• facebook
  • whatsapp
  • telegram

 కొలతలు - ప్రమాణాలు

నదీ జలాల పంపిణీ విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు లేదా తుపానులు, వరదలు సంభవించినప్పుడు సముద్రంపాలయ్యే నీటి గురించి చెప్పేటప్పుడు క్యూసెక్, టీఎంసీ (TMC) లాంటి పదాలు వినేఉంటారు. వీటికి సంబంధించిన ప్రమాణాలతోపాటు వైశాల్యం, కాంతి అభివాహం లాంటి అంశాల గురించి తెలుసుకుందాం.
 క్యూసెక్ : ఇది నీటి ప్రవాహరేటుకు ప్రమాణం. దీని పూర్తి పేరు క్యూబిక్ ఫీట్ పర్ సెకన్ (Cubic feet per second = Cusec). అంటే 'ఒక సెకన్ కాలంలో ప్రవహించిన నీటి ప్రమాణం ఘనపు అడుగుల్లో' అని అర్థం.
1ft3 /S = 1 క్యూసెక్ = 28.3 లీటర్/ సెకన్


టి.ఎం.సి.: ఇది నీటి ఘనపరిమాణానికి ప్రమాణం. దీని పూర్తి పేరు థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ (109 ఘనపు అడుగులు).
1 టి.ఎం.సి. = 28, 316, 846, 592 లీటర్లు.
దీన్నే మరొక విధంగా చెప్పాలంటే 100 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తుతో ఉండే ఒక ట్యాంకులో పట్టే ద్రవ ఘనపరిమాణంగా నిర్వచించవచ్చు.
భారతదేశంలో ఘనపరిమాణానికి సాధారణ ప్రమాణం లీటర్. Sl ప్రమాణం m3 (ఘనపు మీటర్).
1 m3 = 1000 లీటర్లు.
1cm3 = 1 మిల్లీ లీటరు (ml)
cm3 నే CC గా కూడా రాస్తారు.
అమెరికా లాంటి దేశాల్లో గ్యాలన్ (3.78 లీటర్లు), ఔన్స్ (28 ml) లాంటి ప్రమాణాలు వాడుకలో ఉన్నాయి.


వైశాల్యం
వైశాల్యానికి Sl  ప్రమాణం m2 (చదరపు మీటరు). ఇతర ప్రమాణాలు హెక్టేర్, ఎకరం (Acre) మొదలైనవి.
 కేంద్రకాల వైశాల్యాలను, పరిక్షేపణ అడ్డుకోత వైశాల్యాన్ని తెలిపేందుకు బార్న్ (Barn) అనే అతి చిన్న ప్రమాణాన్ని ఉపయోగిస్తారు.
 1 బార్న్ = 10-28 m2
 1 హెక్టేర్ = 10,000 m2
 1 ఎకరం = 4047 m2 = 4840 చదరపు గజాలు.


కాంతిమితి (Photometry)
కాంతి మాపనాన్ని కాంతిమితి అంటారు. దృగ్గోచర కాంతిని చూసినప్పుడు మానవుడు పొందే అనుభూతి (Perception) తో పోల్చి కొలిస్తే దాన్ని దృగ్గోచర కాంతిమితి అంటారు. ఖగోళ వస్తువుల నుంచి వచ్చే విద్యుదయస్కాంత వికిరణ మాపనాన్ని ఖగోళ కాంతిమితి అంటారు. 


కాంతి అభివాహం (Luminous Flux)
దీన్నే కాంతి సామర్థ్యం (Luminous Power) అని కూడా అంటారు.
ప్రమాణ కాలంలో కాంతి జనకం విడుదల చేసే వికిరణ శక్తినే కాంతి అభివాహం/ కాంతి సామర్థ్యం అంటారు. దీనికి Sl ప్రమాణం ల్యూమెన్ (lm). ఒక క్యాండిలా కాంతి తీవ్రతను ఒక జనకం ఒక స్టెరేడియన్ ఘనకోణంలో ఉద్గారిస్తే దాని కాంతి అభివాహాన్ని 'ల్యూమెన్‌'గా నిర్వచిస్తారు.
100 వాట్ సాధారణ విద్యుత్ బల్బు 1700 lm కాంతి అభివాహాన్ని వెలువరిస్తుంది.
1 ల్యూమెన్ = 1 క్యాండిలా . స్టెరేడియన్ (cd. sr)
 ఘనకోణానికి Sl ప్రమాణం స్టెరేడియన్ (sr). గోళం కేంద్రం వద్ద ఏర్పరిచే ఘనకోణం విలువ 4 Π స్టెరేడియన్. 


 కాంతి తీవ్రత లేదా దీపన సామర్థ్యం
ఒక బిందుజనకం నుంచి ప్రమాణ ఘనకోణంలో ఉద్గారమయ్యే కాంతి అభివాహాన్ని కాంతి తీవ్రత అంటారు. దీనికి Sl ప్రమాణం క్యాండిలా (cd). క్యాండిలా కొవ్వొత్తి నుంచి వచ్చిన పేరు.
 ప్రదీప్తత (llluminance): ప్రమాణ వైశాల్యానికి వెలువడే కాంతి అభివాహం. దీనికి Sl ప్రమాణం లక్స్ (lX) లేదా ల్యూమెన్/మీ2.దీనికి సీజీఎస్ ప్రమాణం ఫోట్ (phot).
1 Ph= 10000 లక్స్
ఒక ప్రదేశంలోని ప్రదీప్తతను లక్స్ మీటర్‌తో కొలుస్తారు.  
రేడియోధార్మికత
ఒక అస్థిర కేంద్రకం తనకు తానుగా α, β, γ లాంటి కిరణాలను వెలువరించే ప్రక్రియను రేడియోధార్మికత (Radio activity) అంటారు. రేడియోధార్మిక విఘటనం వల్ల పదార్థ ద్రవ్యరాశి తగ్గిపోతుంది. రేడియోధార్మికతకు ఉపయోగించే సాధారణ ప్రమాణం క్యూరీ (Ci)
1 క్యూరీ (Ci) = 3.7 × 1010 విఘటనాలు/ సెకన్
క్యూరీ పెద్ద ప్రమాణం కాబట్టి చిన్న ప్రమాణాలైన మిల్లీ క్యూరీ, మైక్రో క్యూరీని కూడా ఉపయోగిస్తారు.
 1 m Ci = 10-3 Ci, 1 µ Ci = 10-6 Ci.
 రేడియోధార్మికతకు మరో ప్రమాణం రూథర్‌ఫర్డ్ (rd).
1 rd = 106 విఘటనాలు/ సెకన్
రేడియోధార్మికతకు Sl ప్రమాణం బెకరల్ (Bq). సహజ రేడియోధార్మికతను కనుక్కున్న హెన్రీ బెకరల్ పేరుమీదుగా దీనికి ఈ పేరు పెట్టారు.
1 బెకరల్ (Bq) = 1 విఘటనం/ సెకన్


రేడియోధార్మికత - నష్టాలు
α, β, γ కిరణాల వల్ల మానవులు, జీవులతోపాటు ప్రకృతికి కూడా తీరని నష్టం వాటిల్లుతుంది. జీవసంబంధ నష్టాన్ని తెలియజేసే వివిధ ప్రమాణాలు...
శోషించుకున్న డోసు (Absorbed Dose) : దీన్నే భౌతిక డోసు (Physical dose) అంటారు. ఇది ఏకాంక ద్రవ్యరాశి ఉన్న పదార్థం శోషించుకున్న సగటు శక్తి. దీని Sl ప్రమాణం గ్రే (Gy.)
 1 Gy = J/kg  
 సీజీఎస్ ప్రమాణం rad.
 1 rad = 100 ఎర్గ్/ గ్రాము.
 1 rad = 0.01 Gy.
జీవశాస్త్రీయ డోసు (Biological Dose): ఇది అయనీకరణ వికిరణం చూపే జీవశాస్త్రీయ ప్రభావాన్ని సూచిస్తుంది. దీనికి Sl ప్రమాణం ప్రమాణం సీవర్ట్ (Sv), సీజీఎస్ ప్రమాణం rem (రాంట్‌జెన్ ఈక్వివలెంట్ ఇన్ మ్యాన్).
1 SV = 100 rem

 

 

 

 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌