• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం - సహజ వనరులు

పశ్చిమ హిమాలయాల్లో వికసించే బ్రహ్మకమలం

జీవరాశులు, ఆవరణ వ్యవస్థల మనుగడకు కావాల్సిన శక్తి అవసరాలను తీర్చే వాటినే సహజ వనరులు అంటారు. అవి ప్రకృతిలో సహజసిద్ధంగా ఆవిర్భవిస్తాయి. ఆధునిక   మానవులు వాటిని విచక్షణారహితంగా వినియోగిస్తూ, కలుషితం చేస్తూ వినాశనానికి కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాలుష్య కారకాలైన సంప్రదాయ ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించడం, పునరుత్పాదక శక్తి    వనరుల వినియోగాన్ని పెంచడం లక్ష్యాలుగా ప్రభుత్వాల విధానాలు రూపొందుతున్నాయి. వీటిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశంలో వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా వివిధ ప్రాంతాల్లో పెరిగే అడవులు, అక్కడి వృక్ష జాతులు, లభించే ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలి. అటవీ, జల సంరక్షణ, భూ స్వభావాల ఆధారంగా పాటించాల్సిన నీటిపారుదల పద్ధతులు తదితర పురోగామి అంశాలను అర్థం చేసుకోవాలి. 

 


1.  కిందివాటిలో సాంప్రదాయేతర శక్తి వనరు కానిది  ఏది?

1) చిన్నతరహా జలవిద్యుత్తు  2) కోల్‌బెడెడ్‌ మీథేన్‌ 

3) గ్యాస్‌హైడ్రేట్స్‌       4) బొగ్గు2.   కిందివాటిలో పునరుత్పాదక శక్తివనరు కానిది ఏది?

1) సౌరవిద్యుత్తు     2) జీవవ్యర్థం 

3) ఓషియన్‌ థర్మల్‌ ఎనర్జీ గ్రేడియెంట్         4) ముడిచమురు3.  కిందివాటిలో నవీన శక్తివనరు ఏది?

1) హైడ్రోజన్‌ ఎనర్జీ     2) జియోథర్మల్‌ ఎనర్జీ 

3) కోల్‌బెడెడ్‌ మీథేన్‌     4) పైవన్నీ 


 

4.  కిందివాటిలో తప్పుగా పేర్కొన్న దానిని గుర్తించండి.

1) బొగ్గు - సాంప్రదాయ, పునరుత్పత్తి చెందని ఇంధన వనరు

2) బయోగ్యాస్‌ - సాంప్రదాయేతర, పునరుత్పత్తి చెందే సహజ వనరు

3) జియోథర్మల్‌ ఎనర్జీ - నవీన, పునరుత్పత్తి చెందే సహజ వనరు

4) సహజవాయువు - సాంప్రదాయ, పునరుత్పత్తి చెందే సహజ వనరు5.  కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది?

1) జలవిద్యుత్తు      2) చిన్నతరహా జలవిద్యుత్తు 

3) వాయుశక్తి       4) పైవన్నీ 6.  భారతదేశంలో ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరిత అడవులు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

1) పశ్చిమ హిమాలయాలు         2) పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం 

3) పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం   4) తూర్పు హిమాలయాలు

 


7.  భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి?

1) తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు 

2) ఉప ఉష్ణమండల అనార్ధ్ర సతతహరిత అరణ్యాలు 

3) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు 

4) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరిత అరణ్యాలు  8.   షోలా అడవులు భారత్‌లో ఎక్కడ ఉన్నాయి?

1) హిమాలయాల్లో 1800 మీ. - 3300 మీ. ఎత్తులో

2) మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్‌ జిల్లాలో 

3) పంజాబ్‌ హిమాలయాలు

4) నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీ., అంతకంటే ఎక్కువ ఎత్తులో 9. సిగరెట్‌ పెట్టెల తయారీకి వాడే కలప పేరు? 

1) సెమూల్‌      2) హల్థా     3) సెడార్‌      4) చెస్ట్‌నట్స్‌ 10. క్రికెట్‌ బ్యాట్‌ల తయారీకి వాడే కలప పేరు? 

1) విల్లోస్‌    2) దేవదారు    3) సిల్వర్‌ఫర్‌     4) స్ప్రూస్‌11. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ (IUCN)) భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం?

1) ఎర్రచందనం     2) మంచి గంధం   3) జిట్టెగ     4) టెక్సాస్‌ 12. ఏ ప్రాంతంలో నిరుపయోగమైన భూమి ఎక్కువగా విస్తరించి ఉంది?

1) మధ్యప్రదేశ్‌     2) అరుణాచల్‌ ప్రదేశ్‌ 

3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) జమ్ము-కశ్మీర్‌ 

 


13. సుగంధద్రవ్యాల్లో వాడే అల్ఫైన్‌ జాతి ‘బ్రహ్మకమలం’ భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది?

1) పశ్చిమ హిమాలయాలు     2) కేరళ కొండలు 

3) తూర్పు హిమాలయాలు     4) గంగా మైదానం 14. పశ్చిమ బెంగాల్‌లో ‘జల్దపార సంరక్షణ కేంద్రం’లో పరిరక్షించే జంతువులు ఏవి?    

1) అడవి గాడిదలు     2) ఏనుగులు 

3) ఖడ్గమృగాలు     4) పులులు 15. భారత దేశంలో ఆకర్షణీయ పుష్పాలున్న రోడోడెండ్రాన్‌ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి?

1) లద్దాఖ్‌          2) సిక్కిం హిమాలయాలు 

3) టెరాయి మైదానం   4) వింధ్య పర్వతాలు 16. కిందివాటిని పరిశీలించండి. 

ప్రవచనం (ఎ): రుతువపన ప్రాంతంలో పెరిగే వృక్షజాతులు వేసవిలో ఆకులు రాలుస్తాయి.

కారణం (ఆర్‌): ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకులను రాలుస్తాయి.

1) ఎ, ఆర్‌ లు సరైనవి. ఎ కి ఆర్‌ సరైన వివరణ. 

2) ఎ, ఆర్‌ లు సరైనవి. కానీ, ఎ కి ఆర్‌ సరైన వివరణ కాదు 

3) ఎ సరైంది, ఆర్‌ సరైంది కాదు. 

4) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది.

 


17. కిందివాటిలో సవన్నా శీతోష్ణస్థితికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించండి.

1) దేశంలో వృక్షాలు లేని సవన్నా శీతోష్ణస్థితి ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో విస్తరించి ఉంది.

2) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని నైరుతి ప్రాంతాల్లో పొడి వాతావరణంతో కూడిన సవన్నా శీతోష్ణస్థితి ఉంది.

3) ఏ ప్రాంతంలోనైతే అనార్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు అగ్నిప్రమాదాల వల్ల కాలిపోతాయో ఆ ప్రదేశాలు అనార్ధ్ర సవన్నా ప్రాంతాలుగా మారిపోతాయి.

4) అనార్ధ్ర సవన్నా శీతోష్ణస్థితి ముఖ్య లక్షణం ముళ్లపొదలు, తుప్పలు, గడ్డిజాతులను కలిగి ఉండటం.18. కిందివాటిని జతపరచండి. 

వృక్షజాతి రకం      అటవీ రకం 

1) టేకు        ఎ) సతతహరిత అరణ్యాలు 

2) యుఫోర్బియా   బి) ఆకురాల్చు అరణ్యాలు 

3) రోజ్‌ఉడ్‌       సి) సవన్నా అరణ్యాలు 

4) సుంద్రీ        డి) మాంగ్రూవ్‌ అరణ్యాలు 

1) ఎ-2, బి-1, సి-3, డి-4    

2) ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-2, బి-3, సి-1, డి-4    

4) ఎ-1, బి-3, సి-2, డి-4

 


19. దేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల వరుసను గుర్తించండి.

1) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా 

2) మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ,   మణిపుర్‌ 

3) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా 

4) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌

 


20. క్షారత్వాన్ని తట్టుకుని పెరిగే ప్రాంతాల్లోని సతత హరితాలు దేశంలో కింద తెలిపిన ఏ ఉద్భిజ ప్రాంతంలో ఉన్నాయి?

1) ఉష్ణమండల సతతహరిత ప్రాంతాలు 

2) మాంగ్రూవ్స్‌

3) అనార్ధ్ర సతతహరితాలు         

4) ఆర్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు 

 


21. దేశంలో జలవనరుల అభివృద్ధి, నియంత్రణ కోసం జాతీయ జలవనరుల మండలి (NWRC)ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1981  2) 1982  3) 1983  4) 198422. దేశంలో జలవనరుల నిర్వహణకు మొదటి జలవిధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

1) 1983  2) 1987  3) 1989  4) 1992 23. పంట పొలాలకు నీటి లభ్యతను పెంచి, దేశంలో సాగునీటి సదుపాయం ద్వారా సాగు విస్తీర్ణతను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015-16లో ప్రారంభించిన కార్యక్రమం పేరు?

1) జలక్రాంతి అభియాన్‌  

2) ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన 

3) ఆగ్జిలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం

4) కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం

 

 

24. ఒక నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో, నదీ ప్రవాహ దారిని మళ్లించడానికి తాత్కాలికంగా నిర్మించే ఎత్తయిన కట్టడాలను ఏమని పిలుస్తారు?

1) డైక్‌ డ్యామ్స్‌     2) డైవర్షన్‌ డ్యామ్స్‌ 

3) కాఫర్‌ డ్యామ్స్‌     4) గ్రావిటీ డ్యామ్స్‌ 

 

 

25. దేశంలో రాక్‌ఫిల్‌ డ్యామ్‌ లేదా ఎంబాక్‌మెంట్‌ డ్యామ్‌ కిందివాటిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?

1) థెయిన్‌ డ్యామ్‌     2) రామ్‌గంగా 

3) నాగార్జున సాగర్‌     4) పైవన్నీ 
26. కిందివాటిని పరిశీలించండి.

ప్రవచనం (ఎ): నల్లరేగడి నేలలు పత్తి పంటకు అనుకూలమైనవి.

కారణం (ఆర్‌): నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే నీటిపారుదల సౌకర్యాలు లేని వ్యవసాయ సాగు విధానాలకు ఇవి అనుకూలమైనవి.

1) ఎ, ఆర్‌ లు సరైనవి. ఎ కి ఆర్‌ సరైన వివరణ. 

2) ఎ, ఆర్‌లు సరైనవి. కానీ, ఎ కి ఆర్‌ సరైన వివరణ కాదు. 

3) ఎ సరైంది, ఆర్‌ సరైంది కాదు. 

4) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది. 
27. మృత్తికా క్రమక్షయానికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.

1) గల్లీప్లగ్గింగ్‌ అంటే సాగుభూముల్లో అడ్డంగా ఏర్పడిన భూమికోతను నియంత్రించడం

2) కాంటూర్‌ ప్లవ్వింగ్‌ అంటే భూమి వాలుకి అడ్డంగా కాంటూర్‌లను అనుసరించి పొలాన్ని దున్నడం.

3) పర్వత ప్రాంతాల్లో సోపాన వ్యవసాయానికి బదులు పోడు వ్యవసాయాన్ని అనుసరించాలి.

4) మృత్తికా క్రమక్షయ నివారణకు పంటమార్పిడి విధానాన్ని అనుసరించాలి.

1) 1, 3   2) 2, 3   3) 2, 4   4) 1, 4

 


28. రెగర్‌ నేలలు అని వేటిని అంటారు?

1) ఒండ్రు నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) లేటరైట్‌ నేలలు


 

29. కాఫీ, తేయాకు తోటలకు అనుకూలమైన నేలలు?

1) ఎర్ర నేలలు     2) డెల్టా నేలలు 

3) పర్వత నేలలు     4) నల్లరేగడి నేలలు 30. నీటిపారుదల తక్కువగా అవసరమయ్యే నేలలు?

1) ఒండ్రుమట్టి నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) లేటరైట్‌ నేలలు31. భారత్‌లో మొదటిసారిగా జలవిద్యుత్తు ఉత్పత్తి జరిగిన ప్రదేశం?     

1) శివసముద్రం     2) డార్జిలింగ్‌ 

3) మాచ్‌ఖండ్‌     4) నరోరా 

 


32. భారత్‌లో మొదటి అణురియాక్టర్‌ పేరు?

1) కామిని     2) ఊర్వశి 

3) అప్సర     4) రావత్‌భట 33. కిందివాటిలో సహజవాయు ఆధారిత థర్మల్‌ కేంద్రానికి సంబంధించింది?

1) గుజరాత్‌ - కవాస్‌   2) రాజస్థాన్‌ - అంటా

3) ఒడిశా - తాల్చేర్‌   4) ఉత్తర్‌ప్రదేశ్‌ - గాంధార34. కిందివాటిలో అణురియాక్టర్లకు సంబంధించి సరికానిది?

1) కాక్రపార - గుజరాత్‌   2) కైగా - కర్ణాటక 

3) నరోరా - పంజాబ్‌    4) కుడంకుళం - తమిళనాడు 35. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి  2) హైదరాబాద్‌ 

3) చెన్నై     4) బెంగళూరురచయిత: ఇ.వేణుగోపాల్‌

 

సమాధానాలు

1-4; 2-4; 3-4; 4-4; 5-3; 6-3; 7-3; 8-4; 9-2; 10-1; 11-1; 12-4; 13-1; 14-3; 15-2; 16-1;  17-1; 18-3; 19-3; 20-2; 21-3; 22-2; 23-2;  24-3; 25-4; 26-1; 27-1; 28-2; 29-3; 30-2;  31-2; 32-3; 33-4; 34-3; 35-1. 

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌