• facebook
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంత తరంగాలు

మాదిరి ప్రశ్నలు

1. శూన్యంలో కాంతి వేగం ఎంత?
జ: 3 × 108 మీ./సె.


2. కిందివాటిలో విద్యుదయస్కాంత తరంగాలు కానివి?
జ: ఆల్ఫా వికిరణాలు


3. కింది అంశాలను జతపరచండి.
జాబితా - I               జాబితా - II
a) తరంగదైర్ఘ్యం      i) జౌల్‌
b) పౌనఃపున్యం       ii) మీ./సె.
c) కాంతివేగం        iii) మీటర్‌
d) శక్తి                   iv)హెర్ట్జ్‌
జ:  a-iii, b-iv, c-ii d-i 


4. అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: సెప్టెంబరు 16


5. CFC అంటే ఏమిటి?
జ: క్లోరోఫ్లోరోకార్బన్‌లు 


6. కాంతి విశ్లేషణ లేదా విక్షేపణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త?
జ: న్యూటన్‌ 


7. సాధారణ మానవ కన్ను కింది ఏ తరంగ దైర్ఘ్యాల కాంతికి ప్రతిస్పందిస్తుంది?
జ:  380 nm - 750 nm 


8. ప్రతిపాదన (A): ఎరుపు రంగు లైట్లను ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో వాహనాలను నిలపడానికి ఉపయోగిస్తారు.
కారణం (R): ఎరుపు రంగుకు అత్యధిక తరంగదైర్ఘ్యం ఉంటుంది.
జ: A, R రెండూ నిజం, Aకు R సరైన వివరణ.


9. తేనెటీగలు కింది ఏ విద్యుదయస్కాంత తరంగాలను చూడగలవు?
జ: అతినీలలోహిత కిరణాలు 


10. కిందివాటిలో ప్రాథమిక రంగులు ఏవి?
i. ఎరుపు     ii. నీలం     iii. పసుపు
iv. ఆరెంజ్‌  v. ఆకుపచ్చ   vi. ఊదారంగు
జ: i, ii, v


11. కాంతి-దాని ధర్మాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
జ: ఆప్టిక్స్‌


12. కాంతి వేగంతో ప్రయాణించేవి?
జ: x - కిరణాలు , మైక్రో తరంగాలు 


13. కిందివాటిలో ఏ రంగుకు కనిష్ఠ శక్తి ఉంది?
జ: ఎరుపు 

 

14. C.T. స్కానింగ్‌ అంటే?
జ: కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ 


15. జీర్ణాశయాన్ని x  కిరణాలతో ఫొటో తీసే ముందు రోగికి ఏ రసాయన ద్రావణాన్ని తాగిస్తారు?
జ: బేరియం సల్ఫేట్‌  


16. ‘బేరియం మీల్స్‌’ అని ఏ రసాయన ద్రావణాన్ని పిలుస్తారు?
జ:  బేరియం సల్ఫేట్‌


17. విమానాశ్రయ భద్రతా స్కానర్‌లలో ఉపయోగించే విద్యుదయస్కాంత తరంగాలు?
జ:  x  కిరణాలు 


18. x  కిరణాల కంటే తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?
జ: గామా కిరణాలు 


19. అత్యధికంగా చొచ్చుకొని వెళ్లే సామర్థ్యం కలిగి ఉన్న కిరణాలు ఎవి?
జ: గామా కిరణాలు 


20. గామా కిరణాల రేడియేషన్‌ నుంచి రక్షించుకునేందుకు తయారుచేసే కవచాల్లో ఉపయోగించే పదార్థం ఏది?
జ: సీసం  


21. RADAR  అంటే?
జ:  Radio Detection and Ranging 


22. భూగోళం నుంచి అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల మధ్య దూరాలను కొలిచే పద్ధతిని ఏమంటారు?
జ: టెలిమెట్రి 


23. మైక్రోవేవ్‌ ఓవెన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జ: పెర్సీ స్పెన్సర్‌


24. కిందివాటిలో తక్కువ పౌనఃపున్యం కలిగిన విద్యుదయస్కాంత తరంగాలు ఏవి?
జ: రేడియో తరంగాలు 


25. కిందివాటిలో అధిక తరంగదైర్ఘ్యం కలిగి ఉన్న విద్యుదయస్కాంత తరంగాలు?
జ:  రేడియో తరంగాలు


26. మానసిక ఒత్తిడిని దూరంచేసి, మనిషి కంటికి ఆహ్లాదాన్ని కలిగించే రంగు ఏది?
జ: ఆకుపచ్చ  


27. విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించే వేగం?
జ: 3 x 108 మీ./సె., 3 x 1010 సెం.మీ./సె.


28. కిందివాటిలో సమాచారాన్ని తీసుకుని చాలాదూరం ప్రయాణించేవి ఏవి?
జ: రేడియో తరంగాలు   


29. రెండు వరుస శృంఖాలు లేదా ద్రోణులు మధ్య దూరాన్ని ఏమంటారు?
జ: తరంగదైర్ఘ్యం 


30. కిందివాటిలో రాంట్‌జన్‌ వికిరణాలు అని వేటిని పిలుస్తారు?
జ: x - కిరణాలు


31. కిందివాటిలో శ్రీ  కిరణాలకు సంబంధించి సరైంది?
జ: x - కిరణాలు ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు.


32. భౌతికశాస్త్రంలో మొదటిసారి నోబెల్‌ బహుమతి పొందిన శాస్త్రవేత్త?
జ: రాంట్‌జన్‌

Posted Date : 17-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌