మాదిరి ప్రశ్నలు
1. ఆర్మీనియా పీఠభూమి ఎక్కడ ఉంది?
1) ఆఫ్రికా 2) రష్యా 3) టిబెట్ 4) ఆస్ట్రేలియా
2. టిబెట్, పామిర్ పీఠభూములు ఏ రకమైన పీఠభూములకు ఉదాహరణ?
1) పర్వతాంతర పీఠభూములు 2) గిరిపద పీఠభూములు
3) కలశ పీఠభూములు 4) లావా పీఠభూములు
3. అర్జెంటీనాలో ని పెటగోనియా పీఠభూమి ఏ రకానికి చెందింది?
1) పర్వతాంతర 2) గిరిపద 3) కలశ 4) ఖండాంతర్గత
4. పెటగోనియా పీఠభూమి ఏ ఖండంలో ఉంది?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా 3) యూరప్ 4) ఆస్ట్రేలియా
5. ప్రపంచంలో ఎత్తయిన పీఠభూమి?
1) టిబెట్ 2) బొలీవియా 3) మంగోలియా 4) కొలరాడో
6. ‘ప్రపంచపు పైకప్పు’ అని ఏ పీఠభూమిని పేర్కొంటారు?
1) పామీర్ 2) మాల్వా 3) దక్కన్ 4) కొలరాడో
7. ‘రూర్ ఆఫ్ ఇండియా లేదా ఖనిజాల కాణాచి’ అని పిలిచే పీఠభూమి?
1) బుందేల్ ఖండ్ 2) బాగల్ ఖండ్ 3) కోడెర్మా పీఠభూమి 4) చోటానాగ్‌పుర్ పీఠభూమి
8. కిందివాటిలో పీఠభూమి లక్షణాలకు సంబంధించి సరైంది?
1) ఎక్కువ విస్తీర్ణంతో ఇంచుమించు సమతలంగా ఉండటం.
2) అంచులు వాలును కలిగి ఉండటం.
3) 300 మీటర్లు, అంతకంటే కొద్దిగా ఎత్తుగా ఉండటం.
4) పైవన్నీ
9. లావా పీఠభూములకు ఉదాహరణ?
1) కొలంబియా 2) రాంచీ పీఠభూమి 3) హజీరాబాగ్ 4) కొలరాడో పీఠభూమి
10. అమెరికాలోని అర్కన్‌సాస్, బజార్క్ పీఠభూములు వేటికి ఉదాహరణ?
1) కలశ పీఠభూములు 2) గిరిపద పీఠభూములు
3) పర్వతాంతర పీఠభూములు 4) ఖండాంతర్గత పీఠభూములు
11. మైకా నిల్వలకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి?
1) రాంచీ 2) కోడెర్మా 3) బాగల్ ఖండ్ 4) మాల్వా
12. ‘స్నేక్ రివర్’ పీఠభూమి ఏ దేశంలో ఉంది?
1) అమెరికా 2) భారతదేశం 3) పాకిస్థాన్ 4) చైనా
13. వికోశీకరణ బలాల శైథిల్య క్రమక్షయ చర్యలకు లోనుకావడం వల్ల శిథిలమై పీఠభూములుగా పరిణామం చెందేవి?
1) లావా 2) ఖండాంతర్గత 3) అవశిష్ట 4) పర్వతాంతర
14. పన్నా వజ్రపు గనులకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి?
1) టిబెట్ 2) పామీర్ 3) మంగోలియా 4) ఏదీకాదు
15. పీఠభూమిని సూచించేది?
1) పర్వతాలతో చుట్టబడిన భూమి
2) ఇసుకతో కప్పబడిన భూమి
3) ఒక విశాలమైన సమతలం లేదా సమతల ఉద్గమన ప్రదేశం
4) అడవులతో నిండిన భూమి
సమాధానాలు
1- 3; 2- 1; 3- 2; 4- 2; 5- 1; 6- 1; 7-4; 8-4; 9-1; 10-1; 11-2; 12-1; 13-3; 14-4; 15-3.