• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం - సుస్థిరాభివృద్ధి 

(ప్యారిస్‌ ఒప్పందం - లాస్‌ ఎండ్‌ డ్యామేజ్‌ నిబంధన)


ఆ దేశంలో అడవులు నరకడం నిషేధం!


పర్యావరణం, సుస్థిరాభివృద్ధి పరస్పర సంబంధం ఉన్న పదాలు. వనరుల విచ్చలవిడి వినియోగాన్ని వదిలిపెట్టి, ఘనవ్యర్థాలను సక్రమంగా నిర్వహించి, వాతావరణంపై కాలుష్య ప్రభావాలను నియంత్రించగలిగితే ప్రగతి కొనసాగుతుంది. సహజ వనరులు భవిష్యత్తు తరాలకూ అందుతాయి. ఆ అవసరాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. శీతోష్ణస్థితి మార్పులకు కారణాలను గ్రహిస్తూ, పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, వన్యప్రాణులు, పర్యావరణం పరిరక్షణకు భారత్‌ సహా ఇతర దేశాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలపై అవగాహన పెంచుకోవాలి.


ఎన్విరాన్‌మెంట్‌ అనే పదం ‘ఎన్విరానర్‌’ అనే ఫ్రెంచ్‌ పదం నుంచి వెలువడింది. ఎన్విరానర్‌ అంటే ‘చుట్టూ ఆవరించి ఉన్న’ అని అర్థం. వాతావరణం, జలావరణం, శిలావరణం, జీవావరణం అనేవి పర్యావరణంలోని నాలుగు విభాగాలు. భూమిపై ఉన్న జీవుల మధ్య వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణకు భారత ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. సుస్థిరాభివృద్ది అంటే ఒకవైపు అభివృద్ధిని కొనసాగిస్తూ పర్యావరణ వనరులను విచక్షణాయుతంగా వినియోగించడం, భవిష్యత్తు తరాలకు అందించడం. 


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో సైలెంట్‌ వ్యాలీ నేషనల్‌ పార్కుకు సంబంధించి సరైన వాక్యం?

ఎ) కుంతిపుజా నది పార్కు మొత్తం 15 కి.మీ.  పొడవునా ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తూ భారతపుజా నదిలో కలుస్తుంది.

బి) లోయ ప్రాంతమంతా ఉష్ణ, సబ్‌ ట్రాపికల్‌ మాయిస్ట్‌ ప్రదేశం. వెడల్పాటి ఆకుల అడవుల ప్రాంతానికి చెందింది.

సి)ముదగర్, ఇరులా అనేవి స్థానిక గిరిజన తెగలు.

1) ఎ, బి   2) ఎ, సి   3) బి, సి  4) పైవన్నీ


2.     జీవవైవిధ్య పరిరక్షణ అంటే?

1) మొక్కల పరిరక్షణ     2) జంతువుల పరిరక్షణ 

3) సూక్ష్మజీవుల పరిరక్షణ     4) జీన్‌పూల్‌ పరిరక్షణ


3.     స్థానిక పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు అత్యుత్తమ మార్గం?

1) స్థానిక పాలనా యంత్రాంగాన్ని ఉపయోగించడం 

2) పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయడం 

3) స్థానిక ప్రజలకు పర్యావరణ విద్య అందించి వారిలో అవగాహన పెంపొందించడం 

4) నిర్ణయాన్ని స్థానికులకే వదిలివేయడం

 

4.     కేటలిటిక్‌ కన్వర్టర్‌ ఉపకరణాన్ని దేనిలో ఉపయోగిస్తారు?

1) పాలిమర్‌ తయారీ కేంద్రం     2) న్యూక్లియర్‌ రియాక్టర్‌ 

3) ఆటోమొబైల్‌ ఎగ్జాస్ట్‌ యూనిట్‌ - I 4) నీటి శుద్ధి ప్లాంట్‌

 

5.     అన్ని రకాల వాయు కాలుష్యానికి ప్రధాన కారణం?

1) ఆంత్రోపొజేనిక్‌ యాక్టివిటీ 2) లోప భూయిష్ట సాంకేతికత 

3) కంబశ్చన్‌     4) పారిశ్రామిక వృద్ధి

 

6.     వైల్డ్‌ లైఫ్‌ అనే పదాన్ని ప్రస్తుతం ఏ విషయంలో వినియోగిస్తున్నారు?

1) అడవులు     2) వన్యప్రాణులు 

3) అడవులు, వన్యప్రాణులు 4) రక్షిత జంతువులు, మొక్కలు

 

7.     హిమాలయాల్లో పర్యావరణానికి ముఖ్యంగా ఏ  కారణం వల్ల హాని కలుగుతోంది?

1) పెరిగిన పర్యాటకం     2) భారీ స్థాయిలో అడవుల నరికివేత

3) బాగా లేని రహదారులు, ఆనకట్టల నిర్మాణం  4) రాజకీయ పోరు, అస్థిరత

 

8.     పానీ పంచాయతీలను కింది ఏ సంస్థ సూచించింది?

1) నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ పంచాయత్స్‌   2) నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ లేబర్స్‌

3) నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఫామిన్స్‌   4) నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఫార్మర్స్‌

 

9.     కిందివాటిలో సరిగా జతపరిచిన పులుల సంరక్షణా కేంద్రం, రాష్ట్రం?

1) బక్సా - రాజస్థాన్‌      2) గిర్‌ - అసోం 

3) కార్బెట్‌ - ఉత్తరాఖండ్‌  4) భద్ర - తమిళనాడు

 

10. కిందివాటిలో మడ అడవులు లేని రాష్ట్రం?

1) పశ్చిమ బెంగాల్‌     2) తమిళనాడు 

3) ఆంధ్రప్రదేశ్‌     4) అసోం

 

11. మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏ పద్ధతులను ప్రోత్సహిస్తోంది?

1) వ్యవసాయంపై ఒత్తిడి తగ్గించడం    2) పంట మార్పిడి పద్ధతి 

3) కాంటూర్‌ బండింగ్‌     4) వనీకరణ

 

12. సామాజిక అడవులు పెంచే కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?

1) 6వ   2) 4వ    3) 3వ    4) 5వ

 

13. అంతర్జాతీయ పులుల దినోత్సవం?        

1) జులై 21     2) జనవరి 21 

3) జులై 29     4) జనవరి 29

 

14. ఆవరణ వ్యవస్థ సంబంధ సేవల గురించి కింది అంశాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) సూక్ష్మజీవుల ద్వారా వరదల నియంత్రణ

బి) విచ్ఛిన్నకర ప్రక్రియల ద్వారా పోషకాల పునఃవలయీకరణ

సి) సాంస్కృతిక ప్రకృతి సౌందర్యం పెంపొందించడం

డి) సారవంతమైన పదార్థాన్ని ఒక చోట నుంచి మరోచోటుకు రవాణా చేయడం ద్వారా కొత్త మృత్తికను ఏర్పరచడం

1) ఎ, బి  2) బి, సి   3) ఎ, డి  4) ఎ, సి

 

15. ‘అరుణ్యేన్‌ అధికార్‌’ గ్రంథ రచయిత్రి?

1) రంగనాయకమ్మ     2) మహాశ్వేతాదేవి 

3) ఓల్గా     4) అరుంధతి రాయ్‌

 

16. కిందివాటిలో హరిత మందిర ప్రభావానికి సంబంధించి తప్పు ప్రవచనాన్ని గుర్తించండి.

ఎ) యూట్రోఫికేషన్‌ 

బి) సముద్ర నీటిమట్టం పెరగడం

సి) భూమి, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం

డి) భూమి, సముద్ర వాతావరణం చల్లబడటం

1) బి, సి   2) బి, డి  3) ఎ, సి  4) ఎ, డి

 

17. అంతరించిపోతున్న జంతు జాతుల సమాచారాన్ని తెలియజేసేది?

1) బ్లాక్‌ లిస్ట్‌     2) గ్రీన్‌ లిస్ట్‌ 

3) రెడ్‌ లిస్ట్‌     4) ఎల్లో లిస్ట్‌

 

18. ప్రతిపాదన (A): వ్యవసాయ నిపుణుల అంచనా ప్రకారం భారతదేశం ఏటా 5 బిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ నేలను నేలకోత ద్వారా కోల్పోతుంది.

కారణం (B): నేలకోతను అరికట్టడానికి ఆదివాసీలు ‘పోడు’ వ్యవసాయం చేసేలా అవగాహనకల్పించాలి.

1) A, Rలు రెండు సరైనవి, Aకు R సరైన వివరణ.

2) A, R లు రెండు సరైనవి. కానీ, Aకు R సరైన వివరణ కాదు.

3) A సరైంది R తప్పు.    4) A తప్పు R సరైంది.

 

19. కిందివాటిలో తప్పుగా ఉన్న పునఃప్రవచనాన్ని గుర్తించండి.

1) తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి అడవులు మడ అడవులు.

2) అల్ఫైన్‌ వృక్షజాలం హిమాలయాలకు చెందింది.

3) టేకు.. సతత హరిత అరణ్యాల్లో పెరుగుతుంది.

4) రక్షిత అడవులను ప్రజలు వినియోగించుకోవచ్చు.

 

20. బయోడీజిల్‌ కోసం, భూమిలో నత్రజని సమృద్ధికి  పెంచే మొక్కలు వరుసగా?

1) వేప, జట్రోఫా     2) జట్రోఫా, వేప 

3) గ్లిరిసిడియా, జట్రోఫా     4) జట్రోఫా, గ్లిరిసిడియా

 

21. డాల్ఫిన్‌లు నీటిలో నిర్ధిష్ట స్థాయుల్లో నివసించడానికి వాటి దేహంలోని ప్రత్యేక నిర్మాణాలు?

1) తెడ్డు లాంటి చేతులు    2) ఫ్లోటర్‌లు     

3) ఊపిరితిత్తులు     4) తోక

 

22. పంటల మధ్య కాలం, స్థలంలో వైవిధ్యత సాధించడానికి సరైన పద్ధతి?

1) మోనో కల్చర్‌     2) పవిత్ర తోపులు 

3) ఓలిగో కల్చర్‌     4) సెమీ కల్చర్‌

 

23. ప్రతిపాదన (A) : లిట్టోరల్, లిమ్నెటిక్‌ మండలాలు కాంతియుతంగా ఉంటాయి.

కారణం (B) : సరస్సులోని ఈ మండలాల్లో కిరణజన్యసంయోగ క్రియ తక్కువగా జరుగుతుంది.

1) A, R లురెండూ సరైనవి. Aకు R సరైన వివరణ.

2) A, R లు రెండూ సరైనవి. A కు R సరైన   వివరణ కాదు.

3) A సరైంది R సరికాదు    4) A సరికాదు R సరైంది

 

24. కిందివాటిలో ప్రభుత్వం ప్రారంభించిన సామూహిక పరిరక్షణ వ్యూహం?

1) వన సంరక్షణ     2) పవిత్ర తోపులు 

3) అర్వారీ సంసద్‌     4) చిప్కో ఉద్యమం

 

25. అడవుల నరికివేతను ప్రపంచంలో మొదట నిషేధించిన దేశం ఏది?

1) నార్వే  2) డెన్మార్క్‌  3) స్వీడన్‌  4) ఫిన్లాండ్‌

 

26. 2016కి పక్కేటైగర్‌ రిజర్వ్‌కు బయో డైవర్సిటీ పురస్కారం ఏ పథకానికి ఇచ్చారు?

1) పులుల రక్షణ చర్యలు 

2) మిథున్‌ సంతానోత్పత్తి కార్యక్రమం 

3) హార్న్‌బిల్‌ గూడు దత్తత కార్యక్రమం 

4) మొసళ్ల సంతానోత్పత్తి కార్యక్రమం

 

27. 2016, ఏప్రిల్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడుగుల లోతుకు మించి గొట్టపు బావులను తవ్వడం నిషేధించింది?

1) 400   2) 500   3) 200   4) 300  

 

28. ఫుల్‌ బ్రైట్‌ - కలాం వాతావరణ ఫెలోషిప్‌ను భారత్‌తో కలిసి ఏ దేశం నెలకొల్పింది?

1) యూఎస్‌ఏ     2) యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 

3) జర్మనీ     4) ఫ్రాన్స్‌

 

29. ఇంగ్లండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ రిపోర్టు - 2022 ప్రకారం గాలి కాలుష్యం అతి ఎక్కువగా ఉన్న నగరం ఏది?

1) భివాడి  2) దిల్లీ 3) రాయ్‌పుర్‌ 4) అలహాబాద్‌

 

30. నూతన సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచికలో 166 దేశాల్లో భారత్‌ స్థానం? 

1) 112వ  2) 130వ   3) 80వ  4) 114వ

 

31. మొదటి హరిత రైల్‌ నడవాని ఏ రాష్ట్రంలో నెలకొల్పారు?

1) తమిళనాడు     2) కేరళ    3) మహారాష్ట్ర      4) ఆంధ్రప్రదేశ్‌

 

32. గువాహటికి చెందిన ఏ జంతువును కామరూప నగర జిల్లా పరిపాలన వ్యవస్థ దాని మస్కట్‌గా చేసుకుంది?

1) డాల్ఫిన్‌   2) తాబేలు   3) మేక   4) ఆవు

 

33. ప్రపంచంలోనే మొదటి తెల్లపులుల అన్వేషణ కేంద్రాన్ని భారత్‌లోని ఏ రాష్ట్రంలో నెలకొల్పారు?

1) మధ్యప్రదేశ్‌     2) పశ్చిమ బెంగాల్‌ 

3) కేరళ     4) కర్ణాటక

 

34. అటవీప్రాంత సర్వే 2021 ప్రకారం భారతదేశంలో ఎంత శాతం అడవులు విస్తరించి ఉన్నాయి?

1) 21.71%  2) 21.43%  3) 22.43%  4) 22.34%

 

35. ‘పర్యావరణ పరిరక్షణ’ అనే అంశాన్ని ఏ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు?

1) 1975  2) 1976  3) 1977  4) 1978

 

36. కింద పేర్కొన్న ఏ సమావేశంలో అంగీకరించిన దాని ప్రకారం ప్రమాద భూయిష్టమైన నష్టం/దెబ్బతినడం ఆధారంగా సంపన్న దేశాల నుంచి నష్ట పరిహారాన్ని కోరవచ్చు?

1) ప్యారిస్‌         2) కాన్‌కున్‌ సమావేశం 

3) కోపెన్‌ హాగెన్‌ సమావేశం     4) దోహా సమావేశం

    


సమాధానాలు

1-4; 2-4; 3-3; 4-3; 5-3; 6-3; 7-2; 8-4; 9-3; 10-4; 11-4; 12-4; 13-3; 14-2; 15-2; 16-4; 17-3; 18-3; 19-3; 20-4; 21-2; 22-2; 23-3; 24-1; 25-1; 26-3; 27-3; 28-1; 29-1; 30-1; 31-1; 32-1; 33-1; 34-1; 35-2; 36-1.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

Posted Date : 17-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌