• facebook
  • whatsapp
  • telegram

వ‌ర‌ద‌ల విప‌త్తు

మాదిరి ప్రశ్నలు


1. ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే వరదలతో ఏ వర్గం వారు అధికంగా ప్రభావితమవుతున్నారు?

1) అధిక ఆదాయం గలవారు    2) అల్ప ఆదాయం గలవారు

3) తక్కువ మధ్య ఆదాయం గలవారు   4) అధిక మధ్య ఆదాయం గలవారు


2. దేశ మొత్తం వైశాల్యంలో వరద దుర్బలత్వం ఉన్న భూమి ఎంత?

1) 12%  2) 85%  3) 68%  4) 56%


3. దేశ మొత్తం వర్షంలో నైరుతి రుతువులో (జూన్‌ - సెప్టెంబర్‌ మధ్య) ఎంత వర్షం కురుస్తుంది?

1) 75%  2) 85%  3) 50%  4) 20%


4. దేశంలో వరదల స్థితి కింది విధంగా ఉంది?

1) దేశంలో పెద్ద నదుల ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

2) దేశంలో చిన్న నదుల ప్రాంతంలో వరదలు సంభవిస్తున్నాయి.

3) దేశంలో దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

4) తూర్పునకు వెళ్లే నదులు మాత్రమే వరదలకు కారణమవుతున్నాయి.


5. ఉద్ధృతిపరంగా వరదలు ఎక్కువ సంభవించే రాష్ట్రాలు వరుసగా?

1) ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, అస్సాం 

2) ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌

3) బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం 

4) అస్సాం, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌


6. దేశంలో పెద్ద విపత్తు ఏది?

1) భూకంపాలు  2) తుపాన్లు  3) కరవు  4) వరదలు


7. ప్రపంచంలో విపత్తుల జాబితాలో జల, వాతావరణ విపత్తుల గ్రూపులో కింది ఏ విపత్తు ఎక్కువ ప్రభావవంతమైంది?

1) సునామీలు  2) కరువు  3) వరదలు  4) తుపాన్లు


8. గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ ప్రకారం 90% వరద బాధితులు ఏ ప్రాంతాల్లో ఉన్నారు?

1) దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిపిక్‌ దేశాల్లో

2) దక్షిణాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో

3) ఆసియా, ఆఫ్రికా దేశాల్లో

4) ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు


9. భారత్‌లో కింది ఏ ప్రాంతం ఎక్కువగా వరదలకు గురవుతుంది?

1) ఉత్తర వాయవ్య ప్రాంతం  2) ఉత్తర, ఈశాన్య ప్రాంతం

3) ఉత్తర, దక్షిణ ప్రాంతం  4) ఈశాన్య ఆగ్నేయ ప్రాంతం


10. భారత ప్రభుత్వం జాతీయ వరదల నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది?

1) 1954  2) 1952  3) 1986  4) 1994

 

సమాధానాలు: 1-2; 2-1; 3-1; 4-3; 5-1; 6-4; 7-3; 8-1; 9-2; 10-1.

 

ర‌చ‌యిత‌: జ‌ల్లు స‌ద్గుణ‌రావు

Posted Date : 11-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌