• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణ

సైలెంట్‌ వ్యాలీలో సింహపు తోక కోతులు!
 


సహజ పరిసరాలను కాపాడుకోవడమే పర్యావరణ పరిరక్షణ. సహజ వనరులు, వాతావరణాన్ని పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థితిలో ఉంచడమే లక్ష్యంగా వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వాల కృషి కొనసాగుతోంది. ఇప్పటికే పర్యావరణానికి నష్టం జరిగిన చోట అనుకూల పరిస్థితులు కల్పించి భర్తీ చేయడం, ప్రకృతి విరుద్ధ మానవ కార్యకలాపాలను నియంత్రించడమే దీని ప్రధాన ఉద్దేశం. పర్యావరణం దెబ్బతినడానికి కారణాలు, ఆ క్షీణతను కొలిచే ప్రమాణాలు, నివారణ దిశగా కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశంలో ముఖ్యమైన జీవవైవిధ్య ప్రాంతాలు, వాటి ప్రాధాన్యాలు, పలు అభయారణ్యాల్లో సంరక్షణలో ఉన్న వన్యప్రాణుల సమాచారంతో పాటు వ్యవస్థాగతంగా అమలు చేస్తున్న పర్యావరణ రక్షణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలి. 



1. భారతదేశంలో వివిధ జన సమూహాలు అనుసరించే సంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి?

1) వన మహోత్సవం   2) దేవకాదులు

3) తోటల పెంపకం    4) ఇంటికి ఒక మొక్క దత్తత ఇవ్వడం


2.  కింద పేర్కొన్న సంప్రదాయ జలసంరక్షణ  పద్ధతులు, వాటిని అనుసరించే ప్రాంతాలతో  జత చేయండి.

1) జింగ్‌     ఎ) తమిళనాడు
2) జాబో బి) రాజస్థాన్‌ 
3) జోహాడ్స్‌ సి) లద్దాఖ్‌
4) ఫాడ్‌ డి) మహారాష్ట్ర
5) మేరి ఇ) నాగాలాండ్‌

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ    

2) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-బి, 5-సి

3) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ    

4) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి, 5-ఎ


3.  ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన  సంవత్సరం ఏది? (రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత)

1) 2005  2) 2015   3) 2016  4) 1880


4.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కార్బన్‌ డయాక్సైడ్‌ను వెలువరిస్తున్న దేశం?

1) అమెరికా  2) జపాన్‌  3) చైనా  4) ఇండియా


5. కిందివాటిలో ఏది గ్రీన్‌హౌస్‌ ప్రభావానికి  ప్రధాన కారకం?

1) మీథేన్‌   2) కార్బన్‌ డయాక్సైడ్‌   

3) క్లోరోఫ్లోరో కార్బన్‌లు   4) నీటిఆవిరి


6.  కిందివాటిలో భారత్‌లో సెల్‌టవర్‌ వికిరణం వల్ల బాగా ప్రభావితమైన పక్షి ఏది?

1) చిలుక   2) పావురం   3) కాకి   4) పిచ్చుక


7. సహజ నత్రజని గొలుసు ప్రధానంగా దేనివల్ల దెబ్బతింటుంది?

1) వ్యవసాయంలో యూరియాను విచక్షణారహితంగా వాడటం

2) వ్యవసాయంలో ఫాస్ఫేట్‌ను విచక్షణారహితంగా వాడటం

3) బోరుబావి కింద సాగు

4) యాంత్రిక వ్యవసాయం


8. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం నుంచి ఉపసంహరించుకుని, దాని కోసం చేసిన వాగ్దానాలను వదిలిపెట్టిన దేశం?

1) బ్రిటన్‌  2) కెనడా    3) జర్మనీ  4) ఫ్రాన్స్‌


9. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్‌ వ్యర్థ సేకరణకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరిది?

1) పంపిణీదారుడు     2) వినియోగదారుడు  

3) చిల్లర వర్తకుడు    4) ఉత్పత్తిదారుడు


10. జీవవైవిధ్యం ఏ ప్రాంతానికి దగ్గరలోని ప్రదేశాల్లో ఎక్కువ?

1) భూమధ్యరేఖ   2) ధ్రువాలు   

3) కర్కటరేఖ   4) మకరరేఖ


11. చాలా జల సంబంధ జీవవ్యవస్థల్లో జీవ ద్రవ్యరాశి పిరమిడ్‌-

1) ఉండదు   

2) నిటారుగా ఉన్న పిరమిడ్‌లా ఉంటుంది

3) తిరగవేసిన పిరమిడ్‌లా ఉంటుంది   

4) ఆకారం తరచూ మారుతుంటుంది


12. భారత్‌లో పట్టణాల ఇళ్లలోని చెత్తను ఎక్కువగా ఎక్కడికి పంపిస్తున్నారు?

1) కంపోస్ట్‌ తయారీకి  

2) చెత్త గుట్టల వద్దకు (ల్యాండ్‌ఫిల్)

3) పునర్వినియోగానికి       

4) భస్మీకరణకు


13. భూతాపం వల్ల సగటు ఉష్ణోగ్రత ఏ స్థాయి కంటే పెరగడం భూమికి సురక్షితం కాదు?

1) 2 డిగ్రీల సెల్సియస్‌   2) 3 డిగ్రీల సెల్సియస్‌

3) 5 డిగ్రీల సెల్సియస్‌   4) 1.5 డిగ్రీల సెల్సియస్‌


14. రామ్‌సర్‌ సమావేశం దేని పరిరక్షణకు ఉద్దేశించింది?

1) సారహీన భూములు   2) తడి నేలలు    

3) సముద్ర గర్భం  4) బలహీనమైన కొండలు


15. రాజస్థాన్‌లో బికనీర్‌ ప్రాంతంలో ప్రతి ఏడాది వచ్చే సంవత్సరం వరకు వర్షపు నీటిని నిల్వ ఉంచే భూగర్భ ట్యాంకుల్ని ఏమంటారు?

1) కుల్‌లు   2) బావ్లీ  3) టంకాలు  4) ఫాలోద్‌


16. విత్తనం, ఆహారం, నీరు, భూమి సంబంధిత జ్ఞానాలపై ప్రజా సార్వభౌమత్వం కోసం ‘నవధాన్య’ ఉద్యమాన్ని ప్రారంభించింది? 

1) రాజేంద్ర సింగ్‌   2) సందీప్‌ పాండే   

3) మల్లికా సారాబాయి   4) వందనా శివ


17. రియో సమావేశాల్లో ఆమోదించిన అజెండా 21వ తీర్మానం ప్రధాన లక్ష్యాల్లో కిందివాటిలో ఒకటి-

1) 20వ శతాబ్దంలోనే సుస్థిర అభివృద్ధిని సాధించాలి

2) పేదరికాన్ని తొలగించడానికి మరింత త్వరితగతిన అభివృద్ధి చెందాలి.

3) ప్రతి దేశం అజెండా 21ను చట్టంగా మార్చాలి.

4) ప్రతి స్థానిక ప్రభుత్వం తమ సొంత ‘అజెండా 21’ను రూపొందించాలి.

18. కిందివాటిలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల మరణానికి  కారణం?

1) సముద్ర ఉష్ణోగ్రతలో మార్పులు  

2) మేత ప్రదేశాలు లేకపోవడం

3) చేపలు పట్టే మరపడవలు  

4) ఏదీకాదు


19. రాబందులను కాపాడేందుకు పశువైద్యంలో  ఏ మందును నిషేధించారు?

1) ఆస్పిరిన్‌   2) డైక్లోఫెనాక్‌   

3) టెట్రాసైక్లిన్‌   4) రాంటిడిన్‌


20. కిందివాటిలో కోరింగ అభయారణ్యం ఏ తరహాది?

1) మడ అడవులు      2) ముళ్లపొదలు  

3) టేకు అరణ్యం      4) పర్వత ప్రాంతం


21. కిందివాటిలో దేన్ని ప్రపంచ బయో రిజర్వ్‌ నెట్‌వర్క్‌లో చేర్చలేదు?

1) మానస్‌   2) నీలగిరి  

3) గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌   4) నందాదేవి


22. కిందివాటిలో ఏది సుస్థిర సాగు పద్ధతి కాదు?

1) వెంటవెంటనే ఒకే పంట సాగు   

2) బహుళ పంటల సాగు    

3) అంతర పంటల సాగు     

4) కాంటూర్‌ సాగు


23. కేరళలోని సైలెంట్‌ వ్యాలీ వేటికి (అత్యధిక సంఖ్యలో) నివాస స్థలం?

1) చిరుతపులులు   2) అడవిదున్నలు

3) లయన్‌ టైల్డ్‌ మకాక్‌   4) హార్న్‌బిల్‌ పక్షులు


24. విస్తీర్ణం దృష్ట్యా భారత్‌లో అతిపెద్ద పులుల అభయారణ్యం ఏది?

1) కన్హా పులుల అభయారణ్యం

2) బాంధవ్‌గఢ్‌ పులుల అభయారణ్యం

3) నాగార్జునసాగర్‌ - శ్రీశైలం పులుల అభయారణ్యం

4) సుందర్‌బన్స్‌ పులుల అభయారణ్యం


25. భారత్‌లో ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1992  2) 1993   3) 1994  4) 1995


26. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం తాగునీటి ్పబీ విలువ ఎంత ఉండాలి?

1) 6 నుంచి 7.5   2) 6 నుంచి 8    3) 6.5 నుంచి 8.5   4) 6.5 నుంచి 8


27. జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లను ఏ ప్రమాణం ఆధారంగా లాక్షణీకరిస్తారు

1) స్థానీయ పుష్పించే మొక్క, ముప్పు భావన

2) పుష్పించే మొక్కల జాతులు

3) స్థానికంగా పుష్పించే మొక్క

4) మొక్కల వైవిధ్యం


28. నీటిలో కోలీఫార్మ్‌ ఎక్కువ మోతాదులో ఉంటే, అది దేన్ని సూచిస్తుంది?

1) జీవ ఆమ్లజని డిమాండ్‌లో తగ్గుదల  

2) భాస్వరంతో కలుషితం

3) హైడ్రోకార్బన్‌తో కలుషితం   

4) మానవ వ్యర్థాలతో కలుషితం


29. ప్యారిస్‌ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం భారతదేశం కర్బన ఉద్గారాల విషయంలో   నిర్దేశించుకున్న దేశీయ నిర్ధారిత వాటా ఎంత

1) 2030 నాటికి 2005 స్థాయి కంటే 33-35% తక్కువ

2) 2020 నాటికి 1990 స్థాయి కంటే 20-25% తక్కువ

3) 2020 నాటికి 2000 స్థాయి కంటే 23-25% తక్కువ

4) 2030 నాటికి 1990 స్థాయి కంటే 15-20% తక్కువ


30. ‘కిగాలీ’ ఒప్పందం కిందివాటిలో ఏ బహుపాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుంది?

1) క్యోటో ప్రోటోకాల్‌  

2) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌

3) బాలి కార్యప్రణాళిక     

4) ప్యారిస్‌ ఒప్పందం


31. కిందివాటిలో వృక్ష ప్లవకాలకు సంబంధించి సరైంది?

1) వృక్ష ప్ల్లవకాలు పొడవుగా ఉంటాయి.

2) వృక్ష ప్లవక పుష్పాలు నీలి రంగులో ఉంటాయి

3) వీటిలో వాస్కులర్‌ కణజాలం ఉంటుంది.

4) ఇవి లవణాన్ని సహించగలవు.


32. ఇటీవలి లెక్కల ప్రకారం భారత్‌లోని ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి?

1) ఉత్తరాఖండ్‌     2) పశ్చిమ బెంగాల్‌     

3) మధ్యప్రదేశ్‌  4) కర్ణాటక


33. భారత్‌లోని ఏ రాష్ట్రంలో 50వ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు?

1) అస్సాం   2) ఆంధ్రప్రదేశ్‌

3) అరుణాచల్‌ ప్రదేశ్‌  4) ఉత్తరాఖండ్‌


34. రాలేగావ్‌ సిద్ధిలో నిరంతర కరవు తీవ్రతను ఏ విధంగా తగ్గించగలిగారు?

1) రాజకీయ ప్రయత్నాల ద్వారా

2) ప్రజా సమూహ ప్రయత్నాల ద్వారా

3) ఉద్యమాల ద్వారా

4) బోర్‌వెల్‌ల తవ్వకం ద్వారా


35. బయోమ్‌ అంటే ఏమిటి?

1) ఒక ప్రధాన ఆవాస స్థలంలో సహజంగా ఉండే వృక్షజాతి, జంతుజాల పెద్ద సమూహం

2) అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న స్థానీయ జాతి

3) దాడి చేసే స్వభావం ఉన్న ఒక స్థానీయ జాతి

4) జైవిక ఎంజైమ్‌


36. భూమిపై ఉన్న గుర్తించిన జాతుల్లో కీటకాల శాతం సుమారు ఎంత?

1) 30%   2) 50%   3) 75%   4) 90%


37. విత్తన బాంబు అంటే ఏమిటి?

1) పేలే విత్తనాలతో తయారుచేసిన జీవ విస్ఫోటం

2) భూమిలో నాటడానికి/వెదజల్లడానికి మట్టి, పేడ విత్తనాలతో తయారుచేసిన బంతి

3) పెద్ద విత్తనంలో నిక్షిప్తం చేసిన సూక్ష్మ బాంబు

4) మొలోటోవ్‌ కాక్టెల్‌లో ఉపయోగించే సూక్ష్మ బాంబు


38. వాయు నాణ్యతను కొలిచేందుకు జాతీయ వాయు నాణ్యతా సూచీలో ఎన్ని కలుషిత  పదార్థాలను పరిశీలిస్తారు?

1) 3   2) 5   3) 7   4) 8


39. భారత్‌లోని ఒక ప్రదేశంలో వాయు నాణ్యతా సూచీ 100 ఉంటే ఆ ప్రాంతంలో వాయు నాణ్యత ఎలా ఉంటుంది?

1) బాగుంటుంది             

2) సంతృప్తికరం         

3 ) ఒక మోస్తరుగా ఉంటుంది    

4) బాగుండదు


సమాధానాలు


1-2; 2-4; 3-3; 4-3; 5-2; 6-4; 7-1; 8-2; 9-4; 10-1; 11-3; 12-2; 13-4; 14-2; 15-3; 16-4; 17-4; 18-3; 19-3; 20-1; 21-1; 22-1; 23-3; 24-3; 25-1; 26-3; 27-1; 28-4; 29-1; 30-2; 31-4; 32-4; 33-3; 34-2; 35-1; 36-2; 37-2; 38-4; 39-2.

 

 


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌


 

Posted Date : 31-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌