• facebook
  • whatsapp
  • telegram

దుర్బలత్వం - వైపరీత్యాల సంభావ్యత

మాదిరి ప్రశ్నలు

 

1. విపత్తు నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే చర్యలను ఏ స్థాయిలో పరిగణించాలి?

1) మొదటి    2) రెండో    3) మూడో    4) ఉన్నత 

 

2. సముద్రం ఒడ్డున నివసించే పేదవాడు సరైన కాంక్రీట్‌ భవనాన్ని నిర్మించుకోలేకపోవడం అనేది-

1) భౌతిక దుర్బలత్వం 2) సామాజిక ఆర్థిక దుర్బలత్వం

3) భౌతిక సామర్థ్యం కలిగి ఉండటం

4) ఏదీకాదు

 

3. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలు?

1) దుర్బలత్వాన్ని పెంచే స్థితిని తెలియజేస్తాయి 

2) వైపరీత్యాన్ని పెంచుతాయి

3) సామర్థ్యాన్ని పెంచుతాయి 

4) పైవన్నీ సరైనవి

 

4. ముప్పు లేదా అపాయాన్ని ఎలా కొలుస్తారు?

1) వైపరీత్యాలు, దుర్బలత్వాల మధ్య ఉండే పరస్పర చర్యలను బట్టి

2) వైపరీత్యాలు, విపత్తుల మధ్య ఉండే పరస్పర చర్యలను బట్టి

3) వైపరీత్యాలు, సామర్థ్యాల మధ్య ఉండే పరస్పర చర్యలను బట్టి 

4) పైవన్నీ 

 

5. వరదలు వచ్చే ప్రాంతంలో ఎత్తయిన మిద్దె మీద ఇల్లు కట్టుకుని నివసించడం?

1) వైపరీత్యాన్ని పెంచడం    2) విపత్తును పెంచడం 

3) వైపరీత్యాన్ని తగ్గించడం    4) దుర్బలత్వాన్ని తగ్గించడం

 

6. ఒక విపత్తుకు, మరొక విపత్తుకు మధ్య సమయం మీద ఆధారపడి తీసుకున్న చర్యలు దేన్ని తెలియజేస్తాయి?

1) సంసిద్ధత    2) తీవ్రతను తగ్గించడం  

3) పునర్నిర్మాణం    4) పునరావాసం

 

7. వ్యక్తులకు ముందుగానే శిక్షణ ఇవ్వడం, శోధన రక్షణ చర్యలు చేపట్టడం అనేది కింది ఏ చర్య?

1) ప్రతిస్పందన చర్య    2) ఉపశమన చర్య

3) సంసిద్ధ చర్య    4) పునర్నిర్మాణ చర్య

 

8. విపత్తులో ఇళ్లు కూలిపోయిన వారికి శాశ్వత ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది?

1) పునరావాస, పునర్నిర్మాణ చర్య    2) సంసిద్ధ చర్య

3) తీవ్రతను తగ్గించే చర్య    4) ఉపశమన చర్య

 

9. విపత్తులను తట్టుకునే భవనాలు నిర్మించడం, వరదలు ఆపడానికి నదికి దూరంగా గట్లు వేయడం అనేది విపత్తు నిర్వహణా వలయంలో దేనిలో భాగం?

1) విపత్తు ముందస్తు చర్యలు    2) విపత్తు తర్వాత చర్యలు

3) విపత్తు జరుగుతున్నప్పుడు చర్యలు    4) పైవన్నీ

 

10. విపత్తు నిర్వహణ దశల్లో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలంలో జరిగే కార్యకలాపాలు దేనికోసం?

1) సంసిద్ధత    2) తీవ్రతను తగ్గించడం

3) పునరావాసం    4) ప్రతిస్పందన 

 

సమాధానాలు

1-3, 2-2, 3-1, 4-1, 5-4, 6-1, 7-3, 8-1, 9-1, 10-2.

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌