మాదిరి ప్రశ్నలు
1. ఫాస్టాగ్‌లో ఉపయోగించే రేడియో తరంగాల పౌనఃపున్య వ్యాప్తి?
1) 30 - 300 MHz 2) 500 - 660 MHz
3) 860 - 960 MHz 4) 460 - 560 MHz
2. ఎమ్ఆర్ఐ స్కానర్‌లో ఏ తరంగాలను ఉపయోగిస్తారు?
1) గామా కిరణాలు 2) పరారుణ వికిరణాలు
3) అతినీలలోహిత వికిరణాలు 4) రేడియో తరంగాలు
3. మైక్రోవేవ్ ఓవెన్లలో మైక్రో తరంగాలను ఉత్పత్తి చేసే పరికరం?
1) మాగ్నట్రాన్ 2) సైక్లోట్రాన్ 3) బీటాట్రాన్ 4) ఏదీకాదు
4. టీవీ రిమోట్లలో ఉపయోగించే కిరణాలు?
1) X - కిరణాలు 2) పరారుణ వికిరణాలు
3) అతినీలలోహిత వికిరణాలు 4) మైక్రో తరంగాలు
5. CT స్కానర్‌లో ఉపయోగించే కిరణాలు?
1) X - కిరణాలు 2) గామా కిరణాలు
3) తెల్లని కాంతి 4) మైక్రో తరంగాలు
6. కిందివాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
a) రేడియో ప్రసారాలు i) LF బ్యాండ్
b) సముద్ర, సంచార సాధనాలు ii) HF బ్యాండ్
c) టీవీ ప్రసారాలు iii) SHF బ్యాండ్
d) ఉపగ్రహ సమాచారం iv) VHF బ్యాండ్
1) a-i, b-iii, c-iv, d-ii 2) a-iv, b-i, c-ii, d-iii
3) a-ii, b-i, c-iv, d-iii 4) a-iii, b-iv, c-i, d-ii
7. లైఫై టెక్నాలజీలో ఉపయోగించే తరంగాలు?
1) తెల్లని కాంతి 2) X - కిరణాలు 3) గామా కిరణాలు 4) రేడియో తరంగాలు
8. అతినీలలోహిత వికిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త?
1) విలియం హర్షెల్ 2) విల్హెల్మ్ రిట్టర్ 3) విల్లార్డ్ 4) మార్కొని
9. UHF బ్యాండ్ పౌనఃపున్య అవధి?
1) 300 MHz - 3 GHz 2) 30 - 300 MHz
3) 3 - 30 GHz 4) 30 - 300 GHz
10. కింది ఏ పౌనఃపున్య బ్యాండ్‌ను ఖగోళ శాస్త్రంలో ఉపయోగిస్తారు?
1) HF 2) VHF 3) EHF 4) MF
సమాధానాలు
1-3, 2-4, 3-1, 4-2, 5-1, 6-3, 7-1, 8-2, 9-1, 10-3.