• facebook
  • whatsapp
  • telegram

గతిశాస్త్రం - న్యూటన్‌ గమన నియమాలు

మాదిరి ప్రశ్నలు

1. ఒక వస్తువు చలనాన్ని ప్రాథమికంగా ఏ నియమాల ద్వారా తెలుసుకోవచ్చు? 

1) కెప్లర్‌ నియమాలు          2) కిర్కాఫ్‌ నియమాలు 

3) న్యూటన్‌ నియమాలు     4) ఏదీకాదు


2. న్యూటన్‌ రెండో గమన నియమం ప్రకారం బాహ్య ఫలిత బలం దేనికి సమానమవుతుంది?

1) ద్రవ్యవేగంలో మార్పు      2) ప్రచోదనం 

3) ద్రవ్యవేగంలో మార్పు రేటు   4) త్వరణంలోని మార్పు రేటు


3. గమనంలో ఉన్న బస్సు నుంచి దిగిన ప్రయాణికుడు దాంతో పాటుగా కొంత దూరం ప్రయాణించడం అనేది? 

1) విరామ జడత్వం     2) గమన జడత్వం     3) దిశా జడత్వం    4) ఏదీకాదు


4. కింది ఏ న్యూటన్‌ గమన నియమాన్ని సమతాస్థితి నియమం అంటారు?

1) మొదటి గమన నియమం   2) రెండో గమన నియమం 

3) మూడో గమన నియమం     4) ఏదీకాదు

 

5. ప్రకృతిలో ఏకాంక బలం ఉండదని ఏ న్యూటన్‌ గమన నియమం తెలుపుతుంది? 

1) రెండో గమన నియమం       2) మూడో గమన నియమం

3) మొదటి గమన నియమం     4) ఏదీకాదు
 

6. బలానికి SI ప్రమాణాలు 

1) ఎర్గ్‌     2) జౌల్‌     3) డైన్‌      4) న్యూటన్‌

 

7. ఒక న్యూటన్‌ ఎన్ని డైన్‌లకు సమానం?

    1) 105      2) 107       3) 10-5      4) 10-7


8. న్యూటన్‌ మూడు గమన నియమాల్లో దేన్ని ప్రాథమిక నియమంగా పరిగణిస్తారు? 

1) మూడో గమన నియమం      2) రెండో గమన నియమం  

3) మొదటి గమన నియమం      4) ఏదీకాదు


9. పడవలో నుంచి దిగుతున్నప్పుడు అది వెనుకకు జరగడం న్యూటన్‌ ఏ గమన నియమానికి అనువర్తనం? 

1) చర్య - ప్రతిచర్య నియమం  2) బల నియమం 

3) జడత్వ నియమం    4) ఏదీకాదు


10. ఒక వస్తువు జడత్వం దేనిపై ఆధారపడుతుంది? 

1) ఆకారం    2) ఉపరితల వైశాల్యం  3) ద్రవ్యరాశి   4) అన్నీ

 

సమాధానాలు

1-3,  2-3,  3-2,  4-1,  5-2,  6-4,  7-1,  8-2,  9-1,  10-3.

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌