• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఉనికి - నైసర్గిక స్వరూపం

1. కింది వాటిలో సరికానిది?

ఎ) భారతదేశ ప్రధాన భూభాగపు ఉత్తర, దక్షిణ కొనల మధ్య దూరం 3214 కి.మీ

బి) సుమారు 30 అక్షాంశాలు, 36 రేఖాంశాలు భారతదేశం మీదుగా వెళ్తున్నాయి.

సి) ప్రపంచంలో రెండో పెద్ద ద్వీపకల్పం -  భారతదేశం

1) ఎ, బి    2) ఎ, సి     3) బి, సి    4) పైవన్నీ


2. భూభాగ విస్తీర్ణపరంగా దేశంలో చిన్న రాష్ట్రాలు వరుసగా.....

1) గోవా, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌    2) గోవా, సిక్కిం, త్రిపుర, మిజోరం

3) గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్‌    4) గోవా, మిజోరం, సిక్కిం, త్రిపుర


3. భారత్‌లో అత్యధిక జిల్లాలను కలిగిన రాష్ట్రం ఏది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌    2) మధ్యప్రదేశ్‌    3) రాజస్థాన్‌    4) గుజరాత్‌


4. దాద్రానగర్‌ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాన్ని డామన్‌డయ్యూలో ఎప్పుడు విలీనం చేశారు?

1) 2020, జనవరి 25     2) 2020, జనవరి 26   3) 2021, జనవరి 26   4) 2021, జూన్‌ 21


5. దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌. అయితే ఈ రాష్ట్రంతో అత్యధిక, అత్యల్ప సరిహద్దు కలిగిన రాష్ట్రాలు వరుసగా.....

1) మధ్యప్రదేశ్, రాజస్థాన్‌     2) రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌    3) మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌      4) బిహార్, ఝార్ఖండ్‌


6. కింది వాటిని జతపరచండి

ఎ) కబావ్‌ లోయ      i) భారత్‌ - చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం

బి) కాలాపానీ      ii) భారత్‌ - పాకిస్థాన్‌  మధ్య వివాదాస్పద ప్రాంతం

సి) డెస్సాంగ్‌ మైదానాలు    iii) భారత్‌ - మయన్మార్‌ మధ్య వివాదాస్పద  ప్రాంతం

డి) సర్‌ క్రీక్‌      iv) భారత్‌ - నేపాల్‌ మధ్య వివాదాస్పద ప్రాంతం

1) ఎ-i, బి-iii, సి-iv, డి-ii     2) ఎ-iii, బి-iv, సి-i, డి-ii   3) ఎ-iv, బి-i, సి-iii, డి-ii    4) ఎ-i, బి-iv, సి-iii, డి-ii


7. ఒకే ఒక పొరుగు రాష్ట్రం సరిహద్దుగా ఉన్న భారతదేశ రాష్ట్రాలు ఏవి?

1) సిక్కిం, అసోం  2) జమ్మూకశ్మీర్, సిక్కిం  3) సిక్కిం, మేఘాలయ   4) మేఘాలయ, త్రిపుర  


8. భూభాగ విస్తీర్ణపరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు వరుసగా.....

1) అండమాన్‌ నికోబార్‌ దీవులు, డామన్‌డయ్యూ, లడఖ్, న్యూదిల్లీ

2) జమ్మూకశ్మీర్, అండమాన్‌ నికోబార్‌ దీవులు, డామన్‌డయ్యూ, లడఖ్,

3) లడఖ్, డామన్‌డయ్యూ, ఛండీగఢ్, జమ్మూకశ్మీర్‌

4) లడఖ్, జమ్మూకశ్మీర్, అండమాన్‌ నికోబార్‌ దీవులు, న్యూదిల్లీ


9. దేశంలో ఏర్పాటైన తేదీ ఆధారంగా కొత్త రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి.

1) ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, తెలంగాణ

2) ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, తెలంగాణ

3) ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ

4) ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ


10. కింది వాటిలో సరికానిదేది?

1) మహినది కర్కటరేఖను రెండుసార్లు ఖండిస్తుంది.

2) దామోదర్‌ నది కర్కటరేఖకు సమీపంగా, సమాంతరంగా ప్రవహిస్తుంది.

3) భారతదేశంలోని హలాలీ, జెటాల్‌సూడ్‌ రిజర్వాయర్ల మీదుగా కర్కటరేఖ వెళుతుంది.

4) కర్కటరేఖ పాకిస్థాన్, భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాల మీదుగా వెళుతుంది.


11. కింది వాటిలో భారతదేశ భూభాగ విస్తీర్ణానికి సంబంధించి సరైంది?

ఎ) భూభాగ విస్తీర్ణం 32,87,263 చ.కి.మీ 

బి) ప్రపంచ విస్తీర్ణంలో భారత్‌ విస్తీర్ణ శాతం 2.42%

సి) సరిహద్దున ఉన్న దేశాలన్నింటి కంటే భారత్‌ పెద్దది.

డి) భారత్‌ విస్తీర్ణం పాకిస్థాన్‌కు ఎనిమిది రెట్లు, జపాన్‌కు ఆరురెట్లు ఎక్కువ

1) ఎ, డి    2) ఎ, బి    3) ఎ, బి, సి   4) పైవన్నీ


12. ఉత్తరాఖండ్‌ వేసవి రాజధాని ఏది?

1) ధర్మశాల   2) గైర్సాయిన్‌    3) షాదోల్‌   4) వేసవి రాజధాని లేదు


13. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌ ఎన్ని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది?

1) ఒకటి  2) రెండు   3) మూడు   4) నాలుగు 


14. దేశంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రాలు వరుసగా....

1) గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర

2) గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్‌బంగా, తమిళనాడు

3) గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్‌బంగా        

4) గుజరాత్, పశ్చిమ్‌బంగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు


15. కింది వాటిలో భూ పరివేష్ఠిత (Land Locked) రాష్ట్రాలు ఏవి?

1) మధ్యప్రదేశ్, తెలంగాణ, ఝార్ఖండ్, హరియాణా, గోవా

2) హరియాణా, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, తెలంగాణ

3) హరియాణా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ

4) పంజాబ్, హరియాణా, సిక్కిం, ఝార్ఖండ్‌


16. నాటికల్‌ మైలు అంటే......

1) సముద్రాల్లో ప్రయాణించే వ్యాపార నౌకల వేగాన్ని తెలుపుతుంది

2) సముద్రాల ఉపరితల దూరాన్ని తెలియజేస్తుంది

3) సముద్రాల లోతును తెలుపుతుంది.

4) తీరప్రాంతాన్ని సముద్రాన్ని కలిపే మార్గం


17. కింది వాటిలో ఏడు దీవుల నగరం(City of Seven Island) అని దేన్ని పిలుస్తారు?

1) ముంబయి   2) రోమ్‌    3) కోల్‌కతా     4) జావా


18. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఎతైన శిఖరం ఏది?

1) తుల్లమర్‌    2) శాడిల్‌   3) హారియోట్‌    4) కచల్‌


19. భారత ప్రామాణిక కాలరేఖ  82°30' తూర్పు రేఖాంశం ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తోంది?

1) ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

2) ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్‌

3) ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌

4) ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా


20. కర్కటరేఖ, భారత ప్రామాణిక కాలరేఖలు ఒకదానినొకటి ఖండించుకునే ప్రాంతం ఏది?

1) జబల్‌పూర్‌ - మధ్యప్రదేశ్‌    2) బైకుంఠపూర్‌ - ఛత్తీస్‌గఢ్‌    3) కోరాపూట్‌ - ఒడిశా   4) మీర్జాపూర్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌


21. లండన్‌లో సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాలు అయితే భారత్‌లో ఎంత అవుతుంది?

1) 1 : 00 pm     2) 1 : 30 pm   3) 12 : 30 pm     4) 1 : 30 pm


22. కింది వాటిలో భారతదేశానికి సంబంధించి సరికానిదేది?

ఎ) ఉత్తరాదినున్న చివరి రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌

బి) మూడు జలభాగాల తీరరేఖను కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు

సి) తూర్పున చివరి రాష్ట్రం నాగాలాండ్‌

డి) పడమరన చివరి రాష్ట్రం గుజరాత్‌

1) ఎ, సి   2) సి    3) సి, డి   4) ఎ, బి


సమాధానాలు

1-4  2-3  3-1  4-2  5-3  6-2  7-3  8-4  9-2  10-4 11-2  12-2  13-3  14-1  15-3 16-2  17-1  18-2  19-3  20-2  21-2  22-2.


మరికొన్ని...


1. బంగ్లాదేశ్‌తో సరిహద్దును కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రాలు ఏవి?

1) పశ్చిమ్‌బంగా, సిక్కిం, అసోం, మేఘాలయ, త్రిపుర

2) పశ్చిమ్‌బంగా, బిహార్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం

3) పశ్చిమ్‌బంగా, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం

4) పశ్చిమ్‌బంగా, అసోం మేఘాలయ, మణిపూర్, మిజోరం


2. అంతర్జాతీయ సరిహద్దును కలిగిన భారతీయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య?

1) 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు    

2) 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం

3) 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు    

4) 18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు


3. భారతదేశ మొత్తం తీరరేఖ పొడవు ఎంత?

1) 15200 కి.మీ    2) 6100 కి.మీ    3) 5420 కి.మీ  4) 7516 కి.మీ


4. ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశాలు వరుసగా..

1) కెనడా, ఇండోనేసియా, రష్యా    2) రష్యా, కెనడా, భారత్‌

3) కెనడా, దక్షిణాఫ్రికా, రష్యా    4) రష్యా, ఇండోనేసియా, కెనడా


5. భారతదేశ స్థలాకృతి చిత్రాలను తయారు చేసేవారెవరు?

1) ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా    2) జియోగ్రాఫికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

3) సర్వే ఆఫ్‌ ఇండియా   4)  జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా


6. తమిళనాడులోని నాగర్‌కోయల్‌ నుంచి శ్రీలంకను కలిపే దీవి పేరు?

1) పంబన్‌ దీవి   2) మన్నార్‌ దీవి  3) రామేశ్వరం దీవి   4) తలై జాఫ్నా


7. భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాలకు కారణమైన దీవులు......

1) అరకన్‌ యోమా దీవులు    2) జాఫ్నా, తలైమన్నార్‌

3) న్యూమూర్‌ దీవులు   4) ఈ రెండు దేశాల మధ్య ఏ దీవులు లేవు


8. కింది వాటిలో అరుణాచల్‌ప్రదేశ్‌ దేనితో ఉమ్మడి సరిహద్దు కలిగిలేదు?

1)  చైనా    2) టిబెట్‌    3) మయన్మార్‌    4) నాగాలాండ్‌


9. భారతదేశ ఉనికి అక్షాంశాల ఆధారంగా...

1)  68°7' నుంచి 97°25' ఉత్తర అక్షాంశాలు

2) 8°4' నుంచి 30°7' ఉత్తర అక్షాంశాలు

3) 8°4’ నుంచి 37°6' ఉత్తర అక్షాంశాలు 

4) 15°51' నుంచి 52°11' దక్షిణ అక్షాంశాలు


సమాధానాలు

1-3  2-3  3-4  4-1  5-3  6-2 7-3  8-2   9-3.

Posted Date : 26-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌