• facebook
  • whatsapp
  • telegram

భూపాతాలు - వరదలు - కరవులు - తుపానులు

మేలో తరుముకొచ్చే దుమ్ము తుపానులు!

 

 

ప్రకృతిలో సహజ పరిణామాలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తుల్లో తుపాను, వరద, భూపాతం, కరవు ప్రధానమైనవి. అవి ప్రభావిత ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి లాంటి పరిస్థితులను సృష్టించి, అక్కడి సమాజానికి తీరని ఇబ్బందులు కలిగిస్తాయి.  ఈ విపత్తులకు కారణాలు, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, చూపే ప్రభావాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశంలో సంభవించిన ప్రధాన విపత్తులు, ప్రాంతాలవారీగా పీడ కలలుగా మిగిలిన సంఘటనలు, జరిగిన నష్టాలను గణాంక సహితంగా గుర్తుంచుకోవడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలి.

 

భూపాతం: కొండలు, గుట్టలపై ఉన్న రాళ్లు/మట్టి దిబ్బలు వాటంతటవే లేదా వర్షాలు, వరదలు, భూకంపాలు, తుపానులు, ఇతర కారణాల వల్ల జారి కిందకు పడటాన్ని కొండచరియలు విరగడం, భూపాతం అంటారు. ఎత్తయిన నదీ తీర ప్రాంతాలు, హిమాలయాలు, తూర్పు కనుమలు, ఈశాన్య భారతదేశ ప్రాంతాలు లాంటి పర్వతాలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో కొండచరియలు విరగడం సర్వసాధారణం.


వరద: అధిక భూప్రాంతం కొంతకాలంపాటు నీటిలో మునిగిపోవడాన్ని వరదలు రావడం అంటారు. కుండపోత వర్షం, తుపాన్లు, రిజర్వాయర్లు నిండిపోవడం వరదలకు ప్రధాన కారణాలు. భూకంపాలు, తుపాను గాలులు, తుపాను అలలు, సునామీ, మంచు కరగడం, ఆనకట్టలు, కరకట్టలు తెగిపోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.

 


కరవు: ఎక్కువకాలం పాటు నీటికొరత వల్ల ఏర్పడే అనార్ద్ర పరిస్థితిని కరవు అంటారు. సంవత్సర సగటు వర్షపాతంలో 50% కంటే తక్కువ వర్షం కురిసినప్పుడు ఆ పరిస్థితిని కరవు అని పేర్కొంటారు. దేశంలో దాదాపు 24% ప్రాంతం కరవు బారినపడే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, బావులు ఎండిపోవడం, నదులు, రిజర్వాయర్లు ఎండిపోవడం, వ్యవసాయోత్పత్తులు భారీగా తగ్గిపోవడం లాంటివి కరవు లక్షణాలు.


తుపాను: అల్పపీడనం ఉన్న ప్రదేశాల్లో సుడిగాలి వల్ల వాతావరణంలో కలిగే మార్పులనే తుపాను అంటారు. ఒక అల్పపీడన ప్రాంతం చుట్టూ ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో సవ్యదిశలో అతి వేగంగా గాలి తిరుగుతున్నట్లయితే అలా తిరిగే పవన వ్యవస్థను చక్రవాతం అంటారు. చక్రవాతాల మధ్య అల్ప పీడనం ఏర్పడుతుంది. వీటినే వాయుగుండాలు అంటారు. ‘సైక్లోన్‌’ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. చుట్టుకున్న పాము అని దీనర్థం. ఈ వైపరీత్యం సముద్రంలో జరుగుతుంది.


మాదిరి ప్రశ్నలు


1.    భూపాతాలు దేనివల్ల కలుగుతాయి?

1) వర్షపాతం తీవ్రత      2) ఏటవాలులు  

3) నేలకోతకి దారితీసే అటవీ నిర్మూలన    4) పైవన్నీ


2.     ఈ ప్రాంతాల్లో ప్రధానంగా భూపాతాలు, నైసర్గిక ఆపదలు ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తాయి?

1) హిమాలయ పర్వతాలతో సహా భారతదేశంలోని  పర్వత ప్రాంతాలు    2) తూర్పు భారతదేశ పర్వత ప్రాంతాలు

3) పశ్చిమ భారతదేశ పర్వత ప్రాంతాలు   4) దక్షిణ భారతదేశ పర్వత ప్రాంతాలు


3. భూపాతాలు ఏర్పడటానికి కారణం?

1) వర్షపాతం తీవ్రత      2) ఎత్తయిన వాలులు   

3) ఎక్కువగా విచ్ఛేదం చెందిన శిలా పొరలు      4) పైవన్నీ


4. భారతదేశంలో దుమ్ము తుపాన్లు (డస్ట్‌ స్టోర్మ్‌) ఏ నెలలో ఎక్కువగా వస్తాయి?

1) మార్చి  2) మే   3) జులై   4) అక్టోబరు


5.     1980 నుంచి ఇండియాలో భూపాతాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి వాడుతున్న పద్ధతి?

1) లాండ్‌స్లైడ్‌ జొనేషన్‌ మ్యాపింగ్‌  2) లాండ్‌ డెవలప్‌మెంట్‌ జూమింగ్‌

3) లాండ్‌ రిక్లమేషన్‌ జూమింగ్‌    4) లాండ్‌ డిజాస్టర్‌ మ్యాపింగ్‌


6.     ఇండియాలో భూపాతాలు ఎక్కువ నుంచి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు?

1) హిమాలయాలు  2) తూర్పు కనుమలు (ఘాట్స్‌)  

3) వింధ్యాచలాలు 4) పశ్చిమ కనుమలు (ఘాట్స్‌)


7.     కింది రాష్ట్రాల్లో ఎక్కడ తీవ్ర హిమప్రవాహాలు సంభవిస్తాయి?

1) జమ్ము-కశ్మీర్‌      2) హిమాచల్‌ ప్రదేశ్‌  

3) ఉత్తరాఖండ్‌      4) పైవన్నీ


8.     భూపాతం కలగడానికి కారణం?

1) జలాశయంలో మార్పు         2) భూగర్భ జలాల్లో కదలిక  

3) దిగ్భ్రాంతి, కంపనాలు      4) పైవన్నీ


9.     భారతదేశంలో ఏ నెలల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది?

1) ఏప్రిల్‌-జూన్‌       2) మే-అక్టోబరు 

3) జూన్‌-డిసెంబరు       4) జూన్‌-సెప్టెంబరు


10. ‘కోస్టల్‌ వల్నరబిలిటీ ఇండెక్స్‌’ని హైదరాబాద్‌లో ఇటీవల ఎవరు విడుదల చేశారు?

1) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ

2) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ

3) భారత వాతావరణ శాఖ

4) భారత జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం


11. ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలు?

1) పెన్నా డెల్టా ప్రాంతాలు      2) కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు

3) రాయలసీమ ప్రాంతాలు        4) ఉత్తర కోస్తా ప్రాంతాలు


12. వరదల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయాలని ఏ కమిషన్‌కు సూచించింది?    

1) జాతీయ వరదల కమిషన్‌      2) జాతీయ విపత్తుల కమిషన్‌

3) కేంద్ర జల కమిషన్‌       4) కేంద్ర విద్యుత్‌ కమిషన్‌


13. వరదలు సంభవించడానికి ప్రధాన కారణం?

1) అధిక ఉష్ణోగ్రత      2) భారీ వర్షపాతం   

3) గాలిలో తేమ      4) తుపాన్లు


14. వరదల హెచ్చరిక సమాచారం దేని ద్వారా ప్రసారమవుతుంది?

1) ఆల్‌ ఇండియా రేడియో           2) దూరదర్శన్‌  

3) వార్తాపత్రికలు          4) పైవన్నీ


15. భారతదేశం మొత్తం భూభాగంలో ఎంత శాతానికి వరదలు సంభవించే అవకాశం ఉంది?

1) 11%  2) 12%  3) 13%  4) 14%


16. వరదలు వేటివల్ల కలుగుతాయి?

1) అధిక వర్షపాతం       2) చెరువులకు గండ్లు  

3) తీవ్రమైన గాలులు     4) చెరువుల నుంచి నీరు పైకి రావడం


17. భారతదేశంలోని ఏ నది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి?    

1) గోదావరి      2) గోమతి   

3) బ్రహ్మపుత్ర      4) కావేరీ


18.తీవ్రమైన కరవు’ అని దేనిని పేర్కొంటారు?

1) వర్షపాతం 50% కంటే తక్కువగా ఉంటే

2) వర్షపాతం 26-50 శాతానికి మధ్య ఉన్నట్లయితే

3) పైరెండూ       4) ఏదీకాదు


19. నీటిపారుదల కమిషన్‌ క్షామ ప్రాంతాల్ని నిర్వచిస్తూ 10 సెం.మీ. కంటే తక్కువ వర్షం నమోదైతే దానిని తక్కువ  క్షామ  ప్రాంతంగా గుర్తించింది. ఇది ఏ సంవత్సరంలో జరిగింది?

1) 1952  2) 1962  3) 1972   4) 1982


20. భారతదేశంలో మొత్తం క్షామ ప్రాంతం ఎన్ని మిలియన్‌ చదరపు కిలోమీటర్లుగా ఉంది?

1) 1.5    2) 1.7   3) 1.9   4) పైవన్నీ


21. కరవు నివారణ చర్యల్లో భాగంగా ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఎన్ని వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు?

1) 1230   2) 1330  3) 1430  4) 1530


22. భూమిపై ఒక సెంటీమీటరు నేల పొర తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

1) 120 - 300        2) 150 - 600   

3) 140 - 400       4) 150 - 400 


23. కేంద్ర శుష్క ప్రాంత పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) గుడ్‌గావ్‌      2) జోధ్‌పుర్‌  

3) పట్నా      4) పాటియాలా


24. సారవంతమైన నేలలు కోతకు గురవకుండా ఏ విధంగా నివారించవచ్చు?

1) కాంటూర్‌ గట్ల నిర్మాణం  

2) పొలం గట్ల వెంట గుబురు వేర్లుండే మొక్కల్ని నాటడం

3) వాటర్‌ షెడ్లను నిర్మించడం   4) పైవన్నీ


25. హిమాలయ పర్వత చరియల మధ్య సాగే సన్నని జాలు నీటిని అక్కడి రైతులు ఏ విధంగా వాడుకుంటున్నారు?

1) 1 కి.మీ. నుంచి 50 కి.మీ వరకు కాలువల్ని నిర్మించి వ్యవసాయం చేస్తారు.

2) 1 కి.మీ. నుంచి 15 కి.మీ. వరకు కాలువలు నిర్మించి ఆ నీటితో వ్యవసాయం చేస్తారు.

3) 1 కి.మీ. నుంచి 8 కి.మీ. వరకు కాలువలను నిర్మించి ఆ నీటితో వ్యవసాయం చేస్తారు.

4) పైవన్నీ


26. ప్రస్తుతం మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్న డ్రిప్‌ ఇరిగేషన్‌ దేని ఆధారంగా వచ్చింది?

1) మేఘాలయలోని వెదురుబొంగుల సేద్యం    2) త్రిపురలోని సేద్యపు పద్ధతి

3) మణిపుర్‌లోని వాటర్‌షెడ్‌ పద్ధతి   4) అస్సాంలోని సేద్యపు విధానం


27. కిందివాటిలో సంప్రదాయబద్ధమైన నీటిపారుదల పద్ధతి ఏది?

1) కుండ్స్‌  2) జాల్స్‌  3) సొరంగం  4) పైవన్నీ


28. ఆంధ్రప్రదేశ్‌లో 10,000 మంది ప్రాణాలను హరించిన తుపాను సంభవించిన రోజు?

1) 15-11-1977     2) 15-11-1978 

3) 15-11-1976     4) 15-11-1975


29. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తీవ్రమైన తుపాను వల్ల 63,40,000 మంది నిరాశ్రయులయ్యారు. 26,00,000 మంది ప్రజలకు నష్టం వాటిల్లింది?

1) 1977  2) 1998  3) 1996  4) 1995


30. తుపాన్ల అవాంఛనీయ ప్రభావం?

1) అవస్థాపన నష్టం     2) దూరప్రసారాల నష్టం 

3) విద్యుత్తు ఆటంకం     4) పైవన్నీ 


31. ఆసియాలో నివసించే 4 బిలియన్ల జనాభాలో ఎంత శాతం తీరప్రాంతాల దగ్గర నివసిస్తున్నారు?    

1) 7%   2) 6%   3) 5%   4) 4% 


32. తుపాను అంటే ఏమిటి?

1) ఉత్తరార్ధ గోళంలో సవ్య (ప్రదక్షిణ) గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ. 

2) ఉత్తరార్ధ గోళంలో అపసవ్య (అప్రదక్షిణ) గాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థ.

3) ఉత్తరార్ధ గోళంలో అపసవ్య గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ 

4) ఉత్తరార్ధ గోళంలో సవ్య గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ


33. టోర్నడోలు ప్రధానంగా ఏ దేశంలో సంభవిస్తుంటాయి.

1) రష్యా 2) బ్రెజిల్‌ 3) ఇండియా 4) అమెరికా


34. భారతదేశంలో తుపాను తరంగాలు, తుపాన్లు, సునామీల వల్ల హాని కలిగే తీర ప్రాంతం ఎంత?

1) 5700 కి.మీ.     2) 4700 కి.మీ.

3) 3700 కి.మీ.     4) 2700 కి.మీ.


35. ‘సైక్లోన్‌’ అనే మాట ‘సైక్లోస్‌’ అనే గ్రీకు మాట నుంచి వచ్చింది. ‘సైక్లోస్‌’ అంటే..

1) తుపాను    2) పాము చుట్ట 

3) ప్రకటన     4) కింది భాగం


36. ‘సైక్లోన్‌’ అనే మాట ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) చైనీస్‌   2) లాటిన్‌  3) ఫ్రెంచ్‌  4) గ్రీకు


37. గాలివాన (హరికేన్‌) అనేది?

1) ప్రకృతి విపత్తు    2) మానవ ప్రేరిత విపత్తు

3) సునామీ        4) భూమి విరిగిపడటం


38. తుపాను హెచ్చరికలను ఎన్ని దశల్లో చేస్తారు?

1) రెండు   2) మూడు  

3) నాలుగు   4) అయిదు 



సమాధానాలు

1-4; 2-1; 3-4; 4-2; 5-1; 6-1; 7-4; 8-4; 9-4; 10-4; 11-2; 12-3; 13-2; 14-4; 15-2; 16-1; 17-3; 18-1; 19-2; 20-2; 21-3; 22-4; 23-2; 24-4; 25-2; 26-1; 27-4; 28-1; 29-3; 30-4;  31-1; 32-3; 33-4; 34-1; 35-2; 36-4; 37-1; 38-3.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

 

 

Posted Date : 22-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌