• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం

మాదిరి ప్రశ్నలు


1. గాలిలో సూక్ష్మ పరిమాణాల్లో ఉన్న వాయువులను ట్రేస్‌గ్యాసెస్‌ అంటారు. వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి.
1) కార్బన్‌ డై ఆక్సైడ్, నియాన్, హీలియం      2) నియాన్, హీలియం, కార్బన్‌ డై ఆక్సైడ్‌
3) హీలియం, నియాన్, కార్బన్‌ డై ఆక్సైడ్‌      4) కార్బన్‌ డై ఆక్సైడ్, హీలియం, నియాన్‌

 

2. స్ట్రాటో ఆవరణలో విస్తరించి ఉన్న ఓజోన్‌ పొర విధి?
1) సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలను వడపోసి భూమికి పంపిస్తుంది.
2) సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలను శోషించుకుంటుంది.
3) సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలను వెనుకకు పంపిస్తుంది.
4) సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలను కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మార్చి భూమి చుట్టూ వేడి పెంచుతుంది.

 

3. పర్యావరణ సమతౌల్యం కింది ఏ సందర్భంలో అవసరం?
1) జీవులు, వాటి పరిసరాలకు మధ్య సంబంధాలు అనుకూలంగా ఉన్నప్పుడు
2) జీవులు, వాటి పరిసరాలకు మధ్య సంబంధాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు
3) ప్రకృతి చర్యల వల్ల పర్యావరణం పరిరక్షించబడుతున్నప్పుడు
4) ఏదీకాదు

 

4. కిందివాటిలో సరైంది?  
ఎ) జలావరణం అనేది రసాయన సంఘటనం 
బి) శిలావరణం జీవుల ఆవాసం
సి) జీవావరణం అనేది జీవ, భూరసాయనాలు
1) ఎ, బి, సి     2) బి, సి       3) ఎ, బి      4) ఎ, సి

 

5. జీవావరణం ప్రక్రియ 
1) శిలావరణం, జలావరణం సంయోగ చర్య     2) జలావరణం, వాతావరణం సంయోగ చర్య
3) వాతావరణంతో మాత్రమే సంయోగ చర్య    4) శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంయోగం చెందేది 

 

6. భూమిని కప్పి ఉన్న మంచు ప్రాంతాలు, హిమానీనదాల్లో ఎంత నీరు దాగి ఉంటుంది?
1) 21.5%      2) 2.15%      3) 20%      4) 97%

 

7. భూమి మీద ఉన్న మహాసముద్రాలను బ్లూ కార్బన్‌ సింక్‌గా, అడవులను గ్రీన్‌ కార్బన్‌ సింక్‌గా పిలుస్తారు. కిందివాటిలో పెద్ద గ్రీన్‌ కార్బన్‌ సింక్‌ ఏది?
1) అమెజాన్‌ నదీ పరీవాహక ప్రాంతం      2) రష్యాలోని సైబీరియా ప్రాంతం
3) హిమాలయాల అడవులు           4) ధ్రువ గడ్డిజాతులు

 

8. వాతావరణంలో అధిక శాతంలో ఉన్న జడవాయువు?
1) ఆర్గాన్‌      2) నియాన్‌      3) హీలియం      4) హైడ్రోజన్‌

 

9. భూమిని ఆవరించి ఉన్న వాతావరణ పొరలు ఉపరితలం నుంచి వాతావరణానికి ఏ క్రమంలో ఉంటాయి?
1) ట్రోపో, స్ట్రాటో, మీసో, ఐనో, ఎక్సో ఆవరణాలు 
2) ట్రోపో, మీసో, ఐనో, స్ట్రాటో, ఎక్సో ఆవరణాలు 
3) స్ట్రాటో, ట్రోపో, ఐనో, మీసో, ఎక్సో ఆవరణాలు 
4) ట్రోపో, స్ట్రాటో, థర్మో, మీసో, ఎక్సో ఆవరణాలు 

 

10. గాలిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం ఎంత?
1) 0.03%      2) 0.005%     3) 0.3%      4) 2.15% 

 

సమాధానాలు
1-1,   2-2,  3-2,   4-2,   5-4,   6-2,   7-1,   8-1,   9-1,   10-1.
 

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌