• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ పర్యాప్తత

తెలిసినంతలో తెలివైన నిర్ణయం!



కళాశాలలో ఎనిమిది తరగతులు ఉన్నాయి. నలుగురు అధ్యాపకులే ఉన్నారు. అన్ని పీరియడ్‌లు సజావుగా సాగాలంటే ఏం చేయాలి? విహారయాత్రకు వెళుతున్నారు. వెళ్లాల్సిన ప్రదేశాలు, చేతిలో ఉన్న సొమ్ము, సమయాలను  ఏ విధంగా వినియోగించుకోవాలి? అవసరాలు అనేకం ఉన్నాయి. అందే జీతం అంతంత మాత్రంగా ఉంది. అయినా నెలంతా గడవాలి ఎలా? ఇలాంటి సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకోకపోతే పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశం ఉంది. అలాంటి సామర్థ్యాలను అభ్యర్థుల్లో పరీక్షించడానికే రీజనింగ్‌లో ‘దత్తాంశ పర్యాప్తత’ అనే అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలిసినంత సమాచారంతో తెలివైన నిర్ణయం తీసుకొని, సమస్యను పరిష్కరించగలిగే తార్కిక శక్తిని పరిశీలిస్తారు.  


దత్తాంశ పర్యాప్తతకు సంబంధించిన ప్రశ్నలు సాధారణంగా రీజనింగ్‌లోని వివిధ అధ్యాయాల నుంచి వస్తాయి. ముఖ్యంగా కోడింగ్‌ - డీకోడింగ్, దిశలు, రక్త సంబంధాలు, ర్యాంకింగ్‌ టెస్ట్, క్యాలెండర్, గడియారాలు, అరిథ్‌మెటిక్‌ రీజనింగ్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇచ్చిన ప్రశ్నకు జవాబును కనుక్కోవడానికి ప్రకటనలోని ఏ సమాచారం సరిపోతుందో అభ్యర్థులు గుర్తించాలి.


మాదిరి ప్రశ్నలు


కిందివాటిలో ప్రతిదానిలో ఒక ప్రశ్న, రెండు ప్రవచనాలు (I, II) ఇచ్చారు. 

1) ప్రవచనం  I లోని సమాచారం ఆధారంగా మాత్రమే ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగి, ప్రవచనం  II లోని సమాచారంతో ప్రశ్నకు సమాధానం ఇవ్వనట్లయితే.. 

2) ప్రవచనం  II లోని సమాచారం ఆధారంగా మాత్రమే ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగి, ప్రవచనం  I లోని సమాచారంతో ప్రశ్నకు సమాధానం ఇవ్వనట్లయితే..

3) ప్రవచనం  I, ప్రవచనం II లోని సమాచారాన్ని కలిపి జవాబు ఇవ్వగలిగితే..

4) ప్రవచనం  I, ప్రవచనం  II లోని సమాచారాన్ని కలిపినప్పటికీ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతే..


1. నెలలో 15వ తేదీన వచ్చే వారం ఏది?

I) ఆ నెలలో మొదటి ఆదివారం 6వ తేదిన వచ్చింది.

II) ఆ నెల చివరి రోజు 31వ తేది. 

వివరణ: Iవ ప్రవచనం ద్వారా 6వ తేదీన ఆదివారం.

ప్రతి 7 రోజుల తర్వాత  తిరిగి మళ్లీ అదే రోజు వస్తుంది.

కాబట్టి 13వ తేది ఆదివారం 

14వ తేది సోమవారం 

15వ తేది మంగళవారం

జ: 1


2. ఆ నెలలో 14వ తేదీన వచ్చే వారం ఏది?

I) ఆ నెల చివర రోజు బుధవారం.

II) ఆ నెల 3వ శనివారం 17వ తేది.

వివరణ: ప్రవచనం II ద్వారా

3వ శనివారం 17వ తేది

శుక్రవారం 16వ తేది 

గురువారం 15వ తేది

బుధవారం 14వ తేది 

జ: 2


3. M తండ్రి ఎవరు?

I) A, B లు సోదరులు. 

II) B భార్య, M భార్యకి సోదరి.

వివరణ: ప్రవచనం I ద్వారా A, B లు సోదరులు. 

ప్రవచనం II ద్వారా B అనే వ్యక్తి M కి బావ/బావమరిది.

ప్రవచనం I, II రెండింటి ద్వారా కూడా M తండ్రిని గుర్తించలేం.

జ: 4


4. ఒక తరగతిలో మోహన్‌ ర్యాంకు మొదటి నుంచి 18. అయితే చివర నుంచి అతడి ర్యాంకు ఎంత?

I) తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 47. 

II) తరగతిలో కృష్ణ స్థానం 19.

వివరణ: ప్రవచనం I ద్వారా 

T = n + k - 1

47 = 18 + k - 1

47 = 17 + k

k = 47 - 17

= 30

... మోహన్‌ ర్యాంకు చివరి నుంచి 30 

జ: 1


5. ఈ సంవత్సరం అమ్మకం జరిపిన గ్రీటింగ్‌ కార్డుల సంఖ్య ఎంత?

I) గత సంవత్సరం 2400 గ్రీటింగ్‌ కార్డులు అమ్మాడు. 

II) ప్రస్తుత సంవత్సరం అమ్మకాలు, గత సంవత్సరం అమ్మకాలకు 1.2 రెట్లు. 

వివరణ: ప్రవచనం I, II ద్వారా  

ప్రస్తుత అమ్మకాలు = 2400 x 1.2 = 2880

జ: 3 


6. విహాన్‌ ప్రస్తుత వయసు ఎంత?

I) విహాన్, కునాల్, రాబిన్‌ల వయసులు సమానం.

II) కునాల్, రాబిన్, మదన్‌ వయసుల మొత్తం 32 సంవత్సరాలు. మదన్‌ వయసు కునాల్, రాబిన్‌ల వయసు మొత్తానికి సమానం.

వివరణ: ప్రవచనం I ద్వారా విహాన్‌ వయసు = కునాల్‌ వయసు = రాబిన్‌ వయసు

ప్రవచనం II ద్వారా మదన్‌ = కునాల్‌ + రాబిన్‌ 

కునాల్‌ + రాబిన్‌ + మదన్‌ = 32

x  + x + 2x = 32

4x = 32

x = 8 సంవత్సరాలు 

... విహాన్‌ వయసు = 8 ఏళ్లు

జ: 3


7. A, B, C, D, E లు ఒక వరుసలో కూర్చున్నారు. B అనే వ్యక్తి A, E ల మధ్య ఉన్నాడు. అయితే వారిలో సరిగ్గా మధ్యలో ఎవరున్నారు?

I) A అనే వ్యక్తి B కి ఎడమవైపున, D కి కుడివైపున ఉన్నాడు.

II) C అనే వ్యక్తి కుడివైపున చివర్లో ఉన్నాడు.

వివరణ: ప్రవచనం I ద్వారా

ప్రవచనం II ద్వారా

... B సరిగ్గా మధ్యలో ఉన్నాడు

జ: 3 


8. ఒక సంకేత భాషలో 'nop al ed' అంటే 'They like flowers' అయితే flowers కోడ్‌ ఏది?

I) 'id nim nop' అంటే 'They  are innocent'

II) 'gob ots al' అంటే 'We like roses.'

వివరణ: ప్రవచనం I ద్వారా 

ప్రశ్న, ప్రవచనం I లో ఉమ్మడిగా ఉన్న పదం 'They. దీని కోడ్‌ 'nop'

ప్రవచనం II ద్వారా 

ప్రశ్న, ప్రవచనం II లో ఉమ్మడిగా ఉన్న పదం'like'. దీని కోడ్‌ 'al'

రెండు ప్రవచనాల ద్వారా

They    nop

like    al

flowers    ed

జ: 3 


9. ఒక కళాశాలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ అనే సబ్జెక్టులను నాలుగు వరుస పీరియడ్లలో ఉదయం 8  గంటలకు ప్రారంభమై ప్రారంభమై ఒక్కో గంట చొప్పున బోధిస్తారు. అయితే కెమిస్ట్రీ పీరియడ్‌ ఏ సమయానికి జరుగుతుంది?

I) మ్యాథమెటిక్స్‌ పీరియడ్‌ ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. ఇది బయాలజీ తర్వాత జరుగుతుంది. 

II) ఫిజిక్స్‌ పీరియడ్‌ చివర్లో జరుగుతుంది.

III) ఫిజిక్స్‌ పీరియడ్‌ తర్వాత కెమిస్ట్రీ జరుగుతుంది.

1) కేవలం ప్రవచనం I      2) కేవలం I లేదా II మాత్రమే     3) ప్రవచనాలు II, III      4) కేవలం I, II లేదా III

వివరణ: ప్రవచనాలు I, II ద్వారా

మ్యాథమెటిక్స్‌ @ ఉదయం 9:00 

బయాలజీ @ ఉదయం 8:00 

ఫిజిక్స్‌ @ ఉదయం 11:00 

కెమిస్ట్రీ @ ఉదయం10:00 

ప్రవచనాలు I, III ద్వారా మ్యాథమెటిక్స్‌ తర్వాత కెమిస్ట్రీ  జరుగుతుంది. కాబట్టి 

కెమిస్ట్రీ పీరియడ్‌ @ ఉదయం 10:00 

జ: 4


10. X అనే వ్యక్తికి ఎందరు కుమారులు ఉన్నారు? 

I) Q, U లు T కి సోదరులు. 

II) P, U ల సోదరి R.

III) R, T, లు X కుమార్తెలు.

1) కేవలం I, II         2) కేవలం II, III          3) I, II, III           4) ఏదీకాదు 

వివరణ: ప్రవచనం I ద్వారా

Q+ ______ R+ ______ T

ప్రవచనం II ద్వారా

R- ______ P______ U

ప్రవచనం III ద్వారా

ప్రవచనాలు I, II, III ద్వారా P, Q, R, T, U లు X సంతానం. 

వీరిలో Q, U లు కుమారులు. R, T లు కుమారైలు.

కానీ, P యొక్క లింగం తెలియదు. కాబట్టి X యొక్క కుమారుల సంఖ్య చెప్పలేం.

జ: 4 


రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి
 

Posted Date : 07-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌