• facebook
  • whatsapp
  • telegram

అక్షర శ్రేణి

మార్కుల అక్షరమాల!

  ఆంగ్ల అక్షరాల క్రమం అందరికీ తెలిసిందే. దానిపై కాస్త ప్రత్యేకంగా దృష్టిపెడితో  రీజనింగ్‌లో తేలిగ్గా పూర్తి మార్కులు సంపాదించుకోవచ్చు. పరీక్షలో అక్షరమాలతో అక్షరశ్రేణిని ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. వాటిని వేగంగా చేయాలంటే ముందుగా అభ్యర్థులు సంబంధిత ప్రాథమిక భావనలను తెలుసుకోవాలి. నమూనా ప్రశ్నలను సాధన చేయాలి.

 

 అక్షర శ్రేణి  (Letter Series) ప్రశ్నల్లో నిర్దిష్టమైన నియమాన్ని పాటించే ఆంగ్ల అక్షరమాల క్రమాన్ని గ్రహించి, ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సిన అక్షరాన్ని గుర్తించాలి. 

 

ఆంగ్ల అక్షరమాల - స్థానం

గమనిక: పై పట్టికలో ప్రతి అక్షరం స్థానం ఎడమవైపు నుంచి కుడివైపునకు వ్యక్తపరుస్తుంది.

* కుడివైపు నుంచి అక్షరం స్థానం రావాలంటే దాన్ని 27 నుంచి తీసివేయాలి. 

* ఒకే అక్షరం స్థానం ఎడమవైపు నుంచి + కుడివైపు నుంచి = 27

 

ఉదా: ►  G స్థానం ఎడమవైపు నుంచి 7

G స్థానం కుడివైపు నుంచి 20

7 + 20 = 27

 

► P స్థానం కుడివైపు నుంచి ఎంత?

P స్థానం కుడివైపు నుంచి = 27  ఎడమవైపు స్థానం 

= 27  16 = 11

 P స్థానం కుడివైపు నుంచి 11

 

ఆంగ్ల అక్షరమాలలో 

* ఒకటో అక్షరం = 27వ అక్షరం = A

* సున్నా అక్షరం = 26వ అక్షరం = Z

* 26 ఆంగ్ల అక్షరాలను ఒక సెట్‌గా భావిస్తాం

* 26 అక్షరాలు = ఒక సెట్‌ 

ఉదా: ►ఆంగ్ల అక్షరమాలలో 30వ అక్షరం ఏది?

30 - ఒక సెట్‌ = 30 - 26 = 4

 30వ అక్షరం D

 

► ఆంగ్ల అక్షరమాలలో 59వ అక్షరం ఏది?

59 - 2 సెట్స్‌ = 59 - 52 = 7

 59వ అక్షరం  G

 

సింగిల్‌ లెటర్‌ సిరీస్‌ 

ఉదా: G, J , M, P, S

 

డబుల్‌ లెటర్‌ సిరీస్‌ 

ఉదా: BR, EM, HH, KC 

 

మల్టీలెటర్‌ సిరీస్‌

ఉదా: A, CD, FGH, JKLM, OPQRS  

 

* ఆల్ఫా న్యూమరిక్‌ సిరీస్‌  

ఉదా: K - 121, M - 169, O - 225, Q- 279 

 

మాదిరి ప్రశ్నలు

1. E, G, J, N, .....

1) T       2) U        3) S      4)  R

జవాబు: 3

సాధన: ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరానికి 2, 3, 4 కలపడం ద్వారా ఏర్పడింది. కాబట్టి తర్వాతి అక్షరానికి 5 కలపాలి.

 N + 5 = S

 

2. R, P, L, J, F, .....

1) E        2) D       3) C        4)  A

జవాబు: 2

సాధన: ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరాన్ని 2, 4, 2, 4, ..... తగ్గించడం ద్వారా ఏర్పడింది. కాబట్టి తర్వాతి అక్షరానికి -2 చేయాలి.

 F - 2 = D

 

3. T, U, X, C, J, .....

1) T        2) U        3) R        4)  S

జవాబు: 4

సాధన: ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరానికి 1, 3, 5, 7 కలపడం ద్వారా ఏర్పడింది. కాబట్టి తర్వాత కలపాల్సిన సంఖ్య 9.

 J + 9 = S

 

4. G, T, I, S, K, Q, M, N, ....., .....

1) J, O        2) O, J        3) T, K        4)  P, K

జవాబు: 2

సాధన: దీనిలో రెండు ఉపశ్రేణులు ఉన్నాయి. అవి

G, I, K, M, .....

దీనిలో ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరానికి 2 కలపడం ద్వారా ఏర్పడింది. 

M + 2 = O

T, S, Q, N, .....

దీనిలో ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరం నుంచి 1, 2, 3 లను తగ్గించడం ద్వారా ఏర్పడింది. కాబట్టి 

N -4 = J

 

5. DP, BR,ZT, XV, .....

1) VX       2) XV       3) UX       4) WV

జవాబు: 1

సాధన: డబుల్‌ లెటర్‌ సిరీస్‌ ఉన్నప్పుడు కింది విధంగా భావించాలి. 

మొదటి అక్షరాలు D, B,Z, X, .....

దీనిలో ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరానికి 2 తగ్గించడం ద్వారా ఏర్పడింది. కాబట్టి

 X - 2 = V

రెండో అక్షరాలు P, R, T, V, .....

దీనిలో ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరానికి 2 కలపడం ద్వారా ఏర్పడింది. కాబట్టి

 V + 2 = X

 

6. QM, RL, SK, TJ, UI, .....

1) HV        2) VI      3) VH        4)  HI

జవాబు: 3

సాధన: మొదటి అక్షరాలు Q, R, S, T, U, .....

దీనిలో ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరానికి 1 కలపడం ద్వారా ఏర్పడింది. కాబట్టి

 U + 1 = V

రెండో అక్షరాలు M, L, K, J, I, .....

దీనిలో ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరానికి 1 తగ్గించడం ద్వారా ఏర్పడింది. కాబట్టి

 I - 1 = H

 

7. K-4, M-16, O-36, Q-64, .....

1) T-100     2) S-144   3) T-144   4) S-100

జవాబు: 4

సాధన: ముందుగా అక్షరమాల క్రమం K, M, O, Q, .....

దీనిలో ప్రతి అక్షరం దాని ముందున్న అక్షరానికి 2 కలపడం ద్వారా ఏర్పడింది. కాబట్టి

Q + 2 = S

సంఖ్యల క్రమం 4, 16, 36, 64, .....

ఇది సరిసంఖ్యల వర్గాల క్రమం. కాబట్టి తర్వాత వచ్చే సంఖ్య 102 = 100

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

Posted Date : 28-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌