• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు

1. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) సంస్కృత పదమైన ‘యుజ్‌’ నుంచి ‘యోగా’ ఉద్భవించింది.

బి) యోగా సూత్రాలను, ఆసనాలను పతంజలి మహర్షి సూత్రీకరించారు.

సి) యోగా ద్వారా మెరుగైన మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుంది.

జ: పైవన్నీ

 

2. ప్రాచీన భారత్‌లో గణితశాస్త్త్ర్రంపై పరిశోధనలు జైన సాహిత్యవేత్త ఎవరు? (ఈయన క్రీ.శ. 850లో ‘గణితసారసంగ్రహం’ అనే గ్రంథాన్ని రాశారు. అందులో భిన్నాలు, ఆల్జీబ్రిక్‌ సమీకరణాలు, సమితి సిద్ధాంతాలు, క.సా.గు, గ.సా.భాలను వివరించారు.)

జ:  మహావీర ఆచార్య  

 

3. క్రీ.పూ.6వ శతాబ్దంలో నవీన పరమాణు సిద్ధాంతానికి అనుగుణంగా, పరమాణు సిద్ధాంతాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? (విశ్వం అత్యంత చిన్న కణాలతో (ప్రస్తుత పరమాణు/ అణువులు) నిర్మితమైందని ఈయన విశ్లేషించారు. ఈయన ‘వైశేషిక’ అనే తత్త్వశాస్త్ర గ్రంథాన్ని రచించారు.)

జ: కనడ

 

4. ‘రసరత్నాకరం’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? (ఈయన పదో శతాబ్దానికి చెందిన వారు. లోహ సంగ్రహణ పద్ధతులను ఈ గ్రంథంలో వివరించారు.)

జ: నాగార్జునుడు     

 

5. భారత భౌతిక, అణు శాస్త్రవేత్త డాక్టర్‌ రాజా రామన్న గురించి కిందివాటిలో  సరైన వాక్యాలు ఏవి?

1) భారత శక్తి రంగాన్ని బలోపేతం చేయడంలో రాజా రామన్న క్రియాశీల పాత్ర పోషించారు.

2) ఈయన సారథ్యంలోనే 1974లో పోఖ్రాన్‌లో మొదటి అణు పరీక్ష జరిగింది. ఆ పరీక్షకు ఈయనే ‘స్మైలింగ్‌ బుద్ధ’ అని పేరు పెట్టారు.

3) ఈయనను భారత అణుశక్తి విధాన రూపకర్తగా పిలుస్తారు.

4) పైవన్నీ సరైనవే

జ: పైవన్నీ సరైనవే

 

6. కింది అంశాలను జతపరచండి.

a) పసుపు విప్లవం i) గుడ్లు
b) సిల్వర్‌ విప్లవం ii) ఫార్మాస్యూటికల్స్, రొయ్యలు
c) గోల్డెన్‌ విప్లవం iii) పండ్లు, తేనె, ఉద్యాన పంటలు
d) పింక్‌ విప్లవం iv) నూనె గింజలు

జ: a-iv b-i c-iii d-ii

 

7. కింది అంశాలను జతపరచండి.

a) హరిత విప్లవం i) డాక్టర్‌ హీరాలాల్‌ చౌదరి, అరుణ్‌ కృష్ణన్‌
b) శ్వేత విప్లవం ii) శ్యామ్‌ పిట్రోడా
c) పసుపు విప్లవం iii) ఎం.ఎస్‌.స్వామినాథన్‌ 
d) నీలి విప్లవం iv) డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌

జ: a-iii b-iv c-ii d-i

 

8. యల్లాప్రగడ సుబ్బారావు గురించి కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) కీమోథెరపీ అభివృద్ధికి  కృషి చేశారు.

బి) క్యాన్సర్‌ మందు మీధోటెక్సేట్‌ను కనుక్కున్నారు.

సి) ఫైలేరియా ఔషధం హెట్రాజెన్‌ను కనుక్కున్నారు.

డి) క్షయ నివారణకు ఐసోనిక్టిక్‌ యాసిడ్‌ హైడ్రజైడ్‌ను కనుక్కున్నారు.

జ: పైవన్నీ

 

9. రామన్‌ ఎఫెక్ట్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? (ఈయన 1930లో నోబెల్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు.)

జ: సర్‌ సి.వి.రామన్‌ 

Posted Date : 30-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌