫెల్టియర్‌ ఫలితం  

 


37. విద్యుత్‌ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం?

జవాబు:విద్యుత్‌ మోటార్‌ 

 


38. నిర్దిష్ట ప్రమాణాలతో తయారుచేసిన ఎల్‌ఈడీ బల్బు జీవితకాలం ఎన్ని గంటలు?

జవాబు: 50,000 గంటలు  39. విశిష్ట నిరోధం ప్రమాణాలు?

జవాబు:ఓమ్‌ - మీటర్‌     

 

 

40. షార్ట్‌ సర్క్యూట్‌ (లఘు వలయం) అంటే?

జవాబు:రెండు బిందువుల మధ్య విద్యుత్‌ సర్క్యూట్‌కు అంతరాయం కలగడం


 

41. కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

1) వెండి మంచి విద్యుత్‌ వాహకం  2) డైమండ్‌ మంచి విద్యుత్‌ బంధకం   3) సిలికాన్‌ అతి ఉత్తమమైన అర్ధవాహకం

జవాబు: పైవన్నీ

 


42. ఫ్యూజ్‌ వైరుకు ఉండాల్సిన లక్షణాలను గుర్తించండి.

జవాబు: తక్కువ నిరోధం, తక్కువ ద్రవీభవన స్థానం


 

43. విద్యుత్‌ పొటెన్షియల్‌ను కొలిచే పరికరం?

జవాబు:ఓల్ట్‌ 

 

 

44. ఒక తీగచుట్టకు దగ్గరలో అయస్కాంతాన్ని అటూ ఇటూ కదిలించినప్పుడు దానిలో విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని కనుక్కున్న శాస్త్రవేత్త?

జవాబు: మైకెల్‌ ఫారడే

 

 

45. విద్యుత్‌ పరికరాలు బాగా వేడెక్కినప్పుడు కాలిపోకుండా ఉండేందుకు వలయంలో వినియోగించే రక్షణ పరికరం?

జవాబు: ఫ్యూజ్‌


 

46. 400 ఏళ్ల కిందట ఏ దేశస్థులు విద్యుత్‌పై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు?

జవాబు:బ్రిటన్‌  

 

 

47. కిందివాటిలో ఏ లోహం తన ద్వారా విద్యుత్‌ను పాక్షికంగా ప్రసరింపజేస్తుంది? 

జవాబు: జర్మేనియం


 

48. స్వచ్ఛమైన నీరు (స్వేదన జలం) విద్యుత్‌ పరంగా ఎలా ప్రవర్తిస్తుంది?

జవాబు:విద్యుత్‌ బంధకం 


 

49. గృహాల్లో ఉపయోగించే కరెంట్‌ను కొలిచే ప్రమాణాలు?

జవాబు:కిలోవాట్‌ అవర్‌ 

 


50. ఒక హార్స్‌పవర్‌ ఎన్ని వాట్స్‌కు సమానం?

జవాబు: 746  

 

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌