• facebook
  • whatsapp
  • telegram

 పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు - చట్టాలు

మాదిరి ప్రశ్నలు

1. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ) జోగు రామన్న బి) అజ్మీరా చందూలాల్ సి) జూపల్లి కృష్ణారావు డి) కొప్పుల ఈశ్వర్
జ: (ఎ)

2. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎవరు?
ఎ) బహుగుణ బి) రాజీవ్‌శర్మ సి) అనురాగ్‌శర్మ డి) ఎ.కె.చాందా
జ: (బి)

3. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2014, జులై 6 బి) 2015, జులై 6 సి) 2014, ఆగస్టు 6 డి) 2015, ఆగస్టు 6
జ: (ఎ)

4. ప్రాంతీయ సామాజిక ఉద్యమాలు ఏ దశకం నుంచి ప్రారంభమయ్యాయి?
ఎ) 1980 బి) 1990 సి) 2000 డి) 1970
జ: (ఎ)

5. తెలంగాణలో యురేనియం నిక్షేపాలున్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) మెదక్
జ: (సి)

6. 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1986 బి) 1987 సి) 1988 డి) 1989
జ: (ఎ)

7. 'ఛత్రీ, గమన, పుకార్, చెలిమి' అనేవి ఏమిటి?
ఎ) వ్యాపార సంస్థలు బి) ప్రకటన సంస్థలు సి) స్వచ్ఛంద సంస్థలు డి) ప్రభుత్వ సంస్థలు
జ: (సి)

8. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?
ఎ) బాబా ఆమ్టే బి) మేధా పాట్కర్ సి) రాజేంద్ర సింగ్ డి) బహుగుణ
జ: (బి)

9. 2000, జూన్ 24న ఏర్పడిన 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' కన్వీనర్ ఎవరు?
ఎ) ఎం.వేదకుమార్ బి) డాక్టర్ కిషన్‌రావు సి) కె.పురుషోత్తంరెడ్డి డి) రామారావు
జ: (ఎ)

10. నల్గొండలో యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిచ్చిన గిరిజన సమాఖ్య నాయకుడు ఎవరు?
ఎ) రవీంద్రనాయక్ బి) నాగేశ్వర్‌రావు సి) వీరేంద్రనాయక్ డి) ధరేంద్రసింగ్
జ: (ఎ)

11. నల్గొండ జిల్లాలో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2005 బి) 2006 సి) 2007 డి) 2008
జ: (బి)

12. మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ) హరితపత్రం బి) నందనవనం సి) మిత్రవనం డి) జలవనమండలి
జ: (బి)

13. 2006 నవంబరు 21న హైదరాబాద్‌లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు 'హైదరాబాద్ బచావో' అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?
ఎ) మియాపూర్ నుంచి ఎల్బీనగర్ బి) జూబ్లీహిల్స్ నుంచి ఫలక్‌నుమా సి) పురానా పూల్ నుంచి అంబర్‌పేట డి) అంబర్‌పేట నుంచి మలక్‌పేట
జ: (సి)

14. 'వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా' అనే బిరుదులు ఎవరివి?
ఎ) వందనా శివా బి) సునీతా నారాయణ్ సి) అన్నాహజారే డి) రాజేంద్రసింగ్
జ: (డి)

15. టైమ్ మ్యాగజైన్ 'పర్యావరణ హీరో'గా ఎవరిని అభివర్ణించింది?
ఎ) సునీతా బి) అన్నాహజారే సి) వందనాశివ డి) మాధవ్ ప్రియదాస్
జ: (సి)

16. 'జలమందిర్ యాత్ర' పేరుతో గుజరాత్‌లో ప్రజలను చైతన్యపరిచిన జానపద గాయకుడు ఎవరు?
ఎ) రామ్‌బియా బి) మాధూరిప్రియ సి) రామ్‌లీలావాలా డి) మనోహర్‌బియా
జ: (ఎ)

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణలో  ప్ర‌భుత్వ ప‌థ‌కాలు

* కాలుష్య నియంత్రణ చర్యలు
* 'స్వచ్ఛ' కార్యక్రమాల అమలు
* అడవుల పెంపకానికి కార్యాచరణ

కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నవ సామాజిక, ఆర్థిక నిర్మాణంలో ముందడుగు వేస్తున్న క్రమంలో కొన్ని సామాజిక, ఆర్థిక అడ్డంకులను ఎదుర్కోవడం సహజం. ఆ కోణంలో పరిశీలిస్తే తెలంగాణ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉంది. కాలుష్యాన్ని నివారించే క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో జలహారం, స్వచ్ఛ తెలంగాణ, హరితహారం, మన ఊరు-మన ప్రణాళిక లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలందరి భాగస్వామ్యంలో అమలు చేస్తూ ప్రణాళికలను రూపొందించింది.
మనచుట్టూ ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ సమూహాల మొత్తాన్ని పర్యావరణం అంటారు. ఈ పర్యావరణం కాలుష్యం బారిన పడటానికి కారణమయ్యే పరిశ్రమలు అత్యధికంగా హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిద్వారా వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణం బాగా కలుషితమవుతోంది. పారిశ్రామిక, రసాయనిక, జీవ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతిని, వరుసగా భూమి, జల, వాయు కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం భూగర్భజలం కలుషితమవుతోంది. రసాయన, క్రిమి సంహారక, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు దాదాపు 75 శాతం నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.
మూసీ నదీపరివాహక ప్రాంతాలైన రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో చిన్న కార్ఖానాలు (పరిశ్రమలు) చాలా ఉన్నాయి. వీటి ద్వారా కూడా వ్యర్థ పదార్థాలు ఎక్కువ మోతాదులో విడుదలవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జనాభా కూడా చాలా ఎక్కువ. దీంతో ఈ కలుషితాల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లోని కలుషిత నీటి వల్ల చుట్టూ ఉండే ప్రజలు తీవ్రమైన పర్యావరణ కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు.
పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే రకంగా లేవు. అత్యధిక పర్యావరణ కాలుష్యానికి గురిచేసే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
2015లో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సర్వే కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల వివరాలు, శాతాలను ఇటీవల పేర్కొంది. ఆ వివరాలు..

చట్ట వ్యతిరేకంగా అధిక కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్నాయి. ఇవి ఎక్కువగా రసాయన, జీవ వ్యర్థ పదార్థాలను సమీపంలోని కాలువలు, నదులు, డ్రైనేజీల్లోకి విడుదల చేస్తున్నాయి. దాంతో ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లోని దాదాపు 5 వేల గ్రామాల్లో ధ్వని, వాయు, రేడియోధార్మిక కాలుష్యాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమైన భూగర్భ జలాలను వినియోగిస్తున్న ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ రకమైన కలుషిత పదార్థాల వల్ల చర్మ, శ్వాస, గుండె, నేత్ర, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులతోపాటు అల్సర్లు, కీళ్లనొప్పులు వంటివాటి బారిన పడుతున్నారు. భయంకరమైన క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా గురవుతున్నారు.
రాష్ట్రంలో కాలుష్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు..

స్వచ్ఛ తెలంగాణ
భారత ప్రభుత్వం 2014, అక్టోబరు 2న స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4,041 పట్టణాల్లో క్లీన్ - స్ట్రీట్, రోడ్ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. దీనికంటే ముందు యూపీఏ ప్రభుత్వం రూ.37,159 కోట్లతో గ్రామీణ శానిటేషన్ కోసం 'నిర్మల్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2015, మే 16న 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్‌'ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. 'స్వచ్ఛ తెలంగాణ' కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో 68 పట్టణాల్లో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రాబోయే అయిదేళ్లలో కాలుష్యరహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో రూ. 979 కోట్లు కేటాయించారు.
ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 476 నగరాలను సర్వే చేయగా మైసూరు (కర్ణాటక) మొదటిస్థానంలో నిలిచింది. రాజధానులవారీగా చేసిన సర్వేలో ప్రథమ స్థానంలో బెంగళూరు, చివరిస్థానంలో పట్నా(బిహార్) ఉన్నాయి. హైదరాబాద్ 275, వరంగల్ 33 స్థానాల్లో ఉన్నాయి.

జలహారం
ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే జలహారం. దీన్నే 'వాటర్ గ్రిడ్' పథకం అంటారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో 130 లీటర్ల చొప్పున నీటిని అందించాలనేది లక్ష్యం. దీన్ని మొదట నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' లభించింది.

మన ఊరు - మన ప్రణాళిక
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'మన ఊరు - మన ప్రణాళిక' పేరుతో అయిదేళ్లపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రూ. 22,500 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా చెరువులను పునరుద్ధరించడం ద్వారా జీవవైవిధ్యాన్ని సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. దీనివల్ల చెరువుల పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, వివిధ జీవాలను పెంచడం సాధ్యమవుతుంది.

జీవవైవిధ్యం
పర్యావరణాన్ని పెంపొందించడానికి 2002లో రాష్ట్ర అటవీ పథకాన్ని (స్టేట్ ఫారెస్ట్ పాలసీ) తిరిగి ప్రారంభించారు. దీని ప్రకారం విజన్-2020లో వివిధ రకాల అటవీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫారెస్ట్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రాష్ట్రంలో 3 అంచెల పద్ధతిని ప్రవేశపెట్టారు.
1) రాష్ట్ర స్థాయి - స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎస్ఎఫ్‌డీఏ)
2) డివిజన్ స్థాయి - ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ)
3) గ్రామ స్థాయి - వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్)

పర్యావరణంపై అవగాహన
నేటి తరానికి పర్యావరణం పట్ల అవగాహన కలిగించడంలో పర్యావరణ పరిరక్షణ సమూహాలు (ఇకో క్లబ్స్) ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు; విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టారు. ఇవి చేపట్టే వివిధ పర్యావరణ సానుకూల చర్యల కోసం కేంద్ర పర్యావరణ శాఖ నిధులను మంజూరు చేస్తుంది.

సమూహ కార్యక్రమాలు
* పర్యావరణం కలుషితమైన ప్రదేశాలు, పతనావస్థలో ఉన్న ప్రాంతాలు, వన్యప్రాణులున్న జంతు ప్రదర్శన శాలలను దర్శించడం.
* వివిధ సంస్థల్లో పర్యావరణ సమస్యలు / అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాలు, చర్చలు, ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేయడం.
* బాణాసంచా, లౌడ్ స్పీకర్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం.
* కాలుష్య నియంత్రణలో వినూత్న మార్గాలను అన్వేషించి, వాటిని అమలు పరిచే సంస్థలకు అందించడం.
* రహదారుల అందాన్ని, పరిశుభ్రతను పెంచేందుకు చెట్లు, పూల మొక్కలు పెంచడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం.

హరితహారం
మిశ్రమ మొక్కల పథకం కింద తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ సమతౌల్యం సాధించడానికి ప్రస్తుతం ఉన్న 25 శాతం అడవులను 33 శాతానికి పెంచడం ఈ పథకం ఉద్దేశం. 'మన ప్రణాళిక' అనే కార్యక్రమం కింద రాష్ట్రంలో 3,889 నర్సరీలను గుర్తించారు. 2015 నాటికి 40 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు.
మొదటగా ఈ పథకాన్ని 2015, జులై 3-7 వరకు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం 2014-15లో సీఏఎమ్‌పీఏ (కాంపన్సేటరీ ఎఫారిస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) కార్యక్రమాన్ని చేపట్టింది.

ముఖ్యాంశాలు
* అంతర్జాతీయ బయో డైవర్సిటీ దినోత్సవాన్ని మే 22న నిర్వహిస్తారు.
* ప్రపంచంలో మొత్తం 170 బయోడైవర్సిటీ బోర్డులుండగా.. తెలంగాణలోని 10 జిల్లాలోని 66 మండలాల్లోను, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ బయో డైవర్సిటీ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* తెలంగాణలో (2014-15) 3 జాతీయ పార్కులు, 9 వన్యప్రాణి కేంద్రాలు, 4 జింకల పార్కులు, 2 జంతు ప్రదర్శన శాలలు, 65 సాక్రెడ్ గ్రూవ్స్ ఉన్నాయి.
* కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2015లో తెలంగాణలో 'ప్రాణహిత'ను పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది. ఈ ప్రాంతం చుట్టూ 5 కి.మీ. పరిధిలో పలురకాల జంతువులను పెంచాలని నిర్ణయించింది.

మాదిరి ప్రశ్నలు

1. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) జూన్ 5      బి) మార్చి 21      సి) మార్చి 8     డి) మే 22
జ: (డి)

2. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది?
ఎ) మంజీర     బి) ప్రాణహిత     సి) అలీసాగర్     డి) కిన్నెరసాని
జ: (బి)

3. కిందివాటిలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో పర్యావరణంతో సంబంధం లేనిది ఏది?
ఎ) ఆసరా     బి) జలహారం      సి) స్వచ్ఛ తెలంగాణ     డి) హరితహారం
జ: (ఎ)

4. తెలంగాణలో అత్యధిక పారిశ్రామిక, రసాయన కేంద్రాలు ఉన్న జిల్లాలు ఏవి?
ఎ) రంగారెడ్డి     బి) మెదక్     సి) హైదరాబాద్     డి) పైవన్నీ
జ: (డి)

5. తెలంగాణ పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో 75% నుంచి 80% రసాయన, క్రిమి, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఏ రకమైన కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిపింది?
ఎ) నీటి     బి) వాయు     సి) ధ్వని     డి) రేడియోధార్మిక
జ: (ఎ)

6. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) మే 22     బి) మార్చి 21     సి) డిసెంబరు 10    డి) జూన్ 21
జ: (బి)

7. 'ఫ్లోరైడ్ (F2)' సమస్య అధికంగా ఉన్న తెలంగాణ జిల్లా ఏది?
ఎ) మెదక్     బి) రంగారెడ్డి     సి) నల్గొండ     డి) వరంగల్
జ: (సి)

8. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిశ్రమల మొత్తంలో కాలుష్యం లేని పరిశ్రమల శాతం ఎంత?
ఎ) 29.58%      బి) 64.98%     సి) 5.43%    డి) 0.033%
జ: (సి)

9. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) ఈఎస్ఎల్ నరసింహన్         బి) కె.చంద్రశేఖర్ రావు   
సి) కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా       డి) రాజీవ్ శర్మ
జ: (ఎ)

10. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఏ రోజున చేపట్టారు?
ఎ) 2015, మే 10 - 14     బి) 2015, మే 16 - 20     సి) 2015, మే 20 - 24     డి) 2015, మే 1 - 4
జ: (బి)

11. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' కిందివాటిలో దేనికి లభించింది?
ఎ) హరితహారం    బి) స్వచ్ఛ తెలంగాణ    సి) జలహారం    డి) మన ఊరు - మన ప్రణాళిక
జ: (సి)

12. 'క్లీన్ ఇండియా మిషన్‌'లో ఇటీవల భారతదేశ 476 నగరాల్లో తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ నగరం ఎన్నో స్థానం దక్కించుకుంది?
ఎ) 275      బి) 34      సి) 33      డి) 13
జ: (సి)

13. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు?
ఎ) 2015, జులై 3 - 7             బి) 2015, జులై 7 - 10
సి) 2015, ఆగస్టు 3 - 7          డి) 2015, సెప్టెంబరు 7-10
జ: (ఎ)

Posted Date : 08-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తుపాను

* సముద్రంపైన ఉష్ణోగ్రత, పీడనాల్లో తేడా వల్ల వేగంగా వీచేగాలిని తుపాను అంటారు. దీని వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. సముద్రంలో కెరటాల ఉధృతి పెరుగుతుంది. దీంతో సముద్ర తీరప్రాంతాలకు అధిక నష్టం వాటిల్లుతుంది. వేగంగా వీచే గాలుల వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి. జనావాసాలు దెబ్బతింటాయి. పండ్ల తోటలకూ అపార నష్టం.
* తుపాను వల్ల కలిగే వర్షంతో వరదలు సంభవించి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తుపాను ప్రభావం తీవ్రతను బట్టి వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. పశుసంపదకు నష్టం వాటిల్లుతుంది. వరదల వల్ల ఆవరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.
* తుపానులను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. అట్లాంటిక్ సముద్రంపైన వచ్చే తుపానులను హరికేన్‌లనీ; పసిఫిక్ మహా సముద్రంపై కలిగే వాటిని టైఫూన్‌లనీ, ఆస్ట్రేలియాలో సంభవించే వాటిని విల్లి - విల్లిలనీ పిలుస్తారు. ప్రపంచంలో తుపాన్లు ఎక్కువగా సంభవించే 6 ప్రాంతాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపానులు సంభవిస్తాయి. బంగాళాఖాతం తీరప్రాంతంలోని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలకు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తుపాను ముప్పు పొంచి ఉంది. అరేబియా తీరప్రాంతంలో ఉండే గుజరాత్, మహారాష్ట్రల్లో మిగతా వాటి కంటే ముప్పు కొద్దిగా ఎక్కువ. భారతదేశంలో 8.5 % ప్రాంతానికి తుపాను ముప్పు ఉంది.

భారతదేశంలో 7516 కి.మీ. ప్రాంతానికి తుపాను ముప్పు పొంచి ఉంది. పాండిచ్చేరితోపాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లు తుపాను ప్రభావానికి గురవుతున్నాయి. వీటితోపాటుగా అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్ కూడా తుపాను తాకిడికి గురయ్యే ప్రాంతాలు. ఏటా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో దాదాపుగా 5 నుంచి 6 తుపానులు సంభవిస్తాయి.

* వీటిలో 2 నుంచి 3 ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో ఎక్కువ తుపానులు వస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సంభవించే తుపానుల నిష్పత్తి 4 : 1. సాధారణ తుపాను సమయంలో గాలి సరాసరి వేగం గంటకు 65 కి.మీ. నుంచి 117 కి.మీ. వరకు ఉండవచ్చు. 
* తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే గాలివేగం గంటకు 119 కి.మీ. నుంచి 164 కి.మీ. వరకు, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. 1999 అక్టోబరు 29 న ఒరిస్సాలో సంభవించిన సూపర్‌సైక్లోన్‌లో గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.

నష్టాన్ని తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలు
* తీరప్రాంతాల్లో ముఖ్యంగా తుపానులు తరచుగా సంభవించే ప్రాంతాల్లో చెట్లను పెంచాలి. ఇక్కడి అడవులను పరిరక్షించాలి. తీర ప్రాంతాల్లో ఉండే మాంగ్రూవ్ అడవులు (మడ అడవులు), ఎత్తయిన వృక్షాలు తుపాను తీవ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. సముద్రపు ఒడ్డుకు దగ్గరలో ఉన్న వృక్షసంపద సహజ కవచంలా పనిచేసి తుపాను నష్టాన్ని తగ్గిస్తుంది. తీరప్రాంతాల్లో అడవులను పూర్తిగా కొట్టివేయడం వల్ల తుపాను ముప్పు పెరిగి సహజ విపత్తు కాస్తా మానవ సంబంధ విపత్తుగా మారుతోంది.
* తరచుగా తుపాన్లు సంభవించే ప్రాంతాలను గుర్తించి పటాలను తయారుచేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత చర్యలను చేపట్టవచ్చు. తుపానులను ఉపగ్రహాల సహాయంతో ముందుగానే గుర్తించవచ్చు. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి అక్కడి ప్రజలను హెచ్చరించి తుపాను నష్టాన్ని తగ్గించవచ్చు.
* తుపాను సంభవించే ప్రాంతాల్లో తక్కువ నష్టతీవ్రత ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ నివాసాలు, వసతులను, ఏర్పాటు చెయ్యాలి. తుపాను తాకిడికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాల్లో ఇళ్లు, భవనాల నిర్మాణాల్లో మార్పులు చెయ్యాలి. ఇవి తుపానును తట్టుకునే విధంగా ఉండాలి. గృహాలను నేలమట్టం నుంచి ఎత్తుగా నిర్మించాలి, పైకప్పు వేలాడినట్టుగా కాకుండా మూసినట్టుగా ఉండాలి. ఇంటి చుట్టూ చెట్లను నాటడం వల్ల అవి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని భూగర్భ కేబుల్స్ ద్వారా సరఫరా చెయ్యాలి. తుపాన్లు సంభవించేటప్పుడు వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కొనే చర్యలను కూడా చేపట్టాలి.  
* భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రుతుపవనాలు, వర్షపాతం, తుపాన్ల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాడార్‌లు, ఉపగ్రహాల ద్వారా గ్రహించి అందజేస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ (ACWCs) తగిన హెచ్చరికలను జారీ చేస్తాయి. భారతదేశ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఐ) తుపాన్ల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది.
* తుపాన్ల వల్ల జరిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి, భారత పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 1990 జులైలో బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీల ద్వారా తగిన సమాచారాన్ని అందిస్తూ రక్షణ చర్యలను చేపడుతున్నాయి.
* ఇన్‌శాట్ ఉపగ్రహాలు, 10 రాడార్‌ల సహాయంతో కేంద్రం తుపాను ముప్పులను గమనించి తీర ప్రాంతాల ప్రజలను 48 నుంచి 24 గంటల ముందుగా హెచ్చరిస్తోంది. స్థానిక భాషల్లో తుపాను హెచ్చరిక సూచనలు అందిస్తోంది.

జాతీయ తుపాను ముప్పు నియంత్రణా ప్రాజెక్ట్
   భారతదేశంలోని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను తుపాను బారి నుంచి రక్షించడానికి, వారి ఆస్తులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) అమలు చేస్తోంది. హోంమంత్రిత్వశాఖ, ఎన్‌డీఎంఏ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాయి.
* 2011 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారు. ప్రపంచ బ్యాంక్ దీనికి నిధులను సమకూరుస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 626.87 కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 165.13 కోట్లను సమకూర్చుకుంది. 
* ఇదేవిధంగా ఒరిస్సాకు కేంద్ర ప్రభుత్వం రూ. 520.93 కోట్లు కేటాయించగా ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 132.85 కోట్లు సమకూర్చుకుంది.
మొదట విడతగా ఈ ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల్లో అమలు చేయనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధులతో తుపాను సమయంలో తలదాచుకునే భవనాలు నిర్మిస్తారు. తుపాను వల్ల దెబ్బతిన్న రహదారులను, కరకట్టలను మరమ్మత్తు చేస్తారు. తుపాను విపత్తు గురించిన అవగాహనను ప్రజలకు కలిగిస్తారు.

ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఐసీజడ్ఎంపీ): కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల సూచన మేరకు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా గుజరాత్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ల తీర ప్రాంతాల రక్షణకు చర్యలు చేపడతారు. ఈ రాష్ట్రాల్లో తుపాను ముప్పు ప్రాంతాలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం, రాష్ట్రంలో తుపానును ఎదుర్కొనేందుకు పని చేస్తున్న శాఖలకు, సంస్థలకు నిధులను అందజేయడం ఈ ప్రాజెక్ట్ విధి. ఈ ప్రాజెక్టు కింద పశ్చిమ బెంగాల్‌కు రూ. 1425 కోట్లను కేటాయించారు.
 
కోర్‌గ్రూప్ ఆన్ సైక్లోన్ మిటిగేషన్: తుపాను ముప్పును గమనించడానికి, నివారణకు జాతీయస్థాయిలో ముఖ్యమైన వ్యక్తులతో ఒక గ్రూపును ఏర్పరిచారు. దీనిలో భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, నేషనల్ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు ఉంటారు. వీరితోపాటుగా తుపాను కార్యక్రమాలను పర్యవేక్షించే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరు తుపాను, వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీచేయడం; రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ శాఖలు, సంస్థలను సమన్వయపరచడం లాంటి పనులను చేస్తారు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ చట్టం - 2005

2005, మే 30న కార్యనిర్వహక ఉత్తర్వు ద్వారా ప్రధాని ఛైర్మన్‌గా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటుచేశారు. దీన్ని యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ' అనే పేరుతో 2005, డిసెంబరు 23న పార్లమెంట్‌లో ఆమోదించింది. ఈ చట్టంపై 2006, జనవరి 9న రాష్ట్రపతి సంతకం చేశారు.
* 2006, సెప్టెంబరు 27న ఛైర్మన్, తొమ్మిది మంది సభ్యులతో కూడిన 'జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ - NDMA' లాంఛనంగా అమల్లోకి వచ్చింది.
* జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మొదటి ఛైర్మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్, వైస్ ఛైర్మన్ డాక్టర్ మర్రి శశిధర్ రెడ్డి. వీరు 2014లో రాజీనామా చేశారు.
* 2014 డిసెంబరులో ఎన్‌డీఏ ప్రభుత్వం నూతన విపత్తు నిర్వహణలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులను తగ్గించింది. ప్రస్తుతం ఒక ఛైర్మన్, అయిదుగురు సభ్యులు ఉన్నారు.
* ప్రస్తుత NDMA ఛైర్మన్ నరేంద్ర మోదీ; సభ్యులు కమల్ కిశోర్, డి.ఎన్. శర్మ, ఎన్.సి. మర్వా, ఆర్.కె. జైన్.
* విపత్తు నిర్వహణ చట్టాన్ని 2009, అక్టోబరు 22న కేంద్రమంత్రి మండలి ఆమోదించి దేశ వ్యాప్తంగా అమలు చేసింది. దీన్నే జాతీయ విపత్తు నిర్వహణ విధానం (నేషనల్ పాలసీ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ - NPDM) అంటారు.
* జాతీయ విపత్తు మొదటి సమావేశాన్ని 2006, నవంబరు 29న; రెండో సమావేశాన్ని 2009, నవంబరు 6న దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. విపత్తు పరిహారాన్ని 2015, ఏప్రిల్ 1 నుంచి అందిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒక వ్యక్తి విపత్తు వల్ల మరణిస్తే రూ.4 లక్షలు, 60% గాయాలైతే రూ.2 లక్షలు నష్ట పరిహారంగా ఇస్తారు.

జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ - NDMP):
            2016, జూన్ 1న దిల్లీలో నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసింది ఈ ప్ర‌ణాళిక‌ను కింది స‌ద‌స్సుల ల‌క్ష్యాల‌కు అనుగుణంగా రూపొందించారు.
a) 2015 మార్చి - జపాన్ (సెండాయ్) - అంతర్జాతీయ విపత్తు కుదింపు సదస్సు (DRR - Disaster Risk Reduction)
b) 2015 సెప్టెంబరు - అమెరికా (న్యూయార్క్) - సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG - Sustainable Development Goals)
c) 2015 డిసెంబరు - ఫ్రాన్స్ (పారిస్) - వాతావరణ మార్పు సదస్సుల (COP - 21)
            ఈ ప్రణాళిక 2015 - 2030 వరకు స్పల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల్లో మొత్తం 14 లక్ష్యాలను సాధించాలని నిర్ణయించింది. స్పల్పకాలిక 5 సంవత్సరాలు, మధ్యకాలిక 10 సంవత్సరాలు, దీర్ఘకాలిక 15 సంవత్సరాలుగా నిర్ణయించారు.       

* 2005 విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 11 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) దేశం మొత్తానికి చట్ట/న్యాయ బద్ధమైంది. సెక్షన్ 37 ప్రకారం దేశంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది వర్తిస్తుంది.
విపత్తు నిర్వహణ స్థాయి (Levels of Disasters):
            విపత్తు నిర్వహణ అత్యున్నతాధికారి కమిటీ (HPC) - 2001 నివేదిక ప్రకారం 2016లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికలో విపత్తు దుర్బలత్వాన్ని తగ్గించడానికి వివిధ కేటగిరీలుగా విభజించారు. ఒక సాధారణ కేటగిరీని కూడా రూపొందించారు.
స్థాయి - 1 (L1) - జిల్లా స్థాయిలో విపత్తు ప్రణాళికలను నిర్వహిస్తూ, రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 2 (L2) - రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 3 (L3) - రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒకే సమయంలో దీర్ఘకాలిక విపత్తు సంభవించినప్పుడు
స్థాయి - 0 (L0) - ఒక ప్రాంతం సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు
* జాతీయ విపత్తు నిర్వహణ కో ఆర్డినేటర్ - కేంద్ర హోంమంత్రి.

జాతీయ విపత్తు నిర్వహణ విధాన నిర్ణయ కమిటీలు (National Level Decision Making bodies for DM) 

విపత్తు ఉపశమనం/నోడల్ మంత్రిత్వ నిర్వహణ (Nodel Ministry for Management/Mitigation of Disasters)  

జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (NDRF)
           2005 విపత్తు చట్టం సెక్షన్ 44 ప్రకారం 2006లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు. ఇది హోంమత్రి నిర్వహణలో ఉంటుంది. దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ (ఐపీఎస్). ప్రస్తుతం దేశంలో మొత్తం 5 దళాల్లో 12 బెటాలియన్లు, ప్రతి బెటాలియన్‌లో 1149 మంది ఉంటారు. ఈ బెటాలియన్లకు ప్రకృతి, రేడియోలాజికల్, న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ విపత్తులపై బాధ్యత ఉంటుంది. ఇందులో BSF-3, ITBP-2, CRPF-3, CISF-2, SSB-2 ఉంటాయి. 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సునామీ

* తీవ్ర భౌగోళిక వైపరీత్యం
* తీర ప్రాంతాల్లో విధ్వంసం

సునామీ.. పేరు చెప్పగానే భయకంపితులను చేసేంత తీవ్రమైన విధ్వంసకర విపత్తు. మీటర్ల కొద్దీ ఎత్తులో.. ఒకదాని వెంబడి మరొకటిగా.. ఊహకు అందనంత వేగంగా.. దూసుకొచ్చే సముద్రపు అలలు తీర ప్రాంతాల్లో విలయాన్ని సృష్టిస్తాయి. ఒకేసారి కొన్ని దేశాలపై ప్రభావం చూపించగలిగేంత తీవ్ర శక్తిమంతమైన ఈ సునామీలు ఎలా పుడతాయి? ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? వీటిని ముందుగా గుర్తించగలమా? తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి? ఎదుర్కోవడం ఎలా? - తెలుసుకుందాం..
అత్యంత ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చి.. తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి.. పర్యావరణానికి తీవ్రహాని కలిగించే భౌగోళిక వైపరీత్యాల్లో సునామీ ఒకటి. ప్రధానంగా భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను ముందుగా ఊహించగలిగినా వాటివల్ల వచ్చే నష్టాన్ని మాత్రం పూర్తిగా తగ్గించలేకపోతున్నాం. సాధారణ భాషలో 'రాకాసి అలలుగా వీటిని పిలుస్తుంటారు. భారీ పరిమాణంలో స్థానభ్రంశం చెందిన నీటి వల్ల ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి తరంగాల వరుసను సునామీ అంటారు. మహా సముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు... చివరకు ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ల్లో కూడా సునామీలు ఏర్పడవచ్చు. 2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో భూకంపం సంభవిచ్చినప్పుడు ఒక స్విమ్మింగ్‌పూల్‌లో ఏర్పడిన సునామీని మీడియా ద్వారా చూడగలిగాం.

ఒకటి కాదు.. పదికి పైగా..
బలమైన భూకంపాల వల్ల సముద్రపు అగాధాల్లో ఏర్పడిన సునామీ కెరటాలు వందల కిలోమీటర్ల పొడవునా (సుమారుగా 800 కి.మీ. వేగంతో) ప్రయాణిస్తుంటాయి. సునామీ అంటే ఒక పెద్ద తరంగం కాదు. పది లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఉండొచ్చు. వాటిని 'సునామీ తరంగ రైలు అంటారు. ఒక్కో తరంగం ఒకదాని తర్వాత ఒకటి 5 నిమిషాల నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరొకదాన్ని అనుసరిస్తాయి.
సునామీ మహాజల కుడ్యం (Huge wall of water) తీరానికి చేరిన తర్వాత ఒక వ్యక్తి పరుగెత్తే వేగం కంటే చాలా ఎక్కువ వేగంగా (50 కి.మీ.ల వేగంతో) ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని 'రన్ అప్ అంటారు. ఇది తీరాన్ని బట్టి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. సునామీ ప్రారంభ ప్రాంతంలో తరంగాల ఎత్తు కొన్ని సెంటీమీటర్లుగా ఉండి, తీరానికి చేరే కొద్దీ 30 మీటర్ల ఎత్తువరకు కూడా ఉండొచ్చు. అందువల్ల సముద్రంపై ఓడలో ప్రయాణిస్తున్న వారికి సునామీ గురించి తెలియదు.
సునామీ తీరాన్ని చేరుతున్నప్పుడు వేగం తగ్గుతూ అల ఎత్తు పెరుగుతుంది. దీన్నే 'షోలింగ్ ప్రభావం అంటారు. సునామీ ప్రారంభమైన చోట తక్కువ డోలన పరిమితితో ఉంటుంది. తీరానికి చేరే కొద్దీ డోలన పరిమితి పెరుగుతుంది. కొన్నిసార్లు తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి సముద్ర తీరం భూతలం బయటకు కనిసిస్తుంది. దీన్ని సునామీ రావడానికి అవకాశం ఉన్న సహజ సిద్ధమైన హెచ్చరికగా భావించవచ్చు.

జపాన్ సునామీ విలయం
2011, మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 2.46 గంటల సమయంలో జపాన్‌లోని ఈశాన్యప్రాంతంలోని తోహోకు ప్రాంతానికి 130 కి.మీ.ల దూరంలో (పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రత కూడిన పెను భూకంపం వల్ల) సునామీ సంభవించింది. దీంతో ఫుకిషిమా దైచీలోని అణువిద్యుత్తు ప్లాంటులో విస్ఫోటం జరిగింది. కొన్ని పరిశ్రమల్లో మంటలు రేగాయి. ఇలా ఈ భూకంపం వల్ల అనేక గొలుసు కట్టు విపత్తులు సంభవించాయి.

11 దేశాలపై ప్రభావం
2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవుల మధ్య సుండా అగాధంలో సునామీ ఏర్పడింది. ఇది చుట్టూ ఉన్న 11 దేశాలను నష్టపరిచింది. మన దేశంలో తమిళనాడు తీరంలోని నాగపట్నం ఎక్కువగా దెబ్బతింది. దీంతోపాటు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి; కేరళ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి.

భారత్ తీరరేఖకూ..
ఒకచోట ఏర్పడిన సునామీ కెరటాల ప్రభావం వాటి తీవ్రతను బట్టి అన్ని మహాసముద్రాల్లోనూ కనిపించవచ్చు. భారతదేశ తీరరేఖ మొత్తం సునామీ ముప్పును కలిగి ఉంది. మనదేశ భూపటల పలక (క్రస్ట్ ప్లేట్) ఆస్ట్రేలియన్ పలక నుంచి దూరంగా జరుగుతున్నందున మన దేశానికి తరచుగా సునామీలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతదేశానికి దూరంగా రెండు చోట్ల ఏర్పడుతున్న భూకంపన అధికేంద్రాల వద్ద సునామీలు ఏర్పడి మనదేశ తీరాన్ని తాకుతున్నాయి.
1. అండమాన్ నికోబార్ దీవులు, సుమత్రాదీవి వంపు దగ్గర ఏర్పడిన సునామీలు భారత్‌తో సహా ప్రధాన దేశాలను చేరడానికి 3 నుంచి 5 గంటల వ్యవధి పడుతుంది.
2. అరేబియన్ మైక్రో పలక భారత్ భూపటల పలకను ఢీ కొడుతున్నందున అరేబియా సముద్రంలోని మక్రాన్ ప్రాంతంలో సునామీ ఏర్పడుతుంది. ఇది ప్రధాన భారత తీరానికి అంటే గుజరాత్ తీరాన్ని చేరడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.

అంతర్జాతీయ హెచ్చరిక వ్యవస్థ
సునామీ ఏ తీరాన్నైనా తాకే ప్రమాదం ఉంది. అలాగే అవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంటాయి. ఈమేరకు అంతర్జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థను హవాయి దీవుల్లోని హోనలూలు వద్ద 1946లో ఏర్పాటు చేశారు. దీన్ని పసిఫిక్ సునామీ వార్నింగ్ (Pasific Tsunamy Warning System - PTWS)సెంటర్ అంటారు. ఇది సునామీ రావడానికి గంటల ముందు సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంది. కొన్ని దేశాల్లో ప్రాంతీయ హెచ్చరిక కేంద్రాలు కూడా ఉన్నాయి.

భారత్‌లోనూ...
గతంలో జరిగిన భూకంపాల సమాచారం ఆధారంగా ప్రస్తుత భూకంపం వల్ల సునామీ ముప్పును అంచనా వేసేవారు. ఈ సమాచారం 15 నిమిషాల ముందు మాత్రమే హెచ్చరిక జారీ చేయడానికి పరిమితం అయ్యేది. తర్వాత సర్వే ఆఫ్ ఇండియా తీరం వెంబడి టైడ్‌గేజ్ విధానాన్ని అమలు చేసింది. ఇది కూడా చాలా ఆలస్యంగానే సమస్య తీవ్రతను తెలియజేసేది.
2004లో ఏర్పడిన సునామీని రాడార్ల సహకారంతో తెలుసుకున్నారు. ఇది భూకంపం వచ్చిన రెండు గంటల తర్వాత మాత్రమే తరంగాల ఎత్తును నమోదు చేయగలిగింది.
2007, అక్టోబరు 15న ఐఎన్‌సీవోఐఎస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్)లో సత్వర సునామీ హెచ్చరిక కేంద్రాన్ని (సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ - టీఈడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్‌లో ఉంది.

తీవ్రతను తగ్గించాలంటే..
* తీరం వెంబడి జపాన్‌లా గోడలు నిర్మించి సునామీ తీవ్రతను తగ్గించవచ్చు. మడ అడవులను పెంచడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది.
* తీరం సమీపంలో నిర్మాణాలను దృఢంగా, ఎత్తయిన ప్రాంతాల్లో నిర్మించాలి.
* విపత్తు సమయంలో సహాయ కేంద్రాలుగా పనిచేసే కమ్యూనిటీ హాల్స్‌ను ఎత్తయిన ప్రాంతంలో నిర్మించాలి.
* సరైన వరద నివారణ చర్యలు ముందుగానే కలిగి ఉండాలి.
* సరైన భూ వినియోగ ప్రణాళిక అవసరం.

సునామీలెలా ఏర్పడతాయి?
జలాశయాల్లో ఆకస్మిక చలనం వల్ల సునామీ తరంగాలు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా సముద్ర తీరాల వద్ద ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. సునామీల వల్ల వాటిల్లే నష్టం, అవి ఏర్పడే స్థానం, ప్రయాణం చేసే దూరం, తాకే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అవి ఏర్పడే ప్రాంతం నుంచి 30 నిమిషాల్లో తీరాన్ని తాకే సునామీలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.
* సముద్రం దగ్గర లేదా లోపల బలమైన భూకంపాలు వచ్చినప్పుడు ఏర్పడిన భ్రంశ చలనాల వల్ల సునామీలు సర్వసాధారణంగా సంభవిస్తాయి. పెద్దఎత్తున ఏర్పడిన సునామీ తరంగాలు మహాసముద్రాలను కూడా దాటే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 1960 చిలీలో రిక్టర్ స్కేలుపై 9.5 గా నమోదైన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ తరంగాలు జెట్ వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రం అవతల ఉన్న జపాన్ తీరంలోని మత్స్య పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించాయి. సాధారణంగా సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 7.5 గా నమోదైనప్పుడు సునామీలు సంభవిస్తాయి.
* సముద్రం కింద లేదా సముద్రానికి దగ్గరలో భూపాతం (ల్చ్థ్టి ళ్ద్ట్ఠీౖ) జరిగి కొండచరియలు నీటిలో పడినప్పుడు సునామీ ఏర్పడవచ్చు. 1958లో అలస్కాలోని లిటుయా బేలో సంభవించిన భూపాతం వల్ల 50-150 మీటర్లు ఎత్తున సముద్ర కెరటాలు తీరాన్ని తాకాయి.
* సముద్రాల్లో అగ్నిపర్వతాల విస్ఫోటం జరిగినప్పుడు కూడా సునామీలు ఏర్పడవచ్చు. 1883లో ఇండోనేషియాలోని కాక్రటోవా అగ్నిపర్వతం విస్ఫోటం చెందినప్పుడు జావా, సుమత్రా దీవుల్లో 40 మీటర్ల ఎత్తున సునామీ ఏర్పడింది.
సునామీ (Tsunami) అనేది జపాన్ పదం. జపాన్ భాషలో గ్బ్యి అంటే హార్బర్ (ఓడరేవు), nami అంటే వేవ్ (కెరటం) అని అర్థం. ఈ రెండు పదాల కలయికే సునామీ. తమిళంలో సునామీని ఆఝి పెరలై (Aazhi peraial) అని కూడా అంటారు.

మాదిరి ప్రశ్నలు

1. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత?
జ: 8%

2. భారతదేశంలో సునామీలు ఎక్కడ వస్తున్నాయి?
జ: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో

3. ఇటీవల బంగాళాఖాతంలో సునామీ ఎప్పుడు ఏర్పడింది?
జ: 2004, డిసెంబరు 26

4. సునామీ అంటే ...?
జ: తీరాన్ని ముంచేసిన పెద్ద అలలు

5. సునామీ అనేది ఎలాంటి విపత్తు?
జ: భౌగోళిక

6. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
జ: హోనలూలు

7. సునామీలు ఎక్కడ ఏర్పడతాయి?
ఎ) పసిఫిక్ మహాసముద్రం బి) అంట్లాటిక్ మహాసముద్రం
సి) హిందూ మహాసముద్రం డి) పైవన్నీ
జ: డి

8. సునామీలు ఏర్పడటానికి ప్రధాన కారణం?
జ: సముద్రాల్లో భూకంపాలు సంభవించడం

9. సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం ఏది?
జ: పసిఫిక్ మహాసముద్రం

10. సునామీలు ఎలా ఏర్పడతాయంటే...?
ఎ) సముద్రాల్లో భూకంపాలు బి) సముద్రాల్లో అగ్నిపర్వత విస్ఫోటం
సి) సముద్రాల్లో భూపాతం డి) పైవన్నీ
జ: డి

11. సునామీ ఎప్పుడు సంభవిస్తుంది?
జ: రాత్రి, పగలు సమయాల్లో

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - జీవ వైవిధ్యం

* జీవులు, వాటి ఆవాసాల మధ్య ఉండే సంబంధాల అధ్యయనాన్ని ఆవరణ శాస్త్రం (Ecology) అంటారు.  ఈ పదం Oekos (ఆవాసం), Logos (అధ్యయనం) అనే రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది.
* ఆవరణ శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఎర్నెస్ట్ హెకెల్ ఉపయోగించారు.
* భూమిపై ఉన్న జీవులు, అవి విస్తరించిన ప్రాంతాలన్నింటితో కలిపి జీవావరణం ఏర్పడింది.
* IUCN (International Union For Conservation of Nature & Natural Resources) ప్రకారం ప్రతిజాతి జీవులు, విభిన్న జాతి జీవులు, అవి నివసిస్తున్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం (Bio Diversity) అంటారు.
* ప్రపంచంలో బ్రెజిల్, చైనా, కొలంబియా, ఆస్ట్రేలియా, కాంగో, ఈక్వెడార్, ఇండోనేషియా, మడగాస్కర్, మలేషియా, మెక్సికో, పపువా న్యూగినియా, పెరూ, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెనెజులా, భారతదేశం మెగా డైవర్స్ కంట్రీస్ (అత్యధిక జీవ వైవిధ్యత ఉన్న దేశాలు)గా ప్రసిద్ధిగాంచాయి.
* ప్రపంచ భూభాగంలో 2.4% భూభాగాన్ని ఆక్రమిస్తున్న భారతదేశం ఇప్పటివరకు గుర్తించిన వాటిలో సుమారు 7.8% జీవ జాతులను కలిగి జీవ వైవిధ్యంతో అలరారుతోంది.  దీనిలో 45000 రకాలకు పైగా వృక్ష జాతులు (వీటిలో 15000కు పైగా పూల మొక్కలు), సుమారు 2500 రకాలకుపైగా చేప జాతులు, 1200కు పైగా పక్షి జాతులు భారతదేశంలో ఉన్నాయి.
* భారతదేశంలో ప్రధానంగా పశ్చిమ కనుమలు, నల్లమల కొండలు, శేషాచల కొండలు, హిమాలయాలు, భారతదేశ ఈశాన్య ప్రాంతం విభిన్న జీవ జాతులకు నిలయంగా ఉన్నాయి.
* ఇప్పటికీ ఏటా పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతంలో అనేక కొత్త జీవ జాతులను కనుక్కుంటున్నారు.
* ఈ ఆవరణ వ్యవస్థలు ఇదివరకెప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో ప్రమాదాలను ఎదుర్కొంటున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ గుర్తించింది.
* సహజ వనరుల అధిక దుర్వినియోగం ద్వారా ప్రధానంగా కలప కోసం అడవుల నరికివేత, వ్యవసాయ భూముల విస్తరణ, మైనింగ్, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, రోడ్డు, రైలు మార్గాలు, డ్యామ్‌లు, విద్యుత్ అవసరాలను తీర్చడానికి విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాంటి మానవ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆవరణ వ్యవస్థలు ఎన్నో ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. 
* భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి.

భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వులు

భారతదేశంలో జీవవైవిధ్యత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు
* వన్యజీవుల పర్యవేక్షణ, పరిరక్షణ కోసం 1952లో Indian Board for Wildlife ను ఏర్పాటు చేశారు.  1972లో వన్య మృగ సంరక్షణా చట్టం చేశారు.
* 1982లో డెహ్రాడూన్ కేంద్రంగా Wildlife Institute of India ను ప్రారంభించారు.
*  1983లో ప్రభుత్వం National Wildlife Action Plan ను ప్రారంభించింది. 
* 2002లో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం జీవ వైవిధ్య చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీన్ని అమలుచేయడానికి చెన్నై కేంద్రంగా National Bio Diversity Authority ని ఏర్పాటు చేశారు.

జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.
 
జీవ వైవిధ్య స్థాయులు
జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి.. 
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)

జన్యుపర జీవవైవిధ్యం
ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.

జాతిపర జీవ వైవిధ్యం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.

ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం

దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

కాలుష్య ప్రభావం
జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.
జీవావరణ సమతౌల్యం

ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.

జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్
బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.

1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్): ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.
 
2. బీటా పటాలు (బీటా మ్యాప్స్): ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.
 
3. గామా పటాలు (గామా మ్యాప్స్): ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.
 
తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్): భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. 

వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం
ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.

భారతదేశంలో జీవవైవిధ్యం
ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. 

* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.

జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక
జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.

జాతీయ జీవ వైవిధ్య చట్టం
ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..
* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు

భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు

ఎలిఫెంట్ ప్రాజెక్టు
1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. 

టైగర్ ప్రాజెక్టు
భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.  

బయోస్ఫియర్ రిజర్వ్
ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. 

మెరైన్ నేషనల్ పార్క్‌లు

మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.
దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి..
1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం

భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

మాదిరి ప్రశ్నలు

1. మేఘమథనం లేదా కృత్రిమ వర్షం కురిపించడానికి వాడే మిశ్రమాలు
    1) డ్రై ఐస్     2) సిల్వర్ అయోడైడ్     3) సాల్ట్ పౌడర్     4) అన్నీ
జ: 4 (అన్నీ)

2. జీవావరణం అత్యధికంగా ఉండే ఆవరణం?
జ: జలావరణం

3. కిందివాటిలో సరైంది.
    a) ఎన్విరాన్ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది.
    b) ఎన్విరాన్ అంటే చుట్టూ జీవులతో కూడిన ప్రాంతం అని అర్థం.
జ: a, b సరైనవి

4. ఇకాలజీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త?
జ: హెకెల్

5. కిందివాటిలో స్వయం పోషకాలు?
   1) వినియోగదారులు     2) విచ్ఛిన్నకారులు    3) ఉత్పత్తిదారులు     4) ఏదీకాదు
జ: 3 (ఉత్పత్తిదారులు)

6. పత్రాలు, పుస్తకాలు పసుపు రంగులోకి మారడానికి కారణం?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్

7. జీవావరణ పిరమిడ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త
జ: చార్లెస్ హెల్టన్

8. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది?
జ: స్ట్రాటో ఆవరణం

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడటానికి కారణం? (పోలీస్ కానిస్టేబుల్ 2016, సబ్ ఇన్‌స్పెక్టర్ 2018)
జ: క్లోరోఫ్లోరో కార్బన్లు

2. ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు పిరమిడ్ మొదటి మెట్టులో ఉండేది? (గ్రూప్-1, 2017)
జ: ఉత్పత్తిదారులు

3. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు? (ఏఈ, 2015)
జ: ట్రాన్స్‌లే

4. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
    a) అతినీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి భూఉపరితలానికి చేరతాయి.
    b) పరారుణ కిరణాలు భూఉపరితలం నుంచి పరావర్తనం చెందుతాయి.
జ: a, b సరైనవి

5. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువు (గ్రూప్-4, 2012; డీఎస్సీ 2017)
జ: సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు - భూపాతాలు

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భూకంపాలు అతి తీవ్రంగా సంభవించే జోన్ -V లో ఉన్న ప్రాంతం ఏది? (ఏఎస్‌వో - 2017)
జ: షిల్లాంగ్

2. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత? (గ్రూప్ - 4, 2012)
జ: 8 శాతం

3. హిమాలయ ప్రాంతంలో భూకంపాలు రావడానికి కారణం? (గ్రూప్ - 1, 2017, ఏపీ)
జ: భూపటంలో పలకలు ఢీకొట్టడం

4. భూకంప సమయంలో ఏ నేల ఎక్కువగా ప్రకంపిస్తుంది? (హాస్టల్ వెల్ఫేర్ - 2017)
జ: మెత్తటి నేల

5. కొండ చరియలు తరచుగా ఏ రాష్ట్రంలో విరిగి పడతాయి? (గ్రూప్ - 2, 2016)
జ: ఉత్తరాఖండ్

మాదిరి ప్రశ్నలు

1. భారత ప్రాదేశిక విస్తీర్ణంలో ఎంత శాతం భూకంప దుర్బలత్వం ఉంది?
జ: 59%

2. ఉరుములు, మెరుపులను గుర్తించే సాధనం?
జ: లైట్నింగ్ డిటెక్టర్

3. దిల్లీ, హైదరాబాద్‌లు ఏ భూకంప జోన్‌లలో ఉన్నాయి?
జ: జోన్ - 4, 2

4. కిందివాటిలో దేన్ని నియంత్రించడానికి 'లాండ్ స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి'ని ఉపయోగిస్తారు?
     1) భూకంపాలు       2) కొండచరియలు విరిగిపడటం      3) హిమపాతాలు      4) సహజ అటవీ కార్చిచ్చు
జ: 2 (కొండచరియలు విరిగిపడటం)

5. హిమలయ ప్రాంతాల్లో తరచుగా హిమపాతాలు ఎక్కడ సంభవిస్తాయి?
     1) జమ్మూకశ్మీర్      2) హిమాచల్‌ ప్రదేశ్      3) ఉత్తరాఖండ్      4) అన్నీ

జ: 4 (అన్నీ)            

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు - సునామీ

ప్రపంచంలో చక్రవాతాల ప్రభావం 21% ఉండి ఆయాదేశాల్లో అధిక నష్టాన్ని కలిగిస్తుంది. భూ ఉపరితలంపై ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి (1970) పరిశీలిస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యధిక చక్రవాతాలకు గురవుతున్నాయి. అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్‌లో సంభవించింది. 1970, నవంబరు 12న బంగ్లాదేశ్‌లో సంభవించిన 'బోలా' తుపాన్ వల్ల 5 లక్షల మంది మరణించారు.
* భూ ఉపరితలం 71% నీటితో విస్తరించి 5 మహాసముద్రాలుగా విభజితమైంది. ఈ మహాసముద్రాల పరిధిలో 177 దేశాలు తీరప్రాంతాలతో విస్తరించి ఉండటం వల్ల వాటిపై చక్రవాతాల ప్రభావం అధికంగా ఉంటుంది. చక్రవాతాలను అల్పపీడన ద్రోణి లేదా వాయుగుండం అంటారు. ఇవి 98% సముద్రాలు, 2% భూ ఉపరితలంపై నుంచి ప్రయాణిస్తాయి.

చక్రవాతం
       చక్రవాతాన్ని సైక్లోన్ అంటారు. ఈ పదాన్ని మొదటగా హెన్రీ పిడింగ్‌టన్ ఉపయోగించారు. సైక్లోన్ గ్రీకు భాషా పదమైన 'కైక్లోన్' నుంచి వచ్చింది. కైక్లోన్ అంటే తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము అని అర్థం.

చక్రవాతం/సైక్లోన్ ఏర్పడే విధానం
       సముద్రాలపై అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రాంతంలో నీరు వేడెక్కి, వ్యాకోచించి అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడనం వైపు నలు దిశల నుంచి అధిక పీడన వ్యవస్థలు కేంద్రీకృతం కావడాన్ని చక్రవాతం అంటారు. చక్రవాతాలు జేర్కిన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి.
జేర్కిన్ సిద్ధాంతం ప్రకారం చక్రవాతాలు 2 రకాలు
అవి: 1) ఉష్ణమండల చక్రవాతాలు
       2) సమశీతోష్ణ చక్రవాతాలు  

ఉష్ణమండల చక్రవాతాలు (Tropical Cyclones): ఇవి 0o - 23o  కర్కట, మకరరేఖల మధ్య అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవిస్తాయి. ప్రపంచంలో వీటి ప్రభావం 90% వరకు ఉంటుంది.
సమశీతోష్ణ చక్రవాతాలు (Temperate Cyclones): ఇవి 35o - 66o  ఆర్కిటిక్, అంటార్కిటిక్ మధ్య ప్రాంతంలో సంభవిస్తాయి.
* ఈ విధంగా భూమధ్య రేఖ నుంచి ఉష్ణ వాయురాశులు, ధృవాల నుంచి శీతల వాయురాశులు వీస్తాయి. ఈ ఉష్ణ, శీతల వాయురాశులు కలిసే ప్రాంతాన్నే 'వాతాగ్రం' అంటారు. దీని వద్ద గాలి అవ్యవ్యాకోచం చెంది ఉరుములు, మెరుపులు ఏర్పడే ప్రాంతాన్ని 'కేంద్రకుడ్యం' అంటారు. అది తీర ప్రాంతంలో తుపాన్‌గా మారడాన్ని 'లాండ్‌ఫాల్' అంటారు. చక్రవాతం ఏర్పడే ప్రాంతం వద్ద వ్యాసం 30 కి.మీ. - 370 కి.మీ., గాలివేగం గంటకు 31 కి.మీ. - 221 కి.మీ. వరకు ఉంటుంది.

* అమెరికాలో 2017, సెప్టెంబరులో ఇర్మా తుపాన్ 279 కి.మీ./గంట; ఒడిశాలో 1999, అక్టోబరులో 268 కి.మీ./గంట వేగంతో సైక్లోన్ సంభవించింది.

సైక్లోన్ మండలాలు
        ప్రపంచంలో ప్రతి ఏడాది సగటున 97 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి ఉద్ధృతి మే, నవంబరు నెలల మధ్య ఉంటుంది. ఉద్ధృతిని బట్టి ఆయా దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

టోర్నడో: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైంది. 98% టోర్నడోలు అట్లాంటిక్ మహాసముద్రం, అమెరికాలో సంభవిస్తాయి. స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం. దీని వేగాన్ని, తీవ్రతను 'ఫుజితా స్కేలు' తో కొలుస్తారు.

తుపాన్
భారతదేశానికి మూడువైపుల సముద్రం ఉండి, 7516 కి.మీ. మేర తీరరేఖ వ్యాపించి ఉంది. దేశ భౌగోళిక వైశాల్యంలో ప్రధాన తీర ప్రాంత భూభాగం 5400 కి.మీ., అండమాన్ నికోబార్ దీవులు 1900 కి.మీ., లక్షదీవులు 132 కి.మీ. మేర తుపాన్ తీవ్రతను కలిగి ఉన్నాయి.
       ప్రపంచ ఉష్ణమండల తుపాన్లలో భారత తీరప్రాంతంలో సంభవించే తుపాన్లు 10% కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. మన దేశంలో సగటున ఏటా 6 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత మే - జూన్; అక్టోబరు - నవంబరు మధ్య ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్ల తీవ్రత 4 : 1 నిష్పత్తిలో ఉంటుంది. ప్రధానంగా బంగాళాఖాతం పరిధిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగలోనూ; పుదుచ్చేరి తూర్పు తీరంలోనూ; పశ్చిమ తీర ప్రాంతం (అరేబియా సముద్రం) పరిధిలోని గుజరాత్‌లోనూ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుపాన్ వచ్చినప్పుడు సముద్రంలోని అలలు 6 మీ. ఎత్తుకు లేస్తాయి. వీటిని గుర్తించడానికి టైడ్‌గేజ్ నెట్‌వర్క్ లేదా రాడార్‌లను ఉపయోగిస్తారు.
       ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో 974 కి.మీ. మేర బంగాళాఖాత తీరరేఖ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలోని 44% భూభాగం తుపాన్ ప్రభావానికి గురవుతుంది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అక్టోబరు డిసెంబరు మధ్య అధిక నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం కాబట్టి దీనిపై తుపాన్ ప్రభావం ఉండదు.

ఇటీవల ఏర్పడిన తుపాన్లు
* 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబా దేశాల్లో - ఇర్మా హరికేన్,
* 2016 డిసెంబరులో దక్షిణ భారత్, అండమాన్, థాయిలాండ్‌లలో - వార్ధా తుపాన్,
* 2015 ఆగస్టులో భారత్, బంగ్లా, బర్మా దేశాల్లో - కొమెన్ తుపాన్,
* 2014 అక్టోబరులో విశాఖపట్నం, నేపాల్‌లో - హుద్‌హుద్ తుపాన్ సంభవించాయి.

సునామీ
      సముద్ర అంతర్భాగంలో భూకంపాలు ఏర్పడినప్పుడు అలలు తీరప్రాంతాన్ని చేరి తుపానుగా మారడాన్నే 'సునామీ' అంటారు. ఆ సమయంలో అలలు పదుల అడుగుల ఎత్తులో పైకి ఎగసి తీరప్రాంతంలోని భూభాగాన్ని తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత సునామీ ముప్పు అనేక గంటలపాటు ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదకరమైన పెద్ద అలలు ఏర్పడతాయి.
* సునామీ అనే పదం జపనీస్ భాష నుంచి వచ్చింది. జపాన్ భాషలో 'సు' (Tsu) అంటే రేవు/సముద్రం, 'నామి' (Nami) అంటే అలలు/తరంగం/కెరటాలు అని అర్థం. సముద్ర ఉపరితల నీరు తరంగాల ద్వారా ఉప్పొంగడాన్నే సునామీగా భావిస్తారు.
* సునామీలను జపాన్‌లో హర్బర్ వేవ్, ఆంగ్లంలో సిస్మిక్ సీ వేవ్, తెలుగులో సముద్ర ఉప్పెన, తమిళంలో అజిహిపెరాలై అని అంటారు.
* సునామీ వచ్చినప్పుడు సముద్ర ఉపరితలంపై రెండు శృంగాల మధ్య దూరం 100 కి.మీ., తరంగాల ఎత్తు 30 మీ., తరంగ ప్రయాణ వేగం 800 కి.మీ./గంట ఉంటుంది. మైదాన ప్రాంతంలో సునామీ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇవి ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

కారణాలు:
1. సముద్రంలో భూకంపాలు ఏర్పడటం.
2. అగ్ని పర్వతాలు పేలడం.
3. కొండ చరియలు (భూపాతాలు) విరిగిపడటం.

     వీటిలో 80% సునామీలు భూకంపాల వల్ల వస్తాయి. ఈ కారణాల వల్ల పెద్దపెద్ద అలలు ఏర్పడి తీరప్రాంతాలను అతలాకుతలం చేయడాన్ని 'సునామీ' అంటారు.

విస్తరణ:
* 75% సునామీలు పసిఫిక్ మహాసముద్రం, దాని దీవుల్లో సంభవిస్తున్నాయి. అందువల్ల పసిఫిక్‌ను 'అగ్నివలయం' (Ring Fire) అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా సుగామీచే, హవాయి దీవులు, జపాన్, ఓషియానీయ దీవులు ఉంటాయి.
* 25% మధ్యదరా, కరేబియన్, పశ్చిమ, తూర్పు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో సంభవిస్తున్నాయి.
ఉదా: అమెరికాలోని అలస్కా, హవాయి దీవుల్లోని 'హిలో' అనే ప్రాంతంలో ఎత్తయిన అలలతో తీవ్రమైన సునామీలు సంభవిస్తాయి.

భారతదేశంలో సునామీ
       మనదేశంలో సునామీ తీవ్రత హిందూ మహాసముద్ర ప్రభావం వల్ల 1% మాత్రమే ఉంటుంది. దేశం మొత్తం తీరప్రాంతంలో 300 కి.మీ. పొడవున దీని ప్రభావం ఉంది.
* తూర్పుతీర బంగాళాఖాతంలో తమిళనాడు నుంచి అండమాన్ - నికోబార్, ఇండోనేషియా దీవుల వరకు; పశ్చిమ తీర అరేబియాలో గుజరాత్, పాక్ మాక్రీన్ దీవుల నుంచి మాల్దీవుల వరకు ఉంటుంది.
ఉదా: 2004, డిసెంబరు 26న రిక్టర్ స్కేలుపై 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల హిందూ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. దీని వల్ల 11 దేశాల్లో మొత్తం 2,30,000 ప్రాణనష్టం జరిగింది. భారత్‌లో అండమాన్ దీవులు, తమిళనాడులోని కడలూర్ జిల్లా అత్యధిక నష్టానికి గురయ్యాయి.
* 2011, మార్చి 11న జపాన్‌లో ఫుకుషిమా వద్ద పెద్ద సునామీ వచ్చింది.

నివారణ చర్యలు:
* 1920లో మొదటిసారిగా హవాయి దీవుల్లో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
* 1946లో 'పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్‌'ను హవాయి దీవుల్లోని హోనొలులు సమీపాన ఏర్పాటు చేశారు.
* 1999లో హైదరాబాద్ కేంద్రంగా ఎర్త్ మినిష్టర్ ఆధ్వర్యంలో 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్‌మేషన్ సర్వీస్' (INCOIS) ను ప్రారంభించారు. ఇది పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్ర సమాచారాన్ని అందిస్తుంది.
* సునామీలను ముందుగా గుర్తించడానికి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో హెచ్చరికలు జారీ చేయవచ్చు. కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లను సముద్రంలో 50 కి.మీ. అడుగున ఉంచుతారు. ఇవి ఉపరితల అలజడులను గుర్తించి ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
* 2015 డిసెంబరులో తొలి విపత్తు ఎఫ్ఎం (107.8) రేడియోను తమిళనాడులోని కడలూర్‌లో ప్రారంభించారు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు - సునామీ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
a) స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం.
b) గ్రీకు భాషలో కైక్లోన్ అంటే 'తిరుగుతున్న నీరు' అని అర్థం.
జ: a, b సరైనవి

2. కిందివాటిని జతపరచండి.
ప్రాంతాలు                              సైక్లోన్

a) జపాన్, చైనా                      i) బ్లిజార్డ్స్

b) ఆస్ట్రేలియా                       ii) హరికేన్లు

c) వెస్టిండీస్                        iii) విల్లీ - విల్లీ

d) అంటార్కిటికా                    iv) టైఫూన్లు

                                    v) టోర్నడోలు

జ: a-iv, b-iii, c-ii, d-i

3. దేశంలో తొలి విపత్తు రేడియోను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: కడలూర్

4. ప్రపంచ చక్రవాతాల్లో భారతదేశ తీర ప్రాంతంలో ఎంత శాతం తుపాన్లు సంభవిస్తున్నాయి?
జ: 10%

5. సునామీలు ఎక్కువగా ఎప్పుడు సంభవిస్తాయి?
  1) పగలు         2) రాత్రి       3) పగలు, రాత్రి         4) అన్ని వేళల్లో
జ: 4 (అన్ని వేళల్లో)

6. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
జ: హోనొలులు

7. 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబాను తీవ్రంగా నష్టపరిచిన హరికేన్?
జ: ఇర్మా

8. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు ఏ నిష్పత్తిలో సంభవిస్తాయి?
జ: 4 : 1

గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 2011, మార్చి 11న ఏ దేశంలో సంభవించిన సునామీ వల్ల వేలాది మంది మరణించారు?  (గ్రూప్ - 4, 2012)

జ: జపాన్
 
2. భారతదేశంలో ఎంత మేర తీరప్రాంతం తుపాన్లు, గాలివానలు, సునామీలకు గురవుతుంది? (గ్రూప్ - 4, 2012)
జ: 5700 కి.మీ.

3. సముద్రాల్లో సునామీ సంభవించినప్పుడు దాని తరంగ/అలల ప్రయాణ వేగం ఎంత? (పంచాయతీ సెక్రటరీ, 2013)
జ: 800 కి.మీ./గంట

4. 1999లో ఒడిశాలో సంభవించిన తీవ్ర తుపాన్ వేగం ఎంత? (హాస్టల్ వెల్ఫేర్, 2017)
జ: 260 - 270 కి.మీ./గంట

5. కిందివాటిలో విపత్తు కానిది? (ఏఎస్‌వో - 2017, ఏపీ)
     1) ప్రాణ నష్టంలేని తుపాన్              2) ఆర్థిక నష్టంలేని తుపాన్
     3) ప్రాణ, ఆర్థిక నష్టంలేని తుపాన్     4) గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి
జ: 4 (గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి)

6. ఉష్ణమండల తుపాన్లను గుర్తించడానికి ఉపయోగించే సాధనం? (ఏఎస్‌వో - 2017)
జ: తీరప్రాంత రాడార్‌లు

7. 2014లో విశాఖపట్టణాన్ని తీవ్రంగా నష్టపరిచిన తుపాన్? (డీఎల్ - 2017)
జ: హుద్‌హుద్

8. జపాన్ భాషలో సునామీ అంటే? (డిప్యూటీ సర్వేయర్ - 2017)
జ: హర్బర్ వేవ్

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ చట్టం - 2005

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పారిశ్రామిక రసాయన విపత్తులు ఏ నోడల్ మంత్రి నిర్వహణలో ఉంటాయి?
జ: పర్యావరణ, అటవీ మంత్రి

2. ఆసియా విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎక్కడ ఉంది?
జ: బ్యాంకాక్

3. NDRF 10వ బెటాలియన్ ఎక్కడ ఉంది?
జ: విజయవాడ

4. విపత్తుల్లో జిల్లా ప్రణాళిక విపత్తు అభివృద్ధి స్థాయి
జ: L1

5. 2015, సెప్టెంబరు 25న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG)ను ఎక్కడ నిర్వహించారు?
జ: న్యూయార్క్

6. 2015 - 2030 వరకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక విపత్తు కుదింపులో ఎన్ని లక్ష్యాలను పేర్కొంది?
జ: 14

7. కిందివారిలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో (NDMA) సభ్యులు కానివారు?
1) జె.సి. పంత్                 2) డి.ఎన్. శర్మ
3) ఎన్.సి మర్వా             4) కమల్ కిశోర్
జ: 1 (జె.సి. పంత్)

8. NRSA భూతల కేంద్రం (ఎర్త్ స్టేషన్) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్

9. ఇటీవల 2015 అంతర్జాతీయ (UNO) విపత్తు కుదింపు సదస్సు ఎక్కడ జరిగింది?
జ: జపాన్ - సెండాయ్

10. ఇటీవల విపత్తు నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన NDRF దళం
జ: SSB

11. జాతీయ నిర్వహణ విపత్తు కమిటీ ఛైర్మన్
జ: హోంశాఖ కార్యదర్శి

12. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్
జ: క్యాబినేట్ కార్యదర్శి

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో ఎన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొంటున్నాయి? (2011, గ్రూప్ 1)
జ: 25

2. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎక్స్ అఫీషియో ఛైర్మన్? (2011, గ్రూప్ 2)
జ: ప్రధానమంత్రి

3. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఎవరి నిర్వహణలో ఉంటుంది? (2016, గ్రూప్ 2)
జ: హోంమంత్రి

4. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP)ను ప్రధాని ఎప్పుడు విడుదల చేశారు? (2016 డిప్యూటీ సర్వేయర్)
జ: 2016, జూన్ 1

5. సార్క్ విపత్తు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4)
జ: కాఠ్‌మాండూ

6. నేషనల్ సివిల్ డిఫెన్స్ సర్వీస్ కాలేజ్ ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4; 2013, పంచాయతీ సెక్రటరీ)
జ: నాగ్‌పుర్

7. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? (2011, గ్రూప్ 1)
జ: 2005, డిసెంబరు 23

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమాలు

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు, ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. 
                   మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం
భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.
* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.
* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.
* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం
1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.
* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.
* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
* తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌

మాదిరి ప్రశ్నలు

1. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ) జోగు రామన్న బి) అజ్మీరా చందూలాల్ సి) జూపల్లి కృష్ణారావు డి) కొప్పుల ఈశ్వర్
జ: (ఎ)

2. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎవరు?
ఎ) బహుగుణ బి) రాజీవ్‌శర్మ సి) అనురాగ్‌శర్మ డి) ఎ.కె.చాందా
జ: (బి)

3. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2014, జులై 6 బి) 2015, జులై 6 సి) 2014, ఆగస్టు 6 డి) 2015, ఆగస్టు 6
జ: (ఎ)

4. ప్రాంతీయ సామాజిక ఉద్యమాలు ఏ దశకం నుంచి ప్రారంభమయ్యాయి?
ఎ) 1980 బి) 1990 సి) 2000 డి) 1970
జ: (ఎ)

5. తెలంగాణలో యురేనియం నిక్షేపాలున్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) మెదక్
జ: (సి)

6. 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1986 బి) 1987 సి) 1988 డి) 1989
జ: (ఎ)

7. 'ఛత్రీ, గమన, పుకార్, చెలిమి' అనేవి ఏమిటి?
ఎ) వ్యాపార సంస్థలు బి) ప్రకటన సంస్థలు సి) స్వచ్ఛంద సంస్థలు డి) ప్రభుత్వ సంస్థలు
జ: (సి)

8. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?
ఎ) బాబా ఆమ్టే బి) మేధా పాట్కర్ సి) రాజేంద్ర సింగ్ డి) బహుగుణ
జ: (బి)

9. 2000, జూన్ 24న ఏర్పడిన 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' కన్వీనర్ ఎవరు?
ఎ) ఎం.వేదకుమార్ బి) డాక్టర్ కిషన్‌రావు సి) కె.పురుషోత్తంరెడ్డి డి) రామారావు
జ: (ఎ)

10. నల్గొండలో యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిచ్చిన గిరిజన సమాఖ్య నాయకుడు ఎవరు?
ఎ) రవీంద్రనాయక్ బి) నాగేశ్వర్‌రావు సి) వీరేంద్రనాయక్ డి) ధరేంద్రసింగ్
జ: (ఎ)

11. నల్గొండ జిల్లాలో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2005 బి) 2006 సి) 2007 డి) 2008
జ: (బి)

12. మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ) హరితపత్రం బి) నందనవనం సి) మిత్రవనం డి) జలవనమండలి
జ: (బి)

13. 2006 నవంబరు 21న హైదరాబాద్‌లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు 'హైదరాబాద్ బచావో' అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?
ఎ) మియాపూర్ నుంచి ఎల్బీనగర్ బి) జూబ్లీహిల్స్ నుంచి ఫలక్‌నుమా సి) పురానా పూల్ నుంచి అంబర్‌పేట డి) అంబర్‌పేట నుంచి మలక్‌పేట
జ: (సి)

14. 'వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా' అనే బిరుదులు ఎవరివి?
ఎ) వందనా శివా బి) సునీతా నారాయణ్ సి) అన్నాహజారే డి) రాజేంద్రసింగ్
జ: (డి)

15. టైమ్ మ్యాగజైన్ 'పర్యావరణ హీరో'గా ఎవరిని అభివర్ణించింది?
ఎ) సునీతా బి) అన్నాహజారే సి) వందనాశివ డి) మాధవ్ ప్రియదాస్
జ: (సి)

16. 'జలమందిర్ యాత్ర' పేరుతో గుజరాత్‌లో ప్రజలను చైతన్యపరిచిన జానపద గాయకుడు ఎవరు?
ఎ) రామ్‌బియా బి) మాధూరిప్రియ సి) రామ్‌లీలావాలా డి) మనోహర్‌బియా
జ: (ఎ)

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సామాజిక ఉద్యమాలు

సామాజిక ఉద్యమాల ప్రధాన లక్ష్యం మార్పు. అంటే.. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి మార్పును ఆశించడం. మన దేశంలో ఇలాంటి సామాజిక ఉద్యమాల పరిధి విస్తృతం. దానికి ప్రధాన కారణం మన దేశ సామాజిక వ్యవస్థ స్వభావం. ప్రపంచంలోని చాలా దేశాల కంటే భిన్నమైన సామాజిక నిర్మాణం మనది.
1960వ దశకం నుంచి అమెరికా, యూరప్ దేశాల్లో కొత్త తరహా ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ కాలంలో వచ్చిన పర్యావరణ, శాంతి, స్త్రీవాద ఉద్యమాలను నూతన ఉద్యమాలుగా వర్గీకరించవచ్చు. భారతదేశంలో తలెత్తిన దళిత, ఆదివాసీ, స్త్రీవాద, మానవ హక్కుల, పర్యావరణ ఉద్యమాలను కూడా 'నూతన సామాజిక ఉద్యమాలు'గానే పేర్కొనవచ్చు. అయితే ఈ ఉద్యమాల లక్ష్యం రాజ్యాధికారం కాదు. 

పర్యావరణం - సంవేదన దశ
భారతదేశంలో అనేక సామాజిక ఉద్యమాలు పర్యావరణ సమస్యలను తమ అజెండాలో చేర్చాయి. పర్యావరణ అంశాలు సామాజిక ఉద్యమాల్లో 20వ శతాబ్దపు రెండోభాగంలో.. 1970 దశకం తర్వాత వచ్చినప్పటికీ, వాటి మూలాలు వలస పాలన కాలంలోనే ఉన్నాయి.
* అడవులు - అటవీ ఉత్పత్తులు, సముద్ర సంపదపై హక్కులు..
* చేపల చెరువుల పెంపకం, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించడం..
* అణు విద్యుత్తు, అణుశక్తి కేంద్రాల ఏర్పాటు, అణుయుద్ధాలను వ్యతిరేకించడం..
ఇలాంటి పర్యావరణ అంశాలను వివిధ సామాజిక ఉద్యమాలు తమ అజెండాలో చేర్చాయి. సామాజిక ఉద్యమాలైన గిరిజన, మహిళ, పౌరహక్కుల, రైతుల, కార్మిక ఉద్యమాల అజెండాలో పర్యావరణ అంశాలు కనిపిస్తాయి.

అటవీ హక్కుల కోసం
గిరిజన ఉద్యమాల్లో చిప్కో, అప్పికో ముఖ్యమైనవి. గిరిజనుల అవసరాలు, మనుగడ.. అటవీ ఉత్పత్తులు, అటవీ సంపదపై ఆధారపడి ఉన్నందున గిరిజనులకు వాటిపై హక్కులు ఉండాలని ఈ ఉద్యమాలు పేర్కొన్నాయి.

చిప్కో ఉద్యమం
చారిత్రక నేపథ్యం: చిప్కో ఉద్యమం ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి ఉద్భవించింది. చారిత్రకంగా, తాత్వికంగా గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిచినందున ఈ ఉద్యమాన్ని ఆ రోజుల్లో 'అడవి సత్యాగ్రహం అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ పరిపాలనలో 1927లోని అటవీ చట్టం వల్ల గ్రామ ప్రజల హక్కులను నిరాకరించడం, గ్రామీణ జీవనోపాధి లేకపోవడం, వాణిజ్యం కోసం అడవులను కొల్లగొట్టడంతో దేశమంతటా ఈ ఉద్యమం వ్యాపించింది.
చిప్కో అంటే.. : చిప్కో అనే పదం హిందీ నుంచి వచ్చింది. ఇది ఆలింగనం చేసుకోవడం/హత్తుకుపోవడం అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రస్తుత ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే బిష్నోయ్ తెగకు చెందిన గిరిజన మహిళలు అక్కడి అడవులను నరకకుండా వాటిని రక్షించుకోవడానికి చేపట్టిన ఉద్యమమే చిప్కో ఉద్యమం. వృక్ష ఆలింగన పద్ధతి ద్వారా చెట్లను హత్తుకుని వాటిని నరకకుండా కాపాడుకున్నారు.

స్వాతంత్య్రానంతరం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చిప్కో ఉద్యమం గాంధేయ విధానంతో 'మీరా బెహన్, సరళ బెహన్' లాంటి గాంధేయవాదులతో సాగింది. వీరు మొదలుపెట్టిన పర్యావరణ ఉద్యమాలు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండల్లో వ్యాపించాయి. తర్వాత కాలంలో చండీ ప్రసాద్ భట్, సుందర్‌లాల్ బహుగుణ ద్వారా ఈ ఉద్యమం విస్తృతమై ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది.
 
సర్వోదయ మండల్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గిరిజనులు సరళ బెహన్ ఆధ్వర్యంలో 1961లో 'ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్‌'ను నెలకొల్పారు. తర్వాత గోపేశ్వర్ జిల్లాలోని 'దషోలి' గ్రామంలో చండీ ప్రసాద్ భట్ నాయకత్వంలో 'దషోలి గ్రామ్ స్వరాజ్ మండల్' అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. వీరు పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. హిమాలయాల్లోని వివిధ అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం, అక్కడి వృక్షాలను నరకడాన్ని వ్యతిరేకిస్తూ చిప్కో పద్ధతిని చేపట్టారు. ఈ విషయంపై 1972, 1973లో విస్తృత ఉద్యమాలు సాగాయి.
 
సుందర్‌లాల్ బహుగుణ  
1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గోపేశ్వర్ గ్రామంలో చండీప్రసాద్ భట్ నాయకత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1989లో కర్ణ ప్రయోగ్ దగ్గర అడవుల్లో చెట్లను కొట్టివేసి 'ఫైన్' చెట్లను పెంచుదామని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి సుందర్‌లాల్ బహుగుణ ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిరోధించగలిగారు. ఇలా బహుగుణ నేతృత్వంలో ఈ ఉద్యమం ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా వ్యాపించింది. అంతకు ముందు పర్యావరణవేత్తగా ఉన్న ఆయన 1981 నుంచి 1983 దాకా హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.ల మేర పాదయాత్ర చేశారు. చివరకు దిల్లీ చేరి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి అటవీ వినియోగ పద్ధతులు మార్చాలని కోరారు. ఫలితంగా ప్రధాని ఆజ్ఞానుసారం అప్పటి నుంచి 15 సంవత్సరాల దాకా హిమాలయ ప్రాంతాల్లో చెట్లు కొట్టడాన్ని నిషేధించారు.
 
కర్ణాటకలో అప్పికో
1983 సెప్టెంబరులో కర్ణాటక రాష్ట్రంలో చిప్కో ఉద్యమానికి బదులు 'అప్పికో' ఉద్యమంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమకారులు కూడా చెట్లను కౌగిలించుకుని చెట్టుని నరికే ప్రయత్నాన్ని ఆపు చేశారు.

'చిప్కో' విజయాలు
* ప్రజల హక్కులను కాపాడి, అడవులకు ప్రకృతికి ఉన్న తాత్విక సామీప్యాన్ని రక్షించి శాస్త్రీయంగా వీటికి కొత్త రచన చేయడమే చిప్కో ఉద్యమ లక్ష్యం.
* ఈ ఉద్యమం గిరిజనుల ఐక్యతను చాటిచెప్పి ఇతర రాష్ట్రాల ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.
* ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాలయాలతోపాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వరకు ఈ ఉద్యమం వ్యాపించింది.
* నిరక్షరాస్యులైన గిరిజనులు నడిపిన ఉద్యమ స్ఫూర్తి అక్షరాస్యులు, నగరవాసులతోపాటు ప్రజలందరిలో పర్యావరణ జాగృతిని కలిగించింది.

నర్మదా బచావో
పర్యావరణ పరిరక్షణ కోసం.. వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన ఉద్యమాలన్నింటిలోకి 'నర్మదా బచావో ఆందోళన్ తలమానికమైంది.
1961లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నర్మద, దాని ఉపనదులపైన సుమారు 3000 చిన్న, 135 మధ్య తరహా, 30 పెద్దతరహా ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటిని కలిపి 'సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్' అంటారు. ఇందులో భాగంగా గుజరాత్, దక్షిణ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1964లోనే కేంద్ర ప్రభుత్వం నర్మదానదిపై 'సర్దార్ సరోవర్ పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే క్షామ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ప్రభుత్వం భావించింది. అలాగే తాగునీరు, సాగునీరుతో పాటు 12,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పిత్తి జరుగుతుందని భావించి నర్మదానదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 1969లో కేంద్రం మూడు రాష్ట్రాలకు నదీ జలాల వినియోగం అంటే పంపిణీ నిమిత్తం 'నర్మద జలవివాద న్యాయ ట్రైబ్యునల్‌'ను నియమించింది.
1987లో ప్రపంచ బ్యాంకు ఈ భారీ ప్రాజెక్టుకు 450 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేయడంతో డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపి వేయాలని 1988లో ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్ నాయకత్వలో 'నర్మదా బచావో ఆందోళన్' అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో మేధా పాట్కర్‌తోపాటు సుందర్‌లాల్ బహుగుణ, బాబా ఆమ్టే (ప్రముఖ సంఘ సేవకులు), అరుంధతీ రాయ్ (ప్రముఖ రచయిత్రి) ఉన్నారు.

'ఆందోళన్' ఎందుకంటే..?
* పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని అడవులు నశించిపోతాయి.
* భూకంపాలు సంభవించవచ్చు.
* నదీ పరివాహక ప్రాంతాల్లో జీవావరణం దెబ్బతిని నేల నాణ్యత తగ్గిపోతుంది.
* లక్షల మంది ఆదివాసులు నిరాశ్రయులవుతారు.
ఈ దుష్ఫలితాలను వివరిస్తూ 1989 నాటికి వీరు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దీంతో ప్రపంచ బ్యాంకు రుణ మొత్తాన్ని ఇవ్వకుండా వెనక్కి తీసుకుంది.

ప్రముఖుల మద్దతు
* 1989లో హర్యుద్ నగరంలో మేధాపాట్కర్, బాబా ఆమ్టే, సుందర్ లాల్ బహుగుణ ఆధ్వర్యంలో నర్మదా ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.  
* 1990, డిసెంబరు 25న బాబా ఆమ్టే ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గాట్ నగరం నుంచి గుజరాత్ సరిహద్దుల్లోని ఫెర్కునా గ్రామం (సర్దార్ సరోవర్ డ్యామ్) వరకు 250 కి.మీ. మార్గంలో 'సంఘర్ష్ యాత్ర' పేరుతో పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. 

* 1991 జనవరిలో మేధాపాట్కర్, ఆమ్టే అమరణ నిరాహార దీక్ష తలపెట్టారు. అయితే ఆరోగ్య దృష్ట్యా దీక్షను 1991, జనవరి 28న విరమింపజేశారు.
* 1991లో స్వీడన్ దేశం మేధా పాట్కర్ సేవలకు గుర్తింపుగా 'రైట్ లైవ్లీహుడ్ అవార్డ్' అనే అత్యున్నత పురస్కారంతో గౌరవించింది.
* 'ది ఫ్రెండ్స్ ఆఫ్ రివర్ నర్మదా' అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది.
* ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ 'ది గ్రేటర్ కామన్ గుడ్' అనే తన పుస్తకం ద్వారా మద్దతు పలికి, భారీ ఆనకట్టల వల్ల కలిగే నష్టాలు, విధ్వంసాల గురించి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.
* డ్యామ్ ఎత్తును 122 మీటర్లకు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 2006 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆనకట్ట ఎత్తును 90 మీటర్ల కంటే ఎక్కువ పెంచరాదని తీర్పునిచ్చింది.
* 2006 సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా గుజరాత్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రాజెక్టు ప్రారంభించింది.

తెహ్రీ డ్యామ్ ఉద్యమం
ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్ జిల్లా తెహ్రీ గ్రామానికి సమీపంలో భగీరథ, భిలాం గంగా నదులపై రష్యా సాంకేతిక సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్యామ్ నిర్మాణానికి తలపెట్టాయి. ఇది భూకంప జోన్ పరిధిలో ఉంది. దీని ఎత్తు 260.5 మీటర్లు. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్దది. 1988 జులైలో రష్యా ఆర్థిక సహకారం (రూ. 3000 కోట్లు)తో 'తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీహెచ్‌డీసీ)' నెలకొల్పింది. ఈ డ్యామ్ వల్ల 2,70,000 హెక్టార్ల భూమికి సాగునీరు.. 346 మెగావాట్ల విద్యుత్తు.. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు తాగునీటిని సమకూర్చవచ్చని అంచనా వేశారు. చేపల పెంపకం, వలస పక్షులకు కూడా కేంద్రమవుతుంది.
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ నాయకత్వంలో 'తెహ్రీ బాంధ్ విరోధి సంఘర్ష్ సమితి' ఆధ్వర్యంలో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని ఆపాలని ఉద్యమం నడిపిస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెహ్రీ గ్రామంతోపాటు 96 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయని, 85 వేల మంది ప్రజలు నిర్వాసితులవుతారని అంచనా వేశారు.

నిశ్శబ్ద లోయ ఉద్యమం
కేరళలోని పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వతాల్లో నిశ్శబ్ద లోయ (Silent Valley) ఆవరించి ఉంది. ఈ ప్రాంతంలో కీచురాళ్లు లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉంటుంది. అందువల్ల దీనికి నిశ్శబ్దలోయ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నవి సతత హరిత వనాలు. వేల సంవత్సరాల నుంచి ఈ అడవులు అరుదైన, అతి విలువైన జంతు, వృక్ష జాతులకు నిలయంగా ఉన్నాయి. దేశంలోనే అపురూప సంపదగా ఈ లోయను భావిస్తారు.
1976లో కేరళ ప్రభుత్వం 240 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాన్ని నీలగిరి పర్వతాల సమీపంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్మాణం వల్ల 1000 హెక్టార్ల అరణ్యం నశించిపోతుందని, దీనివల్ల పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతుందని, అరుదైన వృక్ష సంపద నశించి పోతుందని, అరణ్య సంపదను నాశనం చేసుకోవడం సమర్థనీయం కాదని కేరళ ప్రజలు 'శాస్త్ర సాహిత్య పరిషత్' అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో పెద్ద ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసింది. అంతేకాకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ లోయను జాతీయపార్కుగా ప్రకటించారు.

మాదిరి ప్రశ్నలు
 
1. పర్యావరణం, అడవులు అనే పదాలను మొదట ఆదేశిక సూత్రాల్లో 48(ఎ) అధికరణంలో చేర్చారు. ఈ పదాలు ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
ఎ) 42వ సవరణ - 1972 బి) 42వ సవరణ - 1976 సి) 44వ సవరణ - 1976 డి) 44వ సవరణ - 1978
జ: (బి)

2. 1960 దశకం నుంచి ఏ దేశాల్లో కొత్త తరహా ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి?
ఎ) అమెరికా బి) యూరప్ సి) 1, 2 డి) ఆఫ్రికా
జ: (సి)

3. మన దేశంలో పర్యావరణ అంశాలు సామాజిక ఉద్యమాల్లో ఏ దశకం తర్వాత ముందుకు కొనసాగాయి?
ఎ) 1960 బి) 1980 సి) 1990 డి) 1970
జ: (డి)

4. సామాజిక ఉద్యమాలు పర్యావరణ అంశాలను తమ అజెండాలో చేర్చి విస్తృతపరిచాయి. అయితే కిందివాటిలో పర్యావరణ అంశం కానిది ఏది?
ఎ) అడవులు - అటవీ ఉత్పత్తులు బి) సముద్ర సంపదపై హక్కులు సి) భారీనీటిపారుదల ప్రాజెక్టులు డి) దళిత ఉద్యమాలు
జ: (డి)

5. బ్రిటిష్ పాలనలో అటవీ చట్టం ఎప్పుడు చేశారు?
ఎ) 1927 బి) 1937 సి) 1947 డి) 1957
జ: (ఎ)

6. పర్యావరణ సామాజిక ఉద్యమాల్లో ప్రధాన అజెండా అంశాలు?
ఎ) గిరిజన, మహిళా ఉద్యమాలు బి) పౌరహక్కుల ఉద్యమాలు సి) రైతుల, కార్మిక ఉద్యమాలు డి) పైవన్నీ
జ: (డి)

7. గాంధేయ విధానాల్లో చిప్కో ఉద్యమాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) అడవి సత్యాగ్రహం బి) ఉప్పు సత్యాగ్రహం సి) గిరిజన సత్యాగ్రహం డి) మహిళా సత్యాగ్రహం
జ: (ఎ)

8. 'చిప్కో' అంటే ... ?
ఎ) చెట్లను నరికివేయడం బి) చెట్లను పెంచడం సి) చెట్లను పరిరక్షించడం డి) చెట్లను ఆలింగనం చేసుకోవడం
జ: (డి)

9. మొదట చిప్కో ఉద్యమాన్ని చేపట్టిన గిరిజన తెగ ఏది?
ఎ) తాడలు బి) గోండులు సి) బిష్నోయ్ డి) బిల్లులు
జ: (సి)

10. 1961లో 'ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్‌'ను ఎవరు నెలకొల్పారు?
ఎ) మీరా బెహన్ బి) సరళ బెహన్ సి) చండీ ప్రసాద్ భట్ డి) సుందర్‌లాల్ బహుగుణ
జ: (బి)

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలావరణ వ్యవస్థ

జీవజాలం.. జలాధారం!

సముద్రాలు, నదులు, కాలువలు, సరస్సులు, హిమనీనదాలు, మంచు, గాలిలోని నీటి ఆవిరి సహా  భూమండలంపై నీరు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అది జలావరణం కిందికే వస్తుంది.  ఎన్నో రకాల జీవరాశులు ఇందులో మనుగడ సాగిస్తుంటాయి. పర్యావరణాన్ని పరిరక్షించడం, వాతావరణాన్ని సమతౌల్యం చేయడంలో ఈ ఆవరణ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య శక్తి, పోషకాల మార్పిడి జీవ, భూ రసాయన వలయాల వల్ల జరుగుతుంది. ఇలాంటి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థగా పిలుస్తారు. జలం ఆవాసంగా ఉన్న ఆవరణ వ్యవస్థను జలావరణ వ్యవస్థ అంటారు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.

మంచినీటి ఆవరణ వ్యవస్థ: మంచినీటిలో లవణీయత తక్కువగా ఉంటుంది (5% కంటే తక్కువ). 

ఉదా: సరస్సులు, కొలనులు/చెరువులు, నీటి బుగ్గలు, నదులు.

సముద్ర ఆవరణ వ్యవస్థ: సముద్ర నీటిలో లవణీయత అత్యధికంగా (35% కంటే ఎక్కువ) ఉంటుంది. వీటిలో నివసించే జీవజాతుల వ్యవస్థ ప్రత్యేకమైంది.

ఉదా: సముద్రాలు, మహాసముద్రాలు

పరివర్తన ఆవరణ వ్యవస్థ: దీనిలో లవణీయత మధ్యస్థంగా  (5% నుంచి 35%) ఉంటుంది. ఎస్చ్యురీలు, లాగూన్లు, సముద్ర వెనుక జలాలు, మాంగ్రూవ్స్‌లలో నివసించే జీవజాతులు దీని కిందకు వస్తాయి. 

ప్రభావితం చేసే అంశాలు

సూర్య కాంతి: సమస్త జీవరాశికి మూలాధారమైన సూర్యకాంతి సాధారణంగా జలాల ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు మాత్రమే ప్రసరిస్తుంది. ఈ కాంతి ప్రసరించే లోతును బట్టి వృక్ష, జంతుజాలాల ఉనికి ఆధారపడి ఉంటుంది. 

జలాల పారదర్శకత: నీటి పారదర్శకతను తగ్గించే బంకమన్ను, పూడికలు, వృక్ష ప్లవకాల వల్ల నీరు బురదమయమవుతుంది. నీటి పారదర్శకత తగ్గిన మేరకు లోతుకు వెళ్లే కొద్దీ కాంతి ప్రసరణ తగ్గుతుంది. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి జలావరణ వ్యవస్థ ఉత్పాదనా సామర్థ్యం తగ్గిపోతుంది.

ఉష్ణోగ్రత: పరిసర ఉష్ణోగ్రత మార్పులకు నీరు చాలా నెమ్మదిగా ప్రభావితమవుతుంది. అంటే నీటి ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అందువల్ల జలచర జీవరాశులకు ఉష్ణోగ్రతా సహనస్థాయి పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నీటి ఉష్ణోగ్రతలో ఏ మాత్రం మార్పు వచ్చినా జలచర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

వివిధ మండలాలు 

 కొలను ఆవరణ వ్యవస్థ అనేది ఒక స్వయంసమృద్ధ జీవనాధార వ్యవస్థ. తీరం నుంచి లోతుకు వెళ్లే కొద్దీ జీవజాతుల ఆవాసాన్ని బట్టి దీన్ని వివిధ మండలాలుగా విభజించవచ్చు. 

యూఫోటిక్‌ మండలం: ఇది జలాల ఉపరితల ప్రాంతం. ఇక్కడ సూర్యకాంతి సమృద్ధిగా ప్రసరించడం వల్ల కిరణజన్యసంయోగక్రియ రేటు అధికంగా ఉంటుంది. మొక్కల శ్వాసక్రియ చర్య కూడా ఎక్కువే. ఆక్సిజన్‌ పుష్కలంగా లభిస్తుంది.

లిట్టోరల్‌ మండలం: దీన్ని వేలాంచల మండలం అంటారు. ఇది తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ కాంతి అడుగు భాగం వరకు చేరుతుంది. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరిగి ఆక్సిజన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో పెరిగే మొక్కల వేర్లు నీటి అడుగు భాగంలో ఉంటాయి. వాటి పత్రాలు నీటి ఉపరితలంపై తేలియాడుతుంటాయి. 

ఉదా: నీటి లిల్లీలు, నీటిలో పూర్తిగా మునిగి ఉన్న మొక్కలు హైడ్రిల్లా, వృక్ష ప్లవకాలు లాంటి డయాటమ్స్, జంతు ప్లవకాలైన డాఫ్నియా రోటెఫర్‌లు లాంటివి జీవిస్తాయి. మొక్కలను అంటిపెట్టుకునే నత్తలు, కీటక డింభకాలు, హైడ్రాలు నివసిస్తాయి. వేలాంచల అడుగు భాగంలో సంచరించే జీవులను బెంథాస్‌ జీవులు అంటారు. ఎర్రటి అనెలిడ్‌లు, క్రే చేపలు వీటికి ఉదాహరణ.

లిమ్నెటిక్‌ మండలం: ఇది తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం. కొలనులో అతిపెద్ద మండలం. కాంతి సమృద్ధిగా లోపలికి వెళ్లగలిగే ప్రాంతం వరకు ఇది కొనసాగుతుంది. ఈ మండలంలో సమయానుకూలంగా ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ లభ్యతలు వేగంగా మారుతుంటాయి. ఈ ప్రాంతం ఉపరితల జలానికే పరిమితం. సరస్సు అడుగు భాగం వరకు లిమ్నెటిక్‌ మండలం విస్తరించదు. దీని కింద ప్రొఫండల్‌ మండలం ఉంటుంది. లిమ్నెటిక్‌ మండలంలో యూగ్లినాయిడ్స్, డయాటమ్స్, ఆకుపచ్చని శైవలాలు లాంటి స్వయంపోషక జీవులు అధికంగా నివసిస్తాయి. వీటితోపాటు జంతుప్లవకాలు, చేపలు, కప్పలు, నీటి సర్పాలు లాంటి వినియోగదారులూ జీవిస్తాయి. వేలాంచల మండలం, ప్రొఫండల్‌ మండలాలను వేరుచేస్తూ ఉన్న ఊహాజనిత రేఖను పరిహర మండలం లేదా కాంతి పరిహర మండలం అంటారు. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ రేటు, శ్వాసక్రియ రేటు సమానంగా ఉంటాయి. 

ప్రొఫండల్‌ మండలం: ఇది లిమ్నెటిక్‌ మండలానికి కిందనున్న లోతయిన నీటి ప్రదేశం. ఈ ప్రాంతంలో కాంతి ప్రసరణ ఉండదు. ఈ నీటిలో ఆక్సిజన్‌ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో కిరణజన్యసంయోగక్రియ జరిపే జీవులు ఉండవు. ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరిపే, కుళ్లిన ఆహార పదార్థాలను తినే విచ్ఛిన్నకారులు/పూతికాహార (డెట్రిటస్‌) జీవులు ఉంటాయి.

సరస్సు జీవావరణ వ్యవస్థ

జలావరణ వ్యవస్థల్లో సరస్సు జీవావరణ వ్యవస్థ ఒక ఉన్నత స్థాయి జీవావరణ వ్యవస్థ. ఇందులో జీవగోళంలో మాదిరి అన్ని విధులూ జరుగుతాయి. సౌరశక్తి సహాయంతో స్వయం పోషకాలు అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మారుస్తాయి. విచ్ఛిన్నకారులు చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేసి పోషక పదార్థాలు, ఖనిజాలు విడుదల చేయడం, అది తిరిగి స్వయంపోషకాల ద్వారా వినియోగంలోకి రావడం లాంటి ప్రక్రియలన్నీ జరుగుతాయి. 

చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థ 

తేమ, బురదతో కూడిన క్షార స్వభావం ఉన్న ప్రాంతాల్లో భౌమ, జల వనరుల మధ్య ఏర్పడిన సంక్లిష్ట ఆవరణ వ్యవస్థనే చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థగా పిలుస్తారు. ఇవి విలక్షణమైన జీవజాతులకు నిలయాలు. వలస పక్షులకు అనువైన ప్రదేశాలు. పోషకాల పరిమాణాన్ని పెంపొందిస్తాయి. కలుషిత జలాలను శుద్ధి చేస్తాయి. నేల క్రమక్షయాన్ని నియంత్రిస్తాయి. అందువల్ల చిత్తడి నేలలను పర్యావరణానికి కిడ్నీలుగా భావిస్తారు. 

చిత్తడి జలాల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రాంసార్‌ వద్ద అంతర్జాతీయ పల్లపు భూముల (చిత్తడి నేలల) పరిరక్షణ సమావేశం జరిగింది. మనదేశంలో సుమారు 153 లక్షల హెక్టార్లలో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి దేశ వైశాల్యంలో 4.7%. 

మనదేశం నుంచి ఇప్పటి వరకు రాంసార్‌ కన్వెన్షన్‌లో చేర్చిన చిత్తడి నేలలు 49. 

* మొదట 1981లో చిల్కా సరస్సు (ఒడిశా), కియోలాడియో (రాజస్థాన్‌) లను తీసుకున్నారు.

దేశంలో:

* పెద్ద వెట్‌ల్యాండ్‌ - సుందర్‌బన్స్‌ (పశ్చిమ బంగా)

* చిన్న వెట్‌ల్యాండ్‌ - రేణుక (హిమాచల్‌ప్రదేశ్‌)

* అత్యధిక వెట్‌ల్యాండ్స్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం - ఫిబ్రవరి 2

మాదిరి ప్రశ్నలు 

1. తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న నీటి ఆవరణ వ్యవస్థను ఏమంటారు?

1) లిమ్నెటిక్‌ మండలం     2) వేలాంచల మండలం     3) ప్రొఫండల్‌ మండలం     4) యూఫోటిక్‌ మండలం

2. జలావరణ వ్యవస్థలో ఆక్సిజన్‌ సమృద్ధిగా లభించే ప్రాంతాన్ని ఏమంటారు?

1) యూఫోటిక్‌ మండలం     2) ఎఫోటిక్‌ మండలం       3) ఫోటిక్‌ మండలం       4) ఏదీకాదు

3. లిమ్నెటిక్‌ మండలం అంటే?

1) తీరానికి దూరంగా ఉన్న ఉపరితల జలాల మండలం     2) తీరానికి దగ్గరగా ఉన్న లోతయిన నీటి మండలం

3) తీరానికి దూరంగా ఉన్న లోతయిన నీటి మండలం       4)  కాంతి ప్రసరించని ప్రాంతం

4. నీటిపై తేలియాడే మొక్కలున్న ప్రాంతం?

1) లిట్టోరల్‌ ప్రాంతం     2) ప్రొఫండల్‌ ప్రాంతం      3) లిమ్నెటిక్‌  ప్రాంతం        4) ఏదీకాదు

5. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) జనవరి 2     2) ఫిబ్రవరి 2      3) ఆగస్టు 4      4) అక్టోబరు 3

6. రాంసార్‌ కన్వెన్షన్‌ ఎప్పుడు జరిగింది?

1) 1971       2) 1981       3) 1969      4) 1975

7. బురదతో కూడి క్షార స్వభావం ఉండే జీవావరణ వ్యవస్థ?

1) మంచి నీటి ఆవరణ వ్యవస్థ           2) సముద్ర ఆవరణ వ్యవస్థ

3) చిత్తడి నేల ఆవరణ వ్యవస్థ            4) భౌమ ఆవరణ వ్యవస్థ

8. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని శరీర నిర్మాణంలో అనుకూలతలున్న జీవులు?

1) యూరిథర్మల్‌ జీవులు     2) స్టీనో థర్మల్‌ జీవులు     3) ఎకో థర్మల్‌ జీవులు     4) ఏదీకాదు

9. తీరాంచల మండల అడుగు భాగంలో జీవించే అనెలిడ్‌లు, క్రే చేపలను ఏమంటారు?

1) బెంథాస్‌ జీవులు      2) సూక్ష్మజీవులు     3) డయాటమ్స్‌     4) శైవలాలు

10. పర్యావరణ కిడ్నీలు అని ఏ జీవావరణ వ్యవస్థను పిలుస్తారు?

1) చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థ         2) సముద్ర ఆవరణ వ్యవస్థ

3) అమెజాన్‌ అడవుల ఆవరణ వ్యవస్థ       4) భూమధ్యరేఖా అటవీ ఆవరణ వ్యవస్థ 

సమాధానాలు

1-2,    2-1,    3-1,    4-1,    5-2,    6-1,    7-3,    8-1,    9-1,    10-1.

రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 06-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్యం

జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.
 
జీవ వైవిధ్య స్థాయులు
జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి.. 
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)

జన్యుపర జీవవైవిధ్యం
ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.

జాతిపర జీవ వైవిధ్యం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.

ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం
దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

కాలుష్య ప్రభావం
జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.
జీవావరణ సమతౌల్యం

ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.

జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్
బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.

1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్): ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.
 
2. బీటా పటాలు (బీటా మ్యాప్స్): ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.
 
3. గామా పటాలు (గామా మ్యాప్స్): ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.
 
తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్): భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. 

వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం
ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.

భారతదేశంలో జీవవైవిధ్యం
ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. 

* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.

జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక
జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.
 
జాతీయ జీవ వైవిధ్య చట్టం
ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..
* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు

భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు

ఎలిఫెంట్ ప్రాజెక్టు
1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. 

టైగర్ ప్రాజెక్టు
భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.  

బయోస్ఫియర్ రిజర్వ్
ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. 

మెరైన్ నేషనల్ పార్క్‌లు

మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.
దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి..
1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం

భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తులు 

* విపత్తు (Disaster) అనే పదం ఫ్రెంచ్‌భాషకు చెందింది. Desaster అనే ఫ్రెంచ్ పదం నుంచి Disaster అనే ఆంగ్ల పదం వచ్చింది. దీనికి 'చెడ్డ నక్షత్రం (Bad star)'అని అర్థం.
* పర్యావరణం, సమాజం, సామాన్య ప్రజలకు ఆర్థికంగా అధిక నష్టం కలిగించి, సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితిని 'విపత్తుగా' పరిగణించవచ్చు. ప్రకృతి వైపరీత్యాల (Natural Hazards) వల్ల అధిక మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టాలుంటాయి. జరిగిన నష్టం ఆధారంగా విపత్తు తీవ్రతను అంచనా వేస్తారు. ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability) ఉన్నప్పుడు, వైపరీత్యాలను ఎదుర్కొనే ముందస్తు సమర్థ చర్యలు లేనప్పుడు విపత్తు తీవ్రత అధికంగా ఉంటుంది.

         విపత్తు సందర్భంలో ప్రజలు ప్రమాదకర లేదా సున్నితమైన స్థితిలో ఉన్నప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్షణ రక్షణ చర్యలు తీసుకున్నప్పుడు దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఒక ప్రాంత ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability), వయసు, పేదరికం, నిరక్ష్యరాస్యత, సరైన శిక్షణ లేకపోవడం, పర్యావరణ క్షీణత, నియంత్రించలేని అభివృద్ధి, సరైన వసతులు లేకపోవడం, ప్రమాదకర ప్రదేశాలు, నివాసాలు, ఆర్థికంగా పటిష్టంగా లేకపోవడం, పట్టణీకరణం, జనాభా పెరుగుదల లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.  
వైపరీత్యం వల్ల అతి తక్కువ ప్రభావం ఉండి, ఆర్థిక, ప్రాణ నష్టాలు లేకపోతే అది విపత్తుగా మారే అవకాశం లేదు. ఉదాహరణకు ప్రాణులు, ఆవాసాలులేని ఏదైనా ఎడారి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే, దాన్ని విపత్తుగా భావించలేం.

    వైపరీత్యాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
1) సహజ వైపరీత్యాలు (Natural Hazards)
2) మానవకారక వైపరీత్యాలు (Man made Hazards).

సహజ వైపరీత్యాలు: ఇవి ప్రకృతిలో సహజంగా సంభవిస్తాయి. తుపానులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, సునామీ, కొండచరియలు విరిగిపడటం, వరదలు, కరవు, చీడపీడలు ఎక్కువ కావడం లాంటివాటిని సహజ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.

మానవకారక వైపరీత్యాలు: సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం; ఆనకట్ట కూలిపోవడం (Dam Failure); యుద్ధాలు; పరిశ్రమల నుంచి విషవాయువులు, హానికర పదార్థాలు వెలువడటం లాంటి మానవ చర్యల వల్ల మానవకారక వైపరీత్యాలు సంభవిస్తాయి.

* వైపరీత్యాలను అవి సంభవించే ప్రదేశం, కారణమయ్యే స్థితి ఆధారంగా కిందివిధంగా విభజించవచ్చు.
1) భౌగోళిక సంబంధ వైపరీత్యాలు (Geological Hazards): భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, గనుల్లో మంటలు రావడం, ఆనకట్ట బద్దలు కావడం, కొండచరియలు విరిగిపడటం (Land side) లాంటివాటిని భౌగోళిక సంబంధ విపత్తులుగా పేర్కొనవచ్చు.

2) నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలు (Water & Climatic Hazards): తుపానులు, టోర్నడోలు, హరికేన్లు, వరదలు, కరవు, వేడి గాలులు, మంచు చరియలు విరిగిపడటం(Snow Avalanche), సముద్రం వల్ల కలిగే కోత (Sea erosion), వడగళ్ల వాన, గాలితో కూడిన వర్షం(Cloud burst) లాంటివాటిని నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.

3) పర్యావరణ సంబంధ వైపరీత్యాలు (Environmental Hazards): పర్యా వరణ కాలుష్యం, ఎడారి విస్తరించడం (Desertification), చీడపీడల సంక్రమణ (Pest Infection), అడవులు నశించడం లాంటివి వీటికి ఉదాహరణ.

4) జీవన సంబంధ విపత్తులు: చీడపీడలు వ్యాపించడం (Pest Attacks), ఆహారం కలుషితమవడం, మానవులు, జంతువుల నుంచి అంటు వ్యాధులు (Human/ Animal Epidemics) వ్యాపించడం లాంటివి జీవసంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ.

5) రసాయన, పారిశ్రామిక వైపరీత్యాలు: పెద్ద మొత్తంలో రసాయనాలు వెలువడటం, పారిశ్రామిక దుర్ఘటనలు, చమురు ఎక్కువగా ఒలికిపోవడం(Oil Spils), నూనెలవల్ల మంటలు చెలరేగడం, అణు దుర్ఘటనలు మొదలైనవాటిని వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.

6) ప్రమాద సంబంధ వైపరీత్యాలు: రైలు, విమాన, వాహన, పడవ సంబంధ ప్రమాదాలు, జనావాసాల మధ్య మంటలు చెలరేగడం, ఒకేసారి అనేకచోట్ల బాంబులు పేలడం, అడవుల్లో కారుచిచ్చు, భవంతులు కూలిపోవడం, విద్యుత్ సంబంధ ప్రమాదాలు, పండగల సందర్భంలో జరిగే ప్రమాదాలు, గనుల్లోకి వరదరావడం లాంటివి ప్రమాద సంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ. కొన్నిసార్లు సహజ, మానవ సంబంధ కారణాలు కలవడం వల్ల కూడా వైపరీత్యాలు రావచ్చు.

* ఇలాంటి వాటిని సాంఘిక - సహజ వైపరీత్యాలు (Socio-Natural Hazards) అంటారు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లోని మురికి కాలువల్లో చెత్త, చెదారం పేరుకుపోవడం వల్ల వరదలు రావడం. కొన్నిసార్లు కరవు, మంటలు చెలరేగడం లాంటివి సహజ, మానవ కారణాలు రెండింటి ఫలితంగా సంభవించవచ్చు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు-చట్టాలు

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు, ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. 
                   మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం
భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.
* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.
* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.
* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం
1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.
* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.
* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
* తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌

నదీ జలాల్లో 'విష' ప్రవాహం

మానవ మనుగడ దేనిపై ఆధారపడి ఉందో ఆ పర్యావరణం కాలుష్యం దెబ్బకు విషతుల్యంగా మారుతోంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో వెదజల్లుతున్న కాలుష్యం పౌర సమాజాన్ని ఊపిరి సలపనీయడం లేదు. నదీ జలాలు, పరిసర ప్రాంతాల్లో చిమ్ముతున్న విష ప్రభావానికి మూగజీవాలు చనిపోతున్నాయి. మనుషులు కూడా బలై పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని రూపుమాపాలంటూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సాగిన ప్రధాన ఉద్యమాలేమిటో చూద్దాం..

పౌరహక్కుల ఉద్యమాలు తమ అజెండాలో పర్యావరణ సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. కాలుష్యం లేని పర్యావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ఈ ఉద్యమాలు భావించాయి. ఈమేరకు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అణుశక్తి వినియోగం, అణు విద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, అణు యుద్ధాలు లాంటివాటిని వ్యతిరేకిస్తూ పౌర హక్కుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అలాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు, మైనింగ్ తదితర కార్యకలాపాలకు భూసేకరణ జరిపే క్రమంలో.. కొన్ని కుటుంబాలు తమ భూములను కోల్పోతున్నాయి. ఇలాంటి నిరాశ్రయుల హక్కుల సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయి.

కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు: మన దేశంలో శతాబ్దాలుగా నదులు, వాగులు, ఏరులు.. ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి. పరిశ్రమల వాణిజ్య అవసరాలు తీరుస్తున్నాయి. మత్స్య సంపదలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే పారిశ్రామికీకరణ వల్ల ఇవి చాలామేర కలుషితం అయ్యాయి. ప్రత్యేకంగా ఉత్తరాన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌బంగ రాష్ట్రాలకు చెందిన నగరాల్లో గంగానది పొడవునా ఉన్న పంచదార, కాగితం, ఎరువులు, రసాయనాలు, రబ్బరు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల నుంచి వచ్చే కలుషితాలన్నీ నదిలో కలుస్తున్నాయి. దక్షిణాన కూడా పలు పరిశ్రమలు గోదావరి, కావేరి, తుంగభద్ర నదులను కలుషితం చేస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలతోపాటు పలు చట్టాలను కూడా రూపొందించాయి.

'సోన్'లో గరళం: మధ్యప్రదేశ్‌లోని షోడోల్ జిల్లాలో సోన్ నది పక్కనున్న అమ్లాయ్ నగరంలో 1965లో ఓరియంటల్ పేపర్ మిల్స్ అనే కాగితం పరిశ్రమ ఏర్పాటైంది. ఇది పెట్టిన రెండేళ్లకే కలుషిత పదార్థాల వల్ల నదిలోని చేపలు, పరిసర ప్రాంతాల్లో పశువులు మరణించాయి. 1970 నుంచి నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్లే నదీ జలాలు విషపూరితం అయ్యాయంటూ అధికారులకు, కలెక్టరుకు, మంత్రులకు విన్నవించుకున్నారు. అయినా యాజమాన్యం దీనిపై స్పందించలేదు. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ, దిల్లీ) బృందం ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పశువుల్లో పాల దిగుబడి తగ్గిందని; నదిలోని చేపలు, గ్రామాల్లోని పశువులు క్రమంగా చనిపోతున్నాయని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టారు. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది.

'చాలియార్' కలుషితం: కేరళలోని చాలియార్ నది పక్కన 1958లో బిర్లా సంస్థ గ్వాలియర్ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. దీని నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల ఆ నదిలోని చేపలన్నీ చనిపోయాయి. నది నుంచి నీరు వెళ్లే పంట పొలాలు నాశనమయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలకు చర్మ రోగాలు సోకాయి. దీంతో వీరంతా 1963లో కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతూ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. 1975లో ఇది భారీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఫలితంగా 1981లో కాలుష్య నియంత్రణ మండలి కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది.
గోవాలో ఉద్యమం: 1973లో గోవాలో జువారి ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ అనే ఎరువుల పరిశ్రమను ప్రారంభించారు. పని ప్రారంభించిన 3 నెలలకే కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా మాడిపోయాయి. దీంతో 1974 మార్చి 31న సలదాన్హా అనే ఉపాధ్యాయుడు స్థానిక ప్రజలతో కలిసి కాలుష్య వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

కాలుష్య కర్మాగారం: ముంబయికి గాలి వచ్చే నైరుతి దిశలోని అలీబాగ్ ప్రాంతంలో ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని, ప్రజలు కాలుష్యానికి గురవుతున్నారని అక్కడి ప్రజలు గుర్తించారు. వీరంతా దీన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఉద్యమం చేపట్టారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం దీన్ని మరోచోటుకు తరలించింది.

భోపాల్ దుర్ఘటన
* 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్‌లోని 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్' (అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ) అనే ఎరువుల తయారీ పరిశ్రమ నుంచి 'మిథైల్ ఐసోసైనేట్' అనే ప్రమాదకర విషవాయువు వెలువడింది. ఇది 3 వేల మంది మరణానికి కారణమైంది. భారతదేశంలో సంభవించిన పారిశ్రామిక దుర్ఘటనల్లో అతి భయానక విపత్తుగా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. అనంతర కాలంలో ఈ వాయువు దుష్ప్రభావం ఫలితంగా దాదాపు 15 వేల మంది మరణించారు. 5 లక్షల మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రజలు వికలాంగులు, అంధులుగా మారారు. జీవచ్చవాలుగా మిగిలిన వారు చాలామంది ఉన్నారు.
* ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సీఈవో వారెన్ ఆండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై అమెరికా వెళ్లాడు. 1986లో రషీదాబీ, చంపాదేవి శుక్లా భోపాల్ బాధితులకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఉద్యమం నడిపారు. దేశప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
* 1989లో రషీదాబీ, చంపాదేవి ఆధ్వర్యంలో 'భోపాల్ హతశేషుల ఉద్యమం' నడిచింది. దిల్లీలో వేలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమకు న్యాయం చేయమని కోరుతూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వినతి పత్రం సమర్పించారు.
* 1999లో చంపాదేవి ఇతర ఉద్యమకారులతో కలిసి న్యూయార్క్ కోర్టులో 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్'పై ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2002లో రషీదాబీ, చంపా కలిసి న్యూఢిల్లీలో 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. భోపాల్ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
* రషీదాబీ, చంపా చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో వారికి 'గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతి' లభించింది. ఈ పురస్కారాన్ని పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. వీరి పోరాటానికి కొన్ని అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇచ్చాయి. అవి..
* ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* భోపాల్ మెడికల్ అప్పీల్ - బ్రిటన్
* గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* అసోసియేషన్ ఫర్ ఇండియన్ - అమెరికా
* కోర్ వాచ్ - అమెరికా
* పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ - అమెరికా
* భోపాల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ - జపాన్
* విషయం మళ్లీ 2010లో వార్తల్లోకి వచ్చింది. 2011లో కేంద్రం బాధితులకు రూ.1500 కోట్ల అదనపు ప్యాకేజీని సిఫారసు చేసింది. ఇటీవల ఈ కేసును కొట్టేశారు.
* కేంద్ర ప్రభుత్వం 1984లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం'ను రూపొందించింది. 1986లో పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చట్టాలను అమలు చేసింది.

Posted Date : 18-05-2021