• facebook
  • whatsapp
  • telegram

కొరికే కుంతకాలు.. చీల్చే రదనికలు!

జీర్ణక్రియ

 


 

నడవడం, ఆలోచించడం, పనులు చేయడం తదితర శారీరక విధులకు కావాల్సిన శక్తి ప్రాథమికంగా కార్బోహైడ్రేడ్ల నుంచి అందుతుంది. అలాగే ఆరోగ్యం, వ్యాధి నిరోధకశక్తి, బలమైన ఎముకల నిర్మాణం, వాటి నిర్వహణ శరీరం శోషించుకునే విటమిన్లు, ఖనిజాల వల్ల జరుగుతుంది. అవన్నీ ఆహారం నుంచి సమకూరతాయి. మనిషి తిన్న ఆహారాన్ని విచ్ఛినం చేసి, కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా, ఇతర పోషకాలుగా మార్చే కార్యక్రమాన్ని జీర్ణవ్యవస్థ నిర్వహిస్తుంది. నోటి నుంచి చిన్నపేగు వరకు ఆహారం జీర్ణమయ్యే క్రమం అనేక దశలల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ గురించి పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. జీర్ణవ్యవస్థలోని ఏ భాగం ఏ పని చేస్తుందో తెలుసుకోవాలి.

 

 

1.    కిందివాటిలో జీర్ణవ్యవస్థ విధులు ఏవి?

A) ఆహారాన్ని జీర్ణం చేయడం

B) జీర్ణమైన ఆహారాన్ని శోషణం చెందించుకోవడం.

C) జీర్ణం కాని పదార్థాల విసర్జన

1) A, B 2) B, C 3) A, B, C 4) A మాత్రమే


2.     కిందివాటిలో జీర్ణక్రియకి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి.

A) జీర్ణవ్యవస్థలో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారతాయి.

B) శోషితమవని పదార్థాలు శోషితమయ్యే పదార్థాలుగా మారతాయి.

C) గ్లూకోజ్‌ జీర్ణమై పిండిపదార్థాలుగా మారుతుంది.

D) పెద్దపేగులో ప్రొటీన్లు మలపదార్థంగా మారతాయి.

1) C, D    2) B, C   3) A, C   4) B, D


3.     కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఆహారం అంత్య పదార్థం
A) పిండిపదార్థం  గ్లూకోజ్‌
B) ప్రొటీన్లు అమైనో ఆమ్లాలు
C) కొవ్వులు కొవ్వు ఆమ్లాలు
D) విటమిన్లు ఖనిజ లవణాలు

1) A, B      2) D మాత్రమే  

3) A, C      4) A మాత్రమే


4.     కిందివాటిలో నాలుక గురించి సరైన వాక్యం ఏది?

A) నాలుక రుచిని గ్రహించడానికి తోడ్పడుతుంది.

B) లాలాజలంలో కరిగిన ఆహార పదార్థాలను మాత్రమే మనం రుచి చూడగలం.

C) నాలుకపైన రుచి మొగ్గల్లో రుచి కణాలుంటాయి.

D) రుచి మొగ్గలు ఉప్పు, తీపి, పులుపు, చేదు లాంటి వాటితో ఎక్కువ ప్రేరేపితమవుతాయి.

1) A    2) B    3 ) C   4) A, B, C, D


5.     కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

A) కుంతకాలు 1) నమలడానికి ఉపయోగపడతాయి
B) రదనికలు 2) చీల్చడానికి ఉపయోగపడతాయి
C)  అగ్రచర్వణకాలు 3) కొరకడానికి ఉపయోగపడతాయి
D) పాలదంతాల సంఖ్య 4) 32
E) శాశ్వత దంతాల సంఖ్య 5) 20
F) జ్ఞానదంతాల సంఖ్య 6) 4

1) A-1, B-3, C-4, D-5, E-6, F-2     2) A-3, B-4, C-2, D-1, E-6, F-5

3) A-3, B-2, C-1, D-5, E-4, F-6     4) A-6, B-5, C-3, D-1, E-4, F-2


6. కిందివాటిలో మానవుడి సరైన దంత ఫార్ములాను గుర్తించండి.


7. కిందివాటిలో దంతాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.    

A) దంతాల గురించిన అధ్యయనాన్ని ఓడంటాలజీ అంటారు.

B) కుంతకాలను ‘కొరికే దంతాలు’ అంటారు.

C) రదనికలను ‘చీల్చే దంతాలు’ అంటారు.

D) అగ్రచర్వణకాలు ఆహారం నమలడానికి ఉపయోగపడతాయి.

1) A, B  2) B, C   3) C, D  4) A, B, C, D


8. కింది వాక్యాలను పరిశీలించండి.

A) మానవుడిలో 3 జతల లాలాజల గ్రంథులుంటాయి.

B) మిక్సోవైరస్‌ పెరటోడిన్‌ అనే వైరస్‌ వల్ల గవద బిళ్లల వ్యాధి వస్తుంది.

పై వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

1) A సరైంది, B సరైంది కాదు.

2) A, B లు సరైనవి. ఇవి రెండు ఒకదాంతో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి.

3) A, B లు సరైనవి. ఇవి రెండూ వేర్వేరు అంశాలు.

4) A సరైంది కాదు, B సరైంది.


9. కిందివాటిలో నోటిలో జరిగే జీర్ణక్రియకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. 

A) దంతాల వల్ల ఆహారం జీర్ణమవుతుంది.

B) లాలాజలంలో ఉండే ఎంజైమ్‌ టయలిన్‌.

C) టయలిన్‌ పిండిపదార్థాలను మాల్టోజ్‌ చక్కెరగా మారుస్తుంది.

D) నోటిలో పిండిపదార్థాలు మాత్రమే జీర్ణమవుతాయి.

E) నాలుకపైనున్న రుచి మొగ్గల వల్ల ఆహారం రసాయనికంగా మార్పు చెందుతుంది.

1) B, C, D, E         2) A, B, C, D

3) B, C, D             4) A, C, D, E


10. కిందివాటిలో తప్పుగా ఉన్నవాటిని గుర్తించండి.

A) శాకాహార జంతువుల్లో నాలుగు జతల లాలాజల గ్రంథులుంటాయి.

B) మానవుడిలో అతిపెద్ద లాలాజల గ్రంథి పెరోటిడ్‌ గ్రంథి.

C) ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిటిక్‌ చలనాలను చూపుతుంది

D) లాలాజలం జీర్ణక్రియలో ఎలాంటి పాత్ర వహించదు.

1) A మాత్రమే      2) B, C  

3) D మాత్రమే      4) C మాత్రమే


11. కిందివాటిలో దంతాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

A) దంతాలపై ఉండే ఎనామిల్‌ వాటి రక్షణకు తోడ్పడుతుంది.

B) మన శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఎనామిల్‌.

C) 17 - 25 సంవత్సరాల మధ్య వచ్చే దంతాలను జ్ఞానదంతాలు అంటారు.

D) పయోరియా, జింజివైటిస్‌ అనేవి దంత వ్యాధులు.

1) A, B  2) B, C, D  3) C, D   4) A, B, C, D


12. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

A) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం 1) పాలను పెరుగుగా మారుస్తుంది
B) మ్యూకస్‌  2) కొవ్వులపై పనిచేస్తుంది
C) పెప్సిన్‌ 3) జీర్ణాశయానికి రక్షణనిస్తుంది
D) లైపేజ్‌ 4) ప్రొటీన్లపై పనిచేస్తుంది
E)  రెనిన్‌  5) సూక్ష్మజీవులను సంహరిస్తుంది

1) A-1, B-3, C-2, D-4, E-5         2) A-5, B-3, C-4, D-2, E-1

3) A-4, B-3, C-5, D-2, E-1         4) A-4, B-2, C-1, D-5, E-3


13. కిందివాటిలో చిన్నపేగుకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.

A) చిన్నపేగును ఆంత్రమూలం, మధ్యాంత్రం, శేషాంత్రికంగా విభజించొచ్చు.

B) జీర్ణమైన ఆహార పదార్థాలు చిన్న పేగు ద్వారా శోషితమవుతాయి.

C) చిన్నపేగులోకి కాలేయం నుంచి పైత్యసరం, క్లోమం నుంచి క్లోమసరం విడుదలవుతాయి.

D) చిన్నపేగులో ఆహారం ఎక్కువగా జీర్ణమవుతుంది.

1) A, C     2) B, C 

3) A, D     4) A, B, C, D


14. జీర్ణక్రియకు తోడ్పడే కింది జతల్లో ఎన్ని సరైనవి?

A) అమైలేజ్‌ - పిండిపదార్థాలపై పనిచేస్తుంది.

B) లైపేజ్‌ - లిపిడ్‌లపై పనిచేస్తుంది.

C) ట్రిప్సిన్‌ - కొవ్వులపై పనిచేస్తుంది.

D) కైమోట్రిప్సిన్‌ - చక్కెరపై పనిచేస్తుంది.

E) న్యూక్లియేజ్‌లు - కేంద్రకామ్లాలపై పనిచేస్తాయి.

1) 3 జతలు     2) 4 జతలు

3) 5 జతలు     4) 2 జతలు


15. జీర్ణవ్యవస్థకు సంబంధించి వేటిని అవశేష అవయవాలుగా పరిగణిస్తారు?

A) పిత్తాశయం     B) పెరోటిడ్‌ గ్రంథి  C) జ్ఞానదంతాలు    D) చూషకాలు     E) ఉండూకం     F) క్లోమం

1) A, B    2) C, E

3) B, C    4) D, E


16. కింది వాక్యాల్లో మానవుడిలో దంతాల అమరిక, రకాల గురించి సరైనవి ఏవి?

A) దవడ ఎముకల్లో దంతాలు ఉండటాన్ని థీకోడాంట్‌ అంటారు.

B) పాలదంతాలు, శాశ్వత దంతాలు అనే రెండు రకాలుగా దంతాలు రావడాన్ని డిఫయోడాంట్‌ అంటారు.

C) కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణ కాలుగా దంతాలు ఉండటాన్ని హెటిరోడాంట్‌ అంటారు.

1) A, C     2) B, C 

3) A, B     4) A, B, C


17. వివిధ జంతువుల్లో రూపాంతరం చెందిన, మార్పు చెందిన దంతాలకు సంబంధించిన జతలను సరైన క్రమంలో అమర్చండి.

A) శాకాహార జంతువులు 1) దంతాలు వెనుకకు తిరిగి ఉంటాయి.
B) మాంసాహార జంతువులు 2) కుంతకాలు బయటకు వస్తాయి.
C) ఏనుగు 3) రదనికలు బయటకు వచ్చి కోరలుగా ఉంటాయి.
D) మగ అడవి పంది 4) రదనికలు అభివృద్ధి చెంది ఉంటాయి.
E) పాము 5) రదనికలు లోపిస్తాయి.

1) A-4, B-3, C-2, D-1, E-5     2) A-5, B-4, C-2, D-3, E-1

3) A-2, B-4, C-1, D-3, E-5 4) A-1, B-3, C-2, D-5, E-4


18. కిందివాటిలో తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించండి.

A) ఆంత్రమూలం - చిన్నపేగు మొదటి భాగం 

B) మధ్యాంత్రం - పెద్ద పేగు మొదటి భాగం

C) శేషాంత్రికం - చిన్నపేగు చివరి భాగం

D) పురీష నాళం - పెద్దపేగు మధ్య భాగం

E) పాయువు - పెద్ద పేగు చివరి భాగం

1) D, E    2) B      3) A    4) B, C


19. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 

A) పెద్ద పేగులో జీర్ణంకాని ఆహార పదార్థాల నుంచి నీటిశోషణ జరుగుతుంది.

B) జీర్ణమైన ఆహారం చిన్నపేగులో ఉండే చూషకాల ద్వారా శోషితమవుతుంది.

C) ఆంత్రమూలంలోకి కాలేయ, క్లోమ రసాలు విడుదలవుతాయి.

D) జఠర రసం ఆమ్లముతంగా ఉంటుంది.

1) C, D    2) B, D    3) A, C    4) A, B, C, D


20. చిన్న పేగు, పెద్ద పేగు పొడవు, వ్యాసం గురించి కిందివాటిని సరిగా జతపరచండి.

A) చిన్నపేగు పొడవు   1) 1.5 మీటర్లు

B) చిన్నపేగు వ్యాసం  2) 6 - 7 మీటర్లు

C) పెద్దపేగు పొడవు    3) 6.5 సెంటీమీటర్లు

D) పెద్దపేగు వ్యాసం  4) 2.5 సెంటీమీటర్లు

1) A-4, B-3, C-2, D-1             2) A-1, B-4, C-3, D-2

3) A-2, B-4, C-1, D-3                 4) A-4, B-1, C-3, D-2


 


సమాధానాలు

1-3; 2-1; 3-2; 4-4; 5-3; 6-1; 7-4; 8-2; 9-3; 10-3; 11-4; 12-2; 13-4; 14-1; 15-2; 16-4; 17-2; 18-2; 19-4; 20-3.


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 

Posted Date : 25-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌