• facebook
  • whatsapp
  • telegram

మొగల్‌ యుగ విశేషాలు

భారతదేశాన్ని క్రీ.శ. 1526 నుంచి క్రీ.శ. 1858 వరకు మొగలులు పాలించారు. బాబర్‌ నుంచి ఔరంగజేబ్‌ వరకూ మొగల్‌ పాలన గొప్పగా సాగిందని చరిత్రకారులు కొనియాడారు. మొగల్‌ పాలనను ప్రారంభించింది సూర్‌ వంశానికి చెందిన షేర్షా. అతడు ప్రవేశపెట్టిన పాలనా,   రెవెన్యూ, ఆర్థిక సంస్కరణలనే అక్బర్‌ కొద్ది మార్పులతో కొనసాగించాడు. అందుకే షేర్షాను అక్బర్‌కు మార్గదర్శకుడిగా పేర్కొంటారు. 

పరిపాలనా సంస్కరణలు
కేంద్రపాలన: మొగల్‌ చక్రవర్తులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లో అనేక మార్పులు ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలనను అందించారు. కేంద్రపాలనలో చక్రవర్తే అత్యున్నతాధికారి. పౌరపాలన మొత్తం అతడి చుట్టే కేంద్రీకృతమై ఉండేది. మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో చక్రవర్తి పాలనను కొనసాగించేవాడు. షేర్షా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సర్కారులు - పరగణాలు - గ్రామాలుగా విభజిస్తే, కొద్దిమార్పులతో అక్బర్‌ తన సామ్రాజ్యాన్ని సుబాలు - సర్కారులు - పరగణాలు - గ్రామాలు అనే భాగాలుగా ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రి మండలిలో వకీల్‌ (ప్రధానమంత్రి), వజీర్‌ (ఆర్థికమంత్రి), మీర్‌భక్షీ (యుద్ధమంత్రి), మీర్‌-ఇ-సదర్‌ (దానధర్మాల మంత్రి), ప్రధాన ఖాజీ (న్యాయశాఖామంత్రి) పరిపాలనలో చక్రవర్తికి సహాయపడేవారు.  

 

రాష్ట్ర పాలన: షేర్షా సర్కారులు అనే రాష్ట్రాలను ఏర్పాటు చేయగా, అక్బర్‌ ‘సుబాలు’ అనే ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. సుబా అధిపతి సుబేదార్‌. వీరి పాలన కూడా కేంద్ర పాలనను పోలి ఉండేది. సుబేదార్‌కు రాష్ట్ర పాలనలో తోడ్పడేందుకు ఫొతేదార్, పౌజ్‌దార్‌ లాంటి అధికారులు ఉండేవారు. అమీన్‌ను రాష్ట్ర రెవెన్యూ అధికారిగా, నేటి కలెక్టర్‌తో పోల్చవచ్చు. ఫొతేదార్‌ రాష్ట్ర కోశాధికారి. రాష్ట్రంలో సైనిక వ్యవహారాలు చూడటానికి ‘భక్షీ’ అనే అధికారిని నియమించారు. రాష్ట్ర గవర్నర్‌లను సిఫా-సలార్‌ అనేవారు. తర్వాతి కాలంలో సిఫా-సలార్‌ పదవి సుబేదార్‌ లేదా నజీమ్‌గా మారింది. వీరితో పాటు కాజీ, సాదర్, ముతాసిబ్‌ లాంటి ఇతర అధికారులు కూడా రాష్ట్ర పాలనలో సాయపడేవారు.

స్థానిక పాలన
మొగలుల స్థానిక పాలనలో సర్కారులు - పరగణాలు - గ్రామాలతోపాటు మహల్స్, ఠాణాలు, పట్టణాలు, ఓడరేవులు లాంటి ఇతర పాలనా విభాగాలు కూడా ఉండేవి. సర్కారు అధిపతిని పౌజ్‌దార్‌ అని, పరగణా అధిపతిని షిక్‌దార్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో పట్వారీ, చౌకీదార్, ముఖద్దమ్‌ లాంటి ఉద్యోగులు ఉండేవారు. ఇలా మొగలులు తమ కాలంలో కేంద్రం నుంచి గ్రామం వరకు సమర్థవంతమైన పాలన అందించారు.

రెవెన్యూ పాలన
మొగలుల కాలం నాటి రెవెన్యూ విధానాల్లో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. భూములను సర్వే చేయించడం, విభజించడం, శిస్తు నిర్ణయించడం లాంటి రెవెన్యూ విధానాలను అనుసరించారు. కేంద్రంలో వజీర్, సుబాలలో (రాష్ట్రాలు) దివాన్‌లు, అమీన్‌లు, సర్కారులు; పరగణాల్లో కనుంగోలు రెవెన్యూ విధులను నిర్వహించేవారు. షేర్షా భూములను కొలిపించి ఉత్తమ - మధ్యమ - అధమ అనే మూడు రకాలుగా విభజించాడు. అక్బర్‌ కాలంలో భూములను పోలజ్, పరౌటీ, చాచర్, బంజర్‌ అనే నాలుగు రకాలుగా విభజించారు. 
పండిన పంటలో 1/3 వంతు భూమి శిస్తుగా వసూలుచేసేవారు. అక్బర్‌ కాలంలో బందోబస్తు రెవెన్యూ విధానం (రైత్వారీ పద్ధతి) ప్రవేశపెట్టారు. నాటి భూమి శిస్తు విధానాన్ని జబ్తి (జాబితా) పద్ధతిగా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ప్రతి 10 సంవత్సరాల సగటు పంటను లెక్కించి భూమి శిస్తు విధిస్తారు. అందుకే దీన్ని దహ్‌సాలా పద్ధతి అని కూడా పిలిచేవారు. రైతులు భూమి శిస్తును ధన, ధాన్య రూపంలో చెల్లించడానికి అనుమతించారు.

న్యాయపాలన 
మొగలుల కాలంలో చక్రవర్తే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. ఫర్మానాలు జారీ చేయడం, మరణ శిక్షలు విధించడం లాంటి విశేషాధికారాలు కూడా ఉండేవి. చక్రవర్తికి న్యాయపాలనలో సహాయపడటానికి ‘ఖాజీ’లు అనే న్యాయశాఖామంత్రులు, ఇతర ఉద్యోగులు ఉండేవారు. మహ్మదీయ మతానికి చెందిన వారైనా మొగలులు ఇతర మతాల విశ్వాసాలు, మత గ్రంథాల ప్రకారం తీర్పులు చెప్పేవారు. ముఖ్యంగా ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించడానికి అక్బర్‌ తన కాలంలో ఘరోకా-ఇ-దర్శన్‌ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. జహంగీర్‌ ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. సుబాలు, సర్కారులు, పరగణాల్లో కూడా ప్రత్యేక న్యాయాధికారులను నియమించి మొగలులు ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించారు.

సైనిక పాలన
మొగలుల కాలం నాటి సైనిక పద్ధతిని మున్సబ్‌దారీ పద్ధతిగా పేర్కొంటారు. ఈ విధానాన్ని అక్బర్‌ కాలంలో ప్రవేశపెట్టారు. సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో మున్సబ్‌దారులను నియమించారు. వాళ్లు సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మున్సబ్‌దారులకు వంశపారంపర్య హక్కులు లేవు. తరచూ బదిలీ అయ్యేవారు. మున్సబ్‌దార్‌ అంటే ఒక శ్రేణికి అధికారి అని అర్థం. 
అబుల్‌ ఫజల్‌ రచనల ప్రకారం నాటి మున్సబ్‌దారుల్లో సుమారు 33 తరగతులు ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 10 గుర్రాల నుంచి అధికంగా 10 వేల గుర్రాలను పోషించే 33 తరగతుల మున్సబ్‌దారులుండేవారని అబుల్‌ ఫజల్‌ రాశాడు. నాటి మున్సబ్‌దారీ విధానంలో జాత్‌ (హోదా), సవారీ (అదనపు అలవెన్స్‌) అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉండేవి. జహంగీర్‌ కాలంలో, అనంతరం షాజహాన్‌ కాలంలో మున్సబ్‌దారీ విధానంలో కొన్ని మార్పులు చేశారు. అనంతర కాలంలో మున్సబ్‌దారుల స్థానంలో జాగీర్దారులను నియమించారు. మరికొన్నిచోట్ల మున్సబ్‌దారులకే జాగీరులను కేటాయించారు.  అయితే మున్సబ్‌దారులందరూ జాగీర్దారులు కాదు. 

సామాజిక వ్యవస్థ  
మొగలుల కాలంనాటి సామాజిక వ్యవస్థ భూస్వామ్య లక్షణాలను కలిగి ఉండేదని ఆర్‌.సి. మజుందార్, రాయ్‌చౌదరి లాంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నాటి సమాజంలో ప్రభు, మధ్యతరగతి, సామాన్య అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ప్రభు వర్గంలో చక్రవర్తి, అంతఃపుర ఉద్యోగ బృందం; మధ్యతరగతి వర్గంలో జమీందారులు, జాగీర్దారులు, వృత్తి నిపుణులు ఉండేవారు. రైతులు, కూలీలు, కౌలు రైతులు, సేద్య బానిసలు లాంటి పేదవారు సామాన్య వర్గంలో ఉండేవారు. నాటి సామాజిక వ్యవస్థలో రైతులు, కూలీలు తీవ్రమైన దోపిడీకి గురయ్యేవారు. సమాజంలో బహుభార్యత్వం, వ్యభిచారం, సతీసహగమనం, పరదా పద్ధతి లాంటి సాంఘిక దురాచారాలు అధికంగా ఉండేవి. స్త్రీ విద్య అందుబాటులో లేదు.

 

సాంస్కృతిక వికాసం
మొగలులు తమ కాలంలో వాస్తు, కళ, విద్యా సారస్వతాల అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేశారు. ముస్లిం పాలకులైనా మొగలుల్లో ఔరంగజేబ్‌ మినహా అంతా పరమత సహనం పాటించారు. లౌకిక రాజ్యంగా ఉన్న భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఔరంగజేబ్‌ చేసిన ప్రయత్నాల వల్లే మొగల్‌ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. మొగలులు దేశవ్యాప్తంగా మదర్సాలు, పాఠశాలలను స్థాపించారు. కానీ స్త్రీ విద్యాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. చక్రవర్తులు తమ ఆస్థానంలో అనేకమంది కవి పండితులను పోషించారు. రాజభాష అయిన పారశీకంతోపాటు, హిందీ, సంస్కృతం, మరాఠీ లాంటి ప్రాంతీయ భాషల్లో కూడా చక్కటి సాహిత్య సృష్టి జరిగింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రారంభమైన ఇండో-ఇస్లామిక్‌ మిశ్రమ సంస్కృతి మొగలుల కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, వాస్తు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బాబర్‌ నుంచి షాజహాన్‌ వరకు వాస్తురంగంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు.ఉద్యానవనాలు, మసీదులు, కోటలు, దర్గాలు, రాజప్రసాదాలు లాంటి నిర్మాణాల్లో పర్షియన్‌ - భారతీయ వాస్తు విధానాలను అనుసరించారు. బాబర్‌తో ప్రారంభమైన ఉద్యానవనాల నిర్మాణం జహంగీర్, షాజహాన్‌ల కాలంలో ఉన్నత దశకు చేరింది. షాలిమార్‌ గార్డెన్స్, మొగల్‌ గార్డెన్స్‌ ప్రఖ్యాతి గాంచాయి. అక్బర్‌ కాలంలో ఫతేపూర్‌ సిక్రీలో నిర్మించిన కట్టడాలు, షాజహాన్‌ కాలంలో నిర్మించిన ఎర్రకోట, తాజ్‌మహల్‌ నిర్మాణాలు మొగలుల వాస్తు కళాపోషణకు దర్పణాలు. అలహాబాద్‌లో అక్బర్‌ పూర్తిగా హిందూ పద్ధతిలో నిర్మించిన 40 స్తంభాల భవనం చాలా ప్రసిద్ధిచెందింది. సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన తాన్‌సేన్, బైజుబావరా, బాజ్‌బహదూర్, రూపవతి లాంటి వారిని మొగలులు ఆదరించారు. చిత్రలేఖనంలో చక్రవర్తులు సైతం ప్రావీణ్యం పొందారు. జహంగీర్‌ సూక్ష్మ చిత్రలేఖనంలో నిష్ణాతుడు. హుమయూన్‌ తన ఆస్థానంలో పర్షియన్‌ చిత్రకారులను పోషించాడు. అక్బర్‌ కాలంలో ఖ్వాజా అబ్దుల్‌ సమద్‌ నాయకత్వంలో ప్రత్యేక చిత్రలేఖన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈవిధంగా మొగలుల కాలంలో సాహిత్యం, వాస్తు కళలు వర్ధిల్లాయి.

 

ఆర్థిక వ్యవస్థ
మొగలుల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని నూతన మార్పులు సంభవించాయి. పాలకులు వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల రంగాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. అందుకే, అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మొగల్‌ చక్రవర్తులు వ్యవసాయరంగ అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధవహించారు. రాజ్యంలో భూమి మొత్తం చక్రవర్తిదే అయినప్పటికీ వాస్తవ రూపంలో దాన్ని అనేకమంది అధీనంలో ఉంచారు. భూములకు సంబంధించి ఖుద్‌కాస్త్‌లు, పాహీలు, ముజారియమ్‌లు లాంటి అనేక రకాల పేర్లు వాడుకలో ఉండేవి. రాజ్యానికి లేదా చక్రవర్తికి చెందిన సొంత భూములను ఖలీఫా భూములని, రైతులకు చెందిన భూములను ఖుద్‌కాస్త్‌ భూములని పిలిచేవారు. పాహీలు, ముజారియమ్‌లను కౌలు రైతుల భూములుగా పరిగణించేవారు. జమీందారుల అధీనంలో కూడా కొన్ని భూములు ఉండేవి. నాటి జమీందారుల్లో  స్వయం ప్రతిపత్తి ఉన్న జమీందారులు, మధ్యంతరస్థాయి జమీందారులు, ప్రాథమికస్థాయి జమీందారులు అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ఈ విధంగా మొగలుల కాలంలో వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక మార్పులు ప్రవేశపెట్టారు. రైతాంగ అభివృద్ధికి, నీటిపారుదల సౌకర్యాల కల్పనకు, శిస్తు విధింపునకు పాలకులు కృషి చేశారు. అయితే, నాటి రైతులు జమీందారుల దౌర్జన్యానికి గురయ్యేవారు. అధిక పన్నులతో సామాన్యులు బాధపడేవారు.
                     నాటి వర్తక, వాణిజ్యాలను జాతీయ, అంతర్జాతీయ వర్తకాలుగా వర్గీకరించవచ్చు. దేశంలో జరిగే జాతీయ వర్తకంతోపాటు, పశ్చిమ ఆగ్నేయాసియా దేశాలతో జరిగే విదేశీ వర్తకం కూడా బాగా అభివృద్ధి చెందింది. భారతీయ నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు పాశ్చాత్య దేశాలను ఆకర్షించాయి. లాహోర్, ముల్తాన్‌ గొప్ప రవాణా కేంద్రాలుగా రూపొందాయి. 
విశాలమైన తీరప్రాంతం సముద్ర వ్యాపారానికి తోడ్పడింది. పట్టు, నూలు వస్త్రాలు, ఆయుధాలు, వజ్రాలు, చక్కెర లాంటివి ఎక్కువగా విదేశాలకు ఎగుమతయ్యేవి. బంగారం, కర్పూరం, విలాస వస్తువులను దిగుమతి చేసుకునేవారు. భారతదేశంలో పట్టణ కేంద్రాలు అధికంగా వృద్ధి చెందటం కూడా పట్టణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కారణమైంది. చిన్నచిన్న పట్టణాలు, సరాయిలు, కాస్బాలు కూడా స్థానిక మార్కెట్లుగా మార్పు చెందడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు లాంటి కారణాల వల్ల వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి.
                     నాడు గ్రామీణ చేతివృత్తులతోపాటు కుటీర పరిశ్రమలు, నూలు, పట్టు, వజ్రాలు, ఉన్ని లాంటి భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో హస్తకళాకారుడి కుటుంబం ఉత్పత్తికి ప్రథమస్థానంగా ఉండేది. వడ్రంగం, నేత, అద్దకం, కమ్మరం లాంటి గ్రామీణ చేతివృత్తులవారు అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసి, వివిధ వర్గాల అవసరాలు తీర్చేవారు. పత్తి, నూనె గింజలు, నీలిమందు లాంటి ఉత్పత్తులు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డాయి. కుమ్మరం, తోలు ఉత్పత్తులు పెరిగాయి. పాదరక్షలు, తోలు సంచుల తయారీ లాంటి కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన భారీ పట్టణ పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. బెంగాల్, గుజరాత్‌ ప్రాంతాల్లో జౌళి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. బెంగాల్, కోరమాండల్‌ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే లాంగ్‌క్లాత్, మస్లిన్‌ వస్త్రాలకు ఆసియా మార్కెట్లలో అధిక గిరాకీ ఉండేది. ఇత్తడి, రాగి, వజ్రాల పరిశ్రమలు వృద్ధి చెందాయి. మొగలుల కాలంలో పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రాంతాలు చక్కెర పరిశ్రమలకు, ఢిల్లీ రాగి పరిశ్రమకు, బెనారస్‌ ఇత్తడి పరిశ్రమకు; ఢాకా, అహ్మదాబాద్, జాన్‌పూర్‌ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధికెక్కాయి. బెర్నియార్‌ అనే ఫ్రెంచి యాత్రికుడు ‘పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి’ అని పేర్కొన్నాడు.

 

మొగలుల సాహితీసేవ

    మొగలుల కాలంలో ఆస్థాన చరిత్రలతోపాటు అనువాదానికి కూడా ప్రాధాన్యం లభించింది. అక్బర్‌ మక్తబ్‌ ఖానా పేరుతో అనువాద విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కాలంలో హిందీ సాహిత్యం కూడా వికసించింది. తులసీదాస్‌ రచించిన రామ్‌ చరిత్‌ మానస్‌ ఉత్తర భారతదేశంలో ఆరాధనీయ గ్రంథమైంది. షాజహాన్‌ పెద్ద కుమారుడు దారాషికో హిందూ మహ్మదీయ మతాల సారాన్ని  మజ్‌ మాఉల్‌బహ్రెయిన్‌ పేరుతో గ్రంథస్థం చేయడం విశేషం.

ఫుతూహత్‌-ఎ-ఆలంగీరి: దీన్ని రాసింది ఈసర్‌ దాస్‌ నాగర్‌. ఇతడు ఔరంగజేబ్‌ ప్రతినిధిగా జోధ్‌పూర్‌లో పనిచేశాడు. ఔరంగజేబ్‌ మొదటి 34 ఏళ్ల పాలనా కాలపు విశేషాలు ఉన్న ఈ పుస్తకం ఆ కాలపు మొగల్, రాజపుత్రుల సంబంధాల గురించి ప్రధానంగా సాగింది.

 

నుష్కా-ఎ-దిల్‌కుషా: ఇది కూడా ఔరంగజేబ్‌ చరిత్రను తెలిపే రచనే. భీమ్‌సేన్‌ దీని రచయిత. ఇతడు మొగల్‌ మన్సబ్‌దారు దల్‌పత్‌ రావ్‌ బుందేలా దగ్గర పేష్కారుగా పనిచేశాడు. క్రీ.శ.1700 నుంచి ఔరంగజేబ్‌ సేనలు మహారాష్ట్రలో చేసిన పోరాటాల కథనం ఇందులో ప్రధానం. సమకాలీన అధికారుల అవినీతి, మొగల్‌ సేనల దాడుల వల్ల మరాఠా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ‘నుష్కాఎదిల్‌ కుషా’లో వెల్లడించాడు. అయితే ఇది కూడా సత్యాన్ని పాక్షికంగానే తెలుపుతుంది. 

 

మాసీర్‌-ఎ-ఆలంగీరి: ఔరంగజేబ్‌ 40 ఏళ్ల పాలనను సంక్షిప్తంగా అందించే ఈ పుస్తకాన్ని రాసింది మహమ్మద్‌ సాకి ముస్తాయిద్‌ ఖాన్‌. ఔరంగజేబ్‌ దండయాత్రలు, అధికారుల నియామకం, బదిలీల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. దీన్ని సర్‌ జదునాథ్‌ సర్కార్‌ ‘‘మొగలుల రాజపత్రం’’గా పేర్కొన్నారు. ఔరంగజేబ్‌ గురించి వివరించే మరో గ్రంథం సుజన్‌ రావ్‌ ఖత్రీ రాసిన ‘ఖులాసత్‌ఉత్‌తవారిఖ్‌’.


అనువాదాలు 

రజ్మ్‌ నామా: అంటే యుద్ధాల పుస్తకం అని అర్థం. ఇది మహాభారతానికి పర్షియా అనువాదం (తర్జుమాఎమహాభారత్‌). అనువాద బృందానికి అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూనీ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాడు. అనువాదం పూర్తయ్యాక అక్బర్‌ దీనికి చిత్రాలు కూడా గీయించాడు.

* రామాయణాన్ని అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూని, అధర్వణ వేదాన్ని హాజీ ఇబ్రహీం సర్హిందీ, లీలావతిని (గణితశాస్త్ర పుస్తకం) పైజీ, తుజుక్‌ఎబాబరీని అబ్దుల్‌ రహీం ఖాన్‌ఎఖానన్‌ పర్షియా భాషలోకి అనువదించారు. ఇవే కాకుండా రాజాస్థానంలో గజళ్లు, ఖసీదాలు తదితర కవితా ప్రక్రియలు వికసించాయి.
అక్బర్‌ కాలంలో హిందీ సాహిత్యం కూడా ఆదరణ పొందింది. అబ్దుల్‌ రహీం ఖాన్‌ఎఖానన్‌ దోహాలనే ద్విపదలను రచించాడు. నరహరి అనే పండితుడికి అక్బర్‌ ‘మహాపాత్ర్‌’ అనే బిరుదునిచ్చాడు. ప్రసిద్ధ హిందీ కవులకు ‘కవిరాయ్‌’ అనే బిరుదును ఇచ్చి గౌరవించేవారు. 
* బీర్బల్‌కు (అసలు పేరు మహేశ్‌ దాస్‌) అక్బర్‌ కవి ప్రియ అనే బిరుదు ఇచ్చాడు. రస్‌ఖాన్‌ ‘ప్రేమ్‌ వార్తికా’ అనే హిందీ కావ్యం రచించాడు. ఇది కృష్ణభక్తికి సంబంధించింది. తులసీదాస్‌ విరచిత ‘రామ్‌ చరిత్‌ మానస్‌’ ఉత్తర భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. దీన్ని ‘‘వంద మిలియన్ల హిందూస్థాన్‌ ప్రజల పాలిటి బైబిల్‌’’ అని జార్జి గ్రియర్సన్‌ ప్రశంసించాడు.


అమీర్‌ ఖుస్రూ 

కవి, చరిత్రకారుడు, సంగీత విద్వాంసుడైన అమీర్‌ ఖుస్రూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పటియాలిలో క్రీ.శ.1252లో జన్మించాడు. బాల్బన్‌ మొదలు ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ వరకు వివిధ ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో ఉన్నాడు. పర్షియన్, హిందీ, ఉర్దూ భాషల్లో ఖుస్రూ రచనలు సాగాయి. ఈయన ఢిల్లీలోని ప్రసిద్ధ చిష్తీ సాధువు నిజాముద్దీన్‌ ఔలియా శిష్యుడు. అమీర్‌ ఖుస్రూ బిరుదు ‘‘తూతీఎహింద్‌’’  (భారతదేశపు చిలుక). అమీర్‌ ఖుస్రూ రచనా శైలిని ‘సబాక్‌ ఎ హింద్‌’ అంటారు.

* అమీర్‌ఖుస్రూ మొదటి చరిత్ర రచన కిరాన్‌ఉస్‌సాదిన్‌. ఇది మామెలుక్‌ సుల్తాన్‌ కైకుబాద్‌ కాలపు రచన. ఇక ఖజైన్‌ఉల్‌ఫుతూహ్‌లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్, చిత్తోడ్‌గఢ్, మాల్వా, దక్కన్, వరంగల్‌ దండయాత్రలు, భారతదేశం మీదికి జరిగిన మంగోల్‌ దాడుల గురించి వివరించాడు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రణథంబోర్‌ను ముట్టడించినప్పుడు, అక్కడి రాజపుత్ర స్త్రీల  ‘‘జౌహార్‌’’(మూకుమ్మడిగా చితి పేర్చుకుని మరణించడం) గురించి తెలిపాడు. ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ చరిత్రను వివరిస్తూ ‘‘తుగ్లక్‌ నామా’’ రచించాడు. అమీర్‌ ఖుస్రూ ఇతర రచనలు నూహ్‌ సిపార్, మిఫ్తా ఉల్‌ ఫుతూహ్, దేవలరాణి ఖిజిర్‌ఖానీ. 

సంగీతం విషయానికి వస్తే, అమీర్‌ ఖుస్రూ ఖవ్వాలీ ప్రక్రియను అభివృద్ధి చేశాడు. సితార్, తబలాను ఈయనే మొదటగా తయారు చేశాడని అంటారు. క్రీ.శ.1325లో మరణించిన అమీర్‌ ఖుస్రూను నిజాముద్దీన్‌ ఔలియా దర్గా ప్రాంగణంలోనే ఖననం చేశారు.

 

పద్మావత్‌: మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ ప్రసిద్ధ రచన. జాయసీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని జాయస్‌లో జన్మించాడు. మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ షేర్షా కాలపు కవి. అవధీ మాండలికంలో (హిందీ) ఉన్న ఈ రచన ప్రధానంగా సూఫీ ప్రేమతత్వానికి చెందింది. ఇందులో సుప్రసిద్ధ పద్మావతి (పద్మిని) కథ ఉంది. పద్మావతి చిత్తోడ్‌ రాణా రతన్‌ సింగ్‌ భార్య. ఈమె అందం గురించి తెలుసుకున్న అప్పటి ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ను ముట్టడించాడని చెబుతారు. అయితే చరిత్రకారులు దీన్ని వ్యతిరేకించారు. చిత్తోడ్‌ గుజరాత్‌ వెళ్లే మార్గం మీద ఉండటంతో ఖిల్జీ దండయాత్ర చేశాడనేది చరిత్రకారుల వాదన.


దారాషికో: మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ పెద్ద కొడుకు. సూఫీ మార్మికవాది. ఇతడు హిందూ, ఇస్లాం మతాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాడు. రెండు మతాల సారాన్ని క్రోడీకరిస్తూ ‘‘మజ్‌ మాఉల్‌బహ్రెయిన్‌’’ (రెండు సముద్రాల సంగమం) పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఇంకా కొన్ని ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించి, వాటిని ‘‘సిర్‌ఎఅక్బర్‌’’ పేరుతో సంకలనం చేశాడు. మొగల్‌ సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరులో క్రీ.శ.1659లో ఔరంగజేబ్‌ చేతిలో దారాషికో మరణించాడు.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కడ‌ప‌టి మొగ‌లుల పాల‌న‌

   భారతదేశ చరిత్రలో మొగల్ సామ్రాజ్యానికి విశిష్ట స్థానం ఉంది. 300 సంవత్సరాల ఢిల్లీ సుల్తానుల పాలనను అంతమొందించడమే కాకుండా భారత ఉపఖండంలో నూతన శకం ఆరంభానికి మొగలులు నాంది పలికారు. సువిశాల సామ్రాజ్యం, పటిష్టమైన సైన్యం, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక ప్రగతిని సాధించడం ద్వారా వీరు భారతీయ సంస్కృతి ఔన్నత్యానికి దోహదపడ్డారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ కడపటి మొగలుల అధికార దాహం, విలాస జీవనం, అసమర్థ పాలనతో సామ్రాజ్యం పతనమైంది. ఔరంగజేబు మరణించే నాటికి(క్రీ.శ.1707) మొగల్ సామ్రాజ్య విస్తీర్ణం ఉచ్ఛ స్థితికి చేరుకుంది. 21 రాష్ట్రాలు ఉండేవి. ఔరంగజేబు మరణానంతరం మొగల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు నలుగురు గొప్ప మొగలులు 151 సంవత్సరాలు పరిపాలించారు. అయితే మొదటి బహదూర్‌షా నుంచి రెండో షా ఆలం వరకు 11 మంది కడపటి మొగలులు 100 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. అంటే కడపటి మొగలులు ఒక్కొక్కరూ సగటున 10 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేకపోయారు. వ్యక్తిత్వం, సామ్రాజ్య విస్తీర్ణం తదితర అంశాల్లో ముందుతరం మొగలులకు, కడపటి మొగలులకు పోలికే లేదు.

మొదటి బహదూర్‌షా (1707- 1712)
ఔరంగజేబు మరణానంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. చివరికి కాబూల్ గవర్నర్‌గా ఉన్న మువజ్జం వారసత్వ యుద్ధంలో నెగ్గి బహదూర్ షా పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు సిక్కుల గురువు గోవింద్‌సింగ్‌ను మొగలుల సర్వీసులోకి తీసుకోవడం ద్వారా సిక్కులు, మొగలులకు మధ్య ఉన్న వైరానికి తెరదించాడు. అయితే తర్వాతి సిక్కు గురువు బందా బహదూర్ మొగలులపై తిరుగుబాటు చేశాడు. బహదూర్‌షా స్వయంగా యుద్ధం చేసినప్పటికీ సిక్కులను అణిచివేయలేక పోయాడు. అదే సమయంలో మొగలుల చెరలో ఉన్న శంభాజీ కొడుకు సాహును చెర నుంచి విడిపించాడు. ఔరంగజేబు విధించిన జిజియా పన్నును రద్దు చేశాడు. మేవార్, మార్వార్ రాజ్యాల స్వాతంత్య్రాన్ని గుర్తించాడు. బుందేలు నాయకుడు ఛత్రసాల్, జాట్‌ల నాయకుడు చూరమాన్‌లను మొగల్ పరిధిలోకి తీసుకోవడం ద్వారా వారితో వైరం తొలగిపోయింది. క్రీ.శ. 1712లో బహదూర్‌షా మరణాంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. వారు తండ్రి శవానికి దహన క్రియలు చేయడం కూడా మరచి వారసత్వ యుద్ధంలో మునిగిపోయారు. చివరికి పెద్ద కుమారుడు జహందర్‌షా వారసత్వ యుద్ధంలో గెలిచాడు. 10 వారాల తర్వాత బహదూర్‌షాకు వారు అంత్యక్రియలు నిర్వహించారు.

జహందర్‌షా (1712 - 1713)
వారసత్వ యుద్ధంలో జుల్ఫికర్‌ఖాన్ మద్దతుతో జహందర్‌షా విజయం సాధించాడు. ఇతడి కాలంలో జహందర్‌షా భార్య లాల్‌కున్వర్ పారిపాలనా విషయాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఆమె రక్త సంబంధీకులు రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు. మొగలుల పరువు, ప్రతిష్ఠలు దిగజారాయి. ఇతడి కాలంలో తురానీలు, ఇరానీలు, హిందుస్థానీలు అనే మూడు వర్గాలు ఉండేవి. తురానీలు సున్నీ శాఖకు చెందిన వారు కాగా, ఇరానీలు షియా శాఖకు చెందినవారు.

ఫరూక్‌సియార్ (1713 - 1719)
ఇతడు జహందర్ షా సోదరుడి కుమారుడు. సయ్యద్ సోదరుల సహకారంతో సింహాసనాన్ని అధిష్టించాడు. దీనికి ప్రతిఫలంగా చక్రవర్తి సయ్యద్ అబ్దుల్లాఖాన్‌ను వజీర్‌గా, అతడి తమ్ముడు హుస్సేన్ అలీఖాన్‌ను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. ఫరూక్ సియార్ ఉత్తర్వుల మేరకు జుల్ఫికర్ ఖాన్‌ను వధించారు. సయ్యద్ సోదరులు తమ స్థానంలో వేరేవారిని చక్రవర్తి నియమించకుండా ఉండటం కోసం  బంధీలుగా ఉన్న రాకుమారులందరి కళ్లు తీయించారు. తర్వాత చక్రవర్తి, సయ్యద్ సోదరుల మధ్య తగాదా ప్రారంభమైంది. చివరికి ఫరూక్‌సియార్‌ను సయ్యద్ సోదరులు చంపేసి, రఫీ ఉద్దరజత్‌ను చక్రవర్తిగా నియమించారు. అయితే అతడు నాలుగు నెలల్లోనే మరణించాడు. తర్వాత అతడి అన్న రఫీ ఉద్దౌలాను రెండో షాజహాన్ పేరుతో సింహాసనంపై కూర్చోబెట్టారు.

మహమ్మద్‌షా (1719 - 1748)
రెండో షాజహాన్ 1719 సెప్టెంబరులో మరణించాడు. అతడి స్థానంలో రౌషాన్ అక్తర్‌ను మహమ్మద్ షా అనే బిరుదుతో సయ్యద్ సోదరులు సింహాసనంపై కూర్చోబెట్టారు. నిజాం ఉల్ ముల్క్, ఇతిమద్ ఉద్దౌలా, సాదత్‌ఖాన్, మహమ్మద్‌షా తల్లి కూటమిగా ఏర్పడి సయ్యద్ సోదరులను చంపడానికి కుట్ర పన్నారు. 1720లో సయ్యద్ హుస్సేన్ అలీఖాన్, అతడి కుమారుడిని దక్కనులో చంపించారు. నెల తర్వాత అతడి సోదరుడు అబ్దుల్లా ఖాన్‌ను బంధించి విష ప్రయోగంతో హతమార్చారు. సయ్యద్ సోదరుల మరణం తర్వాత మొగల్ సామ్రాజ్య పతనం మరింత వేగవంతమైంది. మహమ్మద్‌షా వయసు సింహాసనాన్ని అధిష్టించేనాటికి 18 సంవత్సరాలు మాత్రమే. ఇతడు నిరంతరం రాజప్రసాదం నాలుగు గోడల మధ్య అంతఃపుర స్త్రీల సాంగత్యంలో గడిపాడు. విలాసాలకు బానిస కావడంతో 'రంగీలాగా పేరుగాంచాడు. ఇతడు మహమ్మద్ అమీన్‌ఖాన్‌ను వజీర్‌గా నియమించాడు. 1721లో అమీన్‌ఖాన్ మరణం తర్వాత నిజాం ఉల్‌ముల్క్‌ను ఆ స్థానంలో నియమించాడు. ఇతడు సంస్కరణల ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ప్రయత్నించాడు. అయితే చక్రవర్తి ఇతడికి పరోక్షంగా ఇబ్బందులు కల్పించాడు. దీంతో విసిగిపోయిన నిజాం ఉల్‌ముల్క్ వజీర్ పదవిని వదలిపెట్టి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని 1724లో స్థాపించాడు. ముర్షీద్ కులీఖాన్ బెంగాల్‌లో, సాదత్‌ఖాన్ అవధ్‌లో స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. మాల్వా, గుజరాత్‌లు మొగల్ సామ్రాజ్యం నుంచి విడిపోయాయి.

నాదిర్షా దండయాత్ర (1738 - 1739)
ఇరాన్ నెపోలియన్‌గా పేరు పొందిన నాదిర్షా భారతదేశంపై 1738-39లో దండయాత్ర చేశాడు. 1738లో కాబూల్, జలాలాబాద్, పెషావర్‌లను ఆక్రమించాడు. 1739లో లాహోర్ ఇతడి ఆధీనమైంది. నిజాం ఉల్‌ముల్క్, కమీరుద్దీన్, ఖాన్-ఇ-దౌరాన్, సాదత్‌ఖాన్‌లు నాదిర్షాను అడ్డుకున్నారు. ఫిబ్రవరి 1739లో కర్నాల్ వద్ద మొగల్ సైన్యం ఓడిపోయింది. ఈ యుద్ధంలో ఖాన్-ఇ-దౌరాన్ మరణించాడు. సాదత్‌ఖాన్ సలహాతో నాదిర్షా 1739, మార్చి 20న ఢిల్లీపై దండెత్తాడు. రెండు రోజుల తర్వాత నాదిర్షా మరణించాడనే వదంతులు వచ్చాయి. మొగల్ సైనికులు 700 మంది నాదిర్షా సైనికులను చంపారు. దీంతో నాదిర్షా ఆదేశం మేరకు 20,000 మంది భారతీయులను చంపారు. నాదిర్షా ఢిల్లీలో 47 రోజులపాటు ఉండి ప్రతి ఇంటినీ దోచుకున్నాడు. ప్రసిద్ధిగాంచిన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం నాదిర్షా వశమయ్యాయి.

అహమ్మద్ షా అబ్దాలీ తొలి దండయాత్రలు
1747లో నాదిర్షా మరణానంతరం అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. అతడి ముఖ్య సైన్యాధ్యక్షుల్లో అబ్దాలీ తెగకు చెందిన అహ్మద్ అఫ్గనిస్థాన్‌కు పాలకుడిగా ప్రకటించుకున్నాడు. కాబూల్, కాందహార్‌లను ఆక్రమించి పెషావర్ చేరుకున్నాడు. తర్వాత సింధు నదిని దాటి లాహోర్, సర్‌హింద్‌లను 1748లో ఆక్రమించాడు. ఇతడి రెండో దండయాత్ర సమయంలో మహమ్మద్‌షా మరణించాడు.


అహమ్మద్ షా (1748 - 1754)
మహమ్మద్ షా తర్వాత అతడి కుమారుడు అహమ్మద్ షా చక్రవర్తి అయ్యాడు. ఇతడు మహమ్మద్ షా, ఒక నర్తకికి జన్మించాడు. అహమ్మద్‌షా మద్యపానం, స్త్రీలకు బానిసై పరిపాలననంతా తన తల్లి ఉద్ధంబాయికి అప్పగించాడు. ఈ కాలంలో అవధ్ నవాబు సఫ్దర్‌జంగ్ మొగల్ సామ్రాజ్యానికి వజీరుగా వ్యవహరించేవాడు. అహమ్మద్‌షా తల్లి ఇతడిని 1753లో ఆ పదవి నుంచి తొలగించి ఇతిజం ఉద్దౌలాను వజీర్‌గా నియమించింది. ఇతడు అహమ్మద్ షాను పదవీచ్యుతుడిని చేశాడు. తర్వాత అహ్మద్‌షాను, అతడి తల్లిని బంధించాడు.
అహమ్మద్ షా కాలంలో అహమ్మద్ షా అబ్దాలీ 1749, 1752లో భారతదేశంపై రెండు సార్లు దండెత్తాడు. ఢిల్లీ పతనం కాకుండా ఉండటం కోసం మొగల్ సుల్తాన్ అహ్మద్‌షా పంజాబ్, ముల్తాన్‌లను అహ్మద్‌షా అబ్దాలీకి అప్పగించాడు. ఇతడి కాలంలో మొగలుల కోశాగారం ఖాళీ అయ్యింది.


రెండో అలంఘీర్ (1754 - 1759)
అహమ్మద్ షా పదవీచ్యుతుడైన తర్వాత జహందర్ షా మనవడైన అజీజుద్దీన్ రెండో ఆలంఘీర్ బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడి కాలంలో మొగలుల సైనిక, ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారిపోయాయి. సైనికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వారి తిరుగుబాట్లు సర్వసాధారణమయ్యాయి. ఈ సమయంలో అహమ్మద్‌షా అబ్దాలీ భారతదేశంపై 1755లో నాలుగోసారి దండెత్తాడు. ఆలంఘీర్‌ను తన వజీర్ 1759 నవంబరులో హత్య చేశాడు.

రెండో షా ఆలం (1759 - 1806)
ఇతడు రెండో ఆలంఘీర్ కుమారుడు. ఇతడి అసలు పేరు అలీగౌహర్. రెండో షా ఆలం 1759లో సింహాసనాన్ని అధిష్ఠించినా, తన వజీరుకు భయపడి రాజధానిలో నివసించ లేదు. ఇదే సమయంలో అహమ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై అయిదోసారి దండెత్తాడు. చివరికి ఇది మూడో పానిపట్ యుద్ధానికి (1761, జనవరి 15) దారితీసింది. ఈ యుద్ధంలో అబ్దాలీ మరాఠాలతో పాటు మొగలులను కూడా  ఓడించాడు. రెండో షా ఆలం బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, అవధ్ నవాబు షుజా ఉద్దౌలాతో కలసి 1764లో 'బక్సార్ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడి ఓడిపోయాడు. అయితే 1772లో మరాఠాలు రెండో షా ఆలంను ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకున్నారు. అనంతరం నజీబుద్దౌలా 1788లో షాఆలం కళ్లు తీయించాడు. 1803లో బ్రిటిషర్లు ఢిల్లీని ఆక్రమించుకున్నారు. తర్వాత షాఆలం, అతడి వారసులు రెండో అక్బర్, రెండో బహదూర్‌షాలు బ్రిటిషర్ల పెన్షనర్లుగా జీవించారు. షాఆలం 1806లో మరణించాడు.

రెండో అక్బర్ (1806 - 1837) 
ఇతడు సంఘ సంస్కర్త అయిన రామమోహన్‌రాయ్‌కి 'రాజా అనే బిరుదునిచ్చాడు. రామమోహన్‌రాయ్ బ్రిటిషర్లు మొగలు చక్రవర్తికి ఇచ్చే పెన్షన్‌ను పెంచే విధంగా వారితో మాట్లాడటానికి ఇంగ్లండ్ వెళ్లాడు. 

రెండో బహదూర్ షా (1837 - 1857)

ఇతడు కడపటి మొగల్ చక్రవర్తుల్లో చివరివాడు. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఓడిపోయాడు. దీంతో అదే ఏడాది మొగలు చక్రవర్తి పదవిని బ్రిటిషర్లు నిషేధించి బహదూర్ షాను బంధించి, రంగూన్‌కు పంపారు. అతడు అక్కడే 1862లో మరణించాడు.

మొగలు సామ్రాజ్య పతనానికి కారణాలు
* ఔరంగజేబు కాలం నాటికి మొగల్ సామ్రాజ్యం నియంత్రించ లేనంతగా విస్తరించింది. ఈ సామ్రాజ్య విస్తరణ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించి యుద్ధాలు చేయడంతో ఖజానా ఖాళీ అయ్యింది.
* ఇతడు పరమత ద్వేషం పాటించడంతో అసంఖ్యాకులైన హిందువులతో వైరాన్ని పెంచుకున్నాడు. దీంతో జాట్లు, సిక్కులు, రాజపుత్రులు, మరాఠాలు తిరుగుబాట్లు చేశారు.
* ఇతడి దక్కను విధానం మొగలు సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైంది.
ఔరంగజేబు తర్వాత సింహాసనాన్ని అదిష్ఠించిన పాలకులంతా బలహీనులు కావడంతో సమస్యలను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేశారు.
* నాదిర్షా, అహమ్మద్ షా అబ్దాలి దండయాత్రలు మొగల్ సామ్రాజ్య పతనాన్ని వేగవంతం చేశాయి.
వ్యవసాయం, వ్యాపారం కుంటుపడటంతో రైతుల పరిస్థితి దిగజారి వారంతా తిరుగుబాటు చేశారు.
* మొగల్ సైన్యం బలహీన పడటానికి మరో ప్రధాన కారణం మున్సబ్‌దారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడం. ఈ విధానంలో అనేక లోపాలుండటంతో సైన్యంలో క్రమశిక్షణ కొరవడింది. సైనికులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడంతో వారు కూడా తిరుగుబాటు చేశారు.
* బ్రిటిషర్ల అధికారం పుంజుకోవడంతో మొగల్ సామ్రాజ్యం పతనమైంది. వీరు సుమారు 100 ఏళ్ల పాటు మొగలులతో పోరాడారు. చివరకు 1857లో సిపాయిల తిరుగుబాటులో మొగలులను పూర్తిగా ఓడించి చక్రవర్తి పదవిని నిషేధించారు.

 

మాదిరి ప్రశ్నలు
 

1. మొదటి బహదూర్‌షాపై తిరుగుబాటు చేసిన సిక్కుల గురువు ఎవరు?
జ: బందాబహదూర్


2. కిందివారిలో ఛత్రసాల్ ఎవరి నాయకుడు?
ఎ) జాట్‌లు బి) రాజపుత్రులు సి) బుందేలులు డి) సిక్కులు
జ: సి(బుందేలులు)


3. మొదటి బహదూర్‌షా అసలు పేరు?
జ: మువజ్జం


4. జహందర్ షా ఎవరి మద్దతుతో మొగలు చక్రవర్తి అయ్యాడు?
జ: జుల్ఫికర్ ఖాన్


5. ఏ మొగల్ చక్రవర్తిని సయ్యద్ సోదరులు హతమార్చారు?
జ: ఫరూక్‌సియార్


6. సయ్యద్ సోదరులను ఏ మొగల్ చక్రవర్తి కాలంలో చంపేశారు?
జ: మహమ్మద్ షా


7. 'రంగీలా'గా పేరు పొందిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: మహమ్మద్ షా


8. ఏ ప్రాంతంలో నిజాం ఉల్ ముల్క్ స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు?
జ: హైదరాబాద్


9. కింది వారిలో 'ఇరాన్ నెపోలియన్‌'గా పేరుగాంచింది ఎవరు?
ఎ) అహమ్మద్ షా అబ్దాలీ బి) మొదటి డేరియస్ సి) నాదిర్షా డి) ఇతిమద్ ఉద్దౌలా
జ: సి(నాదిర్షా)


10. నాదిర్షాకు, మొగల్ సైన్యానికి మధ్య 1739 ఫిబ్రవరిలో యుద్ధం ఎక్కడ జరిగింది?
జ: కర్నాల్


11. అహమ్మద్‌షా అబ్దాలీ ఏ తెగకు చెందినవాడు?
జ: అబ్దాలి


12. రెండో అలంఘీర్ అసలు పేరు?
జ: అజీజుద్దీన్


13. మూడో పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1761

Posted Date : 10-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంఘ సంస్కరణోద్యమాలు

 ఆనాటి సమాజంలో ఎన్నెన్నో దురాచారాలు.. సతీసహగమనం, బాల్యవివాహాలు, బహుభార్యత్వం, వితంతువులపై ఆంక్షలు, దేవదాసీ విధానం, అంటరానితనం.. ఇవన్నీ సమాజాన్ని పట్టి పీడిస్తుంటే వారి గుండె రగిలింది. కట్టుబాట్ల పేరుతో మహిళలు, అణగారిన వర్గాల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే.. అలాంటి దురాచారాలను రూపుమాపడానికి నడుం బిగించారు నాటి సంఘ సంస్కర్తలు. వీరి దృఢ సంకల్పానికి నాటి పాలకులు కూడా కొందరు గట్టి మద్దతు ఇవ్వడంతో చాలామేర సమాజంలో మార్పును తీసుకురాగలిగారు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతిబా ఫూలే తదితరులంతా ఈ సంఘసంస్కరణోద్యమ నిర్మాతలే.. ఇలాంటి మహానుభావులపై అధ్యయన సమాచారం పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం..
        స్వాతంత్య్రానికి పూర్వం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలైన బాల్యవివాహాలు, బహుభార్యత్వం, సతీసహగమనం, దేవదాసీ విధానం, అంటరానితనం లాంటివాటిని రూపుమాపడానికి సంఘ సంస్కర్తలు ఎంతో కృషి చేశారు. కొందరు మొగల్, బ్రిటిష్ పాలకులు కూడా ఇలాంటి ఆచారాలకు వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశారు.. చర్యలు చేపట్టారు.. అక్బర్ చక్రవర్తి, పీష్వాలు సతీసహగమనంపై ఆంక్షలు విధించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్స్ కారన్ వాలిస్, మింటో, లార్డ్ హేస్టింగ్స్‌లు నాటి ప్రజల సాంఘిక, ఆచార వ్యవహారాల్లో తలదూర్చరాదని భావించినా, సతీసహగమనాన్ని సమాజం నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టారు. ఈ దురాచారాన్ని ప్రోత్సహించడాన్ని, గర్భిణులు సతీసహగమనానికి పాల్పడటాన్ని నిషేధించారు. అలాగే 16 సంవత్సరాల లోపు వయసున్న వితంతువులు సతీసహగమనం చేయడాన్ని ఆపడం.. సతీసహగమనానికి సిద్ధం చేస్తున్న సమయాల్లో పోలీసులు హాజరై, బలవంతంగా ఆ దురాచారాన్ని జరపడాన్ని నిరోధించడం.. లాంటి చర్యల ద్వారా కొంత అడ్డుకట్ట వేయగలిగారు.  రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా 1829లో అప్పటి వైస్రాయి విలియం బెంటింక్ సతీసహగమన నిషేధ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం మొదట్లో బెంగాల్ ప్రెసిడెన్సీకి మాత్రమే వర్తింపజేసినా, కొన్ని మార్పులతో 1830లో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల్లో కూడా అమలు చేశారు. బెంగాలీలు, రాజపుత్రుల్లో ఆడపిల్లలను చిన్నప్పుడే చంపేసే మరో దురాచారం ఉండేది. 1795లో రూపొందించిన బెంగాల్ రెగ్యులేషన్ - XXI చట్టం, 1804లో చేసిన రెగ్యులేషన్ చట్టం - III.. ద్వారా ఈ దురాచారాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించారు. 1870లో రూపొందించిన చట్టం పుట్టిన పిల్లల నమోదును తప్పనిసరి చేసింది.     బ్రహ్మసమాజం వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించింది. పండిట్ ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాల కోసం పోరాడారు. ఆయన కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం 1856లో హిందూ వితంతు పునర్‌వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. విద్యాసాగర్ బాల్యవివాహాలను, బహుభార్యత్వాన్ని వ్యతిరేకించారు. స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు. మహారాష్ట్రలోని డి.కె.కార్వే, ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్‌వివాహాల కోసం కృషి చేశారు. ఈ లక్ష్యంతోనే వీరేశలింగం 1878లో 'రాజమండ్రి సాంఘిక సంస్కరణ సంస్థ'ను స్థాపించారు. కార్వే 1899లో పుణెలో వితంతు సదన్‌ను స్థాపించారు. 1916లో భారతదేశంలో మొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించారు. లోకహితవాదిగా ప్రసిద్ధి చెందిన గోపాల హరి దేశ్‌ముఖ్ మహారాష్ట్రలో సంఘ సంస్కరణలకు నడుం కట్టారు.  మహదేవ గోవింద రనడే ప్రార్థన సమాజంలో ప్రముఖ సభ్యుడు. రనడే స్ఫూర్తితో గోపాల గణేష్ అగార్కర్ 1884లో పుణెలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. రనడేను గోపాలకృష్ణ గోఖలే తన గురువుగా పేర్కొన్నారు. గోపాలకృష్ణ గోఖలే 1905లో బొంబాయిలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపింటచారు. మాతృభూమికి సేవ చేయడానికి వీలుగా భారతీయులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 1872లో రూపొందించిన స్వదేశీ వివాహ చట్టం కనీస వివాహ వయసును బాలికలకు 14 ఏళ్లు, బాలురకు 18 ఏళ్లుగా నిర్ణయించింది. అయితే ఈ చట్టం హిందువులు, ముస్లింలు, ఇతర గుర్తింపు పొందిన మతాలవారికి వర్తించకపోవడంతో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. పార్శీ సంఘ సంస్కర్త బి.ఎం.మలబారి కృషి వల్ల 1891లో ఏజ్ ఆఫ్ కన్సెన్ట్ యాక్ట్‌ను రూపొందించారు. ఈ చట్టం 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలకు వివాహం చేయడాన్ని నిషేధించింది. 1849లో జె.ఇ.డి.బెత్యూన్ కలకత్తాలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో 35 బాలికల పాఠశాలలు స్థాపించారు.      1833లో బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని నిషేధించారు. 1843లో భారతదేశంలో బానిసత్వాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించారు. 1860లో రూపొందించిన పీనల్ కోడ్ బానిస వ్యాపారాన్ని చట్ట విరుద్ధం చేసింది.  సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో ముఖ్య సభ్యుడైన నారాయణ మల్హర్ జోషి 1911లో సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. సామాన్య ప్రజలకు నాణ్యతతో కూడిన జీవితాన్ని, పనిని అందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ అనేక పాఠశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, బాలుర క్లబ్బులు, స్కౌట్లను స్థాపించింది. ఈ సంస్థలో మరో ముఖ్య సభ్యుడైన హృదయనాథ్ కుంజు అలహాబాద్‌లో 1914లో సేవాసమితి అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. విద్యావ్యాప్తి, సహకారం, పరిశుభ్రత, అణగారిన వర్గాల అభ్యున్నతి, నేరగాళ్లలో మార్పు తీసుకురావడానికి ఈ సంస్థ కృషి చేసింది.   పాశ్చాత్య విద్యనభ్యసించిన దాదాభాయ్ నౌరోజీ, జె.బి.వాచా, ఎస్.ఎస్.బంగాలి, నౌరోజీ ఫిర్దోంజీ లాంటి పార్శీలు 1851లో 'రహనుమయి మజ్‌దయసనన్ సభ' అనే సంస్థను ప్రారంభించారు. పార్శీల సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం, జొరాస్ట్రియన్ మతాన్ని సంస్కరించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు. వీరు రాస్త్‌గోఫ్తార్ అనే వారపత్రికను నడిపారు.
    రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, జె.ఇ.డి.బెత్యూన్, కందుకూరి వీరేశలింగం, మహదేవ గోవింద రనడే, పడింత రమాబాయి, డి.కె.కార్వే లాంటివారు స్త్రీ విద్య, వారి అభ్యున్నతికి ఎంతో శ్రమించారు. కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్థిని పత్రికను స్థాపించారు. 1874లో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. 1878లో దేవదాసీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.
మహదేవ గోవింద రనడే, ఆయన భార్య రమాబాయి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. రమాబాయి వితంతువుల కోసం బొంబాయి, పుణె దగ్గర ముక్తి వద్ద శారదా సదన్‌ను ప్రారంభించారు. భారతదేశంలో మొదటిసారిగా వితంతువులకు విద్యను నేర్పించిన ఘనత ఆమెకే దక్కింది. ముస్లింలలో క్వాజా అల్తాఫ్ హుస్సేన్ అలీ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా, బేగం రొకియా సఖావత్ హుస్సేన్ ముస్లిం బాలికల విద్య కోసం పాటుపడ్డారు.
    మాతాజీ మహారాణి తపస్వినిగా పేరుగాంచిన గంగాబాయి దక్కన్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ మహిళ. ఆమె కలకత్తాలో స్థిరపడి 1893లో మహాకాళి పాఠశాలను ప్రారంభించారు.
     మద్రాసు ప్రెసిడెన్సీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మొదటి వితంతువు సిస్టర్ సుబ్బలక్ష్మి. సమాజంలో ఎవరూ పట్టించుకోని బాల వితంతువులను గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఆమె భావించారు. మద్రాసు ప్రెసిడెన్సీలో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 22,000 మంది వితంతువుల కోసం వితంతు శరణాలయాలు, బాలికల పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను స్థాపించారు. సుబ్బలక్ష్మి భారత మహిళల సంఘం, అఖిల భారత మహిళల సదస్సుల్లో కీలకపాత్ర పోషించారు. బాల్యవివాహాల నిరోధక బిల్లు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.
   పండిత రమాబాయి 'ఆర్య మహిళా సమాజ్‌'ను స్థాపించారు. పార్శీ మహిళలు స్త్రీ జర్తోస్తి మండల్‌ను; 1910లో అలహాబాద్‌లో సరళాదేవి చౌదరాని భారత్ స్త్రీ మహామండల్‌ను ప్రారంభించారు. ఐర్లాండుకు చెందిన స్త్రీవాద రచయిత్రి, దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలు దొరోతి జన రాజదాస 1915లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు. అనిబిసెంట్ దీనికి మొదటి అధ్యక్షురాలయ్యారు. ఈ సంస్థ వయోజన స్త్రీలకు విద్య, దుస్తులు కుట్టడం, ప్రాథమిక చికిత్స లాంటివాటిలో శిక్షణ ఇవ్వడానికి అనేక కేంద్రాలను స్థాపించింది. 1917లో స్త్రీలకు ఓటుహక్కు ఇవ్వాలని కోరుతూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. స్త్రీ ధర్మ అనే పత్రికను స్థాపించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఇండియా అనే సంస్థను 1925లో మెహ్రీబాయి టాటా స్థాపించారు.
   మార్గరెట్ కజిన్స్ కృషి ఫలితంగా 1927లో అఖిల భారత మహిళల సదస్సును ఏర్పాటు చేశారు. 1941లో రోష్నీ అనే పత్రికను ప్రారంభించారు. 1927లో మద్రాసు శాసనమండలికి ముత్తులక్ష్మీరెడ్డి తొలి మహిళా శాసన మండలి సభ్యురాలిగా నియమితులయ్యారు. దేశంలో వివిధ మహిళా సంఘాలు స్త్రీలకు ఓటుహక్కు ఇవ్వాలని డిమాండు చేశాయి. 1935 - భారత ప్రభుత్వ చట్టం మహిళలకు పరిమితంగా ఓటుహక్కును కల్పించింది.
పశ్చిమ భారతదేశంలో జ్యోతిరావ్ గోవిందరావ్ ఫూలే నిమ్నజాతుల కోసం పోరాడారు. ఆయన 1827లో పుణెలో జన్మించారు. జ్యోతిరావ్ 'మాలి' అనే కులానికి చెందినవారు. వీరి కుటుంబం పీష్వాలకు పూలు, దండలు సరఫరా చేయడంతో వీరు ఫూలేగా పేరుపొందారు.
   ఒకసారి బ్రాహ్మణ వివాహ ఊరేగింపులో పాల్గొన్న ఫూలేను వారంతా అవమానించారు. ఆయన నిమ్న కులాల స్త్రీల కోసం పాఠశాల నడపడాన్ని వారు వ్యతిరేకించి అడ్డుకోవడంతో పూలే ఆ పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది.
ఆగ్రకులాల ఒత్తిడి వల్ల జ్యోతిబా, ఆయన భార్య ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మతం సాకుతో బ్రాహ్మణులు మిగతా కులాలవారిని అణిచివేశారని, బానిసలుగా మార్చారని జ్యోతిబా అభిప్రాయ పడ్డారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు బలహీనవర్గాల ప్రయోజనాలను పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నిమ్న, వెనుకబడిన కులాల సంక్షేమం గురించి పట్టించుకోనంతవరకు కాంగ్రెస్‌ను జాతీయపార్టీగా పేర్కొనలేమని స్పష్టంగా చెప్పారు. 1873లో సత్య శోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. సమాజంలో బలహీనవర్గాల వారికి సామాజిక న్యాయాన్ని అందించాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఫూలే 'గులాంగిరీ', 'స్వారజనిక్ సత్యధర్మ పుస్తక్' అనే రెండు గ్రంథాలను రచించారు. అంటరానివారు, బ్రాహ్మణేతర కులాల మధ్య వ్యత్యాసం లేదన్నారు. వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు వారి గ్రంథాల సహాయంతో సామాన్యులను తక్కువ కులానికి చెందినవారిగా ప్రకటించి వారిని దోపిడీ చేశారని జ్యోతిబా భావించారు. ఫూలే అన్ని కులాలకు చెందిన పిల్లలు, స్త్రీల కోసం అనేక పాఠశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించారు. 1876లో పుణె మున్సిపల్ కమిటీ సభ్యుడిగా ఫూలే ఎన్నికయ్యారు. 1888లో ఆయన్ని మహాత్మ బిరుదుతో సత్కరించారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితంగా 1894లో తమకు సైన్యంలో ఎక్కువ ఉద్యోగాలు, క్షత్రియ హోదాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

మాదిరి ప్రశ్నలు
1. కామన్వెల్త్ పత్రికను ఎవరు స్థాపించారు?
ఎ) తిలక్ బి) బిపిన్ చంద్రపాల్ సి) అనిబిసెంట్ డి) గాంధీజీ
జ: (సి)

 

2. యంగ్ బెంగాల్ ఉద్యమ స్థాపకుడు ఎవరు?
ఎ) ఎం.జి.రనడే బి) ఆనంద మోహన్ బోస్ సి) హెన్రీ వివియన్ డిరోజియో డి) రాధాకాంత్ దేవ్
జ: (సి)

 

3. ధర్మసభ స్థాపకుడు ఎవరు?
ఎ) రాధాకాంత్ దేవ్ బి) ఆత్మారాం పాండురంగ సి) కేశవ చంద్రసేన్ డి) హెచ్.ఎన్.కుంజూ
జ: (ఎ)

 

4. దేవ సమాజం స్థాపకుడు ...
ఎ) కె.శ్రీధరులు నాయుడు బి) శివనారాయణ అగ్నిహోత్రి సి) రాజారామ్మోహన్‌రాయ్ డి) ఎవరూకాదు
జ: (బి)

 

5. కిందివారిలో వితంతు వివాహాల కోసం కృషి చేసినవారు ఎవరు?
ఎ) విలియం బెంటింక్ బి) ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ సి) కారన్ వాలిస్ డి) మింటో
జ: (బి)

 

6. భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) అన్నాదురై బి) నందమూరి తారకరామారావు సి) డి.కె.కార్వే డి) జ్యోతిబా ఫూలే
జ: (సి)

 

7. గోపాలకృష్ణ గోఖలే ఎవరిని తన గురువుగా పేర్కొన్నారు?
ఎ) గాంధీజీ బి) గోపాల గణేష్ అగార్కర్ సి) ఎం.జి.రనడే డి) బెత్యూన్
జ: (సి)

 

8. 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' స్థాపకుడు ఎవరు?
ఎ) గోపాల హరి దేశ్‌ముఖ్ బి) పండిత రమాబాయి సి) బి.ఎం.మలబారి డి) గోపాలకృష్ణ గోఖలే
జ: (డి)

 

9. రహనుమయ్ మజ్‌దయ్ సనన్ సభతో సంబంధం లేనివారు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ బి) జె.బి.వాచా సి) ఎస్.ఎస్.బంగాలీ డి) హెచ్.ఎన్.కుంజూ
జ: (డి)

 

10. శారదా సదన్ స్థాపకులు ఎవరు?
ఎ) పండిత రమాబాయి బి) గంగాబాయి సి) సిస్టర్ సుబ్బలక్ష్మి డి) మార్గరెట్ కజిన్స్
జ: (ఎ)

 

11. మద్రాసు శాసనమండలిలో మొదటిసారి సభ్యురాలిగా నియమితురాలైన మహిళ ఎవరు?
ఎ) ముత్తులక్ష్మిరెడ్డి బి) సుబ్బలక్ష్మిరెడ్డి సి) శ్రీలతారెడ్డి డి) సమీరారెడ్డి
జ: (ఎ)

 

12. సత్యశోధక సమాజాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) జ్యోతిబా ఫూలే బి) డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సి) గాంధీజీ డి) త్యాగరాజ చెట్టియార్
జ: (ఎ)

 

13. 'ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్' మొదటి అధ్యక్షురాలు ఎవరు?
ఎ) దొరోతి జన రాజదాస బి) అనిబిసెంట్ సి) మార్గరెట్ కజిన్స్ డి) లలితా చౌదరి
జ: (బి)

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సంస్కరణోద్యమాలు

    భారత్‌లో 19వ శతాబ్దంలో సమాజోద్ధరణ దిశగా రూపుదాల్చిన అనేక సంస్కరణోద్యమాలు భారతీయుల జీవన విధానంపై విశేష ప్రభావాన్ని చూపాయి. రాజా రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి, సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ లాంటి ప్రముఖులెందరో ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మూఢ సంప్రదాయాలు, అంధ విశ్వాసాలను రూపుమాపేందుకు వీరంతా కృషి చేశారు. ఫలితంగా భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పులు తర్వాతి తరాలకు ఎంతో మేలు చేశాయి. నాటి సామాజిక, మత సంస్కరణ ఉద్యమాల చారిత్రక అధ్యయన సమాచారాన్ని చదవండి మరి!
   19వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల విద్యావ్యాప్తి.. క్రైస్తవ మిషనరీల మత ప్రచారం.. ఐరోపాలో ప్రారంభమైన ఉదార, హేతువాద, మానవతావాద ఉద్యమాలు భారతీయులపై ప్రభావం చూపాయి. ఇవన్నీ తమ సామాజిక, మత వ్యవస్థల గురించి భారతీయులు పునరాలోచించేలా చేశాయి. ఈ ప్రభావంతో తలెత్తిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల జీవన విధానాన్ని మార్చాయి. వారిలో ఐకమత్యం, దేశభక్తిని పెంపొందించాయి. భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు మొదట బెంగాల్, తర్వాత పశ్చిమ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. భారత్‌లో పునరుజ్జీవన ఉద్యమపితగా రాజా రామ్మోహన్ రాయ్‌ని పేర్కొంటారు.

బ్రహ్మ సమాజం

    బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్‌లోని బర్డ్వాన్ జిల్లా రాధానగర్‌లో జన్మించారు. 1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని ఉద్దేశం. హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆధునిక విద్యావ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో రెగ్యులేషన్ XVII ద్వారా సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు. బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు.
దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. కానీ బ్రిటిష్ పాలన పట్ల మాత్రం కొంత సానుకూల వైఖరితో ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు. రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు రాయ్ 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లాడు. బ్రిటిష్‌వారు ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రామ్మోహన్ రాయ్ ద్వారా మొగలు చక్రవర్తి కోరాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు.

'రాజా' అనంతరం..
మహర్షి ద్వారకనాథ్ ఠాగూర్, పండిట్ రామచంద్ర విద్యావాగిష్‌లు రామ్మోహన్ రాయ్ మరణానంతరం పదేళ్లపాటు బ్రహ్మ సమాజాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ద్వారకనాథ్ ఠాగూర్ పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ బాధ్యతలు చేపట్టారు. దేవేంద్రనాథ్ బ్రహ్మ సమాజంలో చేరక ముందు కలకత్తా(1831)లో తత్త్వబోధిని సభను స్థాపించారు. గొప్ప రచయిత, విద్యావేత్త అయిన అక్షయ్‌కుమార్ దత్తా 1840లో తత్త్వబోధిని పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్ మిత్రా, తారాచంద్ చక్రవర్తి, పియరీచంద్ మిత్ర చేరారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తత్త్వబోధిని అనే మాసపత్రికను బెంగాలీ భాషలో ప్రచురించారు. దేవేంద్రనాథ్ 80 మంది అనుచరులతో 1843 డిసెంబరు 21న బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా చేరారు. అలెగ్జాండర్ డఫ్ భారతీయ సంస్కృతిపై చేసిన దాడిని దేవేంద్రనాథ్ సమర్థంగా తిప్పికొట్టారు. దేవేంద్రనాథ్ రెండేళ్ల(1856-58) పాటు సిమ్లా వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలోనే కేశవచంద్రసేన్ (1857లో) బ్రహ్మ సమాజంలో చేరి ఆయన కుడిభుజంగా మారారు. 1859లో యువకులతో కూడిన సంగత్ సభను స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం అప్పటి ఆధ్యాత్మిక, సామాజిక సమస్యల గురించి చర్చించడం.
1861లో కేశవచంద్ర సేన్ సంపాదకుడిగా ఇండియన్ మిర్రర్ అనే పక్ష పత్రికను స్థాపించారు. ఇది తర్వాతి కాలంలో భారతదేశంలో ఆంగ్లంలో ప్రచురితమైన మొదటి దినపత్రికగా పేరొందింది. క్షామం, అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో ఆయన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మ సమాజాన్ని దేశమంతా విస్తరించడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కృషి ఫలితంగా మద్రాసులో వేద్ సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్‌లు ఏర్పాటయ్యాయి.


బ్రహ్మ సమాజంలో చీలికలు
కేశవచంద్ర సేన్ చేపట్టిన కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు, పరదా పద్ధతి తొలగింపు లాంటి కార్యక్రమాలు పాతతరం వారికి నచ్చలేదు. దీంతో 1866లో బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ వర్గం 'ఆది బ్రహ్మసమాజ్‌'గా, కేశవచంద్ర సేన్ వర్గం 'బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా (నవ విధాన్)'గా విడిపోయాయి. 1870లో కేశవచంద్ర సేన్ ఇంగ్లండ్ వెళ్లొచ్చాక మరింత ఉత్సాహంతో సాంఘిక సంస్కరణలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 1872లో ప్రభుత్వంతో చర్చించి బ్రహ్మ వివాహ చట్టాన్ని తీసుకురావడం ద్వారా బ్రహ్మ సమాజం నిర్వహించే వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ఆయన ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను స్థాపించారు. పాశ్చాత్య విద్యావ్యాప్తి; స్త్రీల అభ్యున్నతి, విద్యావ్యాప్తి; సామాజిక కార్యక్రమాలకు ఈ సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది. కేశవచంద్ర సేన్ 1878లో తన కుమార్తెను కూచ్ బిహార్ పాలకుడికి ఇచ్చి వివాహం చేశారు. చట్టబద్ధంగా నిర్ణయించిన కనీస వివాహ వయసు కంటే వధూవరులిద్దరి వయసు తక్కువ. అంతేకాకుండా ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇది పూర్తిగా బ్రహ్మవివాహ చట్టానికి వ్యతిరేకం. దీంతో బ్రహ్మ సమాజంలో మరో చీలిక వచ్చింది. ఆనందమోహన్ బోస్ నాయకత్వంలో సాధారణ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. దక్షిణ భారతదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటివారు బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

ఆర్య సమాజం

ఆర్య సమాజ స్థాప‌కుడు స్వామి దయానంద సరస్వతి. ఆయన అసలు పేరు మూల్‌శంకర్. 1824లో గుజరాత్‌లోని మోర్వి సమీపంలోని టంకారా అనే ప్రదేశంలో జన్మించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో విరజానందుడు అనే అంధ సన్యాసి దగ్గర వేదాలు, ధర్మ శాస్త్రాలు, స్మృతులు అభ్యసించారు. దయానంద సరస్వతి 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. విరజానందుడు హిందూమతంలోని దురాచారాలను తొలగించాలని దయానందుడిని కోరారు. వేదాలకు తిరిగి వెళదాం.. మొత్తం జ్ఞానానికి వేదాలే ఆధారం.. అనేవి వీరి నినాదాలు. తర్వాతి కాలంలో పంజాబ్‌లోని లాహోర్ ఆర్య సమాజ ప్రధాన కేంద్రంగా మారింది. ఆర్య సమాజం సిద్ధాంతాలను పంజాబ్‌లో ప్రచారం చేయడంలో దయానందుడు సఫలీకృతుడయ్యాడు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కొంతవరకు ఆర్య సమాజ ప్రభావం వ్యాపించింది. హిందూ మతంలో విగ్రహారాధన, మూఢ విశ్వాసాలకు కారణమైన పురాణాలను దయానందుడు తిరస్కరించాడు. ఆర్యసమాజం వైదిక మతాన్ని పునరుద్ధరించి, జాతీయతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేసింది. పాశ్చాత్య విద్యావిధానం వ్యాప్తికి తోడ్పడింది. బాలబాలికలకు విద్యనందించడానికి ఆర్యసమాజం దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) పాఠశాలలను స్థాపించింది. చాతుర్వర్ణ విధానం జన్మ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉండాలని ఈ సమాజం భావించింది. సామాజిక, విద్యా రంగాల్లో స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని కోరింది. అంటరానితనం, కుల వ్యత్యాసాలు, బాల్య వివాహాలను వ్యతిరేకించింది. వితంతు పునర్వివాహాలు, కులాంతర వివాహాలను సమర్థించింది. ఆర్య సమాజం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు వివాదాస్పదమయ్యాయి. వీటిలో మొదటిది - 1882లో దయానందుడు ప్రారంభించిన గోరక్ష ఉద్యమం. గోరక్షణ కోసం నిధులు సేకరించి, గోవులను వధించకుండా అడ్డుకోవడం లాంటి కార్యకలాపాలను చేపట్టారు. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. రెండోది - ఇతర మతాల్లోకి చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి దయానందుడు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ఎక్కువ సంఖ్యలో హిందువులను, ముఖ్యంగా అణగారిన వర్గాలవారిని క్రైస్తవ మతంలోకి మార్చాయి. వీరిని తిరిగి హిందువులుగా మార్చడానికి చేసిందే శుద్ధి ఉద్యమం.

రామకృష్ణ మిషన్, మఠం
వివేకానందుడు 1897లో పశ్చిమ బెంగాల్‌లోని బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం సమాజసేవ చేయడం. దీనిద్వారా అనేక పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించి, పేద ప్రజలకు సహాయం చేశారు. ఆయన 1887లో పశ్చిమబెంగాల్‌లోని బారానగర్‌లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీనిద్వారా తన గురువైన             రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేశారు. 1898 నుంచి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలకు బేలూరు ప్రధాన కేంద్రం అయ్యింది. రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. ఆయన 1836లో పశ్చిమబెంగాల్, హుగ్లీ జిల్లాలోని కామర్‌పుకుర్ అనే గ్రామంలో జన్మించారు. మానవ సేవే మాధవ సేవ అనేది రామకృష్ణుడి నినాదం. వేదాంత, ఉపనిషత్తుల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. రామకృష్ణుడికి సూఫీ మత గురువు ఇస్లాం మతదీక్షను అనుగ్రహించారు. కాళీమాత, కృష్ణుడు, బుద్ధుడు, సిక్కు గురువులను ఆయన పూజించేవారు. బైబిల్ పఠనాన్ని వినేవారు. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన కలకత్తాలో 1863లో జన్మించారు. మొదటిసారి 1881లో రామకృష్ణ పరమహంసను కలిశారు. భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించి, ప్రజల వాస్తవ స్థితిగతులను తెలుకున్నారు. వివేకానందుడు మానవులందరిలో దైవత్వం ఉందని, ప్రతి వ్యక్తిలోనూ శక్తి సామర్థ్యాలున్నాయని, ఎవరినీ తక్కువగా చూడరాదని బోధించారు. అనారోగ్యం కారణంగా అతి చిన్న వయసులోనే (1902) ఆయన మృతి చెందారు.

దివ్యజ్ఞాన సమాజం

రష్యాకు చెందిన హెచ్.పి.బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ 1875లో న్యూయార్క్‌లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. వీరు 1879లో భారతదేశానికి వచ్చి, 1882లో మద్రాసు సమీపంలోని అడయార్ వద్ద దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు.
ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ లండన్‌లోని దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆమె 1893లో మనదేశానికి వచ్చి, 1907లో ఆల్కాట్ మరణం తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు. విశ్వమానవులందరిలో సోదర భావాన్ని పెంపొందించడం, ప్రాచీన మతాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం ఈ సమాజం ప్రధాన లక్ష్యాలు.
హిందూ మతసూత్రాలను బోధించడానికి అనిబిసెంట్ 1898లో వారణాసిలో సెంట్రల్ హిందూ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాతి కాలంలో మదన్‌మోహన్ మాలవీయ కృషి ఫలితంగా ఇది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా (1916) అభివృద్ధి చెందింది.


అలీగఢ్ ఉద్యమం
ఉత్తర ప్రదేశ్‌లోని బరేలికి చెందిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. హేతువాదం ప్రాతిపదికగా ఇస్లాం మతాన్ని సమర్థిస్తూనే, ముస్లిం సమాజంలోని బహు భార్యత్వాన్ని, బానిస వ్యవస్థను విమర్శించారు. ముస్లింలకు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో 1875లో అలీగఢ్‌లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. అది 1920లో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది.

ముఖ్యాంశాలు
* రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని 1828లో స్థాపించాడు.
మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదు ఇచ్చాడు.
* స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఆయన అసలు పేరు మూల్‌శంకర్.
* వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన 1863లో జన్మించారు. 1881లో రామకృష్ణ పరమహంసను తొలిసారి కలిశారు.
* వివేకానందుడి గురువైన రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ ఆయన 1836లో జన్మించారు.
* వివేకానందుడు రామకృష్ణ మఠం (1887), రామకృష్ణ మిషన్ (1897)లను స్థాపించాడు.
* 1875లో దివ్యజ్ఞాన సమాజాన్ని రష్యాకు చెందిన హెచ్.పి. బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ స్థాపించారు.
ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చారు. 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు.

 

మాదిరి ప్రశ్నలు

1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూ మత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టిందెవరు?
ఎ) దేవేంద్రనాథ్ ఠాగూర్ బి) కేశవచంద్ర సేన్ సి) దయానందుడు డి) రామ్మోహన్ రాయ్
జ: (ఎ)

 

2. 'వేదాంత సూత్రాలు' గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి ఎవరు?
ఎ) వివేకానందుడు బి) వీరేశలింగం సి) దేవేంద్రనాథ్ ఠాగూర్ డి) రాధాకాంత్ దేవ్
జ: (ఎ)

 

3. కామన్వెల్త్ పత్రికను స్థాపించింది ఎవరు?
ఎ) తిలక్ బి) బిపిన్‌చంద్రపాల్ సి) అనిబిసెంట్ డి) గాంధీజీ
జ: (సి)

 

4. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) రామ్మోహన్ రాయ్ బి) వివేకానందుడు సి) దయానందుడు డి) కేశవచంద్ర సేన్
జ: (సి)

 

5. ఆర్య సమాజ ప్రభావం ఏ రాష్ట్రంపై ఎక్కువ?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) మహారాష్ట్ర సి) పంజాబ్ డి) గుజరాత్
జ: (సి)

 

6. రామకృష్ణ పరమహంస భార్య పేరేమిటి?
ఎ) శారదాప్రియ బి) శారదామణి సి) శ్రీలత డి) హర్షిత
జ: (బి)

 

7. కింది వారిలో పశ్చిమ భారతదేశంలో పునరుజ్జీవన పితగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు?
ఎ) ఎం.జి. రనడే బి) బి.ఎం. మలబారి సి) ఆర్.జి. భండార్కర్ డి) కె.టి. తెలాంగ్
జ: (ఎ)

 

8. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బి) దయానందుడు సి) రాధాకాంత్ దేవ్ డి) కేశవచంద్ర సేన్
జ: (బి)

 

9. శ్రద్ధానందుడు గురుకుల విద్యాల యాలను ఎక్కడ ప్రారంభించాడు?
ఎ) లాహోర్ బి) బొంబాయి సి) హరిద్వార్ డి) కలకత్తా
జ: (సి)

 

10. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను ఎవరు స్థాపించారు?
ఎ) దయానందుడు బి) వివేకానందుడు సి) కేశవచంద్ర సేన్ డి) రామ్మోహన్ రాయ్
జ: (సి)

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బ్రిటిష్ హయాంలో శిస్తు విధానాలు

    బ్రిటిష్ హయాంలో అమలు చేసిన భూమిశిస్తు విధానాలు భారత రైతుల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేశాయి. వ్యవసాయమే ప్రజల ప్రధాన జీవనాధారమైన రోజుల్లో.. ఆంగ్లేయుల శిస్తు విధానాలు గ్రామీణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపాయి. భారత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 3 రకాల శిస్తు విధానాలు అమలు చేయగా.. కొద్దో గొప్పో రైతులకు భూ యాజమాన్య హక్కులను కల్పించడం మినహా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఏ విధానమూ దోహదపడలేదు. జమీందార్లకు, బ్రిటిషర్లకు మాత్రం సంపద వనరులుగా ఆ విధానాలు మారాయి. బ్రిటిష్ కాలంలోని భూమిశిస్తు విధానాలు, వాటి ప్రభావ ఫలితాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
    బ్రిటిష్‌వారు రాక ముందు భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితం. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. వస్త్రాలు, పంచదార, నూనె పరిశ్రమలు వ్యవసాయంపై ఆధారపడి ఉండేవి. బ్రిటిష్ పాలన ప్రారంభమైన 50 సంవత్సరాలకే భూయాజమాన్యం, భూమిశిస్తు మదింపు - వసూలు పద్ధతులు స్వయం సమృద్ధిగా ఉన్న భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి.


జమీందారీ / శాశ్వత శిస్తు విధానం
ఈ విధానాన్ని బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి డివిజన్, ఉత్తర కర్ణాటకల్లో అమలు చేశారు. బ్రిటిష్ ఇండియా మొత్తం భూభాగంలో ఈ విధానం 19 శాతం అమలైంది. ఈ పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వం జమీందారులనే ఒక కొత్త తరగతిని సృష్టించి వారిని భూయజమానులుగా ప్రకటించింది. వారు భూమి శిస్తును వసూలు చేసి, అందులో 1/10 నుంచి 1/11వ వంతు తమ వాటాగా తీసుకుని, మిగిలిన మొత్తాన్ని కంపెనీ ప్రభుత్వానికి అందజేయాలి. ఈ విధానంలో జమీందారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమిశిస్తును నిర్ణయించారు. అయితే జమీందారులు కౌలు రైతుల నుంచి వసూలు చేసే భాటక రేటును మాత్రం నిర్ణయించలేదు. దీన్ని జమీందారుల ఇష్టానికే వదలిపెట్టారు. ఈ నిర్ణయం జమీందారులు రైతులను వీలైనంత ఎక్కువగా దోచుకోవడానికి అవకాశం కల్పించింది. జనాభా, వ్యవసాయ భూమి, ధరలు పెరగడంతో జమీందారుల పరిస్థితి మెరుగుపడింది. కొత్త జమీందారుల్లో ఎక్కువమంది పాత భూయాజమాన్య తరగతికి చెందినవారు కారు. పాత జమీందారులను మోసగించిన సేవకులు, కంపెనీ ప్రభుత్వంతో సంబంధమున్న ఏజెంట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని గుమస్తాలు, వ్యాపారులు, న్యాయవాదులు లాంటివారంతా జమీందారులుగా మారారు. ఈ విధానంలో జమీందారులు ప్రభుత్వానికి నిర్ణీత భూమిశిస్తును క్రమం తప్పకుండా చెల్లించాలి. జమీందారులు చెల్లించాల్సిన శిస్తును పెంచే అధికారం ప్రభుత్వానికి లేదు. అలాగే ఈ శిస్తు చెల్లింపులో ఎలాంటి మినహాయింపు లేదా వాయిదా వేయడానికి అవకాశం లేదు. ఈ చర్యలు.. భూస్వాములు బీడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చి ఉత్పత్తిని పెంచడానికి, ప్రభుత్వానికి శాశ్వత ఆదాయాన్ని సమకూర్చడానికి దోహదపడతాయని కారన్ వాలీస్ వాదించాడు. అయితే జమీందారుల వారసత్వ హోదాను అంగీకరించడం ద్వారా వ్యవసాయదారుల ప్రయోజనాలను పూర్తిగా పక్కకు నెట్టేశారు. భూస్వాముల దయాదాక్షిణ్యాలపై రైతులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారన్ వాలీస్ అభిప్రాయాలను అతడి సలహాదారులైన జాన్ షోర్, చార్లెస్ గ్రాంట్ లాంటివారు వ్యతిరేకించారు. భూమిశిస్తు మదింపునకు ముందు సమగ్ర సర్వే చేపట్టాలని షోర్ భావించాడు. కారన్ వాలీస్ తర్వాత గవర్నర్ జనరల్ అయిన షోర్ శాశ్వత శిస్తు విధాన మొదటి దశ ఫలితాలకు సాక్షిగా నిలిచాడు. జమీందారులు భూమి నుంచి వచ్చే ఆదాయంలో అధిక భాగం అనుభవించడంతో.. కౌలుదారుల ఆర్థిక పరిస్థితి దిగజారింది. వారు పేదరికంతో సతమతమయ్యారు. సరైన ఎరువులు, విత్తనాలు వాడకపోవడంతో వ్యవసాయం దెబ్బతింది. జాతీయవాదులతోపాటు, బ్రిటిష్ విద్యావేత్తలు జమీందారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ దుస్థితిని, కౌలు రైతుల పేదరికాన్ని గుర్తించారు.

రైత్వారీ విధానం
బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన మరో భూమిశిస్తు విధానం రైత్వారీ విధానం. ఈ పద్ధతిని థామస్ మన్రో, కెప్టెన్ రీగ్ మొదట తమిళనాడులో ప్రవేశపెట్టారు. నెమ్మదిగా ఈ విధానం మహారాష్ట్ర, తూర్పు బెంగాల్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కూర్గ్‌లకు విస్తరించింది. ఈ విధానంలో రైతులకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు. వారు నేరుగా ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించాలి. ఈ విధంగా రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి. భూమిని కొలిచి ఉత్పత్తిని అంచనా వేయడం, ఉత్పత్తిలో 55 శాతాన్ని ప్రభుత్వ డిమాండ్‌గా నిర్ణయించడం ఈ విధానంలో ప్రధాన లక్షణాలు. ఈ విధానం కూడా క్షేత్రస్థాయిలో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. రైత్వారీ విధానంలో జమీందారులకు బదులు రైతే భూమి యజమాని అయినప్పటికీ.. రైతు పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ విధానం విఫలమైంది. ప్రభుత్వం రైతుల నుంచి శిస్తు రూపంలో అధికంగా వసూలు చేయడంతో భూమి విలువ పడిపోయింది. కఠిన భూమిశిస్తు విధానం వల్ల రైతులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేయడంతో రైతులు అప్పుపై వడ్డీ మాత్రం అతి కష్టం మీద చెల్లించేవారు.
ప్రధాన లక్ష్యాలు: క్రమం తప్పకుండా భూమిశిస్తు వసూలు చేయడం, రైతుల పరిస్థితిని మెరుగుపరచడం అనేవి ప్రధాన లక్ష్యాలు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితి మారలేదు. రైతు భూమిశిస్తు చెల్లించినంత కాలం అతడిని తొలగించడానికి వీల్లేదన్నది ఈ విధానంలోని ఒక నిబంధన. అయితే అధిక భూమిశిస్తును చెల్లించడం రైతుకు ఇబ్బందికరంగా మారింది. థామస్ మన్రో భూమిశిస్తుగా నిర్ణీత మొత్తాన్ని వసూలు చేసి.. అదనంగా వచ్చే ఆదాయం రైతుకే చెందాలని భావించాడు. 1855 తర్వాత రెవెన్యూ అధికారులు భూమిశిస్తును తమ ఇష్టానుసారం నిర్ణయించారు. దీంతో వ్యవసాయ దిగుబడి తగ్గింది. వ్యవసాయదారులు అప్పుల పాలయ్యారు.


మహల్వారీ విధానం
జమీందారీ, రైత్వారీ విధానాలు పాలకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో.. వాటి స్థానంలో మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ విధానంలో భూమిశిస్తు మదింపునకు ఆధారం మహల్ లేదా ఎస్టేట్ నుంచి వచ్చే ఉత్పత్తి. ఈ మహల్‌లోని యజమానులంతా సంయుక్తంగా ప్రభుత్వానికి భూమిశిస్తు చెల్లించడానికి బాధ్యత వహించాలి. యజమానుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఎంపిక చేసిన వారి ప్రతినిధులు మహల్ నిర్వహణ, శిస్తు చెల్లింపునకు బాధ్యులుగా ఉంటారు. ఇందులో యాజమాన్య హక్కులు రైతులకు వ్యక్తిగతంగా ఉంటాయి. కానీ ప్రభుత్వానికి శిస్తు చెల్లించే బాధ్యత మాత్రం రైతులందరికీ సంయుక్తంగా ఉంటుంది. గ్రామం మొత్తం ఆ గ్రామపెద్ద ద్వారా భూమి శిస్తును చెల్లిస్తారు. ఈ విధానాన్ని మొదట ఆగ్రా, అవధ్‌లో ప్రవేశపెట్టారు. తర్వాత యునైటెడ్ ప్రావిన్స్‌లోని మిగతా ప్రాంతాలకు విస్తరించారు. ఈ పద్ధతిలో.. జమీందారీ విధానంలో మాదిరిగా ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం సమకూరుతుంది. అలాగే రైత్వారీ విధానంలో మాదిరిగా రైతుకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి, రైతుకు మధ్య లంబార్దార్ల(మధ్యవర్తులు)ను సృష్టించినా వీరికి బెంగాల్ జమీందారుల్లా పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వలేదు. అయితే అమల్లో ఈ విధానం కూడా పెద్ద రైతులకే మేలు చేసింది. దీంతో భూస్వాములు, రైతుల మధ్య సాంఘిక, ఆర్థిక అసమానతలు పెరిగాయి. రైతుల పరిస్థితి ఆర్థికంగా బాగా దిగజారింది. రైతుల నుంచి శిస్తు ఎక్కువగా వసూలు చేశారు. దీనివల్ల వ్యవసాయం అభివృద్ధి చెందలేదు. ఇది తాత్కాలిక విధానం కావడం వల్ల స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. చివరకు ఈ విధానం గ్రామీణ సమూహాలు విచ్ఛిన్నం కావడానికి కారణమైంది.

శిస్తు విధాన ఫలితాలు
ఈ శిస్తు విధానాలు బ్రిటిష్‌వారు సృష్టించిన భూస్వాములకు శిస్తు వసూలు అధికారాన్ని కట్టబెట్టడానికి ఎక్కువ శ్రద్ధ చూపాయి. ఈ భూస్వాములు వ్యవసాయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వీరు విదేశీ పాలకుల ఏజెంట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వానికి నిర్ణీత భూమిశిస్తును చెల్లించి రాజకీయంగా రక్షణ లేని, ఆర్థికంగా బలహీనులైన రైతులను దోచుకునే హక్కును పొందారు. నూతన సామాజిక తరగతులకు చెందిన భూస్వాములు, వర్తకులు, వడ్డీ వ్యాపారులకు ప్రాధాన్యం పెరిగింది. బ్రిటిష్ రెవెన్యూ విధానం 19వ శతాబ్దంలో వాణిజ్య పరమైన వ్యవసాయాన్ని పెంపొందించింది. దేశంలో జనాభా క్రమంగా పెరిగింది. దీనివల్ల భూమి మీద ఒత్తిడి పెరిగింది. కుటీర పరిశ్రమలు నాశనం కావడం కూడా దీనికి తోడైంది. బలమైన చట్టాలను ప్రవేశపెట్టడం, న్యాయస్థానాల ఏర్పాటు, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడటం, బ్రిటిష్ వస్తువుల దిగుమతులు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో బయటి వ్యక్తుల జోక్యం బాగా పెరిగింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వయం సమృద్ధి క్రమంగా కనుమరుగైంది. గ్రామాల్లో అధికారం క్రమంగా గ్రామపెద్దల నుంచి ప్రభుత్వ ఏజెంట్ల చేతిలోకి మారింది. బ్రిటిష్‌వారి నూతన భూమిశిస్తు విధానాలు రైతులు పండించే పంట రకాలపై ప్రభావం చూపాయి. బ్రిటిష్‌వారు రాకముందు రైతులు పండించిన పంటను తమ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత భూమిశిస్తును నగదు రూపంలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో రైతులు పంటను మార్కెట్‌లో విక్రయించి, వచ్చిన డబ్బుతో శిస్తు చెల్లించడం ప్రారంభించారు. గ్రామాల్లో రైతులు తమ భూమిలో పండించడానికి అనువైన ఏదో ఒక పంటను ఎన్నుకునేవారు. వీటిలో పత్తి, జనుము, గోధుమ, చెరకు, నూనెగింజలు, నీలిమందు, నల్లమందు మొదలైనవి ప్రధానంగా ఉండేవి. దీంతో భారతీయ రైతు అంతర్జాతీయ పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి దళారులపై ఆధారపడాల్సి వచ్చింది.

జమీందారీ విధానం
రాబర్ట్ క్లైవ్ 1765లో బెంగాల్‌లో దివానీ (రెవెన్యూ వసూలు) హక్కును పొందిన తర్వాత.. సంవత్సరానికి ఒకసారి భూమిశిస్తు నిర్ణయించే పద్ధతి అమల్లో ఉండేది. వారన్ హేస్టింగ్స్ దీన్ని 5 సంవత్సరాలకు మార్చాడు. అయితే మళ్లీ సంవత్సరానికి ఒకసారి నిర్ణయించే పద్ధతినే అనుసరించాడు. కారన్ వాలీస్ కాలంలో 1790, ఫిబ్రవరి 10న పది సంవత్సరాలకు ఒకసారి భూమిశిస్తును నిర్ణయించే విధానాన్ని ప్రకటించాడు. మూడేళ్ల తర్వాత ఈ విధానాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారు. తర్వాత దీన్నే 1793, మార్చి 22న 'శాశ్వత శిస్తు నిర్ణయ విధానం'గా ప్రకటించారు. ఈ పద్ధతిని మొదట బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో ప్రవేశపెట్టారు. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని జమీందారులతో చేసుకోవడం వల్ల దీనికి 'జమీందారీ విధానం' అనే పేరు వచ్చింది. ఈ విధానంలో ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులను భూయజమానులుగా గుర్తించి, భూమిశిస్తు వసూలు చేసే అధికారాన్ని వారికి శాశ్వతంగా కట్టబెట్టింది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బ్రిటిష్ పాలనలో రైతు ఉద్యమాలు

  బ్రిటిష్ హయాంలో పరిపాలనా విధానం గ్రామీణ భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వ్యవసాయ రంగంలో కొత్తగా భూమిశిస్తు విధానాలు వచ్చాయి. దాంతో నూతన సామాజిక తరగతులు ఆవిర్భవించాయి. జమీందార్లు, వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి రైతులు వెళ్లిపోయారు. బ్రిటిష్ పాలన ప్రారంభమైన కొన్ని దశాబ్దాల్లోనే రైతులు అణిచివేతకు, దోపిడీకి గురయ్యారు. భూమిశిస్తును పెంచడం, వడ్డీ వ్యాపారుల దురాగతాలు, తోటల యజమానుల దోపిడీ లాంటి వాటికి వ్యతిరేకంగా రైతులు నిరసనలు, తిరుగుబాట్లు, ఉద్యమాలు చేపట్టారు. ఇవి ప్రధానంగా భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, విదేశీయులకు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ఉద్యమాలు స్థానిక సమస్యల నుంచి ఉద్భవించాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, నాయకత్వ లేమి కారణంగా ఇవి దేశవ్యాప్త ఉద్యమాలుగా అవతరించలేకపోయాయి.

ఫకీర్ సన్యాసి తిరుగుబాట్లు
బిక్షాటనతో జీవించే ఫకీర్లు, సన్యాసులకు బెంగాల్‌లో సంభవించిన తీవ్ర కరవు వల్ల ఆహారం దొరకలేదు. దీంతో సన్యాసులు బలవంతంగా ఆహారాన్ని పొందేందుకు ప్రయత్నించారు. 1770లో సంభవించిన గొప్ప కరవు తర్వాత వారు బెంగాల్‌పై దాడులు చేశారు. వీరితో పేద రైతులు, భూములు కోల్పోయిన భూస్వాములు, ఉద్యోగాలు కోల్పోయిన సైనికులు జత కలిశారు. బ్రిటిష్‌వారు ఈ తిరుగుబాట్లను అణిచివేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ తిరుగుబాటుకు మంజు షా ఫకీర్ నాయకత్వం వహించాడు.

సంతాలుల తిరుగుబాటు (1855-56)
శాంతికాముకులైన సంతాలులు మన్‌భం, బరాభం, హజారీభాగ్, మిడ్నాపూర్, బంకూర ప్రాంతాలకు చెందినవారు. శాశ్వత శిస్తు విధానం వల్ల వీరు తాము సాగుచేస్తున్న భూములను జమీందారులకు అప్పగించాల్సి వచ్చింది. జమీందారులు ఎక్కువ భాటకం డిమాండ్ చేయడంతో వారు తమ పూర్వీకులకు చెందిన ఇళ్లను వదలి రాజ్‌మహల్ కొండల ప్రాంతానికి చేరారు. అక్కడ అడవులను తొలగించి వ్యవసాయ భూమిగా మార్చారు. దీంతో దురాశపరులైన జమీందారులు ఈ భూమిని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నించారు. 1855 జూన్‌లో సంతాలులు సిద్ధు, కన్హు సోదరుల నాయకత్వంలో తమ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని, సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని నిశ్చయించుకున్నారు. 1856 ఫిబ్రవరిలో బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు నాయకులను అరెస్ట్ చేసి, తిరుగుబాటును క్రూరంగా అణిచివేసింది. సంతాలులకు ప్రత్యేకంగా సంతాల్ పరగణాను ఏర్పాటు చేయడం ద్వారా వారిని తమ దారిలోకి తీసుకొచ్చింది.

1857 తిరుగుబాటులో రైతుల పాత్ర
అవధ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు జమీందారుల అణిచివేత విధానాలను పక్కనపెట్టి వారితో కలిసి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ తిరుగుబాటులో క్రియాశీలకంగా పనిచేసిన రైతుల యాజమాన్య హక్కులను రద్దు చేస్తామని అప్పటి గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించడం ద్వారా ఈ తిరుగుబాటులో రైతులు పాల్గొనకుండా చేశారు.

నీలిమందు తిరుగుబాటు (1859-60)

ఐరోపాకు చెందిన నీలిమందు తోటల యజమానులు అంతగా ఆదాయం లేని నీలిమందును కొంత భూమిలో సాగుచేయాలని తూర్పు భారతదేశంలోని రైతులను బలవంతపెట్టారు. ఎదురించిన రైతులను అపహరించడం, అక్రమంగా నిర్బంధించడం, మహిళలు.. పిల్లలపై దాడి చేయడం, పశువులను ఎత్తుకెళ్లడం, పంటలను నాశనం చేయడం లాంటి అకృత్యాలకు పాల్పడ్డారు. చివరగా 1860లో నీలిమందు పండించకూడదని రైతులు నిర్ణయించి, ఉద్యమం చేపట్టారు. నాడియా జిల్లాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అచిర కాలంలోనే బెంగాల్ మొత్తానికి వ్యాపించింది. రైతులు నీలిమందు పరిశ్రమలపై, పోలీసులపై దాడులు చేశారు. రైతులు సమ్మె చేయడమే కాకుండా న్యాయస్థానంలో కేసులు వేయడానికి కావాల్సిన సొమ్మును విరాళాల ద్వారా సేకరించారు. నీలిమందు తోటల యజమానుల ఇళ్లలో పనిచేసేవారిని బలవంతంగా వారికి సేవలందించకుండా చేశారు. నీలిమందు రైతుల ఉద్యమానికి హరీశ్‌చంద్ర ముఖర్జీ (హిందూ పేట్రియాట్ పత్రిక సంపాదకులు) మద్దతు తెలిపారు. దీన్‌బంధు మిత్ర రచించిన 'నీల్‌దర్బణ్‌'లో తోటల యజమానుల అకృత్యాలను చక్కగా వివరించారు. భారతదేశంలో ఇది మొదటి రైతుల సమ్మె. 1867-68లో బిహార్‌లోని చంపారన్‌లో ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది.

దక్కను తిరుగుబాట్లు (1874-75)
మహారాష్ట్రలోని పుణె, అహ్మద్‌నగర్ జిల్లాల్లో రైత్వారీ విధానం అమల్లో ఉండేది. ఇక్కడ భూమి శిస్తు ఎక్కువగా ఉండేది. వరుసగా కరవులు సంభవించినా రైతులు భూమిశిస్తును తప్పనిసరిగా చెల్లించాలి. అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా 1860-64 మధ్యలో పత్తి రైతులు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా లాభాలు ఆర్జించారు. అయితే 1864లో అంతర్యుద్ధం ముగియడం, ఐరోపా ఖండం నుంచి పత్తి ఎగుమతులు పునఃప్రారంభమవడంతో భారతదేశంలో పత్తి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా ఇక్కడి రైతులు అప్పు కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చింది. వడ్డీ వ్యాపారులు రుణం కోసం భూములను తాకట్టు పెట్టమని రైతులను బలవంతపెట్టారు. రుణ విముక్తి కోసం వారి మహిళల మానాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది.
1874లో మరాఠా రైతులు ఆరు తాలుకాల్లోని 33 ప్రదేశాల్లో తిరుగుబాట్లు చేశారు. ఈ సందర్భంగా రుణానికి సంబంధించిన పత్రాల (బాండ్ల)ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు నిరాకరించినప్పుడు మాత్రమే హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అయితే ఈ తిరుగుబాట్లను పోలీసులు, సైన్యం సహకారంతో అణిచివేశారు. ప్రభుత్వం ఈ తిరుగుబాట్ల స్వభావం, కారణాలను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా 1879లో ఒక చట్టం చేసింది. దీని ప్రకారం రైతుల భూముల అన్యాక్రాంతంపై పరిమితులు విధించడమే కాకుండా సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను సవరించింది. రైతులు రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే నిర్బంధించడానికి, జైలుకు పంపడానికి వీల్లేకుండా చట్టం చేసింది.


రామోసీల తిరుగుబాటు
మహారాష్ట్రలోని రామోసీలు మరాఠాల పాలనలో చిన్న స్థాయి పోలీసు ఉద్యోగాలు చేసేవారు. మరాఠా రాజ్య పతనం తర్వాత వారు తిరిగి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అయితే అధిక భూమిశిస్తు వల్ల వారు ఇబ్బందుల పాలయ్యారు. 1822లో చిట్టూర్‌సింగ్ నాయకత్వంలో రామోసీలు తిరుగుబాటు చేసి మరాఠా ప్రాంతాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అనేక కోటలను నాశనం చేశారు. 1825లో వచ్చిన కరవు వల్ల 1826లో డోమాజి నాయకత్వంలో మరోసారి తిరుగుబాటు చేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం వారికి భూములు ఇవ్వడమే కాకుండా పోలీసు ఉద్యోగాలను ఇచ్చింది. 1876-78లో సంభవించిన గొప్ప కరవు వల్ల పశ్చిమ భారతదేశం అతలాకుతలమైంది. దీంతో ఈ ఇబ్బందులన్నింటికీ విదేశీ పాలనే కారణమని భావించిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ప్రభుత్వం ఫాడ్కేను 1880లో అరెస్ట్ చేసింది. అతడు 1883లో జైలులోనే మరణించాడు.

పబ్నా తిరుగుబాటు
859 చట్టం రైతులకు తాము సాగుచేసే భూమిపై స్వాధీన హక్కులను ఇచ్చింది. తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లోని శాశ్వత శిస్తు విధానం అమల్లో ఉన్న భూభాగాల్లోని జమీందారులు.. రైతులకు స్వాధీన హక్కులు లేకుండా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నించారు. దీంతో తూర్పు బెంగాల్‌లోని అనేక జిల్లాలో రైతులు జమీందారులకు వ్యతిరేకంగా 1870-1885 మధ్యకాలంలో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లకు కేంద్ర బిందువు పబ్నా జిల్లా. ఇక్కడి రైతులు జనపనార పండించి అధిక లాభాలు సంపాదించారు. వారు 1873 మేలో ఒక లీగ్‌గా ఏర్పడి జమీందారుల అన్యాయమైన డిమాండ్లను వ్యతిరేకించారు. కోర్టు ఖర్చుల నిమిత్తం విరాళాలు సేకరించడమే కాకుండా గ్రామాల్లో సమావేశాలను నిర్వహించి పన్నులు చెల్లించవద్దని రైతులను కోరారు. వీరు ప్రధానంగా న్యాయపోరాటాన్ని శాంతియుతంగా చేశారు. ఈ ఉద్యమంలో రెండు ప్రధాన లక్షణాలు..1.కిసాన్ సభ లేదా రాజకీయ పార్టీలు రైతు ఉద్యమాలు చేపట్టక ముందే వీరు ఒక గ్రూపుగా ఏర్పడి జమీందారులకు వ్యతి రేకంగా ఉద్యమించడం. 2.మెజారిటీ జమీందారులు హిందువులైనా, ముస్లిం రైతులతోపాటు హిందూ రైతులు కలిసి జమీందారులకు వ్యతిరేకంగా పోరాడటం. దీనికి ముఖ్య నాయకులు షా చంద్రరాయ్, శంభు పాల్, ఖాది మొల్లా. ఈ ఉద్యమ ఫలితంగా 1885లో ప్రభుత్వం బెంగాల్ కౌలుదారుల చట్టాన్ని చేసింది.

పాగల్ పంతి తిరుగుబాటు
వీరు తూర్పు బెంగాల్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాకు చెందిన హజోంగ్, గరో తెగలకు చెందినవారు. పాగల్ పంతి తిరుగుబాటును ప్రారంభించినవాడు కరమ్ షా. ఇతడి కుమారుడైన టిపు రాజకీయ, మతపరమైన లక్ష్యాలతో ప్రభావితుడై ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. ఇతడు జమీందారులకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటుచేసి, దాడులు చేయడం ద్వారా ధనం సేకరించాడు. 1825 జనవరిలో తన సైన్యంతో జమీందారుల ఇళ్లపై దాడి చేయడంతో, వారు బ్రిటిష్ అధికారుల వద్ద ఆశ్రయం పొందారు. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడానికి టిపు డిమాండ్లను అంగీకరించింది. పాగల్ పంతి తిరుగుబాటు 1825-35 మధ్య కొనసాగింది. చివరికి సైన్యం సాయంతో ప్రభుత్వం దీన్ని అణిచివేసింది.

పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టం (1900)
గ్రామీణ రుణగ్రస్థత, వ్యవసాయ భూమి వ్యసాయేతర తరగతులకు అన్యాక్రాంతం కావడం 19వ శతాబ్దం చివరి భాగంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరిణామం. బెంగాల్, మహారాష్ట్రలలో రైతుల ఉద్యమాలను ఎదుర్కొన్న ప్రభుత్వం పంజాబ్‌లో అలాంటి పరిస్థితి రాకముందే రైతుల సమస్యలను పరిష్కరించాలని భావించింది. వివిధ మతాలకు చెందినవారు పంజాబ్‌లో ఉండటం, సిక్కుల వీరత్వం.. ప్రభుత్వాన్ని ఇలాంటి చర్యలు చేపట్టేలా ప్రేరేపించాయి. 1895లో భారత ప్రభుత్వం వ్యవసాయ భూమి అన్యాక్రాంతం కాకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్‌ను జారీ చేసింది. 1896-97, 1899-1900లలో సంభవించిన తీవ్ర కరవుతో సమస్య మరింత జఠిలమైంది. దీంతో 1900లో పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టాన్ని ప్రయోగాత్మక చర్యగా చేసింది. పంజాబ్‌లో ఈ చట్టం విజయవంతంగా పనిచేస్తే.. దీన్ని దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ చట్టం ద్వారా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర తరగతి వారికి అమ్మడం లేదా తాకట్టు పెట్టడాన్ని నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకంజ వేసింది. గాంధీజీ రాకతో రైతుల డిమాండ్లకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రైతులను ఉద్యమంలో భాగస్వాములుగా చేసింది. గాంధీజీ నాయకత్వం వహించిన మొదటి రెండు ఉద్యమాలు రైతుల సమస్యలకు సంబంధించినవే కావడం విశేషం. ఈ రెండూ విజయవంతం కావడంతో అనంతరం గాంధీజీ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక నేతగా ఎదిగారు.

చంపారన్ సత్యాగ్రహం
19వ శతాబ్దంలో బీహార్‌లోని చంపారన్‌లో రైతులు తమ భూమిలో 3/20 భాగం నీలిమందు పండించాలని ఐరోపా తోటల యజమానులు బలవంతపెట్టేవారు. దీన్నే 'తీన్ కథియా విధానం' అని పిలిచేవారు. రాజ్‌కుమార్ శుక్లా అనే రైతు కోరిక మేరకు గాంధీజీ సత్యాగ్రహం చేపట్టారు. జిల్లాను వదిలి వెళ్లాలని ప్రభుత్వం గాంధీజీని ఆదేశించినా ఆయన భయపడలేదు. గాంధీజీ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వం అంగీకరించింది. విచారణలో భాగంగా రాజేంద్రప్రసాద్, జె.బి.కృపలానీ వేలాది మంది రైతుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. దీంతో తీన్ కథియా విధానాన్ని రద్దు చేశారు.

ఖేదా సత్యాగ్రహం
గుజరాత్‌లోని ఖేదా జిల్లాలో పంటలు పండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో భూమిశిస్తు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. గాంధీజీ ఇందులాల్ యాజ్ఞిక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకుల సహకారంతో ఖేదా జిల్లాలో పర్యటించి రైతులను భూమిశిస్తు చెల్లించవద్దని కోరారు. గాంధీజీ పోరాటం తర్వాత ప్రభుత్వం ఒక రహస్య ఉత్తర్వు ద్వారా పన్ను చెల్లించే స్తోమత ఉన్నవారి నుంచి మాత్రమే వసూలు చేయమని పేర్కొంది. దీంతో గాంధీజీ 1918లో ఉద్యమాన్ని నిలిపేశారు.

బార్డోలి సత్యాగ్రహం (1928)
గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో బార్డోలి గ్రామం ఉంది. ఇక్కడ గాంధీజీ అనుచరులైన మెహతా సోదరులు కున్‌బిపాటి దార్ కులస్థులతోపాటు అంటరానివారు, కాలివరాజ్ తెగకు చెందినవారి సహాయంతో రైతు ఉద్యమాన్ని కొనసాగించారు. బాంబే ప్రభుత్వం భూమిశిస్తును 22 శాతం పెంచడంతో.. మెహతా సోదరులు భూమిశిస్తు నిలుపుదల ఉద్యమాన్ని చేపట్టాలని వల్లభాయి పటేల్‌ను కోరారు. ఉద్యమంలో భాగంగా కుల సంఘాలు, ఐక్యత, సామాజిక బహిష్కరణ, భజనలులాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఉద్యమం ఉద్ధృతం కావడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను రైతులకు ఇవ్వడానికి అంగీకరించింది. మాక్స్‌వెల్-బ్రూమ్‌ఫీల్డ్ విచారణ ఫలితంగా బార్డోలిలో 22 శాతానికి పెంచిన భూమిశిస్తును 6.03 శాతానికి తగ్గించారు.

మోప్లా తిరుగుబాటు
కేరళలోని మలబార్ ప్రాంతంలో మోప్లా ముస్లిం రైతులు హిందూ అగ్రకులాలకు చెందిన నంబూద్రి, నాయర్ భూస్వాములకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ఖిలాఫత్ ఉద్యమం మోప్లాలకు అండగా నిలిచింది. కాంగ్రెస్, ఖిలాఫత్ ఉద్యమ నాయకులైన మహాదేవన్ నాయర్, గోపాల మీనన్, యాకూబ్ హసన్‌లను అరెస్ట్ చేయడంతో ఉద్యమం హింసాత్మకమైంది. 1921, ఆగస్టు 20న పోలీసులు తిరురైంగాడి మసీదుపై దాడిచేయడంతో మోప్లాలు పోలీస్ స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలు, భూస్వాముల ఇళ్లను ధ్వంసం చేశారు. వీరు హింసాత్మక చర్యలకు పాల్పడటంతో కాంగ్రెస్ ఉద్యమానికి దూరమైంది. 1921 డిసెంబరు నాటికి అనధికారికంగా 10,000 మంది మోప్లాలు హత్యకు గురయ్యారు.

పేదరికంలోకి రైతులు
ఆ రోజుల్లో దేశ జనాభాలో 3/4వ వంతు మంది వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడేవారు. వలస పాలన కింద వ్యవసాయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 1765లో బెంగాల్‌లో 'దివాని' (భూమి శిస్తు) అధికారాన్ని బ్రిటిషర్లు చేజిక్కించు కోవడంతో వ్యవసాయ విధానంలో సమూల మార్పులు చేశారు. ఇవి వ్యవసాయదారుల అభివృద్ధికి అనుకూలంగా లేకపోవడంతో వారంతా పేదరికానికి గురయ్యారు. 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో భారతదేశంలో అనేక కరవులు సంభవించడంతో చాలామంది కార్మికులు, రైతులు ఆకలిచావులకు గురయ్యారు. ఈ కాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో 24 చిన్న, పెద్ద కరవులు సంభవించాయి. ఇవి 28.5 మిలియన్ల మంది మరణానికి కారణమయ్యాయి. వీటిలో 1876-78, 1896-97, 1899-1900 ప్రాంతాల్లో సంభవించిన కరవులు ఎక్కువ నష్టానికి కలగజేశాయి.

కిసాన్ సభలు
20వ శతాబ్దంలో రైతు సంస్థలైన కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రభుత్వం జమీందార్లకు ప్రోత్సాహకాలను ఇవ్వడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హోమ్‌రూల్ లీగ్‌లో క్రియాశీల సభ్యులైన గౌరి శంకర్ మిశ్రా, ఇంద్ర నారాయణ ద్వివేది.. మదన్‌మోహన్ మాలవ్య సహకారంతో 1918లో కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణుడైన బాబా రామచంద్ర అవధ్‌లో జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1920లో రైతు ఉద్యమాలు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగమయ్యాయి. మాలవ్య అవధ్ కిసాన్ సభను ప్రతాప్‌గఢ్‌లో 1920 అక్టోబరులో స్థాపించారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

యుద్ధాలు

    మొగలు సామ్రాజ్య పతన దశలో మరాఠాల రాజ్యం వచ్చింది. తదనంతరం మరాఠాలను అణచివేసి ఆంగ్లేయులు పాలనకు వచ్చారు. శివాజీ, ఆయన వారసుల తర్వాత కూడా మరాఠాల ప్రాబల్యం పీష్వాల పరిపాలనలో కొనసాగింది. అందుకే పీష్వా వంశస్థాపకుడైన బాలాజీ విశ్వనాథ్‌ను 'మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు' అని పిలిచారు. ఆధునిక భారతదేశ చరిత్రలో మరాఠాల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు పీష్వాల గురించి తెలుసుకోవాలి. వారు తమ పాలన కాలంలో అనేక యుద్ధాలు చేశారు. ఈ పోరాటాలు, ఇతర పరిణామాల ఫలితంగా మరాఠా రాజ్యం ఏవిధంగా అంతరించి ఆంగ్లేయుల సామ్రాజ్యంలో విలీనమైందో అర్ధం చేసుకోవాలి.

బాలాజీ విశ్వనాథ్ (1713-20)

బాలాజీ విశ్వనాథ్ కొంకణస్థ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతడి పూర్వికులు జంజీర రాష్ట్రంలోని శ్రీవర్థన్ ప్రాంతానికి వారసత్వంగా దేశ్‌ముఖ్‌లుగా వ్యవహరించేవారు. బాలాజీ విశ్వనాథ్ చిన్న రెవెన్యూ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1708లో సాహు ఇతడిని సేనాకార్తె పదవిలో, ఆ తర్వాత 1713లో పీష్వాగా నియమించాడు. ఇతడి కాలం నుంచి పీష్వా పదవి వారసత్వంగా మారింది. ఇతడు సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో మరాఠా సర్దార్‌లను సాహు వైపు తిప్పుకోవడం ద్వారా... సాహు విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు. బాలాజీ విశ్వనాథ్ 1719లో సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫలితంగా అప్పటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్.. సాహును స్వరాజ్యానికి రాజుగా గుర్తించడమే కాకుండా, అతడి కుటుంబ సభ్యులందరినీ మొగలుల చెర నుంచి విడిపించాడు. అలాగే దక్కనులోని 6 మొగల్ రాష్ట్రాల నుంచి చౌత్, సర్దేశ్‌ముఖ్ పన్నులను వసూలు చేసుకునే అధికారం సాహుకు దక్కింది.

మొదటి బాజీరావు (1720-40)
బాలాజీ విశ్వనాథ్ పెద్ద కుమారుడైన బాజీరావును 20 సంవత్సరాల వయసులోనే పీష్వాగా నియమించారు. శివాజీ తర్వాత గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను పెంపొందించిన వ్యక్తిగా బాజీరావు ప్రసిద్ధి చెందాడు. ఇతడి కాలంలో మరాఠాల అధికారం తారస్థాయికి చేరుకుంది. ఇతడి కాలంలోనే మరాఠా కూటమికి బీజాలు పడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అనేక మరాఠా కుటుంబాలు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాయి. వారిలో గైక్వాడ్‌లు (బరోడా), భోంస్లేలు (నాగ్‌పూర్), హోల్కార్లు (ఇండోర్) సింధియాలు (గ్వాలియర్), పీష్వాలు (పుణే) ముఖ్యులు.
జంజీరాకు చెందిన సిద్ధీలను ఓడించిన తర్వాత, ఇతడు పోర్చుగీసు వారి నుంచి బస్సైన్, సాల్‌సెట్టి ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతడు నిజాం ఉల్‌ముల్క్‌ను భోపాల్ వద్ద ఓడించి, అతడితో 'దురాయ్ సరాయ్ సంధి' చేసుకున్నాడు. దీని ద్వారా నిజాం నుంచి మాళ్వా, బుందేల్‌ఖండ్‌లను పొందాడు. ఉత్తర భారతదేశంపై అనేక దండయాత్రలు చేయడం ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచి, భారతదేశంలో మరాఠాల అధికారాన్ని స్థాపించాడు.
* మొగలుల గురించి ప్రస్తావిస్తూ బాజీరావు ఇలా వ్యాఖ్యానించాడు 'ఎండిన చెట్టును కాండం దగ్గర నరికితే, కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి'.
బాజీరావు గొప్ప సైనికుడే కాకుండా దౌత్యవేత్త, సామ్రాజ్య స్థాపకుడు. పీష్వాగా ఉన్న 20 సంవత్సరాల్లో నిరంతరం యుద్ధాలు చేస్తూ విజయాలు సాధించాడు. మొగలులతో యుద్ధంలో హిందువులైన రాజపుత్రులు, బుందేలులు, జాట్‌లను తన సహజ మిత్రులుగా గుర్తించి వారి సహకారాన్ని పొందాడు. సవాయ్ జైసింగ్, ఛత్రసాల్‌లతో మైత్రి వల్ల లబ్ది పొందాడు.


బాలాజీ బాజీరావు (1740-61)
ఇతడు నానాసాహెబ్‌గా ప్రసిద్ధిగాంచాడు. 20 సంవత్సరాల వయసులోనే పీష్వా అయ్యాడు. 1749లో సాహు మరణం తర్వాత రాజ్య వ్యవహారాలన్నీ ఇతడి ఆధీనంలోకి వచ్చాయి. సాహుకు వారసులు లేకపోవడంతో రాజారాం మనవడైన రామరాజను తన వారసుడిగా ప్రకటించాడు. అయితే బాలాజీ బాజీరావు సతారాలో రామరాజను బంధించాడు. 1752లో మొగల్ చక్రవర్తి అహ్మద్ షా, పీష్వా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పీష్వా.. మొగల్ సామ్రాజ్యాన్ని అంతర్గత, బాహ్య విరోధుల (అహ్మద్ షా అబ్దాలీ) నుంచి కాపాడాలి. దీనికి ప్రతిగా పీష్వా వాయవ్య రాష్ట్రం నుంచి చౌత్‌ను వసూలు చేసుకోవడంతో పాటు ఆగ్రా, అజ్మీర్ రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ ఒప్పందం వల్ల మరాఠాలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అహ్మద్ షా అబ్దాలీతో ప్రత్యక్షంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాలు ఓడిపోయారు. ఈ వార్త వినడంతో బాలాజీ బాజీరావు 1761, జూన్ 23న మరణించాడు. ఇతడి తర్వాత మాధవరావు, నారాయణరావు, సవాయ్ మాధవరావు, రెండో బాజీరావు పీష్వాలుగా వ్యవహరించారు.
బాలాజీ బాజీరావు కాలంలో మరాఠా రాజ్యం అత్యున్నత దశకు చేరుకుంది. ఇతడి కాలంలో న్యాయ పరిపాలన మెరుగుపడింది. రెవెన్యూ పరిపాలన పటిష్టమైంది. కలెక్టర్లు ఖాతాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాడు. వర్తకాభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాడు. దేవాలయాల నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చాడు. హోల్కార్లు, సింధియాలు రాజపుత్ర రాజ్యాలపై దాడి చేయడం, రఘునాథరావు జాట్‌లకు చెందిన కోటను ఆక్రమించడంతో హిందూ రాజులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలన్న ఆశయానికి విఘాతం ఏర్పడింది. పీష్వా ఢిల్లీలో రాజకీయ పరిణామాలకు అనవసర ప్రాధాన్యం ఇవ్వడం, పంజాబులో తీసుకున్న నిర్ణయాలతో అహ్మద్‌షా అబ్దాలీతో విరోధం ఏర్పడింది. ఆంగ్లేయుల సైనిక బలాన్ని, రాజకీయ ఉద్దేశాన్ని పీష్వా సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.


మూడో పానిపట్టు యుద్ధం
నాదిర్ షా తర్వాత అహ్మద్ షా అబ్దాలీ ఆప్ఘనిస్థాన్ పాలకుడయ్యాడు. మొగలు సామ్రాజ్యం బలహీనమవడంతో అబ్దాలీ కూడా భారతదేశంపై దాడి చేయాలని భావించాడు. 1758లో రఘునాథరావు అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు, ఏజెంట్ అయిన తైమూరును పంజాబ్ నుంచి తరిమేశాడు. మరాఠాలు అదీనా బేగ్‌ఖాన్‌ను పంజాబ్ గవర్నరుగా నియమించారు. ఆప్ఘన్ల నుంచి పంజాబ్‌ను మరాఠాలు ఆక్రమించడం ద్వారా అహ్మద్ షా అబ్దాలీకి సవాలు విసిరారు. 1759 చివరి నాటికి అహ్మద్ షా అబ్దాలీ పెద్ద సైన్యంతో సింధు నదిని దాటి పంజాబ్‌ను ఆక్రమించాడు. అబ్దాలీని ఎదుర్కోలేక మరాఠాలు ఢిల్లీకి పారిపోయారు. ఢిల్లీకి పది మైళ్ల దూరంలోని బరారి ఘాట్ వద్ద 1760లో జరిగిన యుద్ధంలో దత్తాజి సింధియా మరణించాడు. జంకోజి సింధియా, మల్హర్ రావ్ హోల్కార్లు కూడా అబ్దాలీని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. దీంతో అబ్దాలీ ఢిల్లీని ఆక్రమించాడు.
ఉత్తర భారతదేశంలో మరాఠాల అధికారాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో సదాశివరావు భావేను పీష్వా పంపాడు. భావే 1760, ఆగస్టు 22న ఢిల్లీని ఆక్రమించాడు. అబ్దాలీని ఢిల్లీ నుంచి తరిమేయాలని భావే భావించాడు. దీంతో రెండు సేనల మధ్య 1760 నవంబరులో పానిపట్టు వద్ద యుద్ధం జరిగింది. ఇరు సేనలకు ఆహార సరఫరా నిలిచిపోవడంతో శాంతి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇవి ఫలించకపోవడంతో 1761, జనవరి 14న భీకర యుద్ధం జరిగింది. ఇందులో మరాఠాలు ఓడిపోయారు. 75,000 మంది మరాఠాలు మరణించారు. ఈ యుద్ధంలో పీష్వా కుమారుడు విశ్వాస్ రావు, సదాశివరావు భావే కూడా మరణించారు.
* ప్రముఖ చరిత్రకారుడు జె.ఎన్.సర్కార్ ఈ యుద్ధం గురించి ఇలా చెప్పాడు 'మహారాష్ట్రలో కుటుంబ సభ్యులను కోల్పోని కుటుంబం లేదు. చాలా ఇళ్లు కుటుంబ పెద్దను కోల్పోయాయి. ఒక్క దెబ్బతో మొత్తం నాయకుల తరమంతా నాశనమైంది.'


మరాఠాల ఓటమికి కారణాలు
అబ్దాలీ సైన్యం 60,000 కాగా మరాఠాల సైన్యం 45,000 మాత్రమే.
పానిపట్టులోని మరాఠా శిబిరంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. సైన్యానికి ఆహారం, గుర్రాలకు గడ్డి దొరకలేదు.
* ఉత్తర భారతదేశంలోని ముస్లిం రాజ్యాలన్నీ అబ్దాలీకి సహాయం చేయగా మరాఠాలు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. జాట్‌లు, రాజపుత్రులు, సిక్కులు మరాఠాలకు దూరమయ్యారు.
* మరాఠా సైన్యాధికారుల్లో అసూయ వారి ఓటమికి కారణమైంది.
పానిపట్టు యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి.. ఆప్ఘనులతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న వ్యక్తి కాశి రాజ పండిట్. సదాశివరావు భావే వ్యక్తిత్వంలోని లోపాలను పండిట్ దుయ్యబట్టడమే కాకుండా ఓటమికి భావేనే ప్రధాన కారణమని పేర్కొన్నాడు.


ఆంగ్లో-మరాఠా యుద్ధాలు
మరాఠాలు మొగల్ సామ్రాజ్య శిథిలాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించగా.. ఆంగ్లేయులు మరాఠా సామ్రాజ్య శిథిలాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించాలని భావించారు. మరాఠాలు ఇతర భారత రాజ్యాల కంటే బలమైన రాజ్యంగా ఏర్పడగా, ఆంగ్లేయులు భారతదేశంలోని ఇతర ఐరోపా వర్తక కంపెనీలపై ఆధిపత్యం సంపాదించడంలో విజయం సాధించారు. 18వ శతాబ్దం చివరి నాటికి మరాఠాలు, ఆంగ్లేయులు ప్రత్యక్ష యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆంగ్లేయ కంపెనీ అధికార బలం ముందు మరాఠా అధికారం కనుమరుగైంది.

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం (1775-82)
మరాఠా నాయకులైన మాధవరావు, రఘునాథరావు మధ్య అధికారం కోసం జరిగిన పోరును బ్రిటిషర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రఘునాథరావుకు వారి మద్దతు తెలిపారు. ఈ యుద్ధంలో మొదట బ్రిటిషర్లు మరాఠాల చేతిలో ఓడిపోయారు. గొడ్డార్డ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం కలకత్తా నుంచి అహ్మదాబాద్ చేరుకునే క్రమంలో మరాఠాలపై అనేక విజయాలు సాధించింది. ఈ యుద్ధం 1782లో జరిగిన 'సాల్బాయ్ సంధి'తో ముగిసింది. ఈ సంధి ద్వారా యథాతథ స్థితిని కొనసాగించారు. ఫలితంగా బ్రిటిషర్లు మరాఠాలతో 20 సంవత్సరాల పాటు శాంతిని నెలకొల్పారు. మరాఠాల సహాయంతో బ్రిటిషర్లు హైదర్ అలీ నుంచి తమ భూభాగాలను ఆక్రమించుకోగలిగారు.

రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803-05)

మరాఠాల అంతర్గత వ్యవహారంలో వెల్లస్లీ జోక్యం చేసుకోవడం, సైన్య సహకార విధానాన్ని మరాఠాలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడం ఈ యుద్ధానికి కారణాలు. 18వ శతాబ్దం చివరి నాటికి అనుభవజ్ఞులైన మరాఠా నాయకులు మరణించడం, బ్రిటిషర్ల విజయావకాశాలు మెరుగుపడటం, పీష్వా రెండో బాజీరావు 1802లో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయడం లాంటి పరిణామాలు యుద్ధాన్ని ప్రోత్సహించాయి. సింధియా, భోంస్లేల ఉమ్మడి సైన్యం ఆర్థర్ వెల్లస్లీ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం చేతిలో ఓడిపోయింది. అయితే హోల్కర్లను ఓడించడంలో బ్రిటిషర్లు విఫలమయ్యారు. ఈ యుద్ధంతో కంపెనీ భారతదేశంలో తన అధికారాన్ని పూర్తిస్థాయిలో స్థాపించగలిగింది. ఈ యుద్ధం 1802, డిసెంబరు 31న జరిగిన బస్సైన్ సంధితో ముగిసింది. ఈ సంధి ద్వారా పీష్వా రూ.26 లక్షల ఆదాయాన్నిచ్చే భూభాగాలను కంపెనీకి ఇవ్వడానికి అంగీకరించాడు. అలాగే సూరత్ నగరాన్ని కంపెనీకి అప్పగించాడు. నిజాం భూభాగంలో చౌత్ హక్కును వదులుకున్నాడు.

మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1817-18)
బ్రిటిషర్లు తమ స్వాతంత్య్రాన్ని హరించడాన్ని మరాఠాలు వ్యతిరేకించడం, మరాఠా సర్దార్‌ల పట్ల బ్రిటిష్ రెసిడెంట్లు కఠినంగా వ్యవహరించడం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. ఈ యుద్ధం తర్వాత పీష్వా పదవీచ్యుతుడయ్యాడు. బ్రిటిషర్లు మరాఠా భూభాగాలన్నింటినీ తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. మరాఠా సర్దార్‌లు బ్రిటిషర్ల దయాదాక్షిణ్యాలపై జీవించాల్సి వచ్చింది.
 

మాదిరి ప్రశ్నలు

1. సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో సాహు విజయానికి తోడ్పడిన వ్యక్తి ఎవరు?
ఎ) బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) రఘునాథరావు డి) మల్హర్ రావ్ హోల్కర్
జ: (బి)

 

2. గైక్వాడ్‌లు ఏ ప్రాంతం కేంద్రంగా పరిపాలించారు?
ఎ) బరోడా బి) నాగపూర్ సి) ఇండోర్ డి) గ్వాలియర్
జ: (ఎ)

 

3. మొదటి బాజీరావు బస్సైన్, సాల్‌సెట్టిలను ఎవరి నుంచి ఆక్రమించాడు?
ఎ) ఆంగ్లేయులు బి) పోర్చుగీసువారు సి) ఫ్రెంచివారు డి) డచ్చివారు
జ: (బి)

 

4. మొదటి బాజీరావు, నిజాం ఉల్ ముల్క్‌ను ఏ యుద్ధంలో ఓడించాడు?
ఎ) హైదరాబాద్ బి) భోపాల్ సి) నాగపూర్ డి) విజయవాడ
జ: (బి)

 

5. నానాసాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన పీష్వా ఎవరు?
ఎ) బాలాజీ బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) మొదటి బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (ఎ)

 

6. 1752లో పీష్వాతో ఒప్పందం కుదుర్చుకున్న మొగలు చక్రవర్తి ఎవరు?
ఎ) మహమ్మద్ షా బి) అహ్మద్ షా సి) బహుదూర్ షా డి) ఔరంగజేబు
జ: (బి)

 

7. చివరి పీష్వా ఎవరు?
ఎ) మాధవరావు బి) నారాయణరావు సి) బాలాజీ బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (డి)

 

8. బాలాజీ బాజీరావు ఎప్పుడు మరణించాడు?
ఎ) 1759 బి) 1760 సి) 1761 డి) 1762
జ: (సి)

 

9. నాదిర్ షా తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పాలకుడు ఎవరు?
ఎ) తైమూరు బి) అహ్మద్ షా అబ్దాలీ సి) షేర్‌ఖాన్ డి) అదీనా బేగ్ ఖాన్
జ: (బి)

 

10. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలకు సహకరించింది ఎవరు?
ఎ) జాట్‌లు బి) రాజపుత్రులు సి) సిక్కులు డి) ఎవరూ కాదు
జ: (డి)

 

11. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాల ఓటమికి ప్రధాన కారకుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) కాశీ రాజ పండిట్ బి) సదాశివరావు భావే సి) విశ్వాసరావు డి) మల్హర్ రావు హోల్కర్
జ: (బి)

 

12. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది?
ఎ) సల్బాయ్ బి) దురాయ్ సరాయ్ ) పాల్కేడ్ డి) బస్సైన్
జ: (ఎ)

 

13. పీష్వా రెండో బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశాడు?
ఎ) 1800 బి) 1801 సి) 1802 డి) 1803
జ: (సి)

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక విద్యావ్యాప్తి

  ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుకుని బ్రిటిష్ కాలంలో భారత్‌లో విద్యాభివృద్ధి ఎలా సాగిందన్నది ఆధునిక చరిత్ర ప్రధానాంశాల్లో ఒకటి. 1813 చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏటా లక్ష రూపాయలు కేటాయించడం విద్యారంగంలో కీలక పరిణామం.. అనంతర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యావ్యాప్తికి వివిధ కమిటీలను నియమించి అనేక మార్పులు తీసుకొచ్చింది. ఆంగ్లవిద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రధానాంశం. స్వాతంత్య్రానంతరం రాధాకృష్ణన్, కొఠారి కమిషన్లు మన దేశంలో విద్యకు వన్నెలద్ది ప్రగతిపథంలో పరుగులు తీసేందుకు బాటలు వేశాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు విద్యారంగ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడం అవసరం. భారత్‌లో 18వ శతాబ్దం నాటికి హిందూ, ముస్లిం విద్యా కేంద్రాలు కనుమరుగయ్యాయి. స్వదేశీ రాజుల పాలన అంతం కావడంతో విద్యా కేంద్రాలకు నిధుల సమస్య ఎదురైంది. 1784, ఫిబ్రవరి 21న వారన్ హేస్టింగ్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లకు రాసిన ఉత్తరంలో - ఉత్తర భారతదేశం, దక్కనులో విద్యాలయాల దుస్థితిని వివరించారు. బెంగాల్ 1765లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం కిందకు వచ్చింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఇంగ్లండ్‌లో మాదిరిగా భారతదేశంలోనూ ప్రజలకు విద్యను అందించే బాధ్యత నుంచి వైదొలగాలని నిర్ణయించారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే భారతీయ అధికారుల కోరిక మేరకు విద్యాభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపట్టారు. 1781లో వారన్ హేస్టింగ్స్ పర్షియన్, అరబిక్ భాషల అధ్యయనం కోసం కలకత్తాలో మదరసాను స్థాపించాడు. 1791లో బెనారస్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా పనిచేసిన జొనాథన్ డంకన్ హిందూ చట్టాలు, సాహిత్యం, మతానికి సంబంధించిన అధ్యయనాల కోసం ఒక సంస్కృత కళాశాలను స్థాపించాడు. 1784లో సర్ విలియం జోన్స్ మరో ముప్పైమందితో కలిసి 'ఆసియా' విషయాల అధ్యయనం కోసం 'ఏసియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు. అయితే 1829 వరకు ఇందులో భారతీయులకు ప్రవేశం కల్పించలేదు.

ఆంగ్ల భాషకే నిధులు
    క్రైస్తవ మిషనరీలు, మానవతావాదులు ఒత్తిడి తేవడంతో భారతదేశంలో ఆధునిక విద్యావ్యాప్తికి ఈస్ట్ ఇండియా కంపెనీ నడుం బిగించింది. 1813 చార్టర్ చట్టం విద్యాభివృద్ధికి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు కేటాయించింది. అయితే ఈ మొత్తాన్ని ఆధునిక పాశ్చాత్య విద్య కోసం ఖర్చు పెట్టాలా? లేదా భారతీయ విద్య కోసం ఖర్చు పెట్టాలా? అనే విషయంపై వాదోపవాదాలు జరిగాయి. ఈ చర్చలో పాల్గొన్న ఆంగ్లేయులు 1835లో ప్రాచ్యవాదులు, పాశ్చాత్యవాదులుగా విడిపోయారు. జేమ్స్ సూదర్‌లాండ్, జాన్ షేక్‌స్పియర్, జేమ్స్ ప్రిన్సెప్, హెన్రీ ప్రిన్సెప్‌లతో కూడిన ప్రాచ్య వర్గం అరబిక్, సంస్కృత భాషలకు ప్రాధాన్యం తగ్గించడం 1813 చట్టస్ఫూర్తికి విరుద్ధమని వాదించింది. డబ్ల్యూ.డబ్ల్యూ.బర్డ్, సి.బి.సౌండర్స్, జె.ఆర్.కాల్విన్, సి.ఇ.ట్రెవెల్యాన్‌లతో కూడిన పాశ్చాత్య వర్గం ఆంగ్ల భాషలో పాశ్చాత్య ఆధునిక విద్యను అందించడాన్ని బలపరిచింది. థామస్ బాబింగ్టన్ మెకాలే పాశ్చాత్యవాదులను సమర్థించారు. చివరికి అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ మెకాలే వాదనతో ఏకీభవించి విద్య కోసం కేటాయించిన నిధులన్నీ ఆంగ్ల భాషాభివృద్ధికే ఖర్చు చేయాలని నిర్ణయించాడు. మెకాలే ప్రతిపాదనను 1835, మార్చి 7న ఆమోదించి ఆంగ్లభాషను భారతదేశ అధికార భాషగా ప్రకటించారు. 1843-53 మధ్యకాలంలో ఉత్తర్‌ప్రదేశ్ (వాయవ్య రాష్ట్రం) లెఫ్టినెంట్ గవర్నరుగా పనిచేసిన జేమ్స్ థామ్సన్ ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రయత్నించాడు. విద్యాశాఖను ఏర్పాటు చేసి, భారతీయ పాఠశాలలను తనిఖీ చేయడం ద్వారా వాటిని అభివృద్ధి చేశాడు.

మాగ్నాకార్టా
అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా ఉన్న చార్లెస్ ఉడ్ ఒక తాఖీదును 1854లో రూపొందించాడు. తర్వాత అతడిని భారతదేశ మొదటి రాజ్య కార్యదర్శిగా నియమించారు. ఆ తాఖీదునే భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించి 'మాగ్నాకార్టాగా భావిస్తారు. ప్రజలందరికీ విద్యను అందించడం, స్త్రీ విద్య, ప్రాంతీయ భాషల అభివృద్ధి, లౌకిక విద్యకు ఇది ప్రాధాన్యం ఇచ్చింది. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఈ తాఖీదును దశలవారీగా అమలు చేశారు. బొంబాయి, మద్రాసు, బెంగాల్, వాయవ్య రాష్ట్రం, పంజాబ్‌లలో 1855లో విద్యాశాఖలను ఏర్పాటు చేశారు. తర్వాత వివిధ విశ్వవిద్యాలయాలను స్థాపించారు.

హంటర్ కమిషన్
డబ్ల్యూ.డబ్ల్యూ.హంటర్ 1882లో అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించింది. 1854 ఉడ్ తాఖీదు తర్వాత భారతదేశంలో జరిగిన విద్యాభివృద్ధిని సమీక్షించడం ఆ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం. కమిషన్‌ను అప్పటి వైస్రాయి లార్డ్ రిప్పన్ నియమించాడు. ప్రాథమిక విద్య అభివృద్ధికి సూచనలను, సలహాలను సిఫారసు చేయాల్సిందిగా ఈ కమిషన్‌ను కోరాడు. కొత్తగా ఏర్పాటు చేసిన స్థానిక సంస్థలకు (జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు) ప్రాథమిక విద్య నిర్వహణను అప్పగించాలని ఈ కమిషన్ సూచించింది. ప్రభుత్వం కొన్ని కళాశాలలు, సెకండరీ పాఠశాలలను మాత్రమే నిర్వహించాలని, మిగిలినవాటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు వదిలి పెట్టాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం అమలు చేసింది.

భారత విశ్వవిద్యాలయాల చట్టం
1901 సెప్టెంబరులో లార్డ్ కర్జన్ విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సిమ్లాలో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాడు. వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో లా మెంబరు అయిన థామస్ ర్యాలీగ్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ కమిషన్‌ను నియమించారు.

ఈ కమిషన్ సిఫార్సుల మేరకు 1904లో భారత విశ్వవిద్యాలయాల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని అనుసరించి విశ్వవిద్యాలయాలు బోధన బాధ్యతలను స్వీకరించాయి. అంతవరకు అవి పరీక్షల నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యేవి. విశ్వవిద్యాలయ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సిండికేట్లను నియమించారు. ఈ చర్యల వల్ల ఉన్నత విద్య నాణ్యత పెరిగింది. అయితే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణ పెరగడాన్ని జాతీయవాదులు తీవ్రంగా విమర్శించారు. 1910లో కేంద్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేశారు.

విద్యావిధానంపై తీర్మానం
1906లో అభ్యుదయ భావాలు ఉన్న బరోడా రాష్ట్రం నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని పాటించాలని భారతీయ నాయకులు ఒత్తిడి చేశారు. 1910-13 మధ్య కాలంలో గోపాలకృష్ణ గోఖలే విధాన మండలిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య బాధ్యతను తీసుకోవాలని గట్టిగా కోరారు. 1913, ఫిబ్రవరి 21న చేసిన తీర్మానం ప్రకారం ప్రభుత్వం నిర్బంధ విద్య సూత్రాన్ని తిరస్కరించింది. అయితే నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అంగీకరించింది. అలాగే పేదలకు ఉచిత విద్యను అందించడానికి అన్ని రాష్ట్రాలు సత్వర చర్యలు చేపట్టాలని కోరింది.

శాడ్లర్ కమిషన్ (1917-19)
చెమ్స్‌ఫర్డ్ కలకత్తా విశ్వవిద్యాలయ పనితీరును సమీక్షించడానికి శాడ్లర్ కమిషన్‌ను నియమించాడు. ఈ కమిషన్ సెకండరీ విద్య, సెకండరీ విద్యాబోర్డు నియంత్రణలో ఉండాలని, డిగ్రీ కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసింది. అనంతరం 1921 నాటికి భారతదేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 12కు పెరిగింది. కొత్తగా బెనారస్, మైసూరు, పాట్నా, అలీగఢ్, ఢాకా, లక్నో, ఉస్మానియా విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఇదే సమయంలో గాంధీజీ, లాలాలజపతిరాయ్, అనిబిసెంట్ జాతీయ విద్య ఆవశ్యకతను గుర్తించారు. ప్రస్తుత విద్యావిధానం జాతీయవాద అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయదని వాదించారు. మాతృభూమిపై ప్రేమను పెంపొందించే విద్యావిధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా కాశీ విద్యాపీఠ్, జామియా మిలియా ఇస్లామియా, బీహార్ విద్యాపీఠ్ లాంటి జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.

హార్టాగ్ కమిటీ నివేదిక
1928 మే లో సైమన్ కమిషన్.. సర్ ఫిలిప్ జోసెఫ్ హార్టాగ్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ఇండియాలో విద్య మరింతగా అభివృద్ధి చెందేందుకు గల అవకాశాలపై నివేదికను ఇవ్వాలని ఈ కమిటీని కోరింది. కమిటీ తన నివేదికలో - ప్రజలందరికీ విద్య నేర్పించే బాధ్యత ప్రధానంగా రాష్ట్రాలపై ఉంది. సెకండరీ విద్య పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఎక్కువమంది ఉత్తీర్ణులు కాకపోవడం ఇబ్బందికరంగా ఉంది. ప్రాథమిక విద్యావ్యవస్థలో మానవ వనరుల వృథా అధికంగా ఉంది. ఉపాధ్యాయుల జీతాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది - అని పేర్కొంది.

'బేసిక్' విద్యా విధానం
భారత ప్రభుత్వ చట్టం-1935 రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. 1937లో ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 7 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పరచింది. 1937లో గాంధీజీ తన 'హరిజన్ పత్రికలో బేసిక్ విద్య ఆవశ్యకతను వివరిస్తూ వరుసగా వ్యాసాలను ప్రచురించారు. 'కార్యక్రమాల ద్వారా నేర్చుకోవడం అనేది బేసిక్ విద్య సూత్రం. జాకీర్ హుస్సేన్ కమిటీ ఈ విధానంపై కసరత్తు చేసి సిలబస్‌ను రూపొందించింది. ఈ విధానంలో చేతితో వస్తువులను చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపాధ్యాయుల జీతం కోసం వినియోగిస్తారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం, కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడంతో ఈ విధానాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.

సార్జంట్ విద్యాప్రణాళిక
1944లో కేంద్రీయ విద్యా సలహా బోర్డు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. ఆ బోర్డుకు భారత ప్రభుత్వ విద్యా సలహాదారు సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షుడు. ఈ ప్రణాళిక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలని, 6-11 ఏళ్ల వయసు వారికి సార్వత్రిక ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలలు.. సాధారణ విద్య; సాంకేతిక-వృత్తి విద్యను నేర్పేవి అని రెండు రకాలుగా ఉండాలని సిఫార్సు చేసింది. ఇంటర్మీడియట్ కోర్సును తొలగించి ఉన్నత విద్య, కళాశాల విద్యకు చెరో సంవత్సరం కలపాలని పేర్కొంది.

కొఠారి కమిషన్ (1964-66)
డాక్టర్ డి.ఎస్.కొఠారి అధ్యక్షతన భారత ప్రభుత్వం 1964 జులైలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అన్ని స్థాయుల్లో విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలను తెలియజేయాలని కమిషన్‌ను కోరింది.


కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు:
* అన్ని స్థాయుల్లో పని అనుభవం, సామాజిక సేవను ప్రవేశపెట్టాలి.
* నైతికవిద్యపై దృష్టి సారించాలి. సామాజిక బాధ్యతను పెంపొందించాలి.
సెకండరీ విద్యలో వృత్తి విద్యను భాగం చేయాలి.
* అత్యున్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిమిత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి.
పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
వ్యవసాయ విద్య, వ్యవసాయంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.


రాధాకృష్ణన్ కమిషన్
విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి తగిన సూచనలతో ఒక నివేదికను ఇవ్వాలని కోరుతూ.. భారత ప్రభుత్వం 1948 నవంబరులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 1949 ఆగస్టులో తన నివేదికను సమర్పించింది.


నివేదికలోని ప్రధాన విషయాలు
* పన్నెండు సంవత్సరాల విశ్వవిద్యాలయ పూర్వవిద్య.
* విశ్వవిద్యాలయాల పని దినాలు 180 రోజుల కంటే తక్కువ కాకూడదు. (పరీక్షలు జరిగే రోజులు మినహాయించి).
* పరీక్షా ప్రమాణాలను పెంపొందించి.. అన్ని విశ్వవిద్యాలయాల్లో పరీక్షా విధానం ఒకేలా ఉండాలి.
* విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలి.
దేశంలో విశ్వవిద్యాలయాల విద్యను పర్యవేక్షించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి.


ముఖ్యాంశాలు
* 1813-53 మధ్య బెంగాల్, బీహార్, మద్రాసు ప్రెసిడెన్సీలలో అనేక పాఠశాలలు, కళాశాలలను స్థాపించారు.
* 1844లో అప్పటి గవర్నర్ జనరల్ హార్డింజ్ ఆంగ్లవిద్యను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాడు.
* 1919లో చేసిన మాంట్‌ఫర్డ్ (మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్) చట్టం ప్రకారం... మొదటిసారిగా విద్య భారతీయుల నియంత్రణలోకి వచ్చింది. ఫలితంగా అన్ని స్థాయుల్లో మునుపెన్నడూ లేని విధంగా విద్య అభివృద్ధి చెందింది.
* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సు మేరకు 1953లో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ)ను ఏర్పాటు చేశారు. దీనికి పార్లమెంటు చట్టం ద్వారా 1956లో స్వయం ప్రతిపత్తి కల్పించారు.

 

మాదిరి ప్రశ్నలు
 

1. విలియంకోట కళాశాలను ఎవరు స్థాపించారు?
జవాబు: వెల్లస్లీ

 

2. భారతదేశంలో విద్యాభివృద్ధికి లక్ష రూపాయిలు కేటాయించిన చట్టమేది?
జవాబు: 1813 చార్టర్ చట్టం

 

3. సంస్కృత కళాశాలల బలోపేతాన్ని వ్యతిరేకించినవారు ఎవరు?
జవాబు: రాజారామమోహన్‌రాయ్

 

4. కలకత్తాలో హిందూ కళాశాలను ఎప్పుడు స్థాపించారు?
జవాబు: 1817

 

5. వాయవ్య రాష్ట్రంలో ప్రాంతీయ భాషల ద్వారా విద్యాబోధనను ప్రోత్సహించినవారు ఎవరు?
జవాబు: జేమ్స్ థామ్సన్

 

6. బాలికల పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసినవారు ఎవరు?
జవాబు: బెత్యూన్

 

7. హంటర్ కమిషన్‌ను ఎవరి కాలంలో నియమించారు?
జవాబు: రిప్పన్

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర)

ప్రాచీనకాలం నుంచి ప్రజలు సంతోషంగా జీవించడానికి చేసిన ప్రయత్నమే చరిత్ర.
* సాధారణంగా భూమి 100 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని భావిస్తున్నారు. భూమిపై మానవుల లాంటి జీవులు, వారి పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో నివసించేవారు.
* సుమారు 5 లక్షల సంవత్సరాల నుంచి మానవుడు సాగించిన జీవిత యాత్రను 'ఆదిమ చరిత్ర' అంటారు.
* ఈ పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి, చరిత్ర 10 వేల సంవత్సరాల పూర్వం నుంచే ప్రారంభమైంది.
* ప్రపంచ భౌతికాభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే దానిలో మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమేనని, ఇది ప్రపంచ వయోపరిణామంలో 10 లక్షల భాగంలో ఒకవంతు అని వర్ణించారు.
* మానవుడు వివిధ కాలాల్లో పరిసరాలను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని క్రమంగా అభివృద్ధి చెందాడు.

ప్రపంచ మానవ చరిత్రను మూడు విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు
1) పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర): దీనికి లిఖిత ఆధారాలు లేవు. దీన్ని ప్రీ హిస్టరీ అంటారు.
2) సంధికాలపు చారిత్రక యుగం: దీన్ని ప్రోటోహిస్టరీ అంటారు. ఇది రెండు యుగాల మధ్య కాలం.
3) చారిత్రక యుగం (హిస్టారిక్ పీరియడ్): ఇది రెండు యుగాల మధ్యకాలం. దీనికి లిఖిత ఆధారాలు ఉన్నాయి.
చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా అధ్యయనం చేస్తారు.
1) ప్రాచీన యుగం
2) మధ్యయుగం
3) ఆధునిక యుగం
* పూర్వ చారిత్రకయుగాన్ని తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు. దీని గురించి తెలుసుకోవడానికి 'పురావస్తు శాస్త్రం', 'మానవశాస్త్రం' తోడ్పడతాయి.


పురావస్తు శాస్త్రం
      ప్రాచీనకాలంలో మానవుడు నివసించిన ప్రాంతాలు, ఉపయోగించిన పరికరాలు, వస్తువులు, మట్టితో కప్పబడి మరుగునపడ్డాయి. పురాతత్వవేత్తలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, అక్కడ లభించిన వస్తువులను పరిశీలించి, పరిశోధించి ఆ కాలంనాటి మానవుల జీవిత విశేషాలను తెలుసుకున్నారు. ఈ తవ్వకాలను 'ఉత్ఖాతనం' అని, వీటి గురించి వివరించే శాస్త్రాన్ని 'పురావస్తు శాస్త్రం' అని అంటారు.
* ఈజిప్టులోని పిరమిడ్లు, అప్పటి ప్రాచీన నాగరికత విశేషాలను ఉత్ఖాతనాల వల్ల అధ్యయనం చేశారు.
* భారతదేశంలోని పంజాబ్, సింధు రాష్ట్రాల్లో హరప్పా, మొహంజొదారో తవ్వకాలను అధ్యయనం చేసిన జాన్ మార్షల్ 5000 సంవత్సరాల పూర్వపు సింధులోయ నాగరికత గురించి తెలుసుకున్నారు.
* ఉత్ఖాతనల అధ్యయనం వల్ల సింధు నాగరికత ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలకు సమకాలీనమైందని తెలిసింది.
* మన రాష్ట్రంలోని నాగార్జున కొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతనాలు క్రీ.శ.3వ శతాబ్దం నుంచి ఇక్ష్వాకుల కాలంనాటి నాగరికతను తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి. ఈ విధంగా పురావస్తు శాస్త్రం ప్రాచీన కాలపు రచనకు దోహదపడుతోంది.


మానవశాస్త్రం
* మానవశాస్త్రం ప్రాచీన రచనకు ఎంతో తోడ్పడుతోంది. వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందట జీవించిన మానవుల అస్తిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు బయటపడ్డాయి.
* భూమి పైపొరల్లో లభించిన శిలాజాలు, గతంలో మానవుడు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ మానవ చరిత్రకు అతివిలువైన సాక్ష్యాధారాలు.
* వీటిలో ఉన్న రేడియో కార్బన్ల నిష్పత్తి కాల నిర్ణయానికి ఉపయోగపడుతోంది. మార్టిమర్‌వీలర్ వీటిని వస్తువులుగా కాకుండా 'ప్రాచీన కాలపు మనుషులు'గా వర్ణించాడు. ఈ విధంగా మానవశాస్త్రం అప్పటి చరిత్ర రచనకు మూలమైంది.


భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం:
* భూమి సూర్యుడి నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది. అనేక భౌతిక మార్పులు చెందిన తర్వాత భూమి ప్రాణకోటికి నివాసయోగ్యమైంది.
* భూమి మీద మొదట 'లార్వా', ఆ తర్వాత 'ప్లాజిలెట్ట' జీవులు ఆవిర్భవించాయి. కాలక్రమంగా వృక్షజాతి, జంతుజాలం, చివరిగా మానవుడు ఉద్భవించాడు.


మానవ జీవిత పరిణామ దశలు:
1) ఆస్ట్రోఫిథికస్
2) రామాఫిథికస్
3) హోమో ఎరక్టస్
4) నియన్‌డెర్తల్ నరుడు
ఈ జాతులు మనిషి లాంటి ప్రాణులు. క్రీ.పూ.1,40,000 - 4000కు పూర్వం జీవిస్తుండేవి.
5) హోమోసేపియన్లు ఆధునిక మానవులకు పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్‌లు అని కూడా అంటారు.
* 20 వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన వీరు కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించేవారు. గుహ చిత్రాలను గీసేవారు. ఈ చిత్రాలు వారి అనుభవాలను తెలియజేసేవి.
* మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది. ఈ యుగాన్ని 3 దశలుగా విభజించారు.


పాతరాతియుగం
* క్రీ.పూ.2,50,000 - 1000 వరకు (సుమారుగా) ఈ యుగంలో మానవుడు గొడ్డళ్లు, కత్తులు, రాతి పనిముట్లు తయారుచేసుకొని, ఆహారం, ఆత్మరక్షణకు ఉపయోగించేవాడు. గుహల్లో నివసిస్తూ జంతవుల చర్మంతో శరీరాన్ని కప్పుకునేవాడు.
* ఆహారం కోసం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. అనుభవాలను చిత్రాలుగా పెద్ద రాళ్లపై గీసేవాడు.


మధ్య శిలాయుగం
* పాతరాతి, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని 'మధ్య శిలాయుగం' అంటారు. ఈ యుగంలో వాతావరణం మార్పు చెందడం వల్ల ఆలోచన, విచక్షణా జ్ఞానం పెరిగింది. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.
* మధ్య శిలాయుగంలో మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించేవారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడటంతో పాటు సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి.


కొత్తరాతియుగం
* ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకుని వ్యవసాయం, పశుపోషణను ప్రారంభించాడు.
* మట్టి కుండలను కాల్చడం రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది. చేనేత కళ ఆరంభమై క్రమంగా భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. పత్తిపంటను పండించడం వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార, వాణిజ్యాలకు మార్గదర్శకమైంది.
* ఈ విధంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం కొత్తరాతియుగంలోనే జరిగింది. మానవుడు ఆహార సేకరణ, వేటగాడి దశ నుంచి స్థిరజీవన దశకు చేరుకున్నాడు.


ఆర్థిక జీవనం
* ఈ కాలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకుంది. ఆర్థిక జీవన నిర్మాణంలో స్త్రీ, పురుషులు సమాన పాత్రలు పోషించారు.
* 'చక్రాన్ని' ఆవిష్కరించడం వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.


మతవిశ్వాసాలు
* ప్రజలు ఇతర దేవతలతో పాటు భూమిని కూడా పూజించేవారు. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. ఆనాటి ప్రజలు పునర్జన్మ ఉంటుందని విశ్వసించేవారు.


రాజకీయ జీవనం
* ఈ కాలంలో ప్రజలను శత్రువుల బారి నుంచి కాపాడటం పరిపాలకుల విధి. వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసించేవారు.
* ఈ యుగంలో జరిగిన పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రజలకు అన్ని రంగాల్లో ప్రయోగాత్మకమైన అనుభవాలను కలిగించాయి. ఫలితంగా ఇది శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి ఆరంభదశగా రూపొందింది.


కాంస్యయుగపు నాగరికత
* సంస్కృతి, నాగరికత అనే పదాలను విభిన్న అర్థాల్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పదాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో 'నాగరికత' అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావమని, 'సంస్కృతి' అంటే లలితకళలు, తాత్వికచింతనలు అని భావిస్తున్నారు.
* అందుకే సంస్కృతి మానవులంతా కలిసి ఏర్పాటుచేసిందని, నాగరికత కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశమని తెలిపారు.
* నాగరికత అంటే నగరాల్లో నివసించే సమాజ ప్రగతి. నగరాలు అభివృద్ధి చెందిన చోట నాగరికతలు వెలిశాయని అంటారు.
* పురావస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినట్లుగా క్రీ.పూ.4000 సంవత్సరాల సమీప దశను 'రాగి తగరపు యుగం' అంటారు. నాగరికతా వ్యాప్తికి మూలమైన లోహయుగపు ప్రగతిలో ఈ యుగాన్ని మొదటి దశగా వర్ణించారు.
* ఈ యుగం రాగి, తగరం వాడుకతో ఆరంభమై కంచు, ఇనుము వాడుకలోకి వచ్చే వరకు కొనసాగింది. దీన్ని మానవ చరిత్రలో ప్రముఖ ఘట్టంగా పేర్కొన్నారు.


కాంస్య యుగం
* భాష, రాత సాధనాల ఆవిర్భావంతో మొదలైన నాగరికత నగర సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. జనాభా పెరుగుదలతో పరిసరాల గురించి ఏర్పడిన పరిజ్ఞానం వల్ల ఆర్థికాభివృద్ధి జరిగింది. దీన్నే 'నాగరికతా విప్లవం' అంటారు.
* రాయడం, నేర్చుకోవడం తెలిసిన తర్వాతనే పంచాంగం, భూగోళశాస్త్రం లాంటి విజ్ఞానశాస్త్రాలు రూపొందాయి.


ప్రాచీన నాగరికతలు
* ప్రాచీన నాగరికతలన్నీ సాధారణంగా నదీ లోయల్లోనే పుట్టాయి. ప్రపంచంలోని ముఖ్య నాగరికతలైన మెసపటోమియా, ఈజిప్టు, సింధు నాగరికతలు నదీ లోయల్లోనే వ్యాపించాయి.
* ఈ నాగరికతలు ఇంచుమించుగా క్రీ.పూ.3000 సంవత్సరాల ప్రాంతంలో ఏర్పడి మానవ జీవితాన్ని వ్యవస్థీకరించడానికి దోహదం చేశాయి. ఈ సమయంలోనే ప్రపంచమంతటా లోహం వాడుకలోకి వచ్చింది.
* ఈ నాగరికతాభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచమంతటా విస్తరించింది.
* అటవీ సంపద, భూమిపై సహజ వనరులు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. దీంతోపాటు విరామ సమయం కూడా పెరగడం వల్ల, ప్రజలు కొత్త భావాలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టగలిగారు. ఈ విధంగా ప్రపంచమంతటా సాంస్కృతికాభివృద్ధి జరిగింది.


నదీలోయ నాగరికతలు
* మానవ నాగరికత టైగ్రిస్, యూప్రెటిస్ నదీలోయలైన మెసపటోమియాలో ఆరంభమైంది. ఈజిప్టు, సింధు నాగరికతలు మెసపటోమియాలోని నాగరికత కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, అనేక సామాన్యమైన అంశాలు ఉండటం వల్ల ఇవి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేశాయి.
* ప్రపంచంలోని అన్ని దేశాలు, జాతులు సమష్టిగా కృషి చేసినందువల్లే ప్రపంచ నాగరికత అభివృద్ధి చెందింది.
* ఈ యుగంలో మానవుడు సాధించిన సాంస్కృతికాభివృద్ధి ఆధునిక ప్రపంచ నాగరికతలో అంతర్భాగమైంది.
* శాస్త్రీయ, సాంకేతిక, వైజ్ఞానిక పరిశోధనల వల్ల క్రమేపి సమాజంలోని మానవులంతా సమానులే అనే భావన ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్య విధానాలకు మార్గదర్శకమై ఆధునిక యుగానికి నాందిపలికింది.


సామాజిక లక్షణాలు
* ఈ యుగంలో వేటగాళ్ల దశ అంతమై వ్యవస్థీకృత జీవనం మొదలైంది. రాత నేర్చుకోవడం వల్ల సమాజంలో స్థిరత్వం ఏర్పడి మానవుడి ఆలోచనలకు ఒక క్రమరూపం ఏర్పడింది. రాతికి బదులు లోహాన్ని ఉపయోగించడం వల్ల వృత్తి నైపుణ్యం పెరిగింది.
* గ్రామాల స్వయంసమృద్ధి అంతరించి పట్టణాలపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా కనుక్కున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.
* వ్యవసాయంలో లోహాన్ని ఉపయోగించి మెరుగైన నాగళ్లను వాడటం వల్ల పంటల సాగు విస్తృతమైంది.
* నదీమైదానాల్లో నివసించే ప్రజలు వరదలను నివారించడానికి అడ్డుకట్టలు నిర్మించారు. వరదల సమయంపై అవగాహన ఏర్పడటం వల్ల వ్యవసాయ రుతువులను గుర్తించగలిగారు.
* 'చక్రం' ఉపయోగించడం వల్ల సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.


రాజకీయ మతజీవనంపై నూతన సాంకేతిక పరిజ్ఞానపు ప్రభావం
* లోహయుగం నాటికి అభివృద్ధి చెందిన మెసపటోమియా, ఇరాన్ ప్రాంతాల వారు ఇతరులపై పెత్తనం చేసేవారు. యుద్ధంలో ఓడిపోయిన వారిని బానిసలుగా చేసుకుని తమ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించేవారు.
* నగర శిథిలాల్లో లభించిన అవశేషాలను పరిశీలించడం వల్ల, ఆ కాలంలో నగరపాలక సంస్థలుండేవని తెలుస్తోంది. వర్తకులు, భూస్వాముల సంబంధాలు వేర్వేరుగా ఉండేవి.
* మెసపటోమియా పట్టణ దేవాలయాలు పరిపాలన కేంద్రాలుగా 'పటెశి' అని పిలవబడే పూజారుల ఆధిపత్యంలో ఉండేవి. సుమేరియా పట్టణాల్లో ఈ కేంద్రాలను 'జిగ్గురాత్' అని పిలిచేవారు. నగరాన్ని రక్షించడం, ఆర్థిక సంపదను సమాజంలోని వివిధ వర్గాలకు పంచడం లాంటివి అప్పటి ప్రభుత్వ పనుల్లో ముఖ్యమైనవి.


మత జీవనం
* ఈ యుగంలోనే 'పూజారులు' అనే ప్రత్యేక వర్గం ఏర్పడింది. ముద్రలు, పచ్చబొట్లు మహిమగలవని మానవులు విశ్వసించేవారు. దేవతల చిహ్నాలను ఆయా దేవాలయాల్లో ప్రదర్శించేవారు. ప్రకృతి శక్తులను జయించడానికి మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ మత విశ్వాసాల నుంచి గ్రహించినవే.
* 'దేవుడు' నగర జీవనానికి ప్రధానమైనవాడు. పూజారి ద్వారానే ఆయన ప్రజలకు సన్నిహితుడౌతాడు అని నమ్మేవారు. దేవుడికి ఆహార పానీయాలు సమకూర్చడానికే మానవుడు, సుమేరియన్లు సృష్టించబడ్డారని నమ్మేవారు.
* ఈజిప్టు సుమేరియా దేశాల్లో సూర్యుడు ప్రధాన దైవం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మానవుడి జనన మరణాలతో పోల్చి చూస్తూ మానవులకు పునర్జన్మ ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసించేవారు.
* సమాధుల్లో లభించిన వస్తువుల ఆధారంగా అప్పటి ప్రజలకు మరణానంతరం మరో జీవితం ఉంటుందనే నమ్మకం ఉండేదని స్పష్టమవుతోంది. నగరానికి బయట శ్మశానం ఉండేదని, అనేక పూజా కార్యక్రమాలతో అంత్యక్రియలు నిర్వహించేవారని తెలుస్తోంది.


భాషాకళల విశిష్టత
* ఈజిప్ట్‌లోని పిరమిడ్ల నిర్మాణాలను పరిశీలిస్తే కళాకారుల పనితనంతో పాటు వారిపై మత విశ్వాసాల ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
* రాజుల సమాధుల్లో స్త్రీలను, ధనధాన్యాలను, విలాస వస్తువులను పూడ్చిపెట్టేవారు. ఈ వస్తువులు చనిపోయిన రాజుకు ఉపయోగపడతాయని వారి నమ్మకం. కాంస్య యుగంలో ఆవిష్కృతమైన లిపి ప్రభావం వల్ల గణితం, భూగోళ, వైద్యశాస్త్రాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.
* ప్రాచీన కాలంనాటి ఈజిప్షియన్లు కాలాన్ని సంవత్సరాలు, నెలలు, వారాలుగా విభజించి క్యాలెండర్‌ను రూపొందించారు. రోజుకు 24 గంటల కాలమానాన్ని నిర్ణయించారు. వారు పిరమిడ్ల నిర్మాణంలో కచ్చితమైన కొలతలను పాటించారు. ఈ ప్రయోగాలన్నీ తక్షణ అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తాయి.
* కాంస్యయుగంలో సాధించిన పరిజ్ఞానం అడవులను పెంచడానికి యుద్ధాల్లో విజయం సాధించడానికి, వ్యాపారం కొనసాగించడానికి ఉపయోగపడింది. వీటిని గమనిస్తే మానవుడు భౌతిక వనరులను, తనకు తన సంతానానికి, సుఖ సంతోషాలను కలిగించడానికి ఉపయోగించేవారు.
* ఆ కాలంనాటి శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన పదాలన్నీ మత విశ్వాసాల నుంచే ఏర్పడ్డాయి.
* కాంస్యయుగంలో వివిధ ప్రాంతాల్లోని మానవులు సాధించిన సాంకేతిక పరిజ్ఞానంలో సామాన్యమైన లక్షణాలు ఉండటం సమైక్య రాజకీయ వ్యవస్థల ఏర్పాటుకు దోహదంచేసింది.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సింధు నాగరికత

క్రీ.శ. 1921 లో జరిగిన ఒక సంఘటన భారతదేశ చరిత్రనే కాకుండా పురావస్తు శాస్త్ర గతిని కూడా మార్చేసింది. రాయ్‌బహద్దూర్ దయారాం సహాని 1921 లో ప్రసిద్ధ హరప్పా నగరాన్ని సింధునదికి ఉపనది అయిన రావి నది ఒడ్డున కనుక్కున్నారు. 1922 లో ఆర్.డి. బెనర్జీ సింధునది కుడి ఒడ్డున ఉన్న మొహంజోదారోను కనుక్కున్నాడు.
సింధు నాగరికతకు పురావస్తు శాస్త్రజ్ఞులు వివిధ పేర్లను ప్రతిపాదించారు. క్రీ.పూ. 3000 నాటి సుమేరియా నాగరికతతో హరప్పా నాగరికతకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా దీన్ని మొదట ఇండో-సుమేరియా నాగరికతగా పిలిచారు. ఇది సింధు నది లోయలో అభివృద్ధి చెందడం వల్ల దీన్ని సింధు నాగరికత అని కూడా అంటారు. సర్ జాన్ మార్షల్ దీన్ని హరప్పా నాగరికత (లేదా) సంస్కృతిగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఏ ప్రదేశంలో ఒక నాగరికతను మొదట కనుక్కుంటారో దాని ఆధారంగా ఆ సంస్కృతికి పేరు పెట్టడం పురావస్తు శాస్త్ర సంప్రదాయం. అనేక సింధు లోయ ప్రదేశాలు హక్ర - ఘగ్గర్ నదీ ప్రాంతంలో కనుక్కోవడం వల్ల దీన్ని సరస్వతి సింధు నాగరికత అని పిలుస్తున్నారు.


* కాలం: వేద సాహిత్యం ప్రకారం క్రీ.పూ. 2000 సంవత్సరానికి ముందు భారతదేశ చరిత్ర, సంస్కృతి ఉన్నట్లు ఆధారాలు లేవు. అయితే, మొహంజోదారో, హరప్పా, చాన్హుదారో, ఇతర సింధులోయ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల ఆధారంగా క్రీ.పూ. 3200 ఏళ్లనాటి సంస్కృతి వెలుగులోకి వచ్చింది. సుమేరియా, అక్కడ్, బాబిలోనియా, ఈజిప్టు, అస్సీరియా లాంటి గొప్ప ప్రాచీన నాగరికతలకు ఏమాత్రం తీసిపోని నాగరికత హరప్పా ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. రేడియో కార్బన్ డేటింగ్ విధానం ద్వారా క్రీ.పూ. 2500 - 1750 మధ్య ఈ నాగరికత పరిణితి చెందే దశలో ఉన్నట్లు తెలుస్తోంది.


* భౌగోళిక వ్యాప్తి: ఈ నాగరికత ప్రస్తుత పాకిస్థాన్, వాయవ్య భారతదేశంలో ఉండేది. ఇది ఉత్తరాన జమ్మూలోని మాండ నుంచి దక్షిణాన దైమాబాద్ వరకు, తూర్పున పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్ నుంచి పశ్చిమాన బెలూచిస్థాన్‌లోని సుత్కాజెండర్ వరకు విస్తరించింది. పాకిస్థాన్‌లోని హరప్పా, మొహంజోదారో, చాన్హుదారో, భారత్‌లో గుజరాత్‌లోని లోథల్, రంగపూర్, సుర్కోటుడా, రాజస్థాన్‌లోని కాలిబంగన్, హరియాణాలోని బన్వాలి, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్‌లు ఈ నాగరికతకు చెందిన ప్రధాన నగరాలు. దీనికి సంబంధించి తాజాగా కనుక్కున్న ప్రదేశం గుజరాత్‌లోని ధోలవీరా. డాక్టర్ జగపతిజోషి, డాక్టర్ ఆర్.ఎస్. బిస్త్‌లు ఈ ప్రదేశంలో నిర్వహించిన తవ్వకాల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఇది సింధులోయ నాగరికతకు సంబంధించిన అతిపెద్ద ప్రదేశం. హరప్పా సంస్కృతి 1.3 మిలియన్ చ.కి.మీ.ల మేర వ్యాపించి, క్రీ.పూ. 3000 - 2000 మధ్య విలసిల్లింది. ప్రపంచ నాగరికతల్లో ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించిన నాగరికతగా ఇది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.


సామాజిక జీవనం
    హరప్పా ప్రజల సామాజిక జీవనం గురించి తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన ఆధారం అక్కడి తవ్వకాల్లో లభించిన వస్తువులే. వీటికి సంబంధించిన శాసనాలు కానీ, లిఖిత ఆధారాలు కానీ లేవు. హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి. దాన్ని చదివి, అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరి సామాజిక జీవితానికి సంబంధించిన ప్రధాన లక్షణాలను కింది విధంగా వివరించవచ్చు.
* హరప్పా సంస్కృతి నాటి సమాజాన్ని ఆర్థిక హోదాను బట్టి విభజించినట్లు తెలుస్తోంది. హరప్పా నగరాలను అనేక భాగాలుగా విభజించడమే దీనికి నిదర్శనం. హరప్పా సమాజం మాతృస్వామిక సమాజమని సర్ జాన్ మార్షల్ అభిప్రాయం. ఇతడు రెండు కారణాల వల్ల ఈ అభిప్రాయానికి వచ్చాడు.
a) హరప్పా నగరాల్లో లభించిన బంకమట్టితో చేసిన బొమ్మల్లో పురుషుల కంటే స్త్రీల బొమ్మలు అధిక సంఖ్యలో ఉండటం.
b) హరప్పా ప్రజలు అమ్మతల్లిని పూజించడానికి ఎక్కువ ఇష్టాన్ని చూపించడం. దీంతోపాటు బంకమట్టితో చేసిన అమ్మతల్లి బొమ్మలు ఎక్కువ సంఖ్యలో లభించడం.
* హరప్పా ప్రజల సామాజిక జీవనంలో మరో ప్రధాన లక్షణం జంతువులను మచ్చిక చేసుకోవడం. హరప్పా ప్రజలు ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వ్యవసాయం, గృహ అవసరాలు, వేట మొదలైనవి హరప్పా ప్రజలు జంతువులను మచ్చిక చేసుకునేలా చేసి ఉండొచ్చు. హరప్పా ప్రజలకు గుర్రం గురించి తెలుసు. బంకమట్టితో చేసిన గుర్రపు నమూనాలు, గుర్రానికి చెందిన అవశేషాలు మొహంజోదారో, లోథల్, సుర్కోటుడాల్లో లభించాయి. అయితే హరప్పా ప్రజలు గుర్రాన్ని ఎక్కువగా ఉపయోగించలేదు. సమకాలీన సుమేరియన్లు హరప్పా ప్రజలు మచ్చిక చేసుకున్న జంతువులనే మచ్చిక చేసుకున్నారు. అయితే గుజరాత్‌లోని హరప్పా ప్రజలు వరిని పండించారు. ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. కానీ, సుమేరియన్లకు వీటి గురించి తెలియదు.
* దుస్తులు, కేశాలంకరణ, ఆభరణాలు: హరప్పా సంస్కృతికి చెందిన స్త్రీ, పురుషులు దుస్తులు, కేశాలంకరణ పట్ల ఎక్కువ ఇష్టం ప్రదర్శించారు. నూలు, ఉన్నితో చేసిన దుస్తులను వాడేవారు. మొహంజోదారోలో కనుక్కున్న బంకమట్టితో చేసిన బొమ్మ ఆధారంగా హరప్పా ప్రజలకు అల్లికలు, కుట్ల గురించి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. హరప్పా స్త్రీలు అలంకారప్రియులు. ఆ కాలంనాటి ప్రజలు కొయ్య, దంతాలతో చేసిన దువ్వెనలు, గాజులు, వివిధ ఆభరణాలను ఉపయోగించేవారు. బంకమట్టితో చేసిన బొమ్మల ఆధారంగా స్త్రీలు చేతినిండా గాజులు ధరించినట్లు తెలుస్తోంది. అందాన్ని ఇనుమడింపజేసేలా కేశాల మధ్యలో దువ్వెనలు, పువ్వులు పెట్టుకునేవారు. పురుషులకు గడ్డం క్షవరం చేసుకోవడం గురించి తెలుసు.
* స్నానపు అలవాట్లు: హరప్పా నగరంలో చాలావరకు స్నానపు ఘట్టాలను ఏర్పాటు చేశారు. మొహంజోదారోలో ప్రసిద్ధి చెందిన గొప్ప స్నాన వాటిక ఉండేది. స్నానపు గదులు ఇంటి మూలలో లేదా వరండాలో ఉండేవి. ఇది హరప్పా ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల ఉన్న అవగాహనకు నిదర్శనం.
* ఆహారం: హరప్పా ప్రజలు శాకాహారం, మాంసాహారం తినేవారు. కోడి, చేప, మాంసం, గోధుమలు, వరి మొదలైనవి వారి ఆహారంలో ప్రధానమైనవి.
* వినోదాలు: హరప్పా ప్రజలకు ఇంట్లో ఆడుకునే ఆటలైన నృత్యం, జూదం గురించి తెలుసు. అయితే వారికి రథపు పందాలు, వేట గురించి తెలియదు.
* పై లక్షణాలను బట్టి హరప్పా ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో జీవించినట్లు తెలుస్తోంది. ఉన్నతవర్గాల వారు విలాసవంతమైన జీవితాన్ని, సామాన్య ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. హరప్పా సమాజంలో అసమానతలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.


ఆర్థిక వ్యవస్థ
    హరప్పా ప్రజలది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ. వీరు వ్యవసాయం కోసం సారవంతమైన వరద మైదానాలను ఉపయోగించేవారు. వీరికి భూమి దున్నడం తెలుసు. దీనికోసం కొయ్యతో చేసిన నాగలిని ఉపయోగించేవారు. కాలిబంగన్‌లో కనుక్కున్న నాగలితో దున్నిన చాళ్లు, బన్వాలిలో లభించిన బంకమట్టితో చేసిన నాగలి నమూనా ఇందుకు నిదర్శనం. హరప్పా ప్రజలు కాలువల ద్వారా పంటలకు నీటి పారుదల సౌకర్యం కల్పించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సింధు హరివాణం సారవంతంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రతి సంవత్సరం సింధునది వరదలకు గురికావడమే. హరప్పా ప్రజలు వరదనీటి మట్టం తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబరు నెలలో విత్తనాలు వేసి, వరదలు రావడానికి ముందే ఏప్రిల్‌లో గోధుమ, బార్లీ పంటల నూర్పిడి పూర్తిచేసేవారు.
* సింధు హరివాణంలో గోధుమ, బార్లీ, పత్తి మొదలైన పంటలను, గుజరాత్, కథియవార్ ప్రాంతాల్లో వరిని పండించేవారు. హరప్పా ప్రజలు ప్రపంచంలోని మొదటిసారి వరి, పత్తి పంటలను పండించారు. గ్రీకులు క్రీ.పూ. 4 వ శతాబ్దంలో పత్తి పంటను పరిశీలించి, దానికి సింధునది పేరు మీదుగా సిండాన్ అనే పేరు పెట్టారు. లోథల్, కాలిబంగన్‌లలో జరిపిన తవ్వకాలు వరి వాడకం గురించి తెలియజేస్తున్నాయి. ధాన్యాగారాల ఏర్పాటు హరప్పా ప్రజల ప్రధాన లక్షణం. ఆహార ధాన్యాలను సులభంగా రవాణా చేయడానికి ధాన్యాగారాలను నదీ తీరాల్లో ఏర్పాటు చేసేవారు. అనేక హరప్పా నగరాల్లో ధాన్యాగారాలు ఉండటం హరప్పా ప్రజలు వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడటాన్ని తెలియజేస్తోంది.


వ్యాపారం
   హరప్పా నగరాల్లో అవసరమైన ముడిపదార్థాలు లభించనందువల్ల హరప్పా ప్రజలు భారత ఉపఖండం లోపల, ఉపఖండం బయట వర్తక సంబంధాలను నెలకొల్పారు. అంతేగాక, హరప్పా ప్రజలు తాము తయారుచేసిన వస్తువులను అమ్ముకోవడానికి కూడా వర్తక సంబంధాలు అవసరమయ్యాయి.
* ఉపఖండం లోపల వర్తకం: ఉపఖండం లోపల వర్తకం అంటే హరప్పా నగరాల మధ్య అంతర్గత వ్యాపారమే కాకుండా ఇరుగు పొరుగున ఉన్న దక్కను, దక్షిణ భారతదేశం మొదలైన ప్రదేశాలతో జరిపిన వ్యాపారం అని అర్థం. హరప్పా ప్రజలు వివిధ రకాలైన లోహాలు, విలువైన రాళ్లను వేర్వేరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వీరు దక్షిణ భారతదేశం, అఫ్గనిస్థాన్, ఇరాన్ నుంచి బంగారం, రాజస్థాన్‌లోని ఖేత్రి గనుల నుంచి రాగి, బిహార్ నుంచి తగరం, దక్షిణ భారతదేశం, సౌరాష్ట్ర, రాజస్థాన్, దక్కనుల నుంచి విలువైన రాళ్లను దిగుమతి చేసుకునేవారు.
* రవాణా సౌకర్యాలు, వ్యాపార స్వభావం: హరప్పా కాలంనాటి ఓడరేవులు లోథల్, సుర్కోటుడా, సుక్తాజెండర్. వీరు పశ్చిమ ఆసియా దేశాలతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం సాగించేవారు. ఎస్.ఆర్. రావు లోథల్‌లో జరిపిన తవ్వకాల్లో ప్రాచీన ఓడరేవు బయటపడింది. ఇది హరప్పా ప్రజలకు చెందిన గొప్ప సంపన్నమైన ఓడరేవై ఉండొచ్చని పరిశోధకుల అభిప్రాయం.
* మొహంజోదారోలో బయటపడిన ముద్రికలపై ఓడబొమ్మలు అంతర్జాతీయ వ్యాపారాన్ని, వ్యాపారం కోసం పడవల వాడకాన్ని తెలియజేస్తున్నాయి. హరప్పా ప్రజలకు లోహపు నాణేల వాడకం గురించి తెలియదు. బహుశా ముద్రికలను వ్యాపార చిహ్నాలుగా వాడి ఉండొచ్చు. హరప్పా ప్రజల వ్యాపారం వస్తుమార్పిడి ద్వారా జరిగింది. వారు ఉత్పత్తి చేసిన వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి లోహాలు, ముడిసరకులను దిగుమతి చేసుకునేవారు. రవాణా కోసం పడవలు, ఎడ్లబండ్లను వినియోగించేవారు. వీరికి బలమైన చక్రాలతో కూడిన బండ్ల వాడకం గురించి తెలుసు. దీని ఆధారంగా హరప్పా ప్రజలకు కావలసినంత వ్యవసాయ మిగులు ఉండేదని, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని, లాభదాయకమైన అంతర్గత, అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలుస్తోంది. వీరి కాలంలో దిగుమతుల కంటే, ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండేది.

 

ముఖ్యమైన ప్రాంతాలు
         సింధు నాగరికత దాదాపు 1000 ప్రాంతాల్లో విస్తరించింది. ఈ నాగరికత క్రీ.పూ.3000 - క్రీ.పూ.1500 మధ్య కాలం నాటిది. సింధు నాగరికత ఉత్తరాన రూపర్ (పంజాబ్) నుంచి దక్షిణాన భగత్రావ్ (గుజరాత్) వరకు సుమారు 1100 కి.మీ. వ్యాపించి ఉండేది. పశ్చిమాన సుత్కాజెండర్ (పాకిస్థాన్ సరిహద్దు) నుంచి తూర్పున అలంగీర్‌పూర్ (ఉత్తర్ ప్రదేశ్) వరకు దాదాపు 1600 కి.మీ. విస్తరించింది.

 

సింధు నాగరికత కాలంలో బయటపడిన ప్రధాన నగరాలు, వాటి ఉనికి 
1. హరప్పా: పశ్చిమ పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్)
2. మొహంజోదారో: సింధ్ - లార్కానా జిల్లా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.)
3. చాన్హుదారో: సింధ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)
4. సుత్కాజెండర్: పాకిస్థాన్ - ఇరాన్ సరిహద్దుల్లోని బెలూచిస్థాన్‌లో ఉంది.
5. రూపర్: పంజాబ్ (భారతదేశం)
6. బన్వాలీ: హరియాణాలోని హిస్సార్ జిల్లాలో ఉంది.
7. కాలిబంగన్: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఉంది.
8. లోథాల్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.
9. అలంగీర్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలో ఉంది.
10. రంగపూర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.
11. సుర్కోటుడా: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది.
12. ధోలవీర: ఇది ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది.


సింధు నాగరికత పతనం
         సింధు నాగరికత పతనం గురించి కూడా చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రీ.పూ.1700 నాటికి వరదల కారణంగా హరప్పా నాగరికత పతనమైంది. ఉపరితలానికి 50 నుంచి 80 అడుగుల ఎత్తులో కూడా కొన్నిచోట్ల ఇసుక మేటలు కనిపించాయి. కాబట్టి భారీ వరద సంభవించి నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉండొచ్చని చరిత్రకారుల ఊహ. అలాగే సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడ్డారనేది మరో అభిప్రాయం.
* పక్కనున్న ఎడారి విస్తరించడంతో ఇక్కడి భూములు బీడు భూములుగా మారి, సారం కోల్పోయి ఉంటాయని, ఆర్యుల దాడిలో ఈ నాగరికత నాశనమై ఉంటుందని మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం.


 

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జైనమతం

       క్రీ.పూ. 6 వ శతాబ్దం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మతపరమైన ఉద్యమాల అవతరణకు దోహదం చేసింది. చైనాలో కన్‌ఫ్యూజియనిజం, టావోయిజాలు, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి. ఈ శతాబ్దంలోనే గంగానదీ పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది. ఈ కాలంలో వచ్చిన మతాల్లో జైనమతం ఒకటి. ఈ మతం ఏర్పడిన విధానం, అందులోని విశేషాల గురించి పరిశీలిద్దాం.

     క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో 62 మత శాఖలు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. వీటిలో చాలావరకు ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువుల మీద ఆధారపడినవే. ఈ కాలంనాటి మత గురువుల్లో మొదటివాడు పురాణ కశ్శపుడు. ఇతడు మంచి నడవడిక మనిషి కర్మల మీద ఎలాంటి ప్రభావం చూపదని బోధించాడు. అజీవక శాఖకు నాయకుడైన గోసాల మస్కరిపుత్ర కూడా పురాణ కశ్శపుడి వాదనతో అంగీకరించి, నియతి వాదాన్ని బోధించాడు. మరో గురువు అజిత కేశ కాంబలిన్ 'ఉచ్ఛేద వాదం' అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయత, చార్వాక అనే మత శాఖలు ఏర్పడ్డాయి.
* మరో మతాధికారైన పకుధ కాత్యాయన భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో, అదే విధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని అభిప్రాయపడ్డాడు. అతడి భావాల నుంచే వైశేషిక వాదం పుట్టిందని చరిత్రకారుల భావన. కానీ ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన మతశాఖల్లో కేవలం బౌద్ధ, జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా పేరుపొందాయి. దీంతో ఈ శతాబ్దం భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

 

జైనమతం - ఆవిర్భావం 
    జైనమత స్థాపకుడు రుషభనాథుడు. రుగ్వేదంలో రుషభనాథుడు (మొదటి తీర్థంకరుడు), అరిష్టనేమి (22 వ తీర్థంకరుడు)ల ప్రస్తావన ఉంది. రుషభనాథుడి గురించి విష్ణుపురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన్నారు. వీటిలో రుషభనాథుడిని విష్ణుదేవుడి అవతారంగా వివరించారు. జైనమతంలో 24 మంది తీర్థంకరులు (ప్రవక్తలు లేదా గురువులు) ఉన్నట్లు జైనులు విశ్వసిస్తారు. అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు చెందిన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు. తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే కావడం విశేషం. ఇరవైమూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మహావీరుడి కంటే 250 సంవత్సరాల ముందు జీవించాడు. ఇతడు బెనారస్ రాజైన అశ్వసేనుడి కుమారుడు. పార్శ్వనాథుడి కాలం నాటికే జైనమతం వ్యవస్థీకృతమైనట్లు తెలుస్తోంది. వర్థమానుడి తల్లిదండ్రులు పార్శ్వనాథుడి అనుచరులుగా ఉండేవారు. చివరి తీర్థంకరుడు వర్థమానుడు.


మహావీరుడి జీవితం, బోధనలు:
     వర్థమానుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామం (ప్రస్తుత బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా)లో క్రీ.పూ. 540 లో జన్మించాడు. ఇతడి తండ్రి సిద్ధార్థుడు. ఇతడు జ్ఞత్రిక తెగకు అధిపతి, తల్లి త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి. మగధ రాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది. మహావీరుడి భార్య యశోద. వీరి కుమార్తె అనొజ్ఞ (ప్రియదర్శన), అల్లుడు జమాలి. ఇతడే మహావీరుడి మొదటి శిష్యుడు.
* వర్థమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. అప్పుడు అతడి వయసు 30 ఏళ్లు. మొదటి రెండు సంవత్సరాలు పార్శ్వనాథుని మతశాఖలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత దాన్ని వదలి మరో 10 ఏళ్లపాటు అజీవక మతస్థాపకుడైన గోసాల మస్కరిపుత్రతో గడిపాడు. 42 ఏళ్ల వయసులో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద కైవల్యం (సంపూర్ణ జ్ఞానం) పొందాడు. అప్పటి నుంచి జినుడు, జితేంద్రియుడు (జయించినవాడు), మహావీరుడని ప్రసిద్ధి చెందాడు. ఇతడి అనుచరులను జైనులు అంటారు. ఇతడు క్రీ.పూ. 468 లో తన 72 వ ఏట రాజగృహం దగ్గర ఉన్న పావపురిలో మరణించాడు.
* మహావీరుడి మరణం తర్వాత చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో తీవ్రమైన కరవు సంభవించింది. దాంతో జైన సన్యాసులు గంగాలోయ నుంచి దక్కనుకు వలస వెళ్లారు. ఈ వలస జైనమతంలో చీలికకు దారితీసింది. మహావీరుడు చెప్పినట్లు దిగంబరత్వాన్ని పాటించాలని భద్రబాహు పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశంలో ఉన్న జైనులకు నాయకుడైన స్థూలభద్ర తన అనుచరులను తెల్లబట్టలు ధరించాలని కోరాడు. ఇది జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా చీలిపోవడానికి కారణమైంది.


పంచ మహావ్రతాలు:
    జైనమతంలో అయిదు ముఖ్య సూత్రాలున్నాయి. వీటినే పంచ మహావ్రతాలు అంటారు. అవి. 1) అహింస, 2) సత్యం, 3) అస్తేయం (దొంగిలించకూడదు), 4) అపరిగ్రహ (ఆస్తి కలిగి ఉండకూడదు), 5) బ్రహ్మచర్యం. అంతకుముందున్న నాలుగు సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్యం అనే అయిదో సూత్రాన్ని చేర్చాడు. ఈ అయిదు సూత్రాలను సన్యాసులు కఠినంగా ఆచరిస్తే మహావ్రతులని, సామాన్య అనుచరులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు. జైనమతంలో నిర్వాణం సాధించడానికి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన అనే త్రిరత్నాలను పాటించాలి.
మహావీరుని బోధనలు: మహావీరుడు వేదాల ఆధిపత్యాన్ని ఖండించాడు. జంతు బలులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇతడు ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పాడు. అందుకే జైనులు అహింసను కచ్చితంగా పాటిస్తారు. జైనమతం దేవుడి ఉనికిని ఖండించలేదు కానీ, విశ్వం పుట్టుక, కొనసాగడానికి దేవుడే కారణం అనే వాదాన్ని తిరస్కరించింది. దేవుడికి జైనమతంలో తీర్థంకరుల కంటే తక్కువ స్థానాన్ని కల్పించారు. వీరికి వర్ణవ్యవస్థపై విశ్వాసంలేదు. అందుకే వారు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించారు. మహావీరుడు మోక్షసాధనకు పవిత్రమైన, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు. అలాగే కఠోర తపస్సు అవసరాన్ని నొక్కి చెప్పాడు.


* మొదటి జైనమత కౌన్సిల్ పాటలీపుత్రంలో క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీనికి అధ్యక్షుడు స్థూలభద్రుడు. ఈ కౌన్సిల్‌లో జైన గ్రంథాలైన 12 అంగాలను క్రోడీకరించారు. అయితే ఈ గ్రంథాలను శ్వేతాంబరులు మాత్రమే అంగీకరించారు. రెండో జైన కౌన్సిల్ సౌరాష్ట్రలోని వల్లభిలో క్రీ.శ. 5 వ శతాబ్దంలో జరిగింది. దీనికి దేవర్ది క్సమశ్రమణ అధ్యక్షత వహించాడు. ఇందులో 12 అంగాలు, 12 ఉపాంగాలను క్రోడీకరించారు.
జైనమత వ్యాప్తి, అభివృద్ధి: మహావీరుడు, జైన సన్యాసులు సంస్కృతానికి బదులు సామాన్య ప్రజలు మాట్లాడే భాషను వాడటం, సులభమైన నైతిక నియమావళి, జైన సన్యాసుల కార్యకలాపాలు, రాజుల ఆదరణ మొదలైనవి జైనమత వ్యాప్తికి తోడ్పడ్డాయి. మహావీరుడి అనుచరులు దేశమంతటా విస్తరించారు. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు జైన సన్యానులు సింధు నది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తోంది.

* జైన సంప్రదాయం ప్రకారం అజాతశత్రువు తర్వాత మగధను పాలించిన ఉదయనుడు జైనమతాభిమాని. నంద వంశరాజులు కూడా జైనమతాన్ని పోషించారు. క్రీ.పూ. 1 వ శతాబ్దంలో ఉజ్జయిని గొప్ప జైనమత కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 4 వ శతాబ్దం చివరినాటికి భద్రబాహు ఆధ్వర్యంలో కొంతమంది జైన సన్యాసులు దక్కనుకు వలస వెళ్లారు. దీంతో మైసూరులోని శ్రావణ బెళగొల కేంద్రంగా జైనమతం దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చెందింది.


రాజుల ఆదరణ 
     చంద్రగుప్త మౌర్య జైనమతాన్ని పోషించిన వారిలో ప్రముఖుడు. భద్రబాహు దక్కనుకు వలస వెళ్లినప్పుడు, చంద్రగుప్తుడు అతడితోపాటు దక్షిణానికి వెళ్లాడు. ఇతడు ఒక కొండపై ఉన్న గుహను చంద్రగుప్తుడికి అంకితం చేయడంతోపాటు ఆ కొండకు చంద్రగిరి అని నామకరణం చేశాడు.
* క్రీ.పూ. 2 వ శతాబ్దంలో కళింగను పాలించిన ఖారవేలుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనుల విగ్రహాలను ఏర్పాటుచేసి జైనమత వ్యాప్తికి కృషి చేశాడు.
* కుషాణుల కాలంలో మధురలో, హర్షవర్థనుడి కాలంలో తూర్పు భారతదేశంలో జైనమతం ప్రధాన మతంగా ఉండేది. క్రీ.శ. ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని మధుర, దక్షిణ భారత దేశంలోని శ్రావణ బెళగొల ప్రధాన జైనమత కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలు, ఇతర కట్టడాలే ఇందుకు నిదర్శనం.
* క్రీ.శ. 5 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన గంగ, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట రాజవంశాలు జైనమతాన్ని పోషించాయి.
* మాన్యఖేటను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలనను సాగించిన రాష్ట్రకూటులు జైనమతంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. వారు జైన కళలు, సాహిత్యం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడి కాలంలో జినసేనుడు, గుణభద్రుడు మహాపురాణం అనే గ్రంథాన్ని రచించారు. అమోఘవర్షుడు రత్నమాలిక అనే జైన గ్రంథాన్ని రచించాడు.
* క్రీ.శ. 1110 నాటికి గుజరాత్‌లో జైనమతం వ్యాప్తి చెందింది. అన్హిల్‌వారా (Anhilwara) పాలకుడు, జయసింహగా ప్రసిద్ధిచెందిన చాళుక్యరాజు సిద్ధరాజు, కుమారపాల జైనమతాన్ని ఆదరించారు. వారు జైనమతాన్ని స్వీకరించి, జైనుల సాహిత్యాన్ని, దేవాలయాల నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించారు. కుమారపాలుడి ఆస్థానంలోని జైనపండితుడు హేమచంద్రుడు రచించిన త్రిషష్టి సలక పురుష చరిత అనే గ్రంథం ప్రసిద్ధిచెందింది.


జైనమత పతనం: భారతదేశంలో జైనమతం పతనం కావడానికి ప్రధాన కారణం అహింసకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడమేనని చరిత్రకారుల అభిప్రాయం. అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని జైనులు పేర్కొన్నారు. చెట్లు, కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని నమ్మారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు. మొదట్లో జైనమతానికి రాజులనుంచి ఆదరణ లభించినా, తర్వాతికాలంలో ఈ మతానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బౌద్ధ మతం

‣ బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధ జాతక కథలు వివరిస్తాయి.
‣ బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు పాళీ భాషలో ఉన్నాయి.
‣ భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ మతంగా అభివృద్ధి చెందింది.
‣ వినయ పీటకం బౌద్ధ సంఘ నియమ నిబంధనలను, సుత్త పీటకం బుద్ధుడి బోధనలను, అభిదమ్మ పీటకం బౌద్ధ దమ్మ వేదాంతాన్ని వివరిస్తాయి.
‣ బౌద్ధ మతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు
1. స్తూపం
2. చైత్యం
3. విహారం
‣ బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.
‣ బౌద్ధ మతస్తుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.
‣ బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు.
‣ స్తూప, చైత్య, విహారాలు ఒకే చోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొన్నారు.
‣ బౌద్ధ ఆరామాలు నాడు ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
‣ భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జున కొండ విశ్వవిద్యాలయం పేరొందింది.
‣ భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల, ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నలంద.
‣ విహార దేశంగా పేరొందిన రాష్ట్రం బిహార్
‣ గాంధార, అమరావతి శిల్ప కళలు బౌద్ధ మత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.
‣ సాంచీ స్తూపం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ దగ్గర ఉంది.
‣ సారనాథ్ స్తూపం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
‣ పిప్రావహని భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం అని పేర్కొంటారు.
‣ ఆంధ్రదేశం / దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా భట్టిప్రోలు పేరుగాంచింది.
‣ బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధ మతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.
‣ బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.
‣ బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరినిర్యాణం పౌర్ణమి రోజునే జరిగాయి.
‣ బుద్ధుడి మరణం తర్వాత బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)
‣ మొదటి బౌద్ధ సంగీతి - రాజగృహం - అజాతశత్రువు కాలం - మహాకాశ్యపుడు అధ్యక్షుడు.
‣ రెండో బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగింది. సబకామి దానికి అధ్యక్షుడు.
‣ మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. మొగ్గలిపుతతిస్స అధ్యక్షుడు.
‣ నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కశ్మీర్/ కుందనవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు.
‣ మాధ్యమిక సాంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు.
‣ మైత్రేయనాథుడు యోగాచారవాదాన్ని ప్రారంభించాడు.
‣ మాధ్యమికవాదాన్నే శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.
‣ యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా కూడా పేర్కొంటారు.
‣ యోగాచార వాదం హీనయానానికి చెందిన వాస్తవిక వాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.
‣ ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరుగాంచింది.
‣ అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.
‣ సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.
‣ మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.
‣ మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
‣ సధర్మపుండరీకం, లలిత విస్తార, వజ్రచేధిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.
‣ బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరొక శాఖ తర్వాత కాలంలో ఏర్పడింది.
‣ ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం సాధించడం ఈ వాదం వారి ఆశయం.
‣ వజ్రయాన శాఖవారు బౌద్ధులు, బోధిసత్వుల భార్యలైన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజించారు.
‣ వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లెవేయడం)
‣ పాల వంశీయులు, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.
‣ సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం.
‣ కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.
‣ గాంధార శిల్పకళ కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధ మతం ప్రేరణతో అభివృద్ధి చెందింది.
‣ భాగవతుడు అంటే ఆరాధనీయమైన వారిని ఆరాధించేవ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.
‣ పాణిని రచన అష్టాధ్యాయిలోను, మెగస్తనీస్ ఇండికా (హెరాక్లెస్) లోను, బెస్‌నగర్ స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించిన ప్రాస్తావన ఉంది.
‣ బెస్ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజు భాగభద్రుడు వేయించాడు.
‣ బెస్ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియో డోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.
‣ గుప్తుల కాలంలో భాగవత మతం అభివృద్ధి చెందింది.
‣ నాగులు, యక్షులు, గ్రామదేవతల ఆరాధన నుంచి బ్రాహ్మణవాదం అభివృద్ధి చెందింది.
‣ పంచాయతన పూజా విధానంలో గణేశుడికి అగ్రస్థానం ఇచ్చారు.
‣ గుప్తయుగానంతరం భాగవత మతాన్ని వైష్ణవ మతంగా పేర్కొన్నారు. అవతార సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యం లభించింది.
‣ భాగవత మతం భగవద్గీత మీద ఆధారపడింది. వైష్ణవానికి క్రమంగా భాగవత పురాణం, విష్ణు పురాణాలు ప్రధాన గ్రంథాలుగా మారాయి.
‣ క్రీ.శ. 100వ సంవత్సరంలో 'శాండిల్యుడు' పంచరాత్రాలను ప్రబోధించారు. ఇందులో వాసుదేవ కృష్ణుడి కుటుంబం మొత్తాన్ని తాదాత్మ్యీకరించారు.
‣ కృష్ణుడి సోదరుడు సంకర్షణ, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు, కృష్ణుడి మనువడు అనిరుద్ధుడు.
‣ విఖాననుడు ప్రబోధించిన వైఖానన సంప్రదాయాన్ని అత్రి, మరీచి, భృగు, కశ్యపుడు అనే మహార్షులు ప్రచారం చేశారు.
‣ వైఖానన సంస్కార సిద్ధాంతం విష్ణువుకు చెందిన అయిదు రూపాల భావనపై ఆధారపడి ఉంది.
‣ బ్రహ్మ, పురుషుడు, సత్యం, అచ్యుతం, అనిరుద్ధుడు అనేవి విష్ణువు అయిదు రూపాల భావనలు.
‣ తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం, కంచి దేవాలయాలలో సంస్కృత భాషలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు వైఖాననశాఖకు చెందినవారే.
‣ దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులను ఆళ్వారులు అంటారు. వీరు మొత్తం పన్నెండుమంది.
‣ నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ వారిలో ముఖ్యమైనవారు.
‣ ఆళ్వార్‌లలో ఉన్న ఏకైక మహిళ ఆండాళ్.
‣ ఆండాళ్ అనే తమిళ కవయిత్రి గురించి శ్రీకృష్ణ దేవరాయలు తన 'ఆముక్తమాల్యద' గ్రంథంలో ప్రస్తావించారు.
‣ ఆళ్వార్లు రాసిన పద్యాలు, పాటలను పాశురాలు లేదా 'ప్రబంధాలు' అంటారు.
‣ 'తండ్రివి నీవే ఓ పరమాత్మా! అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టేనయ్యా!' అనే పాటను నమ్మాళ్వార్ రాసి పాడారు.
‣ నాకేల ఇవ్వవు నీ దర్శన భాగ్యము? దాగుడు మూతలు ఏల' అని నమ్మాళ్వార్ భగవంతుడిని ప్రశ్నిస్తూ పద్యాలు రాశారు.
‣ శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు, త్రిమతాచార్యులు/ వైష్ణవాచార్యులుగా పేరొందారు.
‣ శంకరాచార్యులు 'అద్వైత' మత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. (కేరళలో జన్మించారు, 8వ శతాబ్దం.)
‣ 'జీవాత్మ, పరమాత్మ ఒకటే. మోక్షసాధనకు జ్ఞానమార్గం అనుసరించడం ఒక్కటే మార్గం' అని శంకరాచార్యులు ప్రబోధించారు.
‣ రామానుజాచార్యులు క్రీ.శ. 11వ శతాబ్దంలో విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు.
‣ 'విష్ణువు మీద గాఢమైన భక్తి కలిగి ఉండటమే ముక్తికి ఉన్న ఏకైక మార్గం' అని రామానుజాచార్యులు పేర్కొన్నారు.
‣ రామానుజాచార్యులపై ఆళ్వార్లు అధిక ప్రభావాన్ని చూపారు.
‣ భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రారంభికుడిగా, నిమ్నకులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించిన తొలి వ్యక్తిగా రామానుజాచార్యులు పేరొందారు.
‣ రామానుజులు ప్రచారం చేసిన విశిష్టాద్వైతాన్ని 'శ్రీవైష్ణవం' అని పేర్కొంటారు. మధ్వాచార్యులు ద్వైత మతాన్ని, వల్లభాచార్యుడు శుద్ధా ద్వైతాన్ని, నింబార్కుడు ద్వైతాద్వైతాన్ని ప్రచారం చేశారు.
‣ బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.
‣ బౌద్ధమతంలో చేరిన వేశ్యగా ఆమ్రపాలిని పేర్కొంటారు.
‣ బుద్ధుడు అంగుళీమాలుడు అనే బందిపోటు దొంగను బౌద్ధమతంలో చేర్చుకున్నాడు.
‣ బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో చేర్చుకున్నాడు.
‣ బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.
‣ బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

‣ బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు

‣ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు (శాక్యముని, తథాగతుడు, అంగీరసుడు అనేవి ఇతర పేర్లు)

‣ గౌతమబుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి

‣ బుద్ధుడు కపిలవస్తు రాజ్యానికి చెందినవాడు, శాక్య వంశస్థుడు.

‣ సిద్ధార్థుడు క్రీ.పూ.563లో లుంబిని వనంలో జన్మించాడు. లుంబిని ప్రస్తుతం నేపాల్‌ దేశంలో ఉంది.

‣ క్రీ.పూ.483లో నేటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుశి నగరంలో నిర్యాణం చెందాడు.

‣ బుద్ధుడి జీవితంలో జరిగిన 5 ప్రధాన సంఘటనలను పంచ కల్యాణాలు అంటారు.

‣ బుద్ధుడిని పెంచిన తల్లి - ప్రజాపతి గౌతమి

‣ బుద్ధుడికి 19వ ఏట యశోధరతో వివాహం జరిగింది. వారికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు.

‣ కపిలవస్తు నగరంలో ఒకేరోజు ఒక వృద్ధుడిని, వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని, శవాన్ని, సన్యాసిని చూసిన బుద్ధుడు పరివర్తన చెందాడు. అనంతరం తన 29వ ఏట ఇల్లు విడిచి వెళ్లాడు. దీన్నే మహాభినిష్క్రమణం అంటారు.

‣ బుద్ధుడి ప్రధాన గురువులు - అలరక, ఉద్ధారక

‣ బుద్ధుడు అలారకలామ అనే గురువు వద్ద సాంఖ్యదర్శనాన్ని నేర్చుకున్నాడు.

‣ రుద్రలీ రామపుత్ర అనే గురువు వద్ద యోగాభ్యాసం అధ్యయనం చేశాడు.

‣ బుద్ధగయలో సుజాత అనే కర్షక బాలిక బుద్ధుడికి క్షీరాన్నం (గంజి) ఇచ్చింది.

‣ సిద్ధార్థుడు తన 35వ ఏట 40 రోజుల ధ్యానం అనంతరం జ్ఞానోదయం పొందాడు. దీన్నే సంబోధి అంటారు.

‣ సిద్దార్థుడు నేటి బిహార్‌లోని గయలో రావిచెట్టు కింద 40 రోజులు తపస్సు చేశాడు.

‣ బుద్ధుడి తపస్సును భగ్నం చేసేందుకు మార అనే దుష్టశక్తి ప్రయత్నించగా భూదేవి వచ్చి మారను శిక్షించింది. ఈ విషయాన్నే బౌద్ధ సాహిత్యంలో భూస్పర్శముద్రగా పేర్కొన్నారు.

‣ బుద్ధుడి గుర్రం పేరు కంఠక. రథసారథి చెన్నడు. 

‣ బుద్ధుడు తన తొలి ఉపదేశాన్ని సారనాథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) లోని జింకతోట/మృగదావనంలో తన పూర్వ సహచరులైన అయిదుగురు స్నేహితులకు బోధించాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు.

‣ బుద్ధుడి బోధనలను ఆర్య సత్యాలు(Nobel Truths) అంటారు

‣ ఆర్య సత్యాలు నాలుగు అవి;

1) ప్రపంచం దుఃఖమయం

2) దుఃఖానికి కారణం కోరికలు

3) దుఃఖం పోవాలంటే కోరికలు అంతమవ్వాలి

4) కోరికల అంతానికి అష్టాంగమార్గాన్ని అనుసరించాలి.

‣ దుఃఖ నివారణ, మోక్ష సాధనకు బుద్ధుడు చూపిన మార్గం లేదా చెప్పిన సూత్రాలే అష్టాంగ మార్గం.

‣ అష్టాంగ మార్గంలోని ఎనిమిది సూత్రాలు

1) సరైన జీవనం         2) సరైన వాక్కు 

3) సరైన క్రియ         4) సరైన ధ్యానం 

5) సరైన నిశ్చయం     6) సరైన దృష్టి 

7) సరైన ఆలోచన     8) సరైన శ్రమ.

- బౌద్ధమత గ్రంథాలను త్రిపీటకాలు అంటారు. అవి;

1) వినయ      2) సుత్త      3) అభిదమ్మ

‣ బుద్ధుడు, ధర్మం, సంఘంలను బౌద్ధ త్రిరత్నాలుగా పేర్కొంటారు. (గమనిక: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి)

‣ బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.

‣ ఆమ్రపాలి అనే వేశ్య, అంగులీమాలుడు అనే బందిపోటు దొంగ బౌద్ధ మతంలో చేరినట్లు పేర్కొంటారు.

‣ బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో  చేర్చుకున్నాడు.

‣ బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.

‣ బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

‣ బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధజాతక కథలు  వివరిస్తాయి.

‣ బౌద్ధ మతంలో పవిత్ర గ్రంథాలైన త్రిపీటకాలు పాళీభాషలో ఉన్నాయి.

‣ భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం ప్రపంచమతంగా అభివృద్ది చెందింది.

‣ వినయ పీటిక బౌద్ధ సంఘ నియమ నిబంధనలను; సుత్త పీటిక బుద్ధుడి బోధనలను; అభిదమ్మ పీటిక బౌద్ధదమ్మ (బౌద్ధ ధర్మం) వేదాంతాన్ని వివరిస్తాయి.

 బౌద్ధమతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు

1) స్తూపం      2)  చైత్యం      3) విహారం

‣ బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.

‣ బౌద్ధమతస్థుల పూజాగృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.

‣ బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలే విహారాలు.

‣ స్తూప, చైత్య, విహారాలు ఒకేచోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొంటారు. ఈ ఆరామాలు అప్పట్లో ప్రసిద్ధ విద్యాకేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.

‣ భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జునకొండ విశ్వవిద్యాలయం పేరొందింది.

‣ భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల కాగా ప్రసిద్ధి చెందింది నలంద.

‣ విహార దేశంగా పేర్కొన్న రాష్ట్రం బిహార్‌.

‣ గాంధార, అమరావతి శిల్పకళలు బౌద్ధమత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.

‣ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ దగ్గర సాంచీ స్తూపం ఉంది.

‣ సారనాథ్‌ స్తూపం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది.

‣ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా పేరొందింది పిప్రావహ.

‣ ఆంధ్రదేశం/దక్షిణ భారతదేశంలో అతిప్రాచీన స్తూపం భట్టిప్రోలు.

‣ బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధమతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.

‣ బుద్ధుడి సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.

‣ బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరి నిర్యాణం పౌర్ణమి రోజే జరిగాయి.

‣ బుద్ధుడి మరణానంతరం బౌద్ధమత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు. (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)

‣ మొదటి బౌద్ధ సంగీతిలో వినయ, సుత్త పీటకాలను సంకలనం చేశారు.

‣ వినయ పీటకాన్ని ఆరామ స్మృతి అని పేర్కొంటారు. సుత్త పీటకంలో బుద్ధుడి బోధనలు ఉన్నాయి.

‣ రెండో బౌద్ధ సంగీతిలో బౌద్ధులు స్థవిరవాదులు/థెరవాదులు, మహాసాంఘికులుగా విడిపోయారు.

‣ మూడో బౌద్ధ సంగీతిలో అభిదమ్మ పీటకాన్ని సంకలనం చేశారు. (దీంతో త్రిపీటకాల సంకలనం పూర్తయ్యింది.)

‣ నాలుగో బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం హీనయానం, మహాయానంగా విడిపోయింది.

‣ సభలో చర్చలు పాళీ భాషలో కాకుండా సంస్కృత భాషలో జరిగాయి.

‣ బుద్ధుడిని మాములు బోధకుడిగా (మనిషిగా) భావించి, విగ్రహారాధనను వ్యతిరేకించిన వర్గం హీనయానులు.

‣ హీనయానులు మత ప్రచారానికి, సాహిత్య రచనకు పాళీ భాషను వినియోగించారు.

‣ హీనయానులు స్వీయ క్రమశిక్షణ, ధ్యానం ద్వారా మోక్షం పొందవచ్చని విశ్వసించారు.

‣ పాళీ ధర్మశాస్త్ర గ్రంథాలైన త్రిపీటకాలను పవిత్ర గ్రంథాలుగా భావిస్తారు.(హీనయానులు)

‣ త్రిపీటకాల్లో అతిముఖ్యమైంది, పెద్దది - సుత్త పీటకం.

 సుత్త పీటకాన్ని అయిదు నికాయలుగా విభజించారు. అవి:

1) దీర్ఘ నికయ         2) మాధ్యమ నికయ 


3) సంయుక్త నికయ    4) అంగుత్తర నికయ 

5) ఖుద్దాక నికయ

*  జాతక కథలు, దమ్మపదం లాంటి భాగాలు ఖుద్దాక నికయలో ఉన్నాయి.

*  మిళింద పన్హా గ్రంథంలో గ్రీకు రాజు మీనాండార్‌కు, బౌద్ధ సన్యాసి నాగసేనుడికి మధ్య జరిగిన చర్చల సారాంశ వివరణ ఉంది.

*  హీనయానులు మిళింద పన్హా, దీప వంశం, మహావంశం లాంటి గ్రంథాలను అనుసరించారు.

* మహాయానులు బుద్ధుడిని దైవ స్వరూపంగా భావించి విగ్రహారాధనను సమర్థించారు.

* బుద్ధుడి ప్రతిమలను పెట్టి పూజించే చైత్యాలు మహాయానులకు చెందినవి.

* మహాయానులు మత ప్రచారానికి సంస్కృత భాషను వినియోగించారు. వీరు బుద్ధులు, బోధిసత్వుల దయ, సహాయాల ద్వారానే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

* గౌతముడు, అమితాభుడు, మైత్రేయనాథులను బుద్ధులుగా; అవలోకితేశ్వరుడు, మంజుశ్రీ, వజ్రపాణి లాంటి వారిని బోధిసత్వులుగా పేర్కొంటారు. అంటే మహాయానులు బుద్ధులు, బోధిసత్వుÄల విగ్రహాలను పూజిస్తారు.

* మహాయానంలో మాధ్యమిక వాదం, యోగాచార వాదం అనే రెండు ప్రధాన సంప్రదాయాలు ఉన్నాయి.

* మాధ్యమిక సంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు. మాధ్యమిక వాదాన్ని శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.

* యోగాచార వాదాన్ని మైత్రేయనాథుడు ప్రారంభించారు. యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా పిలుస్తారు. ఇది  హీనయానానికి చెందిన వాస్తవికవాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.

* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞా పారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరొందింది.

* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.

* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.

* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.

* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి, వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

* సధర్మ పుండరీకం, లలిత విస్తార, వజ్ర ఛేదిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.

* తర్వాతి కాలంలో బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరో శాఖ కూడా ఏర్పడింది. ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం పొందడం ఈ వాదం వారి ఆశయం.

* వజ్రయాన శాఖకు చెందినవారు బుద్ధుల, బోధిసత్వుల భార్యలైౖన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజిస్తారు. వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లె వేయడం.)

* పాల, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.

* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం. 

* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.

* కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధమతం ప్రేరణలో గాంధర శిల్పకళ అభివృద్ధి చెందింది.

* మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో రాజగృహంలో మహాకాశ్యపుడి అధ్యక్షతన జరిగింది.  

* కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగిన రెండో బౌద్ధ సంగీతికి సబకామి అధ్యక్షత వహించాడు.

* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. అధ్యక్షుడు - మొగలిపుత్త తిస్స 

* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కాశ్మీర్‌/కుందలవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు

* బుద్ధుడి జననానికి ప్రతీక గుర్తు - తామరపువ్వు/ పద్మం

* బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి (మహాభినిష్క్రమణం) గుర్తు - గుర్రం

* బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం (సంబోధి)  - బోధి వృక్షం

* బుద్ధుడి తొలి ఉపదేశం (ధర్మచక్ర పరివర్తన)  - ధర్మచక్రం 

* బుద్ధుడి మరణం లేదా పరినిర్యాణం - స్తూపం

 

ఇతర మత శాఖలు

* అజీవక మతాన్ని గోశాల మస్కరిపుత్ర (మక్కలిపుత్ర/ మఖలగోసలుడు) స్థాపించాడు. ఈ మతానికి చెందిన వారు నియతి అనే విధిని విశ్వసిస్తారు. అశోక వృక్షాన్ని పూజిస్తారు. మౌర్యుల కాలంలో ఈ మతశాఖ వృద్ధి చెందింది.

* భూమి, గాలి, నీరు లాగే సంతోషం, దుఃఖం జీవితం అనేవి విధ్వంసనీయం కావని పకుధ కాత్యాయనుడు ప్రబోధించాడు. ఇతడి ప్రబోధాల నుంచి వైశేషిక సంప్రదాయం ఆవిర్భవించింది.

* శరీరం, ఆత్మ వేర్వేరు అని ప్రబోధించిన పురాణ కశ్యప ప్రభావంతో సాంఖ్యతత్వ సంప్రదాయం ఆవిర్భవించింది.

* సంపూర్ణ భౌతికవాదానికి సంబంధించిన మొదటి ప్రబోధకుడు - అజితకేశ కంబలిన్‌. ఇతడు సర్వనాశన వాదం/ ఉచ్ఛేదనాన్ని ప్రచారం చేశాడు. ఇతడి ప్రభావంతోనే చార్వాక సంప్రదాయం/లోకాయుత సంప్రదాయం తలెత్తింది.

* కృష్ణ వాసుదేవుడిని విష్ణుమూర్తిగా కొలిచే భక్తి సంప్రదాయాన్ని భాగవత మతంగా పేర్కొంటారు. భాగవతుడు అంటే ఆరాధనీయమైనవారిని ఆరాధించే వ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.

* పాణిని రచన అష్టాధ్యాయిలో, మెగస్తనీస్‌ ఇండికా (హెరాక్లెస్‌)లో, బెస్‌ నగర స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించి ప్రస్తావన ఉంది.

* బెస్‌ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజైన భాగభద్రుడు వేయించాడు.

* బెస్‌ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియోడోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.


  

Posted Date : 02-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుషాణులు

            భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాల్ల్లో కుషాణులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమేకాకుండా భాష, సాహిత్యం, కళలు మొదలైనవాటిని బాగా ఆదరించారు. కుషాణుల్లో ప్రముఖుడు కనిష్కుడు. ఇతడిని రెండో అశోకుడిగా పేర్కొంటారు. కనిష్కుడి పాలన, కుషాణుల వంశం విశేషాల గురించి తెలుసుకుందాం.
            మౌర్య వంశ పతనానంతరం భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాలన్నింటిలో ప్రముఖమైంది కుషాణుల వంశం. వీరిని 'తాకారియన్లు' అని కూడా అంటారు. వీరు యూచి తెగకు చెందినవారు. మధ్య ఆసియా ఉత్తర భాగంలో చైనాకు దగ్గరగా ఉన్న గడ్డిమైదానాలకు చెందిన సంచార జాతిగా వీరిని పేర్కొంటారు. వీరు సింధూ మైదానంలోని దక్షిణ భాగంలో, గంగా మైదానంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమ అధికారాన్ని నెలకొల్పారు. వీరి సామ్రాజ్యం ఆక్సస్‌నది నుంచి గంగానది వరకు, మధ్య ఆసియాలోని ఖోరసాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వరకు విస్తరించి ఉండేది.
 మధ్య ఆసియాలో ఎక్కువ భాగం, నేటి రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కొన్ని భాగాలు, పాకిస్థాన్, ఉత్తర భారతదేశం మొత్తం.. ఇలా అనేక ప్రాంతాలను కుషాణులు ఒకే పరిపాలన కిందికి తెచ్చారు. అందుకే వీరి పాలనలో వివిధజాతులు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఒకరితో ఒకరు కలిసి జీవించేవారు. దీని ఫలితంగా ఒక కొత్త సంస్కృతి ఉద్భవించింది.
కుషాణులు ఎక్కడ జన్మించారు అనేదానిపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
           'రాజుల పేర్లను బట్టి కుషాణులు ఇరాన్ ప్రాంతవాసులు'. - ఎఫ్.డబ్ల్యూ. థామస్
           'కుషాణుల శరీర నిర్మాణాన్ని బట్టి టర్కీస్థాన్‌కు చెందినవారు'. - కల్హనుడు
           'వీరు చైనీస్ తుర్కిస్థాన్ ప్రాంతానికి చెందినవారు'.- స్టెన్‌కోన్
* మధ్య ఆసియాలోని తొలి కుషాణ నివాస స్థలమైన 'ఖల్చయాన్‌'లో వీరి ఇతిహాస వాక్యాలున్న నాణేలు బయటపడ్డాయి. ఇవి ఖరోష్ఠి, బ్రహ్మీ లిపుల్లో ఉన్నాయి. వీటి ఆధారంగా వీరు సాంస్కృతిక, వ్యాపార కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని,ప్రాకృతం మాట్లాడిన సమూహాలు భారత ఉపఖండం అవతల జీవించి ఉండవచ్చని చెప్పవచ్చు.


కుషాణ వంశస్థాపన
   కుషాణుల్లో రెండు రాజవంశాలు కనిపిస్తాయి. మొదటిది 'కాడ్‌ఫిసెస్', రెండోది 'కనిష్క'. కుషాణ రాజ్యస్థాపకుడు కుజుల కాడ్‌ఫిసెస్. ఇతడు యూచిలోని అయిదు తెగలకు చెందిన వారిని ఏకం చేయడమే కాకుండా హిందూకుష్ పర్వతాలు దాటి కాబూల్, కశ్మీర్‌లో తన అధికారాన్ని స్థాపించాడని చైనీస్ ఆధారాన్ని బట్టి తెలుస్తుంది.
 ఇతడి తర్వాత 'విమా కాడ్‌ఫిసెస్' రాజయ్యాడు. ఇతడు బంగారు నాణేలు ముద్రించాడు. నాణేలపై శివుడి ప్రతిమ ఉంటుంది. పాశుపత శైవాన్ని అభిమానించాడు.


కనిష్కుడు
      విమా కాడ్‌ఫిసెస్ తర్వాత కనిష్కుడు అధికారంలోకి వచ్చాడు. ఇతడు కుషాణుల్లో అత్యంత ప్రముఖుడు. ఇతడి పరిపాలనలో కుషాణ వంశం అత్యున్నత స్థితికి చేరుకుంది. కనిష్కుడు సమకాలీన ప్రపంచంలో గొప్పశక్తిగా ఎదిగాడు.
* భారతదేశంలో ఇతడి అధికారం దక్షిణాన సాంచి, తూర్పున బెనారస్ వరకు విస్తరించింది.ఇతడు మధ్య ఆసియాలో కూడా విశాలమైన రాజ్యభాగాల్ని స్వాధీనం చేసుకున్నాడు.ఇతడి రాజధాని పురుషపురం (నేటి పెషావర్). మధురలో లభించిన కుషాణుల నాణేలు, శాసనాలు, నిర్మాణాలు, శిల్పాలను బట్టి ఆ నగరం కుషాణులకు రెండో రాజధానిగా ఉండేదని భావిస్తున్నారు.
* కనిష్కుడు రాజ్యాధికారాన్ని చేపట్టిన సంవత్సరం గురించి చరిత్రకారుల్లో వాదోపవాదాలున్నాయి. కానీ క్రీ.శ. 78 వ సంవత్సరంలో రాజై ఉండొచ్చన్నది దాదాపు అందరూ అంగీకరించిన విషయం.
* కనిష్కుడి బిరుదులు దేవపుత్ర, సీజర్, రెండో అశోకుడు. 'దేవపుత్ర' అనే బిరుదు చైనీయ ప్రభావంతోనో లేదా రోమ్‌లో ప్రచారంలో ఉన్న 'దివ ఫిలియస్' అనే బిరుదు ప్రభావంతోనో వచ్చి ఉండవచ్చు.
* మరణానంతరం కూడా తమకు దైవత్వం ఆపాదించుకునేందుకు వీరు తాము నిర్మించిన సమాధులకు 'దేవకుల' అని పేరు పెట్టేవారు. ఇలాంటి బిరుదులు భారతదేశంలో అరుదుగా ఉండేవి. కుషాణులు తాము భారతదేశానికి వలస వచ్చామన్న సంగతి మరిచిపోకుండా, పరాయిచోట తమ గౌరవాన్ని పెంచుకోవడానికే ఈ పద్ధతిని ఎంచుకుని ఉంటారన్నది చరిత్రకారుల భావన.
* కనిష్కుడు పరిపాలనాదక్షుడు. యుద్ధ విజేత, బౌద్ధమతాభిమాని. ఇతడికి సంబంధించిన శాసనాలు అలహాబాద్, సారనాథ్, మధుర, భాగల్‌పూర్, రావల్పిండి ప్రాంతాల్లో బయటపడ్డాయి.
* చైనా చరిత్రకారుల కథనాల ప్రకారం కనిష్కుడు 'హాన్' వంశానికి చెందిన రాకుమారిని వివాహమాడతానని అడిగాడనీ, అందువల్లనే 'హాన్' వంశానికి చెందిన 'హా-ట్సీ' చక్రవర్తి సేనాని పాం-చా-వో చేతిలో ఓడిపోయాడని ప్రచారంలో ఉంది.
* మధ్య ఆసియాలోని సిల్క్‌రూట్‌కు ప్రధాన కేంద్రాలైన 'కాష్‌ఘల్, యార్కండ్, ఖోటాన్' ప్రాంతాలను కనిష్కుడు జయించినట్లు తెలుస్తుంది. ఇతడు మధ్య ఆసియా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
* కనిష్కుడు అనగానే బౌద్ధమతంతో (మహాయాన) అతడికి ఉన్న సంబంధం గుర్తుకు వస్తుంది. కశ్మీర్‌లోని కుందనవనంలో నాలుగో బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు.దీనికి వసుమిత్రుడిని అధ్యక్షుడిగా, అశ్వఘోషుడిని ఉపాధ్యక్షుడిగా నియమించాడు.
* కనిష్కుడు ఈ సభను బౌద్ధమత సిద్ధాంతాలకు, అధ్యయనానికి సంబంధించిన విషయాల గురించి చర్చించడానికి ఏర్పాటు చేశాడు. కానీ ఈ సమావేశంలో బౌద్ధమతం హీనయాన, మహాయాన అనే రెండు ప్రధాన శాఖలుగా విడిపోయింది.
* ఇతడు 'కస్యవమాతంగ' నేతృత్వంలో మహాయాన బౌద్ధ మిషన్‌ను చైనాకు పంపాడు. అంతేకాకుండా ఆసియాకు కూడా మత ప్రచారకులను పంపించాడు. పెషావర్‌లో బుద్ధుడి ఒక అవశేషంపై ఇతడు అనేక అంతస్తుల కట్టడాన్ని నిర్మించాడు.
* క్రీ.శ. 7వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ఈ స్తూపాన్ని గురించి విపులంగా వర్ణించాడు. 11వ శతాబ్దిలో 'ఆల్‌బెరూని'కూడా దీన్ని గురించి తెలిపాడు. పెషావర్‌లో జరిపిన తవ్వకాల్లో ఈ స్తూప పథకం, విహారాలు కట్టిన స్థలాలు, కొన్ని శిల్పాలు, బుద్ధుడి అవశేషాలను ఉంచిన పాత్రలు బయటపడ్డాయి.


నాణేలు..
      భారతదేశ చరిత్రలో అత్యధిక సంఖ్యలో బంగారు నాణేలను ముద్రించింది కుషాణులు. ఈ నాణేల్లోని బంగారం గుప్తులకాలం నాటి బంగారం కంటే ఎక్కువ నాణ్యమైంది.
*  వీరి నాణేలపై భాష - పారశీకం. కుజుల కాడ్‌ఫిసెస్ నాణేలపై బుద్ధ ప్రతిమ, విమా కాడ్‌ఫిసెస్ నాణేలపై శివుడు-నంది ప్రతిమ, కనిష్కుడి నాణేలపై బౌద్ధ చిహ్నాలు కనిపిస్తాయి. కానీ బౌద్ధ, భారతీయ దేవతా చిహ్నాలు లేని నాణేలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.
కనిష్కుడి వ్యక్తిగత ఆరాధ్య దేవతలు హెరాక్లిస్, హీలియస్, సెలీనా, మద్రనాన, మిరో మొదలైనవారు. ఇది తన సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో భిన్న సంస్కృతులు, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి ఇతడు పాటించిన మత విధానంగా చెప్పవచ్చు.


కళలు..
  కనిష్కుడు గొప్ప కళాపోషకుడు, సాహిత్యాభిమాని. ఇతడి ఆస్థాన కవులు వసుమిత్రుడు, అశ్వఘోషుడు, చరకుడు & ఆచార్య నాగార్జునుడు మొదలైనవారు.
* వసుమిత్రుడు - సంస్కృతంలో మహా విభాషశాస్త్రాన్ని, అశ్వఘోషుడు - బుద్ధచరిత (భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత కావ్యం), సౌందర్య నందనం, శారిపుత్ర ప్రకరణం అనే సంస్కృత నాటకాలు రచించారు. (మధ్య ఆసియాలోని ఖోటాన్ ప్రాంతంలోని తవ్వకాల్లో బయటపడిన నాటకం - శారిపుత్ర ప్రకరణం). చరకుడు - 'చరక సంహిత' అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు.
* ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ రూపశిల్పి. ఇతడు సుహృల్లేఖ, రసవాదం, శూన్యవాదం, మాధ్యమిక వాదం, ప్రాజ్ఞపారమిత శాస్త్రం, ద్వాదశనికాయ శాస్త్రం, రత్నావళి రాజుపరికథ మొదలైన సంస్కృత గ్రంథాలు రచించాడు. ఇతడి బిరుదులు - ఇండియన్ ఐన్‌స్టీన్, రెండో తథాగతుడు, ఇండియన్ మార్టిన్ లూథర్, ఆంధ్ర బౌద్ధ సారస్వత అరిస్టాటిల్ మొదలైనవి.


కనిష్కుడి వారసులు
    కనిష్కుడి తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టింది హవిష్కుడు. ఇతడు క్రీ.శ. 230 వరకూ తన పరిపాలనను కొనసాగించాడు. ఇతడి బిరుదులు మహారాజ, రాజాధిరాజ, దేవపుత్ర.
* హవిష్కుడి తదనంతరం రెండో కనిష్కుడు రాజయ్యాడు. ఇతడి బిరుదు 'కైజర్'.
* కుషాణు వంశంలో చివరివాడు 'వాసుదేవుడు'. శివ, అంబ, ఉమేశ్వరుల ప్రతిమలు ఇతడి నాణేలపై కనిపిస్తాయి. వాసుదేవుడి కాలంలోనే కుషాణుల ప్రత్యేకత క్షీణించింది. అయితే వీరు భారతదేశంలోనే స్థిరపడి ఉండొచ్చని వాసుదేవుడి పేరు సూచిస్తోంది.


శిల్పకళ..
     కుషాణుల కాలంలో వాయవ్య భారతదేశంలో 'గాంధార శిల్పకళారీతి', తూర్పు భారతదేశంలో 'మధుర శిల్పకళారీతి' ఆవిర్భవించాయి.

గాంధార శిల్ప శైలి
* గ్రీకు-భారతీయ- రోమ్ శిల్పకళల సమ్మేళనమే గాంధార శిల్ప శైలి.
* ఇందులో బుద్ధుడిని తెల్లని చలువ రాయితో మలిచారు.
* ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గాంధార శైలి ఆప్ఘనిస్థాన్‌లోని బీమారన్ దగ్గరున్న 'తఖ్-ఇ-బామి' వద్ద లభించింది.
* ఈ శైలిలో ఉన్న బుద్ధ విగ్రహాలు భారతదేశంలోని కశ్మీర్, విదిశ, అమరావతి మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి.
* ఈ శైలిలో బుద్ధుడు గ్రీకుల యుద్ధదేవుడిని తలపిస్తాడు. గ్రీకుల యుద్ధ దేవుడు ఒలంపస్.
* రోమన్ల కండలు తిరిగిన శరీరం, రింగురింగుల పొడవాటి వెంట్రుకలు, పలుచని వస్త్రాలు మొదలైనవి ఈ శైలిలో ఎక్కువగా కనిపిస్తాయి.
* విగ్రహాలు గడ్డాలు, మీసాలు పెంచుకుని భారతీయ యోగుల మాదిరిగా కనిపించడం దీని ప్రత్యేకత.
* ఈ శిల్పకళ సౌందర్యానికి ప్రాముఖ్యం ఇచ్చింది కానీ ఆధ్యాత్మికతకు ఇవ్వలేదు.


మధుర శిల్ప శైలి
* మధుర శైలిలో బుద్ధుడిని ఎర్రని ఇసుకరాయితో మలిచారు.
* ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శిల్పశైలి.
* ఇందులో బుద్ధుడు ధ్యానస్థితిలో ఉన్నట్లుగా రూపొందించారు.
* హిందూమతంలో భాగంగా శివుడిని పార్వతీ సమేతుడిగా, అర్ధనారీశ్వర రూపంలో తయారు చేశారు.
* ఈ శైలిలో జైన మతంలోని పార్శ్వనాథుడిని కూడా మలిచారు. ప్రస్తుతం ఈ ప్రతిమ లక్నో మ్యూజియంలో ఉంది.
* స్త్రీ ప్రతిమలైన సాలభంజికలు, యక్షణి మొదలైన వాటిని కూడా మలిచారు.
* ఈ శైలి పరమత సహనానికి నిదర్శనం.
* భారతీయులకు కోటు, బూటు, టోపీని పరిచయం చేసినవారు కుషాణులు. కనిష్కుడి శిథిల విగ్రహం మధురకు సమీపంలోని తిక్రితి లోయలో లభించింది.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్త యుగం

   గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్త రాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్తులకాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది.
గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:
    1. పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు.
   2. సాహిత్య ఆధారాలు.


శాసనాలు
మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని 'మహారాజ' బిరుదుతో పేర్కొంది. స్కంధగుప్తుడి భిలారి శాసనం హూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని (సంధి విగ్రాహి) హరిసేనుడు వేయించాడు.
* ఎరాన్ శాసనం గుప్తుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలీ (దిల్లీ) ఉక్కు స్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి.
* గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే, మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు.


సాహిత్యం
   మొదటి చంద్రగుప్తుడి కాలంనాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలంనాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రాసిన 'నారదస్మృతి', 'బృహస్పతి స్మృతి' లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన 'దేవీ చంద్రగుప్తం' నాటకం రామగుప్తుడు శక రాజైన బసన చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జికుడు రచించిన 'కౌముదీ మహోత్సవం' గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన 'మూలకల్ప' గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీ.శ.672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చీ-లి-కిటో (శ్రీగుప్తుడు) అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన 'తిలస్య పన్నాటి' అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో-కువో-కి గ్రంథంలో వివరించాడు.


రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 375 - 415)

      ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి, వదిన ధ్రువాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ పాటలీపుత్రంలో మూడు సంవత్సరాలు, తామ్రలిప్తిలో రెండు సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో 'నవ రత్నాలు' అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి, ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతీ గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి, 'శకారి' అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనానియైన అమరకర దేవుడు బౌద్ధ మతాభిమాని. మంత్రి శబర వీరసేనుడు శైవ మతాభిమాని. దిల్లీలోని మెహరౌలీ ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే.
చివరి గుప్త చక్రవర్తులు

     మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కంధగుప్తుడు హూణుల దండయాత్రను తిప్పికొట్టాడు. కానీ స్కంధగుప్తుడు రాజైన తర్వాత హూణులు గుప్త రాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయ్యింది. ఇతడు హూణుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్త వంశం అంతమైంది.
 

పాలనా విశేషాలు
      గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. విషయపతి జిల్లాలకు (విషయాలకు) అధిపతిగా, భుక్తులకు ఉపరిక అధిపతిగా ఉండేవాడు. గ్రామాధిపతిని గ్రామైక అనేవారు. అయిదుమంది సభ్యులున్న నగరసభ విషయపతికి పరిపాలనలో తోడ్పడేది. గ్రామంలో ఉండే సభను పంచ మండలం సభ అనేవారు. చక్రవర్తి మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలి సహాయంతో పరిపాలించడం వల్ల మంత్రి మండలి నాయకుడిని మంత్రి ముఖ్యుడు అనేవారు. నైతిక, ధార్మిక విషయాల్లో పురోహితుడు కీలకపాత్ర పోషించేవాడు. రాష్ట్రాలకు (భుక్తులకు) యువ రాజులను అధిపతులుగా నియమించేవారు. వారిని 'కుమారామాత్య' అనేవారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు. మొత్తంగా గుప్తుల కాలంలో పాలన వికేంద్రీకృత పాలనగా ఉండేది.


రెవెన్యూ పాలన
     గుప్తుల కాలంలో 1/6వ వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. ఫాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్‌పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికున్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిని 'క్షేత్రం' అనేవారు. నివాసయోగ్యమైన భూమిని 'వస్తి' , అటవీ భూమిని 'అప్రహత' , పచ్చిక బయళ్లను 'గపధసార' , బంజరు భూములను 'ఖిలం' అని పేర్కొనేవారు.
భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని 'పుస్తపాల' అనేవారు. నాటి ప్రధాన న్యాయమూర్తి 'మహా దండనాయక'. ఆ కాలంలో విధించే శిక్షల గురించి ఫాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. మహా సేనాపతి, రణభండారిక లాంటి సైనికాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధానపాత్ర పోషించేవారు. ఆ కాలంలో  యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. ప్రత్యేక యుద్ధమండలి కూడా ఉండేది.  పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండటం గొప్ప విషయం. మంత్రి మండలికి, చక్రవర్తికి మధ్య సంధాన కర్తగా 'కంచుకి' అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు.


ఆర్థిక విషయాలు
    గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి 'పహాడ్‌పూర్' శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను (అగ్రహారాలు) దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలందా, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను 'ఉక్కకల్ప' మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను 'దేవాగ్రహారాలు' అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పుళిందభట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా రెండు గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి.
  రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్ఛ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్థవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది.


సాంఘిక, మత పరిస్థితులు
   వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఛండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాసీ ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం/ హిందూమతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు 'పరమ భాగవత' అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజ చిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. స్కంధగుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి, వామనుల కథనాన్ని వివరించారు. మౌఖరీ వంశస్థుడైన అనంతవర్మబారాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహ అవతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఎరాన్‌లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు.


రాజకీయ చరిత్ర
    గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీ గుప్తుడిని చిలికిత (చీ-లీ-కిటో) మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోద్గజ గుప్తుడు 'మహారాజు' బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్ఛవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. 'రాజాధిరాజ' బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీ.శ.335 - 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి, సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది.
     హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి, వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగి రాజు హస్తివర్మ (శాలంకాయన రాజు), కంచి పాలకుడు విష్ణుగోపుడు (పల్లవ రాజు) ముఖ్యమైనవారు.
     ఆంగ్ల చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని కీర్తించాడు. 'కవిరాజు', 'అశ్వమేధ యోగి' లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతినాగ, అచ్యుతనాగ, లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుడిని ఓడించి, అశ్వమేధ యాగం చేసి 'అశ్వమేధ యోగి' బిరుదు పొందాడు. ఇంకా అయిదు సరిహద్దు రాజ్యాలను, తొమ్మిది ఆటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు, శక రాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు, రెండో చంద్రగుప్తుడు బసనను, రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది.


నాణేలు
     గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. వీరు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్ర గుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి, 'అశ్వమేధ యోగి' బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను 'దీనార్', 'కారా', 'సువర్ణ' అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై 'మహా రాజాధిరాజ శ్రీచంద్రగుప్త' అనే బిరుదును ముద్రించారు. గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించింది రెండో చంద్రగుప్తుడే. రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమభాగవత, మహారాజాధిరాజు బిరుదులను, మరో వైపు గరుడి (గద్ద) బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు.

 

గుప్త యుగం - సాంస్కృతిక వికాసం

* భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. హిందూమత పునరుద్ధరణ, భాషా, సాహిత్యాల వికాసం, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటారు.
* కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి, 'ఇండియన్ షేక్‌స్పియర్‌'గా పేరొందాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు.
* గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం.
* వసుబంధు అనే బాస మహాకవి 'స్వప్న వాసవదత్త' అనే గ్రంథాన్ని రాశాడు.
* వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు.
* శూద్రకుడు మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు.
* విశాఖదత్తుడు దేవీచంద్రగుప్తం, ముద్రా రాక్షసం అనే గ్రంథాలను రచించాడు.
* అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన 'అమరకోశం' అనే గ్రంథాన్ని రాశాడు.
* పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనే పశు వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
* కామందకుడు రచించిన నీతిశాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది.
* బెంగాల్‌కు చెందిన చంద్రగోమియా 'చంద్ర వ్యాకరణం' గ్రంథాన్ని రాశాడు.
* రామచంద్రుడు అనే కవి 'నాట్య దర్పణం' గ్రంథాన్ని రచించాడు.
* రామాయణాన్ని జైనమతానికి అనుగుణంగా రచించింది విమలుడు.
* దివాకరుడు అనే కవి న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర అనే గ్రంథాలు రాశాడు.
* పాణిని అష్టాధ్యాయి గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు.
* గుప్తుల కాలంలో ప్రాకృత భాషను శూరసేన (మగధ ప్రాంతం), అర్ధమగధి (బుందేల్‌ఖండ్ ప్రాంతం), మగధి (బిహార్ ప్రాంతం) లాంటి పేర్లతో పిలిచేవారు.
* వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు (వైద్యశాస్త్ర గ్రంథం).
* నవరత్నాలు - కాళిదాసు, శంఖువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమర సింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు.


శాస్త్ర విజ్ఞానం
* గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంనాటి గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట.
* ఆర్యభట్ట రచనలు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, లఘు జాతకం. సూర్య సిద్ధాంతం గ్రంథంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణాలు వివరించారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పారు.
* వృత్త పరిధికి, వృత్త వ్యాసానికి సరైన π నిష్పత్తిని 22/7 గా చెప్పింది ఆర్యభట్టు.
* వరాహమిహిరుడు 'బృహత్ సంహిత' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని గుప్తుల కాలంనాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు.  వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు.
* భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు 'ఇండియన్ న్యూటన్‌'గా పేరొందాడు.  (ఖండఖాద్యక, బ్రహ్మస్ఫుటక సిద్ధాంతం అనేవి ఈయన రచనలు)
* వివిధ మందులు, ఔషధాల తయారీ విధానం గురించి వివరిస్తున్న గ్రంథం 'నవనీతకం'.
* గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందింది ధన్వంతరి.
* ''శుశృత సంహిత'' అనే శస్త్ర చికిత్స గ్రంథాన్ని శుశృతుడు రచించాడు.
* వజ్జిక అనే రచయిత 'కౌముది మహోత్సవం' అనే గ్రంథాన్ని రాశాడు.
* గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగ లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు రాశాడు


గుప్తుల కాలంనాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు
* నాచన్ కుటారా - పార్వతీదేవి దేవాలయం
* భూమ్రా - శివాలయం, మధ్యప్రదేశ్
* దేవఘడ్ - దశావతార దేవాలయం, మధ్యప్రదేశ్
* టిగావా - విష్ణు దేవాలయం, మధ్యప్రదేశ్
* బిట్టర్‌గావ్ - ఇటుకల దేవాలయం, ఉత్తర్ ప్రదేశ్
* దశావతార దేవాలయ గోడలపై రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కారు.
* ఉదయగిరి గుహాలయం (ఒడిశా) వద్ద వరాహ విగ్రహాన్ని చెక్కారు.
* గ్వాలియర్ సమీపంలోని పవాయి వద్ద నాట్యగత్తె, సంగీతకారిణుల విగ్రహాలు లభించాయి.
* సుల్తాన్‌గంజ్‌లో బుద్ధ విగ్రహం (కంచుతో తయారు చేసింది) ఏడున్నర అడుగుల పొడవుతో లభించింది.
* నలందాలో 18 అడుగుల ఎత్తున్న బుద్ధుడి రాగి విగ్రహం లభించింది.
* వారణాసిలో కార్తికేయ శిల్పాలు లభించాయి.
* గుప్తుల కాలంనాటి ముద్రలు ఎక్కువగా వైశాలిలో లభించాయి.
* గుప్తుల కాలంనాటి బుద్ధుడి శిల్పాలు 'తౌమ బుద్ధులు'గా పేరొందాయి.
* నాటి శిల్పాలను ఎక్కువగా చూనార్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో చెక్కారు.
* సారనాథ్ మ్యూజియంలో బుద్ధ విగ్రహం (సారనాథ్ బుద్ధుడు) యోగిముద్రలో ఉంటుంది.
* అజంతా, బాగ్ గుహల్లో గుప్తుల కాలంనాటి చిత్రలేఖనాలు లభించాయి.
* అజంతా 16వ గుహలోని 'మరణశయ్యపై రాకుమార్తె' చిత్రం గుప్తుల కాలానిదే.
* గుప్తుల శిల్పకళ మహోన్నతి పొందిన హైందవ శిల్పకళ అని విన్సెంట్ స్మిత్ పేర్కొన్నారు.
* 23 అడుగుల 8 అంగుళాల పొడవున్న మెహరౌలీ ఉక్కు స్తంభం (దిల్లీ) ఇప్పటికీ తుప్పుపట్టలేదు.
* ''బిట్టర్‌గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది'' అని పెర్సీబ్రౌన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.


హర్షవర్ధనుడు
* గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు.
* హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతడి రాజధాని స్థానేశ్వరం.
* హర్షుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు. తల్లి యశోమతి దేవి. సోదరుడు రాజ్యవర్ధనుడు. సోదరి రాజ్యశ్రీ.
* పుష్యభూతి వంశీకుల పాలన గురించి వివరిస్తున్న శాసనాలు మధుబన్, బాన్స్‌ఖేరా.
* మధుబన్ శాసనం ప్రకారం ప్రభాకరవర్ధనుడు పరమభట్టారక, మహారాజాధిరాజు అనే బిరుదులతో పాలించాడని తెలుస్తోంది.
* బాణుడి హర్షచరిత్రలో ప్రభాకరవర్ధనుడు హూణుల హరిణాలకు (జింకలకు) సింహం లాంటి వాడని పేర్కొన్నారు.
* యశోమతీదేవి భర్తతో సతీసహగమనం చేసింది.
* రాజ్యశ్రీని కనోజ్ పాలకుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించారు.
* గ్రహవర్మ, అతడి మిత్రుడు గౌడ శశాంకుడు కుట్రచేసి రాజ్యవర్ధనుడిని చంపారు.
* హర్షుడు అస్సాం/ కామరూప పాలకుడు భాస్కరవర్మ సహాయంతో గ్రహవర్మ, గౌడ శశాంకుడిని ఓడించాడు.
* మాళ్వారాజు దేవగుప్తుడు గ్రహవర్మను చంపి, కనోజ్‌ను ఆక్రమించాడు.
* హర్షుడు సోదరిని రక్షించి, కనోజ్ పాలకురాలిగా నియమించాడు.
* కనోజ్ ప్రజల కోరిక మేరకు హర్షవర్ధనుడు క్రీ.శ.606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం, కనోజ్‌లను కలిపి పట్టాభిషేకం చేసుకున్నాడు.
* హర్షుడి పాలనాకాలం క్రీ.శ.606 - 647
* హర్షుడి కాలంలో హుయాన్‌త్సాంగ్ అనే చైనా యాత్రికుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు.
* హుయాన్‌త్సాంగ్ రచన 'సియుకి'.
* హుయాన్‌త్సాంగ్ యాత్రికుల్లో రాజు (కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్)గా పేరొందాడు.
* హర్షుడి బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర.
* హర్షుడిని నర్మదా నది యుద్ధంలో ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి.
* రెండో పులకేశి ఐహోలు శాసనంలో హర్షుడిని సకలోత్తర పథేశ్వరుడు అనే బిరుదుతో ప్రస్తావించడం కనిపిస్తుంది.
* హర్షుడు మహామోక్ష పరిషత్, కనోజ్ పరిషత్తులను నిర్వహించాడు.
* ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన సంపదనంతా పేదలకు పంచే కార్యక్రమమే 'మహామోక్ష పరిషత్'. దీన్నే 'ప్రయాగ పరిషత్' అంటారు.
* హర్షుడు మొత్తం ఆరు మహామోక్ష పరిషత్‌లు నిర్వహించాడు. 6వ పరిషత్‌కు హుయాన్‌త్సాంగ్ హాజరయ్యాడు.
* హర్షుడు కనోజ్‌లో హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. దీన్నే 'కనోజ్ పరిషత్' అంటారు.
* హర్షుడు తన రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలుగా విభజించాడు.
* వల్లభి రాజ్య రాజు రెండో ధ్రువసేనుడిని హర్షుడు ఓడించినట్లు నౌశాసితామ్ర ఫలకం (శాసనం) తెలియజేస్తోంది.
* యుద్ధభూమిలో చక్రవర్తే సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. చక్రవర్తికి పాలనలో సహాయపడటానికి సచివులు/అమాత్యులు అనే మంత్రులను నియమించేవారు.
* హర్షుడి ప్రధానమంత్రి పేరు 'భండి'.
* యుద్ధమంత్రి - మహాసంధి విగ్రహాధికృత, సైన్యాధికారి - మహాబలాధికృత.
* గజబలాధ్యక్షుడు - కాటుక, విదేశీ కార్యదర్శి - రాజస్థానీయ.
* హర్షుడి కాలంలో రాష్ట్రాలను భుక్తులు అని, జిల్లాలను విషయాలు అని పిలిచారు.
* భుక్తి అధిపతిని ఉపరిక/గోస్త్రీ అని పిలిచేవారు.
* నాడు రహదారులు క్షేమంగా లేవని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.630లో భారతదేశానికి వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. (సి-యు-కి అంటే పశ్చిమ ప్రపంచ ప్రతులు)
* హర్షుడు యుద్ధం, శాంతి కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడని ఆర్.సి. మజుందర్ పేర్కొన్నారు.
* నాటి కాలంలో మగధ వరి పంటకు ప్రసిద్ధి చెందింది.
* నాడు భూమి శిస్తు పంటలో 1/6వ వంతు ఉండేది. భూమి శిస్తును 'ఉద్రంగ' అనేవారు. భూమి శిస్తు కాకుండా మరో 18 రకాల పన్నులు వసూలు చేసేవారు.
* హర్షుడు వివిధ స్థాయుల్లో పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ద్రువాధికరణ, గౌల్మిక లాంటి అధికారులను నియమించాడు.
* గ్రామంలో పన్ను వసూలు కోసం అక్షపటలిక, కరణిక్ అనే ఉద్యోగులను నియమించాడు.
* వస్తువు బరువు ఆధారంగా 'తుల్యమేయ' పేరుతో అమ్మకం పన్నును వసూలు చేసేవారు.
* భారతదేశంలో వ్యవసాయ రంగంలో తొలిసారిగా నీటివేగంతో నడిచే తులాయంత్రాలను ప్రవేశపెట్టింది హర్షుడే.
* హర్షుడి కాలంలో మౌఖరీ వంశీయులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశారు.
* హర్షుడు నలందా విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసినట్లు హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హర్షుడి ఆస్థానకవి బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు.
* హర్షుడు సంస్కృత భాషలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలు రాశాడు.
* సుభాషిత శతకం - భర్తృహరి, సూర్యశతకం - మయూరుడు. వీరు హర్షుడి ఆస్థానంలో ఉండేవారు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.645లో ఉదిత అనే సహాయకుడితో చైనా చేరాడు.
* గౌడ శశాంకుడు వంగ, మగధ, ఒరిస్సాలను 'మహారాజాధిరాజ' బిరుదుతో పాలించినట్లు గంజాం శాసనం తెలుపుతోంది.
* నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని 'ధర్మఘంజ్' అనేవారు.
* ధర్మపాల, ఆర్యదేవ, శీలభద్ర లాంటి ఆచార్యులు నలందా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
* స్థిరమతి, గుణమతి లాంటి ఆచార్యులు వల్లభి విశ్వవిద్యాలయంలో పనిచేశారు.


వాస్తు, కళారంగాలు
* గుప్తుల కాలంనాటికి నగర, ద్రవిడ శైలులు రూపాంతరం సంతరించుకున్నాయి.
* గుప్తుల వాస్తు నిర్మాణంలో ప్రధానమైనవి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాలు.
* మహారాష్ట్రలోని అజంతా గుహలు, మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహలు గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంలో సారనాథ్ (ఉత్తర్ ప్రదేశ్), రత్నగరి (ఒడిశా), మీర్‌పూర్‌ఖాన్ (సింధు) ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు.
* మధ్యప్రదేశ్‌లోని భూమ్రాలో శివాలయాన్ని నిర్మించారు.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఢిల్లీ సుల్తానులు

  క్రీ.శ.1206లో మహ్మద్‌ఘోరీ మరణానంతరం కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత క్రీ.శ.1526 వరకు అంటే సుమారు మూడు శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. వీరు సువిశాల సామ్రాజ్య స్థాపనతోపాటు ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేశారు.
 

బానిస వంశం
బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్‌ ఐబక్‌. ఇతడు క్రీ.శ.1206లో తన యజమాని మహ్మద్‌ఘోరీకి వారసులు లేకపోవడం వల్ల తన స్వాతంత్య్రాన్ని భారతదేశంలో ప్రకటించుకొని క్రీ.శ.1210 వరకు పరిపాలించాడు. ఇతడి వారసుల్లో ఇల్‌టుట్‌మిష్, రజియా సుల్తానా, ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ ప్రముఖులు. ఈ వంశాన్నే మామ్లూక్‌ వంశంగా పేర్కొంటారు. వీరు 1206 నుంచి 1290 మధ్య పరిపాలించారు.


కుతుబుద్దీన్‌ ఐబక్‌ 
    బానిసగా జీవితాన్ని ప్రారంభించిన ఐబక్‌ తన శక్తి సామర్థ్యాలతో ఘోరీ మహ్మద్‌  సేనానిగా ఎదిగాడు. తరైన్‌ యుద్ధాలు, ఘోరీ భారతదేశ దండయాత్రల్లో పాల్గొన్న ఐబక్, భారతదేశంలో ఘోరీ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఢిల్లీని ఆక్రమించుకున్నందుకు గుర్తుగా ‘కువ్వత్‌-ఉల్‌-ఇస్లామ్‌’ అనే మసీదును నిర్మించాడు. ఘోరీ మరణానంతరం క్రీ.శ. 1206లో ఐబక్‌ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతడి అధికారాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన బెంగాల్‌ పాలకుడు అలీమర్థాన్‌ను అణచివేసి ఆయన స్థానంలో మహ్మద్‌ షెరాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. ఘజనీ పాలకుడైన తాజ్‌-ఉద్దీన్‌-యల్‌డజ్‌ ఢిల్లీపై దండెత్తగా అతడిని ఓడించాడు. అజ్మీర్‌లో ‘అర్హిదిన్‌ కా జోంప్రా’ అనే మసీదును నిర్మించాడు. లాహోర్‌ను రాజధానిగా చేసుకుని పాలించాడు. తన రెండో రాజధానిగా ఢిల్లీని ప్రకటించాడు (ఢిల్లీని పూర్తి రాజధానిగా చేసింది ఇల్‌టుట్‌మిష్‌). భారతదేశంలో ఇస్లాం రాజ్యస్థాపనకు గుర్తుగా ఢిల్లీలో కుతుబ్‌మీనార్‌ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కుతుబ్‌మీనార్‌ అనేది తన గురువు కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకి  సమాధి. ఐబక్‌ తన దానగుణం వల్ల లాక్‌భక్ష్గా పిలవబడ్డాడు. ఇతడు 1210లో లాహోర్‌లో చౌగాన్‌ (పోలో) ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించాడు. అనంతరం అతడి కుమారుడు ఆరామ్‌షా (ఆరామ్‌భక్ష్) పాలకుడయ్యాడు. 

 

ఇల్‌టుట్‌మిష్‌ (క్రీ.శ.1211 - 1236)
  ఆరామ్‌షాను పదవి నుంచి తొలగించి ఇల్‌టుట్‌మిష్‌ క్రీ.శ.1211లో సుల్తాన్‌ పదవిని చేపట్టాడు. ఇతడు ఐబక్‌ అల్లుడు. ఇతడు ఐబక్‌ మరణించే నాటికి బదయాన్‌ (బదక్షాన్‌) ప్రాంత గవర్నర్‌గా ఉన్నాడు. ఇల్‌టుట్‌మిష్‌ ఇల్బారీ తెగకు చెందినవాడు. అసలు పేరు ష్‌మ్స్‌ - ఉద్దీన్‌ - ఇల్‌టుట్‌మిష్‌. ఖలీఫా నుంచి భారతదేశ సుల్తాన్‌గా అనుమతి పత్రం పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్‌ ఇతడే. ఢిల్లీని శాశ్వత రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఘజనీ పాలకుడు తాజ్‌వుద్దీన్‌ యల్‌డజ్‌ను, ముల్తాన్‌ పాలకుడు నాసిరుద్దీన్‌ కుబాచాను ఓడించాడు. విశాల సామ్రాజ్య స్థాపన చేశాడు. చెంఘీజ్‌ఖాన్‌ నాయకత్వంలోని మంగోలుల దాడులను సమర్థంగా తిప్పికొట్టాడు. ఇతడి కాలంలోనే 40 మంది తురుష్క సర్దారుల  కూటమి చిహల్‌గనీ ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యంలో ‘ఇక్తా’ అనే సైనిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాటి సైనిక రాష్ట్రాలను ఇక్తాలు, వాటి అధిపతిని ముక్తీ అని పిలిచేవారు. ఇతడు ఢిల్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా ‘హౌజ్‌-ఇ-సుల్తానీ’ అనే రాజుల స్నాన ఘట్టాన్ని నిర్మించాడు. ఐబక్‌ ప్రారంభించిన కుతుబ్‌మీనార్‌ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. టంకా అనే వెండి నాణేలు, జితాల్‌ అనే రాగి నాణేలను ముద్రించాడు.  ఇతడికి గల పరమత ద్వేషం వల్ల భిల్సా, ఉజ్జయిని దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌.పి.త్రిపాఠీ ప్రకారం భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పినవారు ఇల్‌టుట్‌మిష్‌. తన ఆస్థానంలో మిన్హజ్‌-ఉస్‌-సిరాజ్‌ (మిన్హజుద్దీన్‌ షిరాజ్‌), తాజుద్దీన్‌ లాంటి కవులను పోషించాడు. 

 

ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ (క్రీ.శ.1266 - 1287)
     బానిసవంశ పాలకుల్లో గొప్పవాడు బాల్బన్‌. ఇతడు బానిసగా, తోటమాలిగా, నీరు మోసేవాడిగా, సేనానిగా, సర్దార్‌గా చివరకు సుల్తాన్‌గా అనేక పాత్రలను పోషించాడు. బానిసగా భారతదేశానికి వచ్చిన బాల్బన్‌ ఇల్‌టుట్‌మిష్‌ కొలువులో చేరి చిహల్‌గనీ కూటమిలో ప్రధానపాత్ర పోషించాడు. తన శక్తి సామర్థ్యాల ద్వారా ఖాస్‌దార్, అమీర్‌-ఇ-షకార్‌ లాంటి పదవులను పొందాడు. రజియా సుల్తానా మరణానంతరం బహరాంషా, మసూద్‌షా, నాసిరుద్దీన్‌ల పాలనాకాలంలో బాల్బన్‌ కీలకపాత్ర పోషించాడు. వారి నుంచి రేవరి, హాన్సీ లాంటి జాగీర్‌లను పొందాడు. నాసిరుద్దీన్‌ తన కుమార్తెను బాల్బన్‌కు ఇచ్చి వివాహం చేయడమే కాకుండా నాయబ్‌-ఐ-మీ మాలిక్‌ (ఉపప్రధాని)గా నియమించాడు. 1266లో నాసిరుద్దీన్‌ మరణించగా బాల్బన్‌ ఢిల్లీ సుల్తాన్‌ పదవిని చేపట్టాడు. బాల్బన్‌ అనేక విజయాలు సాధించాడు. పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. మంగోలుల దండయాత్రను సమర్థంగా తిప్పికొట్డాడు. అనేక పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. చిహల్‌గనీ కూటమిని నిర్మూలించి రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పాడు. బెంగాల్‌ గవర్నర్‌ టుగ్రిల్‌కాన్‌ తిరుగుబాటును అణచివేశాడు. చిహల్‌గనీ ముఠా నాయకుడు అమీర్‌ఖాన్‌ను హత్య చేయించాడు. రాచరికం దైవదత్తం (జిల్లీ - ఇల్లాహే/రాజు భగవంతుడి నీడ) అనే సిద్ధాంతాన్ని బాల్బన్‌ విశ్వసించాడు. సామాన్య ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు. 


    సుల్తాన్‌ అధికారాన్ని పెంచడానికి అనేక పర్షియన్‌ రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. వాటిలో ప్రధానమైనవి సిజ్ధా, ఫైబోస్‌/జమ్నిబోస్‌. సుల్తాన్‌ ఆస్థానంలోనికి వచ్చినవారెవరైనా అతడికి సాష్టాంగ నమస్కారం చేయాలన్నదే సిజ్ధా అర్థం. అలాగే సుల్తాన్‌ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవాలన్నది ఫైబోస్‌/జమ్నిబోస్‌ అర్థం. బాల్బన్‌ నిరంకుశ భావాలతో పరిపాలన చేశాడు. దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఇమాద్‌-ఉల్‌ ముల్క్‌ను అధిపతిగా నియమించాడు.


    సైనిక వ్యవస్థలో వృద్ధాప్య పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అడువులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా కీర్తించబడ్డాడు. మంగోలుల దండయాత్రలను ఎదుర్కోవడానికి రక్షణ ఏర్పాట్లు చేశాడు. లాహోర్‌ కోటను సందర్శించి దానికి మరమ్మతులు చేయించాడు. మంగోలుల దండయాత్రల వల్ల బాల్బన్‌ పెద్ద కుమారుడు మహ్మద్‌ మరణించాడు. బాల్బన్‌ అనంతరం అతడి మనుమడైన కైకూబాద్‌ చివరి బానిస సుల్తాన్‌గా పరిపాలించాడు.

 

సుల్తానా రజియా (క్రీ.శ.1236 - 1240) 
 భారతదేశాన్ని పరిపాలించిన తొలి, ఏకైక ముస్లిం మహిళ రజియా సుల్తానా. ఈమె ఇల్‌టుట్‌మిష్‌ కుమార్తె. రజియా శక్తి సామర్థ్యాలను గమనించిన ఇల్‌టుట్‌మిష్‌ తన కుమారులను (మహ్మద్, రక్నుద్దీన్‌) కాదని ఈమెను వారసురాలిగా ప్రకటించాడు. అయితే ఒక మహిళ పాలకురాలు కావడం ఇష్టం లేని ఆస్థాన సర్దారులు, సామంతులు ఆమెపై అనేక తిరుగుబాట్లు చేశారు. లాహోర్, ముల్తాన్‌ పాలకులు చేసిన తిరుగుబాట్లను రజియా సమర్థంగా అణచివేసింది. మాలిక్‌ జమాలుద్దీన్‌ యాకూత్‌ అనే అబిసీనియా దేశస్థుడిని  అశ్వదళాధిపతి (అమీర్‌- ఇ- అబూఖత్‌)గా నియమించింది. ఈ నియామకం స్వదేశీ ముస్లింలు, సర్దారుల్లో మరింత ద్వేషాన్ని పెంచింది. రజియా యొక్క సర్దార్‌ నిజామ్‌-ఉల్‌-జునైడీ భటిండా పాలకుడు అల్‌తునియాతో చేరి ఆమెను ఓడించి భటిండా కారాగారంలో బంధించారు. కానీ అవసరం తీరిన జునైడీ అల్‌తునియాను మోసం చేయడంతో అల్‌తునియా భటిండా కారాగారం నుంచి ఆమెను విడిపించి, వివాహం చేసుకుని ఇద్దరూ ఢిల్లీపైకి వస్తుండగా క్రీ.శ.1240లో ఖైతాల్‌ అనే ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఫలితంగా ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యంలో సుల్తానా రజియా శకం ముగిసింది.


* బాల్బన్‌ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా,  వేటాధికారిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, చివరికి సుల్తాన్‌గా ఎదిగాడు’’ - ప్రముఖ చరిత్రకారుడు లేన్‌పూలే

 

    క్రీ.శ.1206లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ స్థాపించిన ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం క్రీ.శ.1526 వరకు కొనసాగింది. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాల పాలనలో భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు; సాంస్కృతిక అంశాల్లో ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సుల్తానులు భారతదేశ చరిత్రకు, సాంస్కృతిక ప్రగతికి కృషి చేశారు.

 

పరిపాలనా విధానం

కేంద్రపాలన 
    ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్‌ సంప్రదాయ ‘షరియత్‌’ ప్రకారం భారతదేశాన్ని పరిపాలించారు. సుల్తాన్‌ను భగవంతుడి ప్రతిరూపంగా భావించి పాలించారు. వారు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్తాలు - షిక్‌లు - పరగణాలు - గ్రామాలుగా విభజించారు. కేంద్రస్థాయిలో సుల్తాన్‌ సర్వాధికారి, నిరంకుశుడు. సుల్తాన్‌కు పరిపాలనలో సహాయపడటానికి మంత్రిమండలి ఉండేది. నాడు కేంద్ర మంత్రిమండలిలో వజీర్‌ (ఆర్థికమంత్రి), దివాన్‌-ఇ-అర్జ్‌ (యుద్ధ మంత్రి), దివాన్‌-ఇ-రిసాలత్‌ (విదేశీ వ్యవహారాల మంత్రి), దబీర్‌-ఇ-మమాలిక్‌ (సమాచార మంత్రి), సదర్‌-ఉస్‌-సుదూర్‌ (ధర్మాదాయ, ధార్మిక మంత్రి), దివాన్‌-ఇ-ఖాజీ/ ఖాజీ-ఉల్‌-కుజత్‌ (న్యాయశాఖా మంత్రి) లాంటి మంత్రులు ఉండేవారు. సుల్తాన్‌కు సహాయపడటానికి నాయిబ్‌ సుల్తాన్‌ (ఉప ప్రధానమంత్రి) కూడా ఉండేవాడు. ఈ విధంగా కేంద్రంలో సుల్తాన్‌ సర్వాధికారాలు కలిగి ఉండి మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో పరిపాలించేవాడు.

 

రాష్ట్ర పాలన 
    ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలు అనేవారు. ఇల్‌టుట్‌మిష్‌ ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్తా అధిపతిని ముక్తీ అనేవారు. ఇక్తాలు అనేవి సైనిక రాష్ట్రాలుగా పేరొందాయి. ముక్తీలు రాజు ద్వారా నియమితులై ఇక్తాల నుంచి వచ్చిన ఆదాయంలో కొంత భాగం తీసుకుని సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేయాలి. ఇక్తాల్లో ఉండే రాజ ప్రతినిధిని (గవర్నర్‌) నాయిమ్‌/వలి అని పిలిచేవారు. ముక్తీ, నాయిమ్‌తో పాటు రాష్ట్రాల్లో వజీర్, అరిజ్, ఖ్వాజీ లాంటి అధికారులు ఉండేవారు. రాష్ట్రాల్లో ఇక్తాలతో పాటు ప్రాంతాలు, సామంత రాజ్యాలు కూడా ఉండేవి. ప్రాంతాలను ఉప రాజ్యాలు అనేవారు.

 

స్థానిక పాలన
    ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలు/ప్రాంతాలు/ఇక్తాలను షిక్‌లు, పరగణాలు, గ్రామాలుగా విభజించి పరిపాలించారు. షిక్‌ల అధిపతిని షిక్‌దార్, పరగణాల అధిపతిని అమీల్, గ్రామ అధికారులను చౌదరీ, ముఖద్దమ్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో స్వయంప్రతిపత్తి ఉండేది. కొన్ని గ్రామాల్లో పట్వారీ అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానులు ఇస్లాం న్యాయ షరియత్‌ ప్రకారం పాలించినప్పటికీ గతంలో భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థనే అనుసరించారని అర్థమవుతుంది. రాజు స్థానంలో సుల్తాన్‌ వచ్చాడు. అదే మంత్రిమండలి విధానం, రాజ్య విభజన విధానం, ఉద్యోగ బృంద సహకారం కొనసాగింది కానీ వారి పేర్లు మార్పు చెందాయి. 

 

రెవెన్యూ పాలన 
    ఢిల్లీ సుల్తానులు రెవెన్యూ విధానంలో అనేక నూతన మార్పులను ప్రవేశపెట్టారు. ప్రత్యేక శాఖలను రూపొందించి భూముల సర్వే, విభజన, పంట ఆధారంగా భూమిశిస్తును నిర్ణయించారు. కుతుబుద్దీన్‌ ఐబక్‌ కాలంలో పంటలో 1/10వ వంతును శిస్తుగా నిర్ణయిస్తే అల్లావుద్దీన్‌ ఖిల్జీ, మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ కాలంలో 1/2వ వంతుగా నిర్ణయించారు. కానీ ఎక్కువ మంది సుల్తానులు 1/3వ వంతునే భూమిశిస్తుగా వసూలు చేశారు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ప్రత్యేక అధికారులను నియమించాడు. మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘దివాన్‌-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటుచేసి రెవెన్యూ పాలనను పటిష్ఠం చేశాడు. బాల్బన్‌ తొలిసారిగా అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ రైతు బాంధవుడిగా పేరొందాడు.


సైనిక పాలన
    ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక విధానాన్ని ‘ఇక్తా పద్ధతి’ అంటారు. ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్య ప్రగతి ఎక్కువగా సైనిక వ్యవస్థపైనే ఆధారపడి ఉండేది. ముఖ్యంగా మంగోలుల లాంటి విదేశీయుల దండయాత్రలను సమర్థంగా ఎదుర్కోవడానికి, రాజ్య విస్తరణకు సైనికశక్తి అవసరమని గుర్తించిన ఢిల్లీ సుల్తానులు సైనిక పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 

ఇల్‌టుట్‌మిష్‌ ‘ఇక్తాలు’ అనే సైనిక రాష్ట్రాలను ఏర్పాటుచేసి, వాటిపై ముక్తీలనే అధికారులను నియమించాడు. ముక్తీలు తమ అధీనంలో ఉన్న ఇక్తాల నుంచి శిస్తు వసూలు చేసి కొంతభాగాన్ని సుల్తాన్‌కు చెల్లించి, మిగిలిన దానితో సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేసేవారు. బాల్బన్‌ తన పాలనా కాలంలో దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాడు. సుల్తానుల కాలం నాటి సైనిక వ్యవస్థలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ అనేక మార్పులు చేపట్టాడు. 

    ఇతడు ఇక్తా పద్ధతిని రద్దుచేసి, సైనికులకు నగదు రూపంలో జీతం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ముక్తీలు చేస్తున్న అక్రమ గుర్రాల మార్పిడిని నియంత్రించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతి (దాగ్‌)ని ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సుల్తాన్‌ సొంత సైన్యం (సిద్ధ సైన్యం)ను రూపొందించాడు. సైనికుల్లో క్రమశిక్షణ పెంచడానికి చెహ్రా అనే హాజరుపట్టీ/మస్తరు విధానాన్ని రూపొందించాడు. తక్కువ జీతం గల సైనికులకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించడానికి మార్కెట్‌ సంస్కరణలు అమలుచేశాడు. కానీ ఫిరోజ్‌షా తుగ్లక్‌ కాలంలో ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్ధారీ పద్ధతిగా ప్రవేశపెట్టారు. సైనిక పదవులు వంశపారంపర్యం కావడంతో క్రమంగా సైనిక వ్యవస్థ నిర్వీర్యమైంది. ఫలితంగా సుల్తానుల సామ్రాజ్యం పతనమైంది. 

 

న్యాయపాలన
    సామ్రాజ్యంలో సుల్తాన్‌ అత్యున్నత న్యాయాధికారి. అతనికి న్యాయపాలనలో సాయపడటానికి ప్రధాన ఖాజీ అనే న్యాయశాఖ మంత్రి ఉండేవాడు. అదే విధంగా రాష్ట్ర, స్థానిక స్థాయిల్లోనూ న్యాయపాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామస్థాయిలో గ్రామపెద్దలే తీర్పులు చెప్పేవారు. ఇలానే ఢిల్లీ సుల్తానులు ఖురాన్, షరియత్‌ ప్రకారం న్యాయ పాలన నిర్వహించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరింత కఠినంగా వ్యవహరించేవాడు. ‘నాకు షరియత్‌ (ముస్లిం చట్టం) తెలియదని, రాజ్య శ్రేయస్సుకు ఏది మంచిదయితే దాన్నే అమలు చేస్తానని’ బహిరంగంగా ప్రకటించాడు.


సాంఘిక పరిస్థితులు 
    అల్‌బెరూనీ, అమీర్‌ఖుస్రూ, బరౌనీ, ఇసామీ, ఇబన్‌  బటూటా వంటి సమకాలీన రచయితలు, చరిత్రకారుల రచనల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వివిధ పరిస్థితులను తెలుసుకోవచ్చు. నాటి సమాజంలో అధిక శాతం హిందువులే ఉన్నారు. సమాజంలో వివిధ వర్గాలు, వారి మధ్య వ్యత్యాసాలు, కుల వ్యవస్థ, ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, స్త్రీ స్థానం, సాంఘిక దురాచారాలు వంటి అంశాలను పరిశీలిస్తే నాటి సాంఘిక వ్యవస్థపై ఒక అవగాహన కలుగుతుంది. అంత వరకు పాలకులుగా ఉన్న అధిక శాతం హిందువులు మహ్మదీయుల పాలనలో పాలితులుగా మారడంతో సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముస్లింల సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక దురాచారాలు భారతీయ సమాజంలో ప్రవేశించాయి. ముఖ్యంగా పరదా పద్ధతి, బహు భార్యత్వం, జౌహార్‌ వంటి సాంఘిక దురాచారాలు అధికమయ్యాయి. ఫలితంగా సమాజంలో స్త్రీకి ప్రాధాన్యం తగ్గింది. స్త్రీ విద్యకు ప్రోత్సాహం కరవైంది. అనేక నూతన వర్గాలు వెలిశాయి. పెద్దఎత్తున మత మార్పిడులు జరిగాయి. మహ్మదీయులు కులవ్యవస్థను అనుసరించారు. హిందువుల పండగలను ముస్లింలు, ముస్లింల సంప్రదాయాలను హిందువులు అనుసరించారు. నూతనంగా ఏర్పడిన ఉలేమాలు, కుట్స్, కులీనులు వంటి వర్గాలవారు అధిక పెత్తనం చెలాయిస్తూ ఆర్థికవ్యత్యాసాలకు కారణమయ్యారు.


ఆర్థిక పరిస్థితులు 
    ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాల అభివృద్ధిని పరిశీలిస్తే నాటి ఆర్థిక పరిస్థితులు అర్థమవుతాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఢిల్లీ సుల్తానులు అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహార, వాణిజ్య పంటలకు సమాన ప్రాధాన్యం  ఇచ్చారు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. బంజరు భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చడానికి కృషి చేశారు. నాటి కాలంలో ఇక్తా భూములు, ఖలీసా భూములు, మదద్‌ - ఇ - మాష్‌ భూములు అనే మూడు ప్రధాన రకాలు ఉండేవి. ముక్తీల అధీనంలో ఉండే భూములు ఇక్తా భూములు. సుల్తాన్‌ అధీనంలో ఉండే భూములు ఖలీసా భూములు. వీటి నుంచి వచ్చే ఆదాయం నేరుగా ఖజానాకు చేరేది. వివిధ వర్గాలవారికి పాలకులు దానంగా ఇచ్చిన భూములను మదద్‌ - ఇ - మాష్‌ భూములు అనేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ వ్యవసాయ అభివృద్ధికి నాలుగు ప్రధాన కాలువలు తవ్వించి రైతుబాంధవుడిగా పేరొందాడు. సుల్తానుల కాలంలో తోటపంటలు బాగా అభివృద్ధి చెందాయి.

    ఫలితంగా గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూమిశిస్తుతో పాటు ఖామ్స్, జకత్, జిజియా వంటి పన్నులు వసూలు చేసేవారు. రాజ్యానికి అధిక ఆదాయం భూమిశిస్తు (ఖరజ్‌) ద్వారా సమకూరేది. కానీ ప్రజలు అధిక పన్నుల భారంతో బాధపడేవారు. పట్టణాల సంఖ్య పెరగడం, వృత్తి పనివారు అధికంగా వస్తువులు ఉత్పత్తి చేయడం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం అనే మూడు ప్రధాన కారణాల వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. తురుష్కుల రాకతో వస్త్ర, పట్టు, కాగితం పరిశ్రమల అభివృద్ధి సాధ్యమైంది. భవన నిర్మాణ రంగంలో సాంకేతికత పెరిగింది. ఢిల్లీలో ఉన్న భవన నిర్మాణ మేస్త్రీలు ఇస్లాం రాజ్యాలున్న అన్ని దేశాల కంటే నైపుణ్యం కలవారని అమీర్‌ఖుస్రూ పేర్కొన్నాడు. చర్మ, లోహ పరిశ్రమలు, తివాచీల అల్లకం, ఆభరణాల రూపకల్పన వంటి రంగాల్లో అభివృద్ధి జరిగింది.

    వ్యవసాయ, పరిశ్రమల రంగాలతో పాటు వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. భారతదేశం నుంచి పర్షియన్‌ సింధుశాఖ, ఎర్ర సముద్రం, ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు ఎగుమతయ్యేవి. విదేశీ వాణిజ్యంతో పాటు  దేశీయ వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. మార్వాడీలు, జైనులు, ముల్తానీలు దేశీయ వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషించారు.  ముల్తానీలు చాలా ధనవంతులని, కులీన వంశస్థులకు భారీగా రుణాలు ఇచ్చే వారని బరౌనీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. విదేశాల నుంచి భారీగా వృత్తి పని వారు వలస వచ్చేవారని ఇస్సామీ తెలిపాడు. ఎంత అభివృద్ధి జరిగినా ధనిక, కులీన వర్గాలు మాత్రమే లబ్ధి పొందాయని చెప్పొచ్చు. రైతాంగం, బానిసలు, కూలీలు, మధ్య తరగతి వర్గం అధిక పన్నుల భారంతో బాధపడేవారని సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం.

 

    క్రీ.శ.1206లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ స్థాపించిన ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యాన్ని మొదట బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశాలు పరిపాలించాయి. గియాజుద్దీన్‌ తుగ్లక్‌ క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ ఖుస్రూషాను హత్య చేయించి తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించాడు. తుగ్లక్‌ వంశ పాలన అనంతరం సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. క్రీ.శ.1526లో చివరి లోడీ వంశ పాలకుడైన ఇబ్రహీం లోడీని బాబర్‌ ఓడించి మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం అంతరించింది.


తుగ్లక్‌ వంశం (క్రీ.శ.1320-1414) 

ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌
    తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించినవారు ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌. ఇతడు తరుష్కుల్లో కరౌనా/ఖరౌనా తెగకు చెందినవాడు. అల్లావుద్దీన్‌ పరిపాలనా కాలంలో ఘియాజుద్దీన్‌ దీపాల్‌పూర్‌ వైస్రాయ్‌గా పనిచేశాడు. క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ ఖుస్రూషాను వధించి తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించాడు. తుగ్లకాబాద్‌ అనే నగరాన్ని నిర్మించాడు. కఠిన శిక్షలను తగ్గించాడు. రైతు రుణాలను రద్దు చేశాడు. భూమిశిస్తును 1/3వ వంతుగా నిర్ణయించాడు. తన కుమారుడు జునాఖాన్‌ (మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌)ను దక్షిణ భారతదేశంపైకి పంపి యాదవ రాజ్యంపై విజయం సాధించాడు. క్రీ.శ.1323 నాటికి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కానీ క్రీ.శ.1325లో మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ తండ్రిని హత్యచేసి సింహాసనాన్ని అధిష్టించాడు. 

 

మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ (క్రీ.శ.1325-1351) 
    ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని దక్షిణపథంపై నెలకొల్పిన ఏకైన ఢిల్లీ సుల్తాన్‌ మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌. ఢిల్లీ సుల్తానులందరిలో అత్యంత విద్యావంతుడు, ఉదార స్వభావం గల వ్యక్తిగా పేరొందిన ఇతడు తన చర్యల ద్వారా ‘పిచ్చి తుగ్లక్‌’గా పేరొందాడు. ఈయనను విరుద్ధ గుణాలు మూర్తీభవించిన వ్యక్తిగా సమకాలీన చరిత్రకారులు అభివర్ణించారు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ అసలు పేరు జునాఖాన్‌. తండ్రి ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ పాలనా కాలంలో యాదవ, కాకతీయ రాజ్యాలపై దండెత్తి అపార ధనరాశులను కొల్లగొట్టాడు. వరంగల్‌/ఓరుగల్లును ఆక్రమించి దానికి సుల్తాన్‌పూర్‌ అని పేరు పెట్టాడు. క్రీ.శ.1325లో తండ్రిని హత్యచేయించి సుల్తాన్‌గా పాలనను ప్రారంభించాడు. అనేక విజయాలు సాధించడమే కాకుండా పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా గంగా, యమునా మైదానంలో భూమిశిస్తు పెంచడం, రాజధాని మార్పిడి, టోకెన్‌ కరెన్సీ ముద్రణ లాంటి సంస్కరణలు విఫలమవడంతో పిచ్చి తుగ్లక్‌గా పేరొందాడు.

 

గంగా - యమునా అంతర్వేదిలో భూమిశిస్తు పెంచడం
    గంగా - యమునా అంతర్వేది (దోవాబ్‌)లో సారవంతమైన భూములు ఉండటం వల్ల అక్కడ భూమిశిస్తును 1/2వ వంతుకు పెంచాడు. రాజ్య ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అదే ఏడాది ఆ ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించడంతో రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. అధికారులు ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా దౌర్జన్యంగా శిస్తు వసూలు చేశారు. ఆ తర్వాత సుల్తాన్‌ ప్రతిస్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ‘దివాన్‌-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. రైతులకు తక్కావీ రుణాలు (పంట రుణాలు) మంజూరు చేశాడు. బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చాడు. 

 

రాజధాని మార్పు  
మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ క్రీ.శ.1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి (దౌలతాబాద్‌) మార్చాడు. ఢిల్లీ వాయవ్య భారతదేశానికి దగ్గరగా ఉండటం వల్ల నిత్యం విదేశీ దండయాత్రలకు గురికావడం, దక్షిణపథంపై పట్టు సాధించడం లాంటి కారణాలతో రాజధానిని మార్చాడు. కానీ రాజధానిని మార్చే సమయంలో అతడు జారీచేసిన శాసనాలు ప్రజలకు బాధ కలిగించాయని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు. రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ దౌలతాబాద్‌కు వెళ్లమని ఆదేశించాడని, వెళ్లనివారిని చిత్రహింసలకు గురిచేశాడని, ఫలితంగా ప్రజలు అతడిని మంచివాడు కాదని భావించినట్లు చరిత్రకారులు తెలిపారు. అనేక వ్యయప్రయాసల అనంతరం రాజధానిని దౌలతాబాద్‌కు మార్చినా కొంత కాలానికే క్రీ.శ.1335లో రాజధానిని ఢిల్లీకి మార్చాడు.

 

టోకెన్‌ కరెన్సీ ముద్రణ
    మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో తీవ్ర విమర్శలకు గురైంది ఈ నూతన కరెన్సీ ముద్రణ. ఇతడి పరిపాలనా కాలంలో వెండి కొరత ఏర్పడింది. ఢిల్లీ సుల్తాన్‌ రాజ్యంలో వెండి ‘టంకాలు’ అధికారిక నాణేలుగా చలామణీ అయ్యేవి. వెండి కొరత వల్ల సుల్తాన్‌ రాగి, తోలు నాణేలు ముద్రించాడని చరిత్రకారులు పేర్కొన్నారు. కరెన్సీ ముద్రణపై ఆంక్షలు జారీచేయకపోవడం, ప్రభుత్వమే కరెన్సీ ముద్రించాలనే షరతులు లేకపోవడంతో రాజ్యంలో నకిలీ నాణేల ముద్రణ అధికమైంది. నాడు దిల్లీలో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారిందని చరిత్రకారులు తెలిపారు. ఫలితంగా నాణేల చలామణి అధికమై ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సుల్తాన్‌ టోకెన్‌ కరెన్సీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో ప్రజలంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల బాధలను అర్థం చేసుకున్న సుల్తాన్‌ వారి వద్ద ఉన్న టోకెన్‌ కరెన్సీకి అసలు, నకిలీ అనే తేడా లేకుండా తన ఖజానాలోని వెండి టంకాలను మార్పిడి చేశాడు. ఫలితంగా ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. ఇలాంటి చర్యలతో మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ‘పిచ్చి తుగ్లక్‌గా’ పేరొందాడు. ఈ కరెన్సీ ముద్రణ వల్ల మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘ప్రిన్స్‌ ఆఫ్‌ మనీయర్‌’ (నాణేల యువరాజు)గా పేరొందాడు.


    మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సంస్కరణలు అనేక ఆదర్శ భావాలతో ఉండేవి. రాజ్య రక్షణ, రాజ్యం మధ్యలో రాజధాని ఉండాలనే ఆలోచనతోనే రాజధానిని మార్చాడు. దానివల్ల ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. తురుష్కుల నాగరికత, సంస్కృతి, సాంఘిక ఆలోచనా ధోరణి దక్షిణాదికి వ్యాపించింది. రెవెన్యూ సంస్కరణల ద్వారా వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాడు. ప్రత్యేక వ్యవసాయ శాఖ ‘దివాన్‌-ఇ-కోహీ’ని ఏర్పాటు చేశాడు. భూమిశిస్తు బకాయిలు వసూలు చేయడానికి సెంచూరియన్‌ అనే ప్రత్యేక అధికారులను నియమించాడు. క్రీ.శ.1351లో నాటి గుజరాత్‌ పాలకుడు ధాగి సుల్తాన్‌ను శిక్షించడానికి వెళ్లిన మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘థట్టా’ అనే ప్రాంతంలో మరణించాడు. అతడి మరణం గురించి పేర్కొంటూ ‘అతడి బాధ ప్రజలకు, ప్రజల బాధ అతడికి తప్పింది’ అని లేన్‌పూలే చరిత్రకారుడు తెలిపాడు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ పాలనా కాలంలోనే దక్షిణ భారతదేశంలో విజయనగర (1336), బహమనీ (1347) సామ్రాజ్యాలు అవతరించాయి.

 

ఫిరోజ్‌షా తుగ్లక్‌ (క్రీ.శ.1351-1388)
    మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ మరణానంతరం అతడి సోదరుడు ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరిపాలించాడు. ఇతడు వ్యవసాయరంగ అభివృద్ధికి అనేక కాలువలు నిర్మించి ‘రైతు బాంధవుడు’గా పేరొందాడు. తన ప్రధానమంత్రి ఖాన్‌-ఇ-జహాన్‌-మక్బూల్‌ సాయంతో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేశాడు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ చర్యల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. యమునా నది నుంచి ఫిరోజాబాద్‌ వరకు, సట్లెజ్‌ నది నుంచి ఘఘ్గర్‌ వరకు, మాండవ నుంచి హిస్సార్‌ వరకు నీటిపారుదల కాలువలు ఏర్పాటు చేశాడు. ఆ కాలువలు నేటికీ పంజాబ్, హరియాణాల్లో నీటిని అందిస్తున్నాయి. సుమారు 23 రకాల పన్నులను రద్దు చేసి ముస్లిం మత సూత్రాల ప్రకారం ఖరజ్, ఖామ్స్, జకత్, జిజియా అనే నాలుగు ప్రధానమైన పన్నులను వసూలు చేశాడు. ఫిరోజాబాద్, జాన్‌పూర్, ఫతేబాద్, హిస్సార్‌ లాంటి నూతన పట్టణాలను నిర్మించాడు. పేదల సంక్షేమం కోసం ‘దివాన్‌-ఇ-ఖైరాత్‌’ అనే శాఖను, బానిసల సంక్షేమానికి ‘దివాన్‌-ఇ-బందగాని’ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. అదా, భిఖ్‌ అనే నూతన నాణేలను ప్రవేశపెట్టాడు. ఢిల్లీలో దారుల్‌-షఫా (దార్‌-ఉల్‌-షిఫా) అనే ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశాడు. బాటసారులు, యాత్రికుల కోసం సుమారు 200 సరాయిల (విశ్రాంతి మందిరాలు)ను నిర్మించాడు.

    సమకాలీన చరిత్రకారుడైన షమ్స్‌ ఇ సిరాజ్‌ ఫిరోజ్‌షా తుగ్లక్‌ పాలనా వ్యవహారాల గురించి అనేక విషయాలు తెలిపాడు.  ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరమత సహనాన్ని అనుసరించలేదు. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, జిజియా పన్ను విధించాడు. బ్రాహ్మణులపై కూడా ఈ పన్ను విధించాడు. ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఇతడి ఆస్థానంలో బరౌనీ, షమ్స్‌ ఇ సిరాజ్, మహ్మద్‌ అఫీఫ్‌ లాంటి చరిత్రకారులు, కవులు; జలాలుద్దీన్‌-రూమీ లాంటి పండితులు ఉండేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ రద్దు చేసిన ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టాడు. సివిల్, మిలిటరీ ఉద్యోగాలను వంశపారంపర్యం చేశాడు. ముఖ్యంగా 1,80,000 మంది బానిసలను పోషించి ఖజానా ఖాళీ చేశాడని అఫీఫ్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. పెరిస్టా అనే చరిత్రకారుడి ప్రకారం ఫిరోజ్‌షా తుగ్లక్‌ 50 ఆనకట్టలు, 40 మసీదులు, 30 కళాశాలలను నిర్మించినట్లు తెలుస్తుంది. మీరట్, తోప్రా ప్రాంతాల్లో ఉన్న అశోక స్తంభాలను ఢిల్లీకి (ఫిరోజాబాద్‌) తరలించాడు. ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ చర్యలతోపాటు ప్రజా, హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ ‘ఫతూహత్‌-ఇ-ఫిరోజ్‌ షాహీ’ పేరుతో తన స్వీయచరిత్రను రాశాడు. ఇతడి అనంతరం రెండో ఘియాజుద్దీన్, అబూబకర్, మహ్మద్‌ బీన్‌ ఫిరోజ్, నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌ లాంటి పాలకులు పాలించారు. వీరు అసమర్థులు కావడంతో తుగ్లక్‌ వంశం పతనమైంది. చివరి తుగ్లక్‌ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌ పాలనా కాలంలోనే క్రీ.శ.1398-99లో తైమూర్‌ దండయాత్ర జరిగింది. క్రీ.శ.1414లో ఖిజీర్‌ఖాన్‌ నాసిరుద్దీన్‌ తుగ్లక్‌ను తొలగించి సయ్యద్‌ వంశ పాలనను ప్రారంభించాడు.

 

సయ్యద్‌ వంశం
    క్రీ.శ.1414-1451 మధ్య సయ్యద్‌ వంశీయులు ఢిల్లీ సుల్తానత్‌ రాజ్యాన్ని పరిపాలించారు. తైమూర్‌ ప్రతినిధి ఖిజీర్‌ ఖాన్‌ (ఖైదర్‌ ఖాన్‌) క్రీ.శ.1414లో సయ్యద్‌ వంశ పాలనను ప్రారంభించాడు. అతడి అనంతరం ముబారక్‌ షా, మహ్మద్‌ షా, అల్లావుద్దీన్‌ ఆలంషా పరిపాలించారు. ఖిజీర్‌ ఖాన్‌ కాలంలోనే గుజరాత్, మాళ్వా, జాన్‌పూర్‌ పాలకులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ముబారక్‌ షా కులీనుల చేతిలో హత్యకు గురయ్యాడు. చివరి సయ్యద్‌ వంశ పాలకుడైన అల్లావుద్దీన్‌ ఆలమ్‌షాను తొలగించి బహులాల్‌ లోడీ క్రీ.శ.1451లో లోడీ వంశ పాలనను ప్రారంభించాడు.

 

లోడీ వంశం
    క్రీ.శ.1451-1526 మధ్య ఢిల్లీని పాలించిన చివరి సుల్తానత్‌ వంశం లోడీ వంశం. లోడీ వంశపాలన ప్రారంభకుడు బహాలూల్‌ లోడీ. అతడి అనంతరం సికిందర్‌ లోడీ, ఇబ్రహీం లోడీ పరిపాలించారు. బహాలూల్‌ లోడీ వ్యక్తిత్వం గురించి అబ్దుల్లా అనే కవి ‘తారిఖ్‌-ఇ-దావుదీ’ అనే గ్రంథంలో వివరించాడు. అతడి మరణానంతరం కుమారుడైన నిజాంఖాన్‌ ‘సికిందర్‌ షా’ (సికిందర్‌ లోడీ) అనే బిరుదుతో రాజ్యపాలనకు వచ్చాడు. లోడీ వంశ పాలకుల్లో గొప్పవాడిగా పేరొందాడు. ఇతడు బిహార్, గ్వాలియర్‌ ప్రాంతాలపై విజయం సాధించాడు. ఆగ్రా నగరాన్ని నిర్మించి దాన్ని నూతన రాజధానిగా చేశాడు. వ్యవసాయాభివృద్ధికి చర్యలు చేపట్టాడు. పన్ను భారాన్ని తగ్గించాడు. ఇతడి ఆస్థాన కవి మియాన్‌ భువా ‘తిత్భీ సికిందరీ’ అనే గ్రంథాన్ని పారశీక భాషలోకి తర్జుమా చేశాడు. చివరి లోడీ వంశ పాలకుడు ఇబ్రహీం లోడీని క్రీ.శ.1526లో బాబర్‌ మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం అంతరించింది.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఢిల్లీ సుల్తానులు

మాదిరి ప్రశ్నలు

1.  బానిస వంశ స్థాపకుడు-

1) బాల్బన్‌       2) ఇల్‌టుట్‌మిష్‌       3) కుతుబుద్దీన్‌ ఐబక్‌       4) ఘోరీ మహ్మద్‌


2. ఢిల్లీని ఆక్రమించినందుకు గుర్తుగా ఐబక్‌ చేపట్టిన నిర్మాణం ఏది?

1) కుతుబ్‌మీనార్‌        2) అర్హిదిన్‌ కా జోంప్రా 
3) హౌజ్‌-ఇ-సుల్తానీ    4) కువ్వత్‌ - ఉల్‌ -ఇస్లాం


3. ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు?

1) ఇల్‌టుట్‌మిష్‌     2) ఐబక్‌     3) బాల్బన్‌     4) రజియా సుల్తానా


4. చిహల్‌గనీ కూటమి ఎవరి కాలంలో ఏర్పడింది? 

1) ఐబక్‌     2) ఇల్‌టుట్‌మిష్‌     3) రజియా సుల్తానా     4) బాల్బన్‌


5. దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది?

1) ఇల్‌టుట్‌మిష్‌     2) బాల్బన్‌     3) కుతుబుద్దీన్‌ ఐబక్‌     4) ఎవరూ కాదు


6. లాక్‌భక్ష్ బిరుదాంకితుడైన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఐబక్‌        2) బాల్బన్‌          3) ఇల్‌టుట్‌మిష్‌           4) ఆరామ్‌షా


7. ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాన్ని ధ్వంసం చేయించిన పాలకుడు?

1) గజనీ మహ్మద్‌     2) ఘోరీ మహ్మద్‌     3) బాల్బన్‌     4) ఇల్‌టుట్‌మిష్‌


8. చివరి బానిస వంశపాలకుడు?

1) యల్‌డజ్‌     2) బుర్వానుద్దీన్‌     3) ఆరామ్‌షా     4) కైకూబాద్‌


9. టంకా, జితాల్‌ అనే నాణేలను ముద్రించిన పాలకుడు?

1) ఐబక్‌     2) ఇల్‌టుట్‌మిష్‌     3) బాల్బన్‌     4) రజియా సుల్తానా


10. అడవులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌     2) కుతుబుద్దీన్‌ ఐబక్‌     3) ఇల్‌టుట్‌మిష్‌     4) అల్లావుద్దీన్‌ ఖిల్జీ


11.  కుతుబ్‌ మీనార్‌ నిర్మాణాన్ని పూర్తి చేసింది?

1)  కుతుబుద్దీన్‌ ఐబక్‌     2) ఇల్‌టుట్‌మిష్‌     3) బాల్బన్‌     4) ఆరామ్‌షా


12. చిహల్‌గనీ కూటమిని నిర్మూలించిన వారు?

1) ఇల్‌టుట్‌మిష్‌      2) బాల్బన్‌     3) సుల్తానా రజియా    4) ఎవరూ కాదు


13. చౌగాన్‌ ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) కుతుబుద్దీన్‌ ఐబక్‌    2్శ బాల్బన్‌    3) ఇల్‌టుట్‌మిష్‌     4) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ 


14.  ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించిన సుల్తాన్‌?

1) ఐబక్‌      2) బాల్బన్‌    3) ఇల్‌టుట్‌మిష్‌     4) ఆరామ్‌ షా


15. టుగ్రిల్‌ఖాన్‌ తిరుగుబాటును అణచిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌      2) ఇల్‌టుట్‌మిష్‌    3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ     4) కుతుబుద్దీన్‌ ఐబక్‌


16. రజియా సుల్తానా తన అశ్వదళాధిపతిగా నియమించిన ‘మాలిక్‌యాకుత్‌’ ఏ దేశస్థుడు?

1) అఫ్గానిస్థాన్‌      2) టర్కీ     3) అబిసీనియా     4) పర్షియా 


17. పర్షియా దేశపు రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌? 

1) బాల్బన్‌      2) ఇల్తమష్‌     3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ     4) కుతుబుద్దీన్‌ ఐబక్‌ 


18. సుల్తాన్‌ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడాన్ని ఏమంటారు?

1) సిజ్ధా         2) ఫైబోస్‌/ జమ్నిబోస్‌       3)  దాగ్‌         4) చెహ్రా 


19. మంగోలు దండయాత్రల వల్ల తన కుమారుడిని కోల్పోయిన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఐబక్‌      2) ఇల్‌టుట్‌మిష్‌     3) బాల్బన్‌     4) నాసిరుద్దీన్‌ 

 

 

20. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న భూస్వాములను ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏమని పిలిచేవారు? 

1) చౌదరీలు        2) ముఖద్దమ్‌లు         3) పట్వారీలు        4) కుట్‌లు/కుల్ట్‌లు
 

21. ఢిల్లీలోని భవన నిర్మాణ కార్మికుల గొప్పదనాన్ని కొనియాడిన రచయిత? 

1) అమీర్‌ ఖుస్రూ         2) అల్‌బెరూనీ        3) ఇస్సామీ       4) బరౌనీ
 

22. సుల్తానుల కాలంలో రాజ్యానికి అధిక ఆదాయాన్ని సమకూర్చిన పన్ను? 

1) జకాత్‌              2) జిజియా             3) ఖరజ్‌              4) ఖామ్స్‌ 
 

23. సుల్తాను అధీనంలో ఉన్న భూమిని ఏమని పిలిచేవారు? 

1) ఖలీసా             2) ఇక్తా           3) మదద్‌-ఇ-మాష్‌            4) జాగీర్‌    


24. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక వ్యవస్థను ఏవిధంగా పేర్కొనేవారు? 

1) మున్సబ్‌దారీ      2) ఇక్తా పద్ధతి     3) నాయంకర పద్ధతి      4) అమరనాయక పద్ధతి 
 

25. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థికమంత్రిని ఏమని పిలిచేవారు? 

1) దివాన్‌ - ఇ - అర్జ్‌       2) దివాన్‌ - ఇ - ఖాజీ     3) దివాన్‌- ఇ - వజీర్‌     4) ఇన్షా


26. సిద్ధసైన్యాన్ని రూపొందించుకున్న తొలి ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌       2) ఇల్‌టుట్‌మిష్‌     3) అల్లావుద్దీన్‌ ఆలంషా     4) అల్లావుద్దీన్‌ ఖిల్జీ
 

27. దివాన్‌ - ఇ - కోహి అనే ప్రత్యేక వ్యవసాయశాఖను ఏర్పాటు చేసినవారు? 

1) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌         2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       3) బాల్బన్‌        4) ఫిరోజ్‌షా తుగ్లక్‌
 

28. ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామ అధికారిని ఏమనేవారు? 

1) పట్వారీ           2) చౌకీదార్‌         3) ముఖద్దమ్‌          4) పైవన్నీ
 

29. రాజపుత్ర స్త్రీలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఏమంటారు?

1) సతి పద్ధతి           2) పరదా పద్ధతి          3) షరియత్‌ విధానం          4) జౌహార్‌
 

30. ఖురాన్‌ ప్రకారం మహ్మదీయులు అందించే న్యాయపాలన? 

1) మజ్లిస్‌         2)  దివాన్‌దరి          3)  షరియత్‌          4) జిల్లీ ఇల్లాహె
 


సమాధానాలు: 1-3; 2-4; 3-1; 4-2; 5-2; 6-1; 7-4; 8-4; 9-2; 10-1; 11-2; 12-2; 13-1; 14-3; 15-1; 16-3; 17-1; 18-2; 19-3; 20-4;  21-1;  22-3;  23-1;  24-2; 25-3; 26-4; 27-1;  28-4;   29-4;  30-3.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మొగల్‌ యుగ విశేషాలు

అభ్యాస ప్రశ్నలు

1. భారతదేశ చరిత్రకు సంబంధించి అబ్దుల్‌ హమీద్‌ లాహోరీ ఎవరు?

ఎ) అక్బర్‌ కాలంలో ఒక ప్రధాన సైన్యాధికారి
బి) షాజహాన్‌ పాలనాకాలపు అధికారిక చరిత్రకారుడు.
సి) ఔరంగజేబ్‌ కాలపు కులీనుడు, అతడి సన్నిహితుడు
డి) మహమ్మద్‌ షా పాలనా కాలపు రచయిత, కవి

 
3. దక్కన్‌ సుల్తానుల చరిత్ర తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం ఏది?

ఎ) తబకత్‌ఎనాసిరి           బి) ఫుతూహ్‌ఉస్‌సలాతిన్‌ 
సి) తారిఖ్‌ఎఫెరిష్తా           డి) కితాబ్‌ఉల్‌రెహ్లా


4. అక్బర్‌ కాలంలో రామాయణాన్ని పర్షియన్‌ భాషలోకి అనువదించింది ఎవరు?

ఎ) అబుల్‌ ఫజల్‌       బి) అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూనీ 
సి) బీర్బల్‌                డి) పైజీ సర్హింది


5. హిందూ ఇస్లాం మతాల సారంగా పేర్కొనే ‘మజ్మాఉల్‌బహ్రెయిన్‌’ రచయిత ఎవరు?

ఎ) దారాషికో                 బి) సులేమాన్‌ షికో     
సి) అబుల్‌ ఫజల్‌         డి) అమీర్‌ ఖుస్రూ 


6. ‘తారిఖ్‌ఎముబారక్‌ షాహీ’ ఎవరి కాలపు రచన?

ఎ) ఖిల్జీలు     బి) తుగ్లక్‌లు     సి) లోడీలు     డి) సయ్యద్‌లు


7. ‘తబకత్‌ఎనాసిరి’ రచయిత ఎవరు?

ఎ) మిన్హాజుస్‌ సిరాజ్‌         బి) నాసిరుద్దీన్‌ మహమ్మద్‌ 
సి) జియావుద్దీన్‌ బరౌనీ          డి) అబ్బాస్‌ ఖాన్‌ షేర్వానీ


8. కిందివాటిలో మహమ్మద్‌ హషీం ఖాఫీఖాన్‌ రచన?

ఎ) ముంతఖాబ్‌ఉత్‌తవారిఖ్‌     బి) ముంతఖాబ్‌ఉల్‌లుబాబ్‌ 
సి) ఖులాసత్‌ఉత్‌తవారిఖ్‌         డి) షాజహాన్‌ నామా


సమాధానాలు: 1-బి;  2-ఎ;  3-సి;  4-బి;  5-ఎ;  6-డి;  7-ఎ;  8-బి.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మధ్యయుగం - దక్షిణ భారత రాజ్యాలు

     సంగం యుగంలో తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. గుప్త యుగంలో తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలకపాత్ర పోషించారు. క్రీ.శ.9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


నవీన చోళులు
* విజయాలయుడు క్రీ.శ.846లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి, కావేరి డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు.
* ఒరైయూర్‌కు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని, నిశుంభసూదిని దేవాలయాన్ని నిర్మించాడు.
* నవీన చోళుల రాజధాని తంజావూరు.
* విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు చివరి పల్లవ చక్రవర్తి అపరాజిత వర్మను ఓడించి, పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు.
* మొదటి పరాంతకుడు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైన ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు (చోళులు స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరు పొందారు).
* ఉత్తర మేరూర్ శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది.
* మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి, మధురైకొండ అనే బిరుదు పొందాడు.
* మొదటి పరాంతకుడి కాలంలోనే రాష్ట్రకూటులతో వైరం ఏర్పడింది. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు మొదటి పరాంతకుడిని క్రీ.శ.949 నాటి తక్కోలం యుద్ధంలో ఓడించాడు.
* నవీన చోళ రాజుల్లో మొదటి గొప్ప పాలకుడు మొదటిరాజరాజు (క్రీ.శ.985 - 1014).
* మొదటి రాజరాజు అసలు పేరు అరుమోలి వర్మ. తంజావూరు శాసనం ఇతడి విజయాలను వివరిస్తుంది.
* బృహదీశ్వర ఆలయాన్ని శివుడికి అంకితం చేశారు. ఈ దేవాలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
* మొదటి రాజరాజు పొలోన్నరావాలో (సింహళం) శివాలయాన్ని నిర్మించాడు.
* తమిళ దేవాలయ వాస్తులో విమానాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ.
* భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా రాజరాజు పేరొందాడు. (బిరుదులు జయంగొండ, చోళమార్తాండ, ముమ్మిడి చోళ)
* ఇతడు సింహళంపై (శ్రీలంక) దండెత్తి ఉత్తర సింహళాన్ని ఆక్రమించాడు.
* మాల్దీవులను ఆక్రమించాడు.
* రాజరాజు తన కుమార్తె కుందవ్వను తూర్పు చాళుక్యరాజైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.
* తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసిన కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
* శ్రీ విజయరాజ్య పాలకుడైన శ్రీమార విజయోత్తుంగునకు నాగపట్నంలో చౌఢామణి విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది మొదటి రాజరాజే
* మొదటి రాజరాజు అనంతరం అతడి కుమారుడు మొదటి రాజేంద్రచోళ అధికారంలోకి వచ్చాడు.
* నవీన చోళుల్లో ప్రసిద్ధిచెందిన చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు (1014 - 1044)
* మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ, కడారంకొండ, పండితచోళ లాంటి బిరుదులను పొందాడు.
* మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మాంగదేవిని తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు.
* గంగానది వరకు వెళ్లి పాలవంశ రాజు మహీపాలుడిని ఓడించి, ''గంగైకొండ'' అనే బిరుదు పొందాడు.
* నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక, శ్రీ విజయ రాజ్యాలను జయించాడు.
* శ్రీ విజయ రాజ్య రాజధాని కడారంను జయించి కడారంకొండ అనే బిరుదును పొందాడు.
* మొదటి రాజేంద్ర చోళుడు 'గంగైకొండ చోళపురం' అనే నూతన రాజధానిని, 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించాడు.
* తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను వివరిస్తాయి.
* మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయరాజ్య రాజు శైవేంద్రుడిని, 1029లో సింహళ రాజు మహేంద్రుడిని ఓడించాడు.
* సుమత్రా, మలయా, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయరాజ్యంగా పిలిచేవారు.
* అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పాలకుడు మొదటిరాజేంద్రచోళుడు (చైనాకు వాణిజ్య రాయబారులను పంపించాడు.)
* ఎన్నాయిరం వైదిక కళాశాలను నిర్మించింది మొదటి రాజేంద్ర చోళుడు.
* మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతడి కుమారుడు రాజాధిరాజు ''విజయ రాజేంద్ర' బిరుదుతో రాజ్యపాలన చేశాడు.
* కానీ మొదటి రాజాధిరాజు క్రీ.శ.1052 నాటి కొప్పం యుద్ధంలో మరణించాడు.
* రాజాధిరాజు అనంతరం అతడి సోదరుడు రెండో రాజేంద్రుడు పాలనకు వచ్చాడు.
* రెండో రాజేంద్రుడు క్రీ.శ.1062 నాటి కుడల సంగం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
* అనంతరం వచ్చిన పాలకుడు వీర రాజేంద్రుడు, ఇతడి తర్వాత అతడి కుమారుడు అధిరాజేంద్రుడు పాలించాడు.
* రాజరాజ నరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడు ''కులోత్తుంగ చోళుడు'' అనే బిరుదుతో అధిరాజేంద్రుడి అనంతరం చోళరాజ్య పాలన చేపట్టాడు.
* కులోత్తుంగ చోళుడు చివరి తూర్పు చాళుక్య రాజైన ఏడో విజయాదిత్యుడి మరణానంతరం 'చోళ చాళుక్య రాజ్యాల'ను కలిపి పాలన ప్రారంభించాడు.
* విశాఖపట్నం నగరాన్ని నిర్మించింది కులోత్తుంగ చోళుడే.
* కళింగట్టు సరణి గ్రంథాన్ని రాసిన జయంగొండార్ కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు.
* మూడో కులోత్తుంగ చోళుడు, మూడో రాజరాజు, నాలుగో రాజేంద్రుడు చివరి చోళ చక్రవర్తులు.


ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు
* చోళులు వ్యవసాయ, వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* వ్యవసాయాభివృద్ధి కోసం పెద్దసంఖ్యలో చెరువులను తవ్వించారు.
* చోళులు అధికంగా భూములను వివిధ వర్గాలకు దానం చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ పటిష్టమైంది
* నాటి భూస్వాములను మువ్వేందవేలన్, అరయ్యార్ అని పిలిచేవారు.
* మువ్వేంద వేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించిన భూస్వామి
* అరయ్యార్ అంటే ముఖ్యుడు అని అర్థం.
* చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని శెక్కిలార్ రచించిన పెరియ పురాణం గ్రంథం వివరిస్తుంది.
* పెరియ పురాణం గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న పులయులు అనే నిమ్న కులం గురించి వివరించారు.
* మొదటి రాజేంద్ర చోళుడు చైనా దేశానికి రెండు రాయబార బృందాలను పంపి రాజకీయ, వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు.
* చోళుల కాలంలో ద్రవిడ/ దక్కన్ శైలి ఎంతో అభివృద్ధి చెందింది.


పుదుక్కోటి జిల్లాలోని ప్రధాన ఆలయాలు
* చోళుల ప్రారంభ ఆలయాలు పుదుక్కోటి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి.
* విజయాలయ చోళేశ్వరాలయం నార్థమలై
* నాగేశ్వరస్వామి ఆలయం కుంభకోణం
* కురంగనాథ ఆలయం శ్రీనివాస నల్లూరు
* మొదటి రాజరాజు 1009లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
* చోళుల కాలంనాటి నటరాజ కాంస్య విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది.
* చోళుల అధికార మతం శైవం. (శివారాధకులు)
* కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో కంపహారేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
* తంజావూరు జిల్లాలోని దారాసురాం వద్ద అయితేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
* సిబక చింతామణి, శివకాశీ నందమణి, కంబ రామాయణం లాంటి గ్రంథాలు ఈ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి.
* చోళుల కాలంలో యజ్ఞాల కంటే దానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.
* అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుడు, విశిష్టాద్వైతాన్ని చెప్పిన రామానుజాచార్యుడు ఈ యుగంలో ప్రాచుర్యం పొందారు.
* కులోత్తుంగ చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు హొయసల రాజ్యానికి వెళ్లి, వైష్ణవ మతాన్ని, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* దక్షిణ భారతదేశ సంస్కృతికి చోళులు ఎనలేని సేవలు అందించారు.


ళుల కాలంలో దానం చేసిన భూములు  - పేర్లు
బ్రహ్మదేయ  - బ్రాహ్మణులకు దానం చేసిన భూమి
వెల్లన్ వాగై - బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి
దేవమేయ/ తిరునాముత్తక్కని - దేవాలయానికి దానం చేసిన భూమి
శాలభోగ - పాఠశాలలకు ఇచ్చిన భూమి
పళ్లిచ్చరిదం - జైన సంస్థలకు దానం చేసిన భూమి.


బృహదీశ్వర ఆలయం
     తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజు నిర్మించాడు. కళ్యాణి చాళుక్యులను ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తమిళ వాస్తురీతిలో నిర్మితమైన బృహదీశ్వర ఆలయం మహోన్నతమైంది. ఈ దేవాలయ గోపురంపై అతి పెద్ద విమానాన్ని నిర్మించారు.


పరిపాలనా విశేషాలు
* చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు - వలనాడులు - నాడులు - గ్రామాలుగా విభజించారు.
* చోళుల పాలనలో అత్యంత విశిష్టమైంది గ్రామపాలన/ స్థానిక పాలన.
* మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూర్ శాసనం నాటి స్థానిక పాలన విశేషాలను వివరిస్తుంది.
* నాటి గ్రామాలను ''కుర్రం, కొట్టం'' అని కూడా పిలిచేవారు.
* గ్రామాల సముదాయాన్ని 'నాడు' అనేవారు. ప్రతినాడులో సుమారు 50 గ్రామాలు ఉండేవి
* నాడుల పాలన ధనవంతులైన 'వెల్లాలు' అనే రైతుల ఆధీనంలో ఉండేది.
* గ్రామాన్ని కుటుంబాలు / కుడుంబాలు అనే వార్డులుగా విభజించేవారు.
* గ్రామ కమిటీని వరియం / వారియం అనేవారు.
* గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు నిర్ణయించారు.


అర్హతలు:
   1. సొంత ఇల్లు కలిగి ఉండాలి.
   2. శిస్తు చెల్లించే సొంత భూమి కలిగి ఉండాలి.
   3. 35 - 70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
   4. వేదాల్లోని అంశాలపై అవగాహన ఉండాలి
   5. నిజాయతీపరుడై ఉండాలి.


అనర్హతలు:
   1. గతంలో వరుసగా మూడు సంవత్సరాలు గ్రామకమిటీ సభ్యుడిగా పని చేసి ఉండకూడదు.
   2. గతంలో పని చేసి లెక్కలు చూపనివారై ఉండకూడదు.
* అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలో వేసి ఒక బాలుడితో లాటరీ తీసి విజేతలను / కమిటీని ప్రకటిస్తారు.
* ఇలా ఎన్నుకున్న కమిటీని వారియం అంటారు. ప్రతి గ్రామ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు.
* వారియం మళ్లీ ఆరు ఉపకమిటీలుగా విడిపోయి వివిధ అంశాలను పరిశీలిస్తుంది.

Posted Date : 09-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత స్వాతంత్రోద్యమం - విప్లవకారులు

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం వివిధ వర్గాల వారు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వీరిలో వామపక్షాలు, సాయుధ పోరాట భావాలున్న వారు, మితవాదులు, అతివాదులు, విప్లవ జాతీయవాదులు ఉన్నారు. భారత స్వాతంత్రోద్యమాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
1) మితవాదుల దశ (1885-1905)
2) అతివాదుల దశ (1905-1919)
3) గాంధీయుగం (1919-1947)
* 1906 నుంచి 1920 వరకు సాగిన జాతియోద్యమ దశను ‘సమరశీల జాతీయోద్యమం’ లేదా ‘తీవ్రవాద జాతీయోద్యమం’గా పేర్కొంటారు.


మితవాదులు 
వీరు బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల విధేయత చూపారు. సమస్యలను సరైన, సంతులిత పద్ధతిలో విన్నవిస్తే ప్రభుత్వం వాటిని ఆమోదించి, పరిష్కరిస్తుందని భావించారు. రాజ్యాంగబద్ధ ఉద్యమం ద్వారా సక్రమ పద్ధతిలో, పరిమిత విమర్శలు, డిమాండ్లతో బ్రిటిష్‌వారిపై ఒత్తిడి తెచ్చి స్వాతంత్య్రాన్ని సాధించాలన్నారు.


అతివాదులు 
వీరు పూర్తిస్థాయి స్వాతంత్య్రాన్ని కోరారు. ప్రధానంగా స్వరాజ్య సాధన కోసం పోరాడారు. అతివాదులు తమ భావాలను కచ్చితంగా వ్యక్తం చేసి, ప్రజల్లో జాతీయభావాలను పెంపొందించడానికి ప్రయత్నించారు. ఉద్యమాల ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించారు.
* అతివాదుల్లో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్‌ తిలక్, బిపిన్‌ చంద్రపాల్‌ ముఖ్యులు. తిలక్‌ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని ప్రకటించారు. 
* తీవ్రవాద జాతీయవాదానికి వీరు బలమైన పునాదులు వేశారు. సమరశీల జాతీయవాదులు అతివాదులకు సమాంతరంగా సాయుధ పోరాటాలు నిర్వహించి జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించారు. కానీ వీరి విధానాలు వేరుగా ఉండేవి.


విప్లవ/ సమరశీల జాతీయవాదులు 
 సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్‌ పాలనను అంతమొందించవచ్చని వీరు భావించారు. బ్రిటిష్‌ సామ్రాజ్య వాదాన్ని, వారి సైనిక శక్తిని నిర్మూలించడానికి హింసాయుత విధానాలు అనుసరించారు.
* 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఉగ్రవాద విజృంభణకు కారణాలు ముఖ్యంగా బ్రిటిష్‌ ప్రభుత్వం అనుసరించిన అనేక హింసా విధానాలు, దమననీతి, రాజకీయ పోరాట వైఫల్యం, అతివాదుల ఆత్రుత, విప్లవకారుల వ్యక్తిత్వం.
* వీరు బ్రిటిష్‌ పరిపాలనా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి, వారికి సహకరించిన వారిని శిక్షించారు. బ్రిటిష్‌ వారిని హతమార్చి, బాంబువాదాన్ని అనుసరించారు.
* 20వ శతాబ్దం ప్రారంభం నాటికి అనేక సమితులు, రహస్య సంఘాలను స్థాపించారు. యువకులు, విద్యార్థులను వీటిలో సభ్యులుగా చేర్చుకున్నారు. వీరికి కుస్తీ పట్టడం, ముష్ఠియుద్ధ విధానం, జపాన్‌ వారి జిటోజిట్సు, కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ మొదలైనవి నేర్పించేవారు. 
* విప్లవ కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని చందాల రూపేణ, అవసరమైతే ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసేవారు. ప్రభుత్వ ధనాగారాలను కొల్లగొట్టి డబ్బు సంపాదించడం వారి కార్యక్రమాల్లో ఒక భాగంగా ఉండేది.
* వీరు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, చైనా హాంకాంగ్, సింగపూర్, అమెరికా, కెనడా, ఫిలిప్పీన్స్, టర్కీ, ఆఫ్గనిస్థాన్‌ మొదలైన దేశాల్లో విప్లవవాద సంస్థలను ఏర్పాటు చేసి, బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించారు.
* విదేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చారు.
* భారతదేశంలో బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, మద్రాస్, పంజాబ్, ఢిల్లీ మొదలైన ప్రాంతాలు విప్లవ కార్యక్రమాలకు కేంద్రాలయ్యాయి.


బెంగాల్‌ 
అరబిందో ఘోష్, అతడి సోదరుడు బరీంద్ర కుమార్‌ ఘోష్, స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్‌ దత్తా బెంగాల్‌లో విప్లవ ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమానికి ఆధ్యాత్మికతను జోడించి, భగవద్గీత సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
* 1906లో బరీంద్ర కుమార్‌ ఘోష్, భూపేంద్రనాథ్‌ దత్తా, అభినాష్‌ భట్టాచార్య కలిసి యుగాంతర్‌ అనే బెంగాలీ పత్రికను స్థాపించారు. రాజద్రోహం కింద వీరిపై అనేకసార్లు జరిమానాలు, శిక్షలు విధించారు. ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించింది. 
* బిపిన్‌ చంద్రపాల్‌ స్థాపించిన ‘వందేమాతరం’ పత్రికకు అరబిందో ఘోష్‌ సంపాదకుడిగా వ్యవహరించారు. ‘సంధ్య’ పత్రికను బ్రహ్మబంద్‌ ఉపాధ్యాయ ప్రచురించారు. వీటి ద్వారా విప్లవోద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
* బంకించంద్ర ఛటర్జీ, స్వామి వివేకానంద, అరబిందో ఘోష్‌ రచనల ప్రభావం విప్లవకారులపై  ఉండేది. 
* బెంగాల్‌ యువకుల్లో ధైర్య సాహసాలు నింపి, స్వాతంత్య్రం కోసం రక్తాన్ని ధారపోయాలని బరీంద్ర కుమార్‌ ఘోష్‌ బోధించారు.
* 1902లో కలకత్తాలో సతీష్‌ చంద్రబసు, ప్రమతనాథ్‌ మిత్రా కలిసి అనుశీలన్‌ సమితిని స్థాపించారు. వీరికి బరీంద్ర కుమార్‌ ఘోష్, అతడి అనుచరులు సహకరించారు.
* ఢాకా కేంద్రంగా పులిన్‌ బెహరి దాస్‌ అనుశీలన్‌ సమితిని స్థాపించారు. దీనికి తూర్పు బెంగాల్‌లో సుమారు 500 శాఖలుండేవి. ఈ సమితులకు అరబిందో ఘోష్, సిస్టర్‌ నివేదిత సహకరించారు.
* ఈ సమితులు కలకత్తా, ఢాకా కేంద్రాలుగా పనిచేస్తూ విప్లవ సాహిత్యాన్ని పంచి, అజ్ఞాత వర్గాలను (Underground Groups) నెలకొల్పాయి. రష్యన్, ఇటాలియన్‌ రహస్య సంఘాల్లాగానే ఇవీ పనిచేశాయి. సంఘాల్లోని సభ్యులను ఇబ్బందులు పెట్టే బ్రిటిష్‌వారిని ఇవి శిక్షించేవి.
* ‘ఆత్మోన్నతి సమితి’ విప్లవ సంఘాన్ని బిపిన్‌ బెహారి గంగూలీ బెంగాల్‌లో స్థాపించారు.
* బెంగాల్‌ భాష తెలిసిన మరాఠీ స్కాలర్‌ శకరాం గణేష్‌ దేశ్‌కర్‌ బెంగాల్, మహారాష్ట్ర విప్లవకారులను ఏకం చేశారు.
* 1905లో జరిగిన బెంగాల్‌ విభజన తర్వాత ఉగ్రజాతీయవాదం మరింత పెరిగింది.
* మైమన్‌ సింగ్‌ సుహృద్, సాధనా సమితులను స్థాపించారు. 
* స్వదేశీ బాంధవ్‌ సమితి (బారిసాల్‌), బ్రాతి సమితి (ఫరీద్‌పూర్‌) అనే విప్లవ సంఘాలు వెలిశాయి.
* ఘోష్‌ సోదరులు, భూపేంద్రనాథ్‌ దత్తా, సుబోధ్‌ మాలిక్‌ ‘యుగాంతర్‌’ (జుగాంతర్‌) అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే బ్రిటిష్‌ అధికారులను చంపడం, బాంబులు తయారు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఈ సంఘం పనిచేసింది.
* విప్లవకారులు తమ మొదటి బాంబును తూర్పుబెంగాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పుల్లర్‌పై ప్రయోగించారు. కానీ ఇది విఫలమైంది. తర్వాత 1907, డిసెంబరు 6న మిడ్నాపూర్‌ వద్ద బెంగాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రయాణిస్తున్న రైలును పేల్చేందుకు యత్నించారు. అదే నెలలో ఢాకా జిల్లా మాజీ మెజిస్ట్రేట్‌ లెన్‌ను కాల్చిచంపారు.
* కింగ్స్‌ఫోర్డ్‌ కలకత్తా మెజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు సుశీల్‌సేన్‌ అనే 15 ఏళ్ల యువకుడు వందేమాతరం అని అరిచినందుకు 16 కొరడా దెబ్బలు కొట్టించాడు. దీంతో విప్లవకారులు అతడ్ని హత్య చేయాలని భావించారు. దీన్ని పసిగట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ అధికారిని ముజఫర్‌నగర్‌ (బిహార్‌) మెజిస్ట్రేట్‌గా బదిలీచేసింది. 1908, ఏప్రిల్‌ 30న ఫోర్డ్‌ ప్రయాణిస్తున్న రైలు కోచ్‌పై ఖుదీరాం బోస్, ప్రపుల్లాచాకి అనే ఇద్దరు విప్లవకారులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో బ్రిటిష్‌ అధికారి కెన్నడీ భార్య, కుమార్తె మరణించగా, కింగ్స్‌ఫోర్డ్, కెన్నడీ తప్పించుకున్నారు.
* ప్రపుల్లా చాకి ఆత్మహత్య చేసుకోగా, ఖుదీరాం బోస్‌ను అరెస్ట్‌చేసి, విచారణ అనంతరం ఉరితీశారు. వీరి త్యాగాలను బాలగంగాధర్‌ తిలక్‌ ‘కేసరి’ పత్రికలో ప్రశంసించగా, ఆయనపై రాజద్రోహ నేరం మోపి ఆరేళ్లు మాండలే జైలుకు పంపారు. 


  అలీపూర్‌ కుట్రకేసు
కలకత్తా సమీపంలోని మానిక్‌ టోలాలో విప్లవకారులు (యుగాంతర్‌ సంఘం) బాంబులు తయారుచేసే కర్మాగారాన్ని నిర్వహించారు. 1908, మేలో పోలీసులు దీనిపై దాడిచేసి కొన్ని పేలుడు పదార్థాలు, ముఖ్యమైన ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరబిందో ఘోష్‌తోపాటు మరికొందరిని ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. కేసు విచారణలో నరేంద్రనాథ్‌ గోస్వామి బ్రిటిష్‌ ప్రభుత్వ సాక్షిగా మారి పోలీసులకు సహకరించాడు. వారి రహస్యాలను బ్రిటిష్‌ వారికి చెప్పాడు. దీంతో గోస్వామిని అతడి సహచరులైన కనియలాల్‌ దత్తా,  సత్యేంద్రనాథ్‌ బోస్‌ జైల్లోనే కాల్చిచంపారు. వీరిని 1908, నవంబరు 10న ఉరితీశారు. 
* ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న అశుతోష్‌ బిస్వాస్‌ను విప్లవకారులు కాల్చిచంపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు అరబిందో ఘోష్‌కు చిత్తరంజన్‌దాస్‌ సాయం చేశారు. అయితే బరీంద్రుడితో సహా మరికొందరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. దీన్నే ‘అలీపూర్‌ కుట్రకేసు’గా పేర్కొంటారు.
* 1908, నవంబరులో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సర్‌ ఆండ్రూ ప్రేజర్‌పై హత్యాయత్నం జరిగింది.
* మొదటి ప్రపంచయుద్ధ సమయంలో (191516) జతీంద్రనాథ్‌ ముఖర్జీ ఆధ్వర్యంలో విప్లవ సంఘాలన్నీ బందిపోట్ల నిర్వహణ, హత్యలు లాంటివి చేశాయి. ఈయన ‘బాగ్‌(పులి) జతిన్‌’గా పేరొందాడు.
* రాస్‌ బిహారి బోస్‌ ఆధ్వర్యంలో బెంగాల్, పంజాబ్‌ రాష్ట్రాల్లో విప్లవ కార్యకలాపాలు కొనసాగాయి. బోస్‌ ఆధ్వర్యంలో 1912లో వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింజ్‌పై బాంబు దాడికి ప్రయత్నం జరిగింది. బ్రిటిష్‌వారు బోస్‌ను వారణాసి, ఢిల్లీ, లాహోర్‌ కుట్రకేసుల్లో ఇరికించినా తప్పించుకుని జపాన్‌ చేరాడు. అక్కడ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో పని చేశాడు.
* రెండోదశ విప్లవ కార్యకలాపాలు సహాయనిరాకరణ ఉద్యమం తర్వాత ప్రారంభమయ్యాయి. ఆత్మశక్తి, సారథి లాంటి బెంగాల్‌ పత్రికల్లో గత విప్లవవాదుల సాహసాలు, త్యాగాల వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అనుశీలన్‌ సమితి, యుగాంతర్‌ విప్లవసంఘాలు తమ కార్యక్రమాలను పునరుద్ధరించాయి. 
* సూర్యసేన్‌ నాయకత్వంలో అధికారులను చంపడం, బహిరంగ దోపిడీలు, బాంబుల తయారీని ప్రారంభించారు. ఇతడిని ‘మాస్టర్‌దా’గా పిలిచేవారు. ఈయన చిట్టగాంగ్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా పనిచేశారు.   సేన్‌ ప్రధాన అనుచరులు అనంతసింగ్, గణేష్‌ ఘోష్, లోక్‌నాథ్‌ బాల్‌. 
* సూర్యసేన్‌ నాయకత్వంలో 1930, ఏప్రిల్‌ 18న చిట్టగాంగ్‌ ఆయుధగారంపై దాడి జరిగింది. ముగ్గురు బ్రిటిష్‌ సైనికులను హతమార్చి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ మందుగుండు తీసుకెళ్లడం మరిచారు. టెలిగ్రాఫ్‌ కార్యాలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. సేన్‌ అధ్యక్షతన విప్లవవాదులు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
* ఆంగ్ల ప్రభుత్వం ప్రతిచర్యలు ప్రారంభించగా విప్లవకారులు అడవుల్లోకి పారిపోయారు. 1930, ఏప్రిల్‌ 22న ‘జలాలాబాద్‌’ కొండపైన బ్రిటిష్‌వారికి, విప్లవకారులకు మధ్య 3 గంటల యుద్ధం జరిగింది. ఇందులో 11 మంది విప్లవకారులు; 64 మంది బ్రిటిష్‌ సైనికులు మరణించారు. బ్రిటిష్‌ ప్రభుత్వంతో సాయుధ పోరాటం సాధ్యమనే భావన ప్రజల్లో వ్యాపించింది. అనేక మంది యువకులు, స్త్రీలు ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. విప్లవకారులు ‘హిందుస్తాన్‌ రిపబ్లిక్‌ ప్రజాసైన్యం’ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించారు.
* సూర్యసేన్‌ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలో ఉంటూ కార్యక్రమాలను కొనసాగించారు. 1933, ఫిబ్రవరి 16న ఈయన్ని అరెస్టు చేసి, విచారించి ఉరిశిక్ష ఖరారు చేశారు. 1934, జనవరి 12న ఉరితీశారు. చిట్టగాంగ్‌ దాడి కేసులో 14 మందికి యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష విధించారు.
* ఈ విప్లవోద్యమంలో స్త్రీలు కల్పన దత్‌ (మాండలే జైలు నుంచి విడుదలయ్యాక పీసీ జోషి అనే కమ్యూనిస్ట్‌ని వివాహమాడి కల్పన జోషిగా ప్రసిద్ధిపొందారు.), ప్రీతిలత వడ్డేదార్‌ (చిట్టగాంగ్‌ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో 1932, సెప్టెంబరులో  బాంబు పేల్చారు), వీణాదాస్, భగవతీ చరణ్‌ ఓహ్రా భార్య దుర్గ ఓహ్రా, సుశీల మోహన్‌ లాంటివారు పాల్గొని ప్రాణాలర్పించారు.
* 1930  33 మధ్య 20 హత్యలు, 10 చోట్ల బాంబు దాడులు, ఒక సాయుధ దోపిడి, 8 బాంబు పేలుళ్లు జరిగాయి. న్యాయ, పోలీస్‌ శాఖలకు చెందిన యూరోపియన్‌ అధికారులు ఎక్కువగా హత్యలకు గురయ్యారు.

 

ఉత్తర్‌ ప్రదేశ్‌లో విప్లవం
ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన రాజామహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ బృందావనంలో ఇండిజీనియస్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఐరోపా వెళ్లి జర్మన్‌ల సాయంతో భారత్, విదేశాల్లో సాయుధ పోరాటాలు జరిపేందుకు యత్నించి విఫలమయ్యారు.
* 1923 తర్వాత విప్లవ కార్యక్రమాలను పునరుద్ధరించారు. రాంప్రసాద్‌ బిస్మల్, జోగేశ్‌ ఛటర్జీ, సచీంద్రనాథ్‌ సన్యాల్‌ కలిసి 1924, అక్టోబరులో కాన్పూర్‌లో హిందుస్థాన్‌  రిపబ్లికన్‌ సంఘాన్ని ఏర్పాటుచేశారు. దీని శాఖలు బిహార్, ఉత్తర్‌ ప్రదేశ్, ఢిల్లీ పంజాబ్‌ లో ఉండేవి. ఇదే తర్వాతి కాలంలో హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌గా మారింది. ఈ సంఘం ‘ప్రజా విప్లవం ప్రజల కోసమే’ అనే నినాదాన్ని ప్రతిపాదించింది. బ్రిటిష్‌వారి పట్ల దౌర్జన్యం, వీర త్యాగం మొదలైన చర్యల ద్వారా ప్రజలను ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేసింది.


కకోరి కుట్ర కేసు
రాంప్రసాద్‌ బిస్మల్‌ తన 9 మంది అనుచరులతో కలిసి షహరాన్‌పూర్‌ - లక్నో మార్గంలో కకోరి రైల్వేస్టేషన్‌ వద్ద గొలుసు లాగి రైలును ఆపారు. రైల్వే ఆదాయం, నిల్వ ధనాన్ని కొల్లగొట్టేందుకు ఇలా చేశారు. అష్ఫాఖుల్లా ఖాన్‌ రైల్వే సొమ్ము ఉన్న ఇనుప పెట్టెను బద్దలు కొట్టి, ధనంతో లక్నో వెళ్లిపోయాడు.
* 40 మంది అనుమానితులపై కేసులు పెట్టి, ఏడాది విచారణ చేశారు. కొందరికి జైలుశిక్ష; నలుగురికి ఉరి; నలుగురికి ద్వీపాంతరవాస శిక్ష విధించారు. దీన్నే కకోరి కుట్ర కేసుగా వ్యవహరించారు.
* ఈ కేసులో రాంప్రసాద్‌ బిస్మల్‌ను 1926, డిసెంబరులో  ఉరితీశారు. ఈ సందర్భంగా ‘బ్రిటిష్‌ సామ్రాజ్యం పతనం కావడమే మా లక్ష్యం’ అని ఆయన నినదించారు.
* రాజేంద్ర లాహిరీని ఉరిశిక్ష; మన్మద్‌నాథ్‌ గుప్తాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ తప్పించుకున్నారు.
* చంద్రశేఖర్‌ ఆజాద్‌ నేతృత్వంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లో బిజయ్‌ కుమార్‌ సిన్హా, శివ శర్మ, జైదేవ్‌ కపూర్‌; పంజాబ్‌లో భగత్‌ సింగ్, భగవతీ చరణ్‌ వోహ్రా, సుఖ్‌దేవ్‌ హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ సంఘం కార్యకలాపాలను నిర్వహించారు.
* 1928, సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఒక సమావేశం జరిగింది. ఇందులో హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ సంఘం పేరును ‘హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ సంఘం’గా మార్చారు. 


సైమన్‌ కమిషన్‌
* భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల స్వరూప స్వభావాన్ని అంచనా వేయడానికి  బ్రిటిష్‌ ప్రభుత్వం 1927, నవంబరు 8న ఒక కమిషన్‌ను నియమించింది. దీనికి జాన్‌ సైమన్‌ అధ్యక్షత వహించారు. కమిషన్‌లోని  సభ్యులంతా బ్రిటిష్‌వారే కావడంతో, దీన్ని బహిష్కరించాలని 1927, డిసెంబరులో జరిగిన మద్రాస్‌ కాంగ్రెస్‌ సభలో తీర్మానించారు.
* 1928, ఫిబ్రవరి 3న సైమన్‌ కమిషన్‌లోని సభ్యులు బొంబాయికి వచ్చారు. ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదంతో వారిని బహిష్కరించారు. కలకత్తా, పాట్నా, లాహోర్‌లో కూడా బహిష్కరణ ఉద్యమం జరిగింది.
* 1928, అక్టోబరులో సైమన్‌ కమిషన్‌ లాహోర్‌కు వచ్చింది. వారి రాకను నిరసిస్తూ లాలా లజపతి రాయ్‌ నాయకత్వంలోని హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ సంఘం పెద్ద ఊరేగింపు నిర్వహించారు. దీన్ని చెదరగొట్టడానికి వచ్చిన బ్రిటిష్‌ పోలీస్‌ అధికారి సాండర్స్‌ లజపతి రాయ్‌ను లాఠీ దెబ్బలతో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో 1928, నవంబరు 17న రాయ్‌ మరణించారు. లజపతి రాయ్‌కు పంజాబ్‌ సింహం అనే బిరుదు ఉంది. ఈయన పంజాబీ అనే పత్రికను స్థాపించారు.


లాహోర్‌ కుట్ర కేసు
* లజపతి రాయ్‌ మరణానికి కారకుడైన సాండర్స్‌ను 1928, డిసెంబరు 17న భగత్‌సింగ్, రాజ్‌గురులు, చంద్రశేఖర్‌ ఆజాద్, సుఖ్‌దేవ్‌లు కాల్చి చంపారు. 
* బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజా భద్రతా చట్టం; కార్మిక వివాదాల చట్టం బిల్లులను కేంద్ర శాసన సభలో ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భగత్‌సింగ్, బతుకేశ్వర్‌ దత్‌లు సభలోకి ప్రవేశించి బాంబులు విసిరారు.‘విప్లవం శాశ్వతంగా వర్ధిల్లాలి’ అనే భగత్‌ సింగ్‌ నినాదం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌గా స్థిరపడింది. వీరిని అరెస్ట్‌ చేశారు.
* 1929, మే 7న కోర్టు విచారణ ప్రారంభమై, జూన్‌ 12తో ముగిసింది. 1930, అక్టోబరు 7న రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భగత్‌సింగ్‌లకు ఉరిశిక్ష విధించారు. 1931, మార్చి 23న వారిని లాహోర్‌ జైలులో ఉరితీశారు. మహావీర్‌ తివారీ, విజయ్‌కుమార్‌ సిన్హాలకు ద్వీపాంతరవాస శిక్ష విధించారు. అనేక మందికి దీర్ఘకాల జైలుశిక్షలు వేశారు. చరిత్రలో దీన్నే లాహోర్‌ కుట్ర కేసుగా పేర్కొంటారు. జతీన్‌దాస్‌ జైల్లోనే 64 రోజులు దీక్షచేసి మరణించారు. కలకత్తాలో ఈయన అంతిమ సంస్కారానికి 6 లక్షల మంది హాజరయ్యారు. రెండు మైళ్ల పొడవున ఊరేగింపు నిర్వహించారు. వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన కరాచీలో కాంగ్రెస్‌ మహాసభ జరిగినప్పుడే ఉరిశిక్షలూ అమలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన యువకులు గాంధీజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
* లాహోర్‌లో విప్లవకారులు స్థాపించిన పెద్ద బాంబు తయారీ కర్మాగారాన్ని పోలీసులు  అసెంబ్లీ బాంబు ఘటన అనంతరం కనుక్కున్నారు. అందులో 7000 బాంబుల తయారీకి సరిపడా సామగ్రి లభించింది. షహరాన్‌పూర్‌లో మరో బాంబు తయారీ కర్మాగారాన్ని కనుక్కున్నారు.


చంద్రశేఖర్‌ ఆజాద్‌:
* చంద్రశేఖర్‌ ఆజాద్‌ 1929, డిసెంబరులో వైస్రాయ్‌ ప్రయాణిస్తున్న రైలుపై బాంబులు విసిరాడు. దాడిలో కొంత నష్టం జరిగినా వైస్రాయ్‌ తప్పించుకున్నాడు. సాయుధ పోరాటానికి ఆయుధాలు, ధనాన్ని సమకూర్చేందుకు ఆజాద్‌  1930, జులైలో ఢిల్లీలోని ఓ వ్యాపార కేంద్రంపై దాడిచేసి రూ.14,000 కొల్లగొట్టాడు.
* 1931, ఫిబ్రవరి 26న ఆజాద్‌ అలహాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూను కలిశారు. అనంతరం తన స్నేహితుడ్ని కలిసేందుకు పార్కుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు  చుట్టుముట్టి కాల్పులు జరపగా మరణించారు.

 

తిరునల్వేలి కుట్ర కేసు
* 1906లో తారకనాథ్‌ దాస్‌ మద్రాస్‌లో ‘తారకనాథ బ్రహ్మచారి’ పేరుతో సన్యాసాన్ని స్వీకరించి, ఒక రహస్య సంఘాన్ని స్థాపించారు. చిదంబర పిళ్లై న్యాయవాద వృత్తిని వదిలి, స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ, సొంతంగా ఒక స్వదేశీ నౌకా కంపెనీని స్థాపించారు.
* బిపిన్‌ చంద్రపాల్‌ 1907లో మద్రాస్, ఆంధ్రా ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగాలు చేశారు. తన పర్యటనల్లో వందేమాతరం నినాదం మారుమోగింది. 
* చిదంబరం పిళ్లై ‘వివేకవాణి’ అనే తమిళ పత్రికను; నీలకంఠ బ్రహ్మచారి ‘సూర్యోదయ’, ‘ఇండియా’ అనే పత్రికలను స్థాపించారు.
* నీలకంఠ బ్రహ్మచారి, వాంచి అయ్యర్‌ మరికొందరు కలిసి ‘భారతమాత సంఘం’ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. కాళీ వీరి ఆరాధ్య దేవత. వాంచి అయ్యార్‌ తిరునల్వేలి కలెక్టర్‌గా ఉన్న  ఆషిని 1911, జూన్‌ 19న వాంచి అయ్యర్‌ హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం 14 మందిపై తిరునల్వేలి కుట్రకేసు పెట్టింది.


అల్లూరి సీతారామరాజు:
* 192224లో ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటు చేశారు. మన్యం తిరుగుబాటు నాయకుడిగా పితూరి జరిపారు. బ్రిటిష్‌ వారిపై గెరిల్లా యుద్ధం సాగించారు. ఈయనకు గంటందొర, మల్లుదొర, అగ్గిరాజు ప్రధాన అనుచరులు. ఆ సమయంలో మన్యం ప్రాంత అధికారిగా రూథర్‌ ఫర్డ్‌ నియమితులయ్యాడు. 1924, మే 27న జమేదార్‌ కంచుమీనన్‌ సీతారామరాజును బంధించగా మేజర్‌ గుడాల్‌ రాజును కాల్చి చంపాడు.


ఇతర కుట్ర కేసులు
* గోదావరి జిల్లాలో ప్రతివాది భయంకర వెంకటాచారి ‘ఉజ్జీవన్‌ భారత్‌ సమ్మేళన్‌’ అనే విప్లవ సంస్థను స్థాపించారు. ఆ సమయంలో ముస్తఫా అలీఖాన్, డప్పుల సుబ్బారావు అనే పోలీసు అధికారులు ప్రజలను ఇబ్బందులు పెట్టేవారు. వీరిని అంతం చేసేందుకు కె.కామేశ్వర శాస్త్రి, సి.హెచ్‌.నరసింహాచారి, ఓ.రామచంద్రయ్య తదితరులు 1933, ఏప్రిల్‌ 6, 14 తేదీల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు కాకినాడ కుట్రకేసులో భయంకరాచారికి జైలు శిక్ష విధించి అండమాన్‌ జైలుకు పంపారు. మిగతావారికి ఇతర శిక్షలు వేశారు.
* 1933, మార్చిలో 20 మంది కలసి హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ అనుబంధ సంస్థను మద్రాస్‌లో స్థాపించారు. దీని శాఖలు ఆంధ్రాలోనూ ఉండేవి. మద్రాస్‌ కుట్రకేసు పేరుతో వీరిని బంధించి బ్రిటిష్‌ ప్రభుత్వం శిక్షలు విధించింది.
* పంజాబ్‌లో విప్లవోద్యమానికి కృషి చేసిన వారిలో అంబా ప్రసాద్‌; లాల్‌చంద్‌ హలక్‌;  ధనవత్‌రాయ్‌ ముఖ్యులు.
* అజిత్‌సింగ్‌ లాహోర్‌లోని భారతమాత సమితికి చెందినవారు. బెంగాల్‌ విప్లవకారులతో ఇతడికి సంబంధం ఉండేది. లాలా లజపతి రాయ్, అజిత్‌సింగ్‌లు 190607లో పంజాబ్‌లో రైతు ఉద్యమాన్ని చేపట్టారు.
* పంజాబ్, బెంగాల్‌ విప్లవోద్యమ సంధానకర్తగా రాస్‌ బిహారి ఘోష్‌ పనిచేశారు.
* 1904లో షహరాన్‌పూర్‌లో ఒక రహస్యసంఘాన్ని స్థాపించారు. తర్వాత రూర్కీ దీని ప్రధాన కేంద్రమైంది. లాలా హరదయాళ్‌ ఇందులో సభ్యుడిగా ఉంటూ సంఘానికి నాయకత్వం వహించారు. 1909లో ఈయన అమెరికాకు వెళ్లగా దీననాథ్, రాస్‌ బిహారీ బోస్‌లు సంఘానికి నాయకత్వం వహించారు.
* దేశంలోని మొదటి రాజకీయ హత్య 1897, జూన్‌ 22న పుణె (మహారాష్ట్ర)లో జరిగింది. ప్లేగ్‌ కమిటీ కమిషనర్‌ రాండ్‌ను హత్య చేశారు. ఇందులో చాపేకర్‌ సోదరులు (దామోదర్‌ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్, వాసుదేవ హరి చాపేకర్‌) కీలకపాత్ర పోషించారు. ఈ ఘటనలో లెఫ్టినెంట్‌ అయిరెస్ట్‌ కాల్పులకు గురయ్యారు. చాపేకర్‌ సోదరులను ఉరితీశారు.
* 1905లో శ్యామ్‌జీ కృష్ణవర్మ లండన్‌లో ‘ఇండియా హోమ్‌రూల్‌ సొసైటీ’ని స్థాపించారు. ఇది ‘ఇండియా హౌస్‌’గా ప్రసిద్ధి చెందింది.
* 1899లో నాసిక్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)లో వి.డి.సావర్కర్‌ ‘మిత్రమేళా’ను స్థాపించారు. 1904లో దీని పేరును అభినవ భారత్‌ సంఘంగా మార్చారు. 
* ఈయన తమ్ముడైన గణేష్‌ సావర్కర్‌ ఈ విప్లవ సంఘంలో కీలకపాత్ర పోషించారు. వీరి పత్రిక పేరు కల్‌. ఇది మహారాష్ట్ర నుంచి వెలువడింది.
* నాసిక్‌ కుట్ర కేస్బు1909్శలో గణేష్‌ సావర్కర్‌కు నాసిక్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ జాక్సన్‌ కాలాపాని శిక్షను విధించారు. 1909లో మదన్‌లాల్‌ ధింగ్రా లండన్‌లో కల్నల్‌ విలియం కర్జన్‌ వైలీని కాల్చిచంపాడు. గణేష్‌ సావర్కర్‌లను లండన్‌లో ఉరితీశారు.
* సచీంద్ర సన్యాల్, రాస్‌ బిహారీ బోస్‌లు వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింజ్‌ - II పై ఢిల్లీలో బాంబులు విసరగా ఆయన తప్పించుకున్నాడు. దీన్నే వారణాసి కుట్ర కేసుగా పేర్కొంటారు. అనంతరం బోస్‌ జపాన్‌ వెళ్లిపోగా, సచీంద్ర సన్యాల్‌ అరెస్టయ్యాడు. ఈయన బంధీజీవన్‌ అనే పుస్తకాన్ని రాశారు.
* శరత్‌చంద్ర ఛటర్జీ రచించిన పతెర్‌ దబి నవలను బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది.
* ఆంగ్లేయ చరిత్రకారులు విప్లవకారులను కుట్రదారులుగా, హంతకులుగా, బందిపోట్లుగా పేర్కొనగా, భారతీయులు వీరిని ‘సమరశీల జాతీయవాదులు’గా వర్ణించారు.

 

విదేశాల్లో భారత విప్లవకారులు (Revolutionary movements outside India)

విదేశాల్లో స్థిరపడిన కొందరు భారతీయులు భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయా దేశాల్లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు కొనసాగించారు. ముఖ్యంగా ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్, ఆఫ్గనిస్థాన్, జర్మనీ దేశాల్లోని భారతీయులు ఈ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమాలు, విప్లవకారుల గురించి పరీక్షార్థులకు అవగాహన అవసరం.


శ్యామ్‌జీ కృష్ణవర్మ
ఈయన 1857, అక్టోబరు 4న గుజరాత్‌లోని మాండవిలో జన్మించారు. శ్యామ్‌జీ ఆర్యసమాజ్‌ స్థాపకులైన దయానంద సరస్వతి శిష్యులు. 1875లో భాటియా వర్గానికి చెందిన భానుమతిని వివాహం చేసుకున్నారు.
* కృష్ణవర్మ న్యాయవాదిగా, పత్రికా రచయితగా పనిచేశారు. బొంబయిలోని విల్సన్‌ హైస్కూల్‌లో సంస్కృతం నేర్చుకున్నారు. 1877లో కాశీ పండిట్ల నుంచి ‘పండిట్‌’ బిరుదును పొందారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మానియర్‌ విలియమ్స్‌ సాయంతో లండన్‌లో బారిస్టర్‌ పరీక్ష ఉత్తీర్ణులై, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
* 1881లో బెర్లిన్‌లో జరిగిన ప్రాచ్య సంస్కృతి అభిమానుల సమ్మేళనానికి  (Berlin Congress of Orientalists) భారత ప్రతినిధిగా కృష్ణవర్మ హాజరయ్యారు. ఇంగ్లండ్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక ఉదయ్‌పూర్‌ సంస్థానంలో కౌన్సిల్‌ మెంబర్‌గా; జునాగఢ్‌ సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు.
* ఈయనపై స్వామి దయానంద సరస్వతి, లోకమాన్య తిలక్‌; హెర్బర్ట్‌ స్పెన్సర్‌ రచనల ప్రభావం అధికంగా ఉండేది.
* దేశానికి స్వాతంత్య్రం రావాలని కాంక్షిస్తూ 1897లో బ్రిటన్‌ వెళ్లి అక్కడ విప్లవభావాలను ప్రచారం చేశారు.
* 1905లో లండన్‌ కేంద్రంగా ‘ద ఇండియన్‌ సోషియాలజిస్ట్‌’ అనే ఇంగ్లిష్‌ మాసపత్రికను స్థాపించారు.  
* 1905, ఫిబ్రవరి 18న లండన్‌లో ‘ఇండియన్‌ హోమ్‌ రూల్‌ సొసైటీ’ని స్థాపించారు. స్వరాజ్య సాధన కోసం ప్రజలు ఏకం కావాలనే లక్ష్యంతో ఈ సొసైటీ పనిచేసింది.
* ప్రజల్లో విప్లవభావాలను పెంపొందించడానికి, ఇంగ్లండ్‌లోని భారతీయులను ఏకం చేసేందుకు ‘ఇండియా హౌస్‌’ను ఏర్పాటు చేశారు. వి.డి.సావర్కర్, మేడం బికాజీ కామా, ఎస్‌.ఆర్‌.రానా, వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ, లాలా హర్‌దయాళ్‌ మొదలైన వారికి దీంతో సంబంధాలు ఉండేవి.
* శ్యామ్‌జీ కార్యకలాపాలపై బ్రిటిష్‌ ప్రభుత్వం నిఘా పెట్టింది. దీంతో ఆయన పారిస్‌ వెళ్లిపోయారు. తర్వాత జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించారు. ‘ఇండియన్‌ హౌస్‌’ బాధ్యతలను వీర్‌ సావర్కర్‌కు అప్పగించారు.
* శ్యామ్‌జీ కృష్ణవర్మ 1930, మార్చి 30న జెనీవా (స్విట్జర్లాండ్‌)లో మరణించారు. ఆయన స్మారక చిహ్నాన్ని గుజరాత్‌లోని కచ్‌లో ‘క్రాంతి తీర్థ్‌’ పేరుతో ఏర్పాటు చేశారు. 1989, అక్టోబరు 4న ఈయన పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు.


మేడం బికాజీ కామా
ఈమె 1861, సెప్టెంబరు 24న బొంబయిలోని ఒక పార్శీల కుటుంబంలో జన్మించారు. 1885, ఆగస్టులో రుస్తుం కామాతో వివాహమైంది. జర్మనీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్‌ మొదలైన దేశాల్లో నివసించి, చివరకు లండన్‌ చేరారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ నిర్వహించే విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొంతకాలం దాదాభాయ్‌ నౌరోజీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు.
* యూరప్, అమెరికా, ఫ్రాన్స్‌ మొదలైన దేశాల్లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు కొనసాగిస్తూ భారత స్వాతంత్య్రం కోసం కృషి చేశారు.
* 1907, ఆగస్టు 22న జర్మనీలోని స్టట్‌గార్డ్‌లో జరిగిన ప్రపంచ సోషలిస్ట్‌ మహాసభకు హాజరయ్యారు. అక్కడ భారత జాతీయ పతాకాన్ని రూపొందించి, ఎగరేశారు. ఇలా జాతీయజెండాను విదేశాల్లో మొదటిసారి ఎగరేసిన స్త్రీగా గుర్తింపు పొందారు. ఆ జెండాలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులు ఉన్నాయి.
* 1935లో భారత్‌కు తిరిగివచ్చిన ఆమె 1936, ఆగస్టు 13న మరణించారు.


ఒబైదుల్లా
1872 మార్చి 10న సియాల్‌కోట్‌ (పంజాబ్‌)లో ‘సిక్కు ఖత్రీ’ అనే కుటుంబంలో  జన్మించారు. ఈయన పేరు ‘బూటాసింగ్‌ ఉప్పల్‌’. పదిహేనేళ్ల వయసులో ఇస్లాంను స్వీకరించి, ‘మౌలానా ఒబైదుల్లా సింధీ’గా పేరు మార్చుకున్నారు. ఈయన జాతి డైరీ (ఏన్‌ ఆటో బయోగ్రఫీ), సఫర్నామా- ఐ - కబుల్‌ అనే రచనలు చేశారు. విప్లవ చరిత్రలో ‘సిల్క్‌ లేఖల’ రచయితగా గుర్తింపు పొందారు.
* ఒబైదుల్లా తన గురువైన మహ్మద్‌ - అల్‌- హసన్‌ సలహా మేరకు ‘జమియత్‌ - ఉల్‌- అన్సార్‌’ సంస్థను స్థాపించారు. 
* బ్రిట్‌ష్‌వారిని భారత్‌ నుంచి వెళ్లగొట్టేందుకు మహ్మద్‌-అల్‌ హసన్‌ 1915లో ఒబైదుల్లాను కాబుల్‌కు పంపారు. అక్కడ రాజమహేంద్ర ప్రతాప్‌ బ్రిటిష్‌ వ్యతిరేక ప్రణాళికలు రచించారు. అవి ఒబైదుల్లాకు నచ్చడంతో జర్మనీ సహకారం కోసం ప్రయత్నించారు. 
* ఆఫ్గనిస్థాన్‌ అమీర్‌ హబీబుల్లాఖాన్‌  భారత జాతీయ కాంగ్రెస్‌తో సహకరించాలని  ఒబైదుల్లాను కోరాడు. అప్పటి జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ అన్సారీ సిఫార్సు మేరకు ఒబైదుల్లా అధ్యక్షతన కాబుల్‌లో కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటైంది.
* బెర్లిన్‌లో ఏర్పాటుచేసిన  భారత స్వాతంత్య్ర కమిటీ  (Indian Independence Committee) కాబుల్‌కు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. ఇందులో రాజమహేంద్ర ప్రతాప్, అబ్దుల్‌ హఫీజ్‌ మహ్మద్‌ బర్కతుల్లా, జర్మన్‌ అధికారులు వెర్నర్‌ ఒట్టో ఒన్‌ హెన్టీగ్, ఆస్కార్‌ నీడర్‌మేయర్, ఇతర సభ్యులు ఉన్నారు.
* భారతదేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా వీరు 1915, డిసెంబరు 1న ఆఫ్గనిస్థాన్‌లో తాత్కాలిక భారత ప్రభుత్వాన్ని  (Provisional government of India) ఏర్పాటుచేశారు. ఇందులో రాజమహేంద్ర ప్రతాప్‌ ప్రెసిడెంట్‌గా, బర్కతుల్లా ప్రధానమంత్రిగా, ఒబైదుల్లా భారత వ్యవహారాలు, హోం శాఖ మంత్రిగా, దియోబంద్‌ నాయకుడు మౌలావి బషీర్‌ యుద్ధమంత్రిగా, చంపకరామన్‌ పిళ్లై విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
* గాలిబ్‌ పాషా వీరికి సహకరించి బ్రిటిష్‌ ప్రభుత్వంపై ‘జిహాద్‌’ ప్రకటించారు.
* ఈ తాత్కాలిక ప్రభుత్వానికి చైనా, రష్యా, జపాన్, జర్మనీ మొదలైన దేశాల గుర్తింపు లభించలేదు. 
* మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ, టర్కీలు ఓడిపోవడంతో విప్లవకారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒబైదుల్లాను ఆఫ్గనిస్థాన్‌ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన మాస్కో (రష్యా), అంకారా (టర్కీ)కి వెళ్లారు. 
* 1939లో ఒబైదుల్లా భారత్‌కు తిరిగి వచ్చారు. 1944లో కాన్పూర్‌లోని దీన్‌పూర్‌ గ్రామంలో మరణించారు.


బర్కతుల్లా
ఈయన 1854, జులై 7న భోపాల్‌ (మధ్యప్రదేశ్‌)లో జన్మించారు. అసలుపేరు అబ్దుల్‌ హఫీజ్‌ మహ్మద్‌ బర్కతుల్లా. ఈయన ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ భారత జాతీయవాదులతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. లాలా హర్‌దయాళ్, రాజమహేంద్ర ప్రతాప్‌తో కలిసి పనిచేశారు. గదర్‌ పార్టీ స్థాపకుల్లో ఒకరు. 
* 1904లో యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ హిందుస్థానీగా నియమితులయ్యారు. 
* శ్యామ్యూల్‌ లుకాస్‌ జోషితో కలిసి పాన్‌  - ఆర్యన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు.
* ‘ఇస్లాం ఫ్రెటర్నిటీ’ అనే పత్రికను ప్రచురించారు. అయితే, బ్రిటిష్‌ ప్రభుత్వ ఒత్తిడి వల్ల జపాన్‌ ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించింది.
* 1914లో బెర్లిన్‌ వెళ్లి అక్కడ ఇండియన్‌ నేషనల్‌ పార్టీలో చేరారు. 
* జర్మనీలో ‘నయా ఇస్లాం’ అనే పత్రికకు  సంపాదకుడిగా పనిచేశారు.
* ఈయన 1927 సెప్టెంబరు 20న అమెరికాలో మరణించారు.
* ఈయన గౌరవార్థం భోపాల్‌ యూనివర్సిటీ పేరును 1988లో ‘బర్కతుల్లా యూనివర్సిటీ’గా మార్చారు.


రాజమహేంద్ర ప్రతాప్‌సింగ్‌
* ఈయన 1886, డిసెంబరులో ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించారు. మహమ్మదన్‌ ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజ్‌  (Muhammadan Anglo-Oriental college)లో విద్యనభ్యసించారు. ఇదే యూపీలో ప్రస్తుతం ఉన్న అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ. 
* 1906లో కోల్‌కతా కాంగ్రెస్‌ సమావేశానికి హాజరై అనేకమంది నాయకులను కలిసి, స్వదేశీ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. ఈయనపై దాదాభాయ్‌ నౌరోజీ, బాలగంగాధర్‌ తిలక్, మహారాజా ఆఫ్‌ బరోడా, బిపిన్‌ చంద్రపాల్‌ల ప్రభావం ఉండేది.
* 1909, మే 24న బృందావన్‌లో ‘ప్రేమ్‌ మహావిద్యాలయ’ను స్థాపించారు.
* బెర్లిన్‌లోని ‘ఇండియన్‌ సొసైటీ’లో చేరారు.
* 1929లో జపాన్‌లో వరల్డ్‌ ఫెడరేషన్‌ అనే మాస పత్రికను ప్రారంభించారు. ఆల్‌ ఇండియా జాట్‌ మహాసభ, ఇండియన్‌ ఫ్రీడం ఫైటర్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.
* 1932లో మహేంద్ర ప్రతాప్‌ నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. ఈ బహుమతికి నామినేట్‌ అయిన మొదటి విప్లవకారుడు ఈయనే.
* మై లైఫ్‌ స్టోరీ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు.
* 1940లో జపాన్‌లో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు.
* 1946లో భారతదేశానికి తిరిగి వచ్చి 1957-62 మధ్య కాలంలో ఎంపీగా పనిచేశారు. 92 ఏళ్ల వయసులో 1979, ఏప్రిల్‌ 29న మరణించారు.


గదర్‌ పార్టీ - లాలా హర్‌దయాళ్‌
* హర్‌దయాళ్‌ 1884, అక్టోబరు 14న ఢిల్లీలో జన్మించారు. పూర్తి పేరు లాలా హర్‌దయాళ్‌ సింగ్‌ మాథూర్‌. పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. 1905లో ఉపకారవేతనంపై ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేరారు. శ్యామ్‌జీ కృష్ణవర్మతో కలిసి ఐరోపా ఖండంలో బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
* లాలా హర్‌దయాళ్‌ 1913, నవంబరులో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గదర్‌ పార్టీని స్థాపించారు. విదేశాల్లో నివసించే భారతీయులను విప్లవంలో భాగస్వాముల్ని చేయడం దీని లక్ష్యం. దీనికి అధ్యక్షులుగా సోహన్‌ సింగ్‌ భక్నా ఎన్నికయ్యారు.
* గదర్‌ పార్టీ సమావేశాలు లాస్‌ఏంజెల్స్, వియన్నా, వాషింగ్టన్, షాంఘైల్లో జరిగాయి.
* గదర్‌ పార్టీ ఉద్యమాల్లో హర్‌దయాళ్‌కు భాయ్‌ పరమానంద్, సోహన్‌ సింగ్‌ భక్నా, హర్నామ్‌సింగ్‌ సహకరించారు.
* బ్రిటిష్‌ ప్రతినిధి ఫిర్యాదుతో అమెరికన్‌ అధికారులు హర్‌దయాళ్‌ను నిర్భంధించి వలస చట్టం (Immigration Law) ప్రకారం విచారించారు. బెయిల్‌పై విడుదలైన హరదయాళ్‌ అమెరికా నుంచి జెనీవా (స్విట్జర్లాండ్‌) వెళ్లారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ, వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ, తారక్‌నాథ్‌ దాస్, చంపక రామన్‌ పిళ్లె, చంద్ర చక్రవర్తి, బర్కతుల్లా మొదలైన వారితో కలిసి విప్లవ కార్యక్రమాలు కొనసాగించారు.
* మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యాక  గదర్‌ పార్టీకి చెందిన దాదాపు 3 వేల మంది భారతదేశానికి వచ్చారు. వీరు 1915, ఫిబ్రవరి 21ని విప్లవదినంగా ప్రకటించారు. కానీ  సరైన నాయకత్వం లేకపోవడం, వీరి సమాచారం బ్రిటిష్‌ వారికి తెలియడంతో విప్లవకారులు అరెస్టయ్యారు.
* ఆంధ్రా ప్రాంతానికి చెందిన దర్శి చెంచయ్య గదర్‌ పార్టీలో కొన్నిరోజులు పనిచేశారు.
* లాలా హర్‌దయాళ్, మరి కొందరు విప్లవకారులు భారత స్వాతంత్య్ర పోరాట నిర్వహణకు జర్మనీలోని బెర్లిన్‌లో ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ కమిటీ’ని స్థాపించారు. దీనికి ఆ దేశ మద్దతును పొందారు. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓడిపోవడంతో కమిటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
* లాలా హర్‌దయాళ్‌ అవర్‌ ఎడ్యుకేషన్‌ ప్రాబ్లం, థాట్స్‌ ఆన్‌ ఎడ్యుకేషన్, సోషల్‌ కాంక్యుస్ట్‌ ఆఫ్‌ హిందూ రేస్‌ అనే రచనలు చేశారు. ఈయన 1939, మార్చిన 4న అమెరికాలో మరణించారు.

 

వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ (1880-1937)
* ఈయన 1880లో హైదరాబాద్‌లో జన్మించారు. 
* వీరేంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ సరోజినీ నాయుడికి సోదరుడు.
* ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ వీర్‌ సావర్కర్‌తో కలిసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
* ఛటోపాధ్యాయ బహుభాషా కోవిదుడు. తెలుగు, తమిళం, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిష్ణాతులు. అనంతరం ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, డచ్, రష్యన్, స్కాండినేవియన్‌ భాషలు నేర్చుకున్నారు.
* మద్రాస్, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు.
* ఇంగ్లండ్‌లో ‘తల్వార్‌’ అనే విప్లవ పత్రికలో పనిచేశారు.
* మేడం బికాజీ కామాతో కలిసి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
* 1919లో బెర్లిన్‌లో భారత విప్లవకారుల రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* బెర్లిన్‌లో స్థాపించిన ‘ఇండియా స్వాతంత్య్ర కమిటీ’కి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
* 1920లో భారత్‌లో ఎం.ఎన్‌.రాయ్‌ కొనసాగించిన విప్లవాత్మక జాతీయవాద ఉద్యమానికి ఆర్థిక, రాజకీయ మద్దతు అందించారు.
* వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ 1921, డిసెంబరులో రాస్‌ బిహారీ బోస్‌తో కలిసి ‘ఇండియన్‌ న్యూస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌’ బ్యూరోను జపాన్‌లో ఏర్పాటు చేశారు.
* ఎం.ఎన్‌.రాయ్‌ సలహాతో ‘కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ జర్మనీ’లో చేరారు.
* 1937, జులైలో ఈయన్ను అరెస్టు చేసి సెప్టెంబరులో ఉరితీశారు.


జతిన్‌ ముఖర్జీ (1879-1915)
* ఈయన బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  బెంగాల్‌లో తిరుగుబాటు చేశారు. యుగాంతర్‌ పార్టీలో ప్రధాన నాయకుడు.
* 1906లో పులితో పోరాడి విజయం సాధించడం వల్ల ఈయన్ను బాఘ్‌ జతిన్, టైగర్‌ జతిన్‌ అని కూడా పిలుస్తారు.
* గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదాన్ని వ్యాప్తి చేసేందుకు గ్రామ బోర్డులను ఏర్పాటు చేశారు.
* ఈయన బోలానందగిరి అనే సన్యాసి శిష్యుడు.
* బరీంద్రకుమార్‌తో కలిసి దియోఘర్‌లో బాంబు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 
* కొన్ని రోజులు యుగాంతర్‌ రహస్య సమాజం అనే సంఘానికి నాయకత్వం వహించారు.
* జిడ్డు గోపాల ముఖర్జీ ఈయన కార్యకలాపాలకు సహకరించేవారు.
* 1915, సెప్టెంబరు 10న బ్రిటిష్‌ పోలీసుల చేతిలో గాయపడిన జతిన్‌ ఒడిశాలోని బాలాసోర్‌లో మరణించారు.

 

చంపక్‌ రామన్‌ పిళ్లై (1891-1934)
* 1891, సెప్టెంబరు 15న కేరళలోని తిరువనంతపురంలో తమిళ దంపతులకు జన్మించారు.
* భారత్‌ నుంచి వెళ్లి జర్మనీలో స్థిరపడ్డారు. 
* మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీలో భారతీయ స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఐరోపాలోని భారతీయ సైనికులను చేర్చుకునేందుకు ప్రయత్నించారు.
* లాలా హర్‌దయాళ్, తారక్‌నాథ్‌ దాస్, బర్కతుల్లాతో కలిసి బెర్లిన్‌లో భారత జాతీయ పార్టీని స్థాపించారు. 
* 1915లో ఆప్ఘనిస్థాన్‌లో రాజమహేంద్ర ప్రతాప్‌ స్థాపించిన తాత్కాలిక భారత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
* రామన్‌ పిళ్లై వలస ప్రజల కోసం పీడిత జాతుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 


దర్శి చెంచయ్య (1890-1964)
* 1890, డిసెంబరు 28న ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జన్మించారు. 
* చిన్నతనంలో ఈయనపై వీరేశలింగం ప్రభావం ఎక్కువగా ఉండేది. 
* ఒంగోలులో మెట్రిక్యులేషన్, చెన్నైలో బీఏ పూర్తి చేశారు. వ్యవసాయ శాస్త్రంపై మక్కువతో 1912లో అమెరికా వెశ్లారు. అక్కడ చదువుకుంటూనే గదర్‌ పార్టీలో వ్యవస్థాపక సభ్యులుగా చేరారు.
* బర్మా సరిహద్దులో ఉన్న తిరుగుబాటు దళాలకు సంధానకర్తగా వ్యవహరించారు.
* ఈయన్ను కాన్పూర్‌ కుట్రకేసులో ఇరికించాలని బ్రిటిష్‌వారు విఫలయత్నం చేశారు. 
* స్త్రీ విద్యావ్యాప్తి, వేశ్యా వృత్తి నిర్మూలనకు కృషి చేశారు. 
* ఈయన 1964, డిసెంబరు 30న మరణించారు.


అరబిందో ఘోష్‌
* విప్లవవాద జాతీయోద్యమ నాయకుల్లో అరబిందో ఘోష్‌ ప్రముఖుడు. ఈయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదివి ఐసీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐసీఎస్‌ పదవిని నిరాకరించి, 1892లో భారతదేశానికి వచ్చారు.
* బొంబాయికి చెందిన ఇందు ప్రకాశ్‌ పత్రికలో ‘న్యూ ల్యాంప్స్‌ ఫర్‌ ఓల్ట్‌’ శీర్షికతో 1893, ఆగస్టు నుంచి 1894, మార్చి వరకు వ్యాసాలు రాశారు.
* వందేమాతరం పత్రిక నిర్వహణలో బిపిన్‌ చంద్రపాల్‌కు సహకరించారు. బెంగాల్‌లో యుగాంతర్‌ అనే దినపత్రికలో వ్యాసాలు రాశారు.
* బెంగాల్‌లో జాతీయ కళాశాలను స్థాపించారు.


మరికొందరు వ్యక్తులు..
* ఇంగ్లండ్‌లో మదన్‌లాల్‌ దింగ్రా అనే విప్లవకారుడు ‘కర్జన్‌ విళ్లై’ అనే బ్రిటిష్‌ అధికారిని హత్యచేశాడు. 1992లో భారత ప్రభుత్వం దింగ్రా పేరుమీద స్టాంప్‌ను విడుదల చేసింది.
* సావర్కర్‌ సోదరులు 1904లో అభినవ భారత్‌ మండలి  (Young India Society)ని స్థాపించారు. 
* వి.డి. సావర్కర్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే 1899లో మిత్రమేళా అనే సంస్థను స్థాపించారు.

 

కోమగటమారు సంఘటన
* పంజాబ్‌లోని చాలా మంది సిక్కులు బ్రిటిష్‌ కొలంబియా (కెనడా పశ్చిమ తీరం)లో స్థిరపడ్డారు. కెనడా చట్టాల ప్రకారం భారతదేశం నుంచి నేరుగా వచ్చేవారికి ప్రవేశ అనుమతి లభించేది. 
* 1914, ఏప్రిల్‌ 14న హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న 165 మంది భారతీయులు దూరప్రాచ్యంలో వాణిజ్యవేత్త అయిన గురుదత్‌ సింగ్‌ నాయకత్వంలో కెనడాలోని వాంకోవర్‌ నగరానికి కోమగటమారు అనే జపాన్‌ నౌకలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మరికొన్ని రేవు పట్టణాల్లో నివసించే భారతీయులు కూడా వారితో కలిశారు.  ఆ నౌక 376 మంది (351 మంది సిక్కులు) ప్రయాణికులతో మే 23న వాంకోవర్‌ రేవును చేరింది. కానీ అందులోని ప్రయాణికులను కెనడా ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆ నౌక తిరిగి భారతదేశానికి (కలకత్తా) రావాలని బ్రిటిష్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ నౌక కలకత్తాలోని బడ్జ్‌ - బడ్జ్‌ రేవుకు వచ్చింది.
* కోమగటమారు నౌకలోని ప్రయాణికులను గదర్‌ పార్టీకి చెందిన విప్లవకారులుగా   భావించిన బ్రిటిష్‌వారు వారిని అరెస్ట్‌ చేయాలనుకున్నారు. దీంతో బ్రిటిష్‌ పోలీసులకు, నౌకలోని ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్‌ కాల్పుల్లో 18 మంది మరణించగా, 202 మందిని అరెస్టు చేశారు. గురుదత్‌ సింగ్‌ గాయాలతో అక్కడి నుంచి  తప్పించుకొని పారిపోయారు.
* గదర్‌ పార్టీ పిలుపు మేరకు మనీలా, షాంఘై, హాంగ్‌కాంగ్‌ల నుంచి సిక్కులతో కూడిన తోసమరు అనే మరో ఓడ 1914, అక్టోబరు 29న కలకత్తాకు చేరింది. వీరిలో కొంతమందిని బంధించి జైలుకు పంపగా, మరికొందరు రహస్య విప్లవ కార్యకలాపాలు కొనసాగించారు.
* మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యాక ఆయుధాలు, సైనికుల మద్దతు కోసం మహ్మద్‌ బర్కతుల్లా, భగవాన్‌సింగ్, రామ్‌చంద్ర మొదలైనవారు బహిరంగ సమావేశాలు నిర్వహించి, భారత్‌లో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. కర్తార్‌ సింగ్‌ శరభ, రఘువర్‌ దయాల్‌ గుప్తా లాంటి వారు భారతదేశానికి వచ్చారు.
* సుమారు 8000 మంది గదర్‌ పార్టీ కార్యకర్తలు భారతదేశానికి వచ్చి విప్లవంలో  పాల్గొన్నారు. బ్రిటిష్‌ వారు వీరిని అణిచివేశారు.

Posted Date : 06-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కర్ణాటక యుద్ధాలు

భారతదేశానికి వర్తకం పేరుతో వచ్చిన డచ్, పోర్చుగీస్ తదితర దేశాలవారు అనేక కారణాలతో నిష్క్రమించినా మిగిలిన రెండు ప్రధాన ఐరోపా వర్తక కంపెనీల (బ్రిటిష్, ఫ్రెంచ్) మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. 1740 తర్వాత మన దేశంలో ఆధిపత్యం కోసం ఫ్రెంచ్, బ్రిటిషర్లు ఎన్నో యుద్ధాలకు కారకులయ్యారు. వీటిలో కర్ణాటక, ప్లాసీ, బక్సార్, మైసూర్ యుద్ధాలు ప్రధానమైనవి. వీటిపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.  భారతదేశపు ఆగ్నేయ తీరంలోని ఆర్కాట్ రాజధానిగా సాదతుల్లా ఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగల్ సుబాగా.. హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచివారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిషర్లు ఫ్రెంచివారిపై ఆధిపత్యం సాధించారు.

మొదటి కర్ణాటక యుద్ధం (1745-1748)

ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో బ్రిటిషర్లకు, ఫ్రెంచివారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచి పడవలను స్వాధీనం చేసుకుంది. దానికి ప్రతీకారంగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం మద్రాసును ఆక్రమించింది. తమను ఫ్రెంచివారి నుంచి రక్షించాల్సిందిగా బ్రిటిషర్లు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. ఈ మేరకు నవాబు చేసిన ఆజ్ఞలను ఫ్రెంచివారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచివారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగియడంతో భారతదేశంలో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.

రెండో కర్ణాటక యుద్ధం (1749-1754)
వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచివారు హైదరాబాద్‌లో ముజఫర్‌జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. బ్రిటిషర్లు హైదరాబాద్‌లో నాజర్‌జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్‌కు, తర్వాత అతడి కుమారుడు మహమ్మద్ అలీకి మద్దతిచ్చారు. 1749లో ఫ్రెంచివారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్ఠించేలా చేశారు. అయితే బ్రిటిషర్లు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహమ్మద్ అలీ వశమైంది.

మూడో కర్ణాటక యుద్ధం (1758-1763)
ఐరోపాలో ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ల మధ్య 1756లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచి గవర్నరు కౌంట్ డి లాలీ బ్రిటిష్ జనరల్ సర్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచివారి స్థానంలో బ్రిటిషర్లు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763లో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య సంధి కుదిరింది.

బెంగాల్ ఆక్రమణ

మొగల్ సామ్రాజ్య పతనం తర్వాత ముర్షిద్ కులీఖాన్ బెంగాల్‌లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ముర్షిద్ కులీఖాన్ తర్వాత అతడి అల్లుడు షుజాఉద్దీన్ సింహాసనాన్ని ఆక్రమించాడు. అతడి కుమారుడు సర్ఫరాజ్ పరిపాలనాకాలంలో బీహార్ డిప్యూటీ గవర్నరు అలీవర్దీఖాన్ 1740లో బెంగాల్ నవాబుగా ప్రకటించుకున్నాడు. ఇతడి కాలంలో బెంగాల్‌పై మరాఠాలు అనేక సార్లు దండయాత్రలు చేశారు. 1751లో బెంగాల్ నవాబుకు, మరాఠాలకు మధ్య సంధి కుదిరింది. ఈ సంధి ప్రకారం బెంగాల్ నవాబు మరాఠాలకు సంవత్సరానికి రూ.12 లక్షల చౌత్ చెల్లించడానికి అంగీకరించాడు. అలీవర్దీఖాన్ 1752లో తన మనవడు సిరాజ్-ఉద్-దౌలాను తన వారసుడిగా ప్రకటించాడు. సిరాజ్ సమీప బంధువు షౌకత్ జంగ్, పిన్ని గసితి బేగం, అలీవర్ద్దీఖాన్ సోదరి భర్త, సర్వసైన్యాధ్యక్షుడైన మీర్జాఫర్‌లు బెంగాల్ సింహాసనానికి ప్రధాన పోటీదారులు. వీరిని బలహీనపరచడానికి సిరాజ్ అనేక చర్యలు చేపట్టాడు. గసితి బేగం సంపదను లాక్కున్నాడు. మీర్జాఫర్ స్థానంలో మీర్‌మదన్‌ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. షౌకత్ జంగ్ తిరుగుబాటును అణచివేయడమే కాకుండా అతడిని చంపేశాడు.

సిరాజ్-ఉద్-దౌలా బ్రిటిషర్లతో వైరం పెంచుకోవడానికి కారణాలు
* చట్టానికి విరుద్ధంగా బ్రిటిషర్లు నవాబు ఆధీనంలోని భూభాగంలో కోటలు నిర్మించడంతోపాటు పెద్ద కందకాన్ని తవ్వడం.
* ఆంగ్లేయులు దస్తక్ / ఉచిత పాసులను అనర్హులకు కేటాయించి దుర్వినియోగం చేయడం ద్వారా నవాబు ఆదాయానికి గండికొట్టడం.
నవాబుకు అవిధేయులు, లంచగొండులైన అధికారులకు ఆంగ్లేయులు రక్షణ కల్పించడం.
* తన పూర్వికుల్లా తాను కూడా బ్రిటిషర్లపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.


ప్లాసీ యుద్ధం
ప్లాసీ అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. అక్కడ 1757 జూన్ 23న బ్రిటిషర్లకు, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్ మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు మీర్జాఫర్, యార్‌లతుఫ్ ఖాన్, రాయ్‌దుర్లబ్‌రామ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని ప్రేక్షకపాత్ర వహించారు. ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి దేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది. సిరాజ్-ఉద్-దౌలా స్థానంలో మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఆ తర్వాత మీర్‌ఖాసిం బెంగాల్ నవాబు అయ్యాడు.

బక్సార్ యుద్ధం (1764)
బక్సార్ యుద్ధం 1764 అక్టోబరు 22న మేజర్ హెక్టర్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు - మీర్‌ఖాసిం, అవధ్ నవాబు షుజా-ఉద్-దౌలా, మొగలు చక్రవర్తి రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య జరిగింది. బక్సార్ అనే ఈ ప్రదేశం పాట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ.ల దూరంలో ఉంది.

కారణాలు
* సార్వభౌమాధికారం కోసం బ్రిటిషర్లు - బెంగాల్ నవాబు మీర్‌ఖాసిం మధ్య పోరు.
* 1717లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను బ్రిటిషర్లు దుర్వినియోగం చేయడం.
* నవాబు బెంగాల్‌లో అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.
నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం.
   ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిషర్ల విజయానికి ప్రధాన కారణం.


అలహాబాద్ ఒప్పందం
బక్సార్ యుద్ధం తర్వాత 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన మొదలైంది. అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారాడు. మొగలు చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ అయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఔన్నత్యం పెరిగింది.

మైసూరు రాజ్యం
తూర్పు, పశ్చిమ కనుమలకు మధ్య నెలకొన్న మైసూరు రాజ్యాన్ని ఒడయార్ వంశం పరిపాలించేది. క్రీ.శ. 1731-1734 మధ్య సర్వసైన్యాధ్యక్షుడైన దేవరాజ, సర్వాధికారి (ఆర్థికమంత్రి) ననరాజ అనే సోదరులు మైసూరు రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. మరాఠాలు, నిజాం, బ్రిటిషర్లు, ఫ్రెంచివారు మైసూరు రాజ్యంపై వరుస దాడులు ప్రారంభించారు. రెండో కర్ణాటక యుద్ధం సమయంలో ననరాజ తిరుచిరాపల్లిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆంగ్లేయుల పక్షం వహించాడు. తర్వాత అతడు ఫ్రెంచివారి పక్షాన చేరాడు. మైసూరు రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడైన హైదర్ అలీ తిరుచిరాపల్లి దండయాత్ర సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. క్రీ.శ. 1758 తర్వాత మరాఠాలు మైసూరుపై దండెత్తినప్పుడు హైదర్ అలీ ననరాజ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుని మైసూరు పాలకుడయ్యాడు. అయితే ఇది నచ్చని కొంతమంది హైదర్ అలీపై దండెత్తవలసిందిగా మరాఠాలను ఆహ్వానించారు. ఇందులో హైదర్ అలీ ఓడిపోయాడు. మరాఠాలు మూడో పానిపట్టు యుద్ధంలో తలమునకలై ఉన్న సమయంలో హైదర్ అలీ తన అధికారాన్ని మళ్లీ సుస్థిరం చేసుకున్నాడు.

'కలకత్తా చీకటి గది' ఉదంతం
సిరాజ్-ఉద్-దౌలా 1756 జూన్‌లో ఆంగ్లేయుల ఆధీనంలోని కలకత్తాను ఆక్రమించాడు. బెంగాల్ గవర్నరు రోజర్ డ్రేక్, ఇతర అధికారులు కలకత్తా నగరం వదిలి పారిపోయారు. హాల్‌వెల్‌తో సహా అనేక మంది ఐరోపావారు నవాబుకు లొంగిపోయారు. వీరిని ఒక చిన్న గదిలో రాత్రంతా బంధించడంతో తెల్లవారేసరికి 16 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఈ సంఘటనను 'కలకత్తా చీకటి గది' ఉదంతంగా పేర్కొన్నారు. అయితే దీనికి సిరాజ్-ఉద్-దౌలా స్వయంగా బాధ్యుడు కాడు. రాబర్ట్ క్లైవ్ 1757 జనవరి 2న అడ్మిరల్ వాట్సన్ సహాయంతో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిషర్లకు, నవాబుకు మధ్య అదే ఏడాది ఫిబ్రవరి 9న అలీనగర్ సంధి కుదిరింది. క్లైవ్ మార్చిలో ఫ్రెంచివారికి చెందిన చంద్రనగర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. సిరాజ్-ఉద్-దౌలా ఆస్థానంలోని మీర్జాఫర్, రాయ్‌దుర్లబ్‌రామ్, అమీన్‌చంద్, జగత్‌సేఠ్‌లకు నవాబు వ్యవహార శైలి నచ్చలేదు. వారు అతడిని నవాబు పదవి నుంచి తొలగించాలని కుట్రపన్నారు. అమీన్‌చంద్ ఈ విషయాన్ని బ్రిటిషర్లకు తెలియజేయడంతో వారు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

మైసూరు యుద్ధాలు
మొదటి మైసూరు యుద్ధం (1766-1769)
మైసూరు పాలకుడు హైదర్ అలీ బ్రిటిషర్లను కర్ణాటక ప్రాంతంతోపాటు భారతదేశం నుంచి కూడా తరిమివేయాలని భావించాడు. హైదర్ అలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిషర్లు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో బ్రిటిషర్లపై విజయం సాధించిన హైదర్ అలీ మద్రాసుకు 5 కి.మీ.ల మేర దండయాత్ర కొనసాగించాడు. 1769లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.

రెండో మైసూరు యుద్ధం (1780-1784)
మరాఠాలు 1771లో హైదర్ అలీపై దాడి చేసినప్పుడు బ్రిటిషర్లు హైదర్ అలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదర్ అలీ మిత్రదేశమైన ఫ్రాన్సుకు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ అలీ ఆధీనంలోని ఫ్రెంచి భూభాగమైన మహేను బ్రిటిషర్లు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు. 1780లో జరిగిన యుద్ధంలో కల్నల్ బైలీని హైదర్ అలీ ఓడించాడు. 1781లో పోర్టోనోవో యుద్ధంలో ఐర్ కూట్ చేతిలో పరాజయం పొందాడు. 1782లో కల్నల్ బ్రైట్ వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం జరుగుతుండగానే హైదర్ అలీ మరణించాడు. దీంతో అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. ఈ యుద్ధం 1784లో జరిగిన 'మంగళూరు సంధి'తో ముగిసింది.

మూడో మైసూరు యుద్ధం (1790-1792)
అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం.. టర్కీ, ఫ్రాన్సులకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం.. బ్రిటిషర్ల మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను ఆక్రమించడం.. ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నరు జనరల్ కారన్ వాలిస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు. 1792లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాన్ని బ్రిటిషర్లకు ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ. 3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి రూ. 1.6 కోట్లు వెంటనే చెల్లించాడు.

నాలుగో మైసూరు యుద్ధం (1799)
టిప్పు సుల్తాన్ తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, బ్రిటిష్ గవర్నరు జనరల్ వెల్లస్లీ బ్రిటిష్ సామ్రాజ్యానికి టిప్పు సుల్తాన్ నుంచి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలనుకోవడం ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు. శ్రీరంగ పట్టణంలో జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడుతూ 1799 మేలో టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నరు జనరల్ సోదరుడు సర్ ఆర్ధర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.
   హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ గొప్ప పరిపాలకులు. ఇద్దరూ పరమత సహనాన్ని పాటించారు. హైదర్ అలీ ఎప్పుడూ బహిరంగంగా రాజరిక బిరుదులు ధరించలేదు. ఇతడికి, రాజవంశానికి మధ్య సంబంధం మరాఠా చక్రవర్తికి, పీష్వాకు మధ్య సంబంధంలా ఉండేది. అయితే టిప్పు సుల్తాన్ మైసూరు రాజును పదవీచ్యుతుడిని చేసి 1789లో సుల్తాన్ బిరుదు ధరించాడు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌లు తమ నాణేల మీద హిందూ దేవతల బొమ్మలు ముద్రించారు. టిప్పు సుల్తాన్‌కు శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్యులపై ఎనలేని గౌరవం ఉండేది. శంకరాచార్యులకు దేవాలయ మరమ్మతుల కోసం భారీగా నిధులు ఇచ్చాడు. పరిపాలనలో పాశ్చాత్య పద్ధతులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాజుగా టిప్పుసుల్తాన్ పేరుగాంచాడు. ఇతడు స్వదేశీ, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. న్యాయ పరిపాలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాడు. అధికారుల ఎంపికలో కుల, మత, సాంఘిక తారతమ్యాలు చూపకుండా ప్రతిభకు పట్టం కట్టాడు. సమకాలీన భారతదేశ చరిత్రలో వీరి పరిపాలన అందరిమన్ననలు పొందింది.

 

మాదిరి ప్రశ్నలు
 

1. కిందివారిలో స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
   ఎ) సఫ్దర్ అలీ    బి) దోస్త్ అలీ    సి) సాదతుల్లా ఖాన్    డి) అన్వరుద్దీన్
జ: సి(సాదతుల్లా ఖాన్)

 

2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్

 

3. హైదర్ అలీ ఏ మైసూరు యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో

 

4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజ్-ఉద్-దౌలాను బంధించి చంపిన వ్యక్తి ఎవరు?
జ: మీరాన్

 

5. బక్సార్ యుద్ధ వీరుడు ఎవరు?
జ: హెక్టర్ మన్రో

 

6. చీకటి గది ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు?
జ: హాల్‌వెల్

 

7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్

 

8. టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించాడు?
జ: 1799

 

9. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు

 

10. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్‌కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరు?
జ: అమీన్‌చంద్

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ 18వ శతాబ్దపు స్థితిగతులు

భారతదేశ చరిత్రలో 18వ శతాబ్దానికి ప్రాధాన్యం ఉంది. అప్పట్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు ఎలా ఉండేవనేది తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ అంశంపై అడిగే ప్రశ్నలకు సులువుగా జవాబులు గుర్తించవచ్చు. ఆనాటి ఆచార వ్యవహారాలు - కట్టుబాట్లు, విద్యా వ్యవస్థ, గ్రామీణ - పట్టణ ప్రాంతాల పరిస్థితులు, ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులు.. ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం.. తదితర ఆసక్తికరమైన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం.  భారతదేశంలో క్రీ.శ. 18వ శతాబ్దంలో రాజకీయ అస్థిరత నెలకొన్నప్పటికీ కొన్ని మార్పులతో సమాజంలోని సంప్రదాయ లక్షణాలు కొనసాగుతూనే ఉండేవి.

సాంఘిక అసమానతలు
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన చక్రవర్తి, అధికార వర్గం విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. వీరు మద్యం, స్త్రీ, సంగీతానికి బానిసలుగా తయారయ్యారు. దిగువ స్థాయిలో గ్రామీణ పేద వ్యవసాయదారులు, చేతివృత్తులవారు ఉండేవారు. ఈ రెండు వర్గాలకు మధ్యలో చిన్న వ్యాపారులు, దిగువ తరగతి ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లోని చేతి వృత్తులవారు ఉండేవారు. సమకాలీన ఆధారాలు లేకపోవడం, వివిధ ప్రాంతాల్లో ఆదాయం, ధరల్లో వ్యత్యాసం ఉండటంతో ప్రజల జీవన ప్రమాణాన్ని పోల్చడం సాధ్యపడటంలేదు. ఆ కాలంనాటి హిందూ సమాజంలోని కుల వ్యవస్థ ప్రత్యేకతను సంతరించుకుంది. వివాహం, దుస్తులు, ఆహారం, వృత్తుల ఎంపికలో కుల నియమాలు తప్పక పాటించేవారు. అయితే ఆర్థిక ఒత్తిడులు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన పరిపాలనాపరమైన ఆవిష్కరణల ఫలితంగా కొందరు తమ పూర్వీకుల వృత్తులను విడిచి కొత్త వృత్తులను చేపట్టారు.

స్త్రీల జీవనం
స్త్రీలకు ఇళ్లలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినా సమానత్వాన్ని మాత్రం ఇవ్వలేకపోయారు. మలబార్, కొన్ని వెనుకబడిన ప్రాంతాలు మినహా మిగతా దేశంలో పితృస్వామిక సమాజం అమల్లో ఉండేది. తండ్రి లేదా పెద్ద కుమారుడ్ని కుటుంబ పెద్దగా వ్యవహరించేవారు. రాజకీయాలు, పరిపాలన విషయాల్లో కొందరు హిందూ, ముస్లిం స్త్రీలు ప్రముఖ పాత్ర వహించినప్పటికీ సాధారణ స్త్రీలకు సమాజంలో సముచిత స్థానం లభించలేదు. స్త్రీలు పరదా విధానాన్ని అవలంబించేవారు. పేద స్త్రీలు మాత్రం ఈ విధానాన్ని పాటించలేదు.
* బాల్యవివాహాలు సర్వసాధారణం. రాజకుమారులు, పెద్ద జమిందార్లు, ధనవంతుల్లో బహు భార్యత్వం ఉండేది. ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌కు చెందిన ధనిక వర్గాల్లో ఈ ఆచారం ఎక్కువ. ధనిక వర్గాల్లో వరకట్నం తీసుకోవడం సంప్రదాయం. వితంతు పునర్వివాహాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగేవి. పీష్వాలు వితంతు పునర్వివాహాలపై 'పట్టం అనే పన్ను విధించేవారు. పీష్వాలు తమ భూభాగంలో సతీసహగమనాన్ని రూపుమాపడంలో కొంత విజయం సాధించారు.

రెండు విధాల బానిసత్వం
బానిసలను ఇంటి పని, పొలం పని చేసేవారు.. ఇలా రెండు తరగతులుగా విభజించారు. యజమాని భూమిని అమ్మినప్పుడు ఆ పొలాల్లో పనిచేసే బానిసలు కొత్త యజమాని కింద పనిచేయాల్సి వచ్చేది. భారతదేశంలో బానిసత్వం ఎక్కువగా అమల్లో ఉన్నట్లు ఐరోపాకు చెందిన యాత్రికులు, పరిపాలకులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరవు, ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను కొంత ధరకు అమ్మేవారు. రాజపుత్రులు, ఖాత్రీలు, కయస్థ కులానికి చెందినవారు తమ ఇళ్లలో బానిస స్త్రీలను వినియోగించుకునేవారు. అమెరికా, ఐరోపా దేశాల్లోని బానిసలతో పోలిస్తే భారతదేశంలో బానిసల పరిస్థితి మెరుగ్గా ఉండేది. బానిసలను కుటుంబానికి చెందిన వారసత్వ సేవకులుగా పరిగణించేవారు. వారికి వివాహం చేసుకునే హక్కు ఉండేది. బానిసల పిల్లలను స్వేచ్ఛా పౌరులుగా గుర్తించేవారు. ఐరోపావారి రాకతో బానిసత్వం, బానిసల వ్యాపారం కొత్త పుంతలు తొక్కింది. ఐరోపాకు చెందిన వర్తక కంపెనీలు 10 సంవత్సరాల బాలికను 5 నుంచి 15 రూపాయలకు, 16 ఏళ్ల బాలుడిని 16 రూపాయలకు, వయోజనుడైన బానిసను 15 నుంచి 20 రూపాయిలకు.. బెంగాల్, అసోం, బిహార్ మార్కెట్లలో కొని, వారిని ఐరోపా, అమెరికా మార్కెట్లలో అమ్మేవారు. ఐరోపావారు సూరత్, మద్రాసు, కోల్‌కతాల్లో అబిసీనియన్ బానిసలను కొని, ఇంటిపనికి వినియోగించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1789 లో బానిస రవాణాను నిషేధించారు. అయితే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బానిసత్వం కొనసాగుతోంది.

విద్యకు ప్రాధాన్యం
హిందూ, ముస్లింలు విద్య నేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. వీరు విద్యను మతంతో అనుసంధానం చేశారు. నాడియ, బెనారస్(కాశి), తీర్హుట్(మిథిల), ఉత్కల(ఒడిశా)లు సంస్కృత విద్యకు పేరుపొందిన కేంద్రాలు. ఎంతోమంది సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి కాశీకి వచ్చేవారు. అరబిక్, పర్షియన్ భాషల్లో ఉన్నత విద్యా కేంద్రాలను మద్రసాలని పిలిచేవారు. పర్షియన్ రాజభాష కావడంతో హిందూ, ముస్లింలు దీన్ని నేర్చుకునేవారు. ఖురాన్ అధ్యయనం చేయాలనుకునేవారు అరబిక్ భాషలో ప్రావీణ్యం సాధించేవారు. ప్రాథమిక విద్య ఎక్కువగా విస్తరించింది. హిందువుల ప్రాథమిక విద్యా కేంద్రాలను పాఠశాలలని, ముస్లిం ప్రాథమిక పాఠశాలలను మక్తబ్‌లనీ పిలిచేవారు. పాఠశాలలు, దేవాలయాలు, మసీదులకు అనుబంధంగా ఉండేవి. పాఠశాలలో విద్యార్థులు చదవడం, రాయడం, అంకగణితాలను నేర్చుకునేవారు. సత్యం, నిజాయతీ, తల్లిదండ్రులపై విధేయత, మతం పట్ల విశ్వాసం మొదలైనవి పాఠశాలల్లో నేర్పించే ముఖ్యమైన విషయాలు. ఉన్నత కులాలకు చెందినవారు ఎక్కువగా చదువుకున్నప్పటికీ, తక్కువ కులాలకు చెందినవారి పిల్లలు కూడా పాఠశాలలకు హాజరయ్యేవారు. అయితే బాలికల విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

కళలు - సాహిత్యం
కళలు, సాహిత్యానికి దిల్లీలో ఆదరణ లేకపోవడంతో కవులు, కళాకారులు కొత్తగా స్థాపించిన రాజ్యాల రాజధానులైన హైదరాబాద్, లఖ్‌నవూ(లక్నో), ముర్షీదాబాద్, జైపూర్ తదితర ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. క్రీ.శ. 1784లో లఖ్‌నవూలో అసఫ్ ఉద్దౌలా మొహరం పండుగ జరుపుకోవడానికి వీలుగా గొప్ప ఇమంబరను నిర్మించాడు. ఈ భవన నిర్మాణంలో స్తంభాలు లేకపోవడం విశేషం. మహారాజ రంజిత్ సింగ్ అమృత్‌సర్‌లోని సిక్కుల దేవాలయాన్ని పునరుద్ధరించాడు. 1725లో ఈ దేవాలయంలోని కింది సగభాగాన్ని పాలరాతితో, పై భాగాన్ని రాగితో నిర్మించి, పలుచటి బంగారంతో తాపడం చేయించాడు. అందుకే దీన్ని స్వర్ణదేవాలయంగా పిలుస్తున్నారు. భరత్‌పూర్ రాజధాని దిగ్‌లో సూరజ్‌మల్ ప్రాసాదం, ఆగ్రాలోని రాజ ప్రాసాదాలకంటే మిన్నగా స్వర్ణదేవాలయ పునర్‌నిర్మాణాన్ని ప్రారంభించినా.. దాన్ని పూర్తి చేయలేదు. ప్రాంతీయ భాషలైన ఉర్దూ, హిందీ, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, తెలుగు, తమిళం అభివృద్ధి చెందాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు ముద్రణ యంత్రాలను స్థాపించాయి. బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లో ముద్రించాయి. బెంగాల్‌లో విలియం కేరి, వార్డ్, మార్ష్‌మాన్ లాంటి క్రైస్తవ మిషనరీలు సెరాంపూర్‌లో ముద్రణ యంత్రాన్ని స్థాపించి బెంగాలీ భాషలో బైబిల్‌ను ప్రచురించాయి.

ఆర్థిక వ్యవస్థ
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థలో గ్రామాలు సొంత పరిపాలనా వ్యవస్థను కలిగి ఉండి, స్వయం సమృద్ధితో ఉండేవి. గ్రామానికి కావాల్సిన అన్ని వస్తువులను స్వయంగా ఉత్పత్తి చేసుకునేవి. ఇవి రాజ్యానికి భూమిశిస్తును చెల్లించేవి. పాలకులు, రాజవంశాలు మారినా గ్రామీణ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ పరిస్థితులు ఐరోపా పరిశీలకుల దృష్టిని ఆసియా గ్రామీణ వ్యవస్థ వైపు ఆకర్షించాయి. భారతదేశంలో పట్టణ చేతివృత్తులు బాగా అభివృద్ధి చెంది, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లను ఆకర్షించాయి. అప్పట్లో భారతదేశంలోని ఢాకా, అహ్మదాబాద్, మచిలీపట్నం ప్రాంతాలు నూలు ఉత్పత్తులకు; ముర్షిదాబాద్, ఆగ్రా, లాహోర్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలు పట్టు వస్త్రాలకు; లాహోర్, ఆగ్రా, కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్నితో చేసిన కార్పెట్లు, శాలువాలు, బంగారు, వెండితో చేసిన ఆభరణాలు, లోహపాత్రలు, ఆయుధాలకు విదేశాల్లో ఎక్కువ గిరాకీ ఉండేది. అంతర్గత, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందడంతో వర్తక పెట్టుబడిదారీ వ్యవస్థ అమల్లోకి రావడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఉత్తర భారతదేశంలో జగత్‌షేర్‌లు, నగర్‌షేర్‌లు దక్షిణ భారతదేశంలో చెట్టియార్లు ఆవిర్భవించడంతో వర్తక, వాణిజ్యాలు మరింత అభివృద్ధి చెందాయి. క్రీ.శ. 17, 18 శతాబ్దాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు పెట్టుబడిదారీ వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను కల్పించాయి. రైతుల నుంచి దోచుకున్న సంపదను భూస్వాములు తమ ఆడంబరాల కోసం వృథా చేసేవారు. ప్రభు వర్గానికి చెందినవారు మరణిస్తే వారి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించే చట్టాలు.. ప్రజల్లో సరైన మార్గంలో పొదుపు చేసే అలవాటు లేకపోవడం.. పొదుపు చేసిన సొమ్మును ఉత్పాదన కోసం వినియోగించక పోవడం.. రాజకీయ స్థిరత్వం లేకపోవడం.. అభివృద్ధి కాంక్ష, ముందు చూపులేని రాజ్యం.. ఇవన్నీ అభివృద్ధికి నిరోధకాలుగా ఉన్నాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలో ఐరోపా వర్తక సంఘాలు భారతదేశంలో రాజకీయం, ఆర్థిక ఆసక్తితో బలంగా ఉండటం కూడా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు మళ్లడానికి కారణమైంది.

ముఖ్యాంశాలు
సతీసహగమన దురాచారాన్ని ఎక్కువగా బెంగాల్, మధ్య భారతదేశం, రాజస్థాన్‌లలో కొన్ని ఉన్నత కులాలకు చెందినవారు మాత్రమే పాటించేవారు.
బెంగాల్, బిహార్‌లలో సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేసే ఉన్నత విద్యా కేంద్రాలను 'చటుస్పతి అని పిలిచేవారు.
* బెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు కాశీని 'భారతదేశ ఏథెన్స్‌గా వర్ణించాడు.
* అజిమాబాద్(పాట్నా) తూర్పు భారతదేశంలో గొప్ప పర్షియన్ విద్యా కేంద్రంగా ఉండేది.
పింక్ సిటీగా పేరుపొందిన జైపూర్‌ను సవాయి జైసింగ్ నిర్మించాడు. దీంతో సహా అయిదు నగరాల్లో ఖగోళ పరిశీలన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాడు.
డెన్మార్క్‌కు చెందిన జీజెన్‌బెల్గ్ తమిళ వ్యాకరణాన్ని రచించడంతోపాటు బైబిల్‌ను తమిళంలోకి అనువదించాడు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజపుత్రులు

హర్షవర్ధనుడి మరణానంతరం క్రీ.శ. 7వ శతాబ్ది ద్వితీయార్ధం నుంచి 12వ శతాబ్దం ముగిసే వరకు సుమారు 550 ఏళ్లు రాజపుత్రులు ఉత్తర భారతదేశాన్ని పాలించారు. వీరు ధైర్యసాహసాలకు పేరుగాంచిన యుద్ధ ప్రియులు. ఉత్తర భారతదేశంలో అనేక చిన్న రాజ్యాలు స్థాపించి, దేశ చరిత్రలో అతి క్లిష్టమైన సమయంలో పరిపాలన సాగించారు. దేశంపై దండెత్తి వచ్చిన తురుష్కులతో పోరాడి, ఓడిపోయారు. పరస్పర పోరాటాల్లో నిమగ్నులైనప్పటికీ గుప్త-హర్షయుగ సాంస్కృతిక సంప్రదాయాలకు మెరుగులు దిద్దారు. వీరి చరిత్రకు అనేక ఆధారాలు ఉన్నాయి. వీటిలో చాంద్‌ బర్దాయ్‌ రచించిన పృథ్వీరాజ్‌ రాసో, కల్నల్‌ టాడ్‌ రచించిన రాజస్థాన్‌ కథావళి (The Annals of Rajasthan), కల్హణుడు రచించిన రాజతరంగిణి ముఖ్యమైనవి.

ప్రతీహారులు

రాజపుత్రుల్లో ప్రథములు ప్రతీహారులు. వీరిది ఝూర్జర జాతి. మధ్య ఆసియాకు చెందిన వారు. వీరు 5వ శతాబ్దంలో భారతదేశంపై దండెత్తి, మొదట ఆరావళి పర్వతాలకు పశ్చిమ భాగాన ఉన్న రాజస్థాన్‌లో స్థిరపడ్డారు. ఈ ప్రాంతానికి ఝార్జర రాష్ట్రం అనే పేరుంది. వీరి మొదటి రాజధాని జోధ్‌పూర్‌లోని భీమ్‌మల్‌. తర్వాత కనోజ్‌ను రాజధానిగా చేసుకుని పాలించారు. 

ఈ వంశ స్థాపకుడు హరిశ్చంద్రుడు. ఇతడి తర్వాత వత్సరాజు రాజ్యపాలన చేశాడు. 

ఈ వంశంలో మరో ప్రసిద్ధ రాజు మిహిర భోజుడు. అరబ్బు బాటసారి సులేమాన్‌ క్రీ.శ.851లో భోజుడి ఆస్థానాన్ని సందర్శించాడు. సులేమాన్‌ తన రచనల్లో భోజుడి రాజ్య వైభవాన్ని వర్ణించాడు.

గహద్వాల వంశం 

(క్రీ.శ.1085 - 1202)

గహద్వాలులు క్రీ.శ.1085లో కనోజ్‌ను ఆక్రమించి పరిపాలించారు. వీరి రాజధాని కనోజ్‌. ఈ వంశానికి మూలపురుషుడు చంద్రదేవుడు. ఇతడు ప్రజల నుంచి ‘తురక దండ’ అనే పన్నును వసూలు చేశాడు. ఆ సొమ్ముతో సైన్యాన్ని పెంపొందించి ముస్లింలను ఎదిరించాడు. 

ఈ వంశంలో జయచంద్రుడు సుప్రసిద్ధుడు. ఇతడు క్రీ.శ. 1192లో రెండో తరైన్‌ యుద్ధంలో మహమ్మద్‌ ఘోరీకి సహాయం చేశాడు. పృథిÅ్వరాజ్‌కు వ్యతిరేకంగా జయచంద్రుడు ఘోరీకి సాయం అందించాడు. క్రీ.శ.1194లో చందావార్‌ యుద్ధంలో ఘోరీ జయచంద్రుడ్ని ఓడించాడు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ వంశంలో చివరి పాలకుడు జయచంద్రుడి కుమారుడు హరిశ్చంద్రుడు.

చౌహాన్‌లు

ఈ వంశానికి మూలపురుషుడు సింహరాజు. ఇతడికి మహారాజాధిరాజు అనే బిరుదు ఉంది.

♦ అజయరాజు (అజయమేరు) అజ్మీర్‌ నగరాన్ని నిర్మించాడు.

♦ మరో పాలకుడైన విశాలదేవుడు ఢిల్లీ రాజులైన తోమారులను ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు. ఇతడు స్వయంగా కవి. హర్షకేళి అనే గ్రంథాన్ని రచించాడు. విశాలదేవుడి ఆస్థాన కవి సోమదేవ మహాకవి. ఈయన విశాలదేవుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ, ‘లలితా విగ్రహరాజు’ అనే గ్రంథాన్ని రచించాడు. విశాలదేవుడు అజ్మీర్‌లో ఒక విద్యాపీఠాన్ని నిర్మించాడు.

♦ ఈ వంశంలో మరో గొప్ప పాలకుడు పృథ్వీరాజ్‌. ఇతడు ముస్లిం దండయాత్రలను తిప్పికొట్టి సోలంకి, చందేల, గహద్వాల రాజులను ఓడించాడు. క్రీ.శ.1191లో జరిగిన మొదటి తరైన్‌ యుద్ధంలో పృథ్వీరాజ్‌ చేతిలో మహమ్మద్‌ ఘోరీ ఓడిపోయాడు. రెండో తరైన్‌ యుద్ధంలో పృథ్వీరాజ్‌ను ఘోరీ ఓడించి, సంహరించి ఢిల్లీ, అజ్మీర్‌లను ఆక్రమించాడు.

♦ చాంద్‌ బర్దాయ్‌ ‘పృథ్వీరాజ్‌ రాసో’ అనే గ్రంథంలో పృథ్వీరాజ్‌ గొప్పతనం గురించి వివరించారు.


చందేలులు 

(క్రీ.శ.950 - 1202)

వీరు మధ్య భారతదేశంలోని బుందేల్‌ఖండ్‌లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. వీరి రాజధాని ఖజురహో. 

* క్రీ.శ.950లో యశోవర్మ చందేల రాజ్యాన్ని నెలకొల్పాడు. 

* ఈ వంశ మూలపురుషుడు జయశక్తి.

* వీరిలో గొప్పవాడు విద్యాధరుడు. ఇతడి కాలంలోనే గజనీ మహమ్మద్‌ చందేల రాజ్యంపై దండెత్తాడు. దీన్ని విద్యాధరుడు సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ వంశంలో చివరి రాజు పెరుమాళ్‌.

కాలచూర్యులు

ఈ వంశ రాజ్య స్థాపకుడు కొక్కళుడు. గాంగేయదేవుడు కాలచూర్య రాజ్యాన్ని విస్తరించాడు. మరో పాలకుడైన కర్మదేవుడి కాలంలో ఈ రాజ్యం మహోన్నత దశకు చేరింది. ఈ వంశంలో చివరి పాలకుడు విజయసింహుడు.

పాలరాజులు

ఈ వంశానికి మూలపురుషుడు గోపాలుడు. వీరి రాజధాని ఉద్ధండపురి. వీరి కాలంలో బౌద్ధమతానికి రాజాదరణ లభించింది. 

* మరో రాజైన ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 

* పాలరాజుల కాలంలోనే ఉద్ధండపుర, జగద్దల విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. 

* ఈ వంశంలో చివరి పాలకుడు మహిపాలుడు.

సేన వంశస్థులు

ఈ వంశానికి మూల పురుషుడు సామంత సేనుడు. 

* ఈ పాలకుల్లో లక్ష్మణసేనుడు గొప్పవాడు. ఇతడు స్వయంగా కవి, పండిత పోషకుడు. ఇతడి ఆస్థానంలో పంచరత్నాలు అనే కవులు ఉండేవారు. 

* గీతగోవిందం రాసిన జయదేవుడు లక్ష్మణసేనుడి ఆస్థాన కవి. 

* లక్ష్మణసేనుడి పేరున స్థాపించిన కొత్త శకం, నేటికీ మిథిల ప్రాంతంలో వాడుకలో ఉంది. 

* సేన వంశీయుల కాలంలో బిహార్, బెంగాల్‌ ప్రాంతాల్లో హిందూ ధర్మ శాస్త్రానుగుణంగా సాంఘిక పునర్నిర్మాణం జరిగింది. 

* బ్రాహ్మణ - క్షత్రియ వర్ణాల్లో వారి వారి వంశ గౌరవం ఆధారంగా తరగతులు ఏర్పడ్డాయి.

సోలంకిలు

సోలంకి రాజ్యాన్ని క్రీ.శ.945లో మూలరాజు స్థాపించాడు. వీరి రాజధాని అన్విల్‌వాడ్‌. క్రీ.శ.1026లో మొదటి భీమరాజు కాలంలో గజినీ మహమ్మద్‌ సోలంకి రాజ్యంపై దండెత్తి ప్రసిద్ధ సోమనాథ దేవాలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేసి, దోచుకున్నాడు. 

* ఈ వంశంలో గొప్పవాడు జయసింహుడు. ఇతడి మంత్రి హేమచంద్రుడు. ఈయన గొప్ప జైన పండితుడు. 

* వారసత్వ గొడవల కారణంగా సోలంకి వంశం అంతరించింది.

సాహిత్యం

రాజపుత్ర రాజుల కాలంలో కావ్య, నాటక, ప్రక్రియలకు; అలంకార, నిఘంటు గ్రంథాల రచనలకు విశేష ఆదరణ లభించింది. 

* వీరి సమయంలోనే మాఘుడు - శిశుపాలవధ కావ్యాన్ని; క్షేమేంద్రుడు - బృహత్కథాకోశాన్ని; జయదేవుడు - గీతగోవిందం గేయాన్ని; భవభూతి - ఉత్తర రామచరితం, మాలతీ మాధవాన్ని; కృష్ణమిశ్రుడు - ప్రభోచంద్రోదయాన్ని; రాజశేఖరుడు - ప్రాకృత కర్పూర మంజరి నాటకాన్ని; ఆనంద వర్ధనుడు - ధ్వన్యాలోకం అలంకార గ్రంథాన్ని రచించారు. 

* హేమచంద్రుడు రచించిన కుమారపాల చరితం (సంస్కృత-ప్రాకృత రచన), అభిదాన చింతామణి నిఘంటు గ్రంథ రచనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

* రాజపుత్ర రాజులు స్వయంగా అనేక రచనలు చేశారు. వీరిలో పరమార ముంజ, భోజ రాజులు సోలంకీ మహిపాలుడు, లక్ష్మణసేనుడు ముఖ్యులు. 

భోజుడు అనేక విజ్ఞాన శాఖల మీద ప్రామాణికమైన గ్రంథాలు రాశాడు. ఇతడు చంపూ శైలిలో రాసిన రామాయణం ప్రథమ కావ్యమై, తర్వాతి కవులకు మార్గదర్శకమైంది. సరస్వతీ కంఠాభరణం, యుక్తికల్పతరువు (రాజనీతి గ్రంథం), సమరాంగణ సూత్రధార (వాస్తు విద్యపై), తత్త్వప్రకాశం అనే శైవతత్వ పరమైన గ్రంథం మొదలైనవన్నీ ఇతడి రచనలే.

* చారిత్రక రచన అవతరణ వీరి కాలంలోనే ప్రారంభమైంది. క్షేమేంద్రుడు రచించిన నృపావళి మొదటి చారిత్రక రచన. 

* పద్మగుప్తుడి నవసాహసాంక చరితం, బిల్హణుడి కర్ణసుందరి, విక్రమాంక చరితం మొదలైనవి తర్వాతి కాలంలో వచ్చాయి. 

* చారిత్రక రచనలు చేసిన వారిలో కల్హణ కవిని గొప్పవాడిగా చరిత్రకారులు పేర్కొంటారు. ఇతడి రాజతరంగిణి (కశ్మీర్‌ రాజ వంశాల చరిత్ర)ఎంతో ప్రఖ్యాతి పొందింది. 

* రాజపుత్రుల కాలంలో దేశవ్యాప్తంగా సంస్కృతం రాజభాషగా గుర్తిపు పొందింది.

నిర్మాణాలు

రాజపుత్రులు వాస్తు-శిల్ప కళలను ఆదరించారు. వీరు శత్రుదుర్భేద్యాలైన గిరి దుర్గాలను, అందులో అందమైన రాజప్రాసాదాలను, అనేక దేవాలయాలను నిర్మించారు. 

* వీరు నగరాలను దుర్గాలు, కొండలు, అడవులు, సరోవరాల మధ్య నిర్మించారు. ఇవి ప్రకృతి సౌందర్యంతో ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. 

* రాజపుత్రులు కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చిత్తోడ్, జయపూర్, జోధ్‌పూర్‌ మొదలైన చోట్ల దుర్గాలు, ప్రాసాదాలను కట్టారు. అవి ఆయా ప్రాంతాల్లో నేటికీ శిథిల రూపంలో దర్శనమిస్తూ, అప్పటి ప్రాచీన ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.

* వీరు నాగర శైలిని ఎక్కువగా వినియోగించారు.

* ఒడిశాలోని కోణార్క్‌ సూర్యదేవాలయం, పూరీలోని జగన్నాథ దేవాలయం, భువనేశ్వర్‌లోని లింగరాజు, రాణా ఆలయాలు వీరి కళా నైపుణ్యానికి నిదర్శనాలు. 

* 12వ శతాబ్దంలో తూర్పు గాంగ రాజైన అనంతవర్మ చోడ గాంగ రాజు లింగరాజు ఆలయాన్ని, జగన్నాథ ఆలయాన్ని నిర్మించాడు. 

* ఖజురహోలోని దేవాలయాలను చందేలులు నిర్మించారు. 

* అబూ శిఖరంపై మాణిక్‌ సోదరులు వృషభనాథ, నేమినాథ దేవాలయాలు నిర్మించారు. ఇవి జైన సంప్రదాయాన్ని తెలియజేస్తున్నాయి. 

* అనంతవర్మ కాలంలో లలితాదిత్యుడు మార్తాండ్‌లో సూర్యదేవాలయాన్ని నిర్మించాడు.

పరమారులు

పరమార వంశ స్థాపకుడు ఉపేంద్రుడు. ఇతడు క్రీ.శ.820లో మాల్వాలో పరమార రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని ధారానగరం. ఈ వంశంలో ఏడో రాజు ముంజరాజు. ఈయన కవి, పండిత పోషకుడు. ఇతడి ఆస్థానంలో ధనుంజయ, హాలాయుధ, పద్మగుప్త అనే కవులు ఉండేవారు. 

* ఇతడు అనేక దేవాలయాలు నిర్మించాడు. వ్యవసాయాభివృద్ధికి చెరువులు తవ్వించాడు. ముంజేశ్వర తటాకం ఇతడు ఏర్పాటు చేసిందే.

ఈ వంశంలో మరో గొప్ప పాలకుడు భోజరాజు. ఇతడు భోజపురం అనే నగరాన్ని నిర్మించాడు. అక్కడ ఒక సంస్కృత కళాశాలను, భోజ సరస్సును ఏర్పాటు చేశాడు. 


సాంస్కృతిక సేవలు

రాజపుత్రుల కాలంలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా భూస్వాములు పుట్టుకొచ్చారు. హిందూమత ప్రాబల్యం ఎక్కువైంది. ఎన్నో కులాలు ఏర్పడ్డాయి. సమాజంలో స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది. భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగం విశిష్టమైంది. దేశభక్తి, ధైర్య సాహసాలకు పేరుపొందిన రాజపుత్రులు సమర్థ పాలనను అందించారు. వీరి కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. హిందూమతంతో పాటు ఇస్లాం మతాన్నీ ఆదరించారు. భాషా, సాహిత్యాల అభివృద్ధికి; వాస్తు కళారంగాల విస్తరణకు కృషి చేశారు.

పరిపాలనా విధానం

రాజపుత్రుల రాజకీయ వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రధానమైంది. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజు సర్వాధికారి. అతడి సార్వభౌమాధికారం దైవదత్తాధికార, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల మిశ్రమంగా ఉండేది. రాజుకు పాలనలో యువరాజు, పట్టమహిషి, మంత్రి మండలి సహాయపడేవారు. ప్రధాన రాజపురోహితుడు, జ్యోతిష్కుడు మంత్రి మండలిలో సభ్యులుగా ఉండేవారు. భుక్తి లేదా రాష్ట్ర ప్రతినిధులను రాజ ప్రతినిధులుగా పిలిచేవారు. విషయాలకు విషయపతి, గ్రామాలకు గ్రామపతి పాలకులుగా ఉండేవారు. ఉత్తర భారతదేశంలో భూస్వామ్య ప్రభువుల జోక్యం వల్ల గ్రామ స్వపరిపాలన కుంటుపడింది. కానీ ఇదే సమయంలో దక్షిణాదిన చోళుల పాలనలో గ్రామ స్వపరిపాలన చక్కగా సాగింది. రాజు సొంత సైన్యంతో పాటు భూస్వాముల సైన్యమూ రాజ్య విస్తరణలో సహాయపడేది. సైనిక సర్వీసు కేవలం రాజపుత్రులకే పరిమితమై ఉండేది. సైనిక వ్యయం అధికంగా ఉండటం వల్ల ప్రజలపై పన్ను భారం ఎక్కువగా ఉండేది. న్యాయపాలనలోనూ రాజే సర్వాధికారి. భుక్తుల్లో దండనాయకుడు న్యాయాన్ని నిర్ణయించేవాడు. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఉండేది. భూమిశిస్తు నిర్ణయించి, వసూలు చేసే బాధ్యత వీరిదే.

సామాజిక వ్యవస్థ

రాజపుత్ర యుగం నాటి సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ జటిలమయ్యాయి. కుమ్మరి, చేనేత, కంసాలి, మంగలి, జాలరి, మేళగాడు లాంటి కులాలు, ఉపకులాలతో పాటు రాజపుత్రులనే కొత్త కులం ఆవిర్భవించింది. కాయస్థ కులం ఈ కాలంలో ఉండేది. అధికంగా శ్రమించే కులాలను అస్పృశ్యులు, అంటరానివారుగా పరిగణించేవారు. భూస్వామ్య ప్రభువులుగా వ్యవహరించే రాణాలు, సామంతులు శక్తిమంతమైన వర్గంగా ఎదిగారు. ఓడిపోయిన రాజులు, స్థానిక అధిపతులు, యుద్ధ నిపుణులు, తెగ నాయకులు ప్రత్యేక భూస్వామ్య వర్గాలుగా ఆవిర్భవించారు. రాజు వీరికి దానం చేసిన భూములను భోగ లేదా జమీ భూములు అనేవారు. ప్రభుత్వ పదవులను వంశ పారంపర్యంగా అనుభవించేవారు. ఆడపిల్ల పుట్టగానే చంపే ఆచారం ఈ యుగంలోనే ప్రారంభమైంది. బహు భార్యత్వం, పరదా పద్ధతి, జౌహార్‌, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీల పరిస్థితి దయనీయంగా మారింది. స్త్రీలకు భూమి హక్కు ఉండేది కానీ విద్యావకాశాలు చాలా తక్కువ.

మత పరిస్థితులు

రాజపుత్ర యుగంలో జైన, బౌద్ధ మతాలు క్షీణించి హిందూమతం అభివృద్ధి చెందింది. శైవ, వైష్ణవ మతాలకు ఆదరణ పెరిగింది. భక్తి ఉద్యమాల ప్రభావంతో త్రిమూర్తుల ఆరాధన ప్రాధాన్యం పొందింది. ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధన (స్త్రీ దేవతల ఆరాధన) మరింత పెరిగింది. హిందువులు స్త్రీ మూర్తిని దుర్గ, కాళీ రూపాల్లో శివుడి అర్ధభాగంగా భావించి పూజించేవారు. అనేక దేవాలయాల నిర్మాణాలు రాజపుత్ర యుగంలో హిందూమతానికి దక్కిన ఆదరణకు సాక్ష్యాలుగా నిలిచాయి.

ఆర్థిక పరిస్థితులు

రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థపై ఆధారపడింది. వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, వ్యవసాయం ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని వారసత్వ హక్కుగా అనుభవించే ఆర్థిక వ్యవస్థనే భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజంగా పేర్కొంటారు. ఈ యుగంలో అదనంగా పంటలు పండించి వాణిజ్యం చేసే ప్రయత్నాలు చేయలేదు. భూస్వామ్య ప్రభువుల ఒత్తిడి వల్ల రైతులు కనీస పంటలు పండించడమే మేలని భావించేవారు. వాణిజ్యం, నాణేల చెలామణి తగ్గిపోయాయి. రోమన్‌, ససానిడ్‌ రాజ్యాలు దెబ్బతినడంతో విదేశాల్లో భారతీయ వస్తువులకు గిరాకీ తగ్గి విదేశీ వాణిజ్యం క్షీణించింది. కోస్తా, బెంగాల్‌ ప్రాంతాల్లోని పట్టణాలు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సంబంధాలను కొనసాగించాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వృత్తి పనివారి సంఘాలకు (శ్రేణులు) ప్రాముఖ్యం తగ్గిపోయింది. భూమి ఇచ్చిన రాజు, సేద్యం చేసే రైతు ఇద్దరూ బలహీనపడి భూస్వామ్య ప్రభువులు బలపడ్డారు. భూమిశిస్తు కంటే అధికంగా పన్నులు చెల్లించడం వల్ల రైతులు ఆర్థికమాంద్యంలో కూరుకుపోయారు. దేవాలయ అధికారులూ రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. రాజులు, సామంతులు సైనిక వ్యయంతోపాటు దేవాలయాలు, కోటల నిర్మాణానికి, వాటి అలంకరణకు అధికంగా ఖర్చు చేసేవారు. ఈ విధానాలే అనంతర కాలంలో విదేశీయులు మనపై దాడిచేసి, దోపిడీ చేయడానికి కారణమయ్యాయి.

Posted Date : 14-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  వేద నాగరికత - జైనమతం

పదకోశాలు

 శృతి: ఒకరి నుంచి మరొకరికి మౌఖికంగా అందించే వాజ్ఞయం.


 స్మృతి: న్యాయశాస్త్ర గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు.


 సభ, సమితి: తొలివేద కాలంలోని సభలు.


 సుర, సోమ: మత్తుపానీయాలు.


 గోత్రం: గోశాల లేదా గోవులమంద.


 రుక్కులు: వేదాల్లో శ్లోకాలు.


 బలి, బాగ, శుల్క: రాజుకు చెల్లించే పన్నులు/ బహుమానాలు.


 ఉర్వర: వ్యవసాయ క్షేత్రాలు.


 భూగదుగ: పన్నులు వసూలు చేసే అధికారి.


 రాజసూయయాగం: రాజు సింహాసనాన్ని అధిష్టించేటప్పుడు జరిపే యాగం.


 వాజపేయ యాగం: పందెంలో రాజు రథం అతడి బంధువుల రథాన్ని జయించాలి.


♦ అశ్వమేధయాగం: రాజు గుర్రం ఆటంకం లేకుండా తిరిగినంతమేర తమ రాజ్యంగా భావించేవారు.


♦ ఆశ్రమపద్ధతి: మానవుడి వందేళ్ల జీవిత కాలాన్ని బ్రహ్మచర్య (0  25 సం. వరకు), గృహస్థ (25  50 సం.), వానప్రస్థ (50  75 సం.), సన్యాస (75 సం. పైన)గా విభజించారు. వీటినే వర్ణాశ్రమ ధర్మాలు అంటారు.


 చతుర్విధ పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష.


పురుషసూక్త సిద్ధాంతం: ప్రజాపతి నుదుటి నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారు. ఇది వర్ణ-కుల వ్యవస్థకు నాంది పలికింది.

 

1. కర్షపణ, శతమాన అనేవి?

1) పూసలు    2) నాణేలు 

3) గాజులు    4) సుగంధ ద్రవ్యాలు

 

2. గోపాలకులు ఎవరు?

1) భూములను సాగుచేసేవారు 

2) పరిశ్రమలను స్థాపించేవారు 

3) గ్రామపాలకులు 

4) పశువులను మేపేవారు

 

3. గహపతులు ఎవరు?

1) ధనవంతులైన రైతులు 

2) ఎక్కువ భూమిని కలిగి ఉండేవారు 

3) 1 మాత్రమే    4) పైరెండూ

 

4. శెట్టిగహపతులు ఎవరు?

1) వడ్డీ వ్యాపారులు

2) వ్యవసాయం చేసేవారు

3) సాంకేతికత కలిగినవారు

4) సాహిత్యకారులు

 

5. బింబిసారుడి ఆస్థాన వైద్యుడు ఎవరు?

1) అజీవకుడు    2) జీవకుడు 

3) పాణుడు      4) ప్రసేనజిత్‌

 

6. క్రీ.పూ. 6వ శతాబ్దానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) సమాజంలో సతీసహగమనం ఉండేది.

బి) బహుభార్యత్వం ఉండేది.

సి) బాల్యవివాహాలు ఉండేవి. 

1) ఎ, బి      2) ఎ, సి  

3) బి, సి      4) పైవన్నీ

 

7. కింది అంశాలను జతపరచండి.

జాబితా  I     జాబితా  II

i భోజక     a) వ్యాపార కేంద్రం

ii) నిగమ     b) గ్రామపెద్ద

iii) పుక్కుస   c) శ్రేణి అధిపతి

iv) శ్రేష్టి       d) వేటాడేవారు

1్శ i్జ, ii్చ, iii్ట, i్ర‘

2్శ i‘, ii్చ, iii్ట, i్ర్జ

3్శ i్ట, ii‘, iii్జ, i్ర్చ

4్శ i్జ, ii్ట, iii్చ, i్ర‘

 

8. కిందివాటిలో క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి ప్రముఖ విద్యా, వ్యాపారకేంద్రం ఏది?

1్శ రోపార్‌    2్శ రాజ్‌ఘాట్‌

3్శ గయ        4్శ తక్షశిల

 

9. కింది అంశాలను జతపరచండి.

జాబితా  I       జాబితా  II

i) రాజనపిట       a) దర్జీ పనివారు

ii) రాజకులాల      b) పూలు అల్లేవారు

iii) రాజమాలకార   c) కుమ్మరి

iv) లున్నకార     d) మంగలి

1) i-d, ii-c, iii-, iv-a

2) i-b, ii-c, iii-d, iv-a

3) i-c, ii-d, iii-a, iv-b

4) i-d, ii-a, iii-b, iv-c

 

10. ‘ద వండర్‌ దట్‌ వజ్‌ ఇండియా’ గ్రంథ రచయిత ఎవరు?

1్శ రామ్‌ శరణ్‌ శర్మ   2్శ కె.కె.దత్తా

3్శ ఆర్థర్‌ లావెల్లిన్‌ బాష్యం

4్శ రోమిలా థాపర్‌

 

11. వేదాలను ఏ భాషలో రచించారు?

1్శ పాళీ        2్శ సంస్కృతం

3్శ ప్రాకృతం    4్శ ఏదీకాదు

 

12. కిందివాటిలో జైన, బౌద్ధ మతాల ఆవిర్భావానికి గల కారణాలు గుర్తించండి.

ఎ) వర్ణవ్యవస్థ జఠిలం కావడం.

బి) కర్మకాండలు, జంతు బలులు, సంస్కారాలు అధికం కావడం.

సి) వర్తక, వ్యాపారాలు అభివృద్ధి చెందడం.

డి) శాంతి కరవై, అహింస పెరగడం.

1) ఎ, బి, సి    2) బి, సి, డి

3) ఎ, డి    4) పైవన్నీ

 

13. అజీవక శాఖ స్థాపకుడు ఎవరు?

1) మక్కలి గోసల    

2) వర్ధమాన మహావీర

3) గౌతముడు      4) అజిత

 

14. ‘శారీరక కర్మలు ఆత్మను అంటవు’ అని బోధించింది ఎవరు

1) మక్కలి గోసల    2) అజితకేశ కంబలి 

3) పురాణ కశ్యప    

4) వర్ధమాన మహావీర

 

15. రుగ్వేదం ప్రకారం జైనమత స్థాపకుడు ఎవరు?

1) రిషభనాథ    2) నేమినాథ 

3) అజితనాథ    4) మహావీరుడు

 

16. ‘అంగాలు’ ఏ మతానికి సంబంధించినవి?

1) బౌద్ధమతం    2) చర్వాక 

3) జైనమతం    4) హిందూమతం

 

17. ‘తీర్థంకరులు’ ఎవరు?

1) జైన గురువులు      2) బౌద్ధ గురువులు 

3) చర్వాక గురువులు

4) హిందూమత గురువులు

 

18. జైనమతంలో మొత్తం ఎంత మంది తీర్థంకరులు ఉన్నారు?

1) 22        2) 23    

3) 24        4) 25

 

19. కిందివారిలో 24వ తీర్థంకరుడు ఎవరు?

1) మిలిమినాథ    2) నేమినాథ 

3) పార్శ్యనాథ

4) వర్ధమాన మహావీర

 

20. చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఎవరు?

1) శీతలనాథ    2) అజితనాథ 

3) ధర్మనాథ    4) పార్శ్యనాథ

 

21. పార్శ్యనాథుడు ఎక్కడ మరణించారు?

1) బిహార్‌    2) బెంగాల్‌

3) ఒడిశా    4) బెనారస్‌

 

22. కిందివాటిలో ‘పంచవ్రతాలకు’ సంబంధించిసరైనవి?

ఎ) అహింస (జీవహింస చేయకూడదు)

బి) అపరిగ్రహం (దొంగతనం చేయకూడదు)

సి) ఆస్తేయం (ఆస్తి ఉండకూడదు)

డి) సత్య (సత్యాన్ని మాట్లాడటం)

ఇ) బ్రహ్మచర్య (వివాహం చేసుకోకపోవడం)

1) ఎ, బి, సి, డి    2) సి, డి, ఇ

3) బి, డి, ఇ    4) పైవన్నీ

 

23. ‘త్రి రత్నాలు’ ఏ మతానికి సంబంధించినవి? 

1) జైన        2) బౌద్ధ

3) హిందూ    4) అజీవక

 

24. వర్ధమాన మహావీరుడి చిహ్నం ఏది?

1) పాము      2) తాబేలు

3) సింహం    4) మేక

 

25. కిందివారిలో మొదట క్షత్రియుడిగా ఉండి, తర్వాత జైన తీర్థంకరుడిగా మారింది ఎవరు?

1) విమలనాథ    2) నేమినాథ 

3) అరిష్టనేయ    4) పార్శ్యనాథ

 

26. కిందివాటిలో ప్రాచీన మతం ఏది?

1్శ హిందూమతం    2్శ జైనమతం

3్శ బౌద్ధమతం    4్శ అజీవక మతం

 

సమాధానాలు

1 - 2  2 - 4  3 - 4  4 - 1  5 - 2  6 - 4  7 - 1  8 - 4  9 - 1  10 - 3  11 - 2  12 - 4  13 - 1  14 - 3  15 - 1  16 - 3  17 - 1  18 - 3  19 - 4  20 - 4  21 - 2  22 - 4  23 - 1  24 - 3  25 - 4  26 - 1

 

వివిధ తీర్థంకరులు - వారి చిహ్నాలు

పేరు గుర్తు/ చిహ్నం
రిషభనాథ (అరినాథ)     ఎద్దు
అజితనాథ ఏనుగు
సంభవనాథ గుర్రం
అభినందన కోతి
సుమతినాథ కొంగ
పద్మప్రభు కమలం
సుపార్శ్యనాథ స్వస్తిక్‌
చంద్రప్రభు చంద్రుడు
పుష్పదంత/ సువిధి మకరం/ డాల్ఫిన్‌

శీతలనాథ

శ్రావత్స గుర్తు/ కుంచం

శ్రేయాంసనాథ     ఖడ్గమృగం
వాసువూజ్య గేద
విమలనాథ వరాహం
అనంతనాథ రాబందు
ధర్మనాథ ఉడుము
శాంతినాథ (హస్తినరాజు)  దుప్పి
కుంతనాథ మేక
అరనాథ చేప
మల్లనాథ (మిథిలరాజు కూతురు) కూజా/ కుండ
మునిసుమీరనాథ/ సువ్రత తాబేలు
నేమినాథ నీలి గులాబి
అరిష్టనేమి శంఖం
పార్శ్యనాథ పాము
వర్ధమాన మహావీర సింహం

 

వివిధ వివాహాలు

* బ్రహ్మ - తగినంత కట్నం తెచ్చే కన్యకు అదే వర్గానికి చెందిన పురుషుడితో వేదమంత్రాల ద్వారా జరిపే వివాహం.

* దైవ - గృహస్థుడు తన కుమార్తెను మత గురువుకు దక్షిణగా ఇవ్వడం.

* అర్ష - కన్యతో పాటు కట్నం స్థానంలో ఎద్దులు, ఆవులను ఇవ్వడం.

* ప్రజాపత్య - ఈ విధానంలో కన్య తండ్రి ఏవిధమైన కట్నం ఇవ్వడు, కన్యాశుల్కం కోరడు.

* గాంధర్వ - రెండు వర్గాల సమ్మతితో గుప్త వివాహం చేసుకోవడం.

* అసుర - కొనుగోలు ద్వారా వివాహం చేసుకోవడం.

* పైశాచ - కన్య నిద్రపోతున్న సమయంలో లేదా మత్తుపానీయం స్వీకరించి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకోవడం. దీన్ని వివాహం అనరు.

* రాక్షస - చెరపట్టడం ద్వారా వివాహం చేసుకోవడం.

* వీటిలో మొదటి నాలుగు వివాహాలను మాత్రమే శాస్త్రపరంగా ఆమోదించారు. 

Posted Date : 24-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సంస్కరణోద్యమాలు

భారత్‌లో 19వ శతాబ్దంలో సమాజోద్ధరణ దిశగా రూపుదాల్చిన అనేక సంస్కరణోద్యమాలు భారతీయుల జీవన విధానంపై విశేష ప్రభావాన్ని చూపాయి. రాజా రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి, సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ లాంటి ప్రముఖులెందరో ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మూఢ సంప్రదాయాలు, అంధ విశ్వాసాలను రూపుమాపేందుకు వీరంతా కృషి చేశారు. ఫలితంగా భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పులు తర్వాతి తరాలకు ఎంతో మేలు చేశాయి. నాటి సామాజిక, మత సంస్కరణ ఉద్యమాల చారిత్రక అధ్యయన సమాచారాన్ని చదవండి మరి!

19వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల విద్యావ్యాప్తి.. క్రైస్తవ మిషనరీల మత ప్రచారం.. ఐరోపాలో ప్రారంభమైన ఉదార, హేతువాద, మానవతావాద ఉద్యమాలు భారతీయులపై ప్రభావం చూపాయి. ఇవన్నీ తమ సామాజిక, మత వ్యవస్థల గురించి భారతీయులు పునరాలోచించేలా చేశాయి. ఈ ప్రభావంతో తలెత్తిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల జీవన విధానాన్ని మార్చాయి. వారిలో ఐకమత్యం, దేశభక్తిని పెంపొందించాయి. భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు మొదట బెంగాల్, తర్వాత పశ్చిమ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. భారత్‌లో పునరుజ్జీవన ఉద్యమపితగా రాజా రామ్మోహన్ రాయ్‌ని పేర్కొంటారు.

బ్రహ్మ సమాజం

బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్‌లోని బర్డ్వాన్ జిల్లా రాధానగర్‌లో జన్మించారు. 1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని ఉద్దేశం.

హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆధునిక విద్యావ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో రెగ్యులేషన్ XVII ద్వారా సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు. బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు.

దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. కానీ బ్రిటిష్ పాలన పట్ల మాత్రం కొంత సానుకూల వైఖరితో ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు.
రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు రాయ్ 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లాడు. బ్రిటిష్‌వారు ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రామ్మోహన్ రాయ్ ద్వారా మొగలు చక్రవర్తి కోరాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు.

'రాజా' అనంతరం..

మహర్షి ద్వారకనాథ్ ఠాగూర్, పండిట్ రామచంద్ర విద్యావాగిష్‌లు రామ్మోహన్ రాయ్ మరణానంతరం పదేళ్లపాటు బ్రహ్మ సమాజాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ద్వారకనాథ్ ఠాగూర్ పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ బాధ్యతలు చేపట్టారు. దేవేంద్రనాథ్ బ్రహ్మ సమాజంలో చేరక ముందు కలకత్తా(1831)లో తత్త్వబోధిని సభను స్థాపించారు. గొప్ప రచయిత, విద్యావేత్త అయిన అక్షయ్‌కుమార్ దత్తా 1840లో తత్త్వబోధిని పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్ మిత్రా, తారాచంద్ చక్రవర్తి, పియరీచంద్ మిత్ర చేరారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తత్త్వబోధిని అనే మాసపత్రికను బెంగాలీ భాషలో ప్రచురించారు. దేవేంద్రనాథ్ 80 మంది అనుచరులతో 1843 డిసెంబరు 21న బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా చేరారు. అలెగ్జాండర్ డఫ్ భారతీయ సంస్కృతిపై చేసిన దాడిని దేవేంద్రనాథ్ సమర్థంగా తిప్పికొట్టారు. దేవేంద్రనాథ్ రెండేళ్ల(1856-58) పాటు సిమ్లా వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలోనే కేశవచంద్రసేన్ (1857లో) బ్రహ్మ సమాజంలో చేరి ఆయన కుడిభుజంగా మారారు. 1859లో యువకులతో కూడిన సంగత్ సభను స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం అప్పటి ఆధ్యాత్మిక, సామాజిక సమస్యల గురించి చర్చించడం.

1861లో కేశవచంద్ర సేన్ సంపాదకుడిగా ఇండియన్ మిర్రర్ అనే పక్ష పత్రికను స్థాపించారు. ఇది తర్వాతి కాలంలో భారతదేశంలో ఆంగ్లంలో ప్రచురితమైన మొదటి దినపత్రికగా పేరొందింది. క్షామం, అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో ఆయన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మ సమాజాన్ని దేశమంతా విస్తరించడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కృషి ఫలితంగా మద్రాసులో వేద్ సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్‌లు ఏర్పాటయ్యాయి.

బ్రహ్మ సమాజంలో చీలికలు

కేశవచంద్ర సేన్ చేపట్టిన కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు, పరదా పద్ధతి తొలగింపు లాంటి కార్యక్రమాలు పాతతరం వారికి నచ్చలేదు. దీంతో 1866లో బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ వర్గం 'ఆది బ్రహ్మసమాజ్‌'గా, కేశవచంద్ర సేన్ వర్గం 'బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా (నవ విధాన్)'గా విడిపోయాయి.

1870లో కేశవచంద్ర సేన్ ఇంగ్లండ్ వెళ్లొచ్చాక మరింత ఉత్సాహంతో సాంఘిక సంస్కరణలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 1872లో ప్రభుత్వంతో చర్చించి బ్రహ్మ వివాహ చట్టాన్ని తీసుకురావడం ద్వారా బ్రహ్మ సమాజం నిర్వహించే వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ఆయన ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను స్థాపించారు. పాశ్చాత్య విద్యావ్యాప్తి; స్త్రీల అభ్యున్నతి, విద్యావ్యాప్తి; సామాజిక కార్యక్రమాలకు ఈ సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది.

కేశవచంద్ర సేన్ 1878లో తన కుమార్తెను కూచ్ బిహార్ పాలకుడికి ఇచ్చి వివాహం చేశారు. చట్టబద్ధంగా నిర్ణయించిన కనీస వివాహ వయసు కంటే వధూవరులిద్దరి వయసు తక్కువ. అంతేకాకుండా ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇది పూర్తిగా బ్రహ్మవివాహ చట్టానికి వ్యతిరేకం. దీంతో బ్రహ్మ సమాజంలో మరో చీలిక వచ్చింది. ఆనందమోహన్ బోస్ నాయకత్వంలో సాధారణ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు.

దక్షిణ భారతదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటివారు బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

ఆర్య సమాజం

ఆర్య సమాజ స్థాప‌కుడు స్వామి దయానంద సరస్వతి. ఆయన అసలు పేరు మూల్‌శంకర్. 1824లో గుజరాత్‌లోని మోర్వి సమీపంలోని టంకారా అనే ప్రదేశంలో జన్మించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో విరజానందుడు అనే అంధ సన్యాసి దగ్గర వేదాలు, ధర్మ శాస్త్రాలు, స్మృతులు అభ్యసించారు. దయానంద సరస్వతి 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. విరజానందుడు హిందూమతంలోని దురాచారాలను తొలగించాలని దయానందుడిని కోరారు. వేదాలకు తిరిగి వెళదాం.. మొత్తం జ్ఞానానికి వేదాలే ఆధారం.. అనేవి వీరి నినాదాలు. తర్వాతి కాలంలో పంజాబ్‌లోని లాహోర్ ఆర్య సమాజ ప్రధాన కేంద్రంగా మారింది. ఆర్య సమాజం సిద్ధాంతాలను పంజాబ్‌లో ప్రచారం చేయడంలో దయానందుడు సఫలీకృతుడయ్యాడు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కొంతవరకు ఆర్య సమాజ ప్రభావం వ్యాపించింది.

హిందూ మతంలో విగ్రహారాధన, మూఢ విశ్వాసాలకు కారణమైన పురాణాలను దయానందుడు తిరస్కరించాడు. ఆర్యసమాజం వైదిక మతాన్ని పునరుద్ధరించి, జాతీయతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేసింది. పాశ్చాత్య విద్యావిధానం వ్యాప్తికి తోడ్పడింది. బాలబాలికలకు విద్యనందించడానికి ఆర్యసమాజం దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) పాఠశాలలను స్థాపించింది. చాతుర్వర్ణ విధానం జన్మ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉండాలని ఈ సమాజం భావించింది. సామాజిక, విద్యా రంగాల్లో స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని కోరింది. అంటరానితనం, కుల వ్యత్యాసాలు, బాల్య వివాహాలను వ్యతిరేకించింది. వితంతు పునర్వివాహాలు, కులాంతర వివాహాలను సమర్థించింది.

ఆర్య సమాజం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు వివాదాస్పదమయ్యాయి. వీటిలో మొదటిది - 1882లో దయానందుడు ప్రారంభించిన గోరక్ష ఉద్యమం. గోరక్షణ కోసం నిధులు సేకరించి, గోవులను వధించకుండా అడ్డుకోవడం లాంటి కార్యకలాపాలను చేపట్టారు. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
రెండోది - ఇతర మతాల్లోకి చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి దయానందుడు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ఎక్కువ సంఖ్యలో హిందువులను, ముఖ్యంగా అణగారిన వర్గాలవారిని క్రైస్తవ మతంలోకి మార్చాయి. వీరిని తిరిగి హిందువులుగా మార్చడానికి చేసిందే శుద్ధి ఉద్యమం.

రామకృష్ణ మిషన్, మఠం

వివేకానందుడు 1897లో పశ్చిమ బెంగాల్‌లోని బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం సమాజసేవ చేయడం. దీనిద్వారా అనేక పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించి, పేద ప్రజలకు సహాయం చేశారు. ఆయన 1887లో పశ్చిమబెంగాల్‌లోని బారానగర్‌లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీనిద్వారా తన గురువైన రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేశారు. 1898 నుంచి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలకు బేలూరు ప్రధాన కేంద్రం అయ్యింది.

రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. ఆయన 1836లో పశ్చిమబెంగాల్, హుగ్లీ జిల్లాలోని కామర్‌పుకుర్ అనే గ్రామంలో జన్మించారు. మానవ సేవే మాధవ సేవ అనేది రామకృష్ణుడి నినాదం. వేదాంత, ఉపనిషత్తుల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. రామకృష్ణుడికి సూఫీ మత గురువు ఇస్లాం మతదీక్షను అనుగ్రహించారు. కాళీమాత, కృష్ణుడు, బుద్ధుడు, సిక్కు గురువులను ఆయన పూజించేవారు. బైబిల్ పఠనాన్ని వినేవారు.

వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన కలకత్తాలో 1863లో జన్మించారు. మొదటిసారి 1881లో రామకృష్ణ పరమహంసను కలిశారు. భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించి, ప్రజల వాస్తవ స్థితిగతులను తెలుకున్నారు.

వివేకానందుడు మానవులందరిలో దైవత్వం ఉందని, ప్రతి వ్యక్తిలోనూ శక్తి సామర్థ్యాలున్నాయని, ఎవరినీ తక్కువగా చూడరాదని బోధించారు. అనారోగ్యం కారణంగా అతి చిన్న వయసులోనే (1902) ఆయన మృతి చెందారు.

దివ్యజ్ఞాన సమాజం

రష్యాకు చెందిన హెచ్.పి.బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ 1875లో న్యూయార్క్‌లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. వీరు 1879లో భారతదేశానికి వచ్చి, 1882లో మద్రాసు సమీపంలోని అడయార్ వద్ద దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు.
ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ లండన్‌లోని దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆమె 1893లో మనదేశానికి వచ్చి, 1907లో ఆల్కాట్ మరణం తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు. విశ్వమానవులందరిలో సోదర భావాన్ని పెంపొందించడం, ప్రాచీన మతాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం ఈ సమాజం ప్రధాన లక్ష్యాలు.

హిందూ మతసూత్రాలను బోధించడానికి అనిబిసెంట్ 1898లో వారణాసిలో సెంట్రల్ హిందూ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాతి కాలంలో మదన్‌మోహన్ మాలవీయ కృషి ఫలితంగా ఇది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా (1916) అభివృద్ధి చెందింది.

అలీగఢ్ ఉద్యమం

ఉత్తర ప్రదేశ్‌లోని బరేలికి చెందిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. హేతువాదం ప్రాతిపదికగా ఇస్లాం మతాన్ని సమర్థిస్తూనే, ముస్లిం సమాజంలోని బహు భార్యత్వాన్ని, బానిస వ్యవస్థను విమర్శించారు. ముస్లింలకు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో 1875లో అలీగఢ్‌లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. అది 1920లో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది.

ముఖ్యాంశాలు

* రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని 1828లో స్థాపించాడు.

* మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదు ఇచ్చాడు.

* స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఆయన అసలు పేరు మూల్‌శంకర్.

* వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన 1863లో జన్మించారు. 1881లో రామకృష్ణ పరమహంసను తొలిసారి కలిశారు.

* వివేకానందుడి గురువైన రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ ఆయన 1836లో జన్మించారు.

* వివేకానందుడు రామకృష్ణ మఠం (1887), రామకృష్ణ మిషన్ (1897)లను స్థాపించాడు.

* 1875లో దివ్యజ్ఞాన సమాజాన్ని రష్యాకు చెందిన హెచ్.పి. బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ స్థాపించారు.

* ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చారు. 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు.

 

మాదిరి ప్రశ్నలు

1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూ మత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టిందెవరు?

ఎ) దేవేంద్రనాథ్ ఠాగూర్    బి) కేశవచంద్ర సేన్    సి) దయానందుడు   డి) రామ్మోహన్ రాయ్

జ: (ఎ)

2. 'వేదాంత సూత్రాలు' గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి ఎవరు?

ఎ) వివేకానందుడు    బి) వీరేశలింగం   సి) దేవేంద్రనాథ్ ఠాగూర్   డి) రాధాకాంత్ దేవ్

జ: (ఎ)

3. కామన్వెల్త్ పత్రికను స్థాపించింది ఎవరు?

ఎ) తిలక్ బి) బిపిన్‌చంద్రపాల్ సి) అనిబిసెంట్ డి) గాంధీజీ

జ: (సి)

4. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?

ఎ) రామ్మోహన్ రాయ్   బి) వివేకానందుడు   సి) దయానందుడు    డి) కేశవచంద్ర సేన్

జ: (సి)

5. ఆర్య సమాజ ప్రభావం ఏ రాష్ట్రంపై ఎక్కువ?

ఎ) ఆంధ్రప్రదేశ్   బి) మహారాష్ట్ర   సి) పంజాబ్   డి) గుజరాత్

జ: (సి)

6. రామకృష్ణ పరమహంస భార్య పేరేమిటి?

ఎ) శారదాప్రియ    బి) శారదామణి    సి) శ్రీలత    డి) హర్షిత

జ: (బి)

7. కింది వారిలో పశ్చిమ భారతదేశంలో పునరుజ్జీవన పితగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు?

ఎ) ఎం.జి. రనడే    బి) బి.ఎం. మలబారి    సి) ఆర్.జి. భండార్కర్    డి) కె.టి. తెలాంగ్

: (ఎ)

8. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు?

ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బి) దయానందుడు సి) రాధాకాంత్ దేవ్ డి) కేశవచంద్ర సేన్

జ: (బి)

9. శ్రద్ధానందుడు గురుకుల విద్యాల యాలను ఎక్కడ ప్రారంభించాడు?

ఎ) లాహోర్   బి) బొంబాయి   సి) హరిద్వార్   డి) కలకత్తా

జ: (సి)

10. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను ఎవరు స్థాపించారు?

ఎ) దయానందుడు   బి) వివేకానందుడు   సి) కేశవచంద్ర సేన్   డి) రామ్మోహన్ రాయ్

జ: (సి)

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్త యుగం - సాంస్కృతిక వికాసం

* భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. హిందూమత పునరుద్ధరణ, భాషా, సాహిత్యాల వికాసం, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటారు.

కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి, 'ఇండియన్ షేక్‌స్పియర్‌'గా పేరొందాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు.

గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం.

వసుబంధు అనే బాస మహాకవి 'స్వప్న వాసవదత్త' అనే గ్రంథాన్ని రాశాడు.

వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు.

శూద్రకుడు మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు.

విశాఖదత్తుడు దేవీచంద్రగుప్తం, ముద్రా రాక్షసం అనే గ్రంథాలను రచించాడు.

అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన 'అమరకోశం' అనే గ్రంథాన్ని రాశాడు.

పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనే పశు వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.

కామందకుడు రచించిన నీతిశాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది.

బెంగాల్‌కు చెందిన చంద్రగోమియా 'చంద్ర వ్యాకరణం' గ్రంథాన్ని రాశాడు.

రామచంద్రుడు అనే కవి 'నాట్య దర్పణం' గ్రంథాన్ని రచించాడు.

రామాయణాన్ని జైనమతానికి అనుగుణంగా రచించింది విమలుడు.

దివాకరుడు అనే కవి న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర అనే గ్రంథాలు రాశాడు.

పాణిని అష్టాధ్యాయి గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు.

గుప్తుల కాలంలో ప్రాకృత భాషను శూరసేన (మగధ ప్రాంతం), అర్ధమగధి (బుందేల్‌ఖండ్ ప్రాంతం), మగధి (బిహార్ ప్రాంతం) లాంటి పేర్లతో పిలిచేవారు.

వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు (వైద్యశాస్త్ర గ్రంథం).

నవరత్నాలు - కాళిదాసు, శంఖువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమర సింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు.

 

                                                            శాస్త్ర విజ్ఞానం

గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి.

గుప్తుల కాలంనాటి గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట.

 ఆర్యభట్ట రచనలు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, లఘు జాతకం. సూర్య సిద్ధాంతం గ్రంథంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణాలు వివరించారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పారు.

వృత్త పరిధికి, వృత్త వ్యాసానికి సరైన π నిష్పత్తిని 22/7 గా చెప్పింది ఆర్యభట్టు.

వరాహమిహిరుడు 'బృహత్ సంహిత' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని గుప్తుల కాలంనాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు.  వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు.

భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు 'ఇండియన్ న్యూటన్‌'గా పేరొందాడు.  (ఖండఖాద్యక, బ్రహ్మస్ఫుటక సిద్ధాంతం అనేవి ఈయన రచనలు)

వివిధ మందులు, ఔషధాల తయారీ విధానం గురించి వివరిస్తున్న గ్రంథం 'నవనీతకం'.

గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందింది ధన్వంతరి.

 ''శుశృత సంహిత'' అనే శస్త్ర చికిత్స గ్రంథాన్ని శుశృతుడు రచించాడు.

వజ్జిక అనే రచయిత 'కౌముది మహోత్సవం' అనే గ్రంథాన్ని రాశాడు.

గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగ లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు రాశాడు

గుప్తుల కాలంనాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు

నాచన్ కుటారా - పార్వతీదేవి దేవాలయం

భూమ్రా - శివాలయం, మధ్యప్రదేశ్

దేవఘడ్ - దశావతార దేవాలయం, మధ్యప్రదేశ్

టిగావా - విష్ణు దేవాలయం, మధ్యప్రదేశ్

బిట్టర్‌గావ్ - ఇటుకల దేవాలయం, ఉత్తర్ ప్రదేశ్

దశావతార దేవాలయ గోడలపై రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కారు.

ఉదయగిరి గుహాలయం (ఒడిశా) వద్ద వరాహ విగ్రహాన్ని చెక్కారు.

గ్వాలియర్ సమీపంలోని పవాయి వద్ద నాట్యగత్తె, సంగీతకారిణుల విగ్రహాలు లభించాయి.

సుల్తాన్‌గంజ్‌లో బుద్ధ విగ్రహం (కంచుతో తయారు చేసింది) ఏడున్నర అడుగుల పొడవుతో లభించింది.

నలందాలో 18 అడుగుల ఎత్తున్న బుద్ధుడి రాగి విగ్రహం లభించింది.

వారణాసిలో కార్తికేయ శిల్పాలు లభించాయి.

గుప్తుల కాలంనాటి ముద్రలు ఎక్కువగా వైశాలిలో లభించాయి.

గుప్తుల కాలంనాటి బుద్ధుడి శిల్పాలు 'తౌమ బుద్ధులు'గా పేరొందాయి.

నాటి శిల్పాలను ఎక్కువగా చూనార్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో చెక్కారు.

సారనాథ్ మ్యూజియంలో బుద్ధ విగ్రహం (సారనాథ్ బుద్ధుడు) యోగిముద్రలో ఉంటుంది.

అజంతా, బాగ్ గుహల్లో గుప్తుల కాలంనాటి చిత్రలేఖనాలు లభించాయి.

అజంతా 16వ గుహలోని 'మరణశయ్యపై రాకుమార్తె' చిత్రం గుప్తుల కాలానిదే.

గుప్తుల శిల్పకళ మహోన్నతి పొందిన హైందవ శిల్పకళ అని విన్సెంట్ స్మిత్ పేర్కొన్నారు.

23 అడుగుల 8 అంగుళాల పొడవున్న మెహరౌలీ ఉక్కు స్తంభం (దిల్లీ) ఇప్పటికీ తుప్పుపట్టలేదు.

''బిట్టర్‌గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది'' అని పెర్సీబ్రౌన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.

హర్షవర్ధనుడు

* గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు.

* హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతడి రాజధాని స్థానేశ్వరం.

* హర్షుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు. తల్లి యశోమతి దేవి. సోదరుడు రాజ్యవర్ధనుడు. సోదరి రాజ్యశ్రీ.

* పుష్యభూతి వంశీకుల పాలన గురించి వివరిస్తున్న శాసనాలు మధుబన్, బాన్స్‌ఖేరా.

* మధుబన్ శాసనం ప్రకారం ప్రభాకరవర్ధనుడు పరమభట్టారక, మహారాజాధిరాజు అనే బిరుదులతో పాలించాడని తెలుస్తోంది.

* బాణుడి హర్షచరిత్రలో ప్రభాకరవర్ధనుడు హూణుల హరిణాలకు (జింకలకు) సింహం లాంటి వాడని పేర్కొన్నారు.

* యశోమతీదేవి భర్తతో సతీసహగమనం చేసింది.

* రాజ్యశ్రీని కనోజ్ పాలకుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించారు.

* గ్రహవర్మ, అతడి మిత్రుడు గౌడ శశాంకుడు కుట్రచేసి రాజ్యవర్ధనుడిని చంపారు.

* హర్షుడు అస్సాం/ కామరూప పాలకుడు భాస్కరవర్మ సహాయంతో గ్రహవర్మ, గౌడ శశాంకుడిని ఓడించాడు.

* మాళ్వారాజు దేవగుప్తుడు గ్రహవర్మను చంపి, కనోజ్‌ను ఆక్రమించాడు.

* హర్షుడు సోదరిని రక్షించి, కనోజ్ పాలకురాలిగా నియమించాడు.

* కనోజ్ ప్రజల కోరిక మేరకు హర్షవర్ధనుడు క్రీ.శ.606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం, కనోజ్‌లను కలిపి పట్టాభిషేకం చేసుకున్నాడు.

* హర్షుడి పాలనాకాలం క్రీ.శ.606 - 647

* హర్షుడి కాలంలో హుయాన్‌త్సాంగ్ అనే చైనా యాత్రికుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు.

* హుయాన్‌త్సాంగ్ రచన 'సియుకి'.

* హుయాన్‌త్సాంగ్ యాత్రికుల్లో రాజు (కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్)గా పేరొందాడు.

* హర్షుడి బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర.

* హర్షుడిని నర్మదా నది యుద్ధంలో ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి.

* రెండో పులకేశి ఐహోలు శాసనంలో హర్షుడిని సకలోత్తర పథేశ్వరుడు అనే బిరుదుతో ప్రస్తావించడం కనిపిస్తుంది.

* హర్షుడు మహామోక్ష పరిషత్, కనోజ్ పరిషత్తులను నిర్వహించాడు.

*ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన సంపదనంతా పేదలకు పంచే కార్యక్రమమే 'మహామోక్ష పరిషత్'. దీన్నే 'ప్రయాగ పరిషత్' అంటారు.

* హర్షుడు మొత్తం ఆరు మహామోక్ష పరిషత్‌లు నిర్వహించాడు. 6వ పరిషత్‌కు హుయాన్‌త్సాంగ్ హాజరయ్యాడు.

* హర్షుడు కనోజ్‌లో హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. దీన్నే 'కనోజ్ పరిషత్' అంటారు.

* హర్షుడు తన రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలుగా విభజించాడు.

* వల్లభి రాజ్య రాజు రెండో ధ్రువసేనుడిని హర్షుడు ఓడించినట్లు నౌశాసితామ్ర ఫలకం (శాసనం) తెలియజేస్తోంది.

* యుద్ధభూమిలో చక్రవర్తే సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. చక్రవర్తికి పాలనలో సహాయపడటానికి సచివులు/అమాత్యులు అనే మంత్రులను నియమించేవారు.

* హర్షుడి ప్రధానమంత్రి పేరు 'భండి'.

యుద్ధమంత్రి - మహాసంధి విగ్రహాధికృత, సైన్యాధికారి - మహాబలాధికృత.

* గజబలాధ్యక్షుడు - కాటుక, విదేశీ కార్యదర్శి - రాజస్థానీయ.

* హర్షుడి కాలంలో రాష్ట్రాలను భుక్తులు అని, జిల్లాలను విషయాలు అని పిలిచారు

భుక్తి అధిపతిని ఉపరిక/గోస్త్రీ అని పిలిచేవారు.

* నాడు రహదారులు క్షేమంగా లేవని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.

* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.630లో భారతదేశానికి వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. (సి-యు-కి అంటే పశ్చిమ ప్రపంచ ప్రతులు)

* హర్షుడు యుద్ధం, శాంతి కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడని ఆర్.సి. మజుందర్ పేర్కొన్నారు.

* నాటి కాలంలో మగధ వరి పంటకు ప్రసిద్ధి చెందింది.

* నాడు భూమి శిస్తు పంటలో 1/6వ వంతు ఉండేది. భూమి శిస్తును 'ఉద్రంగ' అనేవారు. భూమి శిస్తు కాకుండా మరో 18 రకాల పన్నులు వసూలు చేసేవారు.

* హర్షుడు వివిధ స్థాయుల్లో పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ద్రువాధికరణ, గౌల్మిక లాంటి అధికారులను నియమించాడు.

* గ్రామంలో పన్ను వసూలు కోసం అక్షపటలిక, కరణిక్ అనే ఉద్యోగులను నియమించాడు.

* వస్తువు బరువు ఆధారంగా 'తుల్యమేయ' పేరుతో అమ్మకం పన్నును వసూలు చేసేవారు.

* భారతదేశంలో వ్యవసాయ రంగంలో తొలిసారిగా నీటివేగంతో నడిచే తులాయంత్రాలను ప్రవేశపెట్టింది హర్షుడే.

* హర్షుడి కాలంలో మౌఖరీ వంశీయులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశారు.

* హర్షుడు నలందా విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసినట్లు హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.

* హర్షుడి ఆస్థానకవి బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు.

* హర్షుడు సంస్కృత భాషలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలు రాశాడు.

* సుభాషిత శతకం - భర్తృహరి, సూర్యశతకం - మయూరుడు. వీరు హర్షుడి ఆస్థానంలో ఉండేవారు.

* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.645లో ఉదిత అనే సహాయకుడితో చైనా చేరాడు.

* గౌడ శశాంకుడు వంగ, మగధ, ఒరిస్సాలను 'మహారాజాధిరాజ' బిరుదుతో పాలించినట్లు గంజాం శాసనం తెలుపుతోంది.

* నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని 'ధర్మఘంజ్' అనేవారు.

* ధర్మపాల, ఆర్యదేవ, శీలభద్ర లాంటి ఆచార్యులు నలందా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.

* స్థిరమతి, గుణమతి లాంటి ఆచార్యులు వల్లభి విశ్వవిద్యాలయంలో పనిచేశారు.


వాస్తు, కళారంగాలు


* గుప్తుల కాలంనాటికి నగర, ద్రవిడ శైలులు రూపాంతరం సంతరించుకున్నాయి.

* గుప్తుల వాస్తు నిర్మాణంలో ప్రధానమైనవి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాలు.

* మహారాష్ట్రలోని అజంతా గుహలు, మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహలు గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందాయి.

*గుప్తుల కాలంలో సారనాథ్ (ఉత్తర్ ప్రదేశ్), రత్నగరి (ఒడిశా), మీర్‌పూర్‌ఖాన్ (సింధు) ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు.

* మధ్యప్రదేశ్‌లోని భూమ్రాలో శివాలయాన్ని నిర్మించారు.

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్త యుగం  

 గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్త రాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్తులకాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది.

గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:

    1. పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు.

   2. సాహిత్య ఆధారాలు.

 

శాసనాలు

మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని 'మహారాజ' బిరుదుతో పేర్కొంది. స్కంధగుప్తుడి భిలారి శాసనం హూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని (సంధి విగ్రాహి) హరిసేనుడు వేయించాడు.

* ఎరాన్ శాసనం గుప్తుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలీ (దిల్లీ) ఉక్కు స్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి.

* గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే, మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు.

సాహిత్యం

       మొదటి చంద్రగుప్తుడి కాలంనాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలంనాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రాసిన 'నారదస్మృతి', 'బృహస్పతి స్మృతి' లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన 'దేవీ చంద్రగుప్తం' నాటకం రామగుప్తుడు శక రాజైన బసన చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జికుడు రచించిన 'కౌముదీ మహోత్సవం' గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన 'మూలకల్ప' గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీ.శ.672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చీ-లి-కిటో (శ్రీగుప్తుడు) అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన 'తిలస్య పన్నాటి' అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో-కువో-కి గ్రంథంలో వివరించాడు.

 

రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 375 - 415)

      ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి, వదిన ధ్రువాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ పాటలీపుత్రంలో మూడు సంవత్సరాలు, తామ్రలిప్తిలో రెండు సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో 'నవ రత్నాలు' అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి, ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతీ గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి, 'శకారి' అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనానియైన అమరకర దేవుడు బౌద్ధ మతాభిమాని. మంత్రి శబర వీరసేనుడు శైవ మతాభిమాని. దిల్లీలోని మెహరౌలీ ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే.

 

చివరి గుప్త చక్రవర్తులు

     మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కంధగుప్తుడు హూణుల దండయాత్రను తిప్పికొట్టాడు. కానీ స్కంధగుప్తుడు రాజైన తర్వాత హూణులు గుప్త రాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయ్యింది. ఇతడు హూణుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్త వంశం అంతమైంది.

 

పాలనా విశేషాలు

      గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. విషయపతి జిల్లాలకు (విషయాలకు) అధిపతిగా, భుక్తులకు ఉపరిక అధిపతిగా ఉండేవాడు. గ్రామాధిపతిని గ్రామైక అనేవారు. అయిదుమంది సభ్యులున్న నగరసభ విషయపతికి పరిపాలనలో తోడ్పడేది. గ్రామంలో ఉండే సభను పంచ మండలం సభ అనేవారు. చక్రవర్తి మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలి సహాయంతో పరిపాలించడం వల్ల మంత్రి మండలి నాయకుడిని మంత్రి ముఖ్యుడు అనేవారు. నైతిక, ధార్మిక విషయాల్లో పురోహితుడు కీలకపాత్ర పోషించేవాడు. రాష్ట్రాలకు (భుక్తులకు) యువ రాజులను అధిపతులుగా నియమించేవారు. వారిని 'కుమారామాత్య' అనేవారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు. మొత్తంగా గుప్తుల కాలంలో పాలన వికేంద్రీకృత పాలనగా ఉండేది.

 

రెవెన్యూ పాలన

     గుప్తుల కాలంలో 1/6వ వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. ఫాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్‌పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికున్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిని 'క్షేత్రం' అనేవారు. నివాసయోగ్యమైన భూమిని 'వస్తి' , అటవీ భూమిని 'అప్రహత' , పచ్చిక బయళ్లను 'గపధసార' , బంజరు భూములను 'ఖిలం' అని పేర్కొనేవారు.

 భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని 'పుస్తపాల' అనేవారు. నాటి ప్రధాన న్యాయమూర్తి 'మహా దండనాయక'. ఆ కాలంలో విధించే శిక్షల గురించి ఫాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. మహా సేనాపతి, రణభండారిక లాంటి సైనికాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధానపాత్ర పోషించేవారు. ఆ కాలంలో  యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. ప్రత్యేక యుద్ధమండలి కూడా ఉండేది.  పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండటం గొప్ప విషయం. మంత్రి మండలికి, చక్రవర్తికి మధ్య సంధాన కర్తగా 'కంచుకి' అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు.

 

ఆర్థిక విషయాలు

    గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి 'పహాడ్‌పూర్' శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను (అగ్రహారాలు) దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలందా, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను 'ఉక్కకల్ప' మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను 'దేవాగ్రహారాలు' అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పుళిందభట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా రెండు గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి.
  రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్ఛ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్థవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది.

 

సాంఘిక, మత పరిస్థితులు

      వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఛండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాసీ ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం/ హిందూమతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు 'పరమ భాగవత' అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజ చిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. స్కంధగుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి, వామనుల కథనాన్ని వివరించారు. మౌఖరీ వంశస్థుడైన అనంతవర్మబారాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహ అవతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఎరాన్‌లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు.

 

రాజకీయ చరిత్ర

    గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీ గుప్తుడిని చిలికిత (చీ-లీ-కిటో) మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోద్గజ గుప్తుడు 'మహారాజు' బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్ఛవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. 'రాజాధిరాజ' బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీ.శ.335 - 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి, సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది.

     హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి, వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగి రాజు హస్తివర్మ (శాలంకాయన రాజు), కంచి పాలకుడు విష్ణుగోపుడు (పల్లవ రాజు) ముఖ్యమైనవారు.

     ఆంగ్ల చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని కీర్తించాడు. 'కవిరాజు', 'అశ్వమేధ యోగి' లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతినాగ, అచ్యుతనాగ, లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుడిని ఓడించి, అశ్వమేధ యాగం చేసి 'అశ్వమేధ యోగి' బిరుదు పొందాడు. ఇంకా అయిదు సరిహద్దు రాజ్యాలను, తొమ్మిది ఆటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు, శక రాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు, రెండో చంద్రగుప్తుడు బసనను, రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది.

 

నాణేలు

     గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. వీరు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్ర గుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి, 'అశ్వమేధ యోగి' బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను 'దీనార్', 'కారా', 'సువర్ణ' అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై 'మహా రాజాధిరాజ శ్రీచంద్రగుప్త' అనే బిరుదును ముద్రించారు. గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించింది రెండో చంద్రగుప్తుడే. రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమభాగవత, మహారాజాధిరాజు బిరుదులను, మరో వైపు గరుడి (గద్ద) బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు.

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభం

* మధ్యయుగంలో క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య జరిగిన మత యుద్ధాలను 'క్రూసేడులు' అంటారు.

* క్రైస్తవులు, మహమ్మదీయులకు పవిత్ర స్థలాలైన పాలస్తీనా, జెరూసలెం, బెత్లెహం ప్రదేశాలను ఆక్రమించడానికి ఈ యుద్ధాలు జరిగాయి.

*క్రీ.శ.1453లో అప్పటి టర్కీ సుల్తాన్ మహమ్మద్ - II గ్రీకు సంస్కృతికి నిలయమైన కాన్‌స్టాంటినోపుల్ నగరంపై దండెత్తి ఆక్రమించాడు. ఆ సమయంలో గ్రీకు పండితులు తమ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలతో యూరప్‌ దేశాలకు వెళ్లారు.

* ఈ విద్వాంసులు యూరప్ అంతటా పాఠశాలలు, మఠాలను స్థాపించి ప్రాచీన గ్రీకు సంస్కృతి, సాహిత్యాలను పునరుద్ధరించడానికి వారు తెచ్చిన గ్రంథాలను బోధించారు.

* ఈ ప్రాచీన సంస్కృతి, సాహిత్యాల పునరుద్ధరనను 'సాంస్కృతిక పునరుజ్జీవనం' లేదా 'రినేజాన్సు' అంటారు.

* కాన్‌స్టాంటినోపుల్ పతనం కంటే ముందుగానే ఇటలీ సాహిత్య రంగంలో రినేజాన్సు ప్రారంభమైంది.

* పెట్రార్క్, డాంటే, బాకాషియో లాంటి రచయితలు తమ రచనల ద్వారా వర్జిల్, సిసిరో, లెవీ, హోరాస్ లాంటి ప్రాచీన రచయితల సాహిత్యాన్ని చదవమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా విద్యా విధానాన్ని సంస్కరించవచ్చని సూచించారు.

* రోమన్‌ల ప్రాచీన భాష 'లాటిన్' కూడా ప్రాముఖ్యాన్ని కోల్పోయింది.

* క్రీ.శ.15వ శతాబ్దపు యూరోపియన్ రచయితలు తమ దేశాల్లో ప్రజలు వాడే ప్రాంతీయ భాషలోనే రచనలు చేయడం ప్రారంభించారు. అనేక దేశాల రచయితలు బైబిల్‌ను తమ దేశ భాషల్లోకి అనువదించారు.

* శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడంతో వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం లాంటి రంగాల్లో పరిశోధనలు జరిగాయి.

* అచ్చుయంత్రాన్ని కనుక్కోవడం, పేపరు తయారుచేయడం వల్ల సైన్స్, సాహిత్య రంగాల్లో అభివృద్ధి చెందిన విజ్ఞానాన్ని ప్రజలు చదవగలిగారు.

* నావికా దిక్సూచిని కనుక్కోవడం వల్ల సముద్ర ప్రయాణాలు సులభమయ్యాయి.

* కాన్‌స్టాంటినోపుల్ నగరాన్ని తురుష్కులు స్వాధీనం చేసుకున్నారు.

* క్రీ.శ.15వ శతాబ్దం వరకు యూరోపియన్ వర్తకులు కాన్‌స్టాంటినోపుల్ ద్వారా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలతో వర్తకం చేయడానికి ప్రయాణించిన భూమార్గాన్ని తురుష్కులు మూసివేశారు. ఫలితంగా వారు సముద్ర మార్గాలను అన్వేషించి ఆసియా, ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం కొనసాగించారు. అదే సమయంలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని,  కొలంబస్ అమెరికాను కనుక్కున్నారు.

* సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా అప్పటి యూరోపియన్ ప్రజలు ప్రతి విషయాన్ని ప్రశ్నించి, తర్కించి, పరిశోధించి, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నేర్చుకోవడం ప్రారంభించారు. దీని వల్ల ప్రజల్లో రాజులు దైవాంశ సంభూతులనే భావం ఏర్పడి వారి నిరంకుశాధికారాన్ని ప్రజలు ధిక్కరించారు.

* రాజకీయ, సామాజిక, మత రంగాల్లో వచ్చిన ఈ మార్పులు యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభానికి నాంది పలికాయి.  ఫలితంగా భూస్వామ్య వ్యవస్థ క్షీణించి దాని స్థానంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది.

* పెట్టుబడిదారీ విధానాన్ని ప్రయివేటు వ్యక్తులు తమ లాభార్జన కోసం ఉత్పత్తి పంపకాలను సొంతం చేసుకునే ఒక ఆర్థిక విధానంగా నిర్వచించారు.

పారిశ్రామిక విప్లవం

* విప్లవం అంటే ఏదైనా రంగంలో వచ్చే ఆకస్మికమైన మార్పు.

* పరిశ్రమల్లో ఉపయోగపడే కొత్త యంత్రాలను కనిపెట్టి వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని 'పారిశ్రామిక విప్లవం' అని అంటారు. పరిశ్రమల్లో యంత్రాల వాడకం మొదట ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది.

* స్పిన్నింగ్ జెన్నీ అనే కొత్త యంత్రాన్ని వస్త్రాల నేతకు ఉపయోగించడం, ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడంతో ఇంగ్లండ్‌లో వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.

* ఇతర పరిశోధనలు అంటే బ్లాస్ట్‌ఫర్నేస్ గనుల్లో ఉపయోగించే రక్షిత దీపం, విద్యుచ్ఛక్తి, టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో లాంటివి పారిశ్రామిక విప్లవాన్ని మరింత శక్తిమంతం చేశాయి.

సామ్రాజ్యవాదం ఆవిర్భావం

* బ్రిటిష్ సామ్రాజ్యం బర్మాకి కూడా విస్తరించింది. ఆఫ్రికాలోని చాలా భాగంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యూరోపియన్‌ల సామ్రాజ్యవాదం వ్యాపించింది.
ప్రపంచంలోని ముఖ్య సంఘటనలు - భారతదేశంపై వాటి ప్రభావం

అమెరికా, ఫ్రాన్స్‌లో విప్లవాలు

* 18వ శతాబ్దపు ద్వితీయార్థంలో వచ్చిన అమెరికా స్వాతంత్య్ర యుద్ధం, ఫ్రెంచి విప్లవం ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగినవి.

* బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో 13 వలస రాజ్యాలను స్థాపించింది. ఆ రాజ్యాల్లోని ప్రజలంతా ఇంగ్లండ్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఇంగ్లండ్‌ ప్రజలు అనుభవించే హక్కులను కల్పించలేదు.

* ఇంగ్లండ్, ఫ్రాన్స్‌కు చెందిన తత్వవేత్తలు తమ రచనల ద్వారా మానవుడికి స్వేచ్ఛగా, ఆనందంగా జీవించే హక్కు ఉందని ఉద్ఘాటించారు.

* బ్రిటిష్ ప్రభుత్వం ఈ హక్కులను తిరస్కరించడం, గుర్తించకపోవడం అమెరికా స్వాతంత్య్ర యుద్ధానికి కారణమైంది. ఫలితంగా అమెరికాలోని ఆంగ్ల వలసలు స్వాతంత్య్రం పొందాయి. క్రీ.శ.1783లో అమెరికా సర్వసత్తాక రాజ్యంగా ఏర్పడింది.

* ఫ్రాన్స్‌లో సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉండేది. వీరంతా అమెరికా స్వాతంత్య్ర యుద్ధం నుంచి స్ఫూర్తిని పొందారు. ఫలితంగా అప్పటి ఫ్రెంచి చక్రవర్తి లూయీ XVIకి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో తిరుగుబాటు జరిగింది.

* క్రీ.శ.1789, జులై 14న ఫ్రాన్స్‌లో విప్లవం ప్రారంభమైంది. విప్లవకారులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాటం చేశారు. పారిస్‌లోని బాస్టిలు జైలు తలుపులు పగులగొట్టి ఖైదీలందర్నీ విడిపించారు.* ఫ్రాన్స్‌లో ఏటా ఈ రోజును జాతీయదినంగా జరుపుకుంటారు.

* మానవులంతా పుట్టుకతోనే స్వేచ్ఛా జీవులని, వారు స్వేచ్ఛగానే జీవిస్తారని, వారందరికీ అన్ని హక్కులు సమానమేనని ఈ విప్లవం ప్రకటించింది. ఈ రెండు విప్లవాలు ప్రపంచమంతటా జాతీయ భావాలను బలపడేలా చేశాయి.

* జాతీయభావం అంటే ఒకే భాష మాట్లాడుతూ, ఒకే మతాన్ని పాటించే, ఒకే జాతికి చెందిన ప్రజలు ఒకే ప్రభుత్వం అధీనంలో ఉండాలని కోరుకోవడం.

* 19వ శతాబ్దంలో జర్మన్, ఇటలీలు తమ దేశాల ఏకీకరణ కోసం ఆయా భాషలు మాట్లాడే ప్రజలు ఒకే ప్రభుత్వం కిందకు వచ్చేందుకు పోరాడి సఫలమయ్యారు.

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సాంఘిక సంస్కరణల కోసం మహమ్మదీయుల ఉద్యమాలు

* మహమ్మదీయుల్లోని కులవ్యవస్థ, పరదా పద్ధతి లాంటి దురాచారాలను రూపుమాపడానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని బెరైలికి చెందిన సయ్యద్ అహ్మద్ ఖాన్, బెంగాల్‌కు చెందిన షరియతుల్లా కృషిచేశారు.

* షరియతుల్లా ఫైరైజి ఉద్యమానికి నాయకత్వం వహించాడు.

* నవాబ్ అబ్దుల్ లతీఫ్ (1828 - 1893) 'మహమ్మదన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా' అనే సంస్థను 1863లో స్థాపించాడు. ఈ సంస్థ కూడా మహమ్మదీయుల సంస్కరణల కోసం కృషి చేసింది.

* అబ్దుల్ లతీఫ్ హిందూ, మహమ్మదీయుల ఐక్యతకు; మహమ్మదీయల్లో విద్యావ్యాప్తికి కృషిచేశాడు.

* సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (1817 - 1898) మొగల్ దర్బారుకు చెందిన గొప్ప వంశస్థుడు. ఇతడు 1875లో అలీఘర్‌లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఇది తర్వాతి కాలంలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది.

* మహమ్మదీయుల్లో సాంఘిక జాగృతి కోసం సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో చేసిన ఉద్యమాన్ని 'అలీగఢ్ ఉద్యమం' అంటారు. ఇతడు హిందువులు, ముస్లింలు భారతీయులేనని విభేదాలు ఉండకూడదని బోధించాడు

ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (1820 - 1891):

* ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1820లో బెంగాల్‌లోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సంస్కృతాన్ని అభ్యసించిన గొప్పవిద్వాంసుడు. కలకత్తాలోని సంస్కృత కళాశాల ఇతడికి 'విద్యాసాగర్' అనే బిరుదును ఇచ్చి గౌరవించింది. సమాజానికి అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి బెంగాలీ పత్రికల్లో ఉత్తేజపరిచే రచనలు చేశాడు.

* అనేక మంది సంఘ సంస్కర్తలు వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్యకు కృషి చేశారు. వారిలో కందుకూరి వీరేశలింగం (1848 - 1919), నారాయణ గురు (కేరళ) ముఖ్యమైనవారు.

సాంస్కృతిక జాగృతీ ప్రభావం:

* యూరోపియన్ విద్వాంసులు భారత సాహిత్యాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో విలియం జోన్స్ మార్గదర్శకత్వం వహించి 'ఏషియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు.

* విలియం జోన్స్ కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలాన్ని' ఆంగ్లంలోకి అనువదించాడు.

* 19వ శతాబ్దపు విద్వాంసులు మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి శాసనాలను అనువదించారు.

* ఏషియాటిక్ సొసైటీ ఈ రచనలన్నింటినీ ముద్రించింది. భారతీయులు ఈ గ్రంథాలను చదివి ప్రాచీన భారతదేశ సంస్కృతిని, నాగరికతను తెలుసుకోగలిగారు.

సాహిత్యం, భాష, కళలు:

* మనదేశంలో 19వ శతాబ్దంలోని సాహిత్యం ప్రాచీన సాహిత్యం కంటే భిన్నమైంది.

* ప్రాచీన సాహిత్యం పద్య, శ్లోకాల రూపంలో ఉండేది. 19వ శతాబ్దంలో గద్య రచనలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉండేది.

* భరతేందు హరిశ్చంద్ర (1850 - 1885) ఆధునిక హిందీ సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు.

* బంకించంద్ర ఛటోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటివారు బెంగాలీ సాహిత్యంలో మార్గదర్శకులు.

* రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'జనగణమన' స్వతంత్ర భారతదేశానికి జాతీయ గీతం అయ్యింది. ఠాగూర్ సాహిత్య కృషికి 1913లో అత్యున్నత అంతర్జాతీయ నోబెల్ పురస్కారం లభించింది.

* బంకించంద్ర రాసిన 'వందేమాతరం', మహమ్మద్ ఇక్బాల్ రచించిన 'సారేజహాసే అచ్ఛా' గేయాలను ప్రజలు దేశభక్తి ప్రబోధకాలుగా పాడుకుంటున్నారు.

* గురజాడ అప్పారావు - తెలుగు, హరినారాయణ - మరాఠీ, సుబ్రమణ్య భారతి - తమిళం, హేమచంద్ర బారువా - అసోం, ఫకీర్ మోహన్ సేనాపతి - ఒరియా, కె.వి. పుట్టప్ప - కన్నడ; కుమరన్ ఆసన్, వి.కె. నారాయణ మీనన్ - మళయాళం భాషల్లో ప్రసిద్ధ రచయితలు. వీరంతా 19వ, 20వ శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో రచనలు చేసి సొంత భాషల్లో సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

* భారతదేశ గ్రామాల్లోని పేదరికాన్ని ప్రేమ్‌చంద్ తన హిందీ రచనల్లో వర్ణించాడు.

* రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రలేఖనాన్ని శాస్త్రీయంగా అభ్యసించాడు. దీనికోసం బెంగాల్‌లో పాఠశాలను స్థాపించాడు.

*రాజారామ్మోహన్ రాయ్ రామాయణ, మహాభారత గాథలను; అమృతా షేర్గిల్ భారతీయుల నిత్యజీవితాలను, నందలాల్ బోస్ వృత్తి పనుల వారి నిత్యజీవితాలను, ప్రాచీన గాథలను, స్వాతంత్య్రోద్యమంలోని కొన్ని ఘట్టాలను చిత్రాల రూపంలో చూపారు.

పత్రికల అభివృద్ధి, వాటి పాత్ర:

* ది హిందూ, అమృత్‌బజార్, ది మరాఠా, ది ఇండియన్ మిర్రర్, ది స్వదేశ్ మిత్రన్, ది ప్రభాకర్, ది ఇందు ప్రకాశ్ లాంటి పత్రికలు భారత ప్రజలను ఉత్తేజపరచి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేలా చేశాయి.

సైన్సు అభివృద్ధి:

* ప్రాచీన భారతదేశ విద్యావిధానంలో సైన్సును బోధించేవారు కాదు.

* రాజారామ్మోహన్ రాయ్ లాంటివారు ఆంగ్ల విద్యను అభ్యసించాలని, తద్వారా సైన్సు చదవడంతో భారతదేశం అభివృద్ధి చెందుతుందని భావించారు.

* 19వ శతాబ్దపు ఆరంభంలో సైంటిఫిక్ సొసైటీలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా భారతదేశంలో సైన్సు అభివృద్ధి చెందింది.

* మహేందర్‌లాల్ సర్కార్ మొదటి వైద్య విద్యార్థి. ఇతడు 1876లో సైన్సు అభివృద్ధికి 'ఇండియన్ అసోసియేషన్' అనే సంస్థను ఏర్పాటు చేశాడు.

* 20వ శతాబ్దంలో 'ఇండియన్ సైన్సు కాంగ్రెస్ అసోసియేషన్‌'ను స్థాపించారు.

* 1930లో సర్ సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన కృషికిగానూ ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.

*శ్రీనివాస రామానుజన్ గణితంలో; మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో ప్రసిద్ధులు.

* విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పని చేసి, దేశానికి విశిష్ట సేవలందించారు. జల విద్యుదుత్పత్తి, ఆనకట్టల నిర్మాణం, పట్టు పరిశ్రమాభివృద్ధికి కృషి చేశారు.

* ప్రఫుల్ల చంద్ర రే, సత్యేంద్రనాథ్ బోస్, జగదీష్ చంద్ర బోస్, డి.ఎన్. వాడియా, బీర్బల్ సహాని, మేఘనాథ్ సాహ లాంటివారు సుప్రసిద్ధ శాస్త్ర విజ్ఞానవేత్తలు.

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయోద్యమం

1. భారతదేశంలో ఏర్పడిన తొలి రాజకీయ సంస్థ ఏది?

జ: బెంగాల్ భూస్వాముల సంఘం

2. అకడెమిక్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు?

: హెన్రీ డిరోజియో

3. కింది సంస్థలను, వాటి స్థాపక సంవత్సరాలతో జత చేయండి.

I) బెంగాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్

A) 1870

II) బొంబాయి అసోసియేషన్

B) 1853

III) మద్రాస్ నేటివ్ అసోసియేషన్

C) 1852

IV) పూనా సార్వజనిక సభ

D) 1851

జ: I-D, II-C, III-B, IV-A

4. లండన్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు?

జ: దాదాభాయ్ నౌరోజీ

5. 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ ఎవరితో కలిసి ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు?

జ: ఆనందమోహన్ బోస్

6. 1884లో మద్రాస్ మహాజన సభను స్థాపించింది ఎవరు?

జ: సుబ్రహ్మణ్య అయ్యర్

7. ఆధునిక జాతీయతాభావ పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?

జ: స్వామి వివేకానంద

8. 'ఇల్బర్ట్ బిల్లు భారతీయులకు నేర్పిన గుణపాఠాన్ని విద్యావంతులైన భారతీయులెవరూ మర్చిపోరు' అని వ్యాఖ్యానించింది ఎవరు?

జ: థాంప్సన్ గారట్

9. 1883లో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎవరు?

జ: సురేంద్రనాథ్ బెనర్జీ

10. భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి సరికానిది?

జ: కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాక వర్గాల సంస్థగా విలియం వెడ్డర్‌బర్న్ వ్యాఖ్యానించారు.

11. తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హజరైన సభ్యుల సంఖ్య?

జ: 72

12. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర పుస్తక రచయిత?

జ: భోగరాజు పట్టాభి సీతారామయ్య

13. కింది అంశాలను జతపరచండి.

I) జార్జి యూలె

A) మద్రాస్

II) బద్రుద్దీన్ త్యాబ్జి

B) అలహాబాద్

III) సరోజినీ నాయుడు

C) నాగ్‌పుర్

IV) పి. ఆనందాచార్యులు

D) కాన్పూర్

జ: I-B, II-A, III-D, IV-C

14. 'ఇండియా' అనే పత్రికను ప్రారంభించింది ఎవరు?

జ: దాదాభాయ్ నౌరోజీ

15. 1924లో గాంధీజీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఏది?

జ: బెల్గాం

16. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నదెవరు?

జ: జె.బి. కృపలానీ

17. మితవాద యుగానికి సంబంధించి కిందివాటిలో సరైన అంశం?

జ: రొట్టె కోసం పోరాడిన మితవాదులు రాళ్లు కూడా సంపాదించ లేకపోయారని తిలక్ విమర్శించారు.

18. బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్రగా వ్యాఖ్యానించింది ఎవరు?

జ: దాదాభాయ్ నౌరోజీ

19. వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను, భారత తంతి సమాచార సంఘాన్ని స్థాపించింది ఎవరు?

జ: ఎ.ఒ. హ్యూమ్

20. భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆ పేరు సూచించింది ఎవరు?

జ: దాదాభాయ్ నౌరోజీ

21. బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడిగా పేరొందిన దాదాభాయ్ నౌరోజీ ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?

జ: సెంట్రల్ ప్రిన్స్‌బరి

22. 'స్వదేశీ' అనే పదాన్ని తొలిసారిగా తీర్మానించింది, ప్రతిపాదించింది ఎవరు?

జ: దాదాభాయ్ నౌరోజీ

23. 1892 భారత కౌన్సిళ్ల చట్టాన్ని 'బిక్షగాడి జీవితం లాంటిది' అని వ్యాఖ్యానించింది ఎవరు?

జ: ఫిరోజ్ షా మెహతా

24. 'ఎ నేషన్ ఇన్ మేకింగ్' అనే గ్రంథ రచయిత ఎవరు?

జ: సురేంద్రనాథ్ బెనర్జీ

25. మహారాష్ట్ర సోక్రటీస్‌గా బిరుదు పొందిన వ్యక్తి ఎవరు?

జ: గోపాలకృష్ణ గోఖలే

26. రాజద్రోహ నేరంపై అరెస్ట్ అయిన తొలి భారతీయుడు ఎవరు?

జ: తిలక్

27. 1905 లో 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' అనే సంస్థను స్థాపించింది ఎవరు?

జ: గోపాలకృష్ణ గోఖలే

28. గోపాలకృష్ణ గోఖలేను 'భారతదేశపు వజ్రం'గా పేర్కొన్నది ఎవరు?

జ: తిలక్

29. 1905లో అతివాదం తలెత్తడానికి కారణం కాని అంతర్జాతీయ సంఘటన ఏది?

జ: 1905లో కర్జన్ బెంగాల్ విభజన చేయడం

30. 1858 విక్టోరియా మహారాణి ప్రకటనను భారతదేశంలో మానవ హక్కుల మాగ్నా కార్టాగా పేర్కొన్నది ఎవరు?

జ: సురేంద్రనాథ్ బెనర్జీ

31. 'దేశ భక్తుల్లో రాజు'గా పేరొందిన జాతీయ నాయకుడు ఎవరు?

జ: తిలక్

32. అమెరికా నుంచి హోంరూల్ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఎవరు?

జ: లాలాలజపతిరాయ్

33. 1906 లో కలకత్తాలో శివాజీ ఉత్సవాలను రాజకీయ పండుగగా నిర్వహించిన వ్యక్తి ఎవరు?

జ: బాలగంగాధర తిలక్

34. వందేమాతరం (ఉర్దూ), పీపుల్ (ఆంగ్లం) పత్రికలను నిర్వహించింది ఎవరు?

జ: లాలాలజపతిరాయ్

35. భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి 'పైసా ఫండ్' ఏర్పాటు చేసింది ఎవరు?

జ: బాలగంగాధర తిలక్

36. మాజినీ (ఇటలీ)ని తన రాజకీయ గురువుగా పేర్కొన్న అతివాద నాయకుడు ఎవరు?

: లాలాలజపతిరాయ్

37. 'మనపై పడే ప్రతీ దెబ్బ ఆంగ్లేయులు స్వయంగా నిర్మించుకుంటున్న శవపేటికలోకి దిగుతున్న ఒక్కొక్క మేకు' అని వ్యాఖ్యానించింది ఎవరు?

జ: పంజాబ్ కేసరి

38. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని 1921లో స్థాపించిన నాయకుడు ఎవరు?

జ: లాలాలజపతిరాయ్

39. న్యూ ఇండియా అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించింది ఎవరు?

జ: బిపిన్ చంద్రపాల్

40. పాండిచ్చేరి యోగిగా పేరొందిన అతివాది ఎవరు?

జ: అరవిందో ఘోష్

41. వందేమాతర ఉద్యమ కాలంలో 'అమర్‌సోనార్ బంగ్లా' గీతాన్ని రచించింది ఎవరు?

: రవీంద్రనాథ్ ఠాగూర్

42. ఇండియన్ నేషనలిజం అనే గ్రంథ రచయిత ఎవరు?

: బిపిన్ చంద్రపాల్

43. వందేమాతర ఉద్యమ కాలంలో నెలకొల్పిన బెంగాల్ జాతీయ కళాశాల తొలి ప్రిన్సిపాల్ ఎవరు?

జ: అరవిందో ఘోష్

44. ఏ రోజును జాతీయ సంతాప దినంగా పాటిస్తారు?

జ: 1905, అక్టోబరు 16

45. భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

జ: 1886

46. భారత జాతీయ కాంగ్రెస్ తొలి నామం?

జ: ఇండియన్ నేషనల్ యూనియన్

47. 1909 నాటి ఆలీపూర్ బాంబు కేసులో అరెస్టయిన అరవిందో ఘోష్‌ను నిర్దోషిగా నిరూపించింది ఎవరు?

జ: చిత్తరంజన్ దాస్

48. ది లైఫ్ డివైన్, సావిత్రి గ్రంథాలను రచించింది ఎవరు?

జ: అరవిందుడు

49. ఢిల్లీలో స్వదేశీ/ వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు?

జ: సయ్యద్ హైదర్‌రజా

50. 1905, జులై 19న బెంగాల్ విభజన జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది

జ: 1905, అక్టోబరు 16

51. 1905లో బెనారస్‌లో జరిగిన మొదటి భారత పరిశ్రమల సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?

జ: రమేష్‌చంద్ర దత్

52. వందేమాతర ఉద్యమానికి సంబంధించి కిందివాటిలో సరైన అంశం ఏది?

ఎ) ఆంధ్రాలో కాకినాడ బాంబు కేసు సంఘటన జరిగింది.

బి) తమిళనాడులో చిదంబరం పిళ్త్లె స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు.

సి) ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ ఉద్యమాన్ని ప్రచారం చేశారు.

డి) పి.సి. రే బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ స్థాపించారు.

జ: బి, సి, డి సరైనవి

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అసఫ్‌జాహీ యుగం - నిజాం పాలన

   క్రీ.శ.1724లో నిజాం ఉల్‌ముల్క్ మొగలుల అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి వంశీయులు క్రీ.శ.1948 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ కాలాన్నే అసఫ్‌జాహీయుగం లేదా నిజాంల పాలనగా పేర్కొంటారు.

 

     నిజాం ఉల్‌ముల్క్

ఇతడు నిజాంల మొదటి పాలకుడిగా పేరు పొందారు. అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. మొగలుల కొలువులో పని చేస్తున్న సమయంలో ఔరంగజేబ్ 'చిన్ - ఖిలిజ్ - ఖాన్' అనే బిరుదిచ్చాడు. చిన్ - ఖిలిజ్ - ఖాన్ అంటే కుర్రకత్తి వీరుడు అని అర్థం. అనంతరం మొగల్ చక్రవర్తి ఫరూక్‌షియర్ నిజాం ఉల్‌ముల్క్, ఫతేజంగ్ బిరుదులను ప్రదానం చేశాడు. మరో మొగల్ చక్రవర్తి మహ్మద్‌షా ఇతడికి అసఫ్ జా అనే బిరుదు ఇచ్చాడు. నిజాం ఉల్‌ముల్క్ ముబారిజ్‌ఖాన్ సైన్యాలను 1724 నాటి షక్కర్‌ఖేడ యుద్ధంలో ఓడించి, ఔరంగాబాద్ రాజధానిగా అసఫ్‌జాహీ పాలనను ప్రారంభించాడు. తన రాజ్యాన్ని ఆరు సుబాలు (బీరర్, బీదర్, బీజాపూర్, ఖాందేష్, హైదరాబాద్, ఔరంగాబాద్)గా విభజించాడు. షాకిర్ (సంతృప్తుడు) అనే కలం పేరుతో కవితలు రాసేవాడు. 1748, మే 22న బర్దాన్‌పూర్ వద్ద మరణించాడు.

 

 నాజర్‌జంగ్

   నిజాం ఉల్‌ముల్క్ మరణానంతరం అతడి కుమారుడు నాజర్‌జంగ్ పాలనాధికారాలు చేపట్టాడు. కానీ నిజాం ఉల్‌ముల్క్ కుమార్తె పుత్రుడు (మనవడు) ముజఫర్‌జంగ్ వారసత్వ పోరులో కర్నూలు నవాబు హిమ్మత్‌ఖాన్‌తో నాజర్‌జంగ్‌ను హత్య చేయించాడు. ఈ పోరులో ఫ్రెంచి వారు ముజఫర్‌జంగ్‌కు సహాయపడగా, ఆంగ్లేయులు నాజర్‌జంగ్ పక్షం వహించారు.

 

ముజఫర్‌జంగ్

 ఫ్రెంచివారి సాయంతో పాలకుడైన ముజఫర్‌జంగ్ వారికి మచిలీపట్నం, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో అధికారం కల్పించాడు. తన ఆస్థానంలో ఉండే ఫ్రెంచి అధికారికి హైదర్‌జంగ్ అనే బిరుదు ఇచ్చాడు. డూప్లేను తన ఏడు వేల అశ్వికదళానికి మున్సబ్‌దారుగా నియమించాడు. కానీ కడప, కర్నూలు నవాబు హిమ్మత్‌ఖాన్ చేతిలో కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె వద్ద హత్యకు గురయ్యాడ.


                                                                         
    సలాబత్‌జంగ్

 ముజఫర్‌జంగ్ హత్యకు గురవడంతో ఫ్రెంచివారు సలాబత్‌జంగ్‌ను హైదరాబాద్ నిజాంగా నియమించారు. అందుకే సలాబత్ ఫ్రెంచివారికి ఉత్తర సర్కారులను బహుమతిగా ఇచ్చాడు. బుస్సీ నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం సలాబత్‌జంగ్‌కు రక్షణ కల్పించింది. ఇందుకు కొండవీడు, నిజాంపట్నం, నరసాపురం ప్రాంతాలను ఫ్రెంచివారికిచ్చి రూ.24 లక్షలు సైనిక ఖర్చుగా చెల్లించాడు. ఖజానాను గోల్కొండ నుంచి ఔరంగాబాద్‌కు మార్చాడు. మూడో కర్ణాటక యుద్ధ సమయంలో ఫ్రెంచివారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోవడంతో ఇతడు ఆంగ్లేయుల వైపు చేరి వారికి ఉత్తర సర్కారులను అప్పగించాడు. తన సోదరుడైన నిజాం అలీఖాన్‌ను ఖైదు నుంచి విడుదల చేసి, బీదర్ సుబేదారుగా నియమించాడు. కానీ 1761లో నిజాం అలీఖాన్ సలాబత్‌జంగ్‌ను తొలగించి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దీంతో రెండో నిజాం పాలకుడిగా గుర్తింపు పొందిన నిజాం అలీఖాన్ పాలన ప్రారంభమైంది. (వారసత్వ యుద్ధాల్లో మునిగి తేలిన నాజర్, ముజఫర్, సలాబత్‌జంగ్‌లను మొగల్ చక్రవర్తులు నిజాం పాలకులుగా గుర్తించలేదు.)



నిజాం అలీఖాన్

     నిజాం అలీఖాన్ (రెండో అసఫ్‌జా/ రెండో నిజాం) ఉత్తర సర్కారులపై ఆంగ్లేయుల అధికారాన్ని అంగీకరించలేదు. అయితే ఆంగ్లేయులు దుబాసీ కాండ్రేగుల జోగిపంతులును రాయబారిగా పంపి, 1766 నాటికి ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకున్నారు. మూడో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించి కడప, బళ్లారి, గుత్తి ప్రాంతాలను పొందాడు. కానీ మహారాష్ట్రుల చేతిలో ఓడిపోయి (1767 ఖర్ధా యుద్ధంలో) దౌలతాబాద్ దుర్గాన్ని కోల్పోయాడు. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి భారతీయ పాలకుడు నిజాం అలీఖాన్ (1798). 1800లో కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం ప్రాంతాలను ఆంగ్లేయులకు దత్తత ఇచ్చాడు. అందుకే వాటిని దత్త మండలాలుగా పేర్కొంటారు. నిజాం తన రాజాధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. 1788లో గుంటూరు సర్కారును ఆంగ్లేయులకుఇచ్చాడు. కిర్క్‌పాట్రిక్‌ను తన రాజధానిలో బ్రిటిష్ రెసిడెంట్‌గా నియమించాడు.

*   రేమండ్ అనే ఫ్రెంచి నిపుణుడి సహాయంతో హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ వద్ద ఆయుధాగారాన్ని నెలకొల్పాడు. నేటి మూసారాంబాగ్‌లో రేమండ్ సమాధి ఉంది. కిర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమకు చిహ్నంగా నిర్మించిన కట్టడంలోనే ప్రస్తుతం కోఠిలోని మహిళా కళాశాలను నిర్వహిస్తున్నారు.

 

సికిందర్ ఝా

      మూడో నిజాం/అసఫ్ జాగా పేరొందిన పాలకుడు. ఇతడి పాలనా కాలంలోనే రెండో ఆంగ్ల - మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నిజాం సైన్యాన్ని బీరర్ గవర్నర్ రాజా మహీపతిరామ్ నడిపాడు. ఆంగ్లేయులు మహీపతి రామ్ స్థానంలో దివాన్ చందూలాల్‌ను పేష్కార్‌గా నియమించారు. సికిందర్ ఝా ప్రధాని మీర్ ఆలం కూడా ఆంగ్ల వ్యతిరేకి. 1811లో రెసిడెంట్‌గా వచ్చిన హెన్రీ రస్సెల్ నాయకత్వంలో దళాన్ని ఏర్పాటు చేశాడు. దీన్నే రస్సెల్ బ్రిగేడ్ లేదా హైదరాబాద్ కంటింజెంట్‌గా పేర్కొన్నారు. విలియం పామర్ అనే వ్యక్తి పామర్ అండ్ కో కంపెనీని స్థాపించాడు. నిజాం ప్రభుత్వం పామర్ కంపెనీ నుంచి 25 శాతానికి అప్పు తీసుకుంది. సికిందర్ ఝా పేరు మీదే నేటి సికింద్రాబాద్‌ను నిర్మించారు. ఇతడి కాలంలోనే మెట్‌కాఫ్ సంస్కరణలను ప్రవేశపెట్టారు.

 

 నాసిర్ - ఉద్ - దౌలా

 ఇతడు నాలుగో నిజాం/ అసఫ్‌జా గా పేరొందాడు. ఇతడి కాలంలోనే ఆంగ్లేయులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందారు. 1829లో నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్‌కు వారి సంఖ్యను తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. తన రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించాడు. హైదరాబాద్ రాజ్యంలో సతీసహగమనాన్ని రద్దు చేశాడు. ఇతడి కాలంలోనే వహాబీ ఉద్యమం జరిగింది. సయ్యద్ అహ్మద్ బ్రైల్వీ సిక్కులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ ఉద్యమం నిజాం కాలంలో ఆంగ్ల వ్యతిరేక ఉద్యమంగా మారింది. నిజాం సోదరుడు ముబారిజ్ - ఉద్ - దౌలా నాయకత్వంలో హైదరాబాద్ రాజ్యంలో ఉద్యమం జరిగింది. కర్నూలు నవాబు గులాం రసూల్‌ఖాన్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1843లో దివాన్ చందూలాల్ రాజీనామా చేయడంతో సిరాజ్ ఉల్‌ముల్క్‌ను ప్రధానిగా నియమించాడు. 1853లో మొదటి సాలార్‌జంగ్‌ను ప్రధానిగా నియమించాడు. నాసిరుద్దౌలా కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది (కానీ తిరుగుబాటును ఎదుర్కొన్నది మాత్రం అఫ్జల్ - ఉద్ - దౌలా). హైదరాబాద్ కంటింజెంట్ ఖర్చుల నిమిత్తం రూ.64 లక్షలు అప్పు చేయడంతో, నిజాం తన రాజ్యంలోని రాయచూర్, ఉస్మాన్‌బాద్, బీరర్ ప్రాంతాలను ఆంగ్లేయులకు స్వాధీనం చేయాల్సి వచ్చింది.

 

  అఫ్జల్ - ఉద్ - దౌలా

         1857, మే 18న అయిదో నిజాంగా పాలన చేపట్టాడు. ఇతడి కాలంలోనే 1857, జులై 17న హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. (భారతదేశంలో తిరుగుబాటు ప్రారంభం మే 10, నాటి నిజాం నాసిరుద్దౌలా). మొగల్ చక్రవర్తి పేరు మీద కాకుండా నిజాం పేరు మీద కుత్బా చదవడం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఆంగ్ల రెసిడెన్సీపై తుర్రేబాజ్‌ఖాన్ దాడి చేశాడు. తిరుగుబాటును అణచడంలో ఆంగ్లేయులకు తోడ్పడినందుకు నాటి బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్‌సన్, సైన్యాధికారి మేజర్ బ్రిగ్స్ నిజాంకు 'స్టార్ ఆఫ్ ఇండియా' బిరుదుతో పాటు రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను తిరిగిచ్చారు. అతడు చెల్లించాల్సిన రూ.50 లక్షల రుణాన్ని రద్దు చేశారు. నిజాం రాజ్య ప్రధానమంత్రి నవాబ్ తురాబ్ అలీఖాన్‌కు 'సాలార్‌జంగ్' అనే బిరుదు ఇచ్చారు. ప్రధాని సాలార్‌జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1865లో జిలాబందీ రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. హాలిసిక్కా అనే నూతన వెండి నాణేన్ని ప్రవేశపెట్టాడు. హైదరాబాద్ - వాడి రైలు మార్గాన్ని నిర్మించాడు.

 

మీర్ మహబూబ్ అలీఖాన్

        అఫ్జల్ - ఉద్ - దౌలా మరణించే నాటికి ఇతడు రెండున్నర సంవత్సరాల బాలుడు. మీర్జా గాలీబ్ మనవడైన మీర్జా ఆషాబేగ్‌ను ఇతడికి సంరక్షకుడిగా నియమించారు. 1884 నాటికి పూర్తి అధికారాలను స్వీకరించాడు. ఖానున్‌చా - ఇ - ముబారక్ పేరుతో క్యాబినెట్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. చట్టాల నిర్మాణం కోసం 1893లో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. బీరర్‌పై నిజాం సార్వభౌమాధికారాన్ని గుర్తించాడు. హైదరాబాద్ కంటింజెంట్‌ను రద్దు చేసి, బ్రిటిష్ సైన్యంలో విలీనం చేశాడు. 1905లో రాజ్యాన్ని నాలుగు సుబాలుగా విభజించాడు. అవి: వరంగల్, మెదక్, గుల్బర్గా, ఔరంగాబాద్. ఇతడి కాలంలోనే కిషన్‌రావు అనే న్యాయవాది ముల్కీ నిబంధనలను రూపొందించాడు. చాందా రైల్వే పథకం ఆందోళన ఇతడి కాలంలోనే జరిగింది. నిజాం కళాశాల తొలి ప్రిన్సిపల్‌గా అఘోరనాథ చటోపాధ్యాయను నియమించాడు. మీర్ మహబూబ్ అలీఖాన్‌ను ఆంగ్లేయులు నియమించిన తొలి నిజాం నవాబుగా పేర్కొంటారు. మొదటి సాలార్‌జంగ్ మరణంతో మీర్ లాయక్ అలీని (రెండో సాలార్‌జంగ్) ప్రధానిగా నియమించాడు. ఇతడు 1887లో నిజాం కళాశాలను స్థాపించాడు. మూడో సాలార్‌జంగ్‌గా పేరొందిన మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్‌జంగ్ మ్యూజియానికి విదేశాల నుంచి అనేక వస్తువులు తెప్పించాడు.

*   1884లో లార్డ్ రిప్పన్ హైదరాబాద్ వచ్చి నిజాంకు సర్వాధికారాలు అప్పగించాడు. అదే సంవత్సరం నిజాం ఉర్దూను రాజభాషగా ప్రవేశపెట్టాడు. మంత్రివర్గం, ద్విసభా విధానం ఏర్పాటు చేశాడు.

*   మీర్ మహబూబ్ అలీఖాన్‌కు ఆంగ్లేయులు 'గ్రాండ్ కమాండర్' బిరుదును ప్రదానం చేశారు. ఇతడు 1909లో మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో మూసీ నదిపై వంతెన నిర్మించాడు. ఇతడి కాలంలోనే యంగ్‌మెన్ ఇంప్రూవ్‌మెంట్ అసోసియేషన్‌ను స్థాపించారు. 1882లో థియోసాఫికల్ సొసైటీశాఖ, 1892లో ఆర్యసమాజ శాఖ హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి.

 

 మీర్ ఉస్మాన్ అలీఖాన్

            చివరి, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఇతడి కాలంలో హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్ చెరువులను తవ్వించాడు. న్యాయశాఖను ఇతర శాఖల నుంచి వేరు చేశాడు. 1919లో సర్ అలీ ఇమామ్‌ను ప్రధానిగా నియమించాడు. 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.

*   సిర్పూర్ పేపరు మిల్లు, అజంజాహీ దుస్తుల మిల్లు, బోధన్ చక్కెర కర్మాగారం, చార్మినార్ సిగరెట్ కంపెనీ, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీలను స్థాపించాడు. 1932లో అరవముదు అయ్యంగార్ నాయకత్వంలో రాజకీయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశాడు. రజాకార్ల వ్యవస్థను ప్రోత్సహించాడు. తొలిసారి ఆదాయ, వ్యయ పద్దులను పునర్విభజించాడు. 1938లో 85 మంది సభ్యులతో ఒక శాఖను ఏర్పాటు చేసి, అందులో హరిజనులకు కూడా స్థానం కల్పించాడు.

*   భద్రాచలం, తిరుపతి దేవాలయాలకు విరాళాలు అందించేవాడు. నాందేడ్‌లో గురుద్వారాను నిర్మించాడు.

*   ఆంగ్లేయులకు విశ్వసనీయుడైన మిత్రుడిగా (ఫెయిత్‌ఫుల్ అలై) గుర్తింపు పొందాడు. 1918లో కింగ్‌జార్జ్ నిజాంను 'హిజ్ ఎగ్జాల్టెడ్ హైనస్‌'గా కీర్తించాడు.

*   స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాల, జనానా పాఠశాల, శాలిబండ మిడిల్ స్కూల్, హన్మకొండ ప్రభుత్వ మిడిల్ స్కూలు లాంటి విద్యాలయాలను ప్రారంభించాడు. రైల్వేలు, రోడ్డు రవాణా సంస్థలను ఏర్పాటు చేశాడు.

*   భారత ప్రభుత్వం 1948లో సెప్టెంబరు 13 17 మధ్య 'ఆపరేషన్ పోలో' పేరుతో సైనిక చర్య జరిపి, హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసింది. 1950, జనవరి 2న హైదరాబాద్ భారత యూనియన్‌లో చేరినట్లు ప్రకటించి, నిజాంను రాజ్‌ప్రముఖ్‌గా నియమించారు.

 

యుగ విశేషాలు

  *    మొదటి సాలార్‌జంగ్ ప్రధానిగా హైదరాబాద్ రాజ్య అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టాడు.

  *  1853 నుంచి 1883 వరకు ముగ్గురు నిజాంల వద్ద ప్రధానిగా మొదటి సాలార్‌జంగ్ పని చేశాడు.

 *   ఇతడు రాజ్యాన్ని 5 సుబాలు, 17 జిల్లాలుగా విభజించారు.

 *  సుబా అధిపతిని సుబేదార్, తాలుకా అధిపతిని తహసీల్దార్, జిల్లా అధిపతిని తాలూక్‌దార్ అనేవారు.

 *  1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు.

*   సదర్ - ఉల్ - మహమ్ పేరుతో పోలీసు, రెవెన్యూ, న్యాయ, విద్య, ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేశారు.

*   భూమి శిస్తును జమ అని, కౌలును ఇజారా అని పిలిచేవారు.

అవల్ తాలూక్‌దార్ నేటి జిల్లా కలెక్టర్‌తో సమాన అధికారి. దోయం తాలూక్‌దార్‌ను సబ్‌కలెక్టర్ హోదాతో, సోయం తాలూక్‌దార్‌ను తహసీల్దార్ హోదాతో సమానంగా భావించేవారు.

*  పోలీసు సూపరింటెండెంట్‌ను ముహతామీన్ అని, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను అమీన్ అని పిలిచేవారు.

 వసూలు చేసిన శిస్తులో జమీందార్ల వాటాను రుసుం అనేవారు.

*   శిస్తు వసూలు అధికారులను బిల్ మక్తదారులు అనేవారు.

*  చివరి నిజాం పాలనా కాలంలో కింది పట్టణాల పేర్లను మార్చారు.

ఎలగండల - కరీంనగర్, మహబూబ్‌నగర్ - పాలమూరు, ఇందూరు - నిజామాబాద్, మానుకోట - మహబూబబాద్, భోన్‌గిరి - భువనగిరి హైదరాబాద్ పాఠశాలల్లో డబ్ల్యూ.హెచ్. విల్కిన్‌సన్ అనే విద్యాశాఖ కార్యదర్శి నూతన    బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాడు.

 *   1871లో హైదరాబాద్‌లో తపాలా శాఖను ఏర్పాటు చేశారు.

*    1856లో డాక్టర్ స్మిత్ హైదరాబాద్‌లో వస్తు ప్రదర్శన (పారిశ్రామిక) ఏర్పాటు చేశాడు.

*    బ్రిటిష్ రెసిడెంటైన జేమ్స్ పాట్రిక్ ఖైరున్నీసా బేగం అనే ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడు.

*   భద్రాచలం రాముడికి తలంబ్రాలు పంపే ఆచారాన్ని నాసిరుద్దౌలా ప్రవేశ పెట్టాడు.

రాజ్య కేంద్ర ద్రవ్య ముద్రణాలయం హైదరాబాద్‌లో, జిల్లా ద్రవ్య ముద్రణాలయాలు గద్వాల్, నారాయణపేట్‌ల్లో ఏర్పాటు చేశారు.

*  కె.ఎం. మున్షీ హైదరాబాద్‌లోని దక్కన్ హౌస్‌లో ఉంటూ 'ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా' అనే గ్రంథాన్ని రచించారు.

1918లో ఏర్పడిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1919, ఆగస్టు 28 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.

Posted Date : 05-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

1857 తిరుగుబాటు

ఆధునిక భారతదేశ చరిత్రలో బ్రిటిష్‌ వలస పాలన, విధానాలకు వ్యతిరేకంగా జరిగిన గొప్ప సంఘటనే  ‘1857 సిపాయిల తిరుగుబాటు’. ప్లాసీ యుద్ధం (1757 జూన్‌ 23) జరిగిన వందేళ్లకు ఈ తిరుగుబాటు సంభవించింది. దీన్ని ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’, ‘సిపాయిల పితూరి’, ‘విప్లవోద్యమం’గా చరిత్రకారులు అభివర్ణించారు.

* దీన్నే ‘జాతీయ తిరుగుబాటు’, ‘సైనిక, పౌర తిరుగుబాటు కలయిక’ అని పేర్కొన్నారు.

* ఈ తిరుగుబాటు ప్రారంభం నాటికి లార్డ్‌కానింగ్‌ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌గా భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో భారతదేశాన్ని మొగల్‌ పాదుషా బహదూర్‌ షా జాఫర్‌ పాలిస్తున్నారు. ఈయన నామమాత్ర  చక్రవర్తిగా ఉన్నారు.

* బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు, కారన్‌వాలీస్‌ శాశ్వత భూమిశిస్తు విధానం, వెల్లస్లీ సైన్యసహకార పద్ధతి, డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతం, బ్రిటిష్‌ సైనిక, ఆయుధ సంపత్తి వల్ల భారతదేశంలోని అనేక ప్రాంతాలపై తమ రాజకీయ సార్వభౌమాధికారాన్ని

నెలకొల్పారు. వీటి వల్ల భారతదేశంలో ప్రతిఘటన ఉద్యమాలు జరిగాయి.

* 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు 1763 నుంచి 1856 వరకు సివిల్, గిరిజన, సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి. 

ఉదా: సన్యాసుల తిరుగుబాట్లు (1763 - 1800), చూర్‌ (1799), దళ్‌భమ్‌ (1769 - 74), రంగపూర్‌ (1783),  బిష్నుపూర్‌ (1789), ఒడిశా పాయికుల తిరుగుబాటు (1804 - 17), వేలుతంపి (1809), కట్టబొమ్మన్‌ (1798 - 1802), పాలకొండ విజయరామరాజు (1831 - 32),

గుసూరుషి, కరభంజి (1800 - 05), ధనుంజయ భంజి (1835-37), కోయిలకుంట్ల (కర్నూల్‌) నరసింహారెడ్డి (1846 - 47), రామోసి (1826 - 29), గడ్కారి (1844), సంతాల్‌ తిరుగుబాటు (1855), భిల్లుల తిరుగుబాటు (1817 -19, 1825), , బరైలీ తిరుగుబాటు (1816), కోల్‌

ఉద్యమం (1831 - 33), కాంగ్రా జస్వర్‌ రాజుల ఉద్యమం (1848) మొదలైనవి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిగాయి. వీటన్నింటిలో ప్రధానమైంది 1857 సిపాయిల తిరుగుబాటు.

* ఈ తిరుగుబాటులో భారతీయ సిపాయిలే అత్యధిక సంఖ్యలో బ్రిటిష్‌వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. అనేక ఏళ్ల నుంచి ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి ఫలితమే ఈ తిరుగుబాటు. 

* దీనికి గల కారణాలను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక అంశాలుగా విభజించవచ్చు.


ఆర్థిక కారణాలు

    వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకం కల్పించకపోవడంతో వ్యవసాయాభివృద్ధి కుంటుపడింది. వ్యవసాయ వాణిజ్యీకరణ వల్ల రైతులు నష్టపోయారు. కరవు సమయాల్లో పన్నులు పెంచడం, కట్టలేని వారి భూములు జప్తు చేయడం, బ్రిటిష్‌ భూమిశిస్తు విధానాలు రైతులను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల అక్కడి వస్తువులు భారత్‌కు దిగుమతి అయి, ఇక్కడి కుటీర, చిన్నతరహా, లఘు పరిశ్రమలను పూర్తిగా దెబ్బతీశాయి. చేతివృత్తులవారు జీవనోపాధిని కోల్పోయారు. ఒకప్పుడు ఢాకా మస్లిన్‌ వస్త్రాలకు ప్రసిద్ధి. కానీ ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి అయిన అనేక వస్తువులను తక్కువ ధరకు వాటిని అమ్మి విపరీత లాభాలు ఆర్జించారు. బ్రిటిష్‌వారికి పోటీ కాకూడదని ఢాకా నేతపనివారి చేతివేళ్లను నరికారు.

* భారతదేశ ఎగుమతులపై బ్రిటిష్‌ వారు ఎక్కువ సుంకాలు విధించారు. పత్తి, జనుము, నీలిమందు, పొగాకు లాంటి వాటిని బ్రిటన్‌కు ఎగుమతిచేసి లాభాలు గడించారు. మర్కంటైలిజాన్ని (Mercantilism)  అమలుచేసి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. 

* పారిశ్రామిక విప్లవ కాలానికి బ్రిటిష్‌వారు భూమిశిస్తు ద్వారా 27%, పన్నుల ద్వారా 10% ఆదాయాన్ని పెంచుకున్నారు. అయితే బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్స్‌ అయిన ఆక్లాండ్, కర్జన్‌ విధానాలు, డల్హౌసీ, హార్డింజ్‌ యుద్ధాల వల్ల బ్రిటిష్‌వారు భారతీయులకు 59 మిలియన్లకు పైగా బాకీ పడ్డారు.

* ఉద్యోగాలు కోల్పోయినవారు నీలిమందు, తేయాకు తోటల్లో కూలీపని చేశారు. ఆదాయం లేక పేదరికంలో మగ్గారు. వీరంతా సిపాయిల తిరుగుబాటులో పాల్లొన్నారు.


సాంఘిక, మత కారణాలు

    అనాది నుంచి భారతీయ ప్రజలు తమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విశ్వసిస్తూ వచ్చారు. అయితే లార్డ్‌ వెల్లస్లీ 6వ రెగ్యులేషన్‌ ద్వారా స్త్రీ, శిశుహత్యలను నిషేధించారు. దీన్ని రాజపుత్రులు వ్యతిరేకించారు.

* లార్డ్‌ విలియం బెంటింక్‌ 1829లో సతీసహగమన నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టం, భారతీయ వారసత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇవి వివాదాస్పదమయ్యాయి.

* 1813, 1833 చార్టర్‌ చట్టాల ద్వారా క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ప్రవేశించాయి. వీటికి బ్రిటిష్‌ ప్రభుత్వం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ ను మంజూరు చేసింది. ఇవి మత మార్పిడులకు ప్రయత్నించడంతో భారతీయులు ఆందోళనకు గురయ్యారు.

* హిందుత్వాన్ని విడిచి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారికి ఆస్తిహక్కు (1850) కల్పించారు. దీన్ని ప్రజలు వ్యతిరేకించారు.

* ‘మేజర్‌ ఎడ్వర్డ్‌’ భారతీయులను క్రైస్తవంలోకి మార్చడమే ఆంగ్లేయుల ప్రధాన లక్ష్యమని ప్రకటించడం హిందూ, ముస్లిం వర్గాల్లో అలజడి రేపింది.

* ఆంగ్ల విద్యాభివృద్ధికి నిధులు ఖర్చు చేయడం, పర్షియన్‌ స్థానంలో ఇంగ్లిష్‌ను రాజభాషగా ప్రకటించడం, డల్హౌసీ ప్రవేశపెట్టిన తంతితపాలా, రైల్వేలు, టెలిగ్రాఫ్, పోస్టల్‌ సేవలు భారతీయులకు సందేహాలు కలిగించాయి.

* రైళ్లలో జాతి, మత, కుల, వర్గ, వర్ణ లింగ భేదాలు లేకుండా ఒకే చోట వివిధస్థాయుల వారు ప్రయాణించడం వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు ఆటంకం కలిగిందని హిందువులు భావించారు.


తక్షణ కారణాలు

    1856 డిసెంబరులో బ్రిటిష్‌వారు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తుపాకీని ప్రవేశపెట్టారు. దీనికి వాడే తూటాల చివరి భాగాన్ని నోటితో కొరికి ఉపయోగించాల్సి ఉండేది. ఈ తుటాల చివర ఆవు, పంది కొవ్వు పూసినట్లు వదంతులు  వ్యాపించాయి. ఆవు హిందువులకు పవిత్రం, పంది ముస్లింలకు నిషేధం. కాబట్టి తూటాలను కొరకడాన్ని భారతీయ సిపాయిలు నిరాకరించారు. ఈ కొత్తరకం తుపాకులు ఇంగ్లండ్‌లోని వూల్‌వ్రచ్‌లోని ఆయుధ ఫ్యాక్టరీలో తయారయ్యేవి.

* ఇది హిందూ, ముస్లిం సైనికులను క్రైస్తవులుగా మార్చడానికి పన్నిన కుట్రగా భావించిన సిపాయిలు తిరుగుబాటుకు పూనుకున్నారు.

* 1857 మార్చి 29న సిపాయిలు ‘బారక్‌పూర్‌’లో కొత్త రకం తూటాలను వాడటానికి నిరాకరించారు. మార్చి 29న ‘మంగళ్‌పాండే’ అనే సిపాయి ఐరోపా అధికారి లెఫ్టెనెంట్‌ బాగ్‌ను కాల్చి చంపగా, అతన్ని నిర్బంధించి ఏప్రిల్‌ 8, 1857లో ఉరితీశారు. ఇతడు 34వ పటాలానికి

చెందినవాడు.

* 1857 ఫిబ్రవరి 26న ‘బరహంపూర్‌’ శిబిరంలోని 19వ పదాతి దళానికి చెందిన సిపాయిలు కవాతులో పాల్గొనడానికి నిరాకరించారు.

* దీని ఫలితంగా 19, 34 పదాతి దళాలను బ్రిటిష్‌వారు రద్దు చేసి, సిపాయిలందరినీ ఉద్యోగం నుంచి తొలగించారు.

* ఇలాంటి సంఘటనలు విశాఖపట్నం (1780), వెల్లోర్ (1806) బర్మా యుద్ధం (1824) సమయంలో జరిగాయి. 47వ పదాతి దళానికి చెందిన సిపాయిలు సముద్రం దాటడానికి నిరాకరిస్తే, వారిని బ్రిటిష్‌వారు కాల్చిచంపి ఆ దళాన్ని రద్దు చేశారు.


సైనిక కారణాలు

    1853లో కార్ల్‌ మార్క్స్‌ ‘ఇండియా ఖర్చుతో, భారతీయులే సిపాయిలుగా ఉన్న భారత సైన్యమే భారతదేశాన్ని ఇంగ్లిష్‌ వారి బానిసత్వంలో అణచి ఉంచుతుంది’ అని పేర్కొన్నారు. ఆ సిపాయిలే అసంతృప్తికి గురై 1857 సిపాయిల తిరుగుబాటుకు పూనుకున్నారు.

* బ్రిటిష్‌ సైన్యంలో యూరోపియన్లను సోల్జర్‌గా, భారతీయులను సిపాయిలుగా పేర్కొన్నారు. 1856 నాటికి సైన్యంలో 2,32,234 మంది సిపాయిలు, 45 వేల మంది బ్రిటిష్‌ సైనికులు ఉండేవారు. భారతీయ సిపాయిలే అధిక సంఖ్యలో యుద్ధాల్లో పాల్గొని బ్రిటిష్‌ విశాల సామ్రాజ్య స్థాపనకు కృషి చేశారు. కానీ వారి కష్టానికి తగిన గుర్తింపు లేదు.

* సిపాయిలు, సైనికుల మధ్య స్నేహభావం లోపించింది. ఎన్నేళ్లు పని చేసినా ‘సుబేదార్‌’కి మించి హోదా లభించేది కాదు. సిపాయిలకు జీతభత్యాలు, ప్రత్యేక సౌకర్యాలు తక్కువగా ఉండేవి. వీటి వల్ల తీవ్ర వివక్షకు గురయ్యారు. ఆజ్ఞలు జారీచేసే అధికారం బ్రిటిష్‌ సైనికులకు మాత్రమే ఉండేది. సుబేదార్‌ జీతం కేవలం రూ.6070 మాత్రమే. ఇవి సిపాయిల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి.

* కుల, మత, ఆచారాలకు వ్యతిరేకంగా తలపాగాలు ధరించరాదని, పొడవైన జట్టు, గడ్డం ఉండకూడదని, అందరు ఒకేలా యునిఫాం ధరించాలని, విదేశాల్లో యుద్ధాలు చేసేందుకు సముద్రాలు దాటాలని ఆజ్ఞలు జారీ చేశారు.

* 1856లో లార్డ్‌ కానింగ్‌ ‘సామాన్య సేవా నియుక్త చట్టం (General Service Enlistment Actz)ను ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతీయ సిపాయిలు ఎక్కడైనా, ఎప్పుడైనా పనిచేయాలని ఆజ్ఞాపించడంతో సైనికులు తిరగబడ్డారు.


రాజకీయ కారణాలు

లార్డ్‌ వెల్లస్లీ ప్రవేశపెట్టిన ‘సైన్య సహకార పద్ధతి’ (Subsidiary Alliance) ప్రకారం బ్రిటిష్‌ సైన్యాన్ని భారతీయ సంస్థానాధీశులే పోషించాలి. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

* చిట్టచివరి మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌షా జాఫర్‌ పాలన కేవలం ఢిల్లీకే పరిమితమైంది. దీంతో ఈస్టిండియా కంపెనీ దేశాన్ని పాలించే శక్తిగా ఎదిగింది. దీన్ని భారతీయులు అంగీకరించలేదు. అదే సమయంలో సిరాజ్‌ ఉద్దౌలా (బెంగాల్‌ నవాబ్‌), టిప్పు సుల్తాన్‌

(మైసూర్‌) దేశం, ఆత్మగౌరవం కోసం పోరాడారు. ఇది దేశప్రజల్లో నూతనోత్సాహాన్ని కలిగించింది.

* సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కారణం డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘రాజ్యసంక్రమణ సిద్ధాంతం’  (Doctrine of Lapse). దీని ప్రకారం వారసులు లేని రాజ్యాలను బ్రిటిష్‌వారు స్వాధీనం చేసుకోవచ్చు. దీన్ని దేశ సంస్థానాధీశులు, ప్రజలు వ్యతిరేకించారు.

* రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం సతారా (1848), జైపూర్, సంబల్‌పూర్‌ (1849), ఉదయ్‌పూర్ (1852), ఝాన్సీ (1853), నాగపుర్‌ (1854) సంస్థానాలను బ్రిటిష్‌వారు ఆక్రమించారు. 

* పరిపాలన సక్రమంగా చేయడంలేదనే నెపంతో అయోధ్య నవాబు వజీద్‌ అలీషాను 1856లో పదవి నుంచి తప్పించి, అతడి రాజ్యాన్ని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో విలీనం చేశారు. ఈ చర్యను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారు.

* చివరి మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌ షా జాఫర్‌ బిరుదు ‘జిలై- ఇల్లాహి’ (Shadow of God) అతడి తర్వాత రద్దవుతుందని ప్రకటించడం, ‘పాదుషా’ హోదా ఉండదని చెప్పడం భారతీయ, ముస్లిం వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది.

* చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు ‘నానాసాహెబ్‌’ దత్తత చెల్లదని ప్రకటించి భరణాన్ని రద్దుచేశారు.

* బహదూర్‌షా అనంతరం ఎర్రకోట బ్రిటిష్‌వారికి చెందుతుందని, మొగల్‌ చక్రవర్తి నివాసం ఎర్రకోట నుంచి కుతుబ్‌మినార్‌కు మారుస్తామని లార్డ్‌ కానింగ్‌ ప్రకటించడంతో భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

* బ్రిటిష్‌ ప్రభుత్వం అప్పటివరకు వాడుకొని తొలగించిన కిరాయి సైనికులు, పిండారీలు, దగ్గులు (దారి దోపిడి దొంగలు) సిపాయిలకు సాయపడ్డారు.

* స్వదేశీ రాజుల కొలువుల్లో పనిచేసిన ఉన్నత వర్గాలు పదవులు కోల్పోవడం, తిరుగుబాటుకు ముందు దాదాపు 20 వేల ఎస్టేట్లను బ్రిటిష్‌ ప్రభుత్వం రద్దుచేయడం, రైతులను భూస్వాములు, జమీందారులపై ఉసిగొల్పడం, ఇంగ్లండ్‌ నుంచి పాలించడం భారతీయులకు నచ్చలేదు. వీరంతా సిపాయిలతో కలిసి తిరుగుబాటులో పాల్గొన్నారు.

* ఈశ్వరీప్రసాద్‌ అనే చిత్రకారుడు ‘‘డల్హౌసీ భారతదేశంలో రాజకుటుంబాలు లేకుండా చేయడంతో, సాంఘిక, ఆర్థిక విధానాల్లో కలిగిన మార్పులు తీవ్ర అసంతృప్తికి కారణాలై ఈ గొప్ప తిరుగుబాటును లేవదీశాయి’’ అని అభిప్రాయపడ్డారు.
 

తిరుగుబాటు స్వభావం

1857 సిపాయిల తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ తిరుగుబాటును సైనిక పితూరీ, ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటమని కొందరు; క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన మత యుద్ధమని కొందరు; నల్లవారికి, తెల్లవారికి మధ్య చెలరేగిన జాతి ఘర్షణ అని; పాశ్చాత్య - ప్రాచ్య సంస్కృతుల మధ్య జరిగిన పోరాటమని మరికొందరు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు.

* బ్రిటిష్‌ చరిత్రకారుడు జె.డబ్ల్యూ.కేయ్‌ తన ‘ఎ హిస్టరీ ఆఫ్‌ సిపాయి వార్‌’ (1880) గ్రంథంలో ఈ తిరుగుబాటును ‘సిపాయిల పితూరీ’గా పేర్కొన్నారు.

* బెంజిమన్‌ డిస్రేలి ఈ తిరుగుబాటును ‘జాతీయ తిరుగుబాటు’గా అభివర్ణించాడు.

* అశోక్‌ మెహతా ‘ద గ్రేట్‌ రెబెలియన్‌’ గ్రంథంలో తిరుగుబాటుకు ‘జాతీయ స్వభావం’ ఉందని తెలిపారు. ఇతడు 

* ఎయిటీన్‌ ఫిప్టీ సెవెన్‌’ అనే మరో గ్రంథాన్ని రాశారు.

* వి.డి.సావర్కర్‌ ‘ద ఇండియన్‌ వార్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌’ ్బ1909్శ గ్రంథంలో 1857 తిరుగుబాటును ‘యోజిత ప్రథమ జాతీయ స్వాతంత్య్ర సమరం’ అని పేర్కొన్నాడు.

* ఆర్‌.సి.మజుందార్‌ ద సిపాయి మ్యూటినీ అండ్‌ ద రివోల్ట్‌ ఆఫ్‌ 1857, బ్రిటిష్‌ పారమౌంటసీ అండ్‌ ద ఇండియన్‌ రినైజాన్స్‌ గ్రంథాల్లో 1857 తిరుగుబాటు ‘స్వాతంత్ర సమరం’ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణం తిరుగుబాటు వివిధ ప్రాంతాల్లో, వివిధ

రూపాల్లో ఉండటం.

* సురేంద్రనాథ్‌ సేన్‌ ‘ఎయిటీన్‌ ఫిప్టీ సెవెన్‌’ గ్రంథంలో 1857 సిపాయిల తిరుగుబాటును ‘ఒక స్వాతంత్ర సమరం’గా వ్యాఖ్యానించారు.

* ఎస్‌.బి.చౌదరి తన ‘సివిల్‌ రెబిలియన్‌ ఇన్‌ ద ఇండియన్‌ మ్యూటినీస్‌ - 1857-59’ గ్రంథంలో 1857 సిపాయిల తిరుగుబాటును ‘సైనిక, పౌర తిరుగుబాటు పరంపరల కలయిక’గా పేర్కొన్నారు.

* భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ద డిస్కవరీ ఆఫ్‌ ఇండియా ్బ1946్శ గ్రంథంలో ఇది ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం కాదని, భూస్వాముల తిరుగుబాటని అభివర్ణించారు.


వైఫల్యానికి కారణాలు

* దేశం మొత్తం వ్యాపించకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంతో బ్రిటిష్‌వారు ఎక్కడికక్కడ సత్వరమే అణచివేయగలిగారు. నాయకత్వ లేమి, అభిప్రాయ భేదాలు సిపాయిల తిరుగుబాటు ఉద్యమాన్ని బలహీనం చేశాయి.

* సిపాయిలకు అవసరమైన ఆహారం, యుద్ధ సామగ్రి, దుస్తుల కొరత ఏర్పడటంతో వారు దోపిడీలకు పాల్పడ్డారు. దీంతో రైతులు, వ్యాపారస్తుల మద్దతు కోల్పోయారు. 

* ఉద్యమం, పోరాటాలకు ప్రసిద్ధి చెందిన సిక్కు, గూర్ఖా సైన్యాలు బ్రిటిష్‌ వారికి విధేయులుగా ఉండి తిరుగుబాటును అణచివేయడానికి తోడ్పడ్డారు.

* సంస్థానాధీశుల్లో ఎక్కువమంది బ్రిటిష్‌ వారికి సాయపడ్డారు. ఉదా: హైదరాబాద్, గ్వాలియర్‌ సంస్థానాధీశులు.

* సిపాయిల వద్ద ఆధునిక ఆయుధాలు, సరైన సమాచార వ్యవస్థ లేకపోవడం, అధునాతన యుద్ధ పద్ధతులు తెలియకపోవడం, భారతీయుల్లో జాతీయభావం లోపించడం, రాజుల మధ్య అనైక్యత, మేధావులు, విద్యావంతులు ఉద్యమానికి సహకరించకపోవడం, ప్లవకారుల్లో ఒక ధ్యేయం, లక్ష్యం లేకపోవడం వల్ల సిపాయిల తిరుగుబాటు నీరుగారిపోయింది.

* బ్రిటిష్‌ సైన్యంలో అనుభవజ్ఞులైన సేనానులు కాంప్‌బెల్, నెయిల్, హడ్సన్, హ్యూరోస్, ఔట్రాం, హేవ్‌లాక్‌ లాంటివారు పూర్తి అంకితభావంతో పనిచేశారు. బ్రిటిష్‌ సైన్యంలోని క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, యుద్ధ వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాల ముందు భారతీయులు నిలవలేకపోయారు. 

* 1857లో హైదరాబాద్‌లో తుర్రెబాజ్‌ఖాన్‌ తిరుగుబాటు చేసినా నిజాం నవాబు దాన్ని అణచివేశాడు. భారతీయ రాజులే ఉద్యమానికి అవరోధంగా మారారు. ఈ కారణాల వల్ల 1857 సిపాయిల తిరుగుబాటు విఫలమైంది.


తిరుగుబాటు ఫలితాలు

* 1857 సిపాయిల తిరుగుబాటు పాలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను ప్రభావితం చేసింది.

* ఈ తిరుగుబాటు ఫలితంగానే 1858 నవంబరు 1న విక్టోరియా మహారాణి ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనతో భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దై, బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన (క్రౌన్‌ రూల్‌) ప్రారంభమైంది.

* గవర్నర్‌ జనరల్‌ పదవి స్థానంలో ‘వైస్రాయ్‌’ (రాజప్రతినిధి) అనే అధికారిని నియమించారు.

* బ్రిటిష్‌ ప్రభుత్వ మంత్రిమండలిలో వైస్రాయ్‌ సభ్యుడిగా, 15 మంది సభ్యులతో కూడిన ఒక సలహా మండలి ఏర్పాటైంది.

* భారతదేశ కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు.

* స్వదేశీ సంస్థానాధీశుల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని బ్రిటిష్‌ వారు ప్రకటించారు.

* రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దయ్యింది.

* కొన్ని రంగాల్లో జాతి, మత, ప్రాంత భేదాలు లేకుండా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడానికి బ్రిటిష్‌ వారు అంగీకరించారు.

* 1861 కౌన్సిల్‌ చట్టం, భారత న్యాయ చట్టాలను రూపొందించారు. వీటి ద్వారా  భారతీయ ఆచార, సంప్రదాయాలకు గుర్తింపు లభించింది.

* భవిష్యత్‌లో ఇలాంటి తిరుగుబాట్లు జరగకుండా సైనిక వ్యవస్థలో మార్పులు చేశారు. ఆంగ్ల సైనికుల సంఖ్యను పెంచి, భారతీయ సిపాయిల సంఖ్యను తగ్గించారు.

ఉదా: 1864 నాటికి సిపాయిల సంఖ్య 2,05,000 కాగా, ఆంగ్ల సైనికుల సంఖ్య 65,000.

* సైన్యంలో అగ్రకులాల వారి సంఖ్యను తగ్గించి, గూర్ఖాలు, సిక్కులు, రాజపుత్రులను చేర్చుకున్నారు. ప్రధాన సైనిక స్థావరాల్లో బ్రిటిష్‌ దళాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు.

* 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం ‘విభజించి, పాలించు’ విధానాన్ని పూర్తిగా అమలుచేశారు.

* ఈ తిరుగుబాటు తర్వాత హిందూ, ముస్లిం వర్గాల మధ్య బ్రిటిష్‌ వారు మత వైషమ్యాలు, విభేదాలను కల్పించారు. సామ్రాజ్య విస్తరణకు బదులు దోచుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు.అయితే, 1857 సిపాయిల తిరుగుబాటు భారత జాతీయోద్యమానికి ప్రారంభంగా పేర్కొనవచ్చు.

Posted Date : 29-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గజనీ మహమ్మద్‌ దండయాత్రలు

 

గజనీ మహమ్మద్‌ లక్ష్యాలు 


 భారతదేశంలో విగ్రహారాధనను నిర్మూలించి, ఇస్లాం మతాన్ని వ్యాప్తిచేయడం.


 ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడం. అపార ధనాన్ని కొల్లగొట్టడం.


దండయాత్రలు (క్రీ.శ. 1000- 1026) 


 క్రీ.శ. 1000లో కైబర్‌ కనుమలోని కొన్ని కోటలు, పట్టణాలను ఆక్రమించాడు.


 క్రీ.శ. 1001లో భారత్‌లోకి ప్రవేశించి పెషావర్‌ పాలకుడైన జయపాలుడ్ని ఓడించి, బందీగా చేసుకున్నాడు. ఇతడ్ని విడుదల చేయడానికి పెద్ద మొత్తం వసూలు చేశాడు.


 క్రీ.శ. 1003లో భాటియా రాజ్యంపై దాడి చేసి, ‘బిజయ్‌ రాయ్‌’ని ఓడించి, అనేకమందిని ఇస్లాంలోకి మార్చాడు.


 క్రీ.శ. 1006లో సింధూ నదిని దాటి ముల్తాన్‌పై దాడి చేసి, ఫతేదావూద్‌ను బంధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. దీనికి శుక్రపాలుడ్ని రాజుగా చేశాడు. శుక్రపాలుడ్ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, అతడి పేరును నవాపాషాగా మార్చాడు.


 మహమ్మద్‌ గజనీకి వెళ్లాక ‘నవాపాషా’ ఇస్లాంను విడిచిపెట్టాడు. దీంతో గజనీ క్రీ.శ.1007లో నవాపాషాపై దండెత్తి, ఓడించి జీవితఖైదు విధించాడు.


 తర్వాత గజనీ దృష్టి హింద్‌ షాహీపై పడింది. ఆనందపాలుడు గజనీని ఎదుర్కొనేందుకు ఉజ్జయిని, గ్వాలియర్, కలంజర్, కనౌజ్, ఢిల్లీ పాలకులతో కలిసి ఒక సమాఖ్యను ఏర్పరిచాడు. క్రీ.శ. 1008లో మహమ్మద్‌ వీరందరిని ‘రోహింద్‌’ యుద్ధంలో ఓడించాడు. నాగర్‌కోట, నారాయణపూర్‌లను దోచుకున్నాడు. 


 క్రీ.శ. 1009లో నాగర్‌కోటను ఆక్రమించాడు.


 క్రీ.శ. 1010లో రెండోసారి ముల్తాన్‌పై దాడి చేశాడు.


 ఆనందపాలుడు తన రాజధానిని వైహిద్‌ నుంచి నందనంకు మార్చాడు. ఇతడి తర్వాత త్రిలోచనపాలుడు రాజయ్యాడు. ఇతడు బుందేల్‌ఖండ్‌ పాలకుడు చందేల వంశానికి చెందిన విద్యాధరుడితో కలిసి గజనీపై దండయాత్రలు సాగించాడు. గజనీ క్రీ.శ. 1014లో త్రిలోచనపాలుడ్ని ఓడించి, నందనాన్ని ఆక్రమించాడు. దీంతో హింద్‌ షాహీ వంశం అంతమైంది.


 క్రీ.శ. 1014లో గజనీ స్థానేశ్వరంపై దాడి చేశాడు. చక్రస్వామి దేవాలయాన్ని దోచుకుని, ధ్వంసం చేశాడు.


 క్రీ.శ. 1015, 1021లో కశ్మీర్‌పై దాడులు చేశాడు.


 క్రీ.శ. 1018లో కృష్ణుడి జన్మస్థలంగా పిలిచే మధుర నగరాన్ని ధ్వంసం చేశాడు. అక్కడి నంచి అపార సంపదను దోచుకున్నాడు.


 మధుర నుంచి గజనీ కనౌజ్‌ వైపు వెళ్లాడు. రాజ్యపాలుడ్ని ఓడించి, ఆ నగరాన్ని నాశనం చేసి, అపార సంపద దోచుకున్నాడు.


 బుందేల్‌ఖండ్‌ పాలకుడైన విద్యాధరుడుకి రాజ్యపాలకుడికి మధ్య వైరం ఉండేది. గజనీ కనౌజ్‌ను దోచుకున్నాక, విద్యాధరుడు రాజ్యపాలుడిపై దండెత్తి అతడ్ని చంపాడు. 


 మహమ్మద్‌ గజనీ విద్యాధరుడిపై దాడిచేసినా విజయం సాధించలేదు. గజనీ ఓడించలేకపోయిన ఏకైక రాజపుత్రుడు విద్యాధరుడే.


 క్రీ.శ. 1019లో గజనీ కలంజర్‌ పాలకుడు గోండు


రాజుపై దండెత్తి అపార సంపదను దోచుకున్నాడు. క్రీ.శ. 1021-22లో మళ్లీ దండెత్తగా సంధి చేసుకుని ధనం అప్పగించాడు.


 క్రీ.శ. 1026లో గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయంపై గజనీ దాడి చేశాడు. అన్హిల్‌వాడ పాలకుడైన సోలంకి వంశానికి చెందిన భీమదేవుడ్ని ఓడించి దేవాలయాన్ని దోచుకున్నారు. మళ్లీ క్రీ.శ.1027లో సింధ్‌లోని జాట్‌లను ఓడించి, సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకుని అపార ధనరాశులతో గజనీకి వెళ్లాడు. 


 గజనీ మహమ్మద్‌  క్రీ.శ.1030లో మరణించాడు.


గజనీ మహమ్మద్‌ ఘనత 


 ఇతడ్ని ప్రపంచ నాయకుల్లో ఒకడిగా చరిత్రకారులు పేర్కొన్నారు. 


 కేవలం దండయాత్రలే కాకుండా సాహిత్య, కళాపోషణకు ఇతడు ప్రాధాన్యం ఇచ్చాడు. 


 ఇతడు భారతదేశంలో తన శక్తినంతా విధ్వంసక చర్యలకే వినియోగించాడు. ఇక్కడ దోచుకున్న సంపదతో గజనీని ఎంతో అభివృద్ధి చేశాడు. 


 మహమ్మద్‌ తర్వాత ఖుస్రూ మాలిక్‌ చివరి రాజయ్యాడు. మొమిజోద్దీన్‌ మహమ్మద్‌-బీన్‌-సమ్‌ (షిహబుద్దీన్‌ మహమ్మద్‌ ఘోరీ) ఖుస్రూను వధించి రాజయ్యాడు.


క్రీ.శ. 1000లో భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు


 గజనీ మహమ్మద్‌ భారతదేశంపై దండెత్తే నాటికి దేశం అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. 


 అరబ్‌ దేశానికి ముల్తాన్, హింద్‌ షాహీ సరిహద్దు రాజ్యాలు. ముల్తాన్‌ పాలకుడు ఫతేదావూద్‌. 


 షాహీ రాజ్యం పంజాబ్‌లో జీలం నది వరకు విస్తరించింది. దీని రాజధాని వైహిద్‌ లేదా ఉద్భందాపూర్‌. దీన్ని ఆనందపాలుడు పాలించేవాడు. ఇతడు రాజపుత్రుడు. 


 కశ్మీర్‌ సంగ్రామ రాజు అధీనంలో ఉండేది. కనౌజ్‌ను పార్థియన్‌ రాజు రాజ్యపాలుడు పాలించేవాడు.


 బెంగాల్‌ను పాల వంశానికి చెందిన మహిపాలుడు పాలించేవాడు. రాజస్థాన్‌లోని మాళ్వాకు భోజుడు రాజు. ఇతడి రాజధాని ఉజ్జయిని. 


 గుజరాత్‌ను సోలంకి వంశానికి చెందిన భీమదేవుడు పాలించేవాడు. ఇతడి రాజధాని అన్హిల్‌వాడ. 


 బుందేల్‌ఖండ్‌ చందేల వంశ రాజు విద్యాధరుడి అధీనంలో ఉండేది. 


 దక్షిణ భారతదేశాన్ని చోళ పాలకుడు రాజేంద్ర గంగైకొండ చోళుడు పాలించేవాడు. ఇతడి రాజధాని తంజావూరు. ఇతడు ఉత్తర భారతదేశంపై ఎక్కువగా దృష్టిసారించలేదు.


మహమ్మద్‌ గజనీ (క్రీ.శ. 978 - 1030) 


 సుబక్తజిన్‌ తర్వాత అతడి కుమారుడు మహమ్మద్‌ రాజయ్యాడు. 


 ఖలీఫా ఖాదిర్‌ బిలాబ్‌ ఇతడికి యామిన్‌ ఉద్దౌలా, అమన్‌ ఉల్‌మిల్లత్‌ అనే బిరుదులు ఇచ్చాడు. 


 మహమ్మద్‌ చేసిన దండయాత్రలన్నింటినీ అతడి ఆస్థాన చరిత్రకారుడు ‘ఉద్బి’ రికార్డు చేశాడు. ఇతడు భారతదేశంపై పవిత్ర యుద్ధం (జిహాద్‌) చేసి విగ్రహారాధనను నాశనం చేసి, అపార ధనాన్ని దోచుకున్నట్లు ఉద్బి పేర్కొన్నాడు. 


 మహమ్మద్‌ భారతదేశంపై 12 సార్లు 17 దండయాత్రలు చేసినట్లు ఉద్బి చెప్పగా, ఇతడు భారత్‌పై 17 యుద్ధాలు చేసినట్లు సర్‌ హెన్రీ ఎలియట్‌ తెలిపారు. 


 ఖలీఫా ఖాదిర్‌ ప్రోత్సాహంతో ఇతడు ఏటా భారతదేశంపై  దండెత్తాడు.


దండయాత్ర ఫలితాలు


 హింద్‌ షాహీ వంశం పతనమైంది. పంజాబ్, ముల్తాన్‌ గజనీ రాజ్యభాగాలయ్యాయి. ప్రతీహార రాజ్యం కూడా కనుమరుగైంది.


 ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ నగరాలన్నీ నిర్వీర్యమయ్యాయి. పవిత్ర దేవాలయాలైన మధుర, కనౌజ్, సోమనాథ్, నాగర్‌కోట నాశనమయ్యాయి. దోచుకున్న సంపదనంతా మహమ్మద్‌ తన రాజ్య అభివృద్ధికి వెచ్చించాడు. అక్కడ అందమైన వనాలు, సమాధులు, కళాశాలలు, మసీదులు నిర్మించాడు. అల్‌బెరూనీ, ఉన్సూరి, పుక్రి, ఉద్బి, ఫిర్దౌసి లాంటి గొప్ప కవులు గజనీ ఆస్థానాన్ని ఆశ్రయించారు. ఫిర్దౌసి ‘షానామా’ అనే గ్రంథాన్ని రచించాడు. గజనీ సామ్రాజ్యం ఇరాక్, కాస్పియన్‌ సముద్రాల నుంచి గంగానది వరకు విస్తరించింది. 


 భారతదేశంలో తురుష్కుల రాజ్యస్థాపనకు గజనీ కారణమయ్యాడు. 


 ఇతడి దండయాత్రలన్నీ భారతదేశాన్ని దోచుకోవడమే లక్ష్యంగా జరిగాయి తప్ప సామ్రాజ్య స్థాపన దిశగా సాగలేదు. మత మార్పిడికి పాల్పడ్డాడు కానీ ఇస్లాం మతవ్యాప్తికి కృషి చేయలేదు. పంజాబ్, ముల్తాన్‌లను ఆక్రమించి తురుష్కుల పాలనకు నాంది పలికాడు.


 ఈ దాడుల తర్వాత కూడా భారతదేశ రాజులు సైనిక శక్తిని పెంచుకోలేదు.


 భారతదేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. భారతీయ శిల్పకళకు నష్టం వాటిల్లింది.


గజనీ రాజ్యం


 తురుష్కులు ఇస్లాంను స్వీకరించి, ఆ మత వ్యాప్తిని చేపట్టారు. 10వ శతాబ్దంలో ఖలీఫాల ప్రాబల్యం తగ్గాక, తురుష్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. 


 గజనీ కేంద్రంగా క్రీ.శ.962లో అలప్తజిన్‌ తురుష్క సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అతడి వారసుడు సుబక్తజిన్‌. 


 సుబక్తజిన్, హింద్‌ షాహీ రాజ్య పాలకుడు ఆనందపాలుడికి మధ్య వివాదాలు ఉండేవి. 


 సుబక్తజిన్‌ రాజపుత్రుల నుంచి పెషావర్‌ను ఆక్రమించుకున్నాడు. ఇతడికి ‘మిర్‌-ఉల్‌-అయాని’ అనే బిరుదు ఉంది.


రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 30-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సింధు నాగరికత ప్రాచీనం నుంచి నవీనానికి!

 కంచు యుగంలో నవీన న‌గ‌రాలు !

ఆధునిక యుగానికి ఏమాత్రం తీసిపోని జీవనశైలి, సాంకేతిక నిర్మాణాలు, ప్రణాళికతో కూడిన పట్టణ సంస్కృతి క్రీస్తు పూర్వమే సింధు నాగరికత రూపంలో భారతదేశంలో విరాజిల్లింది. పూర్వ భారతదేశ చరిత్రలో కలికితురాయిగా, తొలి నాగరిక ప్రపంచానికి తలమానికంగా నిలిచిపోయింది. చారిత్రక ఆధారాల ప్రకారం అప్పటి సమాజం కూర్పు, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన విధానం, వ్యాపకాలు, వినోదాలు, పండించిన పంటలు, తిన్న ఆహారం గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రకృతి ఆరాధన, స్త్రీ పురుష భేదం లేని వైఖరి, కళా కౌశలత లాంటి ఆదర్శాలతో పాటు భూమి పొరల్లో దాగిన నాటి గుర్తులు, వారు వదిలివెళ్లిన వారసత్వపు అంశాలను తెలుసుకోవాలి.

వ్యవసాయ పరిజ్ఞానం సాధించి, పంటలు పండించి, సంచార జీవితానికి స్వస్తి చెప్పి, స్థిర జీవితాన్ని గడపడం మొదలైన నవీన రాతి యుగం మానవ సమాజ మహాప్రస్థానంలో ఒక విప్లవాత్మక యుగం. ఆ తదనంతర పరిణామమే తామ్ర శిలాయుగం. ఈ యుగంలోనే భారతదేశ వాయవ్య ప్రాంతంలో అనేక గ్రామీణ సంస్కృతులు ఏర్పడ్డాయి. తామ్రం, సీసం కలిపి కాంస్యం తయారు చేయడం ప్రారంభమైంది. అధిక వ్యవసాయోత్పత్తి అమ్మకానికి దారితీసి, వ్యాపార కూడళ్లు ఏర్పడి క్రీ.పూ. 2700 నాటికి పట్టణాలుగా రూపొందాయి. ఈ కాంస్య యుగానికి చెందిందే పశ్చిమోత్తర భారతంలో వర్ధిల్లిన నగర నాగరికత - ‘సింధు నాగరికత’.

ప్రధాన అంశాలు:

పట్టణాలు: సింధు నాగరికత నిర్మాణాలు, నాటి ప్రజల జీవన విధానాన్ని, నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి. దాదాపు పట్టణాలన్నీ ఒకే విధమైన ప్రణాళికతో ఉన్నాయి. 

(i) ప్రతి పట్టణం రెండు భాగాలుగా ఉంది. ఒకటి పడమటి దిక్కున ఉన్న ఎత్తయిన ప్రాంతంలో (సిటాడెల్‌/ కోట) నిర్మించిన ప్రజాభవనాలు, స్నానవాటికలు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి (ఒక్క చాన్హుదారో మాత్రం దీనికి మినహాయింపు). 

(ii) పట్టణ తూర్పు వైపు సామాన్యులు నివసించే పౌర గృహాలు ఉన్నాయి. ఇక్కడి వీధులు, ఇళ్లన్నీ ఒక పద్ధతి ప్రకారం నిర్మితమయ్యాయి.

వీధులు: ప్రధాన వీధులను ఉత్తర, దక్షిణ దిశలుగా; ఉప వీధులను తూర్పు పడమరగా సరళరేఖ ఆకారంలో నిర్మించారు. వీధులు పట్టణాన్ని దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా తీర్చిదిద్దాయి. ప్రతి వీధికి అటూ, ఇటూ నివాస గృహాలున్నాయి. అన్ని వీధుల్లో దీపపు స్తంభాలు, చెత్తకుండీలు ఉన్నాయి. ఇళ్ల నుంచి మురుగు జలాలు మట్టిగొట్టాల ద్వారా వీధిలో పక్కాగా నిర్మించిన మురుగు నీటి కాల్వలోకి చేరే ఏర్పాటు ఉంది. కాల్చిన ఇటుకలతో నిర్మించిన గృహాలు వీధికి ఇరువైపుల్లో కనిపిస్తాయి. ఇళ్ల నిర్మాణంలో వైవిధ్యం  ఉంది. ఇంటి ప్రధాన ద్వారాన్ని పెరటి వైపు ఏర్పాటు చేశారు. ఇళ్లు రెండు నుంచి అయిదారు గదులతో విశాలంగా ఉన్నాయి. కొన్ని గృహాలు ఒకట్రెండు అంతస్తులతో నిర్మితమయ్యాయి. ఇంటి పెరట్లో బావి, మరుగుదొడ్లు ఉన్నాయి.  హరప్పాలో రావి నది ఒడ్డున ‘గొప్ప ధాన్యాగారం’ గుర్తించారు. ఒక్కొక్కటి ఆరు గదులతో ఉన్న రెండు దీర్ఘచతురస్రాకార బ్లాకులు ఒక ఎత్తయిన వేదికపై నిర్మించి ఉన్నాయి. వీటిని పన్నుల రూపంలో సేకరించిన ధాన్యాన్ని లేదా వ్యాపారం కోసం తెచ్చిన ధాన్యాన్ని నిల్వ  చేసేందుకు ఉపయోగించి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు.  మొహెంజోదారో వద్ద తవ్వకాల్లో అద్భుత వాస్తు ప్రావీణ్యంతో నిర్మించిన ‘స్నానవాటిక’ బయటపడింది. దీర్ఘచతురస్రాకార స్నానఘట్టంలోకి దిగడానికి ఉత్తరాన ఒకటి, దక్షిణాన ఒకటి - మొత్తం రెండు వెడల్పాటి మెట్ల వరుసలున్నాయి. నీరు ప్రవేశించడానికి ఒక మూల మార్గాన్ని ఏర్పాటు చేశారు. స్నానఘట్టపు అడుగులో నీరు కారిపోకుండా ఇటుకలతో, అంచులను మట్టి అడుసుతో కట్టారు. చుట్టూ ఉన్న గోడలనూ అదే విధంగా నిర్మించారు. తూర్పు, ఉత్తర, దక్షిణ అంచుల్లో ఇటుకలతో వసారా నిర్మించారు. వేదిక మీద వస్త్రాలు మార్చుకోవడానికి గదులను ఏర్పాటు చేశారు. 

సాంఘిక పరిస్థితులు: వీరి ప్రధాన ఆహారం బార్లీ, గోధుమ. జంతుమాంసం, పాలు, పాల ఉత్పత్తులు, కూరలు, పండ్లు కూడా వీరి ఆహారంలో భాగమే. చెరకు వీరికి తెలుసు అనే అంశంపై సందేహాలు ఉన్నాయి.  సింధు ప్రజలే ప్రపంచంలో మొదటగా పత్తి పండించిట్లు తెలుస్తోంది. వీరు కాటన్‌ (నూలు), ఊలు దుస్తులు వాడేవారు. వస్త్రధారణ, ఆభరణాల విషయంలో స్త్రీ పురుష భేదం లేదు. కంఠాభరణాలు, వడ్డాణాలు, గాజులు, ముక్కుపుడకలు, చెవిదుద్దులు, చెవిపోగులు, కడియాలు వారి ఆభరణాల్లో కొన్ని రకాలు. సింధు ప్రజలు అలంకార ప్రియులు. పురుషులు గడ్డాలు, మీసాలు క్రమపద్ధతిలో పెంచేవారు. స్త్రీలు అనేక సౌందర్య సాధనాలు వాడారు. ఈ విషయంలో ప్రస్తుతకాల మహిళలకు సింధు నాగరికత స్త్రీలు ఏ విధంగానూ తక్కువ కారని ఆర్‌.సి.మజుందార్‌ అనే చరిత్రతకారుడు వ్యాఖ్యానించారు. సంగీతం, నృత్యం, వేట, జూదం, చదరంగం నాటి ముఖ్య వినోదాలు. రాతి శిల, రాగి, కంచుతో చేసిన గొడ్డలి, బల్లెం లాంటి ఆయుధాలు వాడారు. సింధు నాగరికత పట్టణాల్లో పురావస్తు శాఖ తవ్వకాల్లో సుమారు రెండు వేలకు పైగా, స్టియాటైట్‌ (Steatite) అనే మెత్తటి రాతితో చేసిన దీర్ఘచతురస్రాకార లేదా చతురస్రాకార ముద్రలు (సీల్స్‌) బయటపడ్డాయి. వీటి పైభాగంలో చిత్ర లిపి ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. 

ఆర్థిక పరిస్థితులు: వీరి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, పశుపోషణ, వ్యాపార వాణిజ్యాలు ఉన్నాయి. బార్లీ, గోధుమ, నువ్వులు, ఆవాలు, ఖర్జూరం, బఠానీ ముఖ్యపంటలు. ఈ కాలం నాటికి వ్యవసాయాభివృద్ధి జరిగి, అధిక ఉత్పత్తి వాణిజ్యానికి దారితీసి అభివృద్ధి జరిగింది. వీరు సమకాలీన మెసపటోమియా నాగరికతతో వ్యాపార, వాణిజ్యాలు నిర్వహించారు. మెసపటోమియా ఆధారాలు (రికార్డులు) సింధు నాగరికతను ‘మెలూహ’ అని పేర్కొన్నాయి. రెండు నాగరికతల మధ్య ‘దిలమున్‌’, ‘మకాన్‌’ అనే రెండు వాణిజ్య కేంద్రాలు ఉండేవి. వాటినే ప్రస్తుత బెహ్రెయిన్, మక్రాన్‌ తీరంగా భావిస్తున్నారు. ఎద్దుల బండి, పడవలు.. వారి రవాణా, ప్రయాణ సాధనాలు. సమాజంలో  వ్యవసాయదారులు, వడ్రంగి, కుమ్మరి, స్వర్ణకారులు, ఇటుకలు తయారుచేసేవారు తదితర అనేక వృత్తులవారు ఉన్నారు. లోథాల్‌ ముఖ్య ఓడరేవు. సముద్ర వ్యాపారం లోథాల్‌ రేవు ద్వారా జరిగేది. సింధు ప్రజలు నిర్ణీత బరువున్న రాళ్లను (13.64 గ్రాములకు సమానం) తూనికలుగా వాడేవారు. గాడిదలు, గొర్రెలు, ఏనుగులు, ఎద్దులు మొదలైన జంతువులను ఆ కాలం ప్రజలు మచ్చిక చేసుకున్నారు. గుర్రం అవశేషాలు సర్కుతోడ (గుజరాత్‌) అనే ప్రాంతంలో లభించినప్పటికీ, సింధు ప్రజలు గుర్రాన్ని మచ్చిక చేసుకుని ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. సింధు ప్రజలకు లోహ పరిజ్ఞానం ఉంది. తవ్వకాల్లో రాగి, కాంస్యం, వెండి, బంగారంతో చేసిన వస్తువులు లభించాయి. వీరికి ఇనుము తెలియదు.

మత పరిస్థితులు: తవ్వకాల్లో దేవాలయాల లాంటి నిర్మాణాలు లేదా పురోహిత వర్గం ఉన్నట్లు రుజువులు లభించలేదు. అయితే వీరికి మత విశ్వాసాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. తలపై విసనకర్ర లాంటి తలపాగా అలంకారం, నడుముకు వడ్డాణం, శరీరంపై విశేష ఆభరణాలున్న స్త్రీమూర్తి, టెర్రకోట (మట్టి) బొమ్మలు అన్ని ప్రాంతాల్లో విరివిగా లభించాయి. బహుశా ఈమె సింధు ప్రజల దేవత (అమ్మతల్లి) అయి ఉండవచ్చని భావిస్తు న్నారు. సింధు ప్రజలు అమ్మతల్లి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చారు. పశుపతి, వృక్షాలు, నదులతోపాటు సర్పం లాంటి వాటిని ఆరాధించారు.మరణించిన వారిని భూస్థాపితం చేయడం లేదా పార్థివ దేహాన్ని ప్రకృతికి వదిలిపెట్టి తర్వాత అవశేషాలను భూస్థాపితం చేయడం లేదా దహనం చేయడం లాంటి విధానాలు అనుసరించేవారు.

కళ: సింధు ప్రజల కళా కౌశలం వారు తయారుచేసిన ముద్రలు (సీల్స్‌), మట్టి, లోహం, రాతితో చేసిన బొమ్మలు, కుండలపై వేసిన చిత్రకళలో ప్రతిబింబిస్తుంది. ఒక ముద్ర మీద ముక్కాలి పీటపై ఒక వ్యక్తి ధ్యానంలో కూర్చొని ఉంటాడు. అతడి తలపై మూడు కొమ్ములతో ఉన్న తలపాగా ఉంది. చుట్టూ ఏనుగు, పులి, గేదె, ఖడ్గమృగం ఉన్నాయి. పీఠం కింద రెండు జింకలు ఉన్నాయి. ఆ యోగి రెండు చేతులకు గాజులు ఉన్నాయి. ఛాతీ మీద నిండుగా ఒక కవచం ఉంది. జాన్‌ మార్షల్‌ ఈ యోగిని మూల పశుపతినాథుడు అని పిలిచాడు. మొహెంజోదారోలో లభించిన నాలుగున్నర అంగుళాల నాట్యగత్తె కాంస్య విగ్రహం - కుడిచేయి నడుముకు ఆనించింది. ఎడమచేయి నిండా గాజులతో, మెడలో కంఠాభరణంతో, అర్ధ నిమిలిత కళ్లతో ఉండి, ఆనాటి కళా  కౌశలానికి పరాకాష్టగా నిలిచింది. హరప్పాలో ఎరుపు రాతితో చెక్కిన నగ్నంగా ఉన్న పురుషుడి ఛాతి విగ్రహం లభించింది. ఇలాంటివన్నీ ఆనాటి కళాకారుల అద్భుత ప్రతిభకు తార్కాణాలు. ఇన్ని విశిష్ట లక్షణాలతో ఉన్న భారతదేశ తొలి నాగరికత క్రీ.పూ.1500 నాటికి పూర్తిగా అదృశ్యమైంది. దీనికి కారణాలు వివరించడంలో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ నాగరికత ఒక్కసారిగా అదృశ్యమవడానికి భూకంపాలు, అకస్మాత్తు వరదలు, వాతావరణంలో మార్పులు, ఆర్యుల దండయాత్రలు మొదలైన వాటిని కారణాలుగా భావి స్తున్నారు. సుమారు 1500 సంవత్సరాలు భారతదేశ పశ్చిమోత్తర భాగంలో వర్ధిల్లిన ఈ నాగరికత తర్వాతి తరాలను ప్రభావితం చేసి, అనేక అంశాలను వారసత్వంగా అందించింది. కాల్చిన ఇటుకలతో క్రమబద్ధమైన ఇళ్ల నిర్మాణం, మురికి కాలువ నిర్మాణాలు ఇప్పటికీ కొనసాగుతు న్నాయి. అమ్మతల్లి, పశుపతినాథుడు, ప్రకృతిల ఆరాధన, స్వస్తిక్‌ చిహ్నం నేటికీ నిలిచి ఉన్నాయి. మహోన్నత సింధు నాగరికత క్రీ.పూ.1500 నాటికి అదృశ్యమైంది. ఆ స్థానంలోకి ఆర్యులు ప్రవేశించడంతో మరో సరికొత్త నాగరికత ప్రారంభమైంది.


 


వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 12-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చోళులు

భారతదేశ చరిత్ర

 


దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో చోళులు ప్రముఖులు. వీరు క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు తమిళ రాజ్యాన్ని పాలించారు. చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు. ఈ సామ్రాజ్యం రాజరాజ, రాజేంద్ర చోళుల కాలంలో గొప్పగా విరాజిల్లింది. వీరు అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి పటిష్ట పాలనను అందించారు. చోళులు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు. స్థానిక స్వపరిపాలనా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేశారు.

చారిత్రక నేపథ్యం

చోళుల గురించిన ప్రస్తావన మొదటగా ‘సంగం యుగ’ సాహిత్యంలో కనిపిస్తుంది. అయితే ప్రాచీనకాలంలోనే మహాభారతం, అశోకుడి శిలాశాసనాలు, మెగస్తనీస్‌ రచనల్లో వీరి గురించి ఉంది.

బౌద్ధ గ్రంథాలైన మహావంశం, దీపవంశం; టాలమీ రచనలు; ‘పెరిప్లస్‌-ఆఫ్‌-ది-ఎరిత్రియన్‌-సి’ గ్రంథాల్లో చోళుల ప్రస్తావన ఉంది. 

క్రీ.శ.1వ శతాబ్దం నుంచే చోళులు రాజకీయంగా అనేక మంది రాజుల వద్ద సేనాధిపతులుగా పనిచేశారు. క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి ‘కరికాల చోళుడు’ ప్రాచీన చోళసామ్రాజ్యాన్ని స్థాపించి, గొప్ప వీరుడిగా పేరొందాడు. 

ఇతడు ‘వెన్ని’ యుద్ధంలో చేర-పాండ్య కూటమిపై గెలిచాడు. తర్వాత సింహళ రాజును ఓడించి, 1200 మందిని యుద్ధ ఖైదీలుగా బంధించాడు. వారితో కావేరీ నదిపై ఆనకట్టలు కట్టించాడు.

ఇతడి తర్వాత ‘నెడుమికిల్లి’ రాజయ్యాడు. ఇతడి కాలంలో కలభ్రులు, సముద్రపు దొంగలు, పల్లవులు, కేరళీయులు, పాండ్యులు చోళ రాజధానిపై దాడి చేశారు. దీంతో ప్రాచీన చోళసామ్రాజ్యం పతనమైంది. 

క్రీ.శ. 9వ శతాబ్దంలో విజయాలయ చోళుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీంతో చోళ పాలన పునరుద్ధరణ జరిగింది.

రాజకీయ చరిత్ర

విజయాలయ చోళుడు

క్రీ.శ. 850 నుంచి క్రీ.శ. 870 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదట్లో పల్లవులకు సామంతుడిగా ఉన్నాడు.

విజయాలయుడు క్రీ.శ. 850లో పాండ్య సామంతుడు ‘ముత్తరయార్‌’ను ఓడించి, తంజావూరును ఆక్రమించాడు. అక్కడ ‘విసంభసూధిని’ అనే దేవాలయాన్ని కట్టించాడు.

ఆ సమయంలో పల్లవులు, పాండ్యుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా చేసుకున్న విజయాలయ చోళుడు తంజావూరును రాజధానిగా చేసుకుని స్వతంత్ర చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

మొదటి ఆదిత్య చోళుడు 

క్రీ.శ. 870 నుంచి క్రీ.శ. 907 వరకు రాజ్యపాలన చేశాడు. 

పల్లవరాజు నందివర్మ మరణించాక అతడి కుమారులైన నృపతుంగవర్మ, అపరాజితవర్మ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. దీనికి ‘శ్రీపురంజియం’ యుద్ధం అని పేరు. ఇందులో ఆదిత్య చోళుడు అపరాజితవర్మకు సహాయం చేయగా, నృపతుంగవర్మకు పాండ్యరాజు వరగుణవర్మ సాయం చేశాడు.

ఆదిత్య చోళుడు వరగుణవర్మను ఓడించి అపరాజితవర్మ విజయానికి సాయం చేశాడు. దీంతో అతడు తంజావూరు పరిసర ప్రాంతాలను పొందాడు. తర్వాత ఆదిత్య చోళుడు అపరాజితవర్మను ఓడించి కంచిని ఆక్రమించి, తన రాజ్యంలో కలుపుకున్నాడు. 

పాండ్యుల నుంచి కోయంబత్తూరు, సేలంను ఆక్రమించాడు. ఇతడు రాతితో ఎత్తయిన శివాలయాలు నిర్మించాడు.

పరాంతక చోళుడు 

క్రీ.శ. 907 నుంచి క్రీ.శ. 955 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదటి ఆదిత్య చోళుడి కుమారుడు. 

క్రీ.శ. 910లో పాండ్యరాజు మారవర్మ రెండో రాజసింహుడ్ని ఓడించి, మధురైను స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఇతడికి ‘మధురై కొండ’ అనే బిరుదు వచ్చింది.

ఇతడి కాలంలో రాష్ట్రకూటులతో వైరం ప్రారంభమైంది. రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు పశ్చిమ గాంగుల సాయంతో పరాంతకుడిపై దండెత్తాడు. పరాంతక చోళుడు వారిని ‘పల్లాల యుద్ధం’లో ఓడించాడు. దీనికి గుర్తుగా ఇతడు చిదంబరంలోని నటరాజ దేవాలయ పైకప్పుకి బంగారుపూత పూయించాడు. 

క్రీ.పూ. 949లో మూడో కృష్ణుడు తక్కోళం యుద్ధంలో పరాంతకుడ్ని ఓడించాడు. ఇతడి జైత్రయాత్ర రామేశ్వరô వరకు సాగింది. అక్కడ మూడో కృష్ణుడు విజయస్తంభం వేయించాడు.

పరాంతకుడు మరణించాక (క్రీ.శ. 955985్శ చోళ సామ్రాజ్యం బలహీనమైంది. 

పరాంతకుడి తర్వాత గండరాదిత్య, అరింజయ, రెండో పరాంతక, రెండో ఆదిత్య ఉత్తమ చోళులు రాజ్యపాలన చేశారు. 

ఉత్తమ చోళుడి కుమారుడు రాజరాజ - 1 కాలంలో చోళ సామ్రాజ్యం మళ్లీ శక్తిమంతమైంది. ఉత్తమ చోళుడికి మరో పేరు సుందర చోళుడు.

మొదటి రాజేంద్ర చోళుడు

క్రీ.శ. 1014 నుంచి క్రీ.శ. 1044 వరకు రాజ్యపాలన చేశాడు. యువరాజుగా ఉన్నప్పుడే చాళుక్యులపై విజయం సాధించాడు. 

కల్యాణి చాళుక్యులను అనేకసార్లు ఓడించి, వేంగి రాజ్యంపై చోళప్రాబల్యం పెంచాడు. 

క్రీ.శ.1018లో సింహళరాజు అయిదో మహేంద్రుడ్ని ఓడించాడు. క్రీ.శ. 1019లో పాండ్య, చేర రాజ్యాలపై దండెత్తి జయించాడు.

వేంగిరాజు రాజరాజ నరేంద్రుడికి తన కుమార్తె ‘అమ్మంగదేవి’ని ఇచ్చి వివాహం చేశాడు. యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయిన రాజరాజనరేంద్రుడికి తిరిగి వేంగి సింహాసనాన్ని అప్పగించాడు.

బెంగాల్‌ పాలకుడు ‘మహిపాలుడ్ని’ ఓడించి ‘గంగైకొండన్‌’ అనే బిరుదు పొందాడు. 

వ్యాపారాభివృద్ధి కోసం మలయా, సుమిత్రాలను పాలిస్తున్న శైలేంద్ర వంశీయుడు శ్రీవిజయోత్తమవర్మను ఓడించాడు. క్రీ.శ. 1025లో అతని రాజధాని ‘కడారం’ను ఆక్రమించి, ‘కడారం కొండ’ అనే బిరుదు పొందాడు. 

క్రీ.శ. 1041లో శ్రీలంకను ఆక్రమించాడు. దీంతో ఇతడికి బంగాళాఖాతం, హిందూ, అరేబియా సముద్రాలపై ఆధిపత్యం దక్కింది. ‘త్రి సముద్రాధీశ్వర’ అనే బిరుదు పొందాడు.

రాజేంద్ర చోళుడు ‘గంగైకొండ చోళపురం’ అనే కొత్త పట్టణాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. అక్కడే గొప్ప తటాకాన్ని నిర్మించాడు. వేద, వ్యాకరణ, న్యాయ మీమాంస శాస్త్రాల బోధనకు 14 మంది ఉపాధ్యాయులను నియమించాడు. 

నౌకాబలాన్ని అభివృద్ధి చేసి, చైనాకు వ్యాపారాభివృద్ధి కోసం రాయబారులను పంపాడు. 

ముడికొండ (కేరళ, పాండ్య, సింహళ రాజులను జయించినవాడు), గంగైకొండ (గంగాపరీవవాహ ప్రాంతాన్ని జయించినవాడు), కడారకొండ (శ్రీవిజయరాజ్య రాజధాని ‘కడారం’ విజేత) అనే బిరుదులు ఇతడి విజయాలను సూచిస్తున్నాయి. 

ఇతడికి రాజాధిరాజు ఖి, రెండో రాజేంద్రుడు, వీర రాజేంద్రుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

రాజాధిరాజు - ఖి 

క్రీ.శ. 1044 నుంచి క్రీ.శ. 1052 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలం మొత్తం యుద్ధాలతో గడిచింది.

ఇతడు వేంగిపై దండెత్తి, పశ్చిమ చాళుక్యరాజు విక్రమాదిత్యుడ్ని ‘ధాన్యకటక’ యుద్ధంలో ఓడించి, ‘కొల్లిపాక’ను ధ్వంసం చేశాడు. 

చాళుక్య సామంతులను ఓడించి, ‘కంపిలి’పై అధికారం చెలాయించాడు. యాతగిరి (యాగ్గిరి) ప్రాంతంలో తన విజయాలకు చిహ్నంగా ‘పులిగుర్తుతో’ స్తంభాన్ని వేయించాడు. 

కల్యాణి పట్టణాన్ని ఆక్రమించి ‘విజయరాజేంద్ర’ అనే బిరుదు పొందాడు. ఇక్కడి నుంచే ‘ద్వారపాలక’ ప్రతిమను తెచ్చి తంజావూరులోని ‘ధారాసురం’ దేవాలయంలో నెలకొల్పినట్లు తమిళ శాసనంలో ఉంది. 

ఈ సమయంలో మధుర, సింహళంలో తిరుగుబాట్లు చెలరేగగా, వాటిని అణచివేశాడు. క్రీ.శ. 1052లో చాళుక్యులతో జరిగిన ‘కొప్పం యుద్ధం’లో మరణించాడు.

రెండో రాజేంద్ర చోళుడు 

క్రీ.శ. 1052 నుంచి క్రీ.శ.1064 వరకు రాజ్యపాలన చేశాడు. కొప్పం యుద్ధంలో రాజాధిరాజు మరణించినప్పటికీ, రాజేంద్ర చోళుడు యుద్ధం కొనసాగించి, విజయం సాధించాడు. 

ఇతడికి యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం జరిగింది. ఇతడు ‘కొల్లాపురం’లో విజయస్తంభం వేయించాడు. 

క్రీ.శ. 1062లో ‘కూడలి సంగం’ యుద్ధంలో చాళుక్య సేనలను పూర్తిగా ఓడించాడు.

చివరి చోళ రాజులు

రెండో రాజేంద్ర చోళుడి తర్వాత రాజ్యపాలన చేసిన వారిని కడపటి చోళరాజులు అని పేర్కొంటారు.

రెండో రాజేంద్రుడి తర్వాత వీరరాజేంద్ర 

క్రీ.శ.1064-70, ఆదిరాజేంద్ర (క్రీ.శ. 1070), కులోత్తుంగ చోళుడు (క్రీ.శ. 1070-1120) పాలించారు. కులోత్తుంగ చోళుడి తల్లిదండ్రులు రాజరాజ నరేంద్రుడు, అమ్మంగదేవి.

చోళ వంశంలో చివరివాడు మూడో రాజేంద్రచోళుడు. ఇతడు క్రీ.శ. 1256-70 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కాకతీయ రాజైన గణపతిదేవుడ్ని ఓడించాడు. 

పాండ్యరాజు కులశేఖర కాలంలో చోళ సామ్రాజ్యం పాండ్యరాజ్యంలో విలీనమైంది. దీంతో చోళుల పాలన అంతమైంది.

రాజరాజ చోళుడు -

క్రీ.శ. 985 నుంచి క్రీ.శ. 1014 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి పాలనాకాలంలో చోళ సామ్రాజ్య కీర్తిప్రతిష్ఠలు పెరిగాయి. 

రాజరాజ చోళుడు గొప్పయోధుడు. ఇతడు మొదట పాండ్య, కేరళ, సింహళ రాజ్యాలపై దాడిచేశాడు. రెండోసారి పాండ్య, కేరళ రాజులను కండలూర్, విలినమ్‌ యుద్ధాల్లో ఓడించాడు. 

ఇతడు నౌకాదళాన్ని అభివృద్ధి చేశాడు. సింహళరాజు అయిదో మహేంద్రను ఓడించి, అనురాధాపురాన్ని కొల్లగొట్టాడు. సింహళంలో తాను ఆక్రమించిన భూభాగానికి ‘పోలోన్నరువ’ను రాజధానిగా చేశాడు. 

క్రీ.శ. 991లో గాంగవాడి, నోళంబవాడి, తడిగైపవాడి, మైసూరును జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు.

తూర్పు చాళుక్యులను ఓడించి, వేంగిని  ఆక్రమించిన తెలుగు జటాచోడ భీముడ్ని 

క్రీ.శ. 1000లో ఓడించాడు. శక్తివర్మకు వేంగి సింహాసనాన్ని అప్పగించాడు. శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యుడికి తన కుమార్తె కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. దీంతో చోళ, చాళుక్య రాజ్యాల మధ్య మైత్రి బలపడింది.

కల్యాణి చాళుక్య రాజు సత్యాశ్రయుడు క్రీ.శ. 1006లో వేంగిపై దండెత్తాడు. ఆ యుద్ధంలో రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళుడు సత్యాశ్రయుడ్ని ఓడించాడు. 

క్రీ.శ.1003లో చాళుక్య తైలపుడ్ని ఓడించి, కట్టవాడిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. 

వేంగిని ఆక్రమించాలనుకున్న కళింగ గాంగులను రాజరాజు ఓడించాడు. ఇతడు తన నౌకాబలంతో మాల్దీవులను జయించాడు.

ఇతర విషయాలు.. 

రాజరాజ చోళుడు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమేకాక, ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించాడు. రాజ్యంలోని భూములను సర్వే చేయించి, గ్రామపాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 

రాజరాజ శివభక్తుడు. ఇతడికి ‘శివపాదశేఖర’ అనే బిరుదు ఉంది. ఇతర బిరుదులు:‘జయంగోడ’, ‘చోళమార్తాండ’, ‘ముమ్మడిచోళ’, ‘కేరళాంతక’.

ఇతడ్ని మొదట్లో ‘రాజకేసరి అరుమోళివర్మన్‌’ అనే పేరుతో పిలిచేవారు. 

ఇతడు క్రీ.శ. 1010లో తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. దీన్నే ‘రాజరాజేశ్వరాలయం’ అంటారు. 

శ్రీవిజయ రాజ్యానికి చెందిన శైలేంద్ర వంశ రాజు శ్రీమార విజయోత్తుంగవర్మ ఇతడి స్నేహితుడు. ఇతడి కోరిక మేరకు రాజరాజ నాగపట్నంలో బౌద్ధవిహార నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. క్రీ.శ 1006లో ఆ విహారానికి ‘అనైమాంగలం’ అనే గ్రామాన్ని దానం చేశాడు.

మాదిరి ప్రశ్నలు

1. ‘సౌత్‌ ఇండియన్‌ నెపోలియన్‌’ అని ఎవరిని అంటారు?

1)రాజరాజ - I   2)రాజేంద్ర చోళుడు   3) రాజరాజ - II    4) నరేంద్ర చోళుడు

2. ‘ఇండియన్‌ నెపోలియన్‌’ అనే బిరుదు ఎవరిది?

1)సముద్రగుప్త   2)రెండో చంద్రగుప్త  3)కుమారగుప్త   4)స్కందగుప్త

3. ‘గంగైకొండ’ అనే బిరుదు ఎవరిది?

1)రాజరాజ    2)అనంత చోళుడు 3)రాజాధిరాజ    4)రాజేంద్ర చోళుడు

4. ఉత్తర మేరూర్‌ శాసనం ఎవరి పాలనా విధానాన్ని తెలుపుతుంది?

1)చోళులు    2)చాళుక్యులు 3)మౌర్యులు    4)రాష్ట్రకూటులు

5. ‘గంగైకొండ చోళపురం’ అనే నగరాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చోళరాజు ఎవరు?

1)రాజేంద్రచోళ - I  2)మొదటి రాజరాజు   3)మొదటి పరాంతక      4)ఆదిత్య చోళుడు

సమాధానాలు

1-2  2-1  3-4  4-1  5-1

 

Posted Date : 09-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌