• facebook
  • whatsapp
  • telegram

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ - వృత్త రేఖాచిత్రాలు

సమాచారం సరళంగా..స్పష్టంగా!


వందమంది ఉన్న తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఏయే సబ్జెక్టులు ఇష్టపడుతున్నారో కనుక్కోవాలంటే లెక్కలేసి సంఖ్యల్లో చెప్పాలి. కానీ దాన్ని వేగంగా అర్థం చేసుకోవడం కాస్త కష్టం కావచ్చు. అదే కొన్ని వృత్తాల్లో ఆ వివరాలను ప్రదర్శిస్తే వెంటనే తెలిసిపోతాయి. సంక్లిష్ట సమాచారాన్ని సరళంగా, స్పష్టంగా వ్యక్తీకరించడానికి వృత్త రేఖాచిత్రాలు లేదా వెన్‌ డయాగ్రమ్స్‌ ఉపయోగిస్తారు. అవి భిన్న సెట్‌ల మధ్య సంబంధాలను సులువుగా బొమ్మల రూపంలో చెప్పేస్తాయి. దీంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. డేటాను ఆ విధంగా ప్రదర్శించగల సామర్థ్యాన్ని అభ్యర్థుల్లో అంచనా వేసేందుకు రీజనింగ్‌లో ‘వృత్త రేఖాచిత్రాల’పై ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రాథమిక గణిత పరిక్రియలు, శాతాలు, నిష్పత్తులు, సగటు తదితరాలపై అవగాహన పెంచుకుంటే వాటికి తేలిగ్గా సమాధానాలను గుర్తించవచ్చు.  


డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (దత్తాంశ విశ్లేషణ)లో భాగంగా వృత్త రేఖాచిత్రాలు, పట్టికలు, కమ్మీ రేఖాచిత్రాలు, రేఖాచిత్రాలు మొదలైన అంశాలు ఉంటాయి. వృత్త రేఖాచిత్రంలో భాగంగా, సమాచారం అనేది డిగ్రీలు లేదా శాతాల్లో ఉంటుంది. వృత్తంలోని కోణాల మొత్తం 360ా. శాతం అంటే ప్రతి 100 కి అని అర్థం.

 

 

2)  900 లకు సమానమైన విలువ శాతాల్లో ఎంత?

*  డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించిన ప్రశ్నలను సాధించడానికి ప్రధానంగా   ప్రాథమిక గణిత పరిక్రియలు, శాతాలు, నిష్పత్తులు, సగటు లాంటి అంశాలపై  అవగాహన ఉండాలి.


మాదిరి ప్రశ్నలు
 

I . కింది వృత్త రేఖాచిత్రం ఒక కుటుంబం నెలవారీ ఖర్చుల వివరాలను శాతాల్లో చూపిస్తోంది. కుటుంబం మొత్తం నెలసరి ఆదాయం  రూ.33,650.

1.  నెలవారీ ఇంటి అద్దె ఎంత?

1) రూ.6000  2) రూ.6152    3) రూ.6057    4) రూ.6048

వివరణ: ఇంటి అద్దె శాతాల్లో = 18%

 జ: 3


2 . ప్రావిడెంట్‌ ఫండ్‌ ద్వారా సంవత్సరానికి చేస్తున్న పొదుపు ఎంత?

1) రూ.48,456     2) రూ.48,540 

3) రూ.44,856     4) రూ.45,480

వివరణ: నెలవారి ప్రావిడెంట్‌ ఫండ్‌ పొదుపు = 12%

సంవత్సరానికి పొదుపు = 4,038 X 12 = 48,456

జ: 1


3. ఆ కుటుంబం ఆహారం, విలాసాలపై చేస్తున్న మొత్తం ఖర్చు ఎంత?

1) రూ.11,432    2) రూ.11,441 

3) రూ.12,315    4) రూ.12,443

వివరణ: ఆహారం + విలాసాలు = 25% + 9% = 34%

జ: 2


II. వృత్త రేఖాచిత్రాలను పరిశీలించి ప్రశ్నలకు సమాధానం రాయండి. 1998, 1999 లలో 4 రకాల కంప్యూటర్‌ సంస్థలు జరిపిన అమ్మకాల వివరాలను శాతాల్లో ఇచ్చారు. 1998లో     జరిపిన మొత్తం కంప్యూటర్‌ అమ్మకాలు 7,890 కాగా, 1999లో అమ్మకాలు గత    సంవత్సరం కంటే 16.5% పెరిగాయి.


4. 1998లో కంపాక్, 1999లో తోషిబా అమ్మకాలకు మధ్య నిష్పత్తి ఎంత?

1) 0.94   2) 1.06    3) 1.43    4) 0.89

వివరణ: 1998 లో మొత్తం అమ్మకాలు = 7890

కంపాక్‌ అమ్మకాల శాతం = 25%

1999లో తోషిబా అమ్మకాలు = 15%

 జ: 3


5. 1998లో సామ్‌సంగ్‌ కంప్యూటర్‌ అమ్మకాలు, 1999 లో హెచ్‌పీ కంప్యూటర్‌ అమ్మకాల్లో ఎంతశాతం?

1) 85.30%    2) 69.30%   3) 75.42%    4) 80.30%

వివరణ: 1998లో సామ్‌సంగ్‌ అమ్మకాలు = 29%

 

జ: 4


III. వృత్త రేఖాచిత్రాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానం రాయండి.


ఒక కళాశాలలో 6 సబ్జెక్టులు బోధిస్తున్న ఉపాధ్యాయుల శాతాలను, స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి ఇచ్చారు. ఆ కళాశాలలో మొత్తం ఉపాధ్యాయులు 1600.


6. ఆ కళాశాలలో మొత్తం ఎంతమంది పురుష ఉపాధ్యాయులు ఉన్నారు?

1) 594    2) 690    3) 696   4) 67

 


7. జువాలజీ మహిళా ఉపాధ్యాయులు, హిందీ పురుష ఉపాధ్యాయులకు మధ్య భేదం ఎంత?

1) 145   2) 150    3) 160   4) 100

వివరణ: పై ప్రశ్నలోని సమాచారం ఆధారంగా    జువాలజీలో మహిళా ఉపాధ్యాయులు  

= 352 - 154 = 198

హిందీలో పురుష ఉపాధ్యాయులు = 48

భేదం 198 - 48 = 150    

జ: 2 

రచయిత గోలి ప్రశాంత్ రెడ్డి 

Posted Date : 19-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌