• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యుత్పత్తి

* ఒక జీవి తనలాంటి మరొక జీవిని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు.

 

ఉద్దేశాలు:

* ఒక జాతి అంతరించిపోకుండా కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. 

* జనాభా పెరుగుదలలో సహాయపడుతుంది.

* జీవన క్రియల్లో మనుగడకు సంబంధంలేని, అత్యంత బలహీనమైన క్రియ.

 

విధాలు:

ప్రత్యుత్పత్తి లైంగిక, అలైంగిక అనే రెండు విధాలుగా జరుగుతుంది.

 

అలైంగిక ప్రత్యుత్పత్తి:

సంయోగ బీజాలు; జీవుల ప్రమేయం లేకుండా ఒక జీవి నుంచి కొత్త జీవులు ఏర్పడటాన్ని ‘అలైంగిక  ప్రత్యుత్పత్తి’ అంటారు.

 

లైంగిక ప్రత్యుత్పత్తి:

* సంయోగ బీజాల కలయిక వల్ల (శుక్ర కణం, అండం) కొత్త జీవి ఏర్పడటాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

* ఇందులో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనే రెండు భాగాలు ఉన్నాయి.

పునరుత్పత్తి: తెగిపోయిన శరీర భాగాల నుంచి కొత్త జీవులు ఏర్పడటాన్ని పునరుత్పత్తి అంటారు. ఉదా: ఫ్లనేరియా, వానపాములో తల భాగం, ఆక్టోపస్‌

ద్విదా విచ్ఛిత్తి: ఒక ప్రౌఢ జీవి రెండు సమాన భాగాలుగా విడిపోయి, పిల్ల జీవిని ఏర్పరిచే క్రియను ద్విదా విచ్ఛిత్తి అంటారు. 

ఉదా: యూగ్లినా, పేరమీషియం, బ్యాక్టీరియా, అమీబా

కోరకీభవనం: కొన్ని ప్రౌఢ జీవుల్లో కేంద్రకం 4, 5 భాగాలుగా విడిపోయి, అందులోని వేర్ల భాగాల్లోకి చేరతాయి. తర్వాత తల్లి జీవి నుంచి ఆ నిర్మాణం విడిపోతుంది. వీటినే ‘కోరకాలు’ అంటారు.

* ప్రతి కోరకం నుంచి ఒక ‘హైడ్రా’ ఉద్భవిస్తుంది.

 

ముక్కలవ్వడం, సిద్ధ బీజాలు ద్వారా:

* రైజోపస్‌ లాంటి శిలీంధ్రాలు శరీరం తంతువుల మాదిరి ఉంటాయి. 

* ఈ తంతువులు ముక్కలైనప్పుడు అందులో కేంద్రకం ఉంటే, ఆ భాగాల నుంచి కొత్త రైజోపస్‌లు ఉద్భవిస్తాయి.

* ఒకవేళ రైజోపస్‌ బాగా అభివృద్ధి చెంది, గొడుగు లాంటి నిర్మాణాలతో ‘కొనిడియోఫోర్‌’ను ఏర్పరచుకుని ఉంటే, ఆ నిర్మాణాల్లో వందల సంఖ్యలో బీజాలు ఉంటాయి. వీటినే సిద్ధ బీజాలు అంటారు.

* ఈ గొడుగు లాంటి భాగం పగిలిపోయి, అన్ని వైపులకు సిద్ధ బీజాలను వెదజల్లుతుంది. ప్రతి సిద్ధ బీజం ఒక రైజోపస్‌గా ఉద్భవిస్తుంది.

లైంగిక ఉత్పత్తి 

పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ (ఆండ్రాలజీ):

* ఇందులో ప్రధానంగా ఒక జత ముష్కాలు, శుక్రనాళాలు, అనుబంధ గ్రంథులు (ఒక పౌరుష గ్రంథి, రెండు కౌపర్‌ గ్రంథులు, రెండు శుక్ర గ్రాహికలు) ఉంటాయి.

* ‘ముష్కాలు’ శరీరరం బయట ఉన్న ముష్కగోణి అనే సంచి లాంటి భాగంలో అమరి ఉంటాయి.

* ముష్కగోణుల్లో ఉన్న గదుల లాంటి భాగాలను ‘లంబికలు’ అంటారు. వీటిలో 80 సెం.మీ. పొడవున్న మెలితిరిగిన నిర్మాణాలు ఉంటాయి. వీటిని ‘శుక్రోత్పాదక నాళికలు’ అంటారు. ఇవి శుక్రకణాలను వేల సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి.

* వీటి నుంచి విడుదలైన శుక్రకణాలను నాళికల లాంటి భాగాలు సేకరించి ‘ఎపిడిడిమిస్‌’ అనే భాగంలో తాత్కాలికంగా నిల్వ చేస్తాయి.

* ఎపిడిడిమిస్‌ నుంచి బయలుదేరిన శుక్రకణాలు నాళాల ద్వారా అనుబంధ గ్రంథుల సమీపానికి ప్రయాణిస్తాయి. ఈ గ్రంథుల నుంచి తెల్లటి జిగట లాంటి ద్రవం శుక్రకణాల్లోకి చేరుతుంది. దీన్ని ‘శుక్రం’ అంటారు.

* ఇది శుక్రకణాలు ఈదడానికి, వాటికి కావాల్సిన పోషకాలను సమకూర్చడానికి సహాయపడుతుంది.

 

శుక్రకణం:

* మానవుడి శరీరంలో అత్యంత చిన్న కణం. దీని జీవిత కాలం 3 రోజులు లేదా 72 గంటలు. శుక్రకణంలో తల, మెడ, మధ్యభాగం, తోక అనే నాలుగు భాగాలు ఉంటాయి. శుక్రకణాన్ని అండంతో కలిపే తలలోని భాగం ‘ఎక్రోసోమ్‌’.

* శుక్రకణానికి అవసరమైన శక్తిని అందించే భాగం ‘మధ్యభాగం’. శుక్రకణం ఈదడానికి సహాయపడే భాగం తోక.

* శుక్రనాళాన్ని కత్తిరించి ముడివేయడాన్ని ‘వేసక్టమి’ అంటారు. ఇది ఒక కుటుంబ నియంత్రణ పద్ధతి.

 

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ (గైనకాలజీ):

* స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానంగా ఒక జత స్త్రీ బీజ కోశాలు, ఒక స్త్రీ బీజ వాహిక, ఒక జత ఫాలోపియన్‌ నాళికలు, గర్భాశయం ఉంటాయి.

* స్త్రీలలో ఉదరం దిగువ భాగాన ఉండే సంచుల లాంటి నిర్మాణాలను ‘స్త్రీ బీజ కోశాలు’ అంటారు. వీటి నుంచి బయలుదేరే నాళాల లాంటి నిర్మాణాలను ‘స్త్రీ బీజ వాహికలు’ అంటారు.

* స్త్రీ బీజ కోశాల్లోని గదుల లాంటి నిర్మాణాలను ‘అండాశయాలు’ లేదా ‘గ్రాఫియన్‌ పుటికలు’ అంటారు. స్త్రీలలో 12, 13 సంవత్సరాల వయసు నుంచి వీటిలో ఒక అండం అభివృద్ధి చెందుతుంది. 

* తర్వాత FSH, LH, ఈస్ట్రోజెన్‌ అనే హార్మోన్‌ల సాయంతో ప్రతి నెలా ఒక పుటిక పగిలి ‘ఒక అండం’ విడుదలవుతుంది. దీన్నే ‘అండోత్సర్గం’ లేదా ‘రుతుచక్రం’ అంటారు. 

* పగిలిన పుటికను ‘కార్పస్‌ లూటియం’ అంటారు.అండం జీవితకాలం 24 గంటలు.

* స్త్రీ జీవిలో ఫలదీకరణం జరిగే ప్రదేశం ‘స్త్రీబీజవాహిక’. ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన బీజాన్ని సంయుక్త బీజం అంటారు.

* చేప, వానపాము, కప్ప లాంటి జీవుల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది.

* మగ కప్ప విడుదల చేసే శుక్రకణాల సమూహాన్ని ‘మిల్ట్‌’ అంటారు. ఆడ కప్ప ఉత్పత్తి చేసే అండాల సమూహాన్ని స్పాన్‌ అంటారు.

* స్త్రీబీజ వాహికలో అంతర ఫలదీకరణం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం ‘ప్రొజెస్టిరాన్‌’ అనే హార్మోన్‌ వల్ల గర్భాశయ గోడ/కుడ్యానికి అతుక్కుంటుంది. దీన్నే ‘పిండప్రతిస్థాపన’ అంటారు. పిండం ఏర్పడిన ప్రాథమిక ధశలో పిండం చుట్టూ లేదా బయట పరాయువు, పిండాన్ని ఆవరిస్తూ ద్రవ రూపంలో ఉల్బం (ఉమ్మనీరు) అనే రెండు పొరలు ఏర్పడతాయి. 

* ప్రారంభదశలో పిండానికి కావాల్సిన పోషకాలను సరఫరా చేయడంలో, పిండంలోని వ్యర్థపదార్థాలను బయటకు విసర్జించడంలో పాత్ర వహించేది - పరాయువు. 

* పిండాన్ని చిన్న చిన్న అగాధాల నుంచి కాపాడేది - ఉల్బం. ‘21 వ రోజు’ నుంచి పిండంలో ‘హృదయస్పందన’ ప్రారంభమవుతుంది. 

* ఆరోవారంలో ‘ఆమ్నియోసెంటాసిస్‌’ అనే పరీక్ష ద్వారా లింగనిర్ధారణను తెలుసుకోవచ్చు. 12వ వారంలో పిండ కణజాలం, తల్లి కణజాలం కలిసి మందమైన నిర్మాణం ఏర్పడుతుంది. దీన్నే ‘జరాయువు’ అంటారు.    

* జరాయువు గ్రహించిన పోషకాలు నాభిరజ్జువు/అళిందం/బొడ్డుతాడు ద్వారా శిశువుకు సరఫరా అవుతాయి. 12వ వారం తర్వాత శిశువులో అన్ని అవయవాలు ఏర్పడి మానవ రూపం కనిపిస్తుంది. అప్పటి నుంచి దీన్ని ‘భ్రూణం’ అంటారు.

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌