• facebook
  • whatsapp
  • telegram

సూక్ష్మజీవులు- వ్యాధులు

కంటికి కనిపించని శత్రువులు!

కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మజీవులు మనుషులకు అనేక రకాల వ్యాధులను కలుగుజేస్తాయి. నిత్యజీవిత పరిజ్ఞానంలో భాగంగా జనరల్‌ స్టడీస్‌ కోసం అభ్యర్థులు వీటి గురించి అధ్యయనం చేయాలి. పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. 

మన పరిసరాల్లో కంటికి కనిపించని అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మానవులకు వివిధ వ్యాధులను కలగజేస్తాయి. 

 

మైకోప్లాస్మా

వీటినే ప్లూరో న్యూమోనియో లైక్‌ ఆర్గనిజమ్స్‌ (PPLO) అంటారు. ఇది కేంద్రక పూర్వజీవులు, అతిచిన్న కణాలకు ఉదాహరణ వీటికి కణకవచం ఉండదు. 

 

మానవుడిలో కలిగే వ్యాధులు:

1) మైకోప్లాస్మా న్యుమోనియే - శ్వాస నాళానికి సంబంధించిన వ్యాధి, ట్రాకియో బ్రాంకైటిస్‌

2) మైకోప్లాస్మా హామినిస్‌ - పోస్ట్‌పార్టమ్‌ ఫీవర్, పైలియోనిఫిరిటిస్, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరి డిసీజ్‌

3) మైకోప్లాస్మా జెనిటేలియమ్‌ - నాన్‌గోనోకోకల్‌ యురైథ్రిటిస్‌

 

క్లమీడియా 

ఇవి బ్యాక్టీరియా కంటే భిన్నమైనవి. బ్యాక్టీరియా మాదిరి వీటికి పెప్టిడోగ్లైకాన్‌ కణ కవచం ఉండదు. ఇవి కణాంతర్గత పరాన్నజీవులు. గ్రామ్‌ నెగెటివ్‌గా ఉంటాయి. గుండ్రటి ఆకారం ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి స్పర్శ లేదా గాలి ద్వారా వాపిస్తాయి. 

కలిగించే వ్యాధి:

1) క్లమీడియా ట్రకోమాటిస్‌ - ట్రకోమా, లైంగిక వ్యాధులు, యురైథ్రైటిస్‌

2) క్లమీడియా న్యూమోనియే - న్యూమోనియా

3) క్లమీడియా సిట్టసి - సిట్టకోసిస్‌ (ఆర్నిథోసిస్‌)

 

రికెట్షియా  

ఇవి గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా. అవికల్ప కణాంతర పర్నాజీవులు. ఇవి ఆతిథేయి కణద్రవ్యం, కేంద్రకంలో విభజన చెందుతాయి. కణకవచం గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియాలా ఉంటుంది. ఇవి చలించవు, స్పోరులను ఏర్పరచవు. ద్విదావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. మానవులకు నల్లులు, తలలోని పేలు, ఈగలు కుట్టడం ద్వారా సంక్రమిస్తాయి. 

 

రికెట్షియా జీవి కలిగించే వ్యాధులు:  

1) రికెట్షియా ప్రోవాజెకి - ఎపిడమిక్‌ టైపస్‌

2) రికెట్షియా టైఫి - మ్యూరైన్‌ టైఫస్‌

3) ఓరియంటియా సుసుగముషి - స్క్రబ్‌ టైఫస్‌

4) రికెట్షియా రికెట్సి - రాకిమౌంటెడ్‌ స్పాటెడ్‌ ఫీవర్‌

5) కెక్సిల్లా బ్రునెటి - క్యూఫీవర్‌

6) బార్టోనెల్లా క్విన్‌టానా - ట్రెంచ్‌ ఫీవర్‌

7) రికెట్షియా కొనోరి - ఇండియన్‌ టిక్‌ టైపస్‌

 

ఆక్టినోమైసిటీస్‌ (ఆక్టినో బ్యాక్టీరియా)

ఇవి దండాకారంగా ఉండి గ్రామ్‌ పాజిటివ్‌ను చూపుతూ స్పోరులను ఏర్పరిచే బ్యాక్టీరియా. వీటిని బ్యాక్టీరియా, శిలీంద్రాలకు సంధానకర్తగా వ్యవహరిస్తారు. ఇవి శిలీంద్ర  తంతువులను ఏర్పరుస్తాయి. వాయుయుతంగా, వాయురహితంగా కూడా ఉంటాయి. నేలలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని జీవులు మానవులకు వ్యాధులను కలగజేస్తాయి. 

ఉదా: ఆక్టినోమైకోటిక్‌ మైసిటోమా, ఆక్టినో మైకాసిస్‌

 

ప్రోటోజోవా వ్యాధులు 

ప్రోటోజోవా జీవులు జంతురాజ్యంలో అకశేరుకాలకు చెందినవి. ఇవి ఏక కణజీవులు. వీటిలో కొన్ని మానవులకు వ్యాధులను కలగజేస్తాయి.
 

ప్రోటోజోవా         మానవుడిలో వచ్చే వ్యాధి 

ప్లాస్మోడియం - మలేరియా 

ప్లాస్మోడియం వివిధ జాతులు వివిధ రకాల మలేరియాను కలిగిస్తాయి.

ఎంటమీబా హిస్టోలైటికా - అమీబియాసిస్‌ 

ఎంటమీబా జింజివాలిస్‌ - పెరిడాంటైటిస్‌ 

ట్రిపనోసోమా క్రూజి - చాగా వ్యాధి

ట్రిపనోసోమా గాంబియన్సి - ట్రిపనోసోమియాసిస్‌ (స్లీపింగ్‌ సిక్‌నెస్‌)  

లైష్మానియా - కాలా అజార్‌

బాలంటిడియమ్‌కోలి - బాలంటిడియాసిస్‌

జియార్డియా ఇంటస్టైనాలిస్‌ - జియార్డియాసిస్‌

టాక్సోప్లాస్మా  - టాక్సో ప్లాస్మోసిస్‌

ట్రైకోమోనాస్‌ వెజినాలిస్‌ - ల్యుకరోహియా

 

శిలీంద్ర వ్యాధులు

శిలీంధ్రాల్లో కొన్ని మానవ శరీరం లోపల, మరికొన్ని చర్మంపై ఉంటూ వ్యాధులను కలిగిస్తాయి. శిలీంధ్ర చర్మ వ్యాధులు స్పర్శ లేదా రోగి వాడిన దుస్తుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. 

శిలీంద్రం                      కలిగించే వ్యాధి

హిస్టోప్లాస్మా కాప్సులేటమ్‌ - హిస్టోప్లాస్మోసిస్‌

బ్లాస్టోమైసిస్‌ డెర్మటైడిస్‌ - బ్లాస్టోమైకాసిస్‌ 

మదురోమైసిటోమా - మదురాఫుట్‌

కాండిడా ఆల్బికన్స్‌ - కాండిడియాసిస్‌

మైక్రోస్పోరమ్‌/టినియా - తామర

ట్రైకో ఫైటాన్‌ - అథ్లెట్‌ఫుట్‌

స్పోరోట్రైకమ్‌ స్కెన్‌స్కి - స్పోరోట్రైకాసిస్‌

మ్యూకార్‌ జాతుల శిలీంధ్రాలు  - మ్యూకరోమైకాసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి)

కాక్సిడియాడిస్‌ ఇమిటస్‌ - కాక్సిడియాడియో మైకాసిస్‌

ఆస్పర్జిల్లస్‌ ఫ్యుమిగేటిస్‌ - ఆస్పర్‌జిల్లోసిస్‌

టినియాక్యూరిస్‌ - జాక్‌యిచ్‌

పయడ్రా హర్టే - బ్లాక్‌ పయెడ్రా

 

ప్లాటిహెల్మింథిస్‌ వ్యాధులు

ప్లాటిహెల్మింథిస్‌ అంటే బల్లపరుపు పురుగులు. వీటి శరీరం కొలబద్దలా (టేప్‌ ఆకారం) ఉంటుంది. కాబట్టి వీటిని బద్దెపురుగులు అంటారు. ఇవి జంతురాజ్యంలో అకశేరుకాలకు చెందినవి. వీటిలో కొన్ని మానవుడిలో వ్యాధులను కలగజేస్తాయి.

ప్లాటిహెల్మింథిస్‌ జీవి                     కలిగించే వ్యాధి

టినియా సోలియమ్‌ (పోర్క్‌ టేప్‌వార్మ్‌) - టినియాసిస్‌/సిస్టిసర్కాసిస్‌

ఇఖైనోకోకస్‌ గ్రాన్యులోసా (డాగ్‌ టేప్‌వార్మ్‌) - హైడటిడ్‌ వ్యాధి

సిస్టోసోమా  - సిస్టో సోమియాసిస్‌

 

నిమాటి హెల్మింథిస్‌ వ్యాధులు

నిమాటి హెల్మింథిస్‌ అంటే దారపు పోగుల లాంటి జీవులు. వీటిలో కొన్ని జీవులు మానవులకు వ్యాధులను కలిగిస్తాయి. 

నిమాటి హెల్మింథిస్‌ జీవి                         కలిగించే వ్యాధి

ఫైలేరియా పురుగు (వుకరేరియా) - ఫైలేరియాసిస్‌ (ఏనుగు కాలు/బోధకాలు)

నార పురుగు (గునియా వార్మ్‌) -  నార కురుపు వ్యాధి (డ్రాకన్‌ క్యులియాసిస్‌)

ఆస్కారిస్‌ - ఆస్కారియాస్‌ 

ఎంటరోబిస్‌ - ఎంటరోబియాసిస్‌

ఎన్‌కైలోస్టోమా (కొంకి పురుగు) - ఎన్‌కైలో స్టోమియాసిస్‌

ఆఫ్రికా కంటి పురుగు - కలబార్‌ స్వెల్లింగ్‌

 

మాదిరి ప్రశ్నలు

1. మ్యూకరో మైకాసిస్‌ లేదా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిని కలిగించేది?

1) బ్యాక్టీరియా   2) శిలీంధ్రం   3) శైవలం   4) వైరస్‌

2. అతిచిన్న కణాలుగా పిలిచే ఏ జీవులు మానవుడిలో శ్వాసకోశ వ్యాధులు, ట్రాకియో బ్రాంకైటిస్, పోస్ట్‌పార్టమ్‌ ఫీవర్‌ లాంటి వ్యాధులను కలగజేస్తాయి?

1) మైకోప్లాస్మా   2) రికెట్షియా   3) ఆక్టినో మైకోటా  4) యూమైకోటా

3. క్లమీడియా తరగతికి చెందిన జీవులు కలిగించే వ్యాధులు?

1) ట్రకోమా   2) సిట్టకోసిస్‌  3) లైంగిక వ్యాధులు  4) పైవన్నీ

4. రికెట్షియాకు చెందిన సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు?

1) క్యూఫీవర్‌   2) ట్రెంచ్‌ ఫీవర్‌  3) టైఫస్‌   4) అన్నీ

5. ఏ సూక్ష్మజీవులను బ్యాక్టీరియా, శిలీంధ్రాలకు సంధానకర్తగా చెప్పవచ్చు?

1) మైకోప్లాస్మా   2) బ్లూగ్రీన్‌ ఆల్గే   3) ఆక్టినో బ్యాక్టీరియా  4) శైవలాలు

6. మలేరియా వ్యాధిని కలిగించే జీవి?

1) ఆడ ఎనాఫిలస్‌ దోమ   2) ప్లాస్మోడియం   3) మగ ఎనాఫిలస్‌ దోమ  4) ఆడ క్యూలెక్స్‌ దోమ 

7. ఎంటమీబా జింజివాలిస్‌ అనే ప్రోటోజోవా పరాన్న జీవి వల్ల కలిగే పెరిడాంటైటిస్‌ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది?

1) కన్ను 2) కాలేయం  3) దంతాలు  4) జీర్ణాశయం

8. తామర అనే చర్మ వ్యాధి ఏ జీవుల వల్ల కలుగుతుంది?

1) శిలీంధ్రాలు   2) బ్యాక్టీరియా   3) వైరస్‌   4) మైకోప్లాస్మా

9. నిమాటి హెల్మింథిస్‌ పరాన్నజీవి వల్ల కలిగే నారకురుపు వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది?

1) కలుషిత ఆహారం   2) కలుషితమైన దిగుడుబావి నీటి ద్వారా 

3) తుమ్మడం, దగ్గడం    4) స్పర్శ 

10. బోధకాలు వ్యాధిలో ఏ వ్యవస్థ ప్రభావితమవుతుంది?

1) నాడీ వ్యవస్థ   2) రక్త ప్రసరణ వ్యవస్థ 3) శోషరస నాళాలు  4) రక్తనాళాలు

11. కలుషితమైన మట్టి నుంచి పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలిగించేది?

1) కొంకి పురుగు   2) నార పురుగు   3) ఎంటమీబా  4) బద్దెపురుగు

12. ఎంటమీబా హిస్టోలైటికా అనే సూక్ష్మజీవి వల్ల కలిగే అమీబియాసిస్‌ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది?

1) జీర్ణాశయం  2) మూత్రపిండాలు  3) మెదడు   4) చిన్నపేగు

13. సిట్టకోసిస్‌ లేదా ఆర్నిథోసిస్‌ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది?

1) క్లమీడియా   2) రికెట్షియా   3) ఆక్టినో మైసిటిస్‌  4) వైరస్‌ 

14. ప్లాటి హెల్మింథిస్‌ పరాన్నజీవి అయిన పోర్క్‌ టేప్‌వార్మ్‌ వల్ల కలిగే వ్యాధి?

1) టినియాసిస్‌  2) సిస్టో సోమియాసిస్‌  3) ఎంటరోబియాసిస్‌  4) ఎన్‌కైలో స్టోమియాసిస్‌

15. కిందివాటిలో శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు?

1) కాండిడియాసిస్‌   2) మదురాఫుట్‌  3) తామర  4) అన్నీ

 

సమాధానాలు: 1-2, 2-1, 3-4, 4-4, 5-3, 6-2, 7-3, 8-1, 9-2, 10-3, 11-1, 12-4, 13-1, 14-1, 15-4.

 

రచయిత: డాక్టర్‌ బి.నరేష్‌

Posted Date : 24-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌